ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ)ఖాతాదారులకు శుభవార్త. ఖాతాదారులు ఈపీఎఫ్ క్లయిమ్ సెటిల్ చేసుకునే మొత్తం నగదుపుపై వడ్డీ, ఈపీఎఫ్ క్లయిమ్ సెటిల్ చేసుకునే సమయంపై ఈపీఎఫ్‌ఓ కీలక ప్రకటన చేసింది.
కేంద్ర కార్మిక , ఉపాధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఈపీఎఫ్‌ఓ కార్యకలాపాలు నిర్వహించే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) పాలక మండలి సమావేశం ఈ ఏడాది నవంబర్ 30న సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈపీఎఫ్‌ఓ సభ్యులకు లబ్ధి చేకూరేలా కొత్త నిబంధనను అమల్లోకి తేనున్నట్లు వెల్లడించింది.
ఈ కొత్త నిబంధనతో ఈపీఎఫ్‌ఓ అధిక మొత్తంలో వడ్డీతో పాటు క్లయిమ్ సెటిల్‌మెంట్ వేగవంతం చేసుకోవచ్చని సూచించింది.
ఈపీఎఫ్‌ఓలో కొత్త నిబంధనలు
ఈపీఎఫ్‌వో ప్రకటన ప్రకారం.. సీబీటీ ఈపీఎఫ్ స్కీమ్ 1952లోని పేరా 60(2)(బి)లోని నిబంధనలను సవరణకు ఆమోదించింది. దీంతో ఈపీఎఫ్‌వో ఖాతాదారులు తమ పీఎఫ్ క్లయిమ్ సెటిల్ అయ్యిందో ఆ తేదీ వరకు వడ్డీని పొందవచ్చు.
ఉదాహరణకు..ఓ సంస్థలో పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత, అంటే డిసెంబర్ నెలలో తన పీఎఫ్ క్లయిమ్ సెటిల్ చేసుకున్నారు. పీఎఫ్ క్లయిమ్ సెటిల్ చేసిన మొత్తం డిసెంబర్ 20న అకౌంట్‌లో జమ అయ్యిందని మెసేజ్ వచ్చింది. అయితే, ఆ క్లయిమ్ సెటిల్ చేసిన మొత్తంపై ఈపీఎఫ్ అందించే 8.25 శాతం వడ్డీ పొందడం సాధ్యం కాదు. నవంబర్ నెల వరకు మాత్రమే సెటిల్‌మెంట్‌పై వడ్డీ వర్తిస్తుందని, డిసెంబర్ 1 నుండి 20 వరకు ఈపీఎఫ్ సెటిల్‌పై వడ్డీ కోల్పోయే పరిస్థితి ఉంది.
కానీ ఇప్పుడు ఈపీఎఫ్‌వో తాజా మార్పుల ద్వారా, ఆ 20 రోజుల వడ్డీ కూడా సురేష్ అందుకోగలుగుతారు. దీని ద్వారా సురేష్ వంటి ఈపీఎఫ్ ఖాతాదారులకు ఊరట లభించింది
దీంతో పాటు ఓ ఉద్యోగి తన సంస్థకు రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత మూడో నెలలో 24వ తేదీకి లోపు ఈపీఎఫ్‌వో క్లయిమ్ సెటిల్‌మెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లయిమ్ ప్రాసెస్ జరగదు. 25వ తేదీ నుంచి నెల చివరి వరకు వడ్డీ నష్టపోవడం, అలాగే క్లయిమ్ సెటిల్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టేది. అయితే, ఇప్పుడు 25వ తేదీ తర్వాత కూడా క్లయిమ్ సెటిల్ ప్రాసెస్ జరిగేలా ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment