Employee Provident Fund Organisation
-
బ్యాంకు వారికి.. ఆ హక్కు లేదు!
ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – గ్రాట్యుటీని బ్యాంకు వారు లోన్ బకాయిల రీత్యా జమ కట్టుకోవచ్చా?ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్న మాధవరావు (పేరు మార్చాము) అనే ఒక వ్యక్తి కోవిడ్ సమయంలో సేవలు నిర్వహిస్తూ కన్నుమూశారు. ఆయన మరణానంతరం తన వారసులకు –భార్యకు రావలసిన కుటుంబ పెన్షన్, గ్రాట్యుటీ వంటి అంతిమ ఆర్థిక ప్రయోజనాలు (టెర్మినల్ బెనిఫిట్స్) భార్య అకౌంట్లోకి వచ్చాయి. అయితే, అలా అకౌంట్ లోకి వచ్చిన వెంటనే సదరు బ్యాంకు అధికారులు పెన్షన్ మొత్తాన్ని మాధవ రావు బతికుండగా తీసుకున్న లోన్ బకాయి కింద జమ కట్టుకున్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించిన సదరు ఉద్యోగి భార్యను ‘ఇది మా హక్కు‘ మీ ఆయన మా బ్యాంకులో లోను తీసుకోవడమే కాక, తన టెర్మినల్ బెనిఫిట్స్ నుంచి కూడా రికవరీ చేసుకోవచ్చు అని మాకు రాసి ఇచ్చారు. అంతేకాక మీ భర్త పని చేసిన డిపార్ట్మెంట్ వారికి, మా బ్యాంకుకు మధ్య ఒక ఒప్పందం కూడా ఉంది. అందువలన మేము ఆ మొత్తాన్ని లోను కింద జమ కట్టుకున్నాము‘ అని చెప్పి ఆవిడని వెళ్ళిపొమ్మన్నారు. అప్పుడు ఇద్దరు మైనర్ పిల్లల తల్లి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.వాదోపవాదాలు విన్న తర్వాత, పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఆధారం చేసుకుని, మరీ ముఖ్యంగా సి.పి.సి లోని సెక్షన్ 60 (1) నిబంధనల ప్రకారం ‘‘టర్మినల్ బెనిఫిట్స్ లోనుంచి వచ్చిన నిధులను, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ (పీ.ఎఫ్) వంటి సామాజిక సంక్షేమ పథకాల ద్వారా సంక్రమించిన నిధులను ఏ బ్యాంకు అయినా, కోర్టు అయినా అలా తీసుకోవడానికి, అటాచ్మెంట్ చేయడానికి వీలు లేదు’’ అని తీర్పునిస్తూ ‘‘ఆ మహిళ అకౌంట్లో నుంచి లోను బకాయి పేరుతో బ్యాంకు వారు తీసేసుకున్న డబ్బులు మొత్తం తిరిగి ఆ మహిళకు చెల్లించవలసిందే’’ అని ఆదేశించింది. అప్పటికీ కూడా బ్యాంకు వారు తిరిగి చెల్లించక΄ోవడంతో గౌరవ హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు కూడా వేయాల్సి వచ్చింది. మొత్తానికి సదరు మహిళకి ఆ డబ్బులు మొత్తం బ్యాంకు వారు తిరిగి చెల్లించారు. బ్యాంకు వారికి లోన్ రికవరీ చేసే అధికారం వున్నప్పటికీ, చట్ట పరిధిలో ఉండి మాత్రమే రికవరీ చేయాల్సి వుంటుంది. లోన్ తీసుకునే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... బ్యాంకు లోన్ తీసుకున్నెప్పుడు ‘లోన్ ఇన్సూరెన్స్’ అనే పథకాన్ని ఎంచుకోవాలి. అంటే, రుణ బకాయీలు ఉండగా లోన్ తీసుకున్న వ్యక్తి మరణించినా, ఏదైనా శాశ్వత వైకల్యం వంటివి కలిగి ఉపాధి కోల్పోయిన సమయాలలో వారు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా ఉండచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ వారు మీ బదులు లోన్ కడతారు. మీ కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది. కొన్ని లోన్ఖాతాలకి లోన్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అయినప్పటికీ, బ్యాంకు వారు కూడా లోన్ ఇన్సూరెన్స్ గురించి అందరికీ చెప్పి, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకునేలా చేస్తే మంచిది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
ఈపీఎఫ్‌వోలో 13.95 లక్షల మంది చేరిక
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) 2023 నవంబర్ నెలలో 13.95 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. ఇందులో 7.36 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్‌వో కింద నమోదు చేసుకున్నారు. కొత్త సభ్యుల్లో 1.94 లక్షల మంది మహిళలు కావడం గమనించొచ్చు. నవంబర్‌లో మొత్తం మహిళా సభ్యుల చేరిక 2.80 లక్షలుగా (20 శాతం) ఉంది. సంఘటిత రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు ఇది తెలియజేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి నికర సభ్యుల చేరిక, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఎక్కువగా ఉన్నట్టు కేంద్ర కారి్మక శాఖ విడుదల చేసిన పేరోల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నూతన సభ్యుల్లో 18–25 ఏళ్ల నుంచి చేరిన వారు 57.30 శాతం ఉన్నారు. 10.67 లక్షల మంది ఒక సంస్థలో మానేసి, మరో సంస్థకు తమ ఖాతాలను బదిలీ చేసుకున్నారు. నవంబర్‌లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి 58.81 శాతం చేరారు. ఇందులో మహారాష్ట్ర వాటాయే 21.60 శాతంగా ఉంది. -
ఈపీఎఫ్‌వోలో కొత్తగా 17 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సెపె్టంబర్ నెలలో 17.21 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకుంది. ఆగస్ట్‌లో కొత్త సభ్యులతో పోలిస్తే నికరంగా 21,745 మంది పెరిగినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ నెల పేరోల్ గణాంకాలను కేంద్ర కారి్మక శాఖ సోమవారం విడుదల చేసింది. క్రితం ఏడాది సెపె్టంబర్ నెలలో కొత్త సభ్యుల గణాంకాలతో పోల్చి చూసినా కానీ, 38,262 మంది నికరంగా పెరిగారు. సెప్టెంబర్ నెలలో 8.92 లక్షల మంది తమ పేర్లను మెదటిసారి ఈపీఎఫ్‌వో కింద నమోదు చేసుకున్నారు. సుమారు 11.93 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరారు. వీరు తమ ఈపీఎఫ్ ఖాతాను పాత సంస్థ నుంచి కొత్త సంస్థకు బదిలీ చేసుకున్నారు. కొత్త సభ్యుల్లో 59 శాతం మంది వయసు 18–25 ఏళ్లలోపు ఉంది. అంటే కొత్త సభ్యుల్లో అధిక శాతం మంది ఉద్యోగ మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించిన వారని తెలుస్తోంది. ఇక ఈపీఎఫ్‌వో నుంచి వైదొలిగిన సభ్యుల సంఖ్య సెపె్టంబర్లో 3.64 లక్షలుగా ఉంది. ఆగస్ట్ నెలతో పోల్చి చూసినప్పుడు 12.17 శాతం తగ్గింది. 2023 జూన్ నుంచి నెలవారీగా సభ్యుల వైదొలగడం తగ్గుతూ వస్తోంది. 35 శాతం మహిళలు కొత్తగా చేరిన 8.92 లక్షల మంది సభ్యుల్లో మహిళలు 3.30 లక్షలుగా ఉన్నారు. ఇందులో 2.26 లక్షల మంది మహిళలు మొదటి సారి ఈపీఎఫ్‌వో కిందకు వచ్చిన వారు కావడం గమనార్హం. సెపె్టంబర్లో అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హర్యానా రాష్ట్రాల నుంచి కొత్త సభ్యులు నమోదయ్యారు. ఈ రాష్ట్రాల నుంచి 57.42 శాతం మంది సభ్యులుగా ఉన్నారు. నికర సభ్యుల చేరికలో మహారాష్ట్ర వాటాయే 20.42 శాతంగా ఉంది. చక్కెర పరిశ్రమలు, కొరియర్ సేవలు, ఐరన్ అండ్ స్టీల్, ఆస్పత్రులు, ట్రావెల్ ఏజెన్సీల్లో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 2018 ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఈపీఎఫ్‌వో గణాంకాలను విడుదల చేస్తుండడం గమనార్హం. -
ఈపీఎఫ్‌వో కిందకు 16.99 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహించే సామాజిక భద్రత పథకం కిందకు ఆగస్ట్ మాసంలో 16.99 లక్షల మంది కొత్త సభ్యులు నికరంగా వచ్చి చేరారు. కేంద్ర కారి్మక శాఖ ఆగస్ట్ నెల ఈపీఎఫ్‌వో పేరోల్ గణాంకాలను విడుదల చేసింది. ఆగస్ట్‌లో 3,210 సంస్థలు మొదటి సారి ఈపీఎఫ్‌వోలో రిజిస్టర్ చేసుకున్నాయి. సుమారు 11.88 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరడం ద్వారా ఈపీఎఫ్‌లో కిందకు మళ్లీ వచ్చి చేరారు. కొత్త సభ్యుల్లో 18–25 ఏళ్ల వయసువారు 58.36 శాతంగా ఉన్నారు. మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మొదటిసారి చేరిన చేరిన మహిళలు 2.44 లక్షల మంది ఉన్నారు. నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.43 లక్షలుగా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్ నుంచి నికర సభ్యుల చేరిక అధికంగా ఉంది. ఈ రాష్ట్రాల నుంచి 9.96 లక్షల మంది ఆగస్ట్‌లో ఈపీఎఫ్‌వో కిందకు వచ్చారు. వ్యాపార దుకాణాలు, భవన నిర్మాణం, ఇంజనీరింగ్ కాంట్రాక్టు సేవలు, టెక్స్‌టైల్స్‌లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. 39.87 మంది సభ్యులు నైపుణ్య సేవలకు సంబంధించి ఉన్నారు. -
అధిక పెన్షన్ కోసం సంస్థలకు గడువు పెంపు
న్యూఢిల్లీ: అధిక పెన్షన్ కోరుకుంటూ దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల తరఫున, వేతన వివరాలను అప్లోడ్ చేసేందుకు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్టు ఈపీఎఫ్‌వో ప్రకటించింది. ఈ గడువు సెపె్టంబర్ 30తో ముగియనుండగా, సంస్థల యాజమాన్యాలు, యాజమాన్య సంఘాలు చేసిన వినతి మేరకు ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సెపె్టంబర్ 29 నాటికి 5.52 లక్షల పెన్షన్ దరఖాస్తులు యాజమాన్యాల వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు ఈపీఎఫ్‌వో తెలిపింది. అధిక పెన్షన్ కోసం ఈపీఎఫ్‌వో దరఖాస్తులు ఆహా్వనించగా.. జూలై 11 నాటికి మొత్తం 17.49 లక్షల దరఖాస్తులు వ్యాలిడేషన్ ఆఫ్ ఆప్షన్/జాయింట్ ఆప్షన్ కోసం వచి్చనట్టు ఈపీఎఫ్‌వో ప్రకటించింది. ఈ దరఖాస్తుదారులకు సంబంధించి వేతన వివరాలను సంస్థలు అప్లోడ్ చేసి, తమవైపు ఆమోదం తెలియజేస్తే అప్పుడు వాటిని ఈపీఎఫ్‌వో ప్రాసెస్ చేయడానికి వీలుంటుంది. -
ఈపీఎఫ్‌వోలో 18.75 లక్షల మంది కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో జూలై నెలలో అత్యధికంగా 18.75 లక్షల మంది సభ్యులుగా చేరారు. 2018 ఏప్రిల్ నుంచి ఈపీఎఫ్‌వో నెలవారీ పేరోల్ గణాంకాలను విడుదల చేస్తుండగా, ఒక నెలలో ఈ స్థాయిలో సభ్యుల చేరిక ఇదే మొదటిసారి. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర కారి్మక శాఖ బుధవారం విడుదల చేసింది. కొత్త సభ్యుల్లో 10.27 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచి్చనవారు కాగా, మిగిలిన వారు ఒక చోట ఉద్యోగం మానివేసి.. మరో సంస్థ తరఫున తాజాగా నమోదు చేసుకున్నారు. కొత్త సభ్యుల్లో 18–25 ఏళ్ల వయసువారే 58 శాతానికి పైగా ఉన్నారు. వీరంతా మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. ఇక జూలైలో ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చిన వారిలో 3.86 లక్షల మంది మహిళలు ఉన్నారు. వీరిలో నికరంగా 2.75 లక్షల మంది మొదటిసారి పేర్లు నమోదు చేసుకున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హర్యానా రాష్ట్రాల నుంచి నికర సభ్యుల చేరిక అధికంగా నమోదైంది. ఈ రాష్ట్రాలే 58.78 శాతం వాటా ఆక్రమిస్తున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల నుంచి జూలైలో 11.02 లక్షల మంది ఈపీఎఫ్‌వోలో చేరారు. ఈఎస్ఐ కిందకు 19.88 లక్షల మంది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) నిర్వహించే సామాజిక భద్రతా పథకం ఈఎస్ఐ కిందకు జూలై నెలలో 19.88 లక్షల మంది సభ్యులు వచ్చి చేరారు. కొత్తగా 28,870 సంస్థలు ఈఎస్ఐసీ కింద నమోదు చేసుకున్నాయి. కొత్త సభ్యుల్లో 25 ఏళ్లలోపు వారు 9.54 లక్షలుగా ఉన్నారు. మహిళా సభ్యులు 3.82 లక్షలుగా ఉన్నట్టు పేరోల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, 52 మంది ట్రాన్స్జెండర్లు కూడా ఈఎస్ఐ కింద నమోదు చేసుకున్నారు. -
నాలుగేళ్లలో 5 కోట్ల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో), ఎన్పీఎస్ పథకాల్లో సభ్యుల చేరిక గణాంకాల ఆధారంగా గడిచిన నాలుగేళ్లలో 5.2 కోట్ల మందికి ఉపాధి లభించినట్టు ఎస్బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఇందులో 47 శాతం మందికి కొత్తగా ఉపాధి లభించగా, మిగిలిన వారు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరిన వారు కావడం గమనార్హం. గడిచిన నాలుగేళ్ల కాలానికి సంబంధించి ఈపీఎఫ్‌వో పేరోల్ డేటాను విశ్లేషించినప్పుడు నికర ఈపీఎఫ్ సభ్యుల చేరిక 2019–20 నుంచి 2022–23 మధ్య 4.86 కోట్లుగా ఉందని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ ‘ఎకోరాప్’ పేర్కొంది. ఇందులో కొత్తగా ఉపాధి లభించిన వారి సంఖ్య 2.27 కోట్లు ఉన్నట్టు, నికర పేరోల్ డేటాలో వీరు 47 శాతంగా ఉన్నట్టు ఎస్బీఐ గ్రూప్ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ తెలిపారు. ఈ సంవత్సరాల్లో సంఘటిత రంగంలో 42 లక్షల మేర ఉపాధి అవకాశాలు పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఈపీఎఫ్‌వో పేరోల్ గణాంకాలు మరింత ఆశాజనకంగా ఉన్నట్టు తెలిపింది. ఇప్పటికే 44 లక్షల మంది నికర సభ్యులు ఈపీఎఫ్‌లో భాగమయ్యారని, ఇందులో మొదటిసారి ఉపాధి పొందిన వారు 19.2 లక్షల మంది ఉన్నారని వెల్లడించింది. ‘‘ఇదే ధోరణి 2023–24 పూర్తి ఆర్థిక సంతవ్సరంలో కొనసాగితే అప్పుడు నికర సభ్యుల చేరిక 160 లక్షలుగా ఉండొచ్చు. మొదటిసారి చేరిన వారు 70–80 లక్షలుగా ఉండొచ్చు’’అని తెలిపింది. ఎన్పీఎస్ డేటా ప్రకారం 2022–23లో 8.24 లక్షల మంది కొత్త సభ్యులు చేరగా, ఇందులో రాష్ట్ర, ప్రభుత్వాల నుంచి 4.64 లక్షలు, కేంద ప్రభుత్వం నుంచి 1.29 లక్షలు, ప్రభుత్వేతర సంస్థల నుంచి 2.30 లక్షల మంది ఉన్నారు. గడిచిన నాలుగేళ్లలో ఎన్‌పీఎస్‌లో సభ్యుల చేరిక 31 లక్షలుగా ఉంది. 1.31 లక్షల ఒప్పంద ఉద్యోగాలు: ఐఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా తమ సభ్య కంపెనీలు 2022 జూలై నుంచి 2023 జూన్ మధ్య కాలంలో 1.31 లక్షల ఒప్పంద కారి్మకులను చేర్చుకున్నట్టు ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) ప్రకటించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్–జూన్‌లో 5.6 శాతం పెరిగాయని ఐఎస్ఎఫ్ ఈడీ సుచిత దత్తా తెలిపారు. ఈ–కామర్స్, సరుకు రవాణా, తయారీ, ఆరోగ్యం, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, రిటైల్, బ్యాంకింగ్ విభాగాల రిక్రూట్మెంట్ కారణంగా ఇది సాధ్యమైందని చెప్పారు. 2023 జూన్ 30 నాటికి ఐఎస్ఎఫ్ సభ్య కంపెనీలు చేర్చుకున్న ఒప్పంద కారి్మకుల సంఖ్య 15 లక్షలకు చేరుకుందన్నారు. -
మే నెలలో కొత్తగా 8.83 లక్షల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: ఈ ఏడాది మే నెలలో 8.83 లక్షల మంది కొత్త వారికి ఉపాధి లభించింది. వీరంతా ఈపీఎఫ్‌వో కిందకు కొత్తగా వచ్చి చేరారు. ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే, మే నెలలో ఈపీఎఫ్‌వో కిందకు చేరిన సభ్యుల సంఖ్య 16.30 లక్షలుగా ఉంది. కేంద్ర కార్మిక శాఖ ఈ వివరాలను గురువారం విడుదల చేసింది. కొత్తగా 3,673 సంస్థలు తమ ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. ఈ సంస్థలు అన్నీ కూడా మొదటిసారి ఈపీఎఫ్‌వో కింద నమోదయ్యాయి. గత ఆరు నెలల కాలంలో ఎక్కువ సభ్యుల చేరిక మేలోనే నమోదైంది. కొత్త సభ్యుల్లో 18–25 ఏళ్ల వయసు వారు 56 శాతంగా ఉన్నారు. సంఘటిత రంగంలో యువత గణనీయ స్థాయిలో ఉపాధి పొందినట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సాధారణంగా విద్య పూర్తయిన తర్వాత ఈ వయసు వారే ఉద్యోగాన్వేషణ చేస్తుంటారని తెలిసిందే. కొత్త సభ్యుల్లో 2.21 లక్షల మంది మహిళలు ఉన్నారు. మొత్తం మీద మే నెలలో చేరిన మహిళా సభ్యుల 3.15 లక్షలుగా ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల నుంచి కొత్త సభ్యులు అధికంగా చేరినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రాష్ట్రాల నుంచే 57.85 శాతం మంది ఈపీఎఫ్‌వో కిందకు వచ్చి చేరారు. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 19.32 శాతం మంది సభ్యులయ్యారు. బిల్డింగ్, నిర్మాణం, వ్రస్తాల తయారీ, ఎల్రక్టానిక్ మీడియా, టెక్స్టైల్స్, రబ్బర్ ఉత్పత్తులు, ఆర్థిక సేవల సంస్థల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. మొత్తం సభ్యుల్లో 42 శాతం మేర నైపుణ్య సేవల విభాగం కిందే ఉన్నారు. -
ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్!
అధిక పెన్షన్ కోసం దరఖాస్తు గడువు తేదీని పొడిగిస్తూ ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం తీసుకుంది. ధరఖాస్తు గడువును జూన్ 26 వరకు పెంచుతున్నట్లు తెలిపింది. గత ఏడాది నవంబర్ 4న అధిక పెన్షన్ కోసం ధరఖాస్తు చేసుకోవాలని కేంద్రం కీలక ఉత్తర్వులను వెలువరించింది. అందుకు వీటిని ఆన్లైన్లో సమర్పించడానికి మార్చి 3 వరకు గడువు పెట్టగా.. తర్వాత చందాదారుల విజ్ఞప్తులు, సాంకేతిక కారణాల నేపథ్యంలో గడువును మే3 వరకు పొడిగించింది. తాజాగా దీనిని జూన్ 26 వరకూ పొడిగించినట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. కాగా, ఇప్పటివరకు 12 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించింది. సమస్యల్ని పరిష్కరిస్తారా? ఈపీఎఫ్‌వో అధిక పెన్షన్ కోసం అప్లయ్ చేస్తున్న చందదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. తాజా నిబంధనలకు అనుగుణంగా ఈపీఎఫ్‌వో పాస్‌బుక్‌లను అప్డేట్ చేసింది. కొత్త పాస్‌బుక్‌లను అందుబాటులో ఉంచింది. చందాదారులు యూఏఎన్ నంబర్ ద్వారా లాగిన్ అయి..కొత్త పాస్‌బుక్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ డౌన్లోడ్ కావడం లేదని చందదారులు వాపోతున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. -
జనవరిలో భారీగా ఉపాధి కల్పన
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ సంస్థ– ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్)లో ఈ ఏడాది జనవరిలో 14.86 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే.. ► జనవరి నెలలో 3.54 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓ పరిధి నుంచి బయటకు వెళ్లారు. ఈపీఎఫ్ఓ చట్రం నుంచి బయటకు వెళ్లడానికి సంబంధించి గడచిన నాలుగు నెలల్లో ఇది కనిష్ట సంఖ్య. ► జనవరిలో నమోదయిన 14.86 లక్షల మందిలో 7.77 మంది కొత్తవారు. మొదటిసారి వీరు ఈపీఎఫ్ఓలో చందాదారులయ్యారు. ► జనవరి 2023లో నికర మహిళా సభ్యుల నమోదు 2.87 లక్షలు. ఇందులో దాదాపు 1.97 లక్షల మంది మహిళా సభ్యులు కొత్తగా చేరారు. దీంతో నికర మహిళా సభ్యుల్లో 68.61 శాతం మంది తొలిసారిగా ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చినట్లయ్యింది. ► రాష్ట్రాల వారీగా చూస్తే, అత్యధిక సంఖ్యలో ఈపీఎఫ్ఓలో చేరిన వారిలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్. ఢిల్లీలకు చెందిన వారు ఉన్నారు. ► ఈపీఎఫ్ఓలో ప్రస్తుతం దాదాపు 8 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. -
ఈపీఎఫ్‌వో అధిక పెన్షన్.. అంత ఈజీ కాదు!?
సుదీర్ఘ పోరాటం తర్వాత వేతన జీవుల ఆకాంక్ష అయిన అధిక పెన్షన్ కల సాకారమైంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోని ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్ 95) కింద అధిక పెన్షన్‌కు అర్హత లభించింది. 2014 సెప్టెంబర్ 1 నాటికి ఈపీఎస్ సభ్యులుగా ఉన్నవారు, అంతకుముందు రిటైర్మెంట్ తీసుకున్న వారు, తమకు అధిక పెన్షన్ కావాలంటూ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఇందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. దరఖాస్తు చేసుకోవచ్చంటూ ఈఎపీఎఫ్‌వో ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగి తన సంస్థ తరఫున ఉమ్మడి దరఖాస్తు పత్రాన్ని ఆన్లైన్లో సమర్పించాలి. అధిక పెన్షన్ కావాలంటూ ఆప్షన్ ఇవ్వాలా? వద్దా..? ఎవరు అర్హులు? తదితర అంశాలపై వేతన జీవుల్లో ఎన్నో సందేహాలు నెలకొనగా.. దీన్ని ఎలా అమలు చేయాలి? అనే విషయమై ఈపీఎఫ్‌వోలోనూ స్పష్టత కొరవడింది. ఈ నేపథ్యంలో దీనిపై ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న వివరాలతో ప్రత్యేక కథనమిది... అంత పింఛను ఎవరు చెల్లించాలి? ఉదాహరణకు కిరణ్ అనే వ్యక్తి 1996 ఏప్రిల్ 1న ఉద్యోగంలో చేరాడని అనుకుందాం. నాడు అతడి బేసిక్ వేతనం రూ.5,000. నాటి నుంచి ఏటా 7.5 శాతం చొప్పున పెరుగుతూ వచ్చిందని భావిస్తే.. అతడు అధిక పెన్షన్ ఆప్షన్ ఎంపిక చేసుకోకపోతే, 2031 నాటికి 35 ఏళ్ల సర్వీస్ ముగిసిన అనంతరం, అతడికి ప్రతి నెలా రూ.7,929 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కిరణ్ ఒకవేళ అధిక పెన్షన్ ఆప్షన్ ఇస్తే అతడికి 2031 తర్వాత నుంచి ప్రతి నెలా వచ్చే పింఛను రూ.26,879కి పెరుగుతుంది. దీనికోసం ఇప్పుడు రూ.9.74 లక్షలు జమ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తంపై వచ్చే రాబడి రేటు 23.4 శాతం. ఇంత రాబడి అంటే అది కచ్చితంగా ఉద్యోగులకు లాభించేదే. కానీ, అది ఈపీఎఫ్ నిధిపై ఇది గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. అందుకుని ఈపీఎఫ్‌వో ప్రత్యామ్నాయ ఫార్ములా కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. సర్వీస్ కాలం.. అదనపు పెన్షన్ కోరుకునే వారు ఎంత అదనపు మొత్తం ఇప్పుడు జమ చేయాలన్నది ఆసక్తికరంగా మారింది. నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ నాటికి ఈపీఎస్ పథకం కింద పదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే పెన్షన్‌కు అర్హత లభిస్తుంది. ఈపీఎస్ కింద సర్వీస్ ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత అధికంగా పెన్షన్ అందుకోగలరు. అధిక పెన్షన్ ఆప్షన్ ఇవ్వాలా? వద్దా? అనేదానికి కూడా ఇదే ప్రామాణికం అవుతుంది. ఈపీఎస్ 95 కింద 20 ఏళ్లకు పైగా సర్వీస్ ఉన్న వారు అధిక పెన్షన్ ఆప్షన్‌తో ఎక్కువగా ప్రయోజనం పొందుతారన్నది ప్రాథమిక అంచనా. పెట్టుబడి వారసులకు రాదు.. ఈపీఎస్ సభ్యుడు, అతని జీవిత భాగస్వామి, వారి మరణానంతరం వైకల్యంతో ఉన్న 25 ఏళ్లకు మించని పిల్లల వరకు పెన్షన్ వస్తుంది. వీరి తదనంతరం పింఛను నిధి వారసులకు చెల్లించరు. దీంతో దీన్ని మంచి సాధనం కాదని చాలా మంది అనుకుంటారు. ప్రైవేటు లైఫ్ ఇన్సూరెన్స్ యాన్యుటీ ప్లాన్‌లో చివర్లో పెట్టుబడి తిరిగిచ్చే ప్లాన్‌లో గరిష్ట రాబడి 6.87 శాతంగా ఉంటే.. పెట్టుబడి తిరిగి ఇవ్వని (ఈపీఎస్ మాదిరి) ఆప్షన్లో రాబడి 8.6 శాతంగా ఉంది. ఇంతకంటే అధిక రాబడిని, ప్రభుత్వ హామీతో ఇచ్చే ఏదైనా సాధనం ఉందంటే.. నిస్సందేహంగా దానికి వెళ్లొచ్చు. ఈపీఎస్‌లో కనీసం 15 ఏళ్ల సర్వీస్ ఉన్న వారికి సైతం ఇంతకంటే అధిక రాబడే వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ కాలం జీవించి లేని సందర్భాల్లో పెన్షన్ ఫండ్‌ను తిరిగిచ్చే ప్లాన్ మెరుగైనది అవుతుంది. కానీ, రిటైర్మెంట్ తర్వాత ఎంత కాలం జీవించి ఉంటామన్నది ఎవరికీ తెలియదు. దేనికైనా కట్టుబడి ఉండాలి? ఈపీఎస్ 95 కింద పెన్షన్ లెక్కింపు అనేది పెన్షన్ సర్వీస్, బేసిక్ వేతనంపై ఆధారపడి ఉంటుంది. ఈపీఎస్ 95 పథకం 1995 నవంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం హామీగా ఉంటుంది. ఆరంభంలో రూ.5,000 బేసిక్ శాలరీ పరిమితి విధించారు. 2001 జూన్ నుంచి రూ.6,500 చేశారు. ఆ తర్వాత 2014 సెప్టెంబర్ నుంచి రూ.15,000కు పెంచారు. ఇంతకంటే అధిక వేతం తీసుకుంటున్నా.. ఈపీఎస్‌కు అధికంగా జమ చేసే అవకాశం లేక రిటైర్మెంట్ తర్వాత తక్కువ పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రూ.15,000 పరిమితి తొలగిపోయింది. రిటైర్మెంట్కు ముందు చివరి ఐదేళ్ల కాలంలో ఉన్న సగటు బేసిక్ వేతనం ఆధారంగా పెన్షన్ అందుకోవడానికి అర్హులు అవుతారు. సుప్రీంకోర్టు ఆదేశాలను యథాతథంగా అమలు చేస్తే ఎక్కువ సర్వీస్ ఉండి.. అధిక మూలవేతనం, డీఏ కలిగిన వారికి ఎక్కువ పెన్షన్ రిటైర్మెంట్ తర్వాత వస్తుంది. కానీ, ఈపీఎఫ్‌వో వైపు నుంచి పారదర్శకత లోపించింది. ఎంత పెన్షన్ ఇస్తారో చెప్పకుండా, ఈపీఎఫ్‌వో నిర్ణయించిన సూత్రం మేరకు పెన్షన్ తీసుకునేందుకు సమ్మతమేనంటూ అంగీకారం తెలియజేయాలని ఆన్లైన్ దరఖాస్తులో షరతు విధించినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకంలో చేసే మార్పులకు అంగీకారం తెలపాలని కూడా కోరుతోంది. అధిక పెన్షన్ ఆప్షన్ ఇచ్చినా, తనపై చెల్లింపుల భారం పడకుండా ఈపీఎఫ్‌వో చూస్తున్నట్టు అర్థమవుతోంది. పైగా 2014 నాటి నిబంధనల సవరణ తర్వాత వాస్తవ వేతనంపై జమలు చేస్తున్న వారు సైతం ఇప్పుడు అధిక పెన్షన్ పొందాలంటే.. నాడు ఈపీఎఫ్‌వో నుంచి ఉద్యోగి, సంస్థ ఉమ్మడిగా తీసుకున్న అనుమతి పత్రాన్ని సమర్పించాలని ఈపీఎఫ్‌వో నిబంధన విధించింది. ఇంతకాలం అధిక చందాలను అనుమతిస్తూ, ఇప్పుడు అనుమతి ఉండాలని కోరడమే విడ్డూరంగా ఉంది. ప్రత్యామ్నాయం ఎన్పీఎస్ అధిక పింఛను ఆప్షన్‌కు ఈపీఎఫ్‌వో దరఖాస్తు తీసుకుంటున్నప్పటికీ.. అందులో పారదర్శకత లేదు. అధిక పింఛను అంటే ఎంత చెల్లిస్తామనే స్పష్టత లేదు. అన్నింటికీ కట్టుబడి ఉంటాము, షరతులకు అంగీకరిస్తాము? అన్న అంగీకారాన్ని తీసుకుంటోంది. కనుక రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను కోరుకునే వారు ఈపీఎస్‌నే నమ్ముకోవాలనేమీ లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. పన్ను ప్రయోజనంతో కూడిన రాబడి కోరుకునే వారికి ఎన్పీఎస్ మెరుగైనది. రిటైర్మెంట్ తర్వాత ఎన్పీఎస్ కింద సమకూరిన మొత్తం నిధిలో 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీనిపై ఎలాంటి పన్ను ఉండదు. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలి. యాన్యుటీ అనేది పెన్షన్ ప్లాన్. ఇక్కడి నుంచి కనీసం మరో 20 ఏళ్ల సర్వీసు ఉన్న వారు ఎన్పీఎస్ను ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ► 1980 జనవరి 1న జన్మించిన వారు ఎన్పీఎస్ను ఎంపిక చేసుకుని ప్రతి నెలా రూ.2,000 చొప్పున, ఇక్కడి నుంచి మరో 17 ఏళ్లపాటు అంటే 60 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేస్తే.. 10 శాతం రాబడి ప్రకారం రూ.10.7 లక్షలు సమకూరుతాయి. 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే 6 శాతం రాబడి రేటు ప్రకారం 2147 పెన్షన్‌గా వస్తుంది. లేదు 100% నిధితో యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే రూ.5,367 పెన్షన్‌గా లభిస్తుంది. ► 1990 జనవరి 1న జన్మించిన వారు ప్రతి నెలా రూ. 2,000ను ఎన్‌పీఎస్‌లో జమ చేసుకుంటే, 60 ఏళ్ల నాటికి 10 శాతం రాబడి రేటు ఆధారంగా రూ.33 లక్షలు సమకూరుతాయి. 40% నిధితో యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే రూ. 16,594గా లభిస్తుంది. ఇవి గమనించండి ► ఈపీఎస్ కింద కనీసం పదేళ్ల సర్వీస్ ఉన్న వారికే 58 ఏళ్ల తర్వాత నుంచి పెన్షన్ లభిస్తుంది. ► ఉద్యోగి మరణిస్తే పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని వారసులకు ఇస్తారు. కానీ, ఈపీఎస్ సభ్యుడు మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి పెన్షన్‌లో సగమే చెల్లిస్తారు. ► అధిక పెన్షన్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే, గత కాలానికి సంబంధించి అదనపు చందాలను ఇప్పుడు చెల్లించాలి. ఈపీఎఫ్ బ్యాలన్స్ నుంచి దీన్ని మిననహాయించేట్టు అయితే.. భవిష్యత్తులో పిల్లల విద్య, సొంతిల్లు వంటి లక్ష్యాల అవసరాలకు నిధి అందుబాటులో ఉండదు. ఇంతకాలం పోగు చేసుకున్న మొత్తంపై కాంపౌండింగ్ ప్రయోజనం కోల్పోతారు కనుక దీన్ని ఆలోచించి నిర్ణయించుకోవాలి. -
EPFO: డిసెంబర్లో కార్యాలయాల కళకళ..!
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో డిసెంబర్ 2022లో 14.93 లక్షల మంది కొత్త సభ్యత్వం నమోదయ్యింది. 2021 ఇదే నెలతో పోల్చితే ఇది 2 శాతం (32,635 మంది) అధికమని కార్మిక మంత్రిత్వశాఖ 2022 డిసెంబర్‌కు సంబంధించి విడుదల చేసిన (తొలి) గణాంకాలు పేర్కొన్నాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఈపీఎఫ్ఓలో చేరిన 14.93 లక్షల మందిలో దాదాపు 8.02 లక్షల మంది కొత్త ఉద్యోగులు. వీరు మొదటిసారి సామాజిక భద్రతా వ్యవస్థ– ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చారు. అంటే మొదటిసారి వ్యవస్థాగతమైన ఉపాధిని వీరు పొందారన్నమాట. ► కొత్తగా చేరిన 8.02 లక్షల మందిలో 18 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్కులు 2.39 లక్షల మంది. 22–25 సంవత్సరాల మధ్య వారు 2.08 లక్షల మంది. 18 నుంచి 25 సంవ త్సరాల మధ్య వయస్సు కలవారు మొత్తం సంఖ్యలో (8.02 లక్షల మంది) 55.64% మంది. ► సమీక్షా నెల్లో 3.84 లక్షల మంది ఈపీఎఫ్ఓ నుంచి బయటకు వెళ్లగా, 10.74 లక్షల మంది బయ టకు వెళ్లి మళ్లీ కొత్త ఉద్యోగాల్లో చేరారు. తద్వా రా తిరిగి ఈపీఎఫ్ఓలో సభ్యత్వం పొందారు. ఈఎస్ఐసీలోనూ భారీ పెరుగుదల కాగా, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ)లో కూడా 2022 డిసెంబర్లో కొత్త ఉద్యోగులు 18.03 లక్షల మంది చేరాయి. 2021 డిసంబర్‌తో పోల్చితే ఈ సంఖ్య 14.52 లక్షలు పెరగడం గమనార్హం. ఈఎస్ఐసీ కింద డిసెంబర్ 2022లో 27,700 కొత్త సంస్థలు రిజిస్టరయ్యాయి. కొత్తగా చేరిన 18.03 లక్షల మంది ఉద్యోగుల్లో 25 సంవత్సరాలపైబడినవారు 8.30 లక్షల మంది. దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈఎస్ఐ స్కీమ్‌లో చేరినవారిలో 80 మంది ట్రాన్స్జెండర్లు. సభ్యులకు బహుళ ప్రయోజనాలు... ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ. ఈ ప్రాతిపదికన పేరోల్ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్ 2018 నుండి (సెప్టెంబర్ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 6 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్లకు పైగా మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో (1977–78లో ఈపీఎఫ్ 8 శాతం) కనిష్ట వడ్డీరేటు ఇది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ప్రస్తుతం 15 శాతానికి చేరాయి. -
అధిక పెన్షన్‌పై ఈపీఎఫ్ఓ సర్క్యులర్
న్యూఢిల్లీ: అధిక పెన్షన్ అర్హతకు సంబంధించి అలాగే ఇందుకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2022 నవంబర్ 4వ తేదీ జారీ చేసిన సూచనలకు అనుగుణంగా ఈ సరŠుయ్యలర్ జారీ అయ్యింది. వాస్తవ వేతనాలపై రూ.5,000 లేదా నెలకు రూ. 6,500 కంటే ఎక్కువ విరాళం అందించిన లేదా అధిక పెన్షన్ కోసం ఆప్షన్‌ను వినియోగించుకున్న లేదా 2014లో ఈపీఎస్–95కి సవరణకు ముందు అధిక పెన్షన్ కోసం చేసిన అభ్యర్థనను ఈపీఎఫ్ఓ పంí³, తిరస్కరణకు గురయిన వారు ఇందుకు అర్హులని నోటిఫికేషన్ వివరించింది. కమీషనర్ సూచించిన దరఖాస్తు ఫారమ్‌లో అలాగే జాయింట్ డిక్లరేషన్సహా అన్ని ఇతర అవసరమైన పత్రాలలో అర్హత కలిగిన చందాదారులు తమ సంస్థతో సంయుక్తంగా ఈ ప్రయోజనం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
అక్టోబర్‌లో ఈపీఎఫ్‌వో పరిధిలోకి 12.94 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కింద అక్టోబర్ నెలలో కొత్తగా 12.94 లక్షల మంది నమోదయ్యారు. 2021 అక్టోబర్‌తో పోలిస్తే 21,026 మంది అధికంగా వచ్చి చేరారు. కేంద్ర కార్మిక శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ చట్టం, 1952 కింద 2,282 కొత్త సంస్థలు అక్టోబర్ నుంచి పని చేయడం మొదలు పెట్టాయి. కొత్త సభ్యుల్లో మొదటిసారి చేరిన వారు 7.28 లక్షల మంది ఉంటే, 5.66 లక్షల మంది సభ్యులు ఒక చోట మానేసి, మరో సంస్థలో చేరిన వారు. పాత సంస్థ నుంచి కొత్త సంస్థకు ఖాతాను బదలాయించుకున్నారు. ఇలాంటి ఖాతాలను కొత్తవిగానే పరిగణిస్తుంటారు. యువత ఎక్కువ.. నికర కొత్త సభ్యుల్లో 18–21 వయసులోని వారు 2.19 లక్షల మంది ఉంటే, 22–25 ఏళ్ల వయసు గ్రూపులోని వారు 1.97 లక్షల మంది ఉన్నారు. కొత్త సభ్యుల్లో 57.25 శాతం 18–25 ఏళ్లలోపు వారే. నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 2.63 లక్షలుగా ఉంది. వీరిలో 1.91 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్‌వో కిందకు వచ్చిన వారు కావడం గమనార్హం. కేరళ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. నికర సభ్యుల చేరికలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా 60 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచి 7.78 లక్షల మంది ఈపీఎఫ్‌వో కిందకు వచ్చారు. క్రితం నెలతో పోలిస్తే అక్టోబర్‌లో న్యూస్‌పేపర్ పరిశ్రమ, షుగర్, రైస్ మిల్లింగ్‌లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. -
ఈపీఎఫ్‌వో కిందకు కొత్తగా 16.82 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి సెప్టెంబర్ నెలలో కొత్తగా 16.82 లక్షల మంది సభ్యులుగా చేరారు. ఇందుకు సంబంధించి గణాంకాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే కొత్త సభ్యుల్లో 9 శాతానికి పైనే వృద్ధి నమోదైంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిస్లేనియస్ చట్టం కింద కొత్తగా 2,861 సంస్థలు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో 16.82 లక్షల మంది కొత్త సభ్యుల్లో 9.34 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్‌వో కిందకు వచ్చారు. అంటే వీరికి కొత్తగా ఉపాధి లభించింది. మిగిలిన సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరిన వారు కావడం గమనార్హం. ఇక కొత్త సభ్యుల్లో 18–21 ఏళ్ల వయసు నుంచి 2.94 లక్షల మంది, 21–25 ఏళ్ల వయసు నుంచి 2.54 లక్షల మంది ఉన్నారు. 25 ఏళ్ల వయసులోపు వారే 58.75 శాతంగా ఉన్నారు. ఈపీఎఫ్ కవరేజీ నుంచి వైదొలిగే సభ్యుల సంఖ్య గడిచిన మూడు నెలల్లో క్రమంగా తగ్గుతూ వస్తోంది. నెలవారీగా చూస్తే సెప్టెంబర్‌లో ఇలా ఈపీఎఫ్‌వో నుంచి వెళ్లిపోయిన వారు 9.65 శాతం తక్కువగా ఉన్నారు. సెప్టెంబర్ నెలలో చేరిన మహిళలు 3.50 లక్షల మంది (26.36 వాతం)గా ఉన్నారు. వార్షికంగా చూస్తే 7 శాతం వృద్ధి నమోదైంది. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది చేరారు. -
మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ కాలేదా? అయితే ఇలా చేయండి..
మీరు ఉద్యోగం చేస్తున్నారా? ఉద్యోగం చేస్తున్నా.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)అకౌంట్లోకి డబ్బులు జమ కావడం లేదా? అయితే ఇప్పుడు మీరు ఖాతాలోకి డబ్బులు డిపాజిట్ కావడం లేదని ఈపీఎఫ్ఓకు ఇలా ఫిర్యాదు చేయండి. సంస్థలు ప్రతినెల ఉద్యోగి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అకౌంట్లోకి ప్రావిడెంట్ ఫండ్‌ను జమ చేస్తాయి. ప్రస్తుతం ఉన్న ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం.. గత నెల ఉద్యోగికి చెల్లించిన జీతానికి..15 రోజులలోపు యజమాని ప్రతి నెలా బేసిక్ శాలరీ, డియర్నెస్ అలవెన్స్‌తో కలిపి 12 శాతం పీఎఫ్ ఖాతాకు జమ చేస్తారు. దీంతో ఆ డిపాజిట్లకు సంబంధించిన సమాచారం క్రమం తప్పకుండా ఎస్ఎంఎస్ల రూపంలో చందాదారులకు అందుతుంది. లేదంటే ఉద్యోగులు సైతం ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో లాగిన్ అయ్యి ప్రతి నెలా పీఎఫ్ ఖాతాలోకి జమ చేసిన డిపాజిట్లను కూడా చెక్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో సంస్థలు పీఎఫ్ మొత్తాన్ని డిపాజిట్ చేయవు. అప్పుడు ఉద్యోగులు తమకు రావాల్సిన పీఎఫ్ ఇంకా డిపాజిట్ కాలేదని ఎంప్లాయిఫీడ్బ్యాక్@ఈపీఎఫ్ఐఇండియా.జీవోవి.ఇన్‌కి ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు తర్వాత, రిటైర్మెంట్ ఫండ్ రెగ్యులేటరీ బాడీ సదరు సంస్థ యజమానిని విచారిస్తుంది. ఈ విచారణలో డిపాజిట్ చేయలేదని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అంతేకాదు చెల్లించిన మొత్తం కాలానికి ఈపీఎఫ్ఓ అధికారులు ఉద్యోగి అసలు ప్లస్ వడ్డీ మొత్తం కలిపి చెల్లించేలా ఒత్తిడి తెస్తారు. -
గుడ్ న్యూస్! ఈపీఎఫ్ఓ కొత్త ప్రతిపాదనలు..మారనున్న నిబంధనలు!
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల్ని సవరించనుంది. కొత్త నిబంధనల్ని అమలు చేయనుంది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ ఈ కొత్త ప్రతిపాదనల్ని తన స్టేక్ హోల్డర్స్‌తో పాటు, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంచినట్లు సమాచారం. ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో చేరాలంటే ఒక సంస్థలో 20మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ..వారి శాలరీ రూ.15వేలకు పైగా ఉండాలి. అలా ఉంటనే వారు చందాదారులుగా చేరే సౌకర్యం ఉంది. అయితే ఈ తరుణంలో ఈపీఎఫ్ఓ సంస్థ మిసిలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952లోని పరిమితుల్ని ఉపసంహరించుకోనుంది. తద్వారా ఈపీఎఫ్ఓ తన పథకాలను బిజినెస్ చేసుకునే వారికి సైతం అందించే సౌలభ్యాన్ని కల్పించనుంది. దీంతో పాటు ఈపీఎఫ్ఓలో చేరేందుకు ఇప్పటి వరకు విధించిన హెడ్ కౌంట్ (20మంది ఉద్యోగులు) ఉండాలని నిబంధనల్ని తొలగించేలా ప్రతిపాదనలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ ఎలా పనిచేస్తుంది కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇందులో ప్రస్తుతం ఈపీఎఫ్ఓ తన ఖాతాదారులకు ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. మార్చి,2022 నాటి లెక్కల ప్రకారం.. ఉద్యోగి బేసిక్ శాలరీలో నుంచి 12 శాతం వారి ఈపీఎఫ్ ఖాతాలోకి వెళుతుంది. సంస్థ మరో 12శాతం ఉద్యోగి తరుపు జమ చేస్తుంది. ఈ జమ చేసిన మొత్తాన్ని ఉద్యోగి అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. లేదంటే ఆ మొత్తాన్ని ఉద్యోగి రిటైరైన తర్వాత ఈపీఎఫ్ఓ నెలకు పెన్షన్ రూపంలో అందిస్తుంది. చదవండి👉 ఈపీఎఫ్ఓలో ఫోటో ఎలా అప్లోడ్ చేయాలో తెలుసా? లేదంటే డబ్బులు రావు! -
స్టాక్స్‌లో ఈపీఎఫ్‌వో మరిన్ని పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సొమ్ములో ఈక్విటీ వాటా పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈక్విటీ వాటా పెంచడం వల్ల మరిన్ని రాబడులకు అవకాశం ఉంటుంది. అప్పుడు సభ్యులకు మెరుగైన రాబడి రేటు ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఈపీఎఫ్ నిధిలో ఈక్విటీ వాటాను 25 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను ఈపీఎఫ్‌వో పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ తన మొత్తం నిర్వహణ పెట్టుబడుల్లో ఈక్విటీలకు 15 శాతమే కేటాయిస్తోంది. ఈక్విటీలకు మరిన్ని పెట్టుబడులు కేటాయించడం వల్ల డెట్ సాధనాల్లో రాబడుల అంతరాన్ని పూడ్చుకోవచ్చని ఈపీఎఫ్‌వో ఆలోచనగా ఉంది. రాబడుల లక్ష్యాలను చేరుకోలేకపోతున్న దృష్ట్యా ఈక్విటీల వాటా పెంచడం ద్వారా ఆ సమస్యను అధిగమించొచ్చన్న అభిప్రాయం ఉంది. ఈపీఎఫ్‌వోకు చెందిన ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆడిట్ కమిటీ రెండు వారాల క్రితమే సమావేశమైంది. ఈ అంశంపై చర్చించి ఈక్విటీల వాటాను 25 శాతం పెంచేందుకు సిఫారసు చేసింది. ఒకే విడత కాకుండా తొలుత 15 శాతం నుంచి 20 శాతానికి ఈక్విటీ పెట్టుబడులను తీసుకెళతారు. అక్కడి నుంచి 25 శాతానికి పెంచుతారు. ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆడిట్ కమిటీ సిఫారసుపై జూన్ చివరి వారంలో జరిగే ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. సీబీటీ దీనికి ఆమోదం తెలిపితే దాన్ని తుది ఆమోదం కోసం కేంద్ర కార్మిక శాఖకు, కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
ఈపీఎఫ్‌లో ఈ-నామినేషన్ ఫైల్ చేశారా! లేదంటే మీకే నష్టం!
ఈపీఎఫ్ ఖాతాదారులకు విజ్ఞప్తి. ఖాతాదారులు ఇప్పటి వరకు అకౌంట్‌కి నామిని వివరాల్ని యాడ్ చేయకపోతే జత చేయండి అంటూ ఈపీఓవో సంస్థ కోరింది. అయితే ఇప్పుడు మనం ఈపీఎఫ్ అకౌంట్లో నామిని వివరాల్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. స్టెప్1:ఈపీఎఫ్ఓ వెబ్ సైట్లో లాగిన్ అవ్వాలి స్టెప్2:మ్యానేజ్ బటన్‌పై క్లిక్ చేసి ఈ నామినేషన్ ట్యాబ్‌ను ఓపెన్ చేయాలి స్టెప్3: అండర్ ఫ్యామిలీ డిక్లరేషన్‌పై ఎస్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. స్టెప్4: తర్వాత మీ నామిని డీటెయిల్స్ యాడ్ చేయాలి. నామినితో పాటు ఇతర కుటుంబ సభ్యుల పేర్లను ఎంటర్ చేయండి స్టెప్5: నామిని డీటెయిల్స్‌లో నామిని ఆధార్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిలేషన్, అడ్రస్, ఐఎఫ్ఎస్ఈ కోడ్, నామిని బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. స్టెప్6: అనంతరం యాడ్ రో ఆప్షన్ క్లిక్ చేస్తే ఇతర నామిని సభ్యుల వివరాల్ని ఎంటర్ చేయోచ్చు. స్టెప్7: తర్వాత నామినికి ఎంత షేర్ ఇవ్వాలనుకుంటున్నారో (ఉదాహరణకు 100శాతం) ఎంటర్ చేయండి. ఒకవేళ నామినీలు ఒకరికంటే ఎక్కువగా ఉంటే పర్సెంటేజీల వారీగా యాడ్ చేయండి స్టెప్8: వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. వెంటనే మీరు ఎంటర్ చేసిన వివరాలు సేవ్ అవుతాయి. స్టెప్9: ఆ తర్వాత ఈ-సైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆధార్‌తో లింకైన ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటంది ఎందుకు ఈపీఎఫ్ అకౌంట్‌కు ఈ నామినేషన్ ఫైల్ చేయాలంటే ఖాతాదారుడు మరణిస్తే అతను/ఆమె అకౌంట్లో ఉన్న మొత్తం నామిని అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ అవుతుంది అదే ఖాతాదరుడు మరిణిస్తే పీఎఫ్‌తో పాటు రూ.7లక్షల వరకు ఇన్స్యూరెన్స్ క్లయిమ్ నామిని ఎవరైతే ఉంటారో వారికి చెందుతుంది. -
అలర్ట్: పీఎఫ్ఓ రూల్స్ మారాయ్, ఈపీఎఫ్ అకౌంట్‌తో రూ.7లక్షల వరకు బెన్ఫిట్స్..!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఖాతాదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా రూ.7లక్షల వరకు ప్రయోజనం పొందే అవకాశాల్ని కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ (EDLI) స్కీమ్ లో భాగంగా 1976 సంవత్సారానికి చెందిన ప్రతి ఒక్క ప్రావిడెంట్ ఫండ్ లబ్ధి దారులకు రూ.7 లక్షల వరకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు ఈపీఎఫ్ఓ అధికారికంగా ట్వీట్ చేసింది. ఈ ప్రయోజనం కేవలం బీమాకే కాకుండా ఇతర ప్రయోజనాలకు వర్తిస్తాయని ట్వీట్లో పేర్కొంది. బీమా ప్రయోజనాలు ఈపీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే , ఆ ఖాతాదారుడి చట్టపరమైన వారసుడు లేదా నామినీకి రూ. 7 లక్షల వరకు ప్రయోజనాలు చెల్లించబడతాయి. ప్రయోజనాలపై పరిమితి ఏప్రిల్ 2021 నుండి రూ.6 లక్షల నుండి రూ.7 లక్షలకు పెంచబడింది. Salient Features of Employees' Deposit Linked Insurance (EDLI) Scheme, 1976.#EPFO #SocialSecurity #PF #Employees #ईपीएफओ #पीएफ #Services @byadavbjp @Rameswar_Teli @PMOIndia @DDNewslive @airnewsalerts @PIBHindi @PIB_India @MIB_India @mygovindia @PTI_News pic.twitter.com/eV3WCspEp0 — EPFO (@socialepfo) October 17, 2021 కనీస హామీ ప్రయోజనాలు ఈడీఎల్ఐ పథకం 1976 కింద కనీస హామీ ప్రయోజనం కింద ఉద్యోగి మరణించిన తరువాత సంవత్సరం పాటు రూ. 2.5 లక్షలు చెల్లింపు ఉంటుంది. 7 లక్షల వరకు ఉచిత ప్రయోజనాలు ఇక బీమా పథకం ప్రయోజనాలను పొందేందుకు ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్, పీఎఫ్ ఖతాదారులకు ఇది ఉచితంగా అందిస్తుంది. ఈ బీమా పథకానికి సంబంధించిన ప్రీమియం యజమాని ద్వారా చెల్లించబడుతుంది. నెలవారీ వేతనంలో 0.50 శాతం రూ. 15,000 పరిమితితో ఉంటుంది. పీఎఫ్ ఖాతాదారు/ఈపీఎఫ్ ఈపీఎఫ్ఓ సభ్యులు ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు అప్లయ్ చేయాల్సిన అవసరం లేదు. సభ్యులు ఈపీఎఫ్ సభ్యులు లేదా చందాదారులు అయిన తర్వాత ఈడీఎల్ఐ స్కీమ్ ప్రయోజనాలకు అర్హులు. డైరెక్ట్ బ్యాంక్ బదిలీ ఈడీఎల్ఐ పథకం ప్రయోజనాలు నేరుగా నామినీ లేదా ఉద్యోగి యొక్క చట్టపరమైన వారసుని బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడతాయి. ఈపీఎఫ్ ఖాతాదారులు మరణించిన సందర్భంలో ప్రయోజనాలు నేరుగా ఈ బ్యాంక్ ఖాతాకు జమ చేయబడతాయి. అయితే, స్కీమ్ నామినీ లేదా చట్టపరమైన వారసుడు యొక్క ప్రయోజనాల క్లెయిమ్‌లను పొందడానికి ఫారమ్ 51F నింపి, ఈపీఎఫ్ఓకి సమర్పించాల్సి ఉంటుంది. చదవండి: డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే! -
జనవరిలో 8.96 లక్షల నూతన ఉద్యోగాలు
న్యూఢిల్లీ: దేశంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ఈ సంస్థ తాజాగా విడుదలచేసిన డేటా ప్రకారం.. సంఘటితరంగంలో ఈ ఏడాది జనవరిలో 8,96,516 నూతన ఉద్యోగ కల్పన జరిగింది. ఇది ఏకంగా 17 నెలల గరిష్టస్థాయి కాగా.. గతేడాది ఇదేకాలంతో పోల్చితే 131 శాతం వృద్ధి చోటుచేసుకుంది. జనవరిలో 2.44 లక్షల నూతన ఉద్యోగాల్లో 22–25 ఏళ్ల మధ్యవారు ఉండగా, 2.24 లక్షల ఉద్యోగాల్లో 18–21 ఏళ్ల వయసువారు ఉన్నట్లు వెల్లడైంది. ఇక సెప్టెంబర్ 2017 నుంచి ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో 76.48 లక్షల ఉద్యోగాల కల్పన జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
ఒక్కటే నంబర్‌తో ఈపీఎఫ్ నిర్వహణ
కోల్కత్తా: దేశంలోని దాదాపు నాలుగు కోట్ల మంది ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) నిర్వహణ మరింత సుల భతరం కానుంది. ఒకే ఒక్క సార్వత్రిక నంబర్ విధానంలో దీన్ని నిర్వహించనున్నట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) వెల్లడించింది. గతంలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఈ కొత్త విధానాన్ని అనుసరించనున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందుబాటులోకి తెస్తామని కేంద్ర భవిష్య నిధి (సీపీఎఫ్) కమిషనర్ కె.కె.జలాన్ చెప్పారు. సోమవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ నూతన విధానాన్ని విజయవంతంగా అమలుచేయగలిగితే ఉద్యోగుల పీఎఫ్ నిర్వహణలో సమూల మార్పు లు చోటుచేసుకుంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న యాజమాన్య ఆధారిత విధానం పూర్తిగా ఉద్యోగి కేంద్రంగా మారుతుందని అన్నారు. ఉద్యోగి వేరే సంస్థకు మారినా, మరో ప్రాంతానికి బదిలీ అయినా అతని సార్వత్రిక భవిష్యనిధి నంబరు బ్యాంకు ఖాతా నంబర్లా శాశ్వతంగా ఉంటుందని తెలిపారు. ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఖాతాను ఆన్లైన్ ద్వారా బది లీ చేసుకొనే సౌలభ్యం ఈనెల నుంచి అందుబాటులోకి వస్తుం దని చెప్పారు. ఇక పెన్షనర్లందరికీ నవంబర్ నుంచి ప్రతి నెలా ఒకటో తేదీకల్లా పింఛన్ చేతికందుతుందని భరోసా ఇచ్చారు. ఇందుకోసం 40 లక్షల మంది పెన్షనర్ల ఖాతాలను కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్‌తో అనుసంధానం చేశామన్నారు.