
న్యూఢిల్లీ: అధిక పెన్షన్ కోరుకుంటూ దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల తరఫున, వేతన వివరాలను అప్‌లోడ్ చేసేందుకు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్టు ఈపీఎఫ్‌వో ప్రకటించింది. ఈ గడువు సెపె్టంబర్ 30తో ముగియనుండగా, సంస్థల యాజమాన్యాలు, యాజమాన్య సంఘాలు చేసిన వినతి మేరకు ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా సెపె్టంబర్ 29 నాటికి 5.52 లక్షల పెన్షన్ దరఖాస్తులు యాజమాన్యాల వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు ఈపీఎఫ్‌వో తెలిపింది. అధిక పెన్షన్ కోసం ఈపీఎఫ్‌వో దరఖాస్తులు ఆహా్వనించగా.. జూలై 11 నాటికి మొత్తం 17.49 లక్షల దరఖాస్తులు వ్యాలిడేషన్ ఆఫ్ ఆప్షన్/జాయింట్ ఆప్షన్ కోసం వచి్చనట్టు ఈపీఎఫ్‌వో ప్రకటించింది. ఈ దరఖాస్తుదారులకు సంబంధించి వేతన వివరాలను సంస్థలు అప్‌లోడ్ చేసి, తమవైపు ఆమోదం తెలియజేస్తే అప్పుడు వాటిని ఈపీఎఫ్‌వో ప్రాసెస్ చేయడానికి వీలుంటుంది.