Pension applications
-
TG: పెన్షన్.. టెన్షన్!
సాక్షి, హైదరాబాద్ : భర్త చనిపోయి ఎలాంటి ఆధారం లేక తండ్లాడుతున్న వితంతువు.. పెద్ద వయసులో తోడెవరూ లేక, ఎలా బతకాలో తెలియక గోస పడుతున్న వృద్ధుడు.. వైకల్యంతో ఏ పనీ చేయలేక, వైద్యం కోసం డబ్బుల్లేక ఆగమైతున్న దివ్యాంగుడు.. .. ఇలా ఎందరో.. అందరిదీ ఒకే వేదన. ఎలాగోలా బతుకు వెళ్లదీసేందుకు కనీసం ప్రభుత్వమిచ్చే పింఛన్ అయినా తోడ్పడుతుందనే ఆలోచన. తిరగని ఆఫీసులు లేవు.. కలవని అధికారులు లేరు.. వేడుకోని రాజకీయ నాయకులు లేరు.. అయినా పింఛన్ రావడం లేదు. ఏళ్లకేళ్లుగా, ఎన్నోసార్లు దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నా ఫలితం ఉండటం లేదు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేసి, తమను ఆదుకోవాలని వారంతా వేడుకుంటున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలకు వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఆత్మియ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్‌కార్డుల కోసం మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అధికారులు చెబుతున్నా... తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరుతూ దరఖాస్తులు ఇస్తున్నారు. పింఛన్ల సొమ్ము పెంచుతామన్న కాంగ్రెస్ సర్కారు హామీని అమల్లోకి తెచ్చేలోగా.. ముందు కొత్త పింఛన్లను మంజూరు చేసి పాత పింఛన్ మొత్తమైనా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 2022 ఆగస్టు నుంచి ఆన్లైన్ పోర్టల్ మూత.. కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునే ఆసరా పోర్టల్ 2022 ఆగస్టు నుంచి అందుబాటులో లేకుండా పోయింది. గత ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్ సర్కారు అధికారంలో వచ్చిన 13 నెలలు కలిపి.. సుమారు మూడున్నరేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులు, ఇతర రూపాల్లో వచ్చిన వినతులు కలిపి.. కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఆరు లక్షల వరకు ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దరఖాస్తు చేసుకున్న అందరికీ కాకపోయినా.. అర్హతలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వడపోస్తే కనీసం 3 లక్షల మందికైనా కొత్త పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఇందులో వృద్ధులు, వికలాంగులు, వితంతువులతోపాటు ఇతర కేటగిరీల వాళ్లు కూడా గణనీయంగా ఉన్నట్టు చెబుతున్నాయి. పాత మొత్తమైనా ఇవ్వాలంటూ.. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు (ప్రస్తుతం రూ.4 వేలు), వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర కేటగిరీల పింఛన్ రూ.4 వేలకు (ప్రస్తుతం రూ.2 వేలు) పెంచుతామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం అన్ని కేటగిరీలు కలిపి 43.72 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 13 నెలలు దాటినా పింఛన్ల పెంపు హామీ అమల్లోకి రాలేదు. నిజానికి 2024–25 బడ్జెట్లో పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.14,628 కోట్లు కేటాయించింది. కానీ పెంపు అమలుచేస్తే ఖజనాపై గణనీయంగా భారం పడుతుందన్న ఉద్దేశంతో.. ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనితో పింఛను మొత్తాన్ని ఇప్పటికిప్పుడు పెంచకపోయినా.. కనీసం కొత్త పింఛన్లు మంజూరు చేస్తే ఆసరాగా ఉంటుందని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర కేటగిరీల వారు కోరుతున్నారు. ఇంటి పెద్ద లేడు.. వితంతు పింఛన్ ఇస్తే కాస్త ఆసరా నా భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఎన్నిసార్లు అధికారులను సంప్రదించినా స్పందన రావడం లేదు. ఇంటికి పెద్ద దిక్కయిన భర్త మృతితో బతుకు కష్టంగా మారింది. ఎలాంటి ఆధారం లేక కూలి పనులు చేస్తూ ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటున్న. వెంటనే పింఛన్ మంజూరు చేయాలి. – కావలి సుష్మ , బొల్లారం గ్రామం, దేవరకద్ర మండలం, మహబూబ్‌నగర్ జిల్లా దివ్యాంగ పింఛన్ వస్తే.. వైద్య ఖర్చుల భారం తగ్గుతుంది మూడేళ్లకుపైగా దివ్యాంగుల పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా దరఖాస్తు ఇచ్చినా, రాజకీయ నాయకులను వేడుకున్నా ఫలితం లేదు. గత ఏడాది ప్రజాపాలనలో కూడా దరఖాస్తు చేసుకున్నాను. కాంగ్రెస్ సర్కారు పెంచే పింఛను కాకున్నా పాత పింఛన్ సొమ్ము రూ.4 వేలు ఇచ్చినా సరే.. నా వైద్య ఖర్చుల భారం తగ్గుతుంది. – అబ్దుల్ మాజిద్ ఖాన్, తిమ్మాపూర్, కరీంనగర్ భర్త చనిపోయాడు.. పింఛన్ వస్తేనే జీవితానికి ఆసరా నా భర్త చనిపోయి మూడేళ్లయింది. అప్పటి నుంచి ఎన్నోసార్లు వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు. మొదట్లో పింఛన్లు ఇవ్వడం లేదని అధికారులు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కొందరికి ఇచ్చినా నాకు రాలేదు. గతేడాది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాను. ఇటీవల కులగణనలో కూడా ఆప్షన్ ఇచ్చిన. ఇప్పుడు గ్రామసభలో దరఖాస్తు చేశాను. త్వరగా పింఛన్ ఇస్తే జీవితానికి ఆసరా అవుతుంది. – కాసగాని సురాంబా, ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రం, సూర్యాపేట జిల్లా వృద్ధాప్యంలో ఒంటరి బతుకు.. పింఛన్ ఇచ్చి ఆదుకోవాలి నాకు 70 ఏళ్లు. నాలుగేళ్ల క్రితం భార్య చనిపోయింది. గుంట భూమి లేదు. ఎలాంటి జీవనాధారం లేదు. ఇద్దరు కొడుకులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వెళ్లారు. ఒంటరిగా ఉంటున్నా. వృద్ధాప్య పింఛన్ కోసం పదేళ్లలో ఎన్నో సార్లు దరఖాస్తు చేసినా రాలేదు. ఇప్పుడు గ్రామసభలో పింఛన్ కోసం దరఖాస్తు ఇచ్చాను. పింఛన్ వస్తే ఉన్నంతకాలం బతుకు వెళ్లదీసుకుంటా.. - తాటికోల్ సాయి గొండ, తగ్గేల్లి గ్రామం, సాలూర మండలం, నిజామాబాద్ జిల్లా పింఛన్ వస్తే బతుకు వెళ్లదీసుకుంటా.. నాకు 75 ఏళ్లు. వృద్ధాప్య పింఛన్ కోసం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న. గతంలో రూ.200 ఇచ్చేప్పటి నుంచీ నా భార్యతోపాటు నాకు కూడా పింఛన్ వచ్చేది. తర్వాత ఇంట్లో ఒక్కరికే పింఛన్ అని నా పేరు తీసేశారు. ఆరేళ్ల క్రితం భార్య చనిపోయింది. అప్పట్నుంచీ పింఛన్ కోసం చాలా సార్లు దరఖాస్తు చేసుకున్న. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్న. ఇప్పుడు గ్రామసభలో అధికారులకు మొరపెట్టుకున్న. పింఛన్లకు దరఖాస్తులు తీసుకోవడం లేదన్నరు. పింఛన్ వస్తే ఈ వయసులో బతుకు వెళ్లదీసుకోవడానికి ఆసరా అవుతుంది. – గంటే రాములు, నేరడగందొడ్డి గ్రామం, మాగనూరు మండలం, నారాయణపేట జిల్లా -
మీకు వచ్చే పెన్షన్ తెలుసుకోండిలా..
పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా ఇచ్చే వాటిలో పెన్షన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. పెన్షన్(Pension) లెక్కలకు సంబంధించి చాలామందికి చాలా ప్రశ్నలుంటాయి. ప్రైవేట్ సంస్థలో 10 సంవత్సరాలుగా పనిచేస్తుంటే పెన్షన్ ఎంత వస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ఎక్కువ అనుభవం ఉంటే వచ్చే పెన్షన్ అధికంగా ఉంటుంది. అందుకు భిన్నంగా తక్కువ సర్వీసు ఉంటే తక్కువ పెన్షన్ అందుతుందని గుర్తుంచుకోవాలి.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)ను నిర్వహిస్తుంది. ఉద్యోగుల పెన్షన్ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుగా తెలిసుండాలి.పెన్షన్‌కు అర్హత పొందాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు ఉండాలి.ఉద్యోగికి 58 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి పెన్షన్ విత్‌డ్రా చేసుకోవచ్చు.పెన్షన్ విధానంలో కనీసం నెలవారీ మొత్తం రూ.1,000 అందుతుంది.గరిష్ఠంగా అందే పెన్షన్ రూ 7,500.ఎలా లెక్కిస్తారంటే..ఈపీఎస్ కింద పెన్షన్ పొందాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 58 ఏళ్లకు చేరుకుని ఉండాలి.పెన్షన్ తీసుకోవాలనుకునే సమయం నుంచి గత 60 నెలల సగటు జీతం (నెలకు గరిష్టంగా రూ.15,000)ను పరిగణనలోకి తీసుకుంటారు.ఈపీఎస్‌కు మీరు కంట్రిబ్యూషన్ చేసిన మొత్తం సంవత్సరాల సంఖ్యను పెన్షనబుల్ సర్వీసు అంటారు. కింది ఫార్ములా ఉపయోగించి పెన్షన్ లెక్కిస్తారు.నెలవారీ పెన్షన్ = పెన్షనబుల్ జీతం(రూ.15,000కు మించకుండా 60 నెలల సరాసరి)×పెన్షనబుల్ సర్వీస్/70ఉదాహరణకు, మీ పెన్షనబుల్ జీతం రూ.15,000, పెన్షనబుల్ సర్వీస్ 10 సంవత్సరాలు అయితే నెలవారీ పెన్షన్ కింది విధంగా ఉంటుంది.నెలవారీ పెన్షన్=15,000×10/70=2,143ఇదీ చదవండి: కాలర్ ఐడీ ఫీచర్‌ను వెంటనే అమలు చేయాలని ఆదేశాలుపదేళ్లలో విభిన్న కంపెనీలు మారితే..పెన్షన్ పొందాలంటే పదేళ్లు ఒకే కంపెనీలో పని చేయాలనే నిబంధనేం లేదు. పదేళ్లలోపు ఈపీఎస్ సర్వీసు అందుబాటులో ఉన్న విభిన్న కంపెనీల్లో పని చేసినా పెన్షన్ పొందడానికి అర్హులు అవుతారు. అయితే, మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) మాత్రం యాక్టివ్‌గా ఉండాలి. కేవైసీ వివరాలను అప్డేట్ చేయాలి. ఉద్యోగం మారినప్పుడు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ కొత్త యజమాన్యం పీఎఫ్ ఖాతాకు బదిలీ అవుతుంది. అయితే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) బ్యాలెన్స్ మీ మునుపటి యజమాని వద్ద ఉంటుంది. అయినప్పటికీ సర్వీస్ వివరాలు బదిలీ చేస్తారు. దాంతో మొత్తం సర్వీసును పరిగణలోకి తీసుకుని ట్రాక్ చేస్తారు. -
అధిక పెన్షన్ కోసం సంస్థలకు గడువు పెంపు
న్యూఢిల్లీ: అధిక పెన్షన్ కోరుకుంటూ దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల తరఫున, వేతన వివరాలను అప్లోడ్ చేసేందుకు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్టు ఈపీఎఫ్‌వో ప్రకటించింది. ఈ గడువు సెపె్టంబర్ 30తో ముగియనుండగా, సంస్థల యాజమాన్యాలు, యాజమాన్య సంఘాలు చేసిన వినతి మేరకు ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సెపె్టంబర్ 29 నాటికి 5.52 లక్షల పెన్షన్ దరఖాస్తులు యాజమాన్యాల వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు ఈపీఎఫ్‌వో తెలిపింది. అధిక పెన్షన్ కోసం ఈపీఎఫ్‌వో దరఖాస్తులు ఆహా్వనించగా.. జూలై 11 నాటికి మొత్తం 17.49 లక్షల దరఖాస్తులు వ్యాలిడేషన్ ఆఫ్ ఆప్షన్/జాయింట్ ఆప్షన్ కోసం వచి్చనట్టు ఈపీఎఫ్‌వో ప్రకటించింది. ఈ దరఖాస్తుదారులకు సంబంధించి వేతన వివరాలను సంస్థలు అప్లోడ్ చేసి, తమవైపు ఆమోదం తెలియజేస్తే అప్పుడు వాటిని ఈపీఎఫ్‌వో ప్రాసెస్ చేయడానికి వీలుంటుంది. -
ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్: ఖాతాదారులకు గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి శుభవార్త. దీనికి సంబంధించిన గుడువుపై ఆందోళన అవసరం లేదు. 2023 మార్చి 3 తో గడువు ముగిసి పోతుందున్న ఆందోళన నేపథ్యంలో ఈపీఎఫ్‌వో గడువును పొడిగించింది. అధికారిక పోర్టల్ సమాచారం ప్రకారం ఈ గడువు మే 3 వ తేదీవరకు ఉంది. ఈ పరిధిలోని చందాదారులు, పెన్షన్‌దారుల్లో ఇప్పుడు అధిక పెన్షన్ కోసం మే 3 తేదీ వరకు అప్లయ్ చేసుకోవవచ్చు. (ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ సర్క్యులర్ జారీ.. ‘అధిక పెన్షన్’కు ఏం చేయాలి?) సుప్రీంకోర్టు నవంబర్ 4, 2022న తన ఆదేశాలలో ఈపీఎఫ్ఓ అర్హతగల సభ్యులందరికీ అధిక పెన్షన్‌ను ఎంచుకోవడానికి నాలుగు నెలల సమయం ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల వ్యవధి మార్చి 3, 2023తో ముగిసిపోనుందనే ఆందోళన సభ్యులలో నెలకొంది. అయితే తాజాగా 60 రోజుల పొడిగింపుతో అర్హత ఉన్న సభ్యులందరూ, యజమానులతో కలిసి మే 3, 2023 వరకు రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఏకీకృత సభ్యుల పోర్టల్‌లో అధిక పెన్షన్ కోసం సంయుక్తంగా దరఖాస్తు చేసుకోవచ్చు. గత నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడి దీనికి సంబంధించిన అర్హతలపై ఈపీఎఫ్ఓ తన జోనల్ కార్యాలయాల్లోని అదనపు చీఫ్ ప్రావిడెంట్ కమిషనర్లు, ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాల్లోని రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్లకు ప్రత్యేక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. -
అధిక పెన్షన్‌పై ఈపీఎఫ్ఓ సర్క్యులర్
న్యూఢిల్లీ: అధిక పెన్షన్ అర్హతకు సంబంధించి అలాగే ఇందుకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2022 నవంబర్ 4వ తేదీ జారీ చేసిన సూచనలకు అనుగుణంగా ఈ సరŠుయ్యలర్ జారీ అయ్యింది. వాస్తవ వేతనాలపై రూ.5,000 లేదా నెలకు రూ. 6,500 కంటే ఎక్కువ విరాళం అందించిన లేదా అధిక పెన్షన్ కోసం ఆప్షన్‌ను వినియోగించుకున్న లేదా 2014లో ఈపీఎస్–95కి సవరణకు ముందు అధిక పెన్షన్ కోసం చేసిన అభ్యర్థనను ఈపీఎఫ్ఓ పంí³, తిరస్కరణకు గురయిన వారు ఇందుకు అర్హులని నోటిఫికేషన్ వివరించింది. కమీషనర్ సూచించిన దరఖాస్తు ఫారమ్‌లో అలాగే జాయింట్ డిక్లరేషన్సహా అన్ని ఇతర అవసరమైన పత్రాలలో అర్హత కలిగిన చందాదారులు తమ సంస్థతో సంయుక్తంగా ఈ ప్రయోజనం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
బతికుండగానే కాగితాల్లో చంపేశారు!
సంస్థాన్ నారాయణపురం: వితంతు పింఛన్‌కు దరఖాస్తున్న చేసుకున్న మహిళ బతికుండగానే అధికారులు కాగితాల్లో చంపేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం పరిధి ఆరెగూడెం గ్రామానికి చెందిన బచ్చన బోయిన బాలమ్మ భర్త రామచంద్రం అనారోగ్య కారణాలతో 2021 జనవరి 28న మృతిచెందాడు. దీంతో బాలమ్మ అదే ఏడాది సెప్టెంబర్ 14న పలు ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ ప్రతులతో వితంతు పింఛన్ కోసం గ్రామ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంది. కాగా, స్వాతంత్య్ర వజ్రోత్సవాల కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన పింఛన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బాలమ్మ తనకు పింఛన్ మంజూరైందా? అని అధికారులను ఆశ్రయించింది. దీంతో వారు ఆన్లైన్లో శోధించగా ఆ జాబితాలో మాత్రం బాలమ్మ చనిపోయినట్లు ఉందని చెప్పడంతో ఆమె అవాక్కయింది. తాను బతికే ఉన్నానని, పింఛన్ ఇప్పించాలని బాలమ్మ అధికారులను వేడుకుంది. కాగా, దీనిపై ఎంపీడీవో యాదగిరిని సంప్రదించగా మీ–సేవలో దరఖాస్తు చేసుకోవడంలో జరిగిన పొరపాటుగా గుర్తించామని తెలిపారు. బాధితురాలికి పింఛన్ వచ్చేలా చూస్తామని చెప్పారు. -
Aasara Pension: 30 వరకు పింఛన్ల దరఖాస్తుకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. ఈ ఆసరా పింఛన్ల అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించిన నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరంభించింది. గత ఆగస్టు 31 నాటికే కొత్త దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినా, అర్హులందరికీ అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నెల 11 నుండి 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తులను స్వీకరించాలని జిల్లా కలెక్టర్లకు, జీహెచ్ఎంసీ కమీషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అర్హులైనవారు ఈ నెల 11 నుంచి ఈసేవ, మీసేవ ద్వారా నిర్ణీత నమూనా ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. ఈనెల 30 వరకు అందిన దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని, సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పుట్టినతేదీ ధ్రువీకరణ, ఓటర్ కార్డు తదితర పత్రాలను దరఖాస్తుతోపాటు జత చేయాలన్నారు. కాగా, ఈ దరఖాస్తులకు ఈ సేవ, మీ సేవల్లో సేవల రుసుములు తీసుకోవద్దని, సంబంధిత రుసుములను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. -
మాయం చేశారు!
విడవలూరు: పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు ఆన్లైన్లో మాయమయ్యాయి. దీనికి అధికార పార్టీ నాయకుడే కారమణని చెబుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. ముదివర్తి గ్రామానికి చెందిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు 300 మంది ప్రభుత్వం మంజూరుచేసే పింఛన్ కోసం గత సంవత్సరం విడవలూరు ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. వాటిని అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. పింఛన్లు ఇంకా మంజూరుకాలేదని నాలుగురోజుల క్రితం దరఖాస్తుదారులు ఎంపీడీఓకు అర్జీ ఇచ్చేందుకు వెళ్లారు. ఈ సమయంలో అధికారుల ద్వారా ఆన్లైన్ జాబితాను తీసుకుని చూడగా అందులో 45 మంది పేర్లు గల్లంతయ్యాయి. అధికారుల ‘పచ్చ’పాతం ముదివర్తికి చెందిన అధికార పార్టీ నాయకుడు ఎంపీడీఓ కార్యాలయంలోని సిబ్బంది ద్వారా ఆన్లైన్లో పేర్లు తీయించి వేసినట్లుగా ఆరోపణలున్నాయి. 45 మంది వైఎస్సార్సీపీకి చెందిన వారుగా చెబుతున్నారు. తామంతా అర్హులమని, కావా లనే జాబితా నుంచి పేర్లు తొలగించారని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఎలా మాయమయ్యాయి నేను వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇటీవల వరకు నా పేరు ఆన్లైన్లో ఉం ది. జన్మభూమి కమిటీలను రద్దుచేశారని తెలి యడంతో పింఛన్ మంజూరు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆన్లైన్ జాబితాను చూడగా అందులో పేరు లేదు. ఎలా మాయమైందో ఆ దేవుడికే ఎరుక. – కె.సుబ్బరామయ్య -
బతికి ఉండగానే చంపేశారు!
భూత్పూర్(దేవరకద్ర): పెన్షన్లు మంజూరు చేయాలని ప్రతీ సోమవారం అధికారులకు దరఖాస్తు చేసుకున్నా పలువురికి మంజూరు కావడం లేదు.. ఇక వస్తున్న పింఛన్లు ఆగడంతో పలువురు ఆవేదన చెందుతున్నారు. ఈ మేరకు అమిస్తాపూర్ గ్రామానికి చెందిన ఈరమ్మ సోమవారం భూత్పూర్లో ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. తనకు అభయ హస్తం పింఛన్ ఆగిపోయి మూడు నెలలైందని.. చనిపోయినట్లు చెబుతూ పేరు తొలగించాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. దీంతో ఎంపీడీఓ గోపాల్‌నాయక్.. మహిళా సమాఖ్య సీసీపై మండిపడ్డారు. ఈరమ్మ పింఛన్ తొలగించడానికి కారణాలను తెలియజేయాలని ఆదేశించారు. -
పింఛన్ల పంపిణీకి రంగం సిద్ధం
* తొలి దశలో 12 వేల మందికి.. * మూడు రంగుల్లో కార్డులు * నియోజకవర్గ కేంద్రాలకు ప్రాధాన్యం * ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పంపిణీ * మిగిలిపోయిన కుటుంబాల సమగ్ర సర్వే కొనసాగింపు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సామాజిక పింఛన్ల పంపిణీకి అధికారయంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఈ నెల 8 నుంచి 12 వేలమందికి పింఛన్లు ఇవ్వడానికి నిర్ణయించారు. పంపిణీలో నియోజకవర్గ కేంద్రాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. నగరానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి పద్మారావు, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపిన అనంతరం అధికారులు పంపిణీ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సమగ్ర సర్వే అనుసంధానంతో ఎంపికైన కొత్త లబ్ధిదారులకు అక్టోబర్ నుంచి పెంచిన వాటిని కలుపుకుని... వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ. 1500 చొప్పున పంపిణీ చేస్తారు. జిల్లా పరిధిలోని 16 మండలాల్లో 500 చొప్పున 8 వేలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్లో 4 వేల మందికి పింఛన్లు పంపిణీ చే సే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు అందాయి. మరోపక్క సామాజిక పింఛన్ల దరఖాస్తుల వెరిఫికే షన్ కార్యక్రమాన్ని ఈ నెల 15 వరకు కొనసాగిస్తూనే..పంపిణీ ప్రక్రియ దశలవారీగా కొనసాగేటట్టు అధికారులు తగిన ప్రణాళిక రూపొందించారు. మూడు రకాల కార్డులు.. పింఛన్ లబ్ధిదారుల కోసం మూడు రకాల కార్డులను ముద్రించారు. వృద్ధుల కోసం ‘ఆసరా’ పేరుతో పింక్ కార్డులు, వితంతువుల కోసం బ్లూ కార్డులు, వికలాంగుల కోసం గ్రీన్ కార్డులను ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ముద్రించారు. వీటిని పంపిణీ సమయంలో ఆయా లబ్ధిదారులకు అందచేస్తారు. వెరిఫికేషన్ 85 శాతం పూర్తి సామాజిక పింఛన్ల కోసం జిల్లాలో 1,35,429 దరఖాస్తులు రాగా, రంగారెడ్డి జిల్లాలోని గ్రేటర్ పరిధిలో1,10,292 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు నగరంలో దరఖాస్తుల పరిశీలన 85 శాతం వరకు పూర్తయిందని, మిగతావి ఈ నెల 15 వరకు పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. మిగిలిన కుటుంబాల సర్వే షురూ.. నగరంలో గతంలో సర్వే చేయని కుటుంబాల కోసం మరోసారి సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నారు. నగరంలో దాదాపు 1.60 లక్షల కుటుంబాలు గతంలో నిర్వహించిన సర్వే పరిధిలోనికి రాలేదని భావిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 53 వేల కుటుంబాలు.. రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్లో 1.07 లక్షల కుటుంబాల సర్వే పూర్తి కాలేదని అధికారులు అంచనా వేశారు. ఈమేరకు హైదరాబాద్ జిల్లా పరిధిలో 1400 మంది ఉపాధ్యాయులు సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖాధికారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నాలుగైదు రోజుల్లో ఇది పూర్తికావచ్చని భావిస్తున్నారు. ‘నిబంధనల’ టెన్షన్ నిబంధనలు, కొత్త మార్గదర్శకాల కారణంగా గ్రేటర్ పరిధిలో భారీస్థాయిలో పింఛన్ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా జనాభాలో 60 శాతానికి మించి పింఛన్లు మంజూరు చేయకూడదని పేర్కొంటూనే....కేటగిరీల వారిగా వద్ధాప్య పింఛన్లు 7 శాతం, వితంతు 5, వికలాంగులవి 3 శాతం మాతమే ఉండాలని ఇటీవలి కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌శర్మ సూచించటం పెన్షన్‌దారులను టెన్షన్‌కు గురిచేస్తోంది. కాగా గ్రేటర్ పరిధిలో 2.45 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన నేపథ్యంలో 1.43 లక్షలకు మించి లబ్ధిదారుల ఎంపిక ఉండక పోవచ్చునని తెలుస్తుంది. ఈ లెక్కన 60 శాతం నుంచి 63 శాతానికి మించి లబ్ధిదారుల ఎంపిక ఉండటం లేదని తెలుస్తున్నది.