ఆన్‌లైన్‌లో ఉంచిన దరఖాస్తుదారుల జాబితా
విడవలూరు: పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు ఆన్‌లైన్‌లో మాయమయ్యాయి. దీనికి అధికార పార్టీ నాయకుడే కారమణని చెబుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. ముదివర్తి గ్రామానికి చెందిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు 300 మంది ప్రభుత్వం మంజూరుచేసే పింఛన్ కోసం గత సంవత్సరం విడవలూరు ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. వాటిని అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. పింఛన్లు ఇంకా మంజూరుకాలేదని నాలుగురోజుల క్రితం దరఖాస్తుదారులు ఎంపీడీఓకు అర్జీ ఇచ్చేందుకు వెళ్లారు. ఈ సమయంలో అధికారుల ద్వారా ఆన్‌లైన్ జాబితాను తీసుకుని చూడగా అందులో 45 మంది పేర్లు గల్లంతయ్యాయి.
అధికారుల ‘పచ్చ’పాతం
ముదివర్తికి చెందిన అధికార పార్టీ నాయకుడు ఎంపీడీఓ కార్యాలయంలోని సిబ్బంది ద్వారా ఆన్‌లైన్‌లో పేర్లు తీయించి వేసినట్లుగా ఆరోపణలున్నాయి. 45 మంది వైఎస్సార్‌సీపీకి చెందిన వారుగా చెబుతున్నారు. తామంతా అర్హులమని, కావా లనే జాబితా నుంచి పేర్లు తొలగించారని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఎలా మాయమయ్యాయి
నేను వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇటీవల వరకు నా పేరు ఆన్‌లైన్‌లో ఉం ది. జన్మభూమి కమిటీలను రద్దుచేశారని తెలి యడంతో పింఛన్ మంజూరు చేయాలని
అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆన్‌లైన్ జాబితాను చూడగా అందులో పేరు లేదు. ఎలా మాయమైందో ఆ దేవుడికే ఎరుక. – కె.సుబ్బరామయ్య
Comments
Please login to add a commentAdd a comment