
న్యూఢిల్లీ: అధిక పెన్షన్ అర్హతకు సంబంధించి అలాగే ఇందుకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2022 నవంబర్ 4వ తేదీ జారీ చేసిన సూచనలకు అనుగుణంగా ఈ సరŠుయ్యలర్ జారీ అయ్యింది.
వాస్తవ వేతనాలపై రూ.5,000 లేదా నెలకు రూ. 6,500 కంటే ఎక్కువ విరాళం అందించిన లేదా అధిక పెన్షన్ కోసం ఆప్షన్‌ను వినియోగించుకున్న లేదా 2014లో ఈపీఎస్–95కి సవరణకు ముందు అధిక పెన్షన్ కోసం చేసిన అభ్యర్థనను ఈపీఎఫ్‌ఓ పంí³, తిరస్కరణకు గురయిన వారు ఇందుకు అర్హులని నోటిఫికేషన్ వివరించింది. కమీషనర్ సూచించిన దరఖాస్తు ఫారమ్‌లో అలాగే జాయింట్ డిక్లరేషన్‌సహా అన్ని ఇతర అవసరమైన పత్రాలలో అర్హత కలిగిన చందాదారులు తమ సంస్థతో సంయుక్తంగా ఈ ప్రయోజనం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.