notification issued
-
ఎస్బీఐ ఎండీగా రామ మోహన్ రావు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎండీగా తెలుగువారైన రామ మోహన్ రావు అమరను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మూడేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఎస్బీఐ డిప్యూటీ ఎండీగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్బీఐ బోర్డులో ఒక చైర్మన్, నలుగురు ఎండీలు ఉంటారు. రామ మోహన్ రావు బాధ్యతలు స్వీకరిస్తే ఎండీల సంఖ్య నాలుగుకు చేరుకుంటుంది. సంస్థ చైర్మన్ సి.ఎస్.శెట్టి కూడా తెలుగు వారు కావడం విశేషం. ఎస్బీఐ చరిత్రలో ఒకేసారి రెండు కీలక పదవులను తెలుగువారు దక్కించుకోవడం ఇదే తొలిసారి. కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు డైరెక్టర్ల పేర్లను సిఫార్సు చేసే ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) ఈ ఏడాది సెప్టెంబర్‌లో రామ మోహన్ రావును ఎస్బీఐ ఎండీగా ప్రతిపాదించింది. ఎస్బీఐ ఎండీ పోస్టుకు ఎఫ్ఎస్ఐబీ తొమ్మిది మందిని ఇంటర్వ్యూ చేసింది. ఎఫ్ఎస్ఐబీ ప్రతిపాదనలపై ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈవోగా కూడా రామ మోహన్ రావు పనిచేశారు. బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. -
Indian Railways: అడ్వాన్స్ బుకింగ్ ఇకపై 60 రోజులే
సాక్షి, న్యూఢిల్లీ: రైళ్లలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ నిబంధనలను భారతీయ రైల్వే మార్చింది. ప్రస్తుతం నాలుగు నెలల ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. దీన్ని 60 రోజులకు కుదించింది. అడ్వాన్స్ రిజర్వేషన్ కాల పరిమితిని 60 రోజులకు తగ్గిస్తూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంతకు ముందు అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితి 120 రోజులు కాగా, ఇప్పుడు అది 60 రోజులకు తగ్గింది. ఈ నిర్ణయం నవంబర్ 1వ తేదీ నుంచి బుక్ చేసుకొనే టికెట్లపై అమలుకానుంది. ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా టికెట్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. లేదా రైల్వే టికెట్ కౌంటర్ నుంచి టికెట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. మరోవైపు తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి షార్ట్ రూట్ రైళ్లకు ఈ నిర్ణయం వర్తించదని రైల్వే శాఖ తెలిపింది. అదే సమయంలో విదేశీ పర్యాటకులకు 365 రోజుల అడ్వాన్స్ బుకింగ్ నిబంధనలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. రిజర్వు టికెట్లు అధికంగా రద్దు అవుతుండటం, ప్రయాణికులు రాక సీట్లు, బెర్తులు ఖాళీగా ఉండిపోతుండటాన్ని దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ కాలపరిమితిని తగ్గించామని రైల్వే పేర్కొంది. ప్రస్తుతం కాన్సిలేషన్స్ 21 శాతం ఉంటున్నాయని, 4–5 శాతం ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నా.. ప్రయాణం చేయడం లేదని వివరించింది. దీనివల్ల దళారులు సీట్లను అమ్ముకుంటున్నారని, రైల్వే సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొంది. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయడానికే అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితిని 120 నుంచి 60 రోజులకు కుదించామని తెలిపింది. -
‘స్పేస్’లో మరిన్ని ఎఫ్‌డీఐలకు సై
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మూడు కేటగిరీల కింద ఉపగ్రహాల తయారీ, శాటిలైట్ లాంచ్ వాహనాలు తదితర విభాగాల్లోకి వంద శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించేలా నిబంధనలను సవరిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం ఉపగ్రహాల తయారీ, శాటిలైట్ డేటా ఉత్పత్తులు మొదలైన విభాగాల్లో 74 శాతం వరకు ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. అది దాటితే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన సిస్టమ్స్, స్పేస్‌క్రాఫ్ట్‌ల ప్రయోగం కోసం స్పేస్పోర్టుల ఏర్పాటు వంటి విభాగాల్లో 49 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంటుంది. ఉపగ్రహాల విడిభాగాలు, సిస్టమ్స్/సబ్–సిస్టమ్స్ మొదలైన వాటి తయారీలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. ఇప్పటివరకు ఉన్న పాలసీ ప్రకారం ఉపగ్రహాల తయారీ కార్యకలాపాల్లో ఎఫ్‌డీఐలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉంటోంది. కొత్త సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఈ ఏడాది తొలి నాళ్లలోనే ఆమోదముద్ర వేసింది. వీటికి సంబంధించి కేంద్ర అంతరిక్ష విభాగం ఇన్–స్పేస్, ఇస్రో, ఎన్ఎస్ఐఎల్ వంటి పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరిపింది. మస్క్ పర్యటన నేపథ్యంలో.. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్న సందర్భంలో తాజా పరిణామం ప్రాధా న్యం సంతరించుకుంది. వేల కొద్దీ ఉపగ్రహాలతో ప్రపంచంలో ఎక్కడైనా హై–స్పీడ్ ఇంటర్నెట్ను అందించేలా ఎలాన్ మస్క్ తలపెట్టిన శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టు స్టార్‌లింక్‌కు ప్రస్తుతం అనుమతులను జారీ చేసే ప్రక్రియ తుది దశలో ఉంది. ఏప్రిల్ 21, 22 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్న మస్క్ .. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు భారతీయ స్పేస్ కంపెనీలతో కూడా సమావేశం కానున్నారు. -
ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు
భోపాల్: అటవీ శాఖ మినహా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కలి్పస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ సివిల్ సరీ్వసెస్(స్పెషల్ ప్రొవిజన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఉమెన్) రూల్స్–1997కు సవరణ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఇకపై మహిళలకు 35 శాతం కోటా అమలవుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. పోలీసు శాఖతోపాటు ఇతర ప్రభుత్వ పోస్టుల్లో 35 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు టీచర్ల పోస్టుల భర్తీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇటీవల ప్రకటించారు. -
మనీ లాండరింగ్ పరిధిలోకి సీఏలు
న్యూఢిల్లీ: నల్ల ధనం చలామణీ, మనీ లాండరింగ్ కార్యకలాపాలను నిరోధించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన కేంద్రం ఆ దిశగా మరో కీలక చర్య తీసుకుంది. బ్లాక్ మనీ చలామణీకి ఆస్కారం ఉండే అయిదు రకాల ఆర్థిక లావాదేవీలను, వాటిని క్లయింట్ల తరఫున నిర్వహించే చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలను మనీ–లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పరిధిలోకి చేర్చింది. దీంతో ఇకపై సదరు లావాదేవీలను నిర్వహించే సీఏలు, సీఎస్‌లు కూడా విచారణ ఎదుర్కొనాల్సి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మే 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థిరాస్తుల కొనుగోలు, విక్రయం; క్లయింట్ల డబ్బు, సెక్యూరిటీలు లేదా ఇతర ఆస్తుల నిర్వహణ; బ్యాంక్, సేవింగ్స్ లేదా సెక్యూరిటీస్ అకౌంట్ల నిర్వహణ; కంపెనీల ఏర్పాటు, నిర్వహణ కోసం నిధులు సమీకరించడంలో తోడ్పాటు; వ్యాపార సంస్థల కొనుగోళ్లు, విక్రయం.. మొదలైన అయిదు రకాల ఆర్థిక లావాదేవీలు ఇందులో ఉన్నాయి. పీఎంఎల్ఏ చట్టం 2002ను ప్రయోగించాల్సి వస్తే క్లయింట్ల స్థాయిలోనే సీఏలు కూడా జరిమానా, విచారణ ఎదుర్కొనాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘పీఎంఎల్ఏ నిబంధనలను అమలు చేస్తే క్లయింట్లతో సమానంగా సీఏలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా లావాదేవీ జరిగినట్లుగా భావిస్తే ఆ విషయాన్ని సీఏలు వెంటనే నియంత్రణా సంస్థకు తెలియజేయాలి‘ అని వివరించాయి. రిపోర్టింగ్ అధికారులుగా సీఏలు.. ఆయా లావాదేవీల విషయంలో సీఏలు ఇకపై నియంత్రణ సంస్థలకు తెలియజేయాల్సిన రిపోర్టింగ్ అధికారులుగా వ్యవహరించాల్సి ఉంటుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) పేర్కొంది. సదరు లావాదేవీలు నిర్వహించే క్లయింట్లందరి వివరాలను సేకరించి (కేవైసీ), రికార్డులను నిర్వహించాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని తెలిపింది. క్లయింట్ల తరఫున ఏయే ఆర్థిక లావాదేవీలు జరపకుండా నిషేధం ఉందనే దాని గురించి తమ సభ్యుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఐసీఏఐ వివరించింది. కొత్త మార్పులు సరైన కోణంలో అమలయ్యేలా చూసేందుకు, వృత్తి నిపుణులు పోషించగలిగే పాత్ర అర్థమయ్యేలా వివరించేందుకు నియంత్రణ సంస్థలు, అధికారులతో కలిసి పనిచేయనున్నట్లు ఐసీఏఐ తెలిపింది. నల్లధనం కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పీఎంఎల్ఏ నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు .. రాజకీయాలతో ప్రమేయమున్న వ్యక్తుల (పీఈపీ) ఆర్థిక లావాదేవీలను రికార్డు చేయడాన్ని తప్పనిసరి చేసింది. అలాగే లాభాపేక్ష రహిత సంస్థల ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని కూడా ఆర్థిక సంస్థలు, రిపోర్టింగ్ ఏజెన్సీలు సేకరించాల్సి ఉంటోంది. ఇక వర్చువల్ అసెట్స్ లావాదేవీలు నిర్వహించే క్రిప్టో ఎక్సే్చంజీలు, మధ్యవర్తిత్వ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే యూజర్ల వివరాలను సేకరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
రేపటి నుంచి కొత్త పార్లమెంట్ కమిటీలు
న్యూఢిల్లీ: 2023–24 ఆర్థిక సంవత్సరంలో నూతన పార్లమెంట్ కమిటీలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 30 దాకా ఇవి కొనసాగుతాయి. ఈ మేరకు లోక్‌సభ, రాజ్యసభ నోటిఫికేషన్ జారీ చేశాయి. కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరికి మరోసారి అవకాశం దక్కింది. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కమిటీ చైర్మన్‌గా బీజేపీ సభ్యుడు సంతోష్‌కుమార్ గంగ్వార్ నియమితులయ్యారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కమిటీలో రాజ్యసభ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డిని సభ్యుడిగా నియమించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌గా కిరీట్ ప్రేమ్జీభాయి సోలంకీ నియమితులయ్యారు. -
బ్రాడ్‌బ్యాండ్ నిర్వచనం మార్పు
న్యూఢిల్లీ: బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ నిర్వచనాన్ని ప్రభుత్వం సవరించింది. కనీస డౌన్లోడ్ స్పీడ్‌ను 2 ఎంబీపీఎస్‌కు (మెగాబిట్స్ పర్ సెకండ్) పెంచింది. 2013 జూలై నాటి నిర్వచనం ప్రకారం ఇది 512 కేబీపీఎస్‌గా (కిలోబిట్స్ పర్ సెకండు) ఉండేది. తాజా మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధానంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంత వినియోగదారులకు ఈ కొత్త నిర్వచనంతో ప్రయోజనం చేకూరగలదని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం ప్రెసిడెంట్ టీవీ రామచంద్రన్ చెప్పారు. డౌన్లోడ్ స్పీడ్‌ను బట్టి ఫిక్సిడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను బేసిక్, ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ అని మూడు రకాలుగా వర్గీకరిస్తారు. ఊక్లా నిర్వహించే స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం గతేడాది డిసెంబర్లో భారత్‌లో సగటున మొబైల్ డౌన్లోడ్ స్పీడ్ 25.29 ఎంబీపీఎస్‌గా నమోదైంది. నవంబర్‌లో ఇది 18.26 ఎంబీపీఎస్‌గా ఉండేది. 2022 నవంబర్ 30 నాటికి దేశీయంగా 82.54 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు ఉండగా, వీరిలో 79.35 కోట్ల మంది వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. -
అధిక పెన్షన్‌పై ఈపీఎఫ్ఓ సర్క్యులర్
న్యూఢిల్లీ: అధిక పెన్షన్ అర్హతకు సంబంధించి అలాగే ఇందుకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2022 నవంబర్ 4వ తేదీ జారీ చేసిన సూచనలకు అనుగుణంగా ఈ సరŠుయ్యలర్ జారీ అయ్యింది. వాస్తవ వేతనాలపై రూ.5,000 లేదా నెలకు రూ. 6,500 కంటే ఎక్కువ విరాళం అందించిన లేదా అధిక పెన్షన్ కోసం ఆప్షన్‌ను వినియోగించుకున్న లేదా 2014లో ఈపీఎస్–95కి సవరణకు ముందు అధిక పెన్షన్ కోసం చేసిన అభ్యర్థనను ఈపీఎఫ్ఓ పంí³, తిరస్కరణకు గురయిన వారు ఇందుకు అర్హులని నోటిఫికేషన్ వివరించింది. కమీషనర్ సూచించిన దరఖాస్తు ఫారమ్‌లో అలాగే జాయింట్ డిక్లరేషన్సహా అన్ని ఇతర అవసరమైన పత్రాలలో అర్హత కలిగిన చందాదారులు తమ సంస్థతో సంయుక్తంగా ఈ ప్రయోజనం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
అత్యవసర ఔషధాల జాబితాలో కరోనరీ స్టెంట్లు
న్యూఢిల్లీ: కరోనరీ స్టెంట్లను అత్యవసర ఔషధాల జాతీయ జాబితా(ఎన్ఎల్ఈఎం–2022)లో చేరుస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మెటల్ సెంట్లు(బీఎంఎస్), మందు పూత పూసిన స్టెంట్లు(డీఈఎస్)ను ఈ జాబితాలో చేర్చారు. ఇన్నాళ్లూ ‘పరికరాల’ జాబితాలో ఉన్న స్టెంట్లను ఔషధాలుగా అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చడం వల్ల ఎంబీఎస్, డీఈఎస్‌తోపాటు బీవీఎస్, బయోడిగ్రేడబుల్ సెంట్ల ధరలు తగ్గనున్నాయి. ధరలపై నేషనల్ ఫార్మాస్యూటికల్, ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) తుది నిర్ణయం తీసుకోనుంది. దేశంలో కరోనరీ ఆర్టరీ వ్యాధులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో స్టెంట్ల ధరల తగ్గుదల వల్ల బాధితులకు ఎంతో ఉపశమనం కలుగనుంది. అత్యవసర ఔషధాల జాతీయ జాబితాలో 2015లో 376 ఔషధాలు ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య 384కు చేరింది. ఎన్ఎల్ఈఎంలో ఉన్న మందులను ఎన్పీపీఏ నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించడానికి వీల్లేదు. -
రసాయనాలు, ఎరువుల శాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌గా థరూర్
న్యూఢిల్లీ: రసాయనాలు, ఎరువుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ నేత శశి థరూర్ నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. థరూర్ పేరును కాంగ్రెస్ పార్టీ సూచించిందని సమాచారం. పార్టీ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలో మలికార్జున ఖర్గేపై శశిథరూర్ పోటీకి దిగిన సమయంలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం థరూర్ పేరును ప్రతిపాదించడం గమనార్హం. థరూర్ ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ కమిటీకి సారథ్యం వహించారు. ఈ కమిటీలో కాంగ్రెస్‌కు చెందిన ఎంకే విష్ణు ప్రసాద్‌కు చోటు కల్పిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా పునర్వ్యవస్థీకరణతో రసాయనాలు, ఎరువులతోపాటు వాణిజ్యం, పర్యావరణ స్టాండింగ్ కమిటీలకు మాత్రమే కాంగ్రెస్ నేతృత్వం వహించనుంది. -
పన్ను చెల్లింపుదారులకు షాక్, 'ఏపీవై' పథకంలో చేరకుండా కేంద్రం నిషేధం!
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకంలో చేరకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ‘‘అక్టోబర్ 1 నుంచి పన్ను చెల్లింపుదారులు ఎవరైనా ఏపీవైలో చేరేందుకు అనర్హులు’’అంటూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 1లోపు చేరిన వారికి నూతన నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. ఈ అటల్ పెన్షన్ యోజన పథకం కింద పెన్షన్ ప్రయోజనాలను ప్రధానంగా లక్ష్యిత వర్గాలకు అందించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అక్టోబర్ 1, ఆ తర్వాత నుంచి ఏపీవైలో చేరిన సభ్యుల్లో ఎవరైనా పన్ను చెల్లింపుదారునిగా బయటపడితే వారి ఏపీవై ఖాతాను మూసేసి, అందులో జమ అయిన మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్టు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. అసంఘటిత రంగంలో పనిచేసే వారికి.. వృద్ధాప్యంలో ఎటువంటి సామాజిక భద్రతా సదుపాయం లేదు. చదవండి👉 ఇన్కమ్ టాక్స్ నుంచి 143 (1) నోటీసు వచ్చిందా?..అప్పుడేం చేయాలి ? దీంతో అటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కారు 2015 జూన్ 1 నుంచి ఏపీవై పథకాన్ని తీసుకొచ్చింది. రూ.1,000–5,000 మధ్య ఎంత పెన్షన్ కావాలో ఎంపిక చేసుకుని, ఆ మేరకు నెలవారీ లేదా త్రైమాసికం లేదా, వార్షికంగా చందా చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత నుంచి పెన్షన్ అందుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 39 ఏళ్లు పూర్తయ్యే వరకు ఈ పథకంలో చేరేందుకు అర్హత ఉంది. -
అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయ పరిమితి పెంపు
న్యూఢిల్లీ: రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రచార వ్యయ పరిమితిని ఎన్నికల సంఘం పెంచింది. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి ప్రచార వ్యయ పరిమితిని రూ. 70 నుంచి 95 లక్షలకు (పెద్ద రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), రూ. 54 నుంచి 75 లక్షలు (చిన్న రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి ఎన్నికల ప్రచార వ్యయ పరిమితిని రూ. 28 నుంచి 40 లక్షలకు (పెద్ద రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), రూ. 20 నుంచి 28 లక్షలకు (చిన్న రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు) పెంచుతున్నట్లు ఈసీ గురువారం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. రాబోయే ఎన్నికల నుంచి ఈ నూతన పరిమితులు అమల్లోకి వస్తాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో వచ్చే ఫిబ్రవరి– మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
జనగణన మరింత ఆలస్యం!
న్యూఢిల్లీ: దేశీయంగా కరోనా ఉధృతి పెరుగుతున్నందున, దశాబ్దానికి ఒకమారు జరిపే సార్వత్రిక జనగణన కార్యక్రమం ఇప్పట్లో జరగకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిజానికి ఈ గణన 2020–21లో జరగాల్సిఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా శాంతించనందున ఇప్పట్లో గణన ఉండకపోవచ్చంటున్నారు. జిల్లాల సరిహద్దులను, సివిల్ మరియు పోలీసు యూనిట్ల హద్దులను 2022 జూన్ వరకు మార్చవద్దని కేంద్రం ఇటీవలే రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు సెన్సస్ రిజిస్టార్ జనరల్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. జనగణనకు మూడు నెలల ముందు ఇలా హద్దుల మార్పుపై నిషేధం విధిస్తారు. ఇప్పటికే జూన్ వరకు నిషేధం ఉన్నందున ఇది తొలగిన అనంతరమే జనగణనకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే జూన్‌లో నిషేధం తొలగిన అనంతరం జనగణన నోటిఫికేషన్ జారీ చేయదలిస్తే మరోమారు సరిహద్దుల మార్పును నిలిపివేస్తూ ఆదేశాలిస్తారు. తర్వాత 3నెలలకు గణన ఆరంభమవుతుంది. అంటే ఎంత కాదన్నా, వచ్చే అక్టోబర్ వరకు జనగణన జరిగే అవకాశం లేదని నిపుణుల విశ్లేషణ. జిల్లాల, ఇతర యూనిట్ల హద్దుల మార్పుపై నిషేధాన్ని కేంద్రం తొలుత 2020 జనవరి 1 నుంచి మార్చి 31 వరకు విధించింది. ప్రస్తుత నిషేధం ఈ జూన్ 30 వరకు ఉంటుంది. -
ఏడు మెగా టెక్స్టైల్ పార్క్‌ల ఏర్పాటుకు నోటిఫికేషన్
న్యూఢిల్లీ: ఏడు మెగా టెక్స్టైల్ పార్క్‌ల ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ (పీఎం–ఎంఐటీఆర్‌ఏ) పార్క్ స్కీమ్ కింద ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు రూ.4,445 కోట్ల కేటాయింపులతో ఈ స్కీమ్ అమలు ప్రతిపాదనను 2021–22 బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్కొక్క పార్క్ ద్వారా లక్ష ప్రత్యక్ష, రెండు లక్షల పరోక్ష ఉపాధి అవకాశాల కల్పన ప్రధాన ఉద్దేశ్యం. పార్క్‌ల ఏర్పాటుకు ముందుకు వస్తున్న రాష్ట్రాల్లో వీటి ఏర్పాటు జరుగుతుంది. 1,000 ఎకరాలకుపైగా అందుబాటులో ఉన్న భూమి, టెక్స్‌టైల్స్‌కు సంబంధించి ఇతర సౌలభ్యత, తగిన పర్యావరణ వ్యవస్థను పరిగణనలోకి తీసుకుని పార్క్‌ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలను స్వీకరించడం జరుగుతోందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి ప్రాజెక్టుల అత్యాధునిక సాంకేతికతను అలాగే భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, స్థానిక ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షిస్తాయని టెక్స్టైల్ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తెలుగురాష్ట్రాలుసహా తమిళనాడు, పంజాబ్, ఒడిస్సా, గుజరాత్, రాజస్తాన్, అస్సోం, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు పార్క్‌ల ఏర్పాటుకు తమ ఉత్సుకతను తెలియజేసినట్లు కూడా మంత్రిత్వశాఖ వెల్లడించింది. -
మహిళల హక్కుల్ని వాయిదా వేయలేం
న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే) ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు మహిళలను అనుమతించడాన్ని వచ్చే సంవత్సరానికి వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మహిళల హక్కులను నిరాకరించాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. వారికి ఎన్డీయేలో ప్రవేశం కల్పించడం మరో ఏడాది వాయిదా వేయలేమని తేల్చిచెప్పింది. 2022 మే నాటికి ఎన్డీయే నోటిఫికేషన్ జారీ చేస్తామని, మహిళలను అనుమతిస్తామని కేంద్రం చెప్పగా, న్యాయస్థానం అంగీకరించలేదు. తాము ఇదివరకే ఇచ్చిన ఆదేశాల ప్రకారం... ఈ ఏడాది నవంబర్లోనే వారిని పరీక్ష రాసేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సైనిక దళాలు అత్యుత్తమ సేవలు అందిస్తుంటాయని జస్టిస్ ఎస్.కె.కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తుచేసింది. ఎన్డీయేలో మహిళలను చేర్చుకొనేందుకు ఇక ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ విషయంలో యూపీఎస్సీ, రక్షణ శాఖ కలిసి పని చేయాలని పేర్కొంది. ఎన్డీయేలో మహిళా అభ్యర్థుల కోసం సమగ్రమైన కరిక్యులమ్ రూపొందించాలని, ఇందుకోసం రక్షణ దళాల ఆధ్వర్యంలో నిపుణులతో కూడిన స్టడీ గ్రూప్‌ను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్డీయేలో మహిళలకు శిక్షణ ఇచ్చే విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వడానికి బోర్డ్ ఆఫ్ ఆఫీసర్ల సమావేశం నిర్వహించాలని తెలిపింది. ఎన్డీయేలో మహిళలకు ప్రవేశం నిరాకరించడాన్ని ఆక్షేపిస్తూ న్యాయవాది కుశ్ కల్రా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదనలు వినిపించారు. నవంబర్ 14న జరిగే పరీక్షకు మహిళలను అనుమతించలేమని, అందుకు సమయం సరిపోదని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించగల సామర్థ్యం ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం బదులిచి్చంది. ఎన్డీయే ప్రవేశ పరీక్ష కోసం మహిళలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని, వారిని నిరాశపర్చలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
ట్రాఫిక్ ఉల్లంఘనలకు 15 రోజుల్లోగా ఈ–చలాన్
న్యూఢిల్లీ: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు రాష్ట్రాల్లోని సంబంధిత విభాగాలు ఇకపై 15 రోజుల్లోగా నోటీసు(ఈ–చలాన్) జారీ చేయాల్సి ఉంటుంది. ఉల్లంఘన జరిగిన తేదీ నుంచి 15 రోజుల్లోగా నోటీసును వాహనదారుడికి చేరవేయాలి. చలాన్ సొమ్మును వాహనదారుడు చెల్లించేదాకా సదరు ఎలక్ట్రానిక్ రికార్డును భద్రపర్చాలి. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ కొత్త నియమాలను అమల్లోకి తీసుకొస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటార్ వాహన చట్టం–1989కు ఇటీవల సవరణ చేయడం తెల్సిందే. కొత్త రూల్స్ ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి స్పీడ్ కెమెరా, సీసీటీవీ కెమెరా, శరీరంపై ధరించే కెమెరా, స్పీడ్ గన్, డ్యాష్‌బోర్డు కెమెరా, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్పీఆర్) వంటి సాంకేతిక పరికరాలను రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. అధికంగా ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారమున్న జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, కీలకమైన జంక్షన్లు, నోటిఫికేషన్లో ప్రస్తావించిన 132 నగరాలతోపాటు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న అన్ని నగరాల్లో ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని రోడ్డు రవాణా, హైవేల శాఖ సూచించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా వీటిని ఏర్పాటు చేయాలని తెలిపింది. నోటిఫై చేసిన నగరాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 19, ఉత్తరప్రదేశ్‌లో 17, ఆంధ్రప్రదేశ్‌లో 13, పంజాబ్‌లో 9 నగరాలు ఉన్నాయి. -
వరంగల్, హన్మకొండ జిల్లాలు: ఏ మండలాలు ఎందులోకి?
సాక్షి, వరంగల్ : వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్చేందుకు ప్రభుత్వం సోమవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాల పేర్ల మార్పుపై అభ్యంతరాలు, వినతుల స్వీకరణకు నెల రోజుల సమయం ఇచ్చింది. ఈ రెండు జిల్లాల పేర్లు మారుస్తున్నట్లు జూన్ 21న వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సమయంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్లతో కలిపి హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయనుండగా, మొత్తం 12 మండలాలు, 139 రెవెన్యూ గ్రామాలు ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి. ఇక వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కేంద్రంగా హన్మకొండ జిల్లా కేంద్రం కొనసాగుతుంది. వరంగల్, నర్సంపేట రెవెన్యూ డివిజన్లతో వరంగల్ జిల్లా ఏర్పడనుండగా, మొత్తం 15 మండలాలు, 217 రెవెన్యూ గ్రామాలు ఈ జిల్లా కిందికి వస్తాయి. వరంగల్ అర్బన్ జిల్లాలోని వరంగల్, ఖిలా వరంగల్ మండలాలు వరంగల్‌లో కలవగా, వరంగల్ రూరల్‌లోని పరకాల, నడికుడ, దామెర మండలాలు హన్మకొండ జిల్లాలో కలిశాయి. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి గందరగోళం లేకుండా ఉండేందుకు.. ప్రజాభిప్రాయం మేరకు ఎటువంటి గందరగోళం లేకుండా ఉండేందుకు జిల్లా పేర్ల మార్పు జరుగుతోందని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ఇప్పటికే ప్రారంభం కాగా.. వరంగల్ కలెక్టర్ కార్యాలయం.. ఆజంజాహిæ మిల్లు మైదానం, ఆటోనగర్ ఏదో ఒక ప్రాంతంలో నిర్మాణానికి యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి జీఓ వెలువడిన నేపథ్యంలో నెల రోజులపాటు అభ్యంతరాలు, వినతులు స్వీకరించనున్నారు. గెజిట్ రాగానే.. అర్బన్, రూరల్ జిల్లాల స్థానంలో.. హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా అధికారికంగా కార్యకలాపాలు సాగుతాయి. ఇదిలా ఉంటే హన్మకొండ, వరంగల్ రెండు జిల్లాలైనప్పటికీ.. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 66 డివిజన్లు, రెండు జిల్లాల పరిధిలోనే ఉంటాయి. అయితే కార్పొరేషన్ సర్కిళ్లు పెరిగే అవకాశాలున్నాయి. హన్మకొండ జిల్లాలో.. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా హన్మకొండలోనే ఉంటుంది. పరకాల, హుస్నాబాద్, హుజూరాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధ్దన్నపేట నియోజకవర్గాలకు చెందిన మండలాలు కూడా ఈ జిల్లాలోకి వస్తాయి. వరంగల్ జిల్లాలో తూర్పు, నర్సంపేట నియోజకవర్గాలు పూర్తిగా ఈ జిల్లాలోకే రానుండగా, పాలకుర్తి, పరకాల, వర్ధ్దన్నపేట తదితర నియోజకవర్గాల మండలాలు కూడా వస్తాయి. నాలుగు రెవెన్యూ డివిజన్లు.. 27 మండలాలు... జిల్లాల పునర్విభజన తర్వాత ఈ రెండు జిల్లాల్లో 27 మండలాలు ఉంటాయి. హన్మకొండ జిల్లాలో హన్మకొండ రెవెన్యూ డివిజన్ కింద 8, పరకాల డివిజన్ పరిధిలోని నాలుగు మండలాలు ఉండేలా చేశారు. ►హన్మకొండ డివిజన్లో హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వేలేరు, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లిలు ►పరకాల డివిజన్లో కమలాపూర్, పరకాల, నడికుడ, దామెర మండలాలు వస్తాయి. ►వరంగల్ జిల్లాలో వరంగల్ రెవెన్యూ డివిజన్లో 9, నర్సంపేట డివిజన్లో 6 మండలాలు వస్తాయి. ►వరంగల్ పరిధిలో వరంగల్, ఖిలా వరంగల్, గీసుకొండ, ఆత్మకూరు, శాయంపేట, వర్దన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెంలు ఉంటాయి. ►నర్సంపేట డివిజన్లో నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ మండలాలు ఉంటాయి. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల స్థానంలో హన్మకొండ, వరంగల్ జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గత నెల 21న వరంగల్ నగర పర్యటన సందర్భంగా ప్రజాప్రతినిధులు, ప్రజల వినతి మేరకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీని ద్వారా పరిపాలన ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఆదేశాలు జారీ చేయడం సంతోషకరమని తెలిపారు. -
వాహన కంపెనీల ‘రీకాల్స్’పై కేంద్రం కొరడా
న్యూఢిల్లీ: తయారీ లోపాల కారణంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వాహనాలను తప్పనిసరిగా రీకాల్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇకపై వాహనాల కంపెనీలు రూ. 1 కోటి దాకా జరిమానా కట్టాల్సి రానుంది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా మోడల్ మొత్తం అమ్మకాల్లో నిర్దిష్ట స్థాయిలో వెహికల్ రీకాల్ పోర్టల్‌కు ఫిర్యాదులు వచ్చిన పక్షంలో తప్పనిసరిగా రీకాల్ చేయాలనే ఆదేశాలిచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. వాహనాల సంఖ్య, రకాలను బట్టి రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా జరిమానా విధించేలా నోటిఫికేషన్లో ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం సెంట్రల్ మోటర్ వెహికల్స్ చట్టంలోని వాహనాల టెస్టింగ్, తప్పనిసరి రీకాల్ నిబంధనల ప్రకారం తయారీ సంస్థలు లేదా దిగుమతి సంస్థలు స్వచ్ఛందంగా రీకాల్ చేయకపోతే పెనాల్టీ విధించడానికి అవకాశం ఉంది. కొత్త నిబంధనలు ఏడేళ్ల లోపు వాహనాలకు వర్తిస్తాయి. ఇక రహదారులపై భద్రతపరమైన రిస్కులు సృష్టించేలా వాహనంలో లేదా విడిభాగాల్లో లేదా సాఫ్ట్‌వేర్‌లో సమస్యలేమైనా ఉంటే లోపాలుగా పరిగణిస్తారు. ఆరు లక్షల పైగా ద్విచక్ర వాహనాలను, ఒక లక్ష పైగా నాలుగు చక్రాల వాహనాలను (కార్లు, ఎస్‌యూవీలు మొదలైనవి) తప్పనిసరిగా రీకాల్ చేయాలంటూ ఆదేశించిన పక్షంలో వాహన కంపెనీలు గరిష్టంగా రూ. 1 కోటి మేర జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇక, తొమ్మిది మంది ప్యాసింజర్లను తీసుకెళ్లే వాహనాలు, హెవీ గూడ్ వెహికల్స్‌ను 50,000 పైచిలుకు రీకాల్ చేయాల్సి వస్తే రూ. 1 కోటి దాకా పెనాల్టీ ఉంటుంది. మూడు లక్షల పైగా త్రిచక్ర వాహనాలను రీకాల్ చేయాల్సి వచ్చినా గరిష్టంగా ఈ స్థాయి జరిమానా వర్తిస్తుంది. ఇక, ఎన్ని ఫిర్యాదులు వస్తే రీకాల్‌కు ఆదేశించేదీ కూడా కేంద్రం తెలిపింది. ఉదాహరణకు కార్లు లేదా ఎస్‌యూవీలు ఏటా 500 యూనిట్లు అమ్ముడవుతున్న పక్షంలో 20 శాతం లేదా 100 ఫిర్యాదులు వస్తే తప్పనిసరి రీకాల్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చు. ఫిర్యాదులకు ప్రత్యేక పోర్టల్ .. వాహనదారులు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు చేస్తుంది. ఫిర్యాదుల ఆధారంగా ఆటోమొబైల్ కంపెనీలకు నోటీసులు పంపిస్తారు. స్పందించేందుకు 30 రోజుల గడువిస్తారు. తప్పనిసరి రీకాల్‌కు ఆదేశించడానికి ముందు నిర్దిష్ట ఏజెన్సీ ఆయా ఫిర్యాదులపై కూలంకషంగా విచారణ జరుపుతుంది. ఇక, రీకాల్ ఆదేశాలపై తయారీ సంస్థలు, దిగుమతిదారులు, రెట్రోఫిటర్‌లకు అభ్యంతరాలేమైనా ఉంటే నోటీసు అందుకున్న 90 రోజూల్లోగా హైకోర్టును ఆశ్రయించవచ్చు. -
పీజీ మెడికల్ కన్వీనర్ సీట్ల తుది విడత కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన పీజీ మెడికల్ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి శని, ఆదివారాల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద సీట్ల భర్తీకి ఇప్పటికే మొదటి, రెండు, మూడో విడత వెబ్ కౌన్సెలింగ్ పూర్తయింది. కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్లను ఈ మాప్‌అప్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. కాలేజీల వారీగా ఖాళీలను వెబ్సైట్లో పొందుపరిచారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రాధాన్య క్రమంలో కాలేజీల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. తగ్గించిన నీట్ అర్హత కటాఫ్ స్కోర్ ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో కూడిన రివైజ్డ్ తుది మెరిట్ జాబితాను వర్సిటీ విడుదల చేసింది. ఆ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని అధికారులు కోరారు. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్ అయి జాయిన్ కాని అభ్యర్థులు, కళాశాలలో చేరి డిస్కంటిన్యూ చేసిన అభ్యర్థులు, అలాగే ఆలిండియా కోటా కౌన్సెలింగ్ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులుగా పరిగణిస్తారని తెలిపారు. ఇతర వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు. -
టెస్కాబ్, మార్క్‌ఫెడ్ చైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్), రాష్ట్ర సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ (మార్క్‌ఫెడ్) మేనేజింగ్ క మిటీకి ఎన్నికల కోసం సోమ వారం రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నోటిఫికేష న్ విడుదల చేసింది. దీని ప్రకారం టెస్కాబ్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఈ నెల 5న, మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ కమిటీ డైరెక్టర్ల ఎన్నిక ఈ నెల 10న జరగనుంది. ఇక మార్క్‌ఫెడ్ చైర్మన్ ఎన్నిక 11న జరగనుంది. 5న ఉదయం 9 నుంచి 11 గంటల వ రకు టెస్కాబ్ చైర్మన్, వైస్ చైర్మన్లకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 11.30 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఉంటాయి. ఎవరైనా ఆ పదవులకు పోటీలో ఉంటే అదేరోజు మధ్యా హ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఉపసంహరణ అనంతరం ఒకరే మిగిలితే ఆయా పదవులను ఏకగ్రీవమైనట్లుగా ప్రకటిస్తామని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వెల్లడించింది. కాగా, డీసీసీబీ చైర్మన్లంతా టెస్కాబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉంటారు. డీసీసీబీ చైర్మన్లు టెస్కాబ్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎ న్నుకుంటారు. ఇక తెలంగాణ సహకార మార్కె టింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికకు సంబంధించి 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఒంటి గంట వరకు డైరెక్టర్ పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తరువాత నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు సాయంత్రం ఐదు గంటల వరకు సమ యం ఇచ్చారు. ఈ నెల 10న ఉదయం 8 నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఆపై ఫలితాలు వెల్లడిస్తారు. ఇందులో ఏడుగురు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. పీఏసీఎస్S అధ్యక్షులు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల అధ్యక్షులు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఈ నెల 11న రాష్ట్ర సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. -
87 సివిల్ జడ్జి పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి హైకోర్టు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 87 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా.. అందులో 70 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. వీటిలో 31 పోస్టులను ఓపెన్ కేటగిరీకి కేటాయించగా.. అందులో 11 పోస్టులు మహిళలకు ఇచ్చారు. దివ్యాంగులకు (ఓపెన్ కేటగిరి)–1, బీసీ–ఎ 6 (మహిళలకు 2), బీసీ–బీ 8 (మహిళలకు 4), బీసీ–సీ 1, బీసీ–డీ 5 (మహిళలకు 2), బీసీ–ఇ 3 (మహిళలకు 1), ఎస్సీలకు 10 (మహిళలకు 3), ఎస్టీలకు 5 (మహిళలకు 3) పోస్టులు ఖరారు చేశారు. మిగిలిన 17 పోస్టులను బదిలీల ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు న్యాయవాదిగా మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలన్న నిబంధనను ఈసారి సడలించారు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ్టటజిఛి. జౌఠి. జీn ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. -
డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు 28న ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు ఈ నెల 28న జరుగనున్నాయి. అందుకు సంబంధించి రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. ప్రతీ జిల్లాకూ వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వడం గమనార్హం. ఈ నెల 22న జిల్లా అధికారులు కూడా మళ్లీ నోటిఫికేషన్లు జారీచేస్తారని అథారిటీ అధికారులు తెలిపారు. దీని ప్రకారం ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం ఈ నెల 28న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికలు ముగిసిన వెంటనే అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు. 29న ఆఫీస్ బేరర్ల ఎన్నిక జరుగుతుంది. అదే రోజు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారని ఎన్నికల అథారిటీ తెలిపింది. ప్రతీ డీసీసీబీ, డీసీఎంఎస్‌లలో 20 మంది వంతున డైరెక్టర్లను ఆ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు ఎన్నుకుంటారు. 20 మంది డైరెక్టర్లలో 16 మందిని ప్యాక్స్‌ల నుంచి, మరో నలుగురిని చేనేత సంఘాలు వివిధ సొసైటీలకు చెందిన వారి నుంచి ఎన్నుకుంటారు. 16 మంది డైరెక్టర్లలో ఎస్సీ లకు మూడు, ఎస్టీలకు ఒకటి, బీసీలకు రెండు, ఓపెన్ కేటగిరీకి 10 వంతున రిజర్వు చేశారు. మరో 4 డైరెక్టర్లకు సంబంధించిన వాటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓపెన్ కేటగిరీలకు ఒక్కోటి వంతున రిజర్వేషన్ కల్పించారు. ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) చైర్మన్‌ను వచ్చే నెల ఐదో తేదీన ఎన్నుకోనున్నారు. -
‘ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులే’
సాక్షి, అమరావతి : జనవరి 1నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిషికేషన్ జారీ చేసింది. జనవరి 1వ తేదిని ఆర్టీసీ ఉద్యోగుల నియామక డేగా పరిగణించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కార్మికులను ప్రభుత్వంలో విలీనం) చట్టం 2019 ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా రవాణా విభాగం ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను పరిగణిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఖజానా నుంచి నేరుగా ఆర్టీసీ కార్మికులు జీతాలు అందుకోనున్నారు. 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి జనవరి 1 నుంచి ఆర్టీసీ సిబ్బంది ప్రజా రవాణా ఉద్యోగులుగా మారనున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ మినహాయించి ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఆ సంస్థలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న 51,488 మందికి లబ్ధి చేకూరనుంది. ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రజా రవాణాశాఖలో విలీనమైన వెంటనే చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. -
ఏపీలో నూతన బార్ పాలసీపై ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన బార్ పాలసీని శుక్రవారం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలయ్యే ఈ పాలసీ ప్రకారం బార్ లైసెన్స్ దరఖాస్తు ఫీజును రూ. 10 లక్షలుగా నిర్ణయించారు. ఇది నాన్ రిఫండబుల్. లాటరీ పద్ధతిలో బార్లను కేటాయించనుండగా, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వ్యాపార వేళలుగా నిర్ణయించారు. లైసెన్స్ గడువు రెండేళ్ల వరకు ఉంటుంది. లైసెన్స్ ఫీజులను చూస్తే 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 25 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో రూ. 50 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో రూ. 75 లక్షలుగా ఫీజును నిర్ణయించారు. మరోవైపు సామాన్యులకు మద్యాన్ని దూరం చేసేందుకు బార్లలో మద్యం అమ్మకాలపై అదనపు పన్ను వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
రైతులందరికీ పీఎం–కిసాన్
న్యూఢిల్లీ: ఎన్నికల హామీని నెరవేరుస్తూ.. రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్ పథకం వర్తింపజేయాలనే నిర్ణయంపై కేంద్రం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 14.5 కోట్ల మంది రైతులకు.. వారికెంత భూమి ఉంది అన్న విషయం పరిగణనలోకి తీసుకోకుండా ఏడాదికి రూ.6 వేల చొప్పున సాయం అందజేస్తారు. మే 31న జరిగిన కొత్త ఎన్డీయే ప్రభుత్వ తొట్టతొలి సమావేశంలోనే ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని రైతులందరికీ వర్తింపజేస్తామని 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రకటించిన బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. దీనిపై శనివారం నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ.. ఈ మేరకు ప్రస్తుతమున్న మినహాయింపు అంశాలను పరిగణనలోకి తీసుకుని లబ్ధిదారులను గుర్తించాల్సిందిగా కోరుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ప్రస్తుతమున్న భూయాజమాన్య విధానాన్ని ఉపయోగించి లబ్ధిదారులను గుర్తించాలని, పీఎం–కిసాన్ పోర్టల్‌లో కుటుంబసభ్యుల వివరాలు అప్లోడ్ చేసిన తర్వాత ప్రయోజనాన్ని వారి ఖాతాల్లోకి బదిలీ చేయాలని ఆదేశించింది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించే బాధ్యత, వారి డేటా పీఎం–కిసాన్ పోర్టల్‌లో అప్లోడ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉంటుంది. వీరికి వర్తించదు సంస్థాగత భూ యజమానులు, రాజ్యాంగ పరమైన పదవులు కలిగిన రైతు కుటుంబాలు, సర్వీసులో ఉన్న లేదా పదవీ విరమణ పొందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, అలాగే ప్రభుత్వం రంగ, స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వ సంస్థల అధికారులు, ఉద్యోగులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సిద్ధి (పీఎం–కిసాన్) పథకం కిందకి రారు. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వంటి వృత్తి విద్యా నిపుణలు, అలాగే నెలకు రూ.10 వేలకు పైగా పెన్షన్ పొందేవారు, గత మదింపు సంవత్సరంలో ఆదాయ పన్ను కట్టినవారికి కూడా ఈ పథకం వర్తించదు. రూ.75 వేల కోట్ల పీఎం–కిసాన్ పథకాన్ని మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం సవరించిన పథకం ప్రకారం.. మరో 2 కోట్ల మంది రైతులు దీనికింద లబ్ధి పొందుతారు. దీంతో దీని అంచనా వ్యయం కూడా 2019–20లో రూ.87,217.50 కోట్లకు పెరుగుతుంది.