
న్యూఢిల్లీ: రసాయనాలు, ఎరువుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ నేత శశి థరూర్ నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. థరూర్ పేరును కాంగ్రెస్ పార్టీ సూచించిందని సమాచారం. పార్టీ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలో మలికార్జున ఖర్గేపై శశిథరూర్ పోటీకి దిగిన సమయంలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం థరూర్ పేరును ప్రతిపాదించడం గమనార్హం.
థరూర్ ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ కమిటీకి సారథ్యం వహించారు. ఈ కమిటీలో కాంగ్రెస్‌కు చెందిన ఎంకే విష్ణు ప్రసాద్‌కు చోటు కల్పిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా పునర్వ్యవస్థీకరణతో రసాయనాలు, ఎరువులతోపాటు వాణిజ్యం, పర్యావరణ స్టాండింగ్ కమిటీలకు మాత్రమే కాంగ్రెస్ నేతృత్వం వహించనుంది.
Comments
Please login to add a commentAdd a comment