సంస్థ బోర్డులో మరో తెలుగు వ్యక్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎండీగా తెలుగువారైన రామ మోహన్ రావు అమరను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మూడేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్‌బీఐ బోర్డులో ఒక చైర్మన్, నలుగురు ఎండీలు ఉంటారు.
రామ మోహన్ రావు బాధ్యతలు స్వీకరిస్తే ఎండీల సంఖ్య నాలుగుకు చేరుకుంటుంది. సంస్థ చైర్మన్ సి.ఎస్.శెట్టి కూడా తెలుగు వారు కావడం విశేషం. ఎస్‌బీఐ చరిత్రలో ఒకేసారి రెండు కీలక పదవులను తెలుగువారు దక్కించుకోవడం ఇదే తొలిసారి. కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు డైరెక్టర్ల పేర్లను సిఫార్సు చేసే ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) ఈ ఏడాది సెప్టెంబర్‌లో రామ మోహన్ రావును ఎస్‌బీఐ ఎండీగా ప్రతిపాదించింది.
ఎస్‌బీఐ ఎండీ పోస్టుకు ఎఫ్‌ఎస్‌ఐబీ తొమ్మిది మందిని ఇంటర్వ్యూ చేసింది. ఎఫ్‌ఎస్‌ఐబీ ప్రతిపాదనలపై ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎస్‌బీఐ కార్డ్ ఎండీ, సీఈవోగా కూడా రామ మోహన్ రావు పనిచేశారు. బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఆయన సొంతం.
Comments
Please login to add a commentAdd a comment