Telugu person
-
ఎస్బీఐ ఎండీగా రామ మోహన్ రావు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎండీగా తెలుగువారైన రామ మోహన్ రావు అమరను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మూడేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఎస్బీఐ డిప్యూటీ ఎండీగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్బీఐ బోర్డులో ఒక చైర్మన్, నలుగురు ఎండీలు ఉంటారు. రామ మోహన్ రావు బాధ్యతలు స్వీకరిస్తే ఎండీల సంఖ్య నాలుగుకు చేరుకుంటుంది. సంస్థ చైర్మన్ సి.ఎస్.శెట్టి కూడా తెలుగు వారు కావడం విశేషం. ఎస్బీఐ చరిత్రలో ఒకేసారి రెండు కీలక పదవులను తెలుగువారు దక్కించుకోవడం ఇదే తొలిసారి. కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు డైరెక్టర్ల పేర్లను సిఫార్సు చేసే ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) ఈ ఏడాది సెప్టెంబర్‌లో రామ మోహన్ రావును ఎస్బీఐ ఎండీగా ప్రతిపాదించింది. ఎస్బీఐ ఎండీ పోస్టుకు ఎఫ్ఎస్ఐబీ తొమ్మిది మందిని ఇంటర్వ్యూ చేసింది. ఎఫ్ఎస్ఐబీ ప్రతిపాదనలపై ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈవోగా కూడా రామ మోహన్ రావు పనిచేశారు. బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. -
దుబాయ్: తెలుగు వ్యక్తికి బంపర్ లాటరీ
దుబాయ్ సిటీ: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ తెలుగు వ్యక్తిని లక్ష్మీదేవి కనికరించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోరుగడ్డ నాగేంద్రమ్ 2017లో దుబాయ్ వెళ్లారు. కష్టపడి సంపాదించిన సొమ్ములో నెల నెలా పొదుపు చేసి లాటరీ టికెట్ కొన్నాడు. ఇంకేముంది జాక్పాట్కొట్టాడు. లాటరీ టికెట్‌పై ఏకంగా రూ.2.25 కోట్లు గెలుచుకున్నారు. పొదుపు పథకం చందాదారులకు లక్కీ డ్రా నిర్వహించగా అందులో అతడు విజేతగా నిలిచారు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ తాను సంపాదించిన సొమ్ములో నుంచి ప్రతి నెలా 100 దిర్హమ్(ఏఈడీ)లను 2019 నుంచి నేషనల్ బాండ్స్‌లో పొదుపు చేశారు. ఈ సేవింగ్ స్కీమ్ కట్టేవారికి రివార్డు ఇవ్వడానికి లక్కీ డ్రా నిర్వహిస్తారు.గ్రాండ్ ప్రైజ్ కేటగిరీ లాటరీలో నాగేంద్రమ్ విజేతగా నిలిచారు. లాటరీ బహుమతిగా 10 లక్షల యూఏఈ దిర్హమ్స్ అందుకున్నారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2.25కోట్లకు పైమాటే. ఇంత భారీ ప్రైజ్‌మనీ రావడంపై నాగేంద్రమ్ పట్టరాని ఆనందం వ్యక్తం చేశారు. ఈ డబ్బుతో తన పిల్లలను ఉన్నత చదువు చదవిస్తానని సంతోషపడ్డారు. -
త్రిపుర హైకోర్టు తాత్కాలిక సీజేగా తెలుగు వ్యక్తి
సాక్షి, న్యూఢిల్లీ: త్రిపుర హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా జస్టిస్ తొడుపునూరి అమర్నాథ్ గౌడ్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. నవంబరు 11 నుంచి ఆయన తాత్కాలిక సీజేగా కొనసాగుతారంటూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. జస్టిస్ అమర్నాథ్ 1965లో హైదరాబాద్‌లో జన్మించారు. 2017 సెప్టెంబర్ 21న ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2021 అక్టోబర్ 28న త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు. -
కార్డినల్‌గా తొలి దళితుడు.. పూల ఆంథోనీ
సాక్షి, హైదరాబాద్: ఆర్చిబిషప్ పూల ఆంథోనీ(60) క్యాథలిక్ కార్డినల్‌గా ప్రకటించబడ్డ విషయం తెలిసిందే. కేథలిక్కుల మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్.. వాటికన్ సిటీ(ఇటలీ) సెయింట్ పీటర్స్ బాసిలికాలో ఇవాళ పూల ఆంథోనీని కార్డినల్‌గా అధికారికంగా ప్రకటించనున్నారు. ఏపీ కర్నూల్‌కు చెందిన పూల ఆంథోనీ.. కార్డినల్ హోదా అందుకోబోయే తొలి దళితుడు కూడా. ఇవాళ(ఆగస్టు 27న) జరగబోయే కొత్త కార్డినల్స్ పరిషత్ సమావేశానికి కూడా పూల ఆంథోనీ హాజరుకానున్నారు. ఇక కేథలిక్ చర్చి చరిత్రలో ఈ హోదా పొందిన తొలి తెలుగు వ్యక్తి పూల ఆంథోనీ. కార్డినల్ హోదాలో.. పోప్ ఎన్నికలో పాల్గొనే అవకాశం పూల ఆంథోనీకి ఉంటుంది. ఆంథోనీతో పాటు భారత్ నుంచి గోవా, డామన్ ఆర్చి బిషప్ ఫిలిపె నెరి అంటోనియో సెబాస్టియో డొ రొసారియో ఫెర్రో కూడా కార్డినల్ ర్యాంక్ పొందిన వాళ్లలో ఉన్నారు. నేపథ్యం.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిందుకూరు గ్రామంలో జన్మించిన ఆంథోనీ.. 1992లో మొదటిసారిగా కడపలో క్రైస్తవ మతాచార్యుడుగా, 2008లో కర్నూలు బిషప్‌గా నియమితులయ్యారు. 2021 జనవరిలో హైదరాబాద్ ఆర్చిబిషప్ అయ్యారు. కార్డినల్‌గా నియమితులైన ఆంథోనీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ ఆర్చిబిషప్ హోదాలోనూ కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: 500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద వేలం -
కార్డినల్‌గా పూల ఆంథోనీ
హైదరాబాద్: ఆర్చిబిషప్ పూల ఆంథోనీ(60) భారత్‌లో కార్డినల్‌గా నియమితులయ్యారు. కేథలిక్కుల మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో ఆదివారం 21 మందిని కొత్త కార్డినల్స్‌గా ప్రకటించారు. వీరిలో భారత్ నుంచి ఆంథోనీతోపాటు గోవా, డామన్ ఆర్చి బిషప్ ఫిలిపె నెరి అంటోనియో సెబాస్టియో డొ రొసారియో ఫెర్రో ఉన్నారు. కేథలిక్ చర్చి చరిత్రలో ఈ హోదా పొందిన తొలి తెలుగు వ్యక్తి పూల ఆంథోనీ. కార్డినల్ హోదాలో పోప్ ఎన్నికలో పాల్గొనే అవకాశం ఈయనకు ఉంటుంది. ఆగస్ట్ 27వ తేదీన జరిగే సమావేశం నాటికి కార్డినల్స్ సంఖ్య 229కు పెరగనుంది. అందులో 131 మందికి పోప్ ఎన్నికలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిందుకూరు గ్రామంలో జన్మించిన ఆంథోనీ 1992లో మొదటిసారిగా మతాచార్యుడుగా, 2008లో కర్నూలు బిషప్‌గా నియమితులయ్యారు. 2021 జనవరిలో హైదరాబాద్ ఆర్చిబిషప్ అయ్యారు. ఆగస్ట్ 27న వాటికన్లో కొత్త కార్డినల్స్ పరిషత్ సమావేశానికి పూల ఆంథోనీ హాజరుకానున్నారు. కార్డినల్‌గా నియమితులైన ఆంథోనీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ ఆర్చిబిషప్ హోదాలోనూ కొనసాగనున్నారు. -
యూజీసీ చైర్మన్‌గా తెలుగు తేజం జగదీశ్
న్యూఢిల్లీ/సాక్షి, నల్లగొండ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)గా ప్రొఫెసర్ మామిడాల జగదీశ్‌కుమార్ నియమితులయ్యారు. ఐదేళ్లపాటు ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. కమిషన్‌కు ఛైర్మన్‌గా పనిచేసిన ప్రొఫెసర్ డిపి సింగ్ పదవీకాలం ముగియడంతో డిసెంబర్ 7న పదవీ విరమణ చేశారు. అప్పటినుంచి ఖాళీగా ఉన్న పోస్టుకు ప్రకటన ఇవ్వడంతో, 55 మంది దరఖాస్తు చేసుకోగా జగదీశ్ ఎంపికయ్యారు. యూజీసీకి చైర్మన్‌గా నియమితులైన మూడో తెలుగు వ్యక్తి జగదీశ్ కుమార్. 1961లో డాక్టర్ వాసిరెడ్డి శ్రీకృష్ణ, 1991 నుంచి 1995 వరకు జి.రామిరెడ్డి యూజీసీ చైర్మన్లుగా పనిచేయగా, ఇప్పుడు ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ నియమితులయ్యారు. 60 ఏళ్ల జగదీశ్ కుమార్ ప్రస్తుతం జేఎన్‌యూ వైస్‌చాన్స్‌లర్‌గా పనిచేస్తున్నారు. వీసీగా పదవీకాలం గతేడాదే ముగిసినా ఆయనను కొనసాగించారు. జేఎన్‌యూలో ఆయన వీసీగా ఉన్నప్పుడు 2016లో విద్యార్థులపై దేశద్రోహం కేసులు నమోదు కావడం, అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహించదలిచిన కార్యక్రమాన్ని వీసీ వద్దనడం, విద్యార్థులు వీసీ కార్యాలయాలనికి తాళాలేయడం, 2019లో జరిగిన స్నాతకోత్సవ వేదికపై దాదాపు ఆరు గంటలపాటు మానవవనరుల శాఖ మంత్రిని నిర్బంధించడం వంటి అనేక వివాదాస్పద సంఘటనలు జరిగాయి. నల్లగొండ వాసి... తెలుగువాడైన జగదీశ్ కుమార్ స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తిమండలం మామిడాల గ్రామం. పాఠశాల విద్యను స్వగ్రామంలో, ఏడవ తరగతి నుంచి ఇంటర్ వరకు మిర్యాలగూడలో చదివారు. డిగ్రీతో పాటు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ హైదరాబాద్‌లో చదివారు. ఆ తరువాత ఐఐటీ మద్రాసులో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తరువాత పోస్ట్ డాక్టో్టరల్ రీసెర్చ్ కోసం కెనడా వెళ్లి 1994లో స్వదేశానికి తిరిగి వచ్చారు. 1995లో ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. 2013లో ఐఐటీ ఢిల్లీ నుంచి ‘అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్’ అందుకున్నారు. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో నిష్ణాతుడైన ఆయన 2016 ఢిల్లీ జేఎన్‌యూ వైస్ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సాంçస్కృతిక మంత్రిత్వ శాఖలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ పాలకమండలి చైర్మన్‌గా, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా, యూజీసీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సభ్యునిగా ఉన్నారు. ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్, ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ ఫెలో అందుకున్నారు. సెమీకండక్టర్ డివైజ్ డిజైన్, మోడలింగ్ రంగంలో విశేష కృషికి గాను ఆయనకు 29వ ఐఈటీఈ రామ్‌లాల్ వాధ్వా గోల్డ్ మెడల్ లభించింది. భారతదేశ ఎలక్ట్రానిక్స్ – సెమీకండక్టర్ అసోసియేషన్ అందించే మొట్టమొదటి ఐఎస్ఏ అండ్ వీఎస్‌ఐ టెక్నోమెంటర్ అవార్డును కూడా అందుకున్నారు. ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2008 ఐబీఎం ఫ్యాకల్టీ అవార్డును పొందారు. నూతన బాధ్యతలు చాలెంజింగ్‌గా ఉంటాయని భావిస్తున్నా. నూతన జాతీయ విద్యా విధానం ఎంత తొందరగా అమల్లోకి వస్తే దేశానికి అంత మేలు జరుగుతుంది. ఇదే విషయమై త్వరలో అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశమవుతాను. మల్టీడిసిప్లినరీ కోర్సుల విషయమై చర్చిస్తాం. ప్రభుత్వం ఇటీవలే బడ్జెట్లో డిజిటల్ యూనివర్సిటీని ప్రకటించింది. విద్యను మరింత సులభతరం చేసే డిజిటల్ సాంకేతికత కూడా ప్రాధాన్య జాబితాలో ఉంటుంది. -
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: తెలుగు పర్సన్ ఆఫ్ ద ఇయర్ పుల్లెల గోపీచంద్
-
లిబియాలో మరో ఇద్దరు భారతీయుల కిడ్నాప్
లిబియాలో మరో ఇద్దరు భారతీయులు కిడ్నాప్ కు గురయ్యారు. ఇప్పటికీ ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లను తమ చెరలో ఉంచుకున్న ఐఎస్ తీవ్రవాదులు.. సిర్తే పట్టణానికి సమీపంలో మరో ఇద్దరు భారతీయులను బందీలుగా చేసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. కిడ్నాపైన ఇద్దరిలో ఒకరు ఏపీకి చెందిన కొసనం రామ్మూర్తి కాగా, మరొకరు ఒడిశాకు చెందిన రంజన్ సమాల్ లుగా గుర్తించామని, వీరిని చెర నుంచి విడిపించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. గత జులై 31న ఇదే సిర్తే పట్టణంలో నలుగురు భారతీయులను ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. వారిలో కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ లు క్షేమంగా తిరిగిరాగా, తెలుగువారైన ప్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరామ్ లు ఇంకా బందీలుగానే ఉన్నారు. వారిని విడిపించేందుకు విదేశాంగ శాఖ చేసిన ప్రయత్నాలు చేస్తున్నది. -
సాహితీ బంధువు
ఆ సందర్భంలోనే సూచన అందింది. ఏటేటా ఒక తెలుగు ప్రముఖుడిని ఎందుకు సన్మానించరాదు? ఆ విధంగా 1979లో రాజా-లక్ష్మీ ఫౌండేషన్ ఏర్పడింది. మొదటి అవార్డు శ్రీశ్రీగారికి ఇచ్చారు. సజ్జన సాంగత్యం జీవన్ము క్తికి మార్గమవుతుందని మనసారా నమ్మి జీవించిన సాహితీ బంధువు రమణ య్య రాజాగారు. మిత్రు లందరికీ ఆయన రాజా గారు. ఆయన స్వతహాగా వ్యాపారి. 1963లో వ్యాపా రం కోసమే చెన్నై వచ్చారు. కానీ వ్యాపారంతో ఆగిపోలేదు. ఆనాటి సాహితీ ప్రియులకు తలలో నాలిక అయ్యారు. బీయస్సార్ కృష్ణ, ఇచ్ఛాపురపు జగన్నాథరావు, నేనూ, గొల్లపూడి రామదాసు (ఇన్‌కంటాక్స్ ఆఫీసరు) ఇలా చాలా మంది ఆయన స్నేహ బృందంలో వారం. పప్పు వేణుగోపాలరావు వారి పెద్దబ్బాయి క్లాస్మేట్. ఆయనా ఈ బృందంలో దరిమిలాను కలిశారు. 1975లో చెన్నైలో ఉంటున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి వారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా సన్మానం చెయ్యాలని సంకల్పించారు. కానీ సన్మా నాలకి దేవులపల్లి వ్యతిరేకం. అప్పుడొక మార్గాం తరాన్ని సూచించారు పాలగుమ్మి పద్మరాజుగారు. దేవులపల్లి ‘కృష్ణపక్షం’ వెలువడి అప్పటికి 50 ఏళ్లయింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ‘కృష్ణ పక్ష స్వర్ణోత్సవం’ ఎందుకు జరపకూడదు? అంత వరకు ప్రచురించని వారి రచనలను ప్రచురిస్తూ సభని జరపాలని నిర్ణయించారు. ‘పల్లకీ’ అనే పేరుతో శాస్త్రి గారి కవితలు, ‘శర్మిష్ట’, ‘ధనుర్దాసు’ వంటి రేడియో నాటికలు, ‘మేఘమాల’ పేరిట శాస్త్రిగారి సినీమా పాటలు (ఈ పాటలు పుస్తకరూ పంగా రావడం అదే మొదటిసారి), ‘కృష్ణపక్షం’ మొదలైన ఆరు సంపుటాలు వెలువడ్డాయి. కృష్ణ పక్షం స్వర్ణోత్సవం వాణీమహల్లో వైభవంగా జరి గింది. ఆ సభలో నేనూ ఒక వక్తని. ఆ రుచిని మరి గిన రాజాగారికి ఆ సందర్భంలోనే సూచన అందిం ది. ఏటేటా ఒక తెలుగు ప్రముఖుడిని ఎందుకు సన్మానించరాదు? ఆ విధంగా 1979లో రాజా-లక్ష్మీ ఫౌండేషన్ ఏర్పడింది. మొదటి అవార్డు హబీబుల్లా రోడ్డులో దక్షిణ భారత కళాకారుల ఆడిటోరియంలో శ్రీశ్రీగారికి ఇచ్చారు. అచిరకాలంలో రాజాగారి అవార్డుకి ఒక గుర్తింపు, ప్రత్యేకత ఏర్పడిపోయింది. దేశంలోనూ, అంతర్జాతీయంగానూ తమ ప్రతిభను చాటిన ఎందరో తెలుగువారిని ఈ అవార్డుతో సత్క రించారు. 1978లో ననుకుంటాను- విజయనగ రంలో రావి కొండలరావుగారి అన్నగారు ఆర్కేరావు షష్టిపూర్తి ఉత్సవాన్ని జరిపారు. ఆ ఫొటోలు నా ఆత్మకథలో ఉన్నాయి. అది చాలా పెద్ద సభ. దాశ రథి, ఆచార్య ఆత్రేయ, విద్వాన్ విశ్వం, నేనూ, బెజ వాడ గోపాలరెడ్డి - ఇలా ఎంతోమందిమో తరలి వెళ్లాం. ఆ రోజు నరాల రామిరెడ్డి అష్టావధానం నిర్వ హించారు. వ్యాపారరీత్యా విశాఖపట్నం వచ్చి స్థిరపడ్డాక- రాజాగారి జీవితం గొప్ప మలుపు తిరిగింది. అప్ప టికే వానప్రస్థంలో పడిన ఆయన జీవితానికి చుక్కా నిలాగ సద్గురు శివానందమూర్తిగారి ఆశ్రయం లభిం చింది. ‘ఇది నా జీవితంలో దక్కిన గొప్ప అదృష్టం’ అని పొంగిపోయేవారు రాజాగారు. శివానంద మూర్తి గారి భీమిలిలోని ఆనందాశ్రమంలో ఒక ఇం టిని నిర్మించుకుని అక్కడే స్థిరపడిపోయారు. ఆయన జీవితంలో ఆ దశ అతి ప్రశాంతతని చేకూర్చిన దశ. అప్పటికే రాజాలక్షీ్ష్మ అవార్డుకి సాహితీ పురస్కా రాన్ని చేర్చారు. గురువుగారి సూచనతో ప్రతీ యేటా ఒక వేదపండితునికి వేద పురస్కారాన్ని జత చేశారు. సి. నారాయణరెడ్డి, పోణంగి శ్రీరామఅప్పారావు సాహితీ పురస్కారం, ప్రముఖ పర్యావరణ నిపుణు రాలు సునీతా నారాయణ్ - ఇంకా ఎన్నో పురస్కా రాలకు నేను వక్తను. నేదునూరి కృష్ణమూర్తిగారికి రాజాలక్ష్మీ అవార్డు ఇచ్చే సంవత్సరం నాకు ప్రత్యేక రాజాలక్ష్మీ పురస్కారం ఇచ్చారు. సద్గురువుల చేతి మీదుగా అందుకోవడం అరుదైన అదృష్టాలలో ఒకటి. ఆయన 80వ జన్మదినం సందర్భంగా డాక్టర్ జ్ఞానేశ్వర్ ఎండోమెంట్ ఫండ్‌కి అవార్డుని అందజే శారు. ఇంతేకాదు. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను ప్రచురించారు. పప్పు వేణుగోపాలరావు ‘భజగోవిం దం’, శలాక రఘునాథశర్మ గారి ‘శివానందలహరి’, సుందరకాండ, ‘లీలాకృష్ణుడు’, ‘శ్రీమాత’ మొద లైనవి. ఆయన ఆంధ్రావిశ్వవిద్యాలయం సెనేట్ సభ్యు నిగా రెండు పర్యాయాలు, సిండికేట్ సభ్యునిగా పని చేశారు. మొన్న- చాలా నెలల తర్వాత చెన్నై వెళ్లాను. ఆ రోజు రాజాగారిని చూడాలని నేనూ, మా ఆవిడా సంకల్పించుకున్నాం. ఉదయం నుంచీ వారి అబ్బా యిలు వెంకట్రావుకీ, కృష్ణకీ కనీసం 10 సార్లయినా ఫోన్ చేసి ఉంటాను. సమాధానం లేదు. మధ్యా హ్నం బయలుదేరే ముందు మళ్లీ చేశాను. మను మడు తీశాడు. ‘‘తాతగారు పోయారండి!’’ తుళ్లిపడ్డాను. ‘‘ఎప్పుడు?’’ ‘‘ఇవాళే!’’ ‘‘మరి...మరి..’’ ‘‘మరోగంటలో ఖననం’’ టెలిఫోన్ పెట్టేసి పరుగెత్తాను. రాజాగారు నిద్ర పోతున్నారు. అత్యంత ప్రశాంత జీవనం గడిపి అల వోకగా సెలవు తీసుకున్న జీవన్ముక్తులు రాజాగారు. - గొల్లపూడి మారుతీరావు -
పాముకాటుతో గల్ఫ్‌లో తెలుగు వ్యక్తి మృతి
నిజామాబాద్: సౌదీ అరేబియాలో పాము కాటుకు తెలుగు వ్యక్తి బలయ్యాడు. అక్కడి వారికి కేవలం అతని జిల్లా నిజామాబాద్ అని మాత్రమే తెలవడంతో 'సాక్షి' రిపోర్టర్‌కు ఫొటో పంపించారు. చనిపోయిన వ్యక్తి పేరు కూడా తెలవకపోవడంతో ఫేస్బుక్, వ్యాట్స్ యాప్‌లలో అతని ఫొటో పోస్టు చేసి బంధువులకు సమాచారం అందించాలని అక్కడి కంపెనీ వారు కోరారు. అధికారులు మృతదేహాన్ని ఇండియా తరలించడానికి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య
న్యూయార్క్: అమెరికాలో దారుణం జరిగింది. దొంగల చేతిలో తెలుగు వ్యక్తి హత్యకు గురయ్యారు. కృష్ణా జిల్లా ఘంటసాల మం డలం చిట్టూర్పుకు చెందిన పరుచూరి బాలగోపాల్ అనే వ్యక్తి సౌత్ కరోలినా మెరిడియన్ బీచ్ ప్రాంతంలో గ్యాస్ స్టేషన్ నిర్వహిస్తున్నారు. దొంగతనానికి వచ్చిన కొందరు బాలగోపాల్పై దాడి చేశాడు. దొంగలు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన బాలగోపాల్ అక్కడికక్కడే మరణించారు. బాలగోపాల్ స్నేహితులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు, ఆంధ్రప్రదేశ్‌లోని ఆయన బంధువులకు తెలిపారు. మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు సహాయం చేయాలని అధికారులను కోరారు. దుండగుడు డబ్బుల కోసమే హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. బాలగోపాల్‌కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాలగోపాల్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా అమెరికాలో ఉన్నారు. బాలగోపాల్ తల్లిదండ్రులు, బంధువులు విజయవాడలో ఉంటున్నారు. బాలగోపాల్ హత్య వార్త తెలియడంతో చిట్టూర్పు, విజయవాడలో విషాదం నెలకొంది. -
తెలుగువ్యక్తి కాల్చివేత
బోరివలి, న్యూస్‌లైన్: బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని దుండగులు తెలుగువ్యక్తిని సోమవారం రాత్రి కాల్చి చంపారు. తలకు బుల్లెట్ గాయాలు కావడంతో ఇతణ్ని పశ్చిమ కాందివలిలోని శతాబ్ది ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. మాల్వాని పోలీసులు కేసు నమోదు చేసి, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మలాడ్ జన కల్యాణ్ నగర్లో నివసిస్తున్న ఇతణ్ని కల్లువ్యాపారి అనుమల్ల శేఖర్ (38)గా గుర్తించారు. ఇతడు ఏదో పనిమీద తన పెద్ద కుమారుడు నీరజ్‌తోపాటు అంధేరి నుండి ఇంటికి వస్తుండగా, తన నివాసానికి దగ్గర్లోనే ఈ దుర్ఘటన జరిగింది. పాత కక్షలే హత్యకు కారణమని తెలిసింది. మృతదేహాన్ని శేఖర్ స్వగ్రామం కరీంనగర్ జిల్లాలోని ధర్మపురికి తరలించి, అంత్యక్రియలు చేశారు. కుటుంబ సభ్యులను కలిసిన తెలుగువారు జరిగిన దారుణం గురించి తెలుసుకున్న తెలుగు సంఘాలు అనుమల్ల శేఖర్ కుటుంబ సభ్యులను కలిశారు. తెలంగాణ యువజన కార్మిక సంఘం సభ్యులు గురువారం బాధితులను పరామర్శిం చారు. బోరివలిలోని తెలంగాణ యువజన కార్మిక సంఘం సలహాదారునిగా అనుమల్ల శేఖర్ పని చేశాడని, నాలుగు నెలల క్రితం కార్మిక సంఘానికి జరి గిన ఎన్నికల్లో సంఘం సలహాదారునిగా ఎన్నుకున్నామని సంఘం అధ్యక్షుడు ఉప్పు భూమన్న తెలి పారు. సంఘానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇటువంటి ఘటన జరగడం బాధాకరమని, త్వరలో కార్మికసంఘం ఆధ్వర్యంలో సంతాపసభ ఏర్పాటు చేస్తామని భూమన్న తెలిపారు.