దుబాయ్‌: తెలుగు వ్యక్తికి బంపర్‌ లాటరీ | Telugu Person Won Lottery In Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో తెలుగు వ్యక్తికి రూ.2 కోట్ల లాటరీ

Jun 25 2024 7:53 PM | Updated on Jun 25 2024 9:10 PM

Telugu Person Won Lottery In Dubai

దుబాయ్‌ సిటీ: ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన ఓ తెలుగు వ్యక్తిని లక్ష్మీదేవి కనికరించింది.  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోరుగడ్డ నాగేంద్రమ్‌ 2017లో దుబాయ్‌ వెళ్లారు. కష్టపడి సంపాదించిన సొమ్ములో నెల నెలా పొదుపు చేసి లాటరీ టికెట్‌ కొన్నాడు. ఇంకేముంది జాక్‌పాట్‌కొట్టాడు. లాటరీ టికెట్‌పై ఏకంగా రూ.2.25 కోట్లు గెలుచుకున్నారు. 

పొదుపు పథకం చందాదారులకు లక్కీ డ్రా నిర్వహించగా అందులో అతడు విజేతగా నిలిచారు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ తాను సంపాదించిన సొమ్ములో నుంచి ప్రతి నెలా 100 దిర్హమ్‌(ఏఈడీ)లను 2019 నుంచి నేషనల్‌ బాండ్స్‌లో పొదుపు చేశారు. ఈ సేవింగ్ స్కీమ్‌ కట్టేవారికి రివార్డు ఇవ్వడానికి లక్కీ డ్రా నిర్వహిస్తారు.

గ్రాండ్‌ ప్రైజ్‌ కేటగిరీ లాటరీలో నాగేంద్రమ్‌ విజేతగా నిలిచారు. లాటరీ బహుమతిగా 10 లక్షల యూఏఈ దిర్హమ్స్‌ అందుకున్నారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2.25కోట్లకు పైమాటే. ఇంత భారీ ప్రైజ్‌మనీ రావడంపై నాగేంద్రమ్‌ పట్టరాని ఆనందం వ్యక్తం చేశారు. ఈ డబ్బుతో తన పిల్లలను ఉన్నత చదువు చదవిస్తానని సంతోషపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement