బోరివలి, న్యూస్‌లైన్: బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని దుండగులు తెలుగువ్యక్తిని సోమవారం రాత్రి కాల్చి చంపారు. తలకు బుల్లెట్ గాయాలు కావడంతో ఇతణ్ని పశ్చిమ కాందివలిలోని శతాబ్ది ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. మాల్వాని పోలీసులు కేసు నమోదు చేసి, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మలాడ్ జన కల్యాణ్ నగర్‌లో నివసిస్తున్న ఇతణ్ని కల్లువ్యాపారి అనుమల్ల శేఖర్ (38)గా గుర్తించారు. ఇతడు ఏదో పనిమీద తన పెద్ద కుమారుడు నీరజ్‌తోపాటు అంధేరి నుండి ఇంటికి వస్తుండగా, తన నివాసానికి దగ్గర్లోనే ఈ దుర్ఘటన జరిగింది. పాత కక్షలే హత్యకు కారణమని తెలిసింది. మృతదేహాన్ని శేఖర్ స్వగ్రామం కరీంనగర్ జిల్లాలోని ధర్మపురికి తరలించి, అంత్యక్రియలు చేశారు.
కుటుంబ సభ్యులను కలిసిన తెలుగువారు
జరిగిన దారుణం గురించి తెలుసుకున్న తెలుగు సంఘాలు అనుమల్ల శేఖర్ కుటుంబ సభ్యులను కలిశారు. తెలంగాణ యువజన కార్మిక సంఘం సభ్యులు గురువారం బాధితులను పరామర్శిం చారు. బోరివలిలోని తెలంగాణ యువజన కార్మిక సంఘం సలహాదారునిగా అనుమల్ల శేఖర్ పని చేశాడని, నాలుగు నెలల క్రితం కార్మిక సంఘానికి జరి గిన ఎన్నికల్లో సంఘం సలహాదారునిగా ఎన్నుకున్నామని సంఘం అధ్యక్షుడు ఉప్పు భూమన్న తెలి పారు. సంఘానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇటువంటి ఘటన జరగడం బాధాకరమని, త్వరలో కార్మికసంఘం ఆధ్వర్యంలో సంతాపసభ ఏర్పాటు చేస్తామని భూమన్న తెలిపారు.
తెలుగువ్యక్తి కాల్చివేత
Published Thu, Jun 12 2014 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM
Advertisement
Advertisement