త్రిపుర హైకోర్టు తాత్కాలిక సీజేగా తెలుగు వ్యక్తి | Justice Amarnath Goud appointed Acting CJ of Tripura HC | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌: త్రిపుర హైకోర్టు తాత్కాలిక సీజేగా హైదరాబాదీ

Published Thu, Nov 10 2022 10:07 AM | Last Updated on Thu, Nov 10 2022 10:07 AM

Justice Amarnath Goud appointed Acting CJ of Tripura HC - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: త్రిపుర హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా జస్టిస్‌ తొడుపునూరి అమర్‌నాథ్‌ గౌడ్‌ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. నవంబరు 11 నుంచి ఆయన తాత్కాలిక సీజేగా కొనసాగుతారంటూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

జస్టిస్‌ అమర్‌నాథ్‌ 1965లో హైదరాబాద్‌లో జన్మించారు. 2017 సెప్టెంబర్‌ 21న ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2021 అక్టోబర్‌ 28న త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement