సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన బార్ పాలసీని శుక్రవారం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలయ్యే ఈ పాలసీ ప్రకారం బార్ లైసెన్స్ దరఖాస్తు ఫీజును రూ. 10 లక్షలుగా నిర్ణయించారు. ఇది నాన్ రిఫండబుల్. లాటరీ పద్ధతిలో బార్లను కేటాయించనుండగా, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వ్యాపార వేళలుగా నిర్ణయించారు. లైసెన్స్ గడువు రెండేళ్ల వరకు ఉంటుంది. లైసెన్స్ ఫీజులను చూస్తే 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 25 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో రూ. 50 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో రూ. 75 లక్షలుగా ఫీజును నిర్ణయించారు. మరోవైపు సామాన్యులకు మద్యాన్ని దూరం చేసేందుకు బార్లలో మద్యం అమ్మకాలపై అదనపు పన్ను వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment