న్యూఢిల్లీ: 2023–24 ఆర్థిక సంవత్సరంలో నూతన పార్లమెంట్ కమిటీలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 30 దాకా ఇవి కొనసాగుతాయి. ఈ మేరకు లోక్‌సభ, రాజ్యసభ నోటిఫికేషన్ జారీ చేశాయి. కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరికి మరోసారి అవకాశం దక్కింది.
పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ కమిటీ చైర్మన్‌గా బీజేపీ సభ్యుడు సంతోష్‌కుమార్ గంగ్వార్ నియమితులయ్యారు. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ కమిటీలో రాజ్యసభ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డిని సభ్యుడిగా నియమించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌గా కిరీట్ ప్రేమ్‌జీభాయి సోలంకీ నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment