Public Accounts Committee of Parliament
-
ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌గా వేణుగోపాల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఖర్చులను క్షుణ్ణంగా అధ్యయనం చేసే కీలకమైన ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్‌గా కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్‌ను నియమించినట్లు లోక్‌సభ సచివాలయం శుక్రవారం పేర్కొంది. అంచనాలు, ప్రభుత్వ సంస్థల కమిటీలుసహా 4 కొత్త కమిటీలకు చైర్మన్లుగా బీజేపీ నేతలను నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ బిర్లా నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికసంబంధాలకు సంబంధించి పీఏసీ, అంచనాలు, ప్రభుత్వ సంస్థల కమిటీలను ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ప్రభుత్వ చేస్తున్న ఖర్చులు, ప్రభుత్వరంగ సంస్థల సమర్థ నిర్వహణ వ్యవహారాలను ఈ కమిటీలు అధ్యయనం చేస్తాయి. ఓబీసీల సంక్షేమ కమిటీకి బీజేపీ నేత గణేశ్ సింగ్, ఎస్సీఎస్టీల సంక్షేమ కమిటీకి బీజేపీ నేత ఫగాన్ సింగ్ కులస్తే చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. అంచనా కమిటీకి బీజేపీ నేత సంజయ్ జైశ్వాల్, ప్రభుత్వ సంస్థల కమిటీకి చైర్మన్‌గా బీజేపీ నేత బైజయంతీ పాండాను నియమించారు. -
రేపటి నుంచి కొత్త పార్లమెంట్ కమిటీలు
న్యూఢిల్లీ: 2023–24 ఆర్థిక సంవత్సరంలో నూతన పార్లమెంట్ కమిటీలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 30 దాకా ఇవి కొనసాగుతాయి. ఈ మేరకు లోక్‌సభ, రాజ్యసభ నోటిఫికేషన్ జారీ చేశాయి. కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరికి మరోసారి అవకాశం దక్కింది. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కమిటీ చైర్మన్‌గా బీజేపీ సభ్యుడు సంతోష్‌కుమార్ గంగ్వార్ నియమితులయ్యారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కమిటీలో రాజ్యసభ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డిని సభ్యుడిగా నియమించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌గా కిరీట్ ప్రేమ్జీభాయి సోలంకీ నియమితులయ్యారు. -
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, ఢిల్లీ: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. విజయసాయిరెడ్డితో పాటు మరో సభ్యుడిగా బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది ఎన్నికయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్‌దీపక్ శర్మ.. పార్లమెంట్ బులిటెన్ విడుదల చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వ ఖాతాలను పరిశీలించనుంది. -
పీఏసీ సభ్యుడిగా ఎంఏ ఖాన్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) సభ్యుడిగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ నియమితులయ్యారు. ఒక సభ్యుడి పదవీకాలం పూర్తి కావడంతో ఆ స్థానంలో కాంగ్రెస్ తరఫున ఎంఏ ఖాన్‌ను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని ధ్రువీకరిస్తూ పార్లమెంట్ శనివారం బులెటిన్ విడుదల చేసింది. ప్రతిష్టాత్మకమైన ఈ కమిటీకి లోక్‌సభలో ప్రతిపక్ష నేత చైర్మన్‌గా వ్యవహరిస్తారు. లోక్‌సభ నుంచి 22 మంది, రాజ్యసభ నుంచి ఆరుగురు ఇందులో సభ్యులుగా ఉంటారు. -
ఆర్‌పవర్‌కి అల్ట్రా ప్రాజెక్టుల అర్హతే లేదు: విచారణకు పీఏసీ సిఫార్సు
న్యూఢిల్లీ : కృష్ణపట్నం సహా మూడు అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులను (యూఎంపీపీ) రిలయన్స్ పవర్‌కి (ఆర్‌పవర్) కట్టబెట్టడంపై విచారణ జరపాలని పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సిఫార్సు చేసింది. కృష్ణపట్నంతో పాటు తిలయ్యా, ససాన్ ప్రాజెక్టులకు అర్హతలేని ఆర్పవర్ను ఎంపిక చేయడం జరిగిందని వ్యాఖ్యానించింది. స్థల సమీకరణలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ జార్ఖండ్‌లోని తిలయ్యా ప్రాజెక్టు నుంచి రిలయన్స్ పవర్ వైదొలిగిన మర్నాడే పీఏసీ ఈ మేరకు నివేదికను పార్లమెంట్‌కు సమర్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది.అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టులు ఇచ్చిన తీరుపై కాంగ్రెస్ నేత కేవీ థామస్ సారథ్యంలోని పీఏసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కనీస సాంకేతిక అర్హతలు కూడా లేని రిలయన్స్ పవర్‌కు ఒక్కోటి 3,960 మెగావాట్ల సామర్థ్యం ఉండే ప్రాజెక్టులను కట్టబెట్టారని ఆక్షేపించింది. పెపైచ్చు ససాన్ ప్రాజెక్టుకు కేటాయించిన చౌక బొగ్గును, ఖరీదైన బొగ్గు వాడాల్సిన ఇతర ప్రాజెక్టు కోసం మళ్లించుకోవడానికి ఆర్పవర్ని అనుమతించడాన్ని కూడా పీఏసీ తప్పు పట్టింది. ససాన్ ప్రాజెక్టుకి బొగ్గు కేటాయింపులు తక్షణమే నిలిపివేయాలని పేర్కొంది. మరోవైపు, ఈ అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున తామేమీ వ్యాఖ్యానించబోమని రిలయన్స్ పవర్ ప్రతినిధి పేర్కొన్నారు. నాలుగు యూఎంపీపీల్లో ముంద్రా ప్రాజెక్టును టాటా పవర్ దక్కించుకోగా, మిగతా మూడింటిని ఆర్‌పవర్ దక్కించుకుంది.