న్యూఢిల్లీ: ప్రభుత్వ ఖర్చులను క్షుణ్ణంగా అధ్యయనం చేసే కీలకమైన ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్‌గా కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్‌ను నియమించినట్లు లోక్‌సభ సచివాలయం శుక్రవారం పేర్కొంది. అంచనాలు, ప్రభుత్వ సంస్థల కమిటీలుసహా 4 కొత్త కమిటీలకు చైర్మన్‌లుగా బీజేపీ నేతలను నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ బిర్లా నిర్ణయం తీసుకున్నారు.
ఆర్థికసంబంధాలకు సంబంధించి పీఏసీ, అంచనాలు, ప్రభుత్వ సంస్థల కమిటీలను ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ప్రభుత్వ చేస్తున్న ఖర్చులు, ప్రభుత్వరంగ సంస్థల సమర్థ నిర్వహణ వ్యవహారాలను ఈ కమిటీలు అధ్యయనం చేస్తాయి. ఓబీసీల సంక్షేమ కమిటీకి బీజేపీ నేత గణేశ్ సింగ్, ఎస్సీఎస్టీల సంక్షేమ కమిటీకి బీజేపీ నేత ఫగాన్ సింగ్ కులస్తే చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. అంచనా కమిటీకి బీజేపీ నేత సంజయ్ జైశ్వాల్, ప్రభుత్వ సంస్థల కమిటీకి చైర్మన్‌గా బీజేపీ నేత బైజయంతీ పాండాను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment