KC Venugopal
-
వయనాడ్‌లో ఖర్గేకు అవమానం నిజమేనా? తేల్చేసిన కాంగ్రెస్
ప్రియాంక గాంధీ నామినేషన్ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ అవమానపరిచిందంటూ బీజేపీ చేసిన విమర్శలకు పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. డోర్ లాక్ అవ్వడం వల్ల ఆయన కొద్దిసేపు మాత్రమే బయట వేచి ఉన్నారని.. నామినేషన్ ప్రక్రియ సమయంలో ఆయన లోపలే ఉన్నారని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. దీనిపై బీజేపీ చేస్తున్న విమర్శలు ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు.తలుపుకి తాళం వేసి ఉండటం వల్ల లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా లోపలికి వచ్చే ముందు కొన్ని నిమిషాలు వేచి ఉన్నారని వేణుగోపాల్ తెలిపారు. ‘బీజేపీ ఇలాంటి అబద్ధాలు ఎలా ప్రచారం చేస్తుంది?. సభ పూర్తయ్యాక కలెక్టరేట్‌కు చేరుకోగానే డోర్ మూసి ఉంది. తరువాత రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ అక్కడికి వచ్చారు.. వారు కూడా కొన్ని నిమిషాలు వేచి చూసి లోపలికి వచ్చారు. ఈ క్రమంలోనే మల్లికార్జున ఖర్గే కూడా వచ్చి తలుపు తాళం వేసి ఉండటంతో నిమిషంపాటు బయట వేచి ఉన్నారు. ఆయన లోపలికి వచ్చిన తర్వాతే ప్రియాకం నామినేషన వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై, పార్టీపై బీజేపీ ఎందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు? ఇది సరైంది కాదు.’ అని పేర్కొన్నారు.కాగా వయనాడ్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తన తల్లి సోనియా గాంధీ, భర్త రాబర్ట్ వాద్రా, సోదరుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. అయితే నామినేషన్ సమర్పణ సమయంలో ఖర్గేను అగౌరవ పరిచారని, రిటర్నింగ్ అధికారి గదిలోకి రానివ్వకుండా బయటే ఉంచారని బీజేపీ ఆరోపించింది. అంతేకాదు దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వేషాన్ని పెంచుకుంటోందని విమర్శించింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా కాషాయ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. -
కాంగ్రెస్‌లో ‘కొండా’ వర్గం కలకలం.. హస్తినకు హస్తం నేతలు
వరంగల్, సాక్షి: వరంగల్‌లో కాంగ్రెస్ రాజకీయాలు హీటెక్కాయి. రేపు (గురువారం) ఢిల్లీ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పయనం కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ను ఎమ్మెల్యేలు కోరినట్ల సమాచారం. మంత్రి కొండా సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ వర్గం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోండా సురేఖపై ఏడుగురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.చదవండి: TG: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా -
‘బుల్డోజర్’ ప్రభుత్వంగా మారొద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మూసీ సుందరీకరణ, చెరువుల పరిరక్షణ, హైదరాబాద్ అభివృద్ధి పేరిట అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేయడంపై ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హితోపదేశం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పౌరుల హక్కులను హరించి వారిని రోడ్డుపాలు చేసేలా అమానవీయంగా వ్యవహరించొద్దని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా అధికార కొరడాను సామాన్యులపై ఝళిపించవద్దని ఏఐసీసీ పెద్దలు సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న బుల్డోజర్ సంస్కృతిపై రాజకీయ, న్యాయ వేదికలపై కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న పోరాటాన్ని ముఖ్యమంత్రికి గుర్తు చేశారు.అదే తరహా బుల్డోజర్ విధానాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో అమలు చేయడం పార్టీ ప్రతిష్టకు భంగకరమని వ్యాఖ్యానించారు. ఇటీవల జమ్మూకశీ్మర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించడంతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పెద్దలతో చర్చించేందుకు సోమవారం రాత్రి ఢిల్లీ వచి్చన రేవంత్‌రెడ్డి మంగళవారం ఖర్గేతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై చర్చించారు. ఆ చెడ్డపేరు మనకొద్దు.. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు, నిర్వాసితుల నిరసనలు, ప్రతిపక్షాల ఆందోళనలు ఆయా భేటీల్లో చర్చకు వచ్చినట్లు తెలిసింది. మూసీ పరీవాహక అభివృద్ధి విషయంలో ప్రభుత్వ లక్ష్యం, దానికోసం తీసుకున్న కార్యాచరణ, నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా అందజేయనున్న మద్దతు వంటి అంశాలను సీఎం వివరించారు. ఈ సందర్భంగా ఖర్గే స్పందిస్తూ.. ‘అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రభుత్వం తీసుకునే కార్యాచరణలో ముందుగా నష్టపోయేది, రోడ్డున పడేది నిమ్న వర్గాల ప్రజలే. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వంటి కార్యక్రమాల్లో నిందితులు ఒకరైతే, బాధితులు ఇంకొకరు ఉంటారు.నిమ్న వర్గాల పట్ల ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందనే అపవాదును ఒకసారి మూటగట్టుకుంటే దానిని తుడిచెయ్యడం అంత సులభం కాదు. అందుకే సంయమనంతో వ్యవహరించండి. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూల్చివేతలపై కాంగ్రెస్ పక్షాన నేనూ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పోరాటం చేస్తున్నాం. బుల్డోజర్ పాలసీని వ్యతిరేకిస్తూ మన పార్టీ నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.కోర్టుల్లోనూ కొట్లాడుతున్నాం. ఇలాంటి నేపథ్యంలో మనది కూడా బుల్డోజర్ ప్రభుత్వం అనే చెడ్డపేరు రాకూడదు..’అని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ అంశంలో ఇప్పటికే ఏఐసీసీకి ఫిర్యాదులు అందాయని, సొంత పార్టీ నేతలు సైతం ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ తమకు లేఖలు రాసినట్లుగా ఖర్గే చెప్పినట్లు సమాచారం. కాగా పునరావాసం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లæ కేటాయింపు వంటి వాటిద్వారా నిరాశ్రయులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని రేవంత్‌రెడ్డి వివరించినట్లుగా సమాచారం. కాగా ఖర్గే తరహాలోనే కేసీ వేణుగోపాల్ సైతం ఈ వ్యవహారంపై స్పందించినట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. దసరాకు ముందే.. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా చర్చించినట్లు తెలిసింది. నామినేటెడ్ పదవుల భర్తీపై పీసీసీ అధ్యక్షుడితో సహాæ ఇతర సీనియర్లను సంప్రదించి నియామకాలు చేసుకోవచ్చని పెద్దలు సూచించినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచి్చన ఎమ్మెల్యేలకు కూడా నామినేటెడ్ పదవుల్లో కీలక కార్పొరేషన్లు ఇచ్చేందుకు వారు అంగీకరించినట్లు తెలిసింది. దసరాకు ముందే 25కు పైగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు భర్తీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.ఇక మంత్రివర్గ విస్తరణపై ఈ నెల 5 తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని ఏఐసీసీ పెద్దలు చెప్పినట్లు తెలిసింది. దసరాకు ముందే విస్తరణ ఉంటుందనే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. కాగా రాజ్యసభ సభ్యుడు అభిõÙక్ మను సింఘ్వీతో కూడా భేటీ అయిన రేవంత్, అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. -
సెబీ చైర్మన్‌ను పిలుస్తాం
న్యూఢిల్లీ: మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్మన్‌గా ఉంటూనే మాధబి పురి బుచ్ ఐసీఐసీఐ నుంచి వేతనం తీసుకుని పరస్పర విరుద్ద ప్రయోజనాలు పొందడంసహా ఆమెపై, సెబీపై పలు ఆరోపణలు వెల్లువెత్తడంతో సెబీ పనితీరును సమీక్షించాలని ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) నిర్ణయించింది. ఈ విషయంలో మాధబిని పిలిపించి ప్రశ్నించేందుకు ఆమెకు సమన్లు జారీచేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధబి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని అమెరికన్ షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలు గుప్పించిన విషయం తెల్సిందే. -
ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌గా వేణుగోపాల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఖర్చులను క్షుణ్ణంగా అధ్యయనం చేసే కీలకమైన ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్‌గా కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్‌ను నియమించినట్లు లోక్‌సభ సచివాలయం శుక్రవారం పేర్కొంది. అంచనాలు, ప్రభుత్వ సంస్థల కమిటీలుసహా 4 కొత్త కమిటీలకు చైర్మన్లుగా బీజేపీ నేతలను నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ బిర్లా నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికసంబంధాలకు సంబంధించి పీఏసీ, అంచనాలు, ప్రభుత్వ సంస్థల కమిటీలను ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ప్రభుత్వ చేస్తున్న ఖర్చులు, ప్రభుత్వరంగ సంస్థల సమర్థ నిర్వహణ వ్యవహారాలను ఈ కమిటీలు అధ్యయనం చేస్తాయి. ఓబీసీల సంక్షేమ కమిటీకి బీజేపీ నేత గణేశ్ సింగ్, ఎస్సీఎస్టీల సంక్షేమ కమిటీకి బీజేపీ నేత ఫగాన్ సింగ్ కులస్తే చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. అంచనా కమిటీకి బీజేపీ నేత సంజయ్ జైశ్వాల్, ప్రభుత్వ సంస్థల కమిటీకి చైర్మన్‌గా బీజేపీ నేత బైజయంతీ పాండాను నియమించారు. -
సెబీ చీఫ్‌పై ఆరోపణలు: దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
ఢిల్లీ:అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో ఆమెను సెబీ ఛైర్ పర్సన్‌గా తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఆమెను ఛైర్మన్ పదవి నుంచి తొలిగించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 22 దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేసీ వేణుగోపాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 22న దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతాం. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈడీ ఆఫీసుల ముందు భైఠాయించి నిరసనలు తెలుపుతాం. ఇవాళ(మంగళవారం) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, ఇన్ఛార్జ్లు, పీసీసీ ప్రెసిడెంట్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆదానీ గ్రూప్, సెబీకి సంబంధించిన అతిపెద్ద కుంభకోణంపై చర్చించాం. అదానీ మెగా స్కామ్‌పై జేపీసీ ఆధ్వర్యంలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని అన్నారు.చదవండి: ముగిసిన ఏఐసీసీ మీటింగ్.. సెబీ, అదానీలే టార్గెట్ -
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై లోక్‌సభలో రచ్చ.. కేంద్రమంత్రి రిప్లై
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. తాజాగా ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో విద్యార్ధుల మృతి అంశం లోక్‌సభను కుదిపేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఢిల్లీలోని కోచింగ్ సెంటర్ బేస్మెంట్ ప్రమాదంలో యూపీఎస్సీ విద్యార్ధుల మరణాలను ప్రస్తావిస్తూ దేశంలో కోచింగ్ సెంటర్లు ఓ మాఫియాలా తయారయ్యాయని మండిపడ్డారు. ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల పట్ల వివక్ష చూపడం కలిగిస్తోందన్నారు.‘2023లో రాజ్యసభలో ఓ మంత్రి పెరుగుతున్న విద్యార్ధుల ఆత్మహత్యపై సమాధానం ఇచ్చారు, 2018 నుంచి 2022 వరకు ఐఐటీలు, ఐఐఎంలతో సహా ఉన్నత విద్యాసంస్థల్లో సుమారు 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇందుకు అక్కడ నెలకొన్న కుల వివక్ష ప్రధాన కారణాలలో ఒకటి.. దీనీనీ తక్షణమే పరిశీలించాలి.దేశవ్యాప్తంగా కోచింగ్ సెంటర్లలో భద్రత, నియంత్రణ సమస్యలను వేణుగోపాల్ ప్రస్తావించారు. నిన్నగాక మొన్న న్యూఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థులు తమ విలువైన ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ కోచింగ్ సరైన అనుమతి, తగిన సౌకర్యాలు లేకుండా పనిచేస్తోందని మీడియా కథనాల ద్వారా వెల్లడైంది. కొన్ని కోచింగ్ సెంటర్లు 'మాఫియా'లుగా మారాయి. ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా?’’ అని కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించారు.దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. విద్యార్థులు ఎక్కడ చదువుకున్నా వారి శారీరక- మానసిక రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు లేవినెత్తిన ఈ ప్రశ్న నేటి చర్చకు సంబంధించినది కాదు. కానీ కోచింగ్ సెంటర్, పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, ఇన్స్టిట్యూట్లు ఇలా విద్యార్ధులు ఎక్కడ చదువుతున్నప్పటికీ వారి శారీరక, మానసిక రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నేను హామీ ఇస్తున్నాను అని పేర్కొన్నారు.కాగా కోచింగ్ సెంటర్లకు సంబంధించి కేంద్రం జనవరిలో తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకు సమగ్రమైన, వివరణాత్మక మార్గదర్శకాలు అందించింది. అయితే రాజస్థాన్, బీహార్, గోవా మొదలైన రాష్ట్రాలు తమ సొంత నిబంధనలను కలిగి ఉన్నాయి. కాగా ఢిల్లీలోని ఓ భవనం బేస్మెంట్లో నిర్వహిస్తున్న యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో శనివారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో, ఓల్డ్ రాజీందర్ నగర్‌లోని ఓ భవనం బేస్మెంట్లో నడుస్తున్న రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద చేరడంతో కొందరు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. వరదతో బేస్మెంట్ పూర్తిగా నిండిపోయినట్లు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని నీటిని బయటకు తోడారు. తాజాగా ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకోవడంతో.. అరెస్టుల సంఖ్య ఏడుకు చేరింది. -
Kc Venugopal: ప్రభుత్వం నా ఫోన్‌ను హ్యాక్ చేసింది
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధమైన, గోప్యతకు భంగకరమైన చర్యలను గట్టిగా వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు యాపిల్ సంస్థ నుంచి వచ్చిన హెచ్చరిక మెసేజ్‌ను శనివారం షేర్ చేశారు. ‘మీ యాపిల్ ఐడీతో ఉన్న ఐఫోన్‌ను రిమోట్‌గా హ్యాక్ చేసేందుకు కిరాయి స్పైవేర్‌తో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరెవరు? ఏం చేస్తున్నారు? అనేవి తెలుసుకునే లక్ష్యంతోనే ఈ దాడి జరుగుతున్నట్లుగా భావిస్తున్నాం’అని అందులో ఉంది. ఈ హెచ్చరిక నేపథ్యంలో వేణుగోపాల్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘మీకెంతో ఇష్టమైన స్పైవేర్‌ను నా ఫోన్‌కు కూడా పంపించినందుకు మోదీ జీ మీకు కృతజ్ఞతలు. మీరు పంపించిన ప్రత్యేక బహుమతి గురించి యాపిల్ సంస్థ నాకు సమాచారమిచ్చింది. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడేందుకు, వారి గోప్యతకు భంగం కలిగించేందుకు మీరు నేరపూరితంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది’అని పేర్కొన్నారు. -
స్పీకర్‌కు రాహుల్ లేఖ.. ‘వ్యాఖ్యలు తొలగించటంపై షాక్‌కు గురయ్యా’
ఢిల్లీ: లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలను స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించటంలో తనను షాక్‌కు గురిచేసిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన సోమవారం లోక్‌సభలో నీట్, హిందుత్వ, అగ్నిపథ్ వంటి అంశాలపై ప్రధాని మోదీ, బీజేపీ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అధికార ఎన్డీయే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు హిందువులను కించపరిచేలా ఉన్నాయని క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం రాహుల్ స్పీచ్‌లో మాటలను రికార్డుల నుంచి తొలగించినట్ల స్పీకర్ ప్రకటించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తాను మాట్లాడిన వ్యాఖ్యలను పునరుద్ధరించాలని స్పీకర్‌కు లేఖ రాశారు.Lok Sabha LoP and Congress MP Rahul Gandhi writes to Speaker Om Birla over the remarks and portions from his speech expunged; requests that the remarks be restored. The letter reads, "...Shocked to note the manner in which considerable portion of my speech have been simply… pic.twitter.com/zoD8A0xvlc— ANI (@ANI) July 2, 2024 ‘నేను నిన్న లోక్‌సభలో మాట్లాడిన ప్రసంగంలో చాలా వ్యాఖ్యలను స్పీకర్‌ను తొలగించటంపై షాక్‌కు గురయ్యా. నా మాటాలను పునురుద్ధరించండి. నా ప్రసంగంలోని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించటం ప్రజాస్వామ్య పార్లమెంట్ సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధం’అని రాహుల్ లేఖలో పేర్కొన్నారు.ప్రధాని మోదీకి కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ సవాల్లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగం తీర్మానంపై చర్చలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. గత ఎన్డీయే పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో కట్టిన నిర్మాణాలన్నీ కూలిపోతున్నాయన్నారు. ‘‘ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. బీజేపీ పాలనలో ఢిల్లీ ఎయిర్ పోర్టు, జబల్పూర్ ఎయిర్‌పోర్టుల రూఫ్‌లు కూలిపోయాయని అన్నారు. రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టు రూఫ్ ధ్వంసం అయింది. అయోధ్యలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.#WATCH | Delhi: In the Lok Sabha, Congress MP KC Venugopal says, "... Delhi Airport roof collapsed, Jabalpur Airport roof collapse, Rajkot Airport canopy collapse, conditions of roads in Ayodhya is bad, leakage in Ram Mandir, cracks in Mumbai Harbour link road, three new bridges… pic.twitter.com/CtYCzhLp3E— ANI (@ANI) July 2, 2024 .. రామ మందిరంలో నీరు లీక్ అయింది. ముంబై హార్బర్ లింక్ రోడ్డుకు పగుళ్లు వచ్చాయి. బీజేపీ పాలనలో బిహార్‌లో మూడు బ్రిడ్జ్‌లు కూలిపోయాయి. ఇవాన్ని కూడా ఎన్డీయే ప్రభుత్వంలో చోటు చేసుకున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి సవాల్ విసురుతున్నా’’ అని కేసీ వేణుగోపాల్ అన్నారు. -
పేర్లు ఫైనల్.. మిగిలింది ప్రకటనే!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించే నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. దీనితోపాటు పీసీసీ కొత్త చీఫ్ ఎంపిక, నామినేటెడ్ పదవుల జాబితానూ కొలిక్కి తెచ్చినట్టు సమాచారం. జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక వర్గాలు, పార్టీలో పనిచేసిన అనుభవం, సీనియారిటీ ఆధారంగా కొత్త మంత్రుల ఎంపిక జరిగినట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి పోటీచేసి, గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు కలి్పంచాలని, ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి న వారికి అవకాశం ఇవ్వకూడదని అధిష్టానం నిర్ణ యించినట్టు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమెల్యేలకు కీలక పదవులు దక్కే అవకాశం లేదని అంటున్నాయి. వరుసగా నేతలతో భేటీలు.. కీలక పదవుల పంపకాలపై ఢిల్లీలో ఐదు రోజులుగా వరుసగా భేటీలు జరుపుతున్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శుక్రవారం కూడా విడివిడిగా చర్చలు జరిపారు. సీఎంతో భేటీకి ముందే దీపాదాస్ మున్షీ తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు లతో గంటన్నర పాటు చర్చించారు. మంత్రివర్గంలో తీసుకునేందుకు పరిశీలనలో ఉన్నవారందరి పేర్లపై అభిప్రాయం తీసుకున్నారు. ఒకరిద్దరి పేర్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా.. మిగతా పేర్లపై ఏకాభిప్రాయం వచ్చినట్టు తెలిసింది.ఈ భేటీ అనంతరం దీపాదాస్ మున్షీ సహా నేతలంతా సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. ఏకాభిప్రాయం వ్యక్తమైన పేర్లపై చర్చించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పేర్లకు అందరూ ఆమోదం తెలిపినట్టుగా సమాచారం. మిగతా పేర్లలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, బల్మూరి వెంకట్, ప్రేమ్‌సాగర్‌రావు, వివే క్, బాలూనాయక్ తదితరుల పేర్లపై కొంత భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు తెలిసింది. దీంతో వీటి నుంచి ఫైనల్ చేసే బాధ్యతను అధిష్టానంకు కట్టబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. కొత్తగా చేరినవారికి ఎలా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్‌ల లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనపైనా భేటీలో చర్చించినట్టు తెలిసింది. దీనికితోడు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లోకి వచ్చే ందుకు సిద్ధమైన దృష్ట్యా.. వారికి ఎలాంటి హామీ ఇవ్వాలన్న దానిపైనా చర్చ జరిగినట్టు సమాచారం.చివరిగా ఈ భేటీ అనంతరం దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి తదితరులు.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అయ్యారు. పరిశీలనలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు, ఏకాభిప్రాయం కుదిరిన పేర్లపై వారితో చర్చించారు. పీసీసీ అధ్యక్ష నియామకం విషయంలో నేతల అభిప్రాయాలను వారి దృష్టికి తెచ్చారు.రాష్ట్ర నేతలు తెలిపిన పేర్లను పరిశీలించి ఒకట్రెండు రోజుల్లో తెలియజేస్తామని.. జూలై మొదటివారంలో మంత్రివర్గ విస్తరణ చేసుకోవచ్చని అధిష్టానం పెద్దలు చెప్పినట్టు తెలిసింది. ఇక మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులేవీ కొత్తగా చేరిన వారికి అవకాశం ఇవ్వకుండా.. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. బీసీకే పీసీసీ చీఫ్ పదవి! పీసీసీ చీఫ్‌గా బీసీ వర్గ నేతకే చాన్స్ ఇవ్వాలని నేతలంతా అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఈ లెక్కన ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. వీరి విషయంలో ఏకాభిప్రాయం రాని పక్షంలో ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేరు పరిశీలనలో ఉందని అంటున్నాయి. -
హైకమాండ్ పెద్దలతో రేవంత్ భేటీ.. ఏ క్షణమైనా టీపీసీసీ చీఫ్‌ను ప్రకటించే ఛాన్స్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై హై కమాండ్ కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశమయ్యారు. కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి , మధుయాష్కి గౌడ్ సమావేశమయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అంశంపై చర్చించారు.పీసీసీ అధ్యక్ష రేసులో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అధిష్టానం ఎవరిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినా కలిసి పనిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గం, డిప్యూటీ సీఎం ఎస్సీ సామాజిక వర్గం కావడంతో పీసీసీ అధ్యక్ష పదవి బీసీ వర్గానికి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్లకు పట్టు ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెలిసి పనిచేసే నేతకు అధిష్టానం అవకాశమిస్తుందా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా పాత కాంగ్రెస్ నేతలకు అవకాశం ఇస్తారా? అనే దానిపై కూడా చర్చ నడుస్తోంది. -
‘జగిత్యాల జగడం’.. జీవన్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ బంపరాఫర్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ‘జగిత్యాల జగడం’ హాట్ టాపిక్‌గా మారింది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడంతో స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హస్తం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డితో కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరుపుతోంది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.కాగా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు జీవన్ రెడ్డి సిద్ధమవడంతో ఆయనతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఏకాంతంగా చర్చలు జరుపుతున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో ఫోన్‌తో మాట్లాడించారు. కాగా, వేణుగోపాల్‌తో జీవన్ రెడ్డి మాట్లాడిన తర్వాత రాజీనామాపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ సంద్భంగా కేసీ వేణుగోపాల్.. జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం.అనంతరం, జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేరు. ఆయన అందుబాటులోకి రాగానే నా నిర్ణయం చెబుతాను. తొందరలోనే మండలి ఛైర్మన్ దగ్గరికి వస్తాను. రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ నాతో మాట్లాడారు. సీనియర్ నాయకులు, సభ్యులు నా దగ్గరికి వచ్చారు. నేను కాంగ్రెస్‌లోనే ఉంటాను. పార్టీతో నాకు 40 సంవత్సరాల అనుబంధం ఉంది. జరిగిన పరిస్థితులు నాకు బాధ కలిగించాయి. మండలి ఛైర్మన్‌ను సమయం అడిగాను అంటేనే మీరు ఆలోచించండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గంలోని తన మద్దతుదారులంతా గాంధీభవన్‌కు రావాలని పిలుపునిచ్చారు. తనకు మద్దతుగా నిలవాలన్నారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో హైడ్రామా క్రియేట్ అయ్యింది. నిన్న(సోమవారం) కూడా జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటి వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు రావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
Mallikarjun Kharge: ఎదురొడ్డి నిల్చున్నారు
న్యూఢిల్లీ: రాజ్యాంగం ప్రబోధించిన అంకితభావం, విలువలున్న రాహుల్ గాంధీ దేశంలో తమ వాణిని వినిపించలేకపోయిన కోట్లాది మందికి గొంతుకగా మారారని రాహుల్‌ను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పొగడ్తల్లో ముంచెత్తారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ 54వ పుట్టినరోజు వేడుకను పార్టీ కీలక నేతలు జరిపారు. ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, కోశాధికారి అజయ్ మాకెల్ తదితరుల సమక్షంలో రాహుల్ కేక్ కట్‌చేశారు. పెద్దసంఖ్యలో అక్కడికొచ్చిన కార్యకర్తలు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా తన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవద్దని సామాజిక, దాతృత్వ కార్యక్రమాల్లో నిమగ్న మవ్వాలని పార్టీ కార్యకర్తలకు రాహుల్ పిలుపునిచ్చారు. ‘‘ కాంగ్రెస్ పాటించే సామరస్యం, భిన్నత్వంలో ఏకత్వం, తపన అన్నీ మీలో ప్రతిబింబిస్తున్నాయి. ప్రతి ఒక్కరి కన్నీటి కష్టాలు తుడిచేసి సత్యానికి ఉన్న శక్తిని చాటుతున్నారు’ అని ఖర్గే ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. ‘‘ నా ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సమాజం కోసం పరితపించే విలక్షణమైన వ్యక్తి, నా స్నేహితుడు, మార్గదర్శకుడు, నేత’ అంటూ ప్రియాంకా ట్వీట్‌చేశారు. ‘‘ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రజల పట్ల మీకున్న అంకితభావం దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది’ అని తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్‌చేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. -
లోక్‌సభ ఎన్నికల్లో 15 సీట్లలో గెలవాలి: కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 15 ఎంపీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పిలుపునిచ్చారు. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందని.. ఉత్తర భారతంలో బీజేపీ బలహీనపడుతుందని అంతర్గత సర్వేలు చెప్తున్నాయని వివరించారు. తెలంగాణలో కనీసం 14 స్థానాల్లో గెలుస్తామని వెల్లడైందన్నారు. ఈ సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని.. ఎన్నికలు ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకరోజు పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన కేసీ వేణుగోపాల్.. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో టీపీసీసీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రులు, కీలక నేతలు, పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ వారికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలోనే ఉండండి.. ‘‘ఈ నెల 18లోపు పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలో.. అసెంబ్లీ, మండలం, గ్రామం ప్రాతిపదికన ఎక్కడెక్కడ ఎప్పుడు ప్రచారం చేపట్టాలో పక్కా షెడ్యూల్ రూపొందించుకోవాలి. దాన్ని ఏఐసీసీకి పంపాలి. అభ్యర్థులు పూర్తిగా క్షేత్రస్థాయిలోనే ఉండాలి. వీలైనన్ని ఎక్కువ గ్రామాలు తిరగాలి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీల సదస్సులు పెట్టండి. మాదిగ సామాజికవర్గ ఓట్లను పొందేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లండి. ఏఐసీసీ నేతలు వారికి అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి తెలంగాణలో పర్యటిస్తారు. అందుకు తగినట్టుగా ప్రచార షెడ్యూల్, ఏర్పాట్లు చేసుకోండి..’’ అని కేసీ వేణుగోపాల్ సూచించారు. బీఆర్ఎస్ మునిగిపోయిన నావ అని, బీజేపీకి తెలంగాణ ప్రజల పట్ల వ్యతిరేకత ఉందని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని.. ఆ పార్టీల మధ్య లోపాయకారీ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. గత పదేళ్ల బీజేపీ వైఫల్యాలు, బీఆర్ఎస్ దుర్మార్గాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. లోక్‌సభ స్థానాల వారీగా సర్వే వివరాలతో.. రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల వారీ పరిస్థితులపై నేతలతో కేసీ వేణుగోపాల్ చర్చించారు. లోక్‌సభ స్థానాల వారీగా సర్వేల్లో వెల్లడైన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు చాలా అవసరమని.. ఆ స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని రాష్ట్ర నేతలకు సూచించారు. ఎన్నికలు ముగిసేంతవరకు నాయకులు తమకు అప్పగించిన నియోజకవర్గాల్లోనే ఉండి పనిచేయాలని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం సెగ్మెంట్లలో ఎవరిని ఖరారు చేయాలన్న దానిపై నేతల నుంచి కేసీ వేణుగోపాల్ మరోమారు అభిప్రాయం తీసుకున్నట్టు తెలిసింది. త్వరలోనే ఓ కీలక నేత కాంగ్రెస్‌లో చేరనున్నారని చెప్పినట్టు సమాచారం. రాష్ట్రంలో ఘర్ వాపసీని ముమ్మరం చేయాలని.. గతంలో బీజేపీ, బీఆర్ఎస్లలోకి వెళ్లిన నాయకులు తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తామంటే చేర్చుకోవాలని సూచించారని తెలిసింది. కాగా.. ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంట్ స్థానాల ఇన్చార్జులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, సుదర్శన్‌రెడ్డి, సంపత్‌కుమార్, మైనంపల్లి హన్మంతరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌చౌదరి, విష్ణునాథ్‌లతోపాటు పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు. మీ ప్రణాళికలేంటో చెప్పండి కేసీ వేణుగోపాల్‌తో భేటీకి ముందు ఎంపీ అభ్యర్థులతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ విడివిడిగా సమావేశమయ్యారు. నియోజకవర్గాల్లో ప్రచారం తీరు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీ సమన్వయం, నేతల సహకారం, ఇన్చార్జులతో కలసి రూపొందించుకున్న ప్రణాళికలపై అభ్యర్థులతో చర్చించారు. ఆయా నియోజకవర్గాల సర్వే రిపోర్టులను వారికి వివరించి.. తగిన ప్రణాళికతో ముందుకెళ్లాలని ఆదేశించారు. -
అందుకే వాళ్లు మా పార్టీ నుంచి వెళ్లిపోయారు..కేసీ సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం : సీనియర్ కాంగ్రెస్ నేత, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలపై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు అందిన వెంటనే కొందరు నేతలు పార్టీ నుంచి వైదొలిగి, ‘బీజేపీ, కేంద్ర ప్రభుత్వ కాళ్లపై పడ్డారు’ అని కేసీ వేణుగోపాల్ అన్నారు. కేరళ కాంగ్రెస్ ఆలప్పుళ లోక్‌సభ అభ్యర్ధి కేసీ వేణుగోపాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీ వేణుగోపాల్ తరుపున ప్రచారం చేసేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం హాజరయ్యారు. ప్రచారంలో భాగంగా కేసీ వేణుగోపాల్ డీకే శివకుమార్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్‌ను అన్యాయంగా బీజేపీ, దర్యాప్తు సంస్థలు పలురు నేతల్ని లేఖలతో బెదిరిస్తున్నాయని ఆరోపించారు. అయినప్పటికీ డీకే శివకుమార్‌లాంటి గట్స్ ఉన్న నేతలు బీజేపీ,ప్రభుత్వ ఏజెన్సీల ఒత్తిడిలకు తలొగ్గలేదని కొనియాడారు. కారణం లేకుండా కేంద్ర ఏజెన్సీలు డీకే శివకుమార్‌ను అన్యాయంగా జైలుకు పంపాయని, అయినప్పటికీ ధైర్యంగా పార్టీలో కొనసాగుతున్నారని అన్నారు. ఎంతోమంది నేతలు పార్టీని వీడే సమయంలో దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నోటీసులకు బయపడి బీజేపీకి సరెండర్ అవుతున్నారన్న ఆయన.. డీకే మాత్రం తన తల్లిలాంటి కాంగ్రెస్‌ను వదల్లేదని తెలిపారు. ధైర్యంగా ఎదుర్కొని కారణం లేకుండానే శివకుమార్ తీహార్ జైలుకు వెళ్లారు. ఆ సమయంలో కొందరు కాంగ్రెస్ పార్టీని వీడాలని ఆయన మీద ఒత్తిడి తెచ్చారు. పార్టీని వదిలేస్తే జైలు జీవితం నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పారు. ఆ చెప్పింది ఎవరో నాకు బాగా తెలుసు. కానీ శివకుమార్ కాంగ్రెస్ తనకు తల్లిలాంటిదని, పార్టీని వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినట్లు వెల్లడించారు. -
కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. 43 అభ్యర్థులతో రెండో జాబితా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ విడుదల చేశారు. రెండో జాబితాలో.. అస్సాం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో జనరల్ కేటగిరీకి చెందిన 10 మంది అభ్యర్థులు, 13 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీ అభ్యర్థులు, 9 మంది ఎస్టీ అభ్యర్థులు, ఒకరు ముస్లిం అభ్యర్థి ఉన్నట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. అస్సాం నుంచి 12 మంది, గురజరాత్ నుంచి 7 మంది, మధ్యప్రదేశ్ 10 మంది, రాజస్థాన్ 10 మంది, ఉత్తరఖండ్ 3, డయ్యూ అండ్ డామన్ నుంచి ఒక్కరికి రెండో జాబితాలో చోటు దక్కింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా సెగ్మెంట్ నుంచి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్‌ను మరోసారి బరిలోకి దింపింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కుమారుడు వైభవ్ గెహ్లాత్‌కు రాజస్థాన్‌లోని జలోర్ సెగ్మెంట్‌ను కేటాయించారు. అదేవిధంగా సోమవారం బీజేపీకీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన రాహుల్ కుశ్వాన్‌ను రాజస్థాన్‌లోని చురూ లోకసభ నియోజకవర్గం బరితో దింపింది. LIVE: Congress party briefing by Shri @kcvenugopalmp in New Delhi. https://t.co/K3nuDYA7P9 — Congress (@INCIndia) March 12, 2024 చదవండి: 39 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా -
ఖర్గే నివాసంలో కీలక భేటీ.. ఈ రాత్రికే ప్రకటన!
ఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ సారించింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో శనివారం సాయంత్రం నుంచి కీలక భేటీ జరుగుతోంది. ఈ భేటీలో రాహుల్ గాంధీ, దీపాదాస్ మున్షీలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు ఖాళీగా ఉన్న మంత్రి పదవులపైనా ఈ భేటీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన వెలువడవచ్చని సమాచారం. ఈ భేటీకి ముందు.. టీపీసీసీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలోని తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. అంతకు ముందు.. శనివారం మధ్యాహ్నాం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులో భాగంగానే ఈ వరుస భేటీలనేది స్పష్టమవుతోంది. సంక్రాంతిలోపు నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేసి తీరతామని సీఎం రేవంత్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్లారాయన. ఇక.. ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహణకు రంగం సిద్ధమైన నేపథ్యంలో.. అభ్యర్థుల ఎంపికపైనా ఆయన అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. -
తెలంగాణ 'సీఎం రేవంత్'
వన్ మ్యాన్ షో ఉండదు తెలంగాణ సీఎల్పీ సమావేశంలో చేసిన మూడు తీర్మానాలను పరిశీలకులు పార్టీ అధ్యక్షుడికి అందించారు. తెలంగాణలో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపే తీర్మానం మొదటిది. అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలకు ధన్యవాదాలు తెలిపేది రెండో తీర్మానం. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధిష్టానానికే అప్పగిస్తూ మూడో తీర్మానం చేశారు. పార్టీ పరిశీలకులు ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం సీనియర్లతో చర్చించాం. రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వంలో వన్‌మ్యాన్ షో ఉండదు. అందరినీ కలుపుకొంటూ కలసి టీమ్‌గా ముందుకు వెళ్తాం. సీనియర్లు అందరికీ సముచిత గౌరవం ఉంటుంది. – కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్, కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం ఉదయం 10.28 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎంలు, మంత్రులుగా ఎవరెవరు ఉంటారన్న దానిపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక రెండు రోజుల పాటు అనేక తర్జనభర్జనలు, సంప్రదింపులు జరిపి, నేతల అభిప్రాయాలు తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పి) నేతగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ప్రకటించారు. ఖర్గే తెలంగాణ సీఎల్పీ భేటీ చేసిన తీర్మానాన్ని పరిశీలించిన తర్వాత రేవంత్‌రెడ్డిని సీఎంగా నియమించాలని నిర్ణయించారని చెప్పారు. గురువారం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. డిప్యూటీ సీఎం సహా ఇతర మంత్రి పదవుల అంశంపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్టు వివరించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సుపరిపాలన అందించబోతోందని.. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేరుస్తామని చెప్పారు. తీర్మానాలను అధిష్టానానికి అందజేసి.. రాష్ట్ర ఎన్నికల్లో జయకేతనం అనంతరం సోమవారం కొత్త ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధిష్టానం దూతలు, ఏఐసీసీ పరిశీలకులు సమావేశం నిర్వహించి అభిప్రాయాలను సేకరించిన విషయం తెలిసిందే. సీఎం ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఆ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ తీర్మానం, ఎమ్మెల్యే అభిప్రాయాల నివేదికలతో ఢిల్లీకి వచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర నేతలు మంగళవారం రోజంతా బిజీబిజీగా గడిపారు. సీఎంతోపాటు ఇతర కీలక పదవులపై రాష్ట్ర, జాతీయ నేతలతో విస్తృతంగా చర్చలు జరిపారు. మరోవైపు సాయంత్రానికల్లా సీఎంను ఖరారు చేస్తామని ఖర్గే ప్రకటించారు. వరుసగా భేటీలు.. విస్తృతంగా సంప్రదింపులు.. మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు కొద్దిసేపు పదవుల అంశంపై చర్చించుకున్నారు. 10.45 గంటలకు ఉత్తమ్ డీకే శివకుమార్‌తో భేటీ అయి.. సీఎం, డిప్యూటీ సీఎం పదవులు, పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక, కీలక శాఖలకు మంత్రులు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తనకు సీఎం పదవికి అర్హత ఉందని నొక్కి చెప్పినట్టు తెలుస్తోంది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశానని.. తనకు మెజార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ల మద్దతు ఉందని వివరించినట్టు సమాచారం. అయితే ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్.. అధిష్టానం సీఎంగా ఎవరిని ఎంపిక చేసినా తనకు ఆమోదమేనని ప్రకటించారు. డీకేతో ఉత్తమ్ భేటీ జరుగుతున్న సమయంలోనే.. భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో భేటీ అయ్యారు. సీఎం పదవి కోసం తన అర్హతను పరిశీలించాలని కోరారు. ఈ భేటీలు సాగుతున్న సమయంలోనే ఖర్గే నివాసంలో మరో కీలక భేటీ జరిగింది. రేవంత్‌రెడ్డి వైపే మొగ్గు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఖర్గే నివాసానికి పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాం«దీ, కేసీ వేణుగోపాల్ తదితరులు చేరుకుని.. సీఎల్పీ నేత ఎంపికపై చర్చించారు. పదవికి పోటీ పడుతున్న రేవంత్, ఉత్తమ్, భట్టి పేర్లను పరిశీలించారు. పారీ్టకి పనిచేసిన అనుభవంతోపాటు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రానున్న పార్లమెంట్ ఎన్నికలు, మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు, ప్రజల్లో ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని రేవంత్‌రెడ్డి వైపే అంతా మొగ్గుచూపినట్టు తెలిసింది. ఈ భేటీ మొదలైన అరగంటకు డీకే శివకుమార్, ఠాక్రే కూడా ఖర్గే నివాసానికి చేరుకుని.. ఎమ్మెల్యేల తీర్మానం కాపీ, వారి అభిప్రాయాల నివేదికను అగ్రనేతలకు అందించారు. ఈ సందర్భంగా అంతా కలసి.. పార్టీ సీనియర్ నేతల నుంచి వస్తున్న డిమాండ్లు, కీలక శాఖల అప్పగింత, పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చించారు. రేవంత్ ఎంపికను ఖరారు చేసి, ఈ విషయాన్ని అగ్రనేత సోనియాగాం«దీకి తెలిపి ఆమోదం తీసుకున్నారు. భట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో ఉత్తమ్, దామోదర, శ్రీధర్‌బాబు, సీతక్కలకు కీలక శాఖలు ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. డిప్యూటీ సీఎం, మంత్రులకు శాఖలపై నేడు స్పష్టత సీఎం ఎంపిక కసరత్తు కొలిక్కి వచ్చిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో కేసీ వేణుగోపాల్‌తో డీకే, ఠాక్రే, భట్టి, ఉత్తమ్ భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం పదవులతోపాటు మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపులపై వారు సుమారు గంట పాటు చర్చించారు. అనంతరం డీకే, ఠాక్రే, ఉత్తమ్, భట్టిలను వెంట పెట్టుకొని ఏఐసీసీ కార్యాలయానికి వచ్చిన కేసీ వేణుగోపాల్.. సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేసినట్టు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రులు ఎందరు ఉండాలి, మంత్రి పదవులు ఎవరికి అన్న దానిపై బుధవారం రేవంత్‌రెడ్డితో కలసి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. సోనియాతో జి.వినోద్ భేటీ మరోవైపు మాజీ మంత్రి జి.వినోద్ ఢిల్లీలో సోనియాగాంధీతో విడిగా భేటీ అయ్యారు. తాను గతంలో మంత్రిగా పనిచేశానని, ఈసారి తనకు మంత్రి పదవి ఇవ్వాలని సోనియాను కోరానని భేటీ అనంతరం వినోద్ తెలిపారు. తన విజ్ఞప్తిపై ఆమె సానుకూలత వ్యక్తం చేశారని చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: ఉత్తమ్ సీఎల్పీ నేత ప్రకటనకు ముందు ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. సీఎం పదవి కోసం తనకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఈ విషయాన్ని పరిశీలించాలని హైకమాండ్‌ను కోరానని చెప్పారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే సీఎం ఎంపిక జరుగుతోందని, మిగతా పార్టీ అంతర్గత విషయాలను బయటికి వెల్లడించలేనని చెప్పారు. కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలంతా మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్లోనే గడిపారు. ఓవైపు ఢిల్లీలో సీఎల్పీ నాయకుడి ఎంపికపై చర్చలు, సంప్రదింపులు జరుగుతుండగా.. అదే సమయంలో రేవంత్‌రెడ్డి హోటల్లో కొత్త ఎమ్మెల్యేలతో ఉండి చర్చలు జరుపుతూ గడిపారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రొఫెసర్ నాగేశ్వర్, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు అసెంబ్లీ వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు, ఇతర అంశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో రేవంత్ మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఆయన ప్రయాణంలో ఉండగానే ఢిల్లీలో కేసీ వేణుగోపాల్, ఇతర నేతలు ప్రెస్‌మీట్ పెట్టి రేవంత్‌ను సీఎంగా ఎంపిక చేసినట్టు ప్రకటించారు. రేవంత్ వెళ్లాక ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరిగా హోటల్ నుంచి వెళ్లిపోయారు. వారంతా బుధవారం మళ్లీ ఎల్లా హోటల్లో సమావేశం కానున్నారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. సీఎంగా రేవంత్ ఎంపిక ప్రకటన వెలువడగానే.. ఎల్లా హోటల్ వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. బాణసంచా కాలుస్తూ, జై రేవంత్, జై కాంగ్రెస్ నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నాయి. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం – వేగంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు వెంటనే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై ఆమె మంగళవారం రాత్రి సచివాలయంలో సమీక్షించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. పారిశుధ్యం, త్రాగునీరు, ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఎల్బీ స్టేడియం వద్దకు వెళ్లే రహదారుల మరమ్మతులు చేపట్టాలని.. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సునీల్‌శర్మ, ముఖ్య కార్యదర్శులు రిజ్వీ, శైలజా రామయ్యర్, గవర్నర్ సెక్రెటరీ సురేంద్ర మోహన్, జీఏడీ సెక్రెటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీకి రెడీ: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. అరగంట పాటు సమావేశం జరిగింది. రేపు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి రాజగోపాల్‌రెడ్డి చేరనున్నారు. మునుగోడు నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన రాజగోపాల్‌రెడ్డి.. పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై కూడా పోటీకి రెడీ అన్నారు. బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ‘‘కేసీఆర్ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం. మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది’’ అని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసింది. కమ్యూనిస్టులకు వదిలేసిన స్థానాలు, కొత్తగా నేతల చేరిక ఉండే సీట్లు, పోటీ ఎక్కువగా ఉన్న కొన్ని స్థానాలు మినహా 50కిపైగా అభ్యర్థుల పేర్లతో మలి జాబితాను సిద్ధం చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో ఆమోదించిన ఈ జాబితాను ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇక పొత్తు, ఇతర అంశాలతో పెండింగ్ పెట్టిన మిగతా స్థానాలకు సంబంధించి బుధవారం రాత్రి కేసీ వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులు, చేరికలపై చర్చించి, పలు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలిసింది. గురువారం జరిగే సీఈసీ భేటీలో ఈ సిఫార్సులను అందజేయనున్నట్టు సమాచారం. సీఈసీ దీన్ని పరిశీలించి, పొత్తు సీట్లు, అభ్యర్థు లను ఖరారు చేసే అవకాశం ఉందని తెలిసింది. -
ఢిల్లీలో టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం
-
తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కీలక భేటీ
ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ రెండో జాబితా ఖరారుకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం శనివారం సాయంత్రం ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రెండో జాబితాను అతి త్వరగా విడుదల చేయాలని చూస్తోన్న కాంగ్రెస్.. ఈ సమావేశంలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసే అవకాశంఉంది. ‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
కాంగ్రెస్ అభ్యర్థులు 70 మంది ఖరారు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగే 70 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. దీంతో 119 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో సగానికి పైగా స్థానాలకు టికెట్లు ఫైనల్ చేసినట్టయ్యింది. పార్టీలో పనిచేసిన అనుభవం, కుల సమీకరణలు, సర్వేలు, ఆర్థిక బలాలను దృష్టిలో పెట్టుకొని స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా తొలి విడతగా 70 మంది అభ్యర్థులను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఎంపిక చేసింది. ఈ మేరకు తొలి జాబితాను 15న విడుదల చేసే అవకాశం ఉంది. సర్వేల ఆధారంగానే.. చైర్మన్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ భేటీ జరిగింది. సోనియాగాందీ, రాహుల్‌గాందీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ఇతర కమిటీ సభ్యులు హాజరయ్యారు. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్‌లను సైతం సమావేశానికి ఆహ్వనించారు. రెండున్నర గంటల పాటు జరిగిన భేటీలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సహా ఏఐసీసీ స్థాయిలో చేసిన సర్వేల నివేదికలు ముందుపెట్టుకొని నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను పరిశీలించారు. మొదట ఒకే ఒక్క పేరున్న 70 నియోజకవర్గాలు, ఆయా స్థానాలకు సంబంధించిన నేతల పేర్లు పరిశీలించారు. ఏయే ప్రాతిపదికల ఆధారంగా ఇక్కడ ఒకే నేత ఎంపిక జరిగిందో మురళీధరన్ కమిటీకి వివరించారు. ఈ స్థానాలపై ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో ఆ 70 నియోజకవర్గాల్లో ప్రతిపాదిత అభ్యర్థులకు సీఈసీ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇక రెండో విడత జాబితాను ఫైనల్ చేసేందుకు వచ్చేవారం మరోమారు సీఈసీ భేటీ కానుంది. దసరాకు ముందే 18న రెండో విడత జాబితా విడుదల చేయాలని సీఈసీలో నిర్ణయం జరిగినట్లు చెబుతున్నారు. భేటీ అనంతరం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ మాట్లాడుతూ.. ‘నేటి భేటీలో 70 సీట్లపై చర్చించాం. మరోమారు సీఈసీ భేటీ ఉంటుంది’ అని తెలిపారు. తొలి జాబితాలో ముఖ్య నేతలు తొలి జాబితాలో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీనియర్ నేతలు షబ్బీర్‌అలీ, సంపత్‌కుమార్, గడ్డం ప్రసాద్‌కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, ఫిరోజ్‌ఖాన్, ప్రేమ్‌సాగర్‌రావు, అంజన్‌కుమార్ యాదవ్, పద్మావతి రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, కొండా సురేఖ, రామ్మోహన్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, అనిరుద్‌రెడ్డి, వీర్లపలి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, రోహిత్‌రావు, గడ్డం వినోద్, ఎర్ర శేఖర్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, కాట శ్రీనివాస్‌గౌడ్, వంశీకృష్ణ తదితరుల పేర్లు ఉన్నట్టు చెబుతున్నారు. కమ్యూనిస్టులతో పొత్తు, స్థానాలపై చర్చ సీఈసీ భేటీకి ముందు స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది. చైర్మన్ మురళీధరన్‌తో పాటు మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్ తదితరులు హాజరయ్యారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన భేటీలో సింగిల్ పేర్లతో, రెండు, మూడేసి పేర్లతో ఉన్న అభ్యర్థుల జాబితాలు రూపొందించారు. వాటిని సీఈసీ ముందుంచాలని నిర్ణయించారు. ఇదే సమయంలో కమ్యూనిస్టులతో పొత్తు, వారికి ఇవ్వాల్సి సీట్ల కేటాయింపుపైనా చర్చించారు. మిర్యాలగూడ, మునుగోడు, ఖమ్మం, కొత్తగూడెం, హుస్నాబాద్ స్థానాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ భేటీ తర్వాత జరిగిన సీఈసీ సమావేశంలోనూ పొత్తు, సీట్ల కేటాయింపు అంశంపై చర్చించారు. ఒకట్రెండు రోజుల్లో పొత్తు తేల్చాలని కేసీ వేణుగోపాల్, రేవంత్‌కు హైకమాండ్ పెద్దలు సూచించినట్లు తెలిసింది. ఇక టికెట్ దక్కని నేతలతో వారికున్న ప్రాధాన్యాన్ని బట్టి నేరుగా హైకమాండ్ పెద్దలు మాట్లాడాలన్న రాష్ట్ర నేతల సూచనకు అధిష్టానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. -
కమలం అసంతృప్తులకు కాంగ్రెస్ గాలం!
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో అసంతృప్త నేతలుగా ముద్రపడిన వారిపై కాంగ్రెస్ దృష్టి సారించింది. వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఢిల్లీ నుంచే వల విసురుతోందని, ‘ఆపరేషన్ బీజేపీ అసమ్మతి’ కోసం సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగారని తెలుస్తోంది. బీఆర్ఎస్ పట్ల మెతక వైఖరి అనుసరిస్తోందని, తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, క్షేత్రస్థాయిలో పార్టీపై నెలకొన్న ప్రజాభిప్రాయాన్ని దృష్టిలోఉంచుకుని బీజేపీతో కొంతకాలంగా అంటీ ముట్టనట్టుగా ఉంటున్న నాయకులు లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతున్నట్టు సమాచారం. కాగా వేణుగోపాల్ ఇప్పటికే బీజేపీ అసమ్మతి నేతలతో టచ్‌లోకి వెళుతున్నారని, వారి రాజకీయ భవిష్యత్తుకు హామీలివ్వడమే కాకుండా, తెలంగాణలో బీజేపీకి అవకాశం లేనందున తమతో కలిసిరావాలని కోరుతున్నారని తెలిసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను గద్దె దించడమే తమ ధ్యేయమని, అందుకే బీజేపీలోకి వెళుతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిన వారితో పాటు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన కొందరిని టార్గెట్‌గా చేసుకుని వేణుగోపాల్ రంగంలోకి దిగారని గాందీభవన్ వర్గాలంటున్నాయి. ఈ జాబితాలో మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితో సహా దాదాపు 20 మంది నాయకులున్నారని చెబుతున్నాయి. జిట్టా బాలకృష్ణారెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి లాంటి కొందరు నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా, బీజేపీ కుంభస్థలాన్ని కొట్టామనే భావన కలిగించే స్థాయి నేతలను సైతం పార్టీలోకి రప్పించేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా వారం పది రోజుల్లోనే ఫలితం కనబడుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే మాజీ ఎంపీలు జి.వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాత్రం తాము పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. మిగతా నేతల గురించి తమకు తెలియదని వారన్నారు. కానీ ప్రధాని మోదీ పాలమూరు, నిజామాబాద్ సభలకు అసంతృప్త నేతలు పలువురు హాజరుకాక పోవడం అనుమానాలకు తావిస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మోదీ సభలకు వెళ్లలేదెందుకో? బీజేపీ అసమ్మతి నేతల వ్యవహారశైలిపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వీరంతా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైందనే ప్రచారం కొంతకాలంగా విస్తృతంగానే జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఎవరూ గట్టిగా ఖండించలేదనే చెప్పాలి. పైగా చాలాకాలంగా పార్టీ తీరుపై గుర్రుగా ఉన్న ఈ నేతలంతా ఇటీవల హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా ఫామ్‌హౌస్, డిన్నర్ మీటింగ్‌లు పెట్టుకున్నారు. కానీ ఈనెల 1, 3 తేదీల్లో జరిగిన మోదీ బహిరంగ సభలకు మాత్రం.. ఆ మీటింగ్‌లకు వెళ్లిన నేతల్లో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు హాజరు కాలేదు. దీంతో దీనివెనుక ఆంతర్యమేమిటనే చర్చ జరుగుతోంది. తర్జనభర్జన! కాంగ్రెస్ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఆ పార్టీలోకి వెళ్లాలా? లేక బీజేపీలోనే ఉండాలా? అన్నదానిపై అసంతృప్త నేతలు తర్జనభర్జన పడుతుండటమే వారో స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడానికి కారణంగా తెలుస్తోంది. బీజేపీ అసమ్మతి నేతల్లోని కీలక నేత ప్రధాన అనుచరుడు ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘మేం బీజేపీలో ఇమడలేకపోతున్నాం. వాస్తవానికి రజాకార్లతో కొట్లాట నుంచి కమ్యూనిస్టులతో పోట్లాట వరకు తరతరాలుగా కాంగ్రెస్‌తోనే ఉన్నాం. ఇప్పుడు మా నాయకుడు బీజేపీలోకి వెళ్లాడు కాబట్టి మేం కూడా ఆ కండువా కప్పుకున్నాం. మాలో చాలా మంది మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లాలని అంటున్నారు. మా నాయకుడు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. కానీ తరచూ పార్టీలు మారడమే ఇబ్బందిగా ఉందని అంటున్నారు. కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తే పార్టీ మారినా ప్రయోజనం ఉంటుంది. అలా కాకపోతే ఎక్కడైనా ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు బీజేపీలో ఉండడం వల్ల నష్టం ఏంటి? కాంగ్రెస్‌లోకి వెళ్లి లాభం ఏంటనే దానిపై మా నాయకుడు మల్లగుల్లాలు పడుతున్నారు. మిగతావారు కూడా దాదాపుగా ఇదే ఆలోచనతో ఉన్నారు. వారం, పది రోజుల్లో ఏదో ఒకటి తేలిపోతుంది..’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఆపరేషన్‌పై ఆ పార్టీ కీలక నేత ఒకరు మాట్లాడుతూ.. ‘ఢిల్లీ పెద్దలు చాలామందితో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వదిలివెళ్లిన వారిని మళ్లీ రమ్మని కోరుతున్నారు. రాజగోపాల్‌తో పాటు చాలామంది బీజేపీ అసమ్మతి నేతలతో వేణుగోపాల్ మాట్లాడుతున్నారన్నది వాస్తవం..’ అని చెప్పడం గమనార్హం. -
తెలంగాణలో దారుణమైన పాలన నడుస్తోంది: కేసీ వేణుగోపాల్
-
‘రాహుల్‌పై విమర్శలు మాని.. కవిత ఈడీ కేసుపై దృష్టి పెట్టండి’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణ అత్యంత అవినీతిమయమైన రాష్ట్రంగా మారిందని ఏఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాలు ధ్వజమెత్తారు. కేంద్రంలో ప్రధాని మోదీ, తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజలను ఇరిటేట్ చేస్తున్నారని విమర్శించారు. ఇండియా మొత్తం ఇండియా కూటమివైపు చేస్తోందని తెలిపారు. అయిదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు తాజ్‌కృష్ణలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. రేపటి నుంచి 2 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని పేర్కొన్నారు. షర్మిల కాంగ్రెస్నాయకులను కలిసిందని, నిర్ణయం త్వరలో తెలుస్తుందని తెలిపారు. ఈమేరకు 17న కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తుక్కుగూడలో విజయభేరి సభాస్థలిని కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, ఇంఛార్జి మణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు పరిశీలించారు. ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ విమర్శించారు. రిజర్వేషన్ బిల్లు తెచ్చింది సోనియా గాంధేనని తెలిపారు. రాహుల్‌పై విమర్శలు మాని.. కవిత ఈడీ కేసుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. భారత్ జోడో యాత్ర తరువాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని.. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. విజయభేరి సభలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను ప్రకటిస్తామని చెప్పారు. చదవండి: మంత్రి కేటీఆర్ మెడిసిన్ ఎందుకు చదవలేకపోయారంటే..? కాంగ్రెస్ అగ్రనేతంతా హైదరాబాద్‌కే.. సీడబ్ల్యూసీ, విజయభేరి సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ రానున్నారు. వీరితోపాటు ప్రియాంక గాంధీ, నాలుగు రాష్ట్రాల సీఎంలు, సీడబ్ల్యూసీ సభ్యులు, 29 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే ఏఐసీసీ ముఖ్యనేతలు తాజ్ కృష్ణకు చేరుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో నగరంలోని తాజ్ కృష్ణ హోటల్ హై సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ ఆగ్ర నేతలంతా ఈ హోటల్లోనే బస చేస్తుండడంతో కేంద్ర బలగాలు హోటల్ మొత్తాన్ని, పరిసరాలను నియంత్రణలోకి తీసుకున్నాయి.