టీపీసీసీ ‘జంబో జట్టు’ | AICC Gives Nod For Important Committees To Run PCC | Sakshi
Sakshi News home page

టీపీసీసీ ‘జంబో జట్టు’

Published Sun, Dec 11 2022 1:45 AM | Last Updated on Sun, Dec 11 2022 3:00 PM

AICC Gives Nod For Important Committees To Run PCC - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ పీసీసీ కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో కార్యవర్గాన్ని ఎంపిక చేసింది. అన్ని సామాజిక వర్గాలను సమతుల్యం చేస్తూ.. జంబో జట్టును ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ జాబితాను విడుదల చేశారు.

ఇందులో 24 మంది ఉపాధ్యక్షులు, 84 మంది ప్రధాన కార్యదర్శులు ఉండగా, 26 జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. వీరితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ అ«ధ్యక్షతన ఏర్పాటు చేసిన రాజకీయ వ్యవహారాల కమిటీలో 17 మంది సభ్యులు, నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. అంతేగాక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా 40 మందితో ప్రదేశ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీని ఏఐసీసీ ఏర్పాటు చేసింది.  

ఇదీ జాబితా.. రాజకీయ వ్యవహారాల కమిటీ(22) : 
మాణిక్యం ఠాగూర్‌ (చైర్మన్‌), రేవంత్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, వి.హనుమంత రావు, పొన్నాల లక్ష్మయ్య, ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కె.జానారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, జె.గీతారెడ్డి, మహమ్మద్‌ అలీ షబ్బీర్, దామోదర సి. రాజనరసింహ, రేణుకా చౌదరి, పి.బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి, శ్రీధర్‌బాబు, వంశీచంద్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌. అలాగే పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లుగా ఉన్న ఎండీ అజారుద్దీన్, అంజన్‌కుమార్‌ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌ రాజకీయ వ్యవహారాల కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.  

ప్రదేశ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (40) .. 
రేవంత్‌రెడ్డి (చైర్మన్‌), మల్లు భట్టివిక్రమార్క, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కె.జానారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, జె.గీతారెడ్డి, మహమ్మద్‌ అలీ షబ్బీర్, దామోదర రాజనరసింహ, రేణుకా చౌదరి, పి.బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, డి.శ్రీధర్‌బాబు, జి.చిన్నారెడ్డి, చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎ.సంపత్‌ కుమార్, పి. సుదర్శన్‌రెడ్డి, ఆర్‌.దామోదర్‌రెడ్డి,

సంభాని చంద్రశేఖర్, నాగం జనార్దన్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌ కుమార్, సి.రామచంద్రారెడ్డి, కొండా సురేఖ, జి.వినోద్, మహమ్మద్‌ అజారుద్దీన్, అంజన్‌కుమార్‌ యాదవ్, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్‌ గౌడ్, డి.సీతక్క, పొదెం వీరయ్య, ఎ.మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, కోదండరెడ్డి, ఈరవత్రి అనిల్‌కుమార్, వేం నరేందర్‌రెడ్డి, మల్లు రవి, సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేని. 

టీపీసీసీ ఉపాధ్యక్షులు (24) .. 
పద్మావతిరెడ్డి, బండారు శోభా భాస్కర్, కొండ్ర పుష్పలీల, నేరెళ్ల శారదాగౌడ్, సీహెచ్‌.విజయ రమణారావు, చామల కిరణ్‌రెడ్డి, చెరుకు సుధాకర్‌గౌడ్, దొమ్మటి సాంబయ్య, శ్రవణ్‌కుమార్‌ రెడ్డి, ఎర్ర శేఖర్, జి.వినోద్, గాలి అనిల్‌కుమార్, హర్కర వేణుగోపాల్‌రావు, జగదీశ్వరరావు, మదన్‌మోహన్‌రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, పొట్ల నాగేశ్వరరావు, రాములు నాయక్, సంజీవరెడ్డి, సిరిసిల్ల రాజయ్య, టి.వజ్రేశ్‌ యాదవ్, తాహెర్‌బిన్‌ హందాని. 

టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు (84) .. 
మధుసూదన్‌రెడ్డి, అద్దంకి దయాకర్, బి.కైలాశ్‌కుమార్, బి.సుభాష్‌రెడ్డి, భానుప్రకాశ్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, భూపతిగల్ల మహిపాల్, బొల్లు కిషన్, సీహెచ్‌. బాల్‌రాజు, చలమల కృష్ణారెడ్డి, చరణ్‌కౌషిక్‌ యాదవ్, చారుకొండ వెంకటేశ్, చేర్యాల ఆంజనేయులు, చిలుక మధుసూదన్‌రెడ్డి, చిలుక విజయ్‌కుమార్, చిట్ల సత్యనారాయణ, దారాసింగ్‌ తాండూర్, సుధాకర్‌ యాదవ్, దుర్గం భాస్కర్,

ఈ.కొమురయ్య, ఎడవల్లి కృష్ణ, ఫక్రుద్దీన్, ఫిరోజ్‌ఖాన్, గడుగు గంగాధర్, జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్, గోమాస శ్రీనివాస్, గౌరీ శంకర్, జానంపల్లి అనిరుధ్‌రెడ్డి, జెరిపేటి జయపాల్, కె.నాగేశ్వరరెడ్డి, కైలాష్‌ నేత, కాటం ప్రదీప్‌కుమార్‌ గౌడ్, కొండేటి మల్లయ్య, కోటంరెడ్డి వినయ్‌రెడ్డి, కోటూరి మానవతారాయ్, కుందూరు రఘువీరారెడ్డి, ఎం.నాగేశ్‌ ముదిరాజ్, ఎం.వేణుగౌడ్, ఎం.ఎ. ఫహీం, మొగల్‌గుండ్ల జయపాల్‌రెడ్డి, మహ్మద్‌ అబ్దుల్‌ ఫహీం, ఎన్‌.బాలు నాయక్, నర్సారెడ్డి భూపతిరెడ్డి, నూతి సత్యనారాయణ,

పి.హరికృష్ణ, పి.ప్రమోద్‌ కుమార్, పి.రఘువీర్‌రెడ్డి, పటేల్‌ రమేశ్‌రెడ్డి, పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, ప్రేమ్‌లాల్, ఆర్‌.లక్ష్మణ్‌ యాదవ్, నర్సాపూర్‌ రాజిరెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, రంగినేని అభిలాశ్‌రావు, రంగు బాలలక్ష్మిగౌడ్, రాపోలు జయప్రకాశ్, ఎస్‌.ఎ. వినోద్‌కుమార్, సంజీవ ముదిరాజ్, సత్తు మల్లేశ్, సొంటిరెడ్డి పున్నారెడ్డి, శ్రీనివాస్‌ చెక్లోకర్, తాటి వెంకటేశ్వర్లు, వల్లె నారాయణరెడ్డి,

వెడ్మ భొజ్జు, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, జహీర్‌ లలాని, భీమగాని సౌజన్యగౌడ్, లకావత్‌ ధన్వంతి, ఎర్రబెల్లి స్వర్ణ, గండ్ర సుజాత, గోగుల సరిత వెంకటేశ్, జువ్వాడి ఇంద్రారావు, కందాడి జ్యోత్స్న శివారెడ్డి, కోట నీలిమ, మందుముల్ల రజితారెడ్డి, మర్సుకోల సరస్వతి, పి.విజయారెడ్డి, పారిజాత నర్సింహారెడ్డి, కుచన రవళిరెడ్డి, శశికళా యాదవ్, సింగారపు ఇందిర, ఉజ్మా షకీర్‌ 

జిల్లా అధ్యక్షులు (26) : 
సాజిద్‌ ఖాన్‌ (ఆదిలాబాద్‌), పొదెం వీరయ్య (భద్రాద్రి కొత్తగూడెం), ఎన్‌.రాజేందర్‌రెడ్డి(హనుమకొండ), వలీయుల్లా సమీర్‌ (హైదరాబాద్‌), ఎ.లక్ష్మణ్‌ కుమార్‌ (జగిత్యాల). పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి (జోగుళాంబ గద్వాల), కైలాశ్‌ శ్రీనివాస్‌రావు (కామారెడ్డి), కె.సత్యనారాయణ (కరీంనగర్‌), రోహిన్‌రెడ్డి (ఖైరతాబాద్‌), జె.భరత్‌చంద్రారెడ్డి(మహబూబాబాద్‌), జి.మధుసూదన్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌), కె.సురేఖ (మంచిర్యాల), టి.తిరుపతిరెడ్డి (మెదక్‌),

నందికంటి శ్రీధర్‌ (మేడ్చల్‌ మల్కాజ్‌గిరి), ఎన్‌.కుమారస్వామి (ములుగు), సి.వంశీకృష్ణ (నాగర్‌కర్నూల్‌), టి.శంకర్‌నాయక్‌(నల్లగొండ), శ్రీహరి ముదిరాజ్‌ (నారాయణపేట), ప్రభాకర్‌రెడ్డి (నిర్మల్‌), మానాల మోహన్‌రెడ్డి (నిజామాబాద్‌), ఎం.ఎస్‌. రాజ్‌ఠాకూర్‌ (పెద్దపల్లి), ఆది శ్రీనివాస్‌ (రాజన్న సిరిసిల్ల), టి.నర్సారెడ్డి (సిద్దిపేట), టి.రామ్మోహన్‌రెడ్డి (వికారాబాద్‌), ఎం.రాజేంద్రప్రసాద్‌ యాదవ్‌ (వనపర్తి), కె.అనిల్‌కుమార్‌ రెడ్డి (యాదాద్రి భువనగిరి)   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement