Chief Secretaries
-
ప్రగతిపై సీఎస్ లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
-
4 ‘ఐ’లపైనే దృష్టి: మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ శనివారం దేశవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన బ్లాక్‌ల అభివృద్ధి కోసం ఉద్దేశించిన అభిలషణీయ బ్లాక్ పథకం(అస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం)ను ప్రారంభించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి పథకంలో మాదిరిగానే ఈ కార్యక్రమంలో కూడా భారత్ అభివృద్ధికి నాలుగు స్తంభాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్(మౌలికరంగం), ఇన్వెస్ట్మెంట్(పెట్టుబడి), ఇన్నోవేషన్(ఆవిష్కరణ), ఇంక్లూజన్(సమ్మిళితం)లపైనే దృష్టి సారించాలన్నారు. రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల రెండో జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని శనివారం ప్రసంగించారు. ప్రపంచ సప్లై చైన్‌ను స్థిరతను సాధించేందుకు దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయన్నారు. ఇందుకోసం చిన్న, మధ్య శ్రేణి పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ విషయంలో రాష్ట్రాలే చొరవచూపాలన్నారు. అసంబద్ధ అనుమతులు, కాలం చెల్లిన చట్టాలు, నిబంధనలను పక్కనబెట్టాలని చీఫ్ సెక్రటరీలను కోరారు. -
టీపీసీసీ ‘జంబో జట్టు’
సాక్షి, న్యూఢిల్లీ: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ పీసీసీ కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో కార్యవర్గాన్ని ఎంపిక చేసింది. అన్ని సామాజిక వర్గాలను సమతుల్యం చేస్తూ.. జంబో జట్టును ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. ఇందులో 24 మంది ఉపాధ్యక్షులు, 84 మంది ప్రధాన కార్యదర్శులు ఉండగా, 26 జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. వీరితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ అ«ధ్యక్షతన ఏర్పాటు చేసిన రాజకీయ వ్యవహారాల కమిటీలో 17 మంది సభ్యులు, నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. అంతేగాక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా 40 మందితో ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏఐసీసీ ఏర్పాటు చేసింది. ఇదీ జాబితా.. రాజకీయ వ్యవహారాల కమిటీ(22) : మాణిక్యం ఠాగూర్ (చైర్మన్), రేవంత్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, వి.హనుమంత రావు, పొన్నాల లక్ష్మయ్య, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కె.జానారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, జె.గీతారెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్, దామోదర సి. రాజనరసింహ, రేణుకా చౌదరి, పి.బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి, శ్రీధర్‌బాబు, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్. అలాగే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న ఎండీ అజారుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్ రాజకీయ వ్యవహారాల కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (40) .. రేవంత్‌రెడ్డి (చైర్మన్), మల్లు భట్టివిక్రమార్క, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కె.జానారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, జె.గీతారెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్, దామోదర రాజనరసింహ, రేణుకా చౌదరి, పి.బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, డి.శ్రీధర్‌బాబు, జి.చిన్నారెడ్డి, చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎ.సంపత్ కుమార్, పి. సుదర్శన్‌రెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, నాగం జనార్దన్‌రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, సి.రామచంద్రారెడ్డి, కొండా సురేఖ, జి.వినోద్, మహమ్మద్ అజారుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్ గౌడ్, డి.సీతక్క, పొదెం వీరయ్య, ఎ.మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, కోదండరెడ్డి, ఈరవత్రి అనిల్‌కుమార్, వేం నరేందర్‌రెడ్డి, మల్లు రవి, సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని. టీపీసీసీ ఉపాధ్యక్షులు (24) .. పద్మావతిరెడ్డి, బండారు శోభా భాస్కర్, కొండ్ర పుష్పలీల, నేరెళ్ల శారదాగౌడ్, సీహెచ్.విజయ రమణారావు, చామల కిరణ్‌రెడ్డి, చెరుకు సుధాకర్‌గౌడ్, దొమ్మటి సాంబయ్య, శ్రవణ్‌కుమార్ రెడ్డి, ఎర్ర శేఖర్, జి.వినోద్, గాలి అనిల్‌కుమార్, హర్కర వేణుగోపాల్‌రావు, జగదీశ్వరరావు, మదన్మోహన్రావు, మల్రెడ్డి రంగారెడ్డి, ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, పొట్ల నాగేశ్వరరావు, రాములు నాయక్, సంజీవరెడ్డి, సిరిసిల్ల రాజయ్య, టి.వజ్రేశ్ యాదవ్, తాహెర్‌బిన్ హందాని. టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు (84) .. మధుసూదన్‌రెడ్డి, అద్దంకి దయాకర్, బి.కైలాశ్‌కుమార్, బి.సుభాష్‌రెడ్డి, భానుప్రకాశ్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, భూపతిగల్ల మహిపాల్, బొల్లు కిషన్, సీహెచ్. బాల్‌రాజు, చలమల కృష్ణారెడ్డి, చరణ్‌కౌషిక్ యాదవ్, చారుకొండ వెంకటేశ్, చేర్యాల ఆంజనేయులు, చిలుక మధుసూదన్‌రెడ్డి, చిలుక విజయ్‌కుమార్, చిట్ల సత్యనారాయణ, దారాసింగ్ తాండూర్, సుధాకర్ యాదవ్, దుర్గం భాస్కర్, ఈ.కొమురయ్య, ఎడవల్లి కృష్ణ, ఫక్రుద్దీన్, ఫిరోజ్‌ఖాన్, గడుగు గంగాధర్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, గోమాస శ్రీనివాస్, గౌరీ శంకర్, జానంపల్లి అనిరుధ్‌రెడ్డి, జెరిపేటి జయపాల్, కె.నాగేశ్వరరెడ్డి, కైలాష్ నేత, కాటం ప్రదీప్‌కుమార్ గౌడ్, కొండేటి మల్లయ్య, కోటంరెడ్డి వినయ్‌రెడ్డి, కోటూరి మానవతారాయ్, కుందూరు రఘువీరారెడ్డి, ఎం.నాగేశ్ ముదిరాజ్, ఎం.వేణుగౌడ్, ఎం.ఎ. ఫహీం, మొగల్‌గుండ్ల జయపాల్‌రెడ్డి, మహ్మద్ అబ్దుల్ ఫహీం, ఎన్.బాలు నాయక్, నర్సారెడ్డి భూపతిరెడ్డి, నూతి సత్యనారాయణ, పి.హరికృష్ణ, పి.ప్రమోద్ కుమార్, పి.రఘువీర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి, పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, ప్రేమ్‌లాల్, ఆర్.లక్ష్మణ్ యాదవ్, నర్సాపూర్ రాజిరెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, రంగినేని అభిలాశ్‌రావు, రంగు బాలలక్ష్మిగౌడ్, రాపోలు జయప్రకాశ్, ఎస్.ఎ. వినోద్‌కుమార్, సంజీవ ముదిరాజ్, సత్తు మల్లేశ్, సొంటిరెడ్డి పున్నారెడ్డి, శ్రీనివాస్ చెక్లోకర్, తాటి వెంకటేశ్వర్లు, వల్లె నారాయణరెడ్డి, వెడ్మ భొజ్జు, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, జహీర్ లలాని, భీమగాని సౌజన్యగౌడ్, లకావత్ ధన్వంతి, ఎర్రబెల్లి స్వర్ణ, గండ్ర సుజాత, గోగుల సరిత వెంకటేశ్, జువ్వాడి ఇంద్రారావు, కందాడి జ్యోత్స్న శివారెడ్డి, కోట నీలిమ, మందుముల్ల రజితారెడ్డి, మర్సుకోల సరస్వతి, పి.విజయారెడ్డి, పారిజాత నర్సింహారెడ్డి, కుచన రవళిరెడ్డి, శశికళా యాదవ్, సింగారపు ఇందిర, ఉజ్మా షకీర్ జిల్లా అధ్యక్షులు (26) : సాజిద్ ఖాన్ (ఆదిలాబాద్), పొదెం వీరయ్య (భద్రాద్రి కొత్తగూడెం), ఎన్.రాజేందర్‌రెడ్డి(హనుమకొండ), వలీయుల్లా సమీర్ (హైదరాబాద్), ఎ.లక్ష్మణ్ కుమార్ (జగిత్యాల). పటేల్ ప్రభాకర్‌రెడ్డి (జోగుళాంబ గద్వాల), కైలాశ్ శ్రీనివాస్‌రావు (కామారెడ్డి), కె.సత్యనారాయణ (కరీంనగర్), రోహిన్‌రెడ్డి (ఖైరతాబాద్), జె.భరత్‌చంద్రారెడ్డి(మహబూబాబాద్), జి.మధుసూదన్‌రెడ్డి (మహబూబ్‌నగర్), కె.సురేఖ (మంచిర్యాల), టి.తిరుపతిరెడ్డి (మెదక్), నందికంటి శ్రీధర్ (మేడ్చల్ మల్కాజ్గిరి), ఎన్.కుమారస్వామి (ములుగు), సి.వంశీకృష్ణ (నాగర్‌కర్నూల్), టి.శంకర్‌నాయక్(నల్లగొండ), శ్రీహరి ముదిరాజ్ (నారాయణపేట), ప్రభాకర్‌రెడ్డి (నిర్మల్), మానాల మోహన్‌రెడ్డి (నిజామాబాద్), ఎం.ఎస్. రాజ్‌ఠాకూర్ (పెద్దపల్లి), ఆది శ్రీనివాస్ (రాజన్న సిరిసిల్ల), టి.నర్సారెడ్డి (సిద్దిపేట), టి.రామ్మోహన్‌రెడ్డి (వికారాబాద్), ఎం.రాజేంద్రప్రసాద్ యాదవ్ (వనపర్తి), కె.అనిల్‌కుమార్ రెడ్డి (యాదాద్రి భువనగిరి) -
ఏపీ, తెలంగాణ సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ సమావేశం
-
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కరోనా మార్గదర్శకాలు
సాక్షి, న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పలు సూచనలు చేస్తూ శనివారం లేఖ రాశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి సడలింపులు ఇవ్వాలని తెలిపారు. టెస్టింగ్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్ నియమాలను పాటించాలని సూచించారు. వ్యాక్సినేషన్ ద్వారా కరోనా చైన్ సిస్టమ్‌ను విచ్ఛిన్నం చేయడం కీలకం అని లేఖలో తెలిపారు. రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని.. పరిస్థితిని నిశితంగా పరిశీలించి కార్యకలాపాలు పునఃప్రారంభించాలని సూచించారు. చదవండి: Covid Vaccine: వ్యాక్సిన్ల సేకరణ ఎలా? -
9న కమల్‌నాథన్ కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ఉద్యోగుల విభజనకు కేంద్రం నియమించిన కమల్‌నాథన్ కమిటీ ఈ నెల 9న సచివాలయంలో భేటీ కానుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కమిటీ ఏర్పడ్డప్పటి నుంచి వరుసగా ఇది 16వ సమావేశం. ఈ నెలాఖరుతో కమిటీ కాల పరిమితి ముగియనుండటంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తం 153 విభాగాలకుగాను 111 విభాగాల్లో విభజన పూర్తయింది. 6 విభాగాల ఉద్యోగుల కేటాయింపు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. మరో 32 విభాగాల్లో తాత్కాలిక కేటాయింపులు పూర్తయినప్పటికీ తుది కేటాయింపులకు మరో నెల సమయం పట్టే అవకాశముంది. ప్రధానంగా కమిటీ భేటీలో ఉద్యోగుల విభజన పూర్తి కాని శాఖలపైనే చర్చ జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
విద్యుత్ ఉద్యోగుల సమస్య పైనా చర్చలు
-
11న ఏపీ, తెలంగాణ సీఎస్ల భేటీ
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కృష్ణారావు, రాజీవ్ శర్మ త్వరలో సమావేశం కానున్నారు. ఈ నెల 11న వీరిద్దరూ భేటీకానున్నారు. శాఖల విభజన, కార్పొరేషన్ల విభజన, ఉమ్మడి సంస్థల విభజన తదితర అంశాలపై ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు చర్చిస్తారు. -
‘పట్టిసీమ’పై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నో
హైదరాబాద్: పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు తాగు, పారిశ్రామిక అవసరాల కోసం 80 టీఎంసీల నీటిని మళ్లించేందుకు వీలుగా పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1న జారీ చేసిన జీవోకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల ముఖ్య కార్యదర్శులకు, చీఫ్ ఇంజనీర్, ఇంజనీర్ ఇన్ చీఫ్, కేంద్ర జల వనరుల కమిషన్ చైర్మన్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటి మళ్లింపు కోసం జారీ చేసిన పరిపాలన అనుమతులను సవాలు చేస్తూ మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని గురువారం న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు విచారించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు తమ తమ వాదనలను వినిపించారు. ముందుగా సత్యనారాయణ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, పట్టిసీమ ఎత్తిపోతల పథకం బచావత్ అవార్డులకు విరుద్ధమని వివరించారు. పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్రం చూస్తోందని, కాబట్టి భారీ నిధులు కేటాయించి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాల్సిన అవసరం లేదని ఆయన కోర్టుకు నివేదించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఉందన్నారు. తరువాత దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, అసలు ఈ వ్యాజ్యాన్ని విచారణార్హతే లేదన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం కేవలం వరద నీటి మళ్లింపు కోసమే ఉద్దేశించిందని వివరించారు. ఈ పథకం నిర్మాణం వల్ల పిటిషనర్‌కు ఎటువంటి నష్టం కలగడం లేదన్నారు. ఎత్తిపోతల పథక నిర్మాణం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, అందువల్ల ఈ వ్యవహారంలో కోర్టుల జోక్యం తగదన్నారు. ఈ వ్యాజ్యాన్ని ఏ రకంగానూ విచారణార్హత లేదని, అందువల్ల దీనిని ఆ కారణం చేతనే కొట్టివేయాలన్నారు. ఆ తరువాత జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, గోదావరి జలాల వ్యవహారం ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉందని, కాబట్టి నీటి వినియోగానికి సంబంధించి ఎవరూ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదన్నారు. అనంతరం సత్యనారాయణ ప్రసాద్ మధ్యంతర ఉత్తర్వుల కోసం అభ్యర్థించారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించడంతో కనీసం ప్రాజెక్టు పనులు కోర్టు తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటుందనే ఉత్తర్వులనైనా ఇవ్వాలని కోరారు. అందుకు సైతం న్యాయమూర్తి నిరాకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిస్తూ విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేశారు. -
అభివృద్ధే లక్ష్యంగా విధాన రూపకల్పన:కేసీఆర్
హైదరాబాద్: అభివృద్ధే లక్ష్యంగా విధానాల రూపకల్పన చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ముఖ్య కార్యదర్శులకు చెప్పారు. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో ఈ రోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శతాబ్ధ కాలంగా తెలంగాణ ప్రజలు పడుతున్న గోసకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో విముక్తి కలిగిందన్నారు. తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలు, భవిష్యత్ ప్రణాళికలపై మనకు స్పష్టత ఉండాలని చెప్పారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత అధికార యంత్రాంగపైనే ఉందన్నారు.అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధే లక్ష్యంగా విధానాలను రూపొందిస్తారని చెప్పారు. వాస్తవాల ఆధారంగా ఎలాంటి దాపరికంలేని బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలన్నారు. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధుల విధానంలో సమూల మార్పులు రానున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రిగా పని చేసిన నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండటం సానుకూల అంశమన్నారు. భౌగోళికంగా తెలంగాణకు, హైదరాబాద్‌కు అనేక అనుకూల అంశాలు ఉన్నాయన్నారు. విద్యుత్ విషయంలో కొంత ఇబ్బంది ఉందని అంగీకరించారు. దానిని అధిగమించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. తెలంగాణలో పనిచేసే అధికారులకు గొప్ప పని సంస్కృతి ఉందని పొగిడారు.శాఖల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడపాలన్నారు. అనంతరం అన్ని శాఖల ముఖ్య కార్యదర్శలతో కలసి కేసీఆర్ భోజనం చేశారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర హాజరయ్యారు. -
ఢిల్లీకి ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మలు శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో వీరిద్దరు సమావేశం కానున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజన చెంది ఏడు నెలలు దాటినా ఇప్పటికీ ఆర్టీసీని విభజించలేదు. రాష్ట్ర విభజన జరిగినా ఆర్టీసీ ఇంకా ఉమ్మడిగా ఉన్నందున సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీని వీలైనంత త్వరగా విభజన చేయాలని ఇరు రాష్ట్రాల సీఎస్ లు మంత్రిని కోరనున్నారు. ఇదే విషయమై ఇద్దరు కార్యదర్శులు కేంద్రమంత్రితో చర్చిస్తారని సమాచారం. -
ఇక తుది నిర్ణయం మీదే!
* కేంద్రం వద్దకు చేరిన ఇరు రాష్ట్రాల పంచాయితీ * అన్ని వివాదాలను కేంద్రమే పరిష్కరించాలని ఇద్దరు సీఎస్ల వినతి * కేంద్ర హోం కార్యదర్శితో ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారుల భేటీ * కమలనాథన్, ప్రత్యూష్‌సిన్హా కమిటీలతోనూ వేర్వేరుగా సమావేశం * అన్ని అంశాలపై మరోసారి వాదనలు వినిపించిన అధికారులు * ఉద్యోగుల పంపకాలపై నోడల్ కమిటీని వేయాలని ప్రతిపాదన * ఐఏఎస్‌ల కేటాయింపును త్వరగా పూర్తి చేయాలని ఏపీ సీఎస్ విజ్ఞప్తి * ప్రోత్సాహకాలపై నిర్ణయం తీసుకోవాలన్న టీ-సీఎస్ రాజీవ్ శర్మ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన అనేక సమస్యలకు సంబంధించిన పంచాయితీ కేంద్రం వద్దకు చేరింది. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని కేంద్రానికే వదిలేయాలని ఇరు ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆయా సమస్యలపై రెండు రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు పరిశీలించి, న్యాయ సలహా మేరకు తుది నిర్ణయాన్ని వెల్లడించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులు స్పష్టం చేశారు. పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో హోం కార్యదర్శి అనిల్ గోస్వామితో ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మతోపాటు రెండు రాష్ట్రాల విద్యుత్, నీటిపారుదల, ఇంధన, ప్లానింగ్ శాఖల కార్యదర్శులు శుక్రవారం సమావేశమయ్యారు. అలాగే రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజనకు సంబంధించి ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ, అఖిల భారత సర్వీస్ అధికారుల పంపిణీపై పనిచేస్తున్న ప్రత్యూష్ సిన్హా కమిటీతోనూ ఇరువురు సీఎస్‌లు వేర్వేరుగా భేటీ అయ్యారు. ఉదయం కమల్‌నాథన్ కమిటీతో భేటీ సందర్భంగా.. ఉద్యోగుల పంపకాల తుది గడువు, దీనికి సంబంధించిన ప్రక్రియపై ఇరు రాష్ట్రాల అధికారులు మరోమారు కూలంకషంగా చర్చించారు. పోస్టులు తక్కువగా, ఉద్యోగులు ఎక్కువగా ఉన్న కొన్ని శాఖల్లో సర్దుబాటు అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఉద్యోగుల విభజనలో వచ్చే సమస్యల పరిష్కారం, ఇతర అనుమతులకు సంబంధించి ఓ నోడల్ కమిటీని వేయాలన్న ప్రతిపాదనను ఇరువురు సీఎస్‌లు కేంద్రం దృష్టికి తెచ్చారు. వివాదాలపై వాడివేడి చర్చ రాష్ర్ట విభజన చట్టంలోని అంశాల అమలులో ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముందు ఇరువురు సీఎస్‌లు తమతమ వాదనలు వివరించారు. విద్యుత్ కేటాయింపులు, నదీజలాల పంపకాలు, షెడ్యూల్ తొమ్మిది, పదిలోని ఉమ్మడి సంస్థల నిర్వహణ , ఉమ్మడి పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. కృష్ణా బోర్డు ఇచ్చిన ఏకపక్ష నోటీసుల అంశాన్ని తెలంగాణ సీఎస్ ప్రస్తావించారు. ఈ విషయంలో ఏపీ వైఖరి సరిగా లేదని, కావాలనే సమస్యలు సృష్టిస్తోందని ఫిర్యాదు చేశారు. కృష్ణా ట్రిబ్యునల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోడానికి వీల్లేదని, కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేలా చర్యలు తీసుకోవాలని రాజీ వ్‌శర్మ కోరారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 8 ప్రకారం హైదరాబాద్‌లో పోలీసు యంత్రాంగా న్ని గవర్నర్ పరిధిలోకి తేవాలని ఏపీ సీఎస్ కోరగా.. అందుకు రాజీవ్‌శర్మ అభ్యంతరం తెలి పారు. చట్టంలో అలా పేర్కొనలేదన్నారు. విద్యుత్ సమస్యలపై ప్రస్తావిస్తూ.. పీపీఏలను అమలు చేసేలా చూడాలని తెలంగాణ సీఎస్ కోరారు. ఉమ్మడి సంస్థలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం లేకుండానే ఏపీకి నిధులు మళ్లించుకున్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. దీనిపై అనిల్ గోస్వామికి ఇరువురు సీఎస్‌లు వేర్వేరుగా నివేదికలను అందజేసినట్టు సమాచారం. పదో షెడ్యుల్‌లో పేర్కొన్న సంస్థలు భౌగోళికంగా తెలంగాణలోనే ఉన్నం దున వాటి నిర్వహణ హక్కు ఏపీ ప్రభుత్వానికి ఎలా ఉంటుందని రాజీవ్ శర్మ ప్రశ్నించినట్లు సమాచారం. ఐవైఆర్ కృష్ణారావు కూడా దీనిపై తన వాదన వినిపించారు. ఇక ఉమ్మడి పరీక్షల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వ తీరు ఇబ్బం దికరంగా ఉందని కూడా ఆయన కేంద్రం దృష్టికి తెచ్చారు. విభజన చట్టంలో చెప్పిన ప్రకారం విద్యా సంస్థల్లో ప్రవేశాలను ఉమ్మడిగా చేపట్టాలని వివరించారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి వివాదాన్ని కూడా ప్రస్తావించారు. స్థూలంగా అన్ని సమస్యలపై ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని, న్యాయ సలహా మేరకు కేంద్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని ఇరువురు సీఎస్‌లు హోంశాఖ కార్యదర్శికి స్పష్టం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద ఇరు రాష్ట్రాలకు దక్కాల్సిన పలు సదుపాయాలను కేంద్రం దృష్టికి తెచ్చాం. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, వివాదాలను కూడా వివరించాం. వాటన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి చె ప్పారు’ అని ఏపీ సీఎస్ కృష్ణారావు వెల్లడించారు. చట్టంలో పేర్కొన్న అంశాలపై త్వరగా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరినట్టు టీ-సీఎస్ రాజీవ్‌శర్మ తెలిపారు. ‘తెలంగాణకు ఇచ్చే ప్రోత్సాహకాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరాం. విభజన చట్టంలోని విధానాల అమలుపై రాష్ర్టం తరఫున ప్రతిపాదనలు పంపుతాం. అదేవిధంగా ఏపీ కూడా పంపుతుంది. వీటిపై న్యాయ సలహా తీసుకుని నిర్ణయం చెప్పాలని కేంద్రాన్ని కోరాం. ఈ సమావేశాలు విజయవంతంగా కొనసాగాయి. సత్ఫలితాలు వస్తాయనుకుంటున్నాం’ అని రాజీవ్‌శర్మ పేర్కొన్నారు. కాగా, సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల విభజన అంశంపై ప్రత్యూష్ సిన్హా కమిటీతో ఇద్దరు సీఎస్‌లు భేటీ అయ్యారు. ఐఏఎస్‌ల కేటాయింపుల ఫైలును ప్రధాని నరేంద్రమోదీ తిప్పి పంపిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇరువురు సీఎస్‌లు పలు అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని, వీలైనంత త్వరగా కేటాయింపులు పూర్తి చేయాలని కమిటీని కోరారు. -
తొలిసారి ఇద్దరు సీఎస్ల ఉమ్మడి లేఖ
అఖిలభారత సర్వీసు ఉద్యోగుల విభజనపై ఆంధ్రప్రదేశ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కలిసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నారు. తొలిసారి ఇద్దరు సీఎస్‌లు కలిసి ఉమ్మడిగా లేఖ రాస్తున్నారు. ఉన్నతాధికారుల విభజన జరగకపోవడం వల్ల పాలన స్తంభించిందని, రెండు రాష్ట్రాల్లో పాలన గాడిలో పడాలంటే తక్షణమే అధికారుల విభజన జరగాలని ఆ లేఖలో చెబుతున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారుల విభజన బాగా ఆలస్యమైందని, అధికారులకు ఏవైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే వాళ్లను మినహాయించి ఎలాంటి సమస్యలు లేని వాళ్లను వెంటనే ఇరు రాష్ట్రాలకు పంపాలని రాశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు ఉమ్మడి లేఖ వెళ్లింది. రెండు మూడు రోజుల్లో ఈ లేఖ కేంద్రానికి చేరుతుంది. -
వాళ్లను వెంటనే ఇవ్వండి
అభ్యంతరాల్లేని అధికారుల విషయంలో జాప్యం వద్దు ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపుపై కేంద్రానికి ఇరు రాష్ట్రాల విజ్ఞప్తి కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ, తెలంగాణ సీఎస్ల నిర్ణయం తెలంగాణ సచివాలయంలో భేటీ, పలు అంశాలపై చర్చ కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలపై వివాదాల్లేవని ప్రకటన హైదరాబాద్: అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపులపై అభ్యంతరాలు లేని వారిని ఆయా రాష్ట్రాల కేడర్‌కు కేటాయిస్తూ తక్షణమే ఉత్తర్వులు ఇచ్చేలా కేంద్రానికి లేఖ రాయాలని ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నిర్ణయించారు. మంగళవారం తెలంగాణ సచివాలయంలో సమావేశమైన ఇద్దరు సీఎస్‌లు ఈ మేరకు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజనకు కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ ఈ నెల 22న రోస్టర్ బ్యాండ్ పద్ధతిలో అధికారులను ఇరు రాష్ట్రాలకు కేటాయించడం, ఆ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ తన వెబ్సైట్లో ఆ జాబితాను వెల్లడించిన విషయం విదితమే. ఏపీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, తెలంగాణ సీఎస్ డాక్టర్ రాజీవ్ శర్మ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకున్న సంగతి తెలిసిందే. అయితే అధికారుల పంపిణీ చివరి తేదీ వరకు ఆగాల్సిన అవసరం లేదని వీరిద్దరూ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక కేటాయింపుల వల్ల ఆయా రాష్ట్రాల్లో పనిచేయడానికి అధికారులు ఇబ్బంది పడుతున్నారని, తాజా కేటాయింపులపై అభ్యంతరాలు లేని అధికారులను ఆయా రాష్ట్రాల కేడర్‌కు ఇచ్చేలా చూడాలని కేంద్రాన్ని కోరడానికి సిద్ధమయ్యారు. లేని పక్షంలో వర్క్ టు ఆర్డర్ ఉత్తర్వులైనా ఇవ్వాలని సూచించనున్నారు. ఇక తమకు కేటాయించిన రాష్ట్రంలో పనిచేయడానికి ఇష్టపడని కొందరు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ ఎస్ అధికారులు తాము పరస్ప ర అంగీకారంతో బదిలీ అవుతామని, అందుకు అనుమతించాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పరస్పర బదిలీలు కుదరవంటూ సీఎస్‌లు వారికి స్పష్టం చేసినట్లు సమాచారం. భార్యాభర్తలను వేర్వేరు రాష్ట్రాలకు కేటాయించిన పక్షంలో మాత్రం వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలపై ఇరు రాష్ట్రాలకు ఎలాంటి వివాదాలు లేవని ఆంధ్రా సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విలేకరులతో అన్నారు. ఈ మార్గదర్శకాలపై ఇప్పటికే సంతకాలు చేసినట్లు చెప్పారు. రెండుమూడు రోజుల్లో ఇవి వెలువడనున్నట్లు, కేంద్రం ఆమోదానికి కూడా పంపనున్నట్లు సమాచారం. ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోండి వ్యవసాయ విశ్వవిద్యాలయం, సచివాలయంలో దక్షిణ ద్వారం వద్దనున్న భవనాలను ఖాళీ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మను కోరారు. అయితే ఈ విషయంలో ఆయన ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ అంశాలపై సీఎంతో చర్చించాల్సి ఉంటుందని చెప్పినట్లు సమాచారం. వ్యవసాయ విశ్వవిద్యాలయ అంశం సీఎంల స్థాయిలో పరిష్కారమైతే బాగుంటుందని రాజీవ్ శర్మ అన్నట్లు తెలిసింది. గవర్నర్ వద్ద జరిగిన ముఖ్యమంత్రుల స్థాయి సమావేశంలో నిర్ణయించిన మేరకు మరిన్ని అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సీఎస్‌లు అంగీకారానికి వచ్చారు. -
'గవర్నర్ అధికారాలపై ఇప్పుడు మాట్లాడవద్దు'
న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం ముగిసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. పీపీఏ, కృష్ణా జలాల అంశాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తమ వాదనలు వినిపించారు. ఈఆర్సీ ఆమోదించిన పీపీఏలను మాత్రమే కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ సర్కార్, కృష్ణా ట్రిబ్యునల్ నాలుగు రాష్ట్రాల వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వ సీఎస్ హోంశాఖ కార్యదర్శిని కోరారు. ఇక హైదరాబాద్‌లో గవర్నర్ అధికారాలపై ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదని హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య పలు రంగాల్లో రాజుకుంటున్న వివాదాల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించిన విషయం తెలిసిందే. -
ఇద్దరు సీఎస్‌లకు కుందన్‌బాగ్‌లో నివాసాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు గ్రీన్‌ల్యాండ్స్ కుందన్‌బాగ్‌లోని ప్రభుత్వ భవనాల్లో అధికార నివాసాలను కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత సీఎస్ మహంతి అధికార నివాసంగా ఉన్న కుందన్‌బాగ్‌లోని నంబర్ 10 భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్‌కు, అక్కడే ఖాళీగా ఉన్న నంబర్ 4 భవనాన్ని తెలంగాణ రాష్ట్ర సీఎస్‌కు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూన్ 2 నుంచి రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో ఆయా భవనాలను ఇరు రాష్ట్రాల సీఎస్ల ప్రైవేట్ కార్యదర్శులకు అప్పగించాలని చెప్పారు. -
సచివాలయంలో కీలక సమావేశం
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి ఆధ్వర్యంలో సచివాలయంలో కీలక సమావేశం జరుగుతోంది. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మహంతికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిన నేపధ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సచివాలయ విభజన, ప్రాంతల వారీగా ఫైళ్ల విభజన, విభజనకు పట్టే సమయం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ అన్ని అంశాలపై ఒక నివేదిక రూపొందించి రేపు ఉదయం మహంతి ఢిల్లీ వెళతారు. కేంద్ర హోంశాఖ రేపు సమావేశమై విభజన తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. మహంతి ఇచ్చే సమాచారం ఆధారంగా ఆ తేదీనికి ఖరారు చేస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కూడా రేపు ఢిల్లీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
ముఖ్య కార్యదర్శులను పంపండి!: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ
రాష్ట్ర విభజనకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన పలు కీలక శాఖల సమాచారాన్ని అందించేందుకు వీలుగా ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులను ఢిల్లీకి పంపాల్సిందిగా కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈనెల 25న కేంద్ర హోంశాఖ కార్యదర్శి కార్యాలయంలో జరగనున్న సమావేశానికి వీరు హాజరు కావాల్సి ఉంటుందని రాష్ట్రప్రభుత్వానికి రాసిన లేఖలో హోంశాఖ పేర్కొంది. నీటిపారుదల, రెవెన్యూ, ఆర్థికం, విద్య, హోం, ప్రణాళిక, న్యాయ, సాధారణ పరిపాలన త దితర కీలక శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో ముఖ్య కార్యదర్శులు ఆ సమావేశానికి రావాలని అందులో సూచించింది.