
సచివాలయం
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి ఆధ్వర్యంలో సచివాలయంలో కీలక సమావేశం జరుగుతోంది. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మహంతికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిన నేపధ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
సచివాలయ విభజన, ప్రాంతల వారీగా ఫైళ్ల విభజన, విభజనకు పట్టే సమయం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ అన్ని అంశాలపై ఒక నివేదిక రూపొందించి రేపు ఉదయం మహంతి ఢిల్లీ వెళతారు.
కేంద్ర హోంశాఖ రేపు సమావేశమై విభజన తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. మహంతి ఇచ్చే సమాచారం ఆధారంగా ఆ తేదీనికి ఖరారు చేస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కూడా రేపు ఢిల్లీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.