న్యూఢిల్లీ: ప్రధాని మోదీ శనివారం దేశవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన బ్లాక్‌ల అభివృద్ధి కోసం ఉద్దేశించిన అభిలషణీయ బ్లాక్ పథకం(అస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం)ను ప్రారంభించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి పథకంలో మాదిరిగానే ఈ కార్యక్రమంలో కూడా భారత్ అభివృద్ధికి నాలుగు స్తంభాలైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(మౌలికరంగం), ఇన్వెస్ట్‌మెంట్(పెట్టుబడి), ఇన్నోవేషన్(ఆవిష్కరణ), ఇంక్లూజన్(సమ్మిళితం)లపైనే దృష్టి సారించాలన్నారు.
రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల రెండో జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని శనివారం ప్రసంగించారు. ప్రపంచ సప్లై చైన్‌ను స్థిరతను సాధించేందుకు దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయన్నారు. ఇందుకోసం చిన్న, మధ్య శ్రేణి పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ విషయంలో రాష్ట్రాలే చొరవచూపాలన్నారు. అసంబద్ధ అనుమతులు, కాలం చెల్లిన చట్టాలు, నిబంధనలను పక్కనబెట్టాలని చీఫ్ సెక్రటరీలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment