
జమ్మూ: దేశాన్ని మత ప్రాతిపదికన విడదీయవద్దని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మోదీ ప్రభుత్వాన్ని కోరారు. ‘‘దేశంలోని 24 కోట్ల ముస్లింలను ఏం చేయాలనుకుంటున్నారు? సముద్రంలోకి విసిరేస్తారా? లేక చైనాకు పంపిస్తారా?’’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు.
ప్రతి ఒక్కరూ సమానాకాశాలను పొందగలిగే రామరాజ్యం కావాలన్నారు. జమ్మూ కశ్మీర్‌లో తొందరగా ఎన్నికలు జరపాలని, రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ఈసీని కలిసి కోరాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు.