Religious basis
-
విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కన్నెర్ర
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కన్నెర్రజేసింది. రాజకీయ నాయకులు మతాన్ని రాజకీయాలకు వాడుకోవడం ఆపినప్పుడే వాటికి అడ్డుకట్ట పడుతుందని పేర్కొంది. ‘‘దేశం ఎటు పోతోంది? విద్వేష ప్రసంగాలు ఓ విషవలయం. రాజకీయాలను మతంలో కలపడం పెను సమస్యకు దారి తీస్తోంది. విచ్ఛిన్న శక్తులే ఇందుకు పాల్పడుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం తక్షణం ఓ మార్గం చూడాలి’’ అని న్యాయమూర్తులు కె.ఎం.జోసెఫ్, బి.వి.నాగరత్న ధర్మాసనం బుధవారం అభిప్రాయపడింది. ఇటీవలి తీర్పులోనూ సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని నొక్కిచెప్పిందని గుర్తు చేసింది. ‘‘టీవీల్లో, మీడియాలో, బహిరంగ వేదికలపై రోజూ ఇలాంటి శక్తులు ఇతరులపై విద్వేష వ్యాఖ్యలకు పాల్పడుతూనే ఉన్నాయి. ఎంతమందిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టగలం? తోటివారిపై, సామాజిక వర్గాలపై విద్వేష వ్యాఖ్యలు చేయబోమని ప్రజలే ప్రతినబూనితే బాగుంటుంది’’ అని సూచించింది. దివంగత ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పేయి వంటివారి ప్రసంగాలు ఎంతో హుందాగా ఉండేవంటూ గుర్తు చేసింది. వాడీవేడి వాదనలు.. ‘‘విద్వేష ప్రసంగాలపై సకాలంలో చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిస్తేజంగా మారాయి. అందుకే కోర్టులకు పని పడుతోంది’’ అంటూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలా మౌనంగా ఉండే పక్షంలో ప్రభుత్వాల ఉనికికి అర్థమేముందని ప్రశ్నించింది? రాష్ట్రాల సంగతేమో గానీ ఈ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వానికి వర్తించవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. కేరళ, తమిళనాడుల్లో నేతల విద్వేష ప్రసంగాల ఉదంతాలను కూడా ఈ పిటిషన్‌తో కలిపి విచారించాలని కోరారు. వాటికి సంబంధించిన వీడియో క్లిప్‌ల ప్రదర్శనకు అనుమతించాలని కోరడంతో దీన్నో డ్రామాగా మార్చొద్దని ధర్మాసనం పేర్కొంది. ‘‘దేనికైనా ఓ పద్ధతుంటుంది. మేం వీడియో క్లిప్‌లు చూడాలని మీరు భావిస్తే దాన్ని మీ పిటిషన్లో చేర్చండి’’ అని సూచించింది. విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. -
24 కోట్ల ముస్లింలను చైనాకు పంపిస్తారా?
జమ్మూ: దేశాన్ని మత ప్రాతిపదికన విడదీయవద్దని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మోదీ ప్రభుత్వాన్ని కోరారు. ‘‘దేశంలోని 24 కోట్ల ముస్లింలను ఏం చేయాలనుకుంటున్నారు? సముద్రంలోకి విసిరేస్తారా? లేక చైనాకు పంపిస్తారా?’’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ సమానాకాశాలను పొందగలిగే రామరాజ్యం కావాలన్నారు. జమ్మూ కశ్మీర్లో తొందరగా ఎన్నికలు జరపాలని, రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ఈసీని కలిసి కోరాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. -
Satyendar Jain: ఆప్ మంత్రికి మరో దెబ్బ
సాక్షి, ఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ కుమార్ జైన్‌కు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆయన బెయిల్ అభ్యర్థనలు తిరస్కణకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. శనివారం ఆయనకు మరో చేదు అనుభవం ఎదురైంది. జైల్లో మత విశ్వాసాలకు తగ్గట్లుగా ఆహారం తీసుకునేట్లు తనను అనుమతించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రత్యేక ఆహారం అందించాల్సిందిగా తీహార్ జైలు అధికారులను ఆదేశించాలన్న ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. తీహార్ జైలులో మంత్రి జైన్‌కు సరైన ఆహారం, వైద్య సదుపాయాలు అందడం లేదని, ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా జైలు అధికారులను ఆదేశించాలంటూ కూడా ఆ అభ్యర్థన పిటిషన్ పేర్కొంది. అయితే.. ప్రత్యేక న్యాయవాది వికాస్ ధూల్ ఆ పిటిషన్‌ను తిరస్కరించారు. మే 31వ తేదీన జైన్ అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన జైన్ టెంపుల్‌కు వెళ్లలేదు. జైన మత విశ్వాసాలను నికచ్ఛిగా పాటించే సత్యేందర్ కుమార్ జైన్.. అందుకు తగ్గట్లుగా ఆహారం తీసుకోలేకపోతున్నారు అని ఆయన తరపున పిటిషన్ దాఖలైంది. కానీ, జైలు అధికారులు మాత్రం ఆ డిమాండ్‌ను అంగీకరించలేదు. ఒక ఖైదీని ప్రత్యేకంగా చూడడం వీలు కాదని, ఖైదీలందరికీ కుల, మతాలకు అతీతంగా ఒకేరకమైన ఆహారం అందిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో పోలీసులతో ఏకీభవించిన స్పెషల్ జడ్జి వికాస్.. సత్యేందర్ జైన్ పిటిషన్‌ను కొట్టేశారు. ఇక.. 2017లో ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు వ్యతిరేకంగా సీబీఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఆయనకు సంబంధించిన నాలుగు కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఈ ఏడాది మే చివరన ఆయన్ని అరెస్ట్ చేసి.. తీహార్ జైలుకు తరలించారు. నవంబర్ 17వ తేదీన ఆయనతో ఈ కేసులో అరెస్ట్ అయిన మరో ఇద్దరికీ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. -
ముఖ్యమైన వాళ్లు
మీకు తెలిసిన కథే. ఒక వైద్యుడు, ఒక న్యాయవాది, ఒక మతబోధకుడు, ఒక చిన్నపిల్లవాడు ఓ చిన్న విమానంలో ప్రయాణిస్తున్నారు. అనూహ్యంగా విమానంలో ఏదో లోపం తలెత్తింది. లోపల ఉండే నిపుణులు ప్రయత్నించారు కానీ మరమ్మతు చేయలేకపోయారు. చివరికి పైలట్ నుంచి ప్రకటన వెలువడింది. ‘‘నన్ను క్షమించండి. నా చేతుల్లో ఏమీ లేకుండా పోయింది’’ అని చెప్తూనే ప్యారాచ్యూట్ నుంచి కిందికి దూకేశాడు. దురదృష్టవశాత్తూ విమానంలో ఇంకా మూడు మాత్రమే ప్యారాచ్యూట్లు మిగిలి ఉన్నాయి. వెంటనే వైద్యుడు ఒక ప్యారాచ్యూట్ అందుకున్నాడు. ‘‘నా జీవితం చాలా ముఖ్యమైనది. నేను బతికి ఉండడం చాలా ముఖ్యం. నేను బతికి ఉంటే నా జీవితకాలంలో అనేకమందిని నా వైద్యంతో బతికించవచ్చు’’ అని చెప్పి విమానం నుంచి కింది దూకేశాడు. రెండో ప్యారాచ్యూట్ను న్యాయవాది లాగేసుకున్నాడు. ‘‘నేను తెలివైన వాడిని. నా వంటి తెలివైన వాడు లోకానికి అవసరం’’ అని నిముషం కూడా ఆలస్యం చేయకుండా దడేల్మని కింది దూకేశాడు. ఇక మిగిలింది ఒకటే ప్యారాచ్యూట్. మిగిలినవారు ఆ పిల్లవాడు, ఆ మత బోధకుడు. ‘‘త్వరగా ఆ ప్యారాచ్యూట్ తీసుకుని కిందికి దూకెయ్. నేను ఎంతో జీవితాన్ని గడిపాను. నువ్వు చిన్నపిల్లవాడివి నీకింకా చాలా జీవితం ఉంది. నువ్వు బతకాలి, దూకెయ్’’ అని తొందరపెట్టాడు మతబోధకుడు. ఆ బాలుడు మత బోధకునికి ప్యారాచ్యూట్ ఇచ్చి, ‘‘మీరూ దూకేయొచ్చు ఫాదర్. ఇంతక్రితం ఆ న్యాయవాది తీసుకెళ్లింది ప్యారాచ్యూట్ కాదు, నా లెదర్ బ్యాగ్’’ అని చెప్పాడు. తెలివైనవాళ్లమని, ప్రపంచానికి ముఖ్యులం అని అనుకుంటూ తిరిగేవాళ్లు చాలాసార్లు తమను తాము తెలుసుకోవడంలో తప్పటడుగు వేస్తారు. (కథ కోసం ఇందులో కొన్ని వృత్తులను పేర్కొడం జరిగింది తప్ప, ఎవరినీ వేలెత్తి చూపాలన్న ఉద్దేశం లేదు) -
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు సరికాదు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సాక్షి, న్యూఢిల్లీ: మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం ఆమోదయోగ్యం కాదని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. లౌకిక దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు ఆస్కారం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు పేర్కొన్నారు. తెలంగాణలోని ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని శాసనసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంపై మురళీధర్‌రావు స్పందించారు. ‘‘తమిళనాడులో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన పద్ధతులలోనే రాష్ట్రంలోని ముస్లింలకు కూడా 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం ఆమోదయోగ్యం కాదు’’ అని మురళీధర్ రావు గురువారం సోషల్ మీడియా ట్వీటర్లో చెప్పారు.