jammu kashmir elections
-
నేను జైలులో ఉన్నప్పుడు.. వాళ్లు తోలు బొమ్మలు: ఇంజనీర్ రషీద్
శ్రీనగర్: బీజేపీ అనుకూల వ్యక్తిగా తనపై వస్తున్న ఆరోపణలను అవామీ ఇత్తెహాద్ పార్టీ(ఏఐపీ) చీఫ్, బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ (షేక్ అబ్దుల్ రషీద్) ఖండించారు. సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు ప్రధాని మోదీ ‘నయా కశ్మీర్’ విధానాల వల్ల ప్రజల్లో కలిగిన అసంతృప్తికి నిదర్శరనమని అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.‘‘నాపై బీజేపీ అనుకూల వ్యక్తిని అనే ఆరోపణలు చేయటం చాలా సిగ్గుచేటు. ఇలాంటి ఆరోపణలు చేసినవాళ్లు సిగ్గుపడాలి. నేను ఒక్కడినే బీజేపీ చేతిలో బలిపశువును అయ్యాను. ఆర్టికల్ 370 రద్దు సమయంలో ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలను కొన్ని నెలల పాటు గృహనిర్బంధంలో ఉంచారు. కానీ, నేను మాత్రం తిహార్ జైల్లో ఉన్నా. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఒమర్ అబ్దుల్లా , పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)కి చెందిన మెహబూబా ముఫ్తీలు ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత జమ్ము కశ్మీర్ ప్రజలను ఏకం చేయటంలో విఫలమయ్యారు. కశ్మీర్ ప్రజలు దృష్టిలో ఒమర్ అబ్దుల్లా.. మహాత్మా గాంధీ లేదా సుభాష్ చంద్రబోస్ కాలేదు. మెహబూబా ముఫ్తీ రజియా సుల్తాన్ లేదా మయన్మార్‌కు చెందిన ఆంగ్ సాన్ సూకీ కాలేకపోయారు. తోలుబొమ్మలు, రబ్బరు స్టాంపులుగా మిగిలి పోయారు.2019లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన ఆరోపణలపై రషీద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. జమ్ము కశ్వీర్ ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబర్ 10న తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు ఆయను అక్టోబర్ 2 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలో రషీద్ ఒమర్ అబ్దుల్లాపై విజయం సాధించారు.చదవండి: ఎన్నికల వేళ.. హర్యానా బీజేపీలో ట్విస్ట్! -
24 కోట్ల ముస్లింలను చైనాకు పంపిస్తారా?
జమ్మూ: దేశాన్ని మత ప్రాతిపదికన విడదీయవద్దని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మోదీ ప్రభుత్వాన్ని కోరారు. ‘‘దేశంలోని 24 కోట్ల ముస్లింలను ఏం చేయాలనుకుంటున్నారు? సముద్రంలోకి విసిరేస్తారా? లేక చైనాకు పంపిస్తారా?’’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ సమానాకాశాలను పొందగలిగే రామరాజ్యం కావాలన్నారు. జమ్మూ కశ్మీర్లో తొందరగా ఎన్నికలు జరపాలని, రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ఈసీని కలిసి కోరాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. -
సాగు సంక్షోభం .. నిరుద్యోగం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ ఎన్నికలు, నిరుద్యోగం, సాగు సంక్షోభం, కరువు, పత్రికా స్వేచ్ఛ వంటి అంశాలను ఆదివారం నాటి అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా లేవనెత్తింది. జమ్మూ కశ్మీర్లో త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ఒకరోజు ముందు కేంద్రం నిర్వహించిన ఈ భేటీలో.. ఈ అంశాలన్నిటినీ పార్లమెంటులో చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇది ఇప్పటికీ ఒక సైద్ధాంతిక పోరాటమేనని కాంగ్రెస్ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్, కాంగ్రెస్ ఎంపీలు అధీర్ రంజన్ చౌదరి, కె.సురేష్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రీన్ తదితరులు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని కూడా విపక్షాలు గట్టిగా ప్రస్తావించాయి. కాగా ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని టీఎంసీ నేతలు సుదీప్ బంద్యోపాధ్యాయ్, ఒబ్రీన్లు నొక్కిచెప్పారు. అదే సమయంలో సమాఖ్యవాదం బలహీనపడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ..రాష్ట్రాలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడం ఆమోదనీయం కాదని విపక్షాలు స్పష్టం చేశాయి. ‘అధికారంలోకి వచ్చినందుకు ప్రభుత్వాన్ని అభినందించాం. ఇది సైద్ధాంతిక పోరాటం, గతంలోనూ సైద్ధాంతిక పోరాటమే. సైద్ధాంతిక పోరాటంగానే ఉంటుంది కూడా..’ అని ప్రభుత్వానికి చెప్పినట్లు సమావేశం తర్వాత ఆజాద్ విలేకరులకు తెలిపారు. లౌకిక శక్తులకు కాంగ్రెస్ పార్టీ పునాది వంటిదని, ప్రభుత్వంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఆ స్ఫూర్తిని సజీవంగా ఉంచేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. అధికారంలో లేకపోయినా రైతులు, కార్మికులు, మహిళల అభ్యున్నతికి కృషి కొనసాగిస్తామని అన్నారు. దేశంలో భారీ నిరుద్యోగిత, కరువు పరిస్థితులు, సాగు సమస్యలు, తాగునీటి కొరత వంటి అంశాలపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ‘పత్రికా స్వేచ్ఛ గురించి కూడా లేవనెత్తాం. జర్నలిస్టుల విషయంలో అధికార పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరును ప్రస్తావించాం. వారిని కొడుతున్నారు. వారి గొంతును అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని ఖండిస్తూ ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాం..’ అని ఆజాద్ తెలిపారు. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన అవసరం లేదని, త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించగలిగినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించకూడదన్నారు. ఎన్నికలకు రాష్ట్రాల నిధులు, బ్యాలెట్ పేపర్ల వంటి ఎన్నికల సంస్కరణలను టీఎంసీ లేవనెత్తింది. ప్రతిదానికీ ఆర్డినెన్సును ఉపయోగించడాన్ని కూడా టీఎంసీ ప్రస్తావించింది. దురదృష్టవశాత్తూ 16వ లోక్‌సభలో గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దానిని మితిమీరి ఉపయోగించారని బంద్యోపాధ్యాయ, ఒబ్రీన్ చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వి. విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు అఖిలపక్ష భేటీలో పాల్గొన్నారు. అఖిలపక్ష భేటీ ఫలప్రదం: మోదీ ‘ఎన్నికల ఫలితాల తర్వాత, పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఒక ఫలప్రదమైన అఖిలపక్ష భేటీ జరిగింది. విలువైన సూచనలిచ్చిన నేతలకు కృతజ్ఞుడినై ఉంటా’ అంటూ అఖిలపక్ష భేటీ అనంతరం మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం, అలాగే ఎన్డీయే భేటీ ఆదివారం ఢిల్లీలో జరిగాయి. బడ్జెట్, ట్రిపుల్ తలాక్ ప్రభుత్వ ప్రధాన ఎజెండా పదిహేడవ లోక్‌సభ మొదటి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర బడ్జెట్‌కు ఆమోదం, ట్రిపుల్ తలాక్ వంటి ఇతర కీలక చట్టాలు ప్రభుత్వ ఎజెండాలో అగ్రభాగాన ఉండనున్నాయి. మొదటి రెండురోజులు సభ్యుల ప్రమాణ స్వీకారానికి వినియోగిస్తారు. 19న స్పీకర్ ఎన్నిక ఉంటుంది. మరుసటి రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జూలై 5న బడ్జెట్ ప్రవేశ పెడతారు. 26 వరకు సమావేశాలు కొనసాగుతాయి. జూన్ 20 నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు ఏపీ ఎంపీల ప్రమాణస్వీకారం సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సోమ, మంగళవారాల్లో లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ వీరితో ప్రమాణం చేయిస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన ఎంపీల ప్రమాణస్వీకారం సోమవారం మధ్యాహ్నానికి పూర్తికానుంది. అక్షర క్రమంలో మొదటగా అండమాన్ నికోబార్ ఎంపీలు, తర్వాత ఏపీ ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. తెలంగాణ ఎంపీలు మంగళవారం ప్రమాణం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికెన వైఎస్సార్సీపీ ఎంపీలందరూ సోమవారం ఉదయం వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నివాసంలో భేటీ కానున్నారు. -
పీడీపీకి నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు!!
-
పీడీపీకి నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు!!
జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు బీజేపీకి మద్దతు ఇస్తోందనుకున్న నేషనల్ కాన్ఫరెన్స్.. ఉన్నట్టుండి ఇప్పుడు పీడీపీకి మద్దతిస్తామని ముందుకొచ్చింది. 87 స్థానాలున్న జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో పీడీపీ 28 స్థానాలు, బీజేపీ 25 స్థానాలు సాధించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీతో అధికారాన్ని పంచుకున్న నేషనల్ కాన్ఫరెన్స్ కేవలం 15 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. పీడీపీకి ఇప్పటికే 28 స్థానాలు ఉండటంతో నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతిస్తే వారి బలం 43 అవుతుంది. కానీ, కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన సాధారణ మెజారిటీ 44. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలిచినా, వాళ్లలో అత్యధికులు బీజేపీ రెబల్సే. వాళ్లు బీజేపీ నేతృత్వంలోని సర్కారుకు మద్దతివ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో పీడీపీ - నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఎలా ఉంటాయో చూడాలి మరి. -
విజయానందం.. ఏకే47తో గాల్లోకి కాల్పులు
రాజకీయ నాయకులకు ఉత్సాహం వచ్చిందంటే పట్టలేం. తాజాగా ఎన్నికల ఫలితాలు వచ్చిన జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో కూడా ఇలాగే జరిగింది. పీడీపీ తరఫున పోటీచేసి.. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను సోనావార్ స్థానం నుంచి ఓడించిన అష్రఫ్ మీర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. తన విజయ సంబరాల్లో ఏకంగా ఏకే 47 తుపాకి తీసుకుని.. గాల్లోకి కాల్పులు జరిపారు. ఆయన ఇంటి ఎదుట మద్దతుదారులు గుమిగూడి.. మీర్‌ను అభినందించిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఒమర్ అబ్దుల్లాను 4వేల ఓట్ల తేడాతో ఓడించడంతో కాశ్మీర్లో ఇప్పుడు ఆయనను అంతా జెయింట్ కిల్లర్ అంటున్నారు. అయితే.. ఇప్పుడు ఆయన కాల్పులు జరిపిన ఏకే 47 తుపాకి ఆయనదేనా, లేక భద్రతా సిబ్బందిదా అనే విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. తాను గెలిచి తీరుతానన్న నమ్మకం ముందునుంచి తనకుందని, ఒమర్ అబ్దుల్లా తన శక్తి మేరకు ప్రయత్నిస్తే.. తాను తన శక్తి మేరకు ప్రయత్నించానని గెలిచిన తర్వాత అష్రఫ్ మీర్ చెప్పారు. 15 ఏళ్లుగా ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ రాజ్యమేలుతున్నా.. తాము గెలిచి చూపించామని తెలిపారు. -
జమ్ముకాశ్మీర్‌లో 71% ఓటింగ్ నమోదు
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. తొలిదశలో లాగే, ఉగ్రవాదుల హెచ్చరికలను పూర్తిగా పక్కన పెట్టి.. రెండో దశలో కూడా 71 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రెండోదశ పోలింగ్ మంగళవారం ప్రారంభం అయినప్పుడు మొదట్లో కాస్త పల్చగా ఉంది. కానీ, కాస్త ఎండ ముదిరేకొద్దీ ఓటర్లు బారులు తీరారు. దక్షిణ కాశ్మీర్‌లోని దేవ్సర్, హొమేషలీబగ్, నూరాబాద్, కుల్గం నియోజకవర్గాల్లో మొదట్లో ఓటింగ్ కాస్త పల్చగానే ఉంది. హంద్వారా పట్టణంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో పురుషులు, మహిళలు బారులు తీరారు. మార్పు కోసమే తాము ఓట్లు వేసినట్లు చాలామంది ఓటర్లు తెలిపారు. సైనికులు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన భద్రత కల్పించారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ 80 శాతం వరకు కూడా నమోదైనట్లు ఈసీ వర్గాలు చెప్పాయి. పూంఛ్, కుప్వారా లాంటి సరిహద్దు ప్రాంతాల్లో 78, 68 శాతం చొప్పున ఓట్లు పడ్డాయి. -
జమ్ము కాశ్మీర్లో 70% దాటిన పోలింగ్!
ఉత్తర కాశ్మీర్లో రెండుచోట్ల బాంబులు పేలాయి. అయినా, తొలిసారిగా జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ దాటింది. తొలి విడతలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఈ రికార్డు స్థాయి పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. మంగళవారం పోలింగ్ ముగిసే సమయానికి సుమారు 70% పోలింగ్ రికార్డయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓ నియోజకవర్గంలో అయితే కనిష్ఠంగా కేవలం వెయ్యి ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆ స్థితి నుంచి క్రమంగా బయటపడి.. ఇప్పుడు 70% పోలింగ్ నమోదుచేసే స్థితికి జమ్ము కాశ్మీర్ చేరుకుంది. ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గంలోని ఎనిమిది మంది మంత్రులు సహా మొత్తం 132 మంది అభ్యర్థులు తొలిదశలో పోటీపడ్డారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం చలి కారణంగా పోలింగ్ కొంత మందగించినా, మధ్యాహ్నానికి బాగా పుంజుకుంది. బండిపురా ప్రాంతంలో ఓ పోలింగ్ కేంద్రం బయట బాంబు పేలింది. అలాగే ఇదే ప్రాంతంలో మరోచోట కూడా మధ్యాహ్నం ఇంకో బాంబు పేలింది. అయినా.. ఓటర్లు మాత్రం చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో ఓట్లు వేసేందుకు ముందుకొచ్చారు. -
కూతురి పెళ్లినే అప్పుగా పేర్కొన్న అభ్యర్థి!
కూతురు అంటే గుండెల మీద కుంపటి అనుకునే కాలం పోయినా.. ఇప్పటికీ కొంతమంది అలాగే భావిస్తున్నారు. జమ్ము కాశ్మీర్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మహ్మద్ యూసుఫ్ భట్ అనే అభ్యర్థి తన ఎన్నికల అఫిడవిట్లో కూతురి పెళ్లినే తనకున్న 'అప్పు'గా పేర్కొన్నారు. ఈయన గండేర్బల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈయన అఫిడవిట్ విషయం ఒక్కసారిగా బయట గుప్పుమనడంతో తప్పు సరిదిద్దుకునే ప్రయత్నాల్లో పడ్డారు. తాను నిరక్షరాస్యుడినని, తన సహచరులు ఎవరో ఈ నామినేషన్ పత్రాలను దాఖలుచేశారని, అప్పుడే ఈ పొరపాటు దొర్లి ఉండొచ్చని చెబుతున్నారు. తన ఆలోచనలను సరిగా అర్థం చేసుకోలేక ఇలా చేసి ఉంటారన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందే ఎన్సీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి దూకిన భట్‌కు.. ఈ సంఘటన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం కూడా గట్టిగానే తలంటినట్లు తెలిసింది.