
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోదీ మాసాంతపు ‘ఆలిండియా రేడియో’ప్రాసంగిక కార్యక్రమం మన్ కీ బాత్ 100 ఎపిసోడ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ జాతీయ సదస్సు నిర్వహించనుంది. దీన్ని బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రారంభించనున్నారు.
ఈ సదస్సులో నాలుగు ప్రత్యేకచర్చా కార్యక్రమాలుంటాయి. వీటిలో నటులు అమీర్ ఖాన్, రవీనాటాండన్, తెలంగాణ నుంచి నిఖత్ జరీన్, పూర్ణ మలావత్‌లతో పాటు మన్ కీ బాత్‌లో ప్రధాని ప్రస్తావించిన 100 మందికి పైగా ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. ‘మన్ కీ బాత్’100 ఎపిసోడ్‌లకు గుర్తుగా పోస్టల్ స్టాంప్, నాణేలను హోంమంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు.