
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ చేరుకున్నారు. కాశ్మీర్‌లో ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రధాని మోదీ.. సౌదీ అరేబియా పర్యటన అర్థాంతరంగా ముగించుకుని భారత్‌కు పయనమయ్యారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీని కలిసి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రస్తుత పరిస్థితి వివరించారు. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ చర్చించనున్నారు.
ఇక, ఢిల్లీ చేరుకున్న వెంటనే ప్రధాని మోదీ.. ఎయిర్‌పోర్టులోనే కశ్మీర్ ఉగ్రదాడిపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశానికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

నేడు పహల్గాంకు అమిత్ షా
ఘటనాస్థలాన్ని సందర్శించాలన్న ప్రధాని మోదీ ఆదేశంతో హోంమంత్రి అమిత్ షా హుటాహుటిన మంగళవారం రాత్రి శ్రీనగర్‌కు చేరుకున్నారు. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. ఆయన వెంట జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా కూడా ఉన్నారు. బుధవారం అమిత్ షా పహల్గాంకు వెళ్లనున్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యపై భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ. వాన్స్ సహా పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Prime Minister Narendra Modi arrives in Delhi after cutting short his Saudi Arabia visit in view of the #PahalgamTerroristAttack in Kashmir.
NSA Ajit Doval accompanies him.
(Source - ANI/DD) pic.twitter.com/PeA7CWRAes— ANI (@ANI) April 23, 2025