అఖిలభారత సర్వీసు ఉద్యోగుల విభజనపై ఆంధ్రప్రదేశ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కలిసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నారు. తొలిసారి ఇద్దరు సీఎస్లు కలిసి ఉమ్మడిగా లేఖ రాస్తున్నారు. ఉన్నతాధికారుల విభజన జరగకపోవడం వల్ల పాలన స్తంభించిందని, రెండు రాష్ట్రాల్లో పాలన గాడిలో పడాలంటే తక్షణమే అధికారుల విభజన జరగాలని ఆ లేఖలో చెబుతున్నారు.
ఇప్పటికే ఉన్నతాధికారుల విభజన బాగా ఆలస్యమైందని, అధికారులకు ఏవైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే వాళ్లను మినహాయించి ఎలాంటి సమస్యలు లేని వాళ్లను వెంటనే ఇరు రాష్ట్రాలకు పంపాలని రాశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు ఉమ్మడి లేఖ వెళ్లింది. రెండు మూడు రోజుల్లో ఈ లేఖ కేంద్రానికి చేరుతుంది.
తొలిసారి ఇద్దరు సీఎస్ల ఉమ్మడి లేఖ
Published Sat, Oct 11 2014 12:38 PM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM
Advertisement