ఢిల్లీకి ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు | ap, ts chief secretaries went to delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి వెళ్లిన ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు

Published Fri, Jan 16 2015 11:42 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

ap, ts chief secretaries went to delhi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మలు శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు.  కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో వీరిద్దరు సమావేశం కానున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజన చెంది ఏడు నెలలు దాటినా ఇప్పటికీ ఆర్టీసీని విభజించలేదు.

రాష్ట్ర విభజన జరిగినా ఆర్టీసీ ఇంకా ఉమ్మడిగా ఉన్నందున సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీని వీలైనంత త్వరగా విభజన చేయాలని ఇరు రాష్ట్రాల సీఎస్ లు మంత్రిని కోరనున్నారు.  ఇదే విషయమై ఇద్దరు కార్యదర్శులు కేంద్రమంత్రితో చర్చిస్తారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement