
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వవైభవం తెచ్చేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ముందుకు సాగుతున్నారు. కాగా, రాహుల్ యాత్ర ప్రస్తుతానికి ఏపీకి చేరుకుంది. ఇక, అక్టోబర్ 23న భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి చేరుకోనుంది.
ఈ తరుణంలో తెలంగాణలో భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై ఇందిరా భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ తీరుపై వేణుగోపాల్ అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. యాత్రకు సంబంధించి ఎక్కడా కూడా హోర్డింగ్స్, ఫ్లెక్సీలు లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.
దీంతో, తేరుకున్న టీపీసీసీ దిద్దుబాటు చర్యలు దిగింది. కేసీ వేణుగోపాల్ హెచ్చరికలతో టీపీసీసీలో కదిలిక వచ్చినట్టు తెలుస్తోంది. భారత్ యాత్ర ఏర్పాట్లపై 10 రకాల కమిటీలను వేసేందుకు పార్టీ సమాయత్తం అయినట్టు సమాచారం. శుక్రవారం సాయంత్రానికి కమిటీల గురించి టీపీసీసీ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ కమిటీల్లో ముఖ్యంగా అలంకరణ కమిటీ, ట్రాఫిక్ అండ్ పార్కింగ, మౌలిక వసతులు, పబ్లిక్ మొబిలైజేషన్, మీడియా మేనేజ్‌మెంట్ కమిటీలు ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ కమిటీలో కాంగ్రెస్ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment