
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతను ఎన్నుకొనే బాధ్యతను ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పగించారు. ఇందుకోసం రాహుల్ ఏకగ్రీవ తీర్మానం చేయాలని, ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలంగాణ పీసీసీ నాయకులంతా కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఆయన గురువారం అసెంబ్లీ పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీఎల్పీ నేతను ఎన్నుకునేందుకు రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు పీసీసీ కోర్‌కమిటీ, సీనియర్ నేతలతో తాను సమావేశమయ్యానని తెలిపారు. సీనియర్ నేతల అభిప్రాయం మేరకు సీఎల్పీ నేత ఎన్నిక ఉంటుందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment