ఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ సారించింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో శనివారం సాయంత్రం నుంచి కీలక భేటీ జరుగుతోంది. ఈ భేటీలో రాహుల్ గాంధీ, దీపాదాస్ మున్షీలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు ఖాళీగా ఉన్న మంత్రి పదవులపైనా ఈ భేటీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన వెలువడవచ్చని సమాచారం. ఈ భేటీకి ముందు..
టీపీసీసీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. అంతకు ముందు.. శనివారం మధ్యాహ్నాం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులో భాగంగానే ఈ వరుస భేటీలనేది స్పష్టమవుతోంది.
సంక్రాంతిలోపు నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేసి తీరతామని సీఎం రేవంత్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్లారాయన. ఇక.. ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహణకు రంగం సిద్ధమైన నేపథ్యంలో.. అభ్యర్థుల ఎంపికపైనా ఆయన అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment