
ఢిల్లీ ; తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎంఎల్‌సీ అభ్యర్థుల ఖరారు అంశం తుది దశకు వచ్చింది ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదివారం భేటీ అయ్యారు. వీరిద్దరూ గంటన్నర పాటు సమావేశమై తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేశారు. దీనిలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలతో వీరు ఫోన్ లో మాట్టాడారు. ఏ క్షణంలోనైనా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ్ ల చర్చలు పూర్తి చేశారు. ఎమ్మెల్సీ బరిలో ఓసీ వర్గం నుంచి పరిశీలను నరేందర్ రెడ్డి, కుసుమ కుమార్, కుమార్ రావ/ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, బీసీల నుండి ఇరపత్రి అనిల్, కొనగాల మహేష్, జెర్సీటీ జైపాల్, గాలి అనిల్ లు పరిశీలనలో ఉన్నాయి. ఇక ఎస్సీల నుండి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మడి సాంబయ్య, రాచమల్లు సిద్దేశ్వర్ పేర్లు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment