mla quota mlcs
-
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ కు నేడే చివరిరోజు
-
కాంగ్రెస్ మార్క్ సెలక్షన్!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ మార్కు స్పష్టంగా కనిపించింది. ఎవరూ ఊహించని విధంగా భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావుకు అవకాశం ఇచ్చింది. వెంకట్‌తో పాటు ముందు నుంచీ ఊహిస్తున్న విధంగానే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ను మరో అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. బల్మూరి వెంకట్ ఓసీ (వెలమ) వర్గానికి చెందిన వారు కాగా, మహేశ్‌కుమార్ బీసీ (గౌడ) వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. తొలుత బల్మూరితో పాటు దళిత నాయకుడు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు ఖరారైందనే వార్తలు వెలువడ్డాయి. నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాల్సిందిగా చెప్పిందని కూడా ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఝలక్ ఇచ్చింది. గవర్నర్, స్థానిక సంస్థలు, గ్రాడ్యుయేట్స్ కోటా ఎమ్మెల్సీ పదవులను ఎస్సీ, మైనార్టీ వర్గాలకు కేటాయిస్తారని తెలుస్తోంది. మొదట్నుంచీ పార్టీకి విధేయుడు ఎన్నికైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అతి తక్కువ వయసులో ఎమ్మెల్సీ అయిన నేతగా బల్మూరి వెంకట్ రికార్డు సృష్టించనున్నారు. ఇక ఆయన ఎంపికకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వెంకట్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. విద్యార్థి స్థాయి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఖచ్చితంగా భవిష్యత్ ఉంటుందన్న సంకేతాలు పంపడంలో భాగంగానే వెంకట్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారనే చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో పాలు పంచుకున్న పలువురు నేతలకు కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యత కల్పించిందని, అందులో భాగంగా వెంకట్‌కు ఈ ప్రాధాన్యత లభించిందని చెబుతున్నారు. మరోవైపు పార్టీ పట్ల వెంకట్కున్న విధేయత కూడా కలిసి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2021 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి వెంకట్‌ను పోటీకి దింపిన కాంగ్రెస్ పార్టీ.. అంతకు ముందు 2018 ఎన్నికల్లో పెద్దపల్లి అసెంబ్లీ టికెట్‌ను, ఆ తర్వాత 2023 ఎన్నికల్లో హుజూరాబాద్ టికెట్‌ను ఇవ్వలేదు. అయినా పార్టీ పట్ల విధేయతతో వెంకట్ అవిశ్రాంతంగా ఉద్యమాలు నిర్వహించారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ, పేపర్ లీకేజీలు, పోలీసు ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడారు. అనేకసార్లు గాయపడ్డారు. పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో జైలుకు కూడా వెళ్లారు. చర్లపల్లి జైల్లో ఉన్న వెంకట్‌ను ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా పరామర్శించారు. ఈ విధేయతే వెంకట్‌కు అనూహ్యంగా పెద్దల సభకు వెళ్లే అవకాశాన్ని కల్పించిందని, 2023 ఎన్నికల కంటే ముందే కేసీ వేణుగోపాల్ స్వయంగా వెంకట్ భవిష్యత్తుకు హామీ ఇచ్చిన దృష్ట్యా ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. వెంకట్ పేరును రాహుల్‌గాంధీ స్వయంగా ప్రతిపాదించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండో ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్, మహేశ్‌గౌడ్‌ల పేర్ల పరిశీలన జరిగిందని, చివరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైపు పార్టీ మొగ్గు చూపిందని చెబుతున్నారు. సంస్థాగత నిర్మాణంలో మహేశ్ సక్సెస్ మహేశ్‌కుమార్ గౌడ్ కూడా విద్యార్థి రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 1986–1990 వరకు నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్‌లోనూ పనిచేశారు. అనంతరం పీసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2013–14 వరకు ఉమ్మడి రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. ఇక, 2014లో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగస్వామి అయిన మహేశ్‌గౌడ్ ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల బాధ్యుడిగా పనిచేస్తున్నారు. 2023 ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించినా కొన్ని సమీకరణల వల్ల సాధ్యం కాలేదు. అయినా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దడంలో సఫలీకృతులయ్యారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేని కారణంగా ఎమ్మెల్సీ లేదా పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తామని గతంలోనే అధిష్టానం మహేశ్‌కు హామీ ఇచ్చిందని, ఈ హామీ మేరకే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంపిక చేసిందని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. నిస్వార్థంతో చేసిన కష్టానికి గుర్తింపు: వెంకట్ ప్రజాసమస్యల పరిష్కారం కోసం, పార్టీ బలోపేతం కోసం నిస్వార్థంతో సేవ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఓ యువ కార్యకర్తకు గుర్తింపునిచ్చిందని బల్మూరి వెంకట్ చెప్పారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాందీ, రాహుల్‌గాందీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై నమ్మకంతో పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ గౌడ్, బల్మూరి నేడు నామినేషన్ల దాఖలు సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇద్దరిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావు (వెంకట్) అభ్యర్థిత్వాలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇద్దరికీ పార్టీ బీ ఫారాలు అందజేశారు. కాగా మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్ గురువారం ఉదయం విడివిడిగా తమ నామినేషన్లు దాఖలు చేస్తారని సీఎల్పీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. బల్మూరి వెంకట్ బయోడేటా పేరు : బల్మూరి వెంకట నర్సింగరావు తండ్రి: మదన్మోహన్రావు పుట్టిన తేదీ : నవంబర్ 2, 1992 విద్యార్హత: ఎంబీబీఎస్ పుట్టిన ఊరు: తారుపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా కులం: ఓసీ (వెలమ) మహేశ్‌కుమార్ గౌడ్ బయోడేటా పేరు: బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ తండ్రి: బి.గంగాధర్ గౌడ్ పుట్టిన తేదీ: ఫిబ్రవరి 24, 1966 విద్యార్హత: బీకామ్ పుట్టిన ఊరు: రహత్‌నగర్, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లా కులం: బీసీ (గౌడ) -
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలపై సంక్లిష్టత
-
TS: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై వివాదం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పై వివాదం నెలకొంది. తెలంగాణలో పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాతో ఉప ఎన్నికలు రాగా, రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. రెండు స్థానాలకు జనవరి 29వ తేదీన విడివిడిగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించనుంది. ఒకే తేదీలో రెండు విడివిడిగా ఎన్నికలు జరుగుతామని ఈసీ తెలిపింది. రెండు సార్లు తమ ఓటును ఎమ్మెల్యేలు వినియోగించుకోనున్నారు. కడియం, పాడి కౌశిక్ రెడ్డి ఒకేసారి నామినేట్ కానందున, ఎన్నికల నిబంధనల ప్రకారం విడి విడిగా ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు అంటున్నారు. 119 మంది ఎమ్మెల్యే లలో 65 స్థానాలతో అధికార పార్టీ బలంగా ఉంది. సంఖ్యా బలం కారణంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు మాకేనని కాంగ్రెస్ అంటోంది. రెండు ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ పోగొట్టుకోనుంది. ఇదీ చదవండి: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు -
సీఎం జగన్ తలుచుకుంటే.. అది పెద్ద కష్టమేమీ కాదు..
ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ్యుల కోటా నుంచి శాసనమండలికి జరిగిన ఎన్నికలలో ఆరు సీట్లను గెలుచుకున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక సీటు కోల్పోవడం సహజంగానే చర్చనీయాంశం అవుతుంది. ఇందులో తప్పెవరిది, ఒప్పు ఎవరిది అన్న మీమాంస ఉంటుంది. కాని ఒక్క విషయం మాత్రం స్పష్టం అవుతుంది. ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మాత్రం రాజకీయాలలో ఫెయిర్‌గా ఉండాలన్న తన ఆలోచనను వీడలేదని, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయాలన్న ఉద్దేశానికి రాలేదని అర్ధం అవుతుంది. శరభ.. శరభ.. పూనకం పూనినట్లు.. ఈ విషయంలో ఆయన నిజాయితీని మెచ్చుకోవలసిందే. తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో శరభ.. శరభ.. పూనకం పూనినట్లు ఒక ఎమ్మెల్సీ సీటు టీడీపీకి వచ్చిందంటూ పేజీలకొద్ది వార్తలు, వ్యాఖ్యలను ప్రచారం చేశాయి. ఇదేదో మంచి అవకాశంగా ఆ మీడియా సంస్థలు భావించి ఉండవచ్చు. కాని వారు తెలిసిరాశారో, తెలియక రాశారో కాని జగన్ ఎంత నిబద్దతతో ఉంటారో తెలియచెప్పేలా కొన్ని కథనాలు వాటిలో ఉన్నాయి. జగన్‌కు షాక్ అంటూ రాస్తున్న ఉత్సాహంలో కొన్ని వాస్తవాలు బయటపెట్టారు. ఉదాహరణకు ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనం చూడండి. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు ఓపెన్ గానే పార్టీతో కొంత కాలం క్రితం విభేదించారు. వారు ఆత్మప్రబోధానుసారం ఓట్లు వేస్తామని చెప్పారు. కాగా రహస్యంగా ఉన్న మరో ఎమ్మెల్యే గురించి ఈనాడులో ఏమి రాశారంటే...'నెల్లూరు జిల్లాకే చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యేకి వచ్చే ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వడం లేదని ఇటీవల ముఖ్యమంత్రి జగన్ తేల్చి చెప్పినట్లు సమాచారం. ఆయన అడిగిన పనులు కూడా చేయలేదు...అంటూ ఆ వార్తలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులొకరికి మార్కెట్ చైర్మన్ పదవి కూడా అడిగినా ఇవ్వలేదని తెలిపారు. మరో పేరాలో ఇలా రాశారు...'రాజకీయంగా చైతన్యవంతమైన కోస్తాజిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కి సైతం రానున్న ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వడం సాధ్యం కాదని ఇటీవల పార్టీ అగ్రనేతలు తేల్చి చెప్పారు. ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులంతా కలిసి సి.ఎమ్. జగన్‌తో గురువారం భేటీ అయ్యారు. అప్పుడు కూడా టిక్కెట్ ఇవ్వలేనని పునరుద్ఘాటించినట్లు సమాచారం..." అని తెలిపారు. ఈ విషయాలు చూస్తే ఏమనిపిస్తుంది.. ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇలాంటి వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించే అవకాశం ఉందని తెలిసినా, జగన్ మాత్రం నిజాయితీగా తన అభిప్రాయం చెప్పడం ఎంత ధైర్యంతో కూడిన పని అని తెలియడం లేదా!ఒక వేళ టిక్కెట్లు ఇస్తామనో, లేక మరేదో చేస్తామని మాట ఇచ్చి, ఆ తర్వాత మాట తప్పితే వచ్చే అప్రతిష్టను భరించడానికి ఆయన సిద్దంగా లేరన్నమాట. మరో పత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం చూడండి..'ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అధినేత చంద్రబాబు నిశ్శబ్దంగా గెలుపు కొట్టేశారు. తనకు చాలినంత బలం లేకపోయినా పోటీ పెట్టి, అధికార పార్టీ శిబిరాన్ని చీల్చి మరీ తమ అభ్యర్ధి పంచుమర్తి అనూరాధను గెలిపించుకున్నారు.." అని పేర్కొన్నారు. అంటే దీని అర్ధం ఏమిటి? చంద్రబాబు తనదైన శైలిలో వ్యూహ రచన చేసి వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి గెలిపించుకున్నారనే కదా! అలా ప్రలోభపెట్టడాన్ని ఈ పత్రిక సమర్దిస్తున్న తీరు పెద్ద ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాలలో కొందరు మీడియా యజమానులు కూడా భాగస్వాములవుతుండడమే కావచ్చు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒకసారి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వంపై ఏవో ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత ఆయన మీడియా తో మాట్లాడుతూ మాటవరసకు చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు..అని వ్యాఖ్యానించారు. ఎంత గగ్గోలు పెట్టాయో గుర్తు చేసుకోండి. అంతే.. ఇవే మీడియా సంస్థలు ఎంత గగ్గోలు పెట్టాయో గుర్తు చేసుకోండి.. ఇంకేముంది టీడీపీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి జగన్ స్కెచ్ వేశారని వీరు ఆరోపించారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ నాయకత్వం కొనుగోలు చేసింది. దానిని తప్పు అని ఈ మీడియా ఖండించలేదు. అలాగే ఇప్పుడు కూడా టీడీపీ వారు వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం తప్పు అని అనడం లేదు.అది చంద్రబాబు చాతుర్యంగా ప్రచారం చేస్తున్నారు. పైగా చంద్రబాబు నిశ్శబ్దంగా కొట్టేశారు ! అని శీర్షికలు కూడా పెట్టారు. తెలుగుదేశం పార్టీకి చాలా కాలం క్రితం నలుగురు ఎమ్మెల్యేలు దూరం అయ్యారు. అదేదో ముందుగానే గ్రహించి ఉంటే.. జగన్ తలచుకుని ఉంటే ఇంకొంతమందిని టీడీపీకి దూరం చేయడం పెద్ద కష్టం కాదు. అయినా ఆయన ఆ పని చేయలేదు. గతంలో తెలంగాణలో ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం నేతలు ఎలా పట్టుబడ్డారో అందరికి తెలుసు. అయినా మళ్లీ అదే పనికి టీడీపీ పూనుకోవడం రాజకీయ చాతుర్యంగా చెప్పుకోవడం సిగ్గుచేటైన వ్యవహారమా?.కాదా అన్నది ఆలోచించుకోవాలి. టీడీపీ మీడియా కథనాల ఆధారంగా విశ్లేషిస్తే ఏమి కనిపిస్తుంది.వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధి ఒకరు ఓడిపోయే అవకాశం ఉందని తెలిసినా, జగన్ తన విధానంలో రాజీపడలేదనే కదా! అయితే అదేదో ముందుగానే గ్రహించి ఉంటే ఈ కాస్త అసౌకర్యం కూడా ఏర్పడేది కాదేమో! ఇక్కడ గమనించవలసిన సంగతి ఏమిటంటే? ఆరు ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ గెలిచినా, ఒక్క సీటును గెలుచుకున్న టీడీపీ మాత్రం మొత్తం మండలినే గెలుచుకున్నంత సంబరం చేసుకుంది. నిజానికి మండలిలో ఒక సీటు గెలవడం, ఒక సీటు ఓడడం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే అవి దాదాపు అన్ని పరోక్ష ఎన్నికల ప్రాతిపదిక ద్వారానే భర్తీ అవుతుంటాయి. ఇక్కడ గమనించవలసిన సంగతి ఏమిటంటే 2019 శాసనసభ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు అన్నిటిలో వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అలాగే బద్వేలు, ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలలోను, తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికలోను వైసీపీ భారీ ఆధిక్యతతో గెలిచింది. ఇవన్ని ప్రత్యక్ష ఎన్నికలు. అదే టైమ్‌లో పరోక్షంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధికం వైసీపీ గెలిచినా, నాలుగింటిని మాత్రం టీడీపీ సాధించుకుంటే, మొత్తం మారిపోయిందని చెప్పడమే విడ్డూరం. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నతెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు
-
ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్న వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు
-
ఎమ్మెల్సీలుగా ఐదుగురు ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: శాసన సభ్యుల కోటాలో నవంబర్ 22న శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన ఐదుగురు సభ్యులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కల్లపల్లి రవీందర్రావు, పాడి కౌశిక్‌రెడ్డి, పరుపాటి వెంకట్రామిరెడ్డితో ప్రొటెమ్ చైర్మన్ వెన్న వెరం భూపాల్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి హాజరై నూతన సభ్యులను అభినందించారు. కొత్త సభ్యులకు రూల్స్ బుక్, గుర్తింపు కార్డులతో కూడిన బ్యాగ్‌ను వేముల ప్రశాంత్‌రెడ్డి అందజేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత కొత్త సభ్యులతో కలిసి ప్రొటెమ్ చైర్మన్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు గ్రూప్ ఫోటో దిగారు. కాగా శాసనసభ్యుల కోటాలో మండలికి ఎన్నికైన మరో సభ్యుడు బండా ప్రకాశ్ గురువారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో కలిసి.. రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు బండా ప్రకాశ్ రాజీనామా పత్రాన్ని అందజేశారు. 4వ తేదీ నుంచి రాజీనామా అమల్లోకి వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. బండా ప్రకాశ్‌తో పాటు గవర్నర్ కోటాలో శాసన మండలికి నామినేట్ అయిన సిరికొండ మధుసూదనాచారి ఈ నెల 6న శాసన మండలి సభ్యులుగా ప్రమాణం చేస్తారు. కేంద్రం వైఖరి అసంబద్ధం: టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారని, కేంద్రం దిగివచ్చేంత వరకు విశ్రమించేది లేదన్నారు. పనిచేసే ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడం బీజేపీ, కాంగ్రెస్‌కు పరిపాటిగా మారిందని, ఈ రెండు పార్టీల నాయకులు బేవకూఫ్‌లు అని కడియం శ్రీహరి దుయ్యబట్టారు. ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండి మరింత బాధ్యతతో పనిచేస్తానని ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో కరీంనగర్‌లోని రెండు స్థానాలను టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని కౌశిక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
పెరిగిన ఎమ్మెల్సీ వేడి.. తెరపైకి ఆ ముగ్గురి పేర్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి పెరిగింది. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థుల జాబితా ఖరారైన నేపథ్యంలో పలువురికి ప్రగతిభవన్ నుంచి సీఎం నేరుగా ఫోన్‌చేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల కోటాలో పన్నెండు, ఎమ్మెల్యే కోటాలో ఆరు సీట్లను దక్కించుకునేందుకు గులాబీ పార్టీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం నాలుగు సీట్లు దక్కనున్నాయి. వాస్తవానికి ఆరుగురు అభ్యర్థుల్లో బీసీ సామాజికవర్గం నుంచి ఎల్.రమణ, రెడ్డి సామాజిక వర్గం నుంచి పాడి కౌశిక్‌రెడ్డికి స్థానాలు ఖరారయ్యాయని సమాచారం. ఇటీవల గవర్నర్ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేట్చేసినా.. ఆయనపై ఉన్న కేసుల కారణంగా అది వాస్తవరూపం దాల్చలేదు. దీంతో ఎమ్మెల్యే కోటాలో అధిష్టానం కౌశిక్‌కు బెర్త్ కన్ఫర్మ్ చేసిందని ప్రచారం జరుగుతోంది. చదవండి: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. వెంటనే ఆమోదం స్థానిక సంస్థల కోటాలో తెరపైకి ముగ్గురు! త్వరలో స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి జిల్లా నుంచి రెండు స్థానాలు ఖాళీ అవనున్నాయి. ఈనెల 16వ తేదీన నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో రెండుస్థానాల ఆశావహుల జాబితా కూడా రెడీ అయిందని సమాచారం. ప్రస్తుతం ఓసీ (వెలమ సామాజికవర్గం) భానుప్రసాదరావు, బీసీ (ఎల్లాపు) నుంచి నారదాసు లక్ష్మణరావు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఈసారి వెలమసామాజికవర్గానికి చెందిన చెన్నాడి సుధాకర్‌రావు, బీసీ (యాదవ) నుంచి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తోపాటు, మాజీ జెడ్పీటీసీ వీర్ల వెంకటేశ్వరరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. భాను ప్రసాద్‌కు ఎమ్మెల్యే టికెట్హామీ దక్కడంతో ఆయన పోటీ చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు నారదాసు లక్ష్మ ణరావుకు ఇప్పటికే రెండుసార్లు అవకాశం కల్పించిన నేపథ్యంలో మూడోసారి ఎమ్మెల్సీ టికెట్ దక్కే చాన్స్‌లు దాదాపుగా లేవనే చెబుతున్నారు. పార్టీ మొత్తంగా భర్తీ చేయనున్న 18 సీట్లలో నాలుగు సీట్లు ఉమ్మడి జిల్లా నుంచి భర్తీ కానుండటం గమనార్హం. హుజూరాబాద్ ఓటమిని మరిచిపోయేలా.. మరోవైపు పార్టీలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓ టమి తీరని నైరాశ్యాన్ని నింపింది. నాలుగైదు నెలలపాటు భారీ మెజారిటీతో గెలుస్తామన్న ధీమాగా ఉన్న పార్టీకి ఈటల విజయం సాధించడంతో ఊ హించని భంగపాటు ఎదురైంది. దీంతో గులాబీ శ్రేణులు ఒక్కసారిగా ఢీలా పడ్డాయి. అందుకే, ఆ నష్టాన్ని పూడ్చాలంటే.. రాబోయే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటాలో సీట్లు కైవసం చేసుకుని తిరిగి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపాలి. అందుకే, పకడ్బందీగా ప్లాన్ చేసి ప్రతిపక్షాలను తిరిగి ఆత్మరక్షణ ధోరణిలో పడేసేలా పావులు కదుపుతోంది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఆది నుంచి టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న కరీంనగర్ జిల్లాపై ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు సడలనీయవద్దన్న పట్టుదలతో పకడ్బందీగా ముందుకు సాగుతోంది. -
Telangana: బీసీలు, రెడ్లకు రెండేసి ఎమ్మెల్సీలు?
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు జరగనున్న ఆరు ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థుల ఎంపికలో బీసీలు, రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి కనీసం రెండేసి సీట్లను ఇవ్వాలనే యోచనలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది. అలాగే వెలమ, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారికి చెరో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేలా ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. బీసీ సామాజికవర్గం నుంచి (ఎల్.రమణ), అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి (విశ్వబ్రాహ్మణ) పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. శాసనసభలో ప్రాతినిధ్యం లేని బీసీ సామాజికవర్గంలో పద్మ శాలి, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి కులాలకు చెందిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తామని గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం తెలిసిందే. ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే హామీ మేరకే టీటీడీపీ అధ్యక్ష పదవికి ఎల్.రమణ రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరినట్లు ప్రచారం జరగ్గా ఆయన చేరిక సందర్భంగా కేసీఆర్ రాష్ట్రస్థాయి పదవి ఇస్తామని పరోక్షంగా హామీ ఇచ్చారు. మరోవైపు మూడో ఎమ్మెల్సీ పదవిని కూడా బీసీకి ఇవ్వాలనే ప్రతిపాదన కూడా కేసీఆర్ మదిలో ఉన్నట్లు తెలి సింది. అదే జరిగితే మాజీ ప్రభుత్వ విప్ బోడ కుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత, ఫరీదుద్దీన్, కర్నె ప్రభాకర్, పీఎల్ శ్రీనివాస్, తాడూరు శ్రీని వాస్ పేర్లు పరిశీలనకు రావొచ్చు. రెడ్డి సామాజిక వర్గం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా హామీ పొందిన ఎంసీ కోటి రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఒకే జిల్లా నుంచి ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరికి అవకాశం దక్కుతుందా అనే అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. రెడ్డి సామాజికవర్గం నుంచి అల్లి పురం వెంకటేశ్వర్‌రెడ్డి ఓసీ సామాజిక వర్గం నుంచి సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ ఆశావహుల జాబితాలో ఉన్నారు. వెలమ, ఎస్సీ సామాజికవర్గాలకు చెరొకటి.. గతంలో ఇచ్చిన హామీ మేరకు వెలమ సామాజిక వర్గం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం మండలిలో ఈ సామాజికవర్గం నుంచి కల్వకుంట్ల కవిత, భానుప్రసాద్, నవీన్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే స్థానిక సంస్థల కోటాలో వచ్చే ఏడాది జనవరి తొలి వారంలో కవిత, భానుప్రసాద్ పదవీకాలం పూర్తవుతుండటంతో రవీందర్రావు పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఎస్సీ సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఖాయమవగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహుల పేర్లు సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉన్నాయి. అయితే వచ్చే సాధారణ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే లేదా వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరిని పంపాలనే వ్యూహంతో అధినేత కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో పదవుల భర్తీలో యువతకు ప్రాధాన్యతనిస్తున్న కేసీఆర్ గతంలో టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ‘స్థానిక’ కోటానూ దృష్టిలో పెట్టుకొని... వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో 12 మంది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తవుతోంది. ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నెల చివరి వారం లేదా డిసెంబర్ తొలివారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. దీంతో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పదవులనూ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ఖరారు చేస్తున్నారు. ఈ నెల 9 నుంచి మండలి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 16న పూర్తి కానుంది. గవర్నర్ కోటా నుంచి ‘కౌశిక్’ ఔట్! హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆగస్టు 2న రాష్ట్ర మంత్రివర్గం నామినేట్ చేసింది. అయితే ఆయనపై వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు ఉండటంతో కౌశిక్ అభ్యర్థిత్వం నాలుగు నెలలుగా గవర్నర్ ఆమోదానికి నోచుకోలేదు. నిబంధనల మేరకు కౌశిక్ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ ఆమోదించే అవకాశం లేకపోవడంతో మరో అభ్యర్థిని గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు. కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటా నుంచి తప్పించి ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి పంపడమో లేదా అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపడమో జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
కరోనా ఎఫెక్ట్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణతో దేశం అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కరోనా కారణంగా ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవని సీఈసీ తెలిపింది. కాగా నోటిఫికేషన్ ప్రకారం ఏపీలో 3 మండలి స్థానాలకు ఈ నెల 31తో, తెలంగాణలో 6 మండలి స్థానాలకు జూన్ 3తో గడువు ముగియనుంది. తాజాగా ఈ నిర్ణయంతో ఏపీలో 3 , తెలంగాణలో 6 మండలి సభ్యుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా పరిస్థితులను బట్టి తదుపరి తేదీలను ప్రకటిస్తామని సీఈసీ తెలిపింది. చదవండి: DGCA:అంతర్జాతీయ విమానాల నిషేధంపై కీలక నిర్ణయం -
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం?
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. మొత్తం ఐదు ఖాళీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేయగా.. బరిలో ఐదుగురు అభ్యర్థులే నిలిచారు. దాంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. అయితే ఇంకా దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిల్లి సుభాష్ చంద్రబోస్, కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి గుమ్మడి సంధ్యారాణి, వీవీవీ చౌదరి, తిప్పేస్వామిలు మంగళవారం నామినేషన్లు వేయనున్నారు.