కరోనా ఎఫెక్ట్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా | New delhi: Cec Postponed Mla Quota Mlc Elections Covid 19 Pandemic | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా

Published Fri, May 28 2021 8:56 PM | Last Updated on Fri, May 28 2021 9:14 PM

New delhi: Cec Postponed Mla Quota Mlc Elections Covid 19 Pandemic - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణతో దేశం అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కరోనా కారణంగా ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవని సీఈసీ తెలిపింది. కాగా నోటిఫికేషన్‌ ప్రకారం ఏపీలో 3 మండలి స్థానాలకు ఈ నెల 31తో, తెలంగాణలో 6 మండలి స్థానాలకు జూన్‌ 3తో గడువు ముగియనుంది.  తాజాగా ఈ నిర్ణయంతో ఏపీలో 3 , తెలంగాణలో 6 మండలి సభ్యుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా పరిస్థితులను బట్టి తదుపరి తేదీలను ప్రకటిస్తామని సీఈసీ తెలిపింది.

చదవండి: DGCA:అంతర్జాతీయ విమానాల నిషేధంపై కీలక నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement