
Coronavirus Update: దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటలలో 50,407 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటలలో 1,36,962 మంది వైరస్ బారినుంచి కోలుకోగా 804 మంది కరోనాతో మృతి చెందారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,07,981 మంది కోవిడ్ బారినపడి మరణించారు. ప్రస్తుతం 6,10,443 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 1,72,29,47,688 మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు.