సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పై వివాదం నెలకొంది. తెలంగాణలో పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాతో ఉప ఎన్నికలు రాగా, రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
రెండు స్థానాలకు జనవరి 29వ తేదీన విడివిడిగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించనుంది. ఒకే తేదీలో రెండు విడివిడిగా ఎన్నికలు జరుగుతామని ఈసీ తెలిపింది. రెండు సార్లు తమ ఓటును ఎమ్మెల్యేలు వినియోగించుకోనున్నారు.
కడియం, పాడి కౌశిక్ రెడ్డి ఒకేసారి నామినేట్ కానందున, ఎన్నికల నిబంధనల ప్రకారం విడి విడిగా ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు అంటున్నారు. 119 మంది ఎమ్మెల్యే లలో 65 స్థానాలతో అధికార పార్టీ బలంగా ఉంది. సంఖ్యా బలం కారణంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు మాకేనని కాంగ్రెస్ అంటోంది. రెండు ఎమ్మెల్సీలను బీఆర్‌ఎస్ పోగొట్టుకోనుంది.
ఇదీ చదవండి: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment