
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్యనేతలు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ రోజు(సోమవారం) మధ్యాహ్న సమయంలో సీఎం రేవంత్ తో పాటు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీకి పయనమయ్యారు..
తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్ విస్తరణ, భారత్ సంవిధాన్ కార్యక్రమాలకు సంబంధించి సీఎం రేవంత్, పలువురు మంత్రులను ఢిల్లీకి బయల్దేరి రమ్మని అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈరోజు(సోమవారం) సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో వీరు సమావేశం కానున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లినట్లు తెలుస్తోంది.
వచ్చే నెలలో సీఎం రేవంత్ విదేశీ పర్యటన
ఏప్రిల్ లో సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటించనున్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 23 వరకూ జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్. అయితే ఈ లోపే డీ లిమిటేషన్ పై హైదరాబాద్ లో మీటింగ్ నిర్వహించే యోచనలో ఉన్నారు రేవంత్.

Comments
Please login to add a commentAdd a comment