న్యూఢిల్లీ: దేశంలో అధికార బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రతిపక్ష నేతలు జూన్ 23న బిహార్ రాజధాని పాటా్నలో సమావేశమైన సంగతి తెలిసిందే. తదుపరి భేటీ ఈ నెల 17, 18న కర్ణాటక రాజధాని బెంగళూరులో జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ సోమవారం ట్వీట్ చేశారు.
ఫాసిస్ట్, అప్రజాస్వామిక శక్తులను ఓడించాలన్నదే ధ్యేయమని, అందుకోసమే ప్రతిపక్షాలు చేతులు కలుపుతున్నాయని చెప్పారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నదే విపక్ష కూటమి సంకల్పమని వివరించారు. వాస్తవానికి విపక్షాల సమావేశాన్ని ఈ నెల 13, 14న నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. ఆ సమయంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో తమ భేటీని 17, 18వ తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment