సాక్షి, ఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై హై కమాండ్ కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశమయ్యారు. కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి , మధుయాష్కి గౌడ్ సమావేశమయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అంశంపై చర్చించారు.
పీసీసీ అధ్యక్ష రేసులో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అధిష్టానం ఎవరిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినా కలిసి పనిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గం, డిప్యూటీ సీఎం ఎస్సీ సామాజిక వర్గం కావడంతో పీసీసీ అధ్యక్ష పదవి బీసీ వర్గానికి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్‌లకు పట్టు ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెలిసి పనిచేసే నేతకు అధిష్టానం అవకాశమిస్తుందా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా పాత కాంగ్రెస్ నేతలకు అవకాశం ఇస్తారా? అనే దానిపై కూడా చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment