tpcc President
-
దీపావళిలోపు కార్పొరేషన్ పదవులు
సాక్షి, హైదరాబాద్: దీపావళిలోపు రెండోదఫా కార్పొరేషన్ పదవులు ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. దసరాలోపు చేద్దామని అనుకున్నా హరియాణా, కశ్మీర్ రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా సాధ్యం కాలేదని, ఏఐసీసీ నాయకత్వం కూడా బిజీగా ఉండడంతో మంత్రివర్గ విస్తరణ విషయంలోనూ, టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటులోనూ జాప్యం జరిగిందన్నారు. శుక్రవారం గాం«దీభవన్‌లో మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ⇒ ఎంఐఎంతో స్నేహం వేరు. శాంతిభద్రతల సమస్య వేరు. నాంపల్లి నియోజకవర్గంలో మా పార్టీ నేత ఫిరోజ్‌ఖాన్‌పై జరిగిన దాడిని సీరియస్‌గా తీసుకుంటాం. విషయం సీఎం దృష్టికి వెళ్లింది. దాడుల విషయంలో కఠినంగా ఉంటాం. ⇒ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నియోజకవర్గాల్లో కొంత ఇబ్బంది అవుతోంది. అందుకే చేరికలకు తాత్కాలికంగా బ్రేక్ వేశాం. కానీ బీఆర్ఎస్కు చెందిన చాలామంది మాతో టచ్‌లో ఉన్నారు. త్వరలోనే మళ్లీ చేరికలు ప్రారంభమవుతాయి. ఎమ్మెల్యేలు కూడా వస్తారు. ⇒ సినీనటుడు నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ కావాలని మాట్లాడలేదు. కేటీఆర్ వ్యవహారశైలి కారణంగానే అలా మాట్లాడారని అనుకుంటున్నా. అయినా అలా మాట్లాడాల్సింది కాదు. నాగార్జున కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఏం చెబుతుందో చూడాలి. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదు. ఈ విషయంలో అధిష్టానం మమ్మల్ని ఎలాంటి వివరణ అడగలేదు. అయినా కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పారు. ఆ రోజే ఆ విషయం క్లోజ్ అయ్యింది. ⇒ పేదలకు ఇబ్బంది లేకుండా మూసీ ప్రక్షాళన చేయాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. మూసీ, హైడ్రాలు భావితరాల కోసమే చేపట్టాం. ⇒ బీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది. మమ్మల్ని ఎదుర్కోవడమే ఆ రెండు పార్టీల టార్గెట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేసే అవకాశముంది. అయినా మాకేం నష్టం లేదు. ⇒ సోషల్ మీడియాను ఉపయోగించుకొని బీఆర్ఎస్ మా మీద దు్రష్పచారం చేస్తోంది. దుబాయి నుంచి ఖాతాలు తెరిచి మరీ నడిపిస్తున్నారు. రూ. వందల కోట్లు ఇందుకోసం ఖర్చు చేస్తున్నారు. సోషల్ మీడియాను దురి్వనియోగం చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ⇒ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల పక్షాన మాట్లాడుతున్నారు. బీసీల పక్షాన మాట్లాడితే పార్టీ లైన్ తప్పారని అనలేం. అయితే, కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి అని మల్లన్నకు విజ్ఞప్తి చేస్తున్నా. ⇒ కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, బీజేపీ మతతత్వ పార్టీ. రెండు పార్టీలు ఎప్పటికీ ఒక్కటి కావు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎంత దు్రష్పచారం చేసినా ప్రజలు నమ్మరు. ⇒ పార్టీ బలోపేతానికి ప్రణాళికలు ఉన్నాయి. నెలరోజుల్లో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాం. త్వరలోనే జిల్లాల పర్యటనకు వెళతా. -
38 నెలలు.. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం జూన్ 26, 2021న రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. జూలై 7న ఆయన గాంధీ భవన్లో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంత బలంగా లేదు. ఒకవైపు అధికార బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్‡్షతో.. మరోవైపు ప్రత్యామ్నాయ స్థానం కోసం బీజేపీ సవాలు విసురుతున్న పరిస్థితుల్లో రేవంత్ పార్టీ పగ్గాలు స్వీకరించారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఇచి్చన పార్టీగా కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చారు. తొలి పరీక్ష.. హుజురాబాద్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే హుజురాబాద్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి తొలి సవాల్‌గా నిలిచింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 3,014 (1.5 శా తం) ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానంలో నిలిచింది. అంతలోనే మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. అదే సమయంలో రాహుల్ గాంధీ భార త్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. ఇటువంటి పరిస్థితుల్లో అటు మునుగోడు ఉప ఎన్నిక, భారత్ జోడో యాత్రను సమన్వయం చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు. ఈ ఎన్నికల్లోనూ పారీ్టకి పరాజయ మే మిగిలింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంతో రేవంత్ 2023, ఫిబ్రవరి 6 నుంచి మార్చి 20 వరకు 33 రోజులపాటు చేపట్టిన పాద యాత్ర కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహాన్ని తెచ్చింది. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాలు సఫలీకృతమై 64 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టగలిగింది.రేవంత్ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. 8 పార్లమెంటు స్థానా ల్లో కాంగ్రెస్ విజయం సాధించేలా రేవంత్ పార్టీని నడిపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా దాదాపు 9 నెలలపాటు ఆయన పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. ఆదివారం టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు స్వీకరించడంతో రేవంత్ రెడ్డి 38 నెలల పీసీసీ అధ్యక్ష ప్రస్థానానికి ముగింపు పలికినట్టు అయింది. -
నేడు టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు
-
కార్యవర్గానికి.. కొంత సమయం!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర పారీ్టకి కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తి కావడంతో పార్టీ పదవులు, టీపీసీసీ కార్యవర్గంపై కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. అయితే, కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగినా కార్యవర్గం ఏర్పాటుకు కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతల స్వీకరణ అనంతరం రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపి, వారి సల హా మేరకు కమిటీలను కూర్చి, ఆ కమిటీలపై హైకమాండ్ ఆమోద ముద్ర వేయించుకునేందుకు కొంత సమయం పడుతుందని తెలుస్తోంది.పీసీసీ అధ్యక్షునిగా ఈనెల 15వ తేదీన మహేశ్‌గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకంటే ముందు బుధవారం ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నా యి. మహేశ్‌గౌడ్ ఈనెల 11న ఢిల్లీ వెళ్తారని, అధ్యక్ష పదవి అప్పగించినందుకు గాను పార్టీ పెద్దలను కలసి కృతజ్ఞతలు తెలిపేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారని గాంధీభవన్‌వర్గాలు చెబుతున్నాయి. ప్రచార కమిటీని నియమిస్తారా? టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించిన నేపథ్యంలో గతంలో ఉన్న మిగిలిన కమిటీలను కొత్తగా ని యమిస్తారా లేక వాటినే కొనసాగిస్తారా అనే చర్చ ప్రారంభమైంది. టీపీసీసీకి అనుబంధంగా ఏడెని మిది కమిటీలు పనిచేస్తుంటాయి. వీటిలో టీపీసీసీ ప్రచార కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమి టీ లాంటి వాటిని కొత్తగా ప్రకటిస్తారని గాం«దీభవ న్ వర్గాలంటున్నాయి. టీపీసీసీకి ప్రచార కమిటీని నియమిస్తే దానికి చైర్మన్‌గా ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జగ్గారెడ్డికి పదోన్నతి కలి్పంచి ఆ పదవిలో నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ఇక, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రస్తుతం ఐదుగురు ఉన్నారు. అందులో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్‌గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు.ఇక, జగ్గారెడ్డితో పాటు అంజన్‌కుమార్, అజారుద్దీన్, గీతారెడ్డిలు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేస్తున్నారు. సామాజిక సమీకరణల మేరకు గతంలో నియమించిన ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ల స్థానంలో కొత్త వారు వస్తారనే చర్చ జరుగుతోంది. ఈసారి కూడా ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తారని, వీరిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.వీరితో పాటు సీనియర్ ఉపాధ్యక్షులుగా పార్టీ సీనియర్ నేతలను నియమిస్తారని, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఎంత మంది ఉండాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా, అధికార ప్రతినిధుల జాబితాలో మాత్రం మార్పులు చేస్తారని సమాచారం. అన్ని పదవుల విషయంలోనూ సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఉంటుందని, వచ్చే నెలలో టీపీసీసీ కార్యవర్గ కూర్పు కసరత్తు జరుగుతుందని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు వెల్లడించారు. -
పాత ఫార్ములానే..!
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్ష నియామకంలో కాంగ్రెస్ హైకమాండ్ పాత ఫార్ములానే అనుసరించింది. ముఖ్యమంత్రిగా ఓసీ వర్గాలకు చెందిన వారిని నియమిస్తే... బీసీ వర్గానికి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే సాంప్రదాయాన్ని కొనసాగించింది. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతోపాటు ఆయన మూడేళ్ల పదవీకాలం కూడా ముగిసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారాన్ని ఏఐసీసీ చాలా సీరియస్‌గా తీసుకుంది. నాలుగు నెలలుగా దీనిపై కసరత్తు చేసిన అధిష్టానం పలుమార్లు రాష్ట్ర నేతలతో సంప్రదింపులు జరిపి, అనేక కోణాల్లో పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతల పేర్లను ఈ పదవి కోసం పరిశీలించి చివరకు మహేశ్‌గౌడ్ వైపు మొగ్గు చూపింది. చర్చోపచర్చలు.. భిన్న వాదనలుకర్ణాటక ఫార్ములా ప్రకారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కొత్త టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని తొలుత ప్రచారం జరిగింది. బీసీ వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూడా అధ్యక్షుడిగా నియమించే అవకాశముందనే చర్చ కూడా జరిగింది. ఆ చర్చల అనంతరం సామాజికవర్గాల లెక్కలు తెరపైకి వచ్చాయి. ఓసీ వర్గానికి చెందిన నేత ముఖ్యమంత్రిగా ఉండడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఒకరిని అధ్యక్షుడిగా నియమిస్తారని, ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్‌కుమార్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పోరిక బలరాంనాయక్, మధుయాష్కీగౌడ్, మహేశ్కుమార్గౌడ్లలో ఒకరిని ఈ పదవిలో నియమిస్తారనే ప్రచారం ఊపందుకుంది.దీంతో పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్మున్షీలను పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించినప్పటికీ అధ్యక్షుడి వ్యవహారాన్ని తేల్చలేదు. కేబినెట్ ఖాళీలు భర్తీ చేసే క్రమంలో సామాజిక సమతుల్యత సరిపోలడం లేదంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. ఇక, ఎస్సీల వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాదిగ సామాజికవర్గానికి అవకాశం వస్తుందని, ఈ మేరకు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేరు ఖరారైందని ప్రచారం జరిగింది.ఆ తర్వాత కొన్నాళ్లు మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ పేరు వినిపించింది. సీనియర్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఈ పదవిలో నియమిస్తారని మరికొన్నాళ్లు చర్చ జరిగింది. ఇక, ఎట్టకేలకు ఆగస్టు చివరి వారంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో జరిపిన చర్చల్లో బీసీ వర్గానికి అధ్యక్ష పదవిని ప్రతిపాదించిన ఏఐసీసీ మధుయాష్కీ, మహేశ్‌గౌడ్‌ల పేర్లపై కీలక నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. వారి అభిప్రాయాలు విన్న తర్వాత ఎట్టకేలకు మహేశ్‌గౌడ్ వైపు మొగ్గుచూపింది. రెండు ప్రాంతాలకు చెరో పదవిమహేశ్గౌడ్ను అధ్యక్షుడిగా ఎంపిక చేయడంలో విధేయతకు ఏఐసీసీ పెద్దపీట వేసింది. దక్షిణ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఉత్తర తెలంగాణకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం, సామాజిక సమతుల్యత, రేవంత్ సిఫారసుకు ప్రాధాన్యం, సంస్థాగత వ్యవహారాలపై పట్టు నేపథ్యంలో మధుయాష్కీ, మహేశ్‌గౌడ్‌ల మధ్య దోబూచులాటతో చివరి నిమిషంలో ఉత్కంఠ రేపింది. మహేశ్‌గౌడ్ నియామకం పూర్తయిందని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే సంతకం చేశారని, కేసీ.వేణుగోపాల్ కూడా మహేశ్‌గౌడ్‌తో మాట్లాడి దిశానిర్దేశం చేశారనే వార్తలొచ్చిన తర్వాత కూడా మరోవారం రోజుల పాటు జాప్యం జరిగింది. ఈనేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ మార్కు ఊహాగానాలకు తెరలేచినా ఎట్టకేలకు మహేశ్‌గౌడ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి దక్కింది. -
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్ గౌడ్... కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
హైకమాండ్ పెద్దలతో రేవంత్ భేటీ.. ఏ క్షణమైనా టీపీసీసీ చీఫ్‌ను ప్రకటించే ఛాన్స్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై హై కమాండ్ కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశమయ్యారు. కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి , మధుయాష్కి గౌడ్ సమావేశమయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అంశంపై చర్చించారు.పీసీసీ అధ్యక్ష రేసులో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అధిష్టానం ఎవరిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినా కలిసి పనిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గం, డిప్యూటీ సీఎం ఎస్సీ సామాజిక వర్గం కావడంతో పీసీసీ అధ్యక్ష పదవి బీసీ వర్గానికి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్లకు పట్టు ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెలిసి పనిచేసే నేతకు అధిష్టానం అవకాశమిస్తుందా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా పాత కాంగ్రెస్ నేతలకు అవకాశం ఇస్తారా? అనే దానిపై కూడా చర్చ నడుస్తోంది. -
అడ్డగోలుగా భవనాలకు అనుమతులిచ్చి దోచుకుంటున్నారు
-
కుక్కల దాడి ఘటన.. వారికి మెదడు ఉందా?.. రేవంత్‌రెడ్డి సీరియస్
సాక్షి, భూపాలపల్లి: కుక్కల బెడదపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కుక్కల బెడదను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో కుక్కల దాడిలో బాలుడు చనిపోతే మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్న రేవంత్‌రెడ్డి.. కోటంచ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుక్కలకు ఆకలి వేసి బాలుడిని తిన్నాయని మేయర్ అంటే.. మంత్రి కేటిఆర్ కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తామని చెప్పడం చూస్తే వారి ఆలోచన ఏవిధంగా ఉందో అర్థమవుతుందన్నారు. చనిపోయిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవాల్సిన మంత్రి కేటీఆర్ కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామనడం వారికి మెదడు ఎక్కడ ఉందో అర్థమవుతుందన్నారు. ఎఫ్1 రేస్‌పై ఉన్న శ్రద్ధ కుక్కల బెడదపై లేదా అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ తక్షణమే మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించి, క్షమాపణ చెప్పి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లిలో పామాయిల్ కంపెనీ పేరుతో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి బినామీల పేరుతో పేదల భూములను ఆక్రమించుకుంటున్నాడని ఆరోపించారు. రేపు భూపాలపల్లిలో పర్యటించే మంత్రి కేటీఆర్.. దానిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అక్రమ దందాను నిరూపించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. చదవండి: అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు: చికోటి ప్రవీణ్ షాకింగ్ కామెంట్స్ భూపాలపల్లికి పట్టిన చీడపీడ విరగడం కోసం కోటంచ లక్ష్మి నరసింహస్వామి వారిని వేడుకుని పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు. భూపాలపల్లిలో ఆరాచకశక్తులు పార్టీ ఫిరాయింపుదారులు రాజ్యమేలుతున్నారని విమర్శించారు. వారి తప్పిదాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిన చరిత్ర భూపాలపల్లిలో ఉందన్నారు. ప్రజా వ్యతిరేక పాలనతో ఆస్తులు సంపాదనే లక్ష్యంగాఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పనిచేస్తున్నాడని విమర్శించారు. భూపాలపల్లిలో పర్యటించే కేటీఆర్ తమ సవాల్ స్వీకరించి సమాధానం చెప్పాలని కోరారు. -
అచేతనావస్థలో ఆ రెండు పార్టీలు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించుకోలేని అచేతనావస్థలో టీఆర్ఎస్, బీజేపీలున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యా ఖ్యానించారు. ఆయా పార్టీల నేతలపై నమ్మకం లేని కార ణంగానే అభ్యర్థులపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతిని గెలిపించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వమంతా సమష్టిగా పనిచేస్తుందన్నారు. శనివారం గాంధీభవన్‌లో ముఖ్య నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బోసురాజు, అంజన్‌కు మార్, బలరాంనాయక్, మల్లు రవి, దామోదర్‌రెడ్డి, చెరుకు సుధాకర్‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మునుగోడుకు టీఆర్ఎస్, బీజేపీ చేసిన మోసాన్ని అక్కడి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. 10వేల ఎకరాల పోడు భూములకు ధరణిలో పట్టాలు రద్దు చేసిన టీఆర్ఎస్ అరాచకాలు మునుగోడులో అన్నీ ఇన్నీ కావని, ఆ పార్టీని ఉరేసినా తప్పులేదని అన్నారు. ఇప్పుడు ఒక్కదెబ్బకు రెండు పిట్టల్ని కొట్టే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందని, ఇక్కడ కాంగ్రెస్‌ను గెలిపించే అవకాశం వచ్చిందన్నా రు. కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేసి స్రవంతిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాగేవాళ్ల దగ్గరికే వెళ్లను.. తాగుడు వ్యాపారం చేస్తానా? లిక్కర్ స్కాంలో తనకూ సంబంధం ఉందని బీజేపీ చేస్తున్నది చిల్లర ప్రచారమని రేవంత్ అన్నారు. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు రాజగోపాల్‌రెడ్డి వ్యవహరిస్తు న్నారని చెప్పారు. తాగేవాళ్ల దగ్గరికే తాను వెళ్లనని, అలాంటిది తాగుడు వ్యాపారం చేస్తానా అని ప్రశ్నించారు. తాను డైరెక్టర్‌గా ఎప్పుడో రాజీనామా చేసిన ఆ కంపెనీని మూసే సిన 13 ఏళ్ల తర్వాత పనికి మాలిన మాటలు మాట్లాడు తున్నారని అన్నారు. సూదిని సృజన్‌రెడ్డి తనకు బంధువని, అంతమాత్రాన వారు చేసే వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉంటుందా అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ సొంత అన్న దమ్ములని, వారే రెండు పార్టీల్లో ఉండి, ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటున్నప్పుడు తనకు, తన చినమామ కొడు కు సృజన్‌రెడ్డికి ఏం సంబంధముంటుందన్నారు. ఒకవేళ తనకు ఏ కుంభకోణంలోనైనా ఈసుమంత భాగమున్నా ఏ సంస్థతోనైనా దర్యాప్తు జరిపించుకోవచ్చని రేవంత్ సవాల్ చేశారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్ మాట్లాడుతూ.. స్రవంతి గెలుపు కోసం కాంగ్రెస్ నేతలంతా పనిచేయాలని, తామంతా కలిసికట్టుగా ముందుకెళతామని చెప్పారు. ఇక్కడ ఏడవలేకపోతున్నారు.. రాష్ట్రంలో ఏడవలేకపోతున్న కేసీఆర్ దేశంలో రాజకీయం చేస్తానని చెప్పడం ఏదో సామెత చెప్పి నట్లుగా ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కలు స్తున్న జాతీయ నేతలంతా యూపీఏతో ఉన్నవారేనని, వారిని కలవడం ద్వారా కాంగ్రెస్‌ను బలహీనపరిచి బీజేపీని బలోపేతం చేయాలన్నదే కేసీఆర్ ఎజెండా అని చెప్పారు. ఎన్డీయేలో ఉన్న ఏ మిత్రపక్ష పార్టీతో కేసీఆర్ చర్చలు జరిపి వారిని బీజేపీ నుంచి దూరం చేశారో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దాం: బీజేపీ -
Sakshi Cartoon: గోడలు లేనిచోట కలిస్తే పోలా..!
గోడలు లేనిచోట కలిస్తే పోలా..! -
నివురుగప్పిన నిప్పు: రేవంత్ వర్సెస్ సీనియర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయం రంజుగా మారుతోంది. కొత్త అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత కొన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న పార్టీ పరిస్థితి ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా మారింది. పార్టీలోని కొందరు సీనియర్లు, రేవంత్ నియామకాన్ని వ్యతిరేకించిన మరికొందరితో రేవంత్, ఆయన టీంకు చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. ప్రతి విషయాన్ని పార్టీలో చర్చించిన తర్వాతే నిర్ణయాలు బయటకు చెప్పాలని, తమతో మాట్లాడిన తర్వాతే కేడర్‌లోకి వెళ్లాలని సీనియర్లు భావిస్తుంటే రేవంత్ దూకుడు మాత్రం ఆ కోణంలో వెళ్లడం లేదు. సీనియర్ల మాటలను పరిగణనలోకి తీసుకుంటానని అంటూనే రేవంత్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ దీంతో ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరాయి. రేవంత్ మినహా పార్టీ ఎంపీలు, సీతక్క మినహా ఎమ్మెల్యేలు, ఉన్న ఒక్క ఎమ్మెల్సీతో పాటు పలువురు సీనియర్ నాయకులు.. టీపీసీసీ అధ్యక్షుడి తీరుపై అసంతృప్తితో ఉన్నారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. పార్టీ అధి ష్టానం కొత్తగా ఏర్పాటు చేసిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) శనివారం భేటీ కానుండటం, అంతకుముందు రోజే ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన వ్యాఖ్యలతో వేడి పుట్టించడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. సమష్టిగా అన్నారు.. సమాచారమే లేదు.. ఈ ఏడాది జూలై 7న టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ బాధ్యతలు చేపట్టడానికి ముందే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మినహా పార్టీలోని సీనియర్ నేతలందరినీ ఇళ్లకు వెళ్లి కలసి మరీ సయోధ్యకు ఆయన ప్రయ త్నించారు. అంతవరకు బాగానే ఉన్నా, పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు, అధ్యక్షుడైన తర్వాత వ్యవహరిస్తున్న తీరుకు పొంతన లేదని సీనియర్లు ఆరోపిస్తున్నారు. సమష్టిగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్దామని చెప్పిన రేవంత్ కనీసం సమా చారం ఇవ్వకుండానే అన్నీ తానే అనే ధోరణిలో పార్టీని తీసుకెళ్తున్నారని వారు వాపోతున్నారు. జగ్గారెడ్డి లాంటి కొందరు బహిరంగంగానే మాట్లాడుతున్నా.. మిగిలిన వారంతా రేవంత్ తీరుపై అసంతృప్తితో ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. ముఖ్యంగా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమ నిర్వహణ సీనియర్లు వర్సెస్ రేవంత్ అన్నట్లుగా సాగింది. ఇంద్రవెల్లి సభకు ముందు మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అలకతో ప్రారంభమైన పంచాయతీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇంద్రవెల్లి సభకు సీతక్క అధ్యక్షత వహించడం, రావిర్యాల సభను అంతా రేవంత్ టీం నడిపించడం, మూడుచింతలపల్లి దళిత దీక్షలో కూడా సీనియర్లు తెరపైన కనిపించే పరిస్థితి లేకపోవడం, గజ్వేల్ సభ అంతా రేవంత్ అన్నట్లే సాగడాన్ని ఆయన వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేక పోతోంది. కనీసం పార్టీలో చర్చించకుండానే గజ్వేల్ సభలో 2 నెలల పాటు నిరుద్యోగ సమస్యపై కార్యాచరణ ప్రకటించడం దేనికి సంకేతమని, అన్నీ ఆయనే ప్రకటిస్తే ఇక తాముండి ఎందుకనే భావన రాష్ట్ర కాంగ్రెస్ సీని యర్ నాయకుల్లో వ్యక్తమవుతోంది. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన కొందరు ఇతర పార్టీల నేతలు స్థానిక కాంగ్రెస్ నాయకులకు సమాచారం లేకుండా రేవంత్‌ను కలవడం, కనీసం చర్చించకుండానే అధికార ప్రతినిధుల నియామక పేర్లు ప్రకటించడం, గాంధీభవన్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఎవరెవరు వస్తున్నారనే సమాచారం కూడా ముఖ్య నేతలకు ఇవ్వకపోవడం లాంటివి రేవంత్ ఏకపక్ష ధోరణికి అద్దం పడు తున్నాయనేది సీనియర్ల విమర్శ. దీనిపై టీపీసీసీ ముఖ్యనేత పార్టీ అధిష్టానం నేత కేసీ వేణు గోపాల్‌కు లేఖ రాయడం కూడా తెలి సిందే. రాష్ట్ర నేతలు అధిష్టానాన్ని కలసి రేవంత్ తీరుపై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తయితే శుక్రవారం జగ్గారెడ్డి రేవంత్‌ను ఉద్దేశించి నేరుగా చేసిన వ్యాఖ్యలు పార్టీలో సెగలు పుట్టిస్తున్నాయి. ఆడలేక మద్దెల ఓడు.. కొందరు సీనియర్లు, రేవంత్ నియామకంపై వ్యతిరేకత ఉన్న నేతల వాదన అలా ఉంటే.. రేవంత్ టీంకూడా పార్టీలో చురుగ్గానే వ్యవ హరిస్తోంది. ఆయనకు మొదటి నుంచీ అండగా ఉన్న నేతలు రేవంత్‌కు కవచంగా పనిచేస్తూ అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. సీనియర్ల వ్యవ హారశైలిని ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాలూ చేస్తున్నారు. సీనియర్లతో మాట్లాడినా, మాట్లాడకపోయినా రేవంత్ నుంచి వచ్చే ప్రతి పిలు పును విజయవంతం చేసే పనిలో వారు నిమ గ్నమైపోయారు. సీనియర్లు.. సీనియర్లు.. అం టూ ఏడేళ్లుగా పార్టీని పాతాళంలోకి తొక్కేశారని, రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త ఊపు వస్తే దాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని వారంటున్నారు. సీనియర్లు కొందరిని ఉసిగొల్పుతున్నారని, అధిష్టానం స్పష్టంగా చెప్పినా వారి వైఖరిలో మార్పురావడం లేదని పేర్కొంటున్నారు. రేవంత్ కూడా సమ యానికి అనుగుణంగా తన కార్యచరణను ముందుగానే ప్రకటించేస్తున్నారు. దండోరా నుంచి నిరుద్యోగ జంగ్ సైరన్ వరకు అన్నీ ఆయన పకడ్బందీగానే వ్యవహరిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. సీనియర్లు తనకు అక్షింతలు వేస్తున్నారని పార్టీ అంతర్గత సమావేశాల్లో చెబుతూనే.. వాటిని నెత్తిపై నుంచి దులిపేసుకుంటాననే రీతిలో వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలాఉంటే పార్టీ అధిష్టానం కూడా రేవంత్‌ను సమర్థించే రీతిలోనే వెళ్తోంది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మాణిక్యం ఠాగూర్ అన్ని విషయాల్లోనూ టీపీసీసీ అధ్యక్షుడికి అండగా నిలబడుతున్నారు. దీనికి తోడు రేవంత్‌కు సహకరించాల్సిందేనంటూ ముఖ్యనేతలందరికీ అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా కొందరు, బహి రంగంగా మరికొందరు చేస్తున్న వాదనలు నిల బడతాయా? దూకుడుగా వెళ్తున్న రేవంత్ శిబిరమే నిలబడుతుందా..? ఇరుశిబిరాలు శాం తిమంత్రం పఠిస్తాయా? నేటి పీఏసీ భేటీకి ఎవరెవరు వస్తారు? ఏం జరుగుతుంది.. అనేది అటు గాంధీభవన్వర్గాలను, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. -
రేవంత్ జైలు పాలయ్యే రోజు దగ్గరలోనే ఉంది
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు కేసులో కొద్ది రోజులు జైలుకు పోయిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శాశ్వతంగా జైలుకు పోయే రోజు దగ్గరలోనే ఉంది. రేవంత్‌వి బుడ్డరఖాన్ మాటలు. కాంగ్రెస్ డ్రామా కంపెనీ, ఆయన అందులో ఓ డ్రామా ఆర్టిస్టు. సమైక్యవాదుల పంజరంలో చిలుక రేవంత్.. వాళ్లు చెప్పేదే పలుకుతారు. చంద్రబాబు మేనేజ్‌మెంట్‌తోనే టీపీసీసీ అధ్యక్షుడు అయ్యారు. హుజూరాబాద్‌లో ఓడితే టీపీసీసీ అధ్యక్ష పదవి పోతుం దని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు’అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, జి.విఠల్‌రెడ్డి, మాజీ ఎంపీ గెడాం నగేశ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. 1981లో ఇంద్రవెల్లిలో ఆదివాసీలను కాల్చిచంపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆదివాసీలకు స్మారక స్తూపం కడతా మని ప్రకటించడం విడ్డూరంగా ఉందని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పూటకో పార్టీ మార్చిన రేవంత్‌ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలా నమ్ముతారని, సోనియాని బలిదేవతగా రేవంత్ గతంలో అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘నా మీద వ్యక్తిగతంగా మాట్లాడితే నాలుక తెగ్గోస్తా అని గతంలోనే హెచ్చరించినా రేవంత్ భాష మారడం లేదు. మరో 25 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది. పోడు భూములపై కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటార’ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మేమూ తిట్టడం మొదలు పెడితే..! ‘ఆర్టీఐ రెడ్డిగా పేరొందిన రేవంత్ సమాచార హక్కు చట్టాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించారు. భూమికి జానెడు లేవు.. బిడ్డా మేము తిట్టడం మొదలుపెడితే ఉరేసుకుని చస్తావ్, ద మ్ముంటే హుజూరాబాద్‌లో ఏదైనా మండల ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకో, ఎవరు గెలుస్తారో చూ ద్దాం’అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సవాల్ చేశారు. ‘కాంగ్రెస్ నేతలు ఇంద్రవెల్లిలో సభ పెట్టి పుండుమీద కారం చల్లారు. ఆదివాసీలతో చెలగాటం ప్రమాదకరం, విల్లు ఎక్కుపెడితే కోలుకోలేవు. ఒక్క సభతోనే రేవంత్ రెచ్చిపోతున్నాడు. టీఆర్ఎస్ ఇలాంటి సభలు వందలు పెట్టి ఉంటుంది. దళితబంధు ఆట ఇప్పుడే మొదలైంది క్లైమాక్స్ మిగిలే ఉంది’అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభ జరిగిన చోట ఆదివాసీలు శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారని, తెలంగాణ వచ్చిన తర్వాతే ఆదివాసీల బతుకులు బాగుపడ్డాయని మాజీ ఎంపీ జి.నగేశ్ చెప్పారు. బ్లాక్మెయిలర్లకు బ్రాండ్ అంబాసిడర్ ‘బ్లాక్మెయిలర్లకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్‌రెడ్డి, చంచల్‌గూడలో ఖైదీనంబరు 1779, చర్లపల్లిలో 4170. టీపీసీసీ అధ్యక్షుడు కాగానే రేవం త్‌కు వసూళ్లు పెరిగాయి, తమను వేధిస్తున్నారని బిల్డర్లు ఫిర్యాదు చేస్తున్నార’ని పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ చైర్మన్ ఏ.జీవన్‌రెడ్డి అన్నారు. ‘తెలంగాణకు రేవంత్ ముఖ్యమంత్రి కాదు కదా కనీసం చప్రాసీ కూడా కాలేరు. తాను జైలుకు వెళ్లివచ్చి అందరూ జైల్లో ఉండాలని కోరుకుంటున్నారు. రేవంత్ అధికారం గురించి కలలు కనడం మానేయాలి. కాంగ్రెస్ పార్టీని రేవంత్ భూస్థాపితం చేస్తారు’అని జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
భూముల వేలంలో అక్రమాలు జరిగాయి : రేవంత్ రెడ్డి
-
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకాన్ని హర్షించిన డాల్లస్ ఎన్నారైలు!
డాల్లస్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకాన్ని డాల్లస్ ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి భాద్యతలు తీసుకోవడం తెలంగాణ రాజకీయాలలో కీలక ఘట్టమని తెలంగాణకు చెందిన ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. మినర్వా బాంక్యేట్ హాల్లో జులై 9 శుక్రవారం జరిగిన అభినందన సభలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా దాదాపు రెండు వందల మందికి పైగా ఎన్నారైలు పాల్గొని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. నిజాం నవాబు మాదిరి పరిపాలన జరుతున్న తెలంగాణలో ప్రజల కోసం, యువకుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మాట్లాడే గొంతుకగా నిలిచిన పోరాట యోధుడు ఎంపీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం జరగాలని ఎన్నారైలు ఆకాంక్షించారు. ఈ అభినందన సభ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూమ్ లైవ్ లో పాల్గొని ఎన్నారైలని ఉద్దేశించి ప్రసంగించారు.రేవంత్ రెడ్డి తో పాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా జూమ్ లైవ్ లో పాల్గొని తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఎన్నారైలు కేక్ కట్ చేసి సీతక్క జన్మదిన వేడుకని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గోవింద్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, చంద్ర రెడ్డి పోలీస్, వసంత్ రామ్ రెడ్డి, ఫణి రెడ్డి బద్దం తదితరులు పర్యవేక్షించారు. -
టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి
-
‘మమ్మల్ని రాళ్లతో కొడితే.. నిన్ను చెప్పులతో కొట్టాలి’
-
‘ఠాగూర్‌కు రూ.25 కోట్లు ఇచ్చి పీసీసీ చీఫ్ తెచ్చుకున్నావ్’
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నోరుంది కదా అని ఏదైనా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. ‘‘రేవంత్‌రెడ్డి.. పార్టీ మారిన వాళ్లని రాళ్లతో కొట్టి చంపాలి అంటున్నాడు. మీరు రాళ్లతో కొడితే మేం చెప్పులతో కొడతాం’ అంటూ ఆయన ధ్వజమెత్తారు. మేం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం టీఆర్ఎస్లో వీలినం చేశామని పేర్కొన్నారు. మావి సేవా రాజకీయాలు, నీది స్వార్థ రాజకీయాలు అంటూ రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. మాణిక్కం ఠాగూర్‌కి రూ. 25 కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నావ్ అంటూ దుయ్యబట్టారు. ఓటుకి నోటు కేసులో దొరికిన దొంగ తమ గురించి మాట్లాడటం ఏమిటంటూ సుధీర్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రాజకీయ ఎదుగుదల అంతా వివాదాస్పదమే.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డి రాజకీయ ఎదుగుదల మొత్తం వివాదాస్పదమేనని, రాళ్లతో కొట్టి చంపండి అనేది రాజ్యాంగంలో ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో పార్టీ లు మారితే సంసారం, కానీ ఇక్కడ మారితే వ్యభిచారమా’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాజాంగ్యం ప్రకారమే తాము టీఆర్ఎస్లో విలీనమయ్యామని వెంకటరమణారెడ్డి తెలిపారు. -
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కూర్పులో కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. మరో ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, పది మందిని సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా నియమించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్య దర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ కుమార్ల సేవల పట్ల పార్టీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు, కార్యవర్గం నియామకం కోసం కాంగ్రెస్ అధిష్టానం గత ఏడాది డిసెంబర్లోనే కసరత్తు మొదలుపెట్టింది. అదే నెలలో ఏఐసీసీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 162 మంది నాయకుల అభిప్రాయాలను సేకరించింది. సామాజిక సమీకరణాలు, పార్టీలో ఇతర నాయకులను కలుపుకొని పోవడం, పార్టీ విధేయత, పలు ఇతర అంశాల ఆధారంగా.. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్, శ్రీధర్‌బాబుల పేర్లను ఏఐసీసీ పెద్దలు షార్ట్ లిస్ట్ చేశారు. అధ్యక్ష పదవితోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ఇతర కీలక కమిటీలు, పోస్టులకు ఎంపికపై చర్చించారు. జనవరి తొలివారంలోనే ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయి, ప్రకటనే తరువాయి అనుకున్న సమయంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కారణంగా వాయిదా పడింది. తిరిగి ఈ నెల 18న కసరత్తు మొదలుపెట్టారు. తాజాగా తుది జాబితాకు సోనియాగాంధీ ఆమోద ముద్ర వేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి తిరిగి బలోపేతం చేయాలని అధిష్టానం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న సుమారు 589 మండలాలకు ప్రస్తుతమున్న అధ్యక్షులను కొనసాగించాలా లేక కొత్తవారిని నియమించాలా అన్నదానిపై గతంలోనే సమాలోచనలు జరిగాయి. ఈ విషయం తేలాక జిల్లాస్థాయి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలు జరుగుతాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈసారి సోషల్ మీడియాలో పార్టీ ప్రచారానికి సంబంధించి మండల, జిల్లా స్థాయిల్లోనూ ప్రత్యేక నియామకాలు జరగనున్నాయని తెలిసింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు 1. సంభాని చంద్రశేఖర్ 2. దామోదర్‌రెడ్డి 3. మల్లు రవి 4. పొదెం వీరయ్య 5. సురేశ్ షెట్కార్ 6. వేం నరేందర్‌రెడ్డి 7. రమేశ్ ముదిరాజ్ 8. గోపిశెట్టి నిరంజన్ 9. టి.కుమార్‌రావు 10. జావీద్ అమీర్ ప్రచార కమిటీ 1. మధుయాష్కీ గౌడ్ – చైర్మన్ 2. సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ – కన్వీనర్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ దామోదర రాజనర్సింహ – చైర్మన్ ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ అల్లేటి మహేశ్వర్‌రెడ్డి – చైర్మన్ చదవండి: తెలంగాణలో జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కేసీఆర్ వరంగల్ పర్యటన: ఆ రోజు ఏం జరిగింది? -
క్లైమాక్స్‌కు చేరిన టీపీసీసీ ఎంపిక కసరత్తు
సాక్షి, ఢిల్లీ: టీపీసీసీ ఎంపిక కసరత్తు క్లైమాక్స్‌కు చేరింది. నాయకుల అభిప్రాయాలను రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ సేకరించారు. సీనియర్లకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కీలక నేతలు అంటున్నారు. కేసీఆర్ సర్కార్ పై దూకుడుగా పోరాడే నాయకులకి పగ్గాలు ఇవ్వాలని మరో వర్గం నాయకులు అంటున్నారు. అని వర్గాల అభిప్రాయాలను ఠాకూర్.. సోనియా ముందు ఉంచారు. టీపీసీసీ రేసులో ముందంజలో కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, మధుయాష్కీ ఉన్నారు. వీలైనంత త్వరలోనే పీసీసీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన వెలువడే అవకాశముంది కాగా, కాంగ్రెస్ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష వ్యవహారం వ్యవహారం నలుగుతూ వస్తుంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలకు తోడు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఒకరి వెనుక ఒకరు ఢిల్లీకి బయలుదేరి వెళ్లడంతో టీపీసీసీ అంశం మరోమారు చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఈ పదవిని ఆశిస్తున్న ఇద్దరు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డి హస్తిన బాట పట్టిన సంగతి విదితమే. మరో వైపు టీపీసీసీ అధ్యక్ష పదవిపై తనకు ఎటువంటి ఆసక్తి లేదని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి డి.శ్రీధర్‌బాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: Huzurabad: ‘సాగర్’ ఫార్మూలాతో ఈటలకు చెక్.. బాస్ ప్లాన్ ఇదేనా? -
టీపీసీసీ చీఫ్.. తేలేనా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. ఇటీవల జరుగుతున్న పరిణామాలకు తోడు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఒకరి వెనుక ఒకరు ఢిల్లీకి బయలుదేరి వెళ్లడంతో టీపీసీసీ అంశం మరోమారు చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఈ పదవిని ఆశిస్తున్న ఇద్దరు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డి హస్తిన బాట పట్టడం ప్రాముఖ్యత సంతరించుకుంది. దీనికితోడు ఇటీవలే కేరళ రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించడం, పంజాబ్‌లో పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించి కొత్త పీసీసీని ఎన్నుకునేందుకు కమిటీని ఏర్పాటు చేయడంతో తెలంగాణ కాంగ్రెస్ సంగతినీ అధిష్టానం ఈసారి తేల్చేస్తుందనే చర్చ తెరపైకి వచ్చింది. కానీ, దీనిపై గాంధీభవన్ వర్గాలు గుంభనంగానే ఉన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం స్థాయిలో మరిన్ని చర్చ లు జరగాల్సి ఉందని, ఆ తర్వా తే తేలుతుందని అంటున్నాయి. మూడు రోజులుగా అక్కడే.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధిపై కేంద్ర పెద్దలను కలుస్తున్న ఆయన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ అపాయింట్మెంట్ కూడా అడిగినట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలోనే మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా శుక్రవారం హస్తిన బాట పట్టడంతో అసలేం జరుగుతుందనే చర్చ రాష్ట్ర కాంగ్రెస్‌లో మొదలైంది. అయితే, రేవంత్ కూడా తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఎలాగూ ఢిల్లీ వెళ్లారు కనుక పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశముందని అంటున్నారు. వీరికి తోడు మరికొందరు ముఖ్య నాయకులు కూడా ఢిల్లీకి వెళ్లారని వార్తలు వచ్చినా అందులో నిజం లేదని అంటున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంపై రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలందరితో మాట్లాడిన తర్వాతే అధిష్టానం ఈ విషయాన్ని తేలుస్తుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇందుకు సంబంధించిన చర్చలు ఇంకా జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఎప్పటికి తేలుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారో వేచిచూడాల్సిందే! చదవండి: ‘స్వార్థం కోసమే ఈటల రాజీనామా చేశారు’ -
పీసీసీ: కలకలం రేపిన రేవంత్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడి నియామకం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ’పట్టు‘విడుపులు లేని నాయకుల పంతాలతో వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పార్టీ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డిలలో ఎవరో ఒకరిని ఈ పదవి వరిస్తుందనే చర్చ నిన్నటి వరకు జరగ్గా, ఇప్పుడు అనూహ్యంగా మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ ఇద్దరూ కాకుండా మధ్యేమార్గంగా రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు టి.జీవన్‌రెడ్డి, కె.జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, మర్రి శశిధర్‌రెడ్డిల పేర్లు ముందు వరుసలోకి వచ్చాయి. ఒకదశలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరు ఖరారైందన్న ప్రచారం కూడా జరి గింది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడొచ్చంటూ మంగళవారమంతా హడావుడి జరిగింది. కానీ, సాయంత్రానికి అలాంటిదేమీ లేదని అధిష్టానం తేల్చడంతో కాంగ్రెస్ శ్రేణులు నిట్టూర్చాయి. సామాజిక సమీకరణలు, పంతాలు, పట్టింపులు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, త్వరలో జరగబోయే ఎన్నికలు లాంటి అంశాల నేపథ్యంలో అసలు టీపీసీసీకి ఎవరిని ఎంపిక చేయాలన్నది పార్టీ అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి నాటికల్లా వ్యవహారాన్ని తేల్చాలా... నాగార్జునసాగర్ ఉపఎన్నిక వరకు వేచి ఉండాలా అనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ వ్యాఖ్యలతో...! వాస్తవానికి సోమవారం వరకు టీపీసీసీ అధ్యక్ష వ్యవహారంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్దగా చర్చ ఏమీ లేదు. కానీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. తానే టీపీసీసీ అధ్యక్షుడిననే ధీమాతో ఉన్న రేవంత్ ఉన్నట్టుండి తనకు అధ్యక్ష పదవే ముఖ్యం కాదని, ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదంటూ చేసిన వ్యాఖ్యలతో అసలు పార్టీలో ఏం జరుగుతుందోననే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే జీవన్‌రెడ్డి అధ్యక్షుడిగా, రేవంత్ ప్రచార కమిటీ చైర్మన్‌గా మంగళవారం అధికారిక ప్రకటన వెలువడుతుందనే ప్రచారం జరిగింది. అసలేం జరిగింది? టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినా ఫర్వాలేదంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వర్గాలు పలురకాలుగా విశ్లేషించాయి. పీసీసీ అధ్యక్ష పదవే కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ అధిష్టానానికి ఆయన వెసులుబాటు కల్పించారని, ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తాననే సంకేతాలు ఇచ్చారనే చర్చ జరిగింది. మరోవైపు అధిష్టానం నుంచి అలాంటి సంకేతాలు ఉన్నందునే రేవంత్ అలా మాట్లాడారని, ఆయనకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఖరారైందనే ప్రచారం సాగింది. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుని ఎంపికపై గురువారం నుంచి కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించనున్న నేపథ్యంలో... ఈలోపే తెలంగాణ పీసీసీని తేల్చేస్తుందనే అంచనాతో ఈ ఊహాగానాలు సాగాయి. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, జానారెడ్డి, శ్రీధర్‌బాబు, మధుయాష్కీ గౌడ్లకు ఫలానా పదవులంటూ రాష్ట్రంలో చర్చ జరిగిందని ఏఐసీసీ వర్గాలు చెపుతున్నాయి. సామాజిక సమీకరణాల మాటేమిటి? ఒకవేళ టీపీసీసీ అధ్యక్షునిగా జీవన్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌గా రేవంత్‌రెడ్డిని అధిష్టానం ఖరారు చేసిన పక్షంలో రెండు కీలక పదవులూ ఒకే సామాజిక వర్గానికి దక్కుతాయని, అది చాలా నష్టానికి కారణమవుతుందనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ రాజకీయ పరిస్థితుల ప్రకారం పీసీసీ అధ్యక్షుడు లేదా ప్రచార కమిటీ చైర్మన్ పదవుల్లో ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి తప్పకుండా కేటాయించాలని, అయితే రెండో పదవిని మాత్రం బీసీ లేదా ఎస్సీలకు కేటాయించాల్సి ఉంటుందని ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. నిన్నటి వరకు టీపీసీసీ రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏం చేస్తారన్న దానిపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయనకు సీడబ్ల్యూసీలో ఆహ్వానితుడిగా అవకాశం ఇస్తారనే ప్రచారం ఉన్నా... ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కాదని ఆయనకు కేటాయించే పరిస్థితి లేదని అంటున్నారు. ఒకవేళ కోమటిరెడ్డికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇస్తే టీపీసీసీ అధ్యక్షుడు, ప్రచార కమిటీ చైర్మన్, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీలోని ఇతర సామాజిక వర్గ నేతలను ఎక్కడ సర్దుబాటు చేయాలన్నది అధిష్టానానికి రిస్క్ ఫ్యాక్టర్‌గా మారిందని టీపీసీసీలో కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో బీజేపీ దూసుకువస్తోంది. ఆ పార్టీకి బీసీ అధ్యక్షుడు ఉన్నారు. టీఆర్ఎస్ కూడా బీసీలకు అనేక సమయాల్లో ప్రాధాన్యం ఇచ్చింది. మేం బీసీ, ఎస్సీలను విస్మరిస్తే నష్టమే జరుగుతుంది. తేడా వస్తే పునాదులే కదులుతాయి.. ఆచితూచి అడుగేయాలి’అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. సాగర్ ‘గుబులు’ మరోవైపు టీపీసీసీ అధ్యక్ష ఎన్నిక వ్యవహారాన్ని తేల్చకపోవడానికి నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా కారణమని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. అసంతృప్తులు, అలకలతో పార్టీ నేతలు సహకరించకపోతే... పార్టీకి నష్టం జరుగుతుందనే ఆలోచన కూడా అధిష్టానం చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత జరుగనున్న సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలవకపోతే రాష్ట్రంలో ఇక ఆ పార్టీ పరిస్థితి అంతేననే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో సాగర్ ఎన్నిక పూర్తయ్యేవరకు టీపీసీసీపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానాన్ని అడిగినట్టు గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. ముఖ్యంగా తన జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ సహకారం ఈ ఎన్నికల్లో తనకు అవసరమని, ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని జానా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి చివరి వారంలో ఈ ఉపఎన్నిక జరుగుతుందన్న అంచనా మేరకు అప్పటివరకు ఈ తలనొప్పి వ్యవహారాన్ని వాయిదా వేద్దామా..? లేక ముందుగా అనుకున్నట్టు సంక్రాంతి లోపు తేల్చేద్దామా? అనే తర్జనభర్జనలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. జీవన్‌రెడ్డికి అభినందనల వెల్లువ కాగా టీపీసీసీ అధ్యక్షుడిగా జీవన్‌రెడ్డి పేరు ఖరారైందన్న వార్తల నేపథ్యంలో ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. మంగళవారం ఆయన పుట్టినరోజు కూడా కావడంతో జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసానికి అభిమానులు బారులు తీరారు. అయితే ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడి విషయంలో ఇంతవరకు తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. ఎవరికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాల్సిందేనని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష వ్యవహారంలో ఇంకా ఏమీ తేలలేదని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ ‘సాక్షి’కి వెల్లడించారు. -
రేవంత్‌కన్నా నాకే క్రేజ్ ఎక్కువ ఉంది..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని ఎవరిని వరిస్తుందనే దానిపై కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అధ్యక్ష పదవి కోసం పార్టీ సీనియర్లు హస్తిన వేదికగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ జాబితాలో ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముందువరుసలో ఉన్నారు. వీరితో పాటు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మల్లుభట్టి విక్రమార్క, జగ్గారెడ్డి సైతం పీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే అటు ఢిల్లీలోనూ.. ఇటు హైదరాబాద్‌లోనూ రేవంత్ పేరే ప్రముఖంగా వినపడుతోంది. ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోన్న సమాచారం ప్రకారం.. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా దాదాపు ఖరారు అయ్యారని, అధికారికంగా ప్రకటించడమే ఆలస్యమని తెలుస్తోంది. దీంతో అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీపడిన కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిరాశకు లోనవుతున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్ష పదవి ఎంపికపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకత్వ బాధ్యతలు టీడీపీ నుంచి వచ్చి న రేవంత్‌కు అప్పగించడం సరైనది కాదని నిరసన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని, ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చారని విమర్శించారు. అతన్ని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే తాను పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. తనతోపాటు చాలామంది కాంగ్రెస్ పార్టీని వీడుతారని వ్యాఖ్యానించారు. పార్టీలోని సీనియర్లను విస్మరిస్తున్నారని, సీనియర్ నేతలంతా అసంతృప్తిలో ఉన్నారన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. చదవండి: టీపీసీసీ చీఫ్ ఎంపిక దాదాపు పూర్తి! కాంగ్రెస్‌లో తాను సీనియర్ అని వీహెచ్ హనుమంతరావు అన్నారు. గాంధీ కుటుంబానికి దగ్గరగా ఉన్నానని, ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఏం సంపాదించుకోలేదన్నారు. 2018 నుంచి ఇప్పటి వరకూ సోనియాగాంధీని కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని, కావాలనే కలవకుండా ఒక సెక్షన్ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ విషయంపై హైకమాండ్ ఆలోచన చేయాలన్నారు. తనకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వారని వీహెచ్ సూటిగా ప్రశ్నించారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఓటమిపై రివ్యూ ఎందుకు చేయరని నిలదీశారు. రేవంత్ మాస్ లీడర్ అయితే, గ్రేటర్లో 48 సీట్లు తీసుకొని 2 స్థానాలు మాత్రమే గెలిచిందని ఎద్దేవా చేశారు. ఆయన టీడీపీని ఖతం పట్టించి, కాంగ్రెస్‌లో పడ్డారని ఎద్దేవా చేశారు. పోలీస్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు చరిత్ర చూస్తారు కానీ రేవంత్ చరిత్ర ఎందుకు చూడలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా తమని పిలిచి మాట్లాడాలని అన్నారు. లేదని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే... తమ నిర్ణయం తాము తీసుకుంటామని హెచ్చరించారు. ‘మీడియా, సోషల్ మీడియాతోనే రేవంత్ లీడర్ అయ్యాడు. పీసీసీ విషయంలో సమాచారం ఉన్నందుకే మాట్లాడుతున్నాను. అభిప్రాయ సేకరణలో నేను ఇచ్చిన ఆధారాలను అధిష్టానానికి చేరకుండా ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అడ్డుకున్నాడు. ఆయన అధిష్టానానికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు. ఆయన ప్యాకేజీకి అమ్ముడుపోయాడు. రేవంత్ తమ్ముడు.. దళితుల భూమి కబ్జా చేస్తే మీడియా ఎందుకు రాయదు. రేవంత్ మీడియాను పార్టీ హైకమాండ్‌ను మేనేజ్ చేస్తున్నాడు. రేపటి నుంచి టీఆర్ఎస్ తెలంగాణ వ్యతిరేకిని పీసీసీ చీఫ్ చేశారని ప్రచారం చేస్తుంది. మేం ఆయనను కలవడానికి జైలుకు పోవాలా. ఈ వాస్తవాలను వివరిస్తూ లెటర్ రాసినా. మాస్ లీడర్ అయితే కొడంగల్‌లో రేవంత్ ఎందుకు ఓడిపోయాడు. మూడు రోజుల నుంచి నా ఫోన్‌ను మాణిక్కం ఠాగూర్ ఎత్తడం లేదు. బీసీగా ఉన్న డీ శ్రీనివాస్ రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు. తెలంగాణ కోసం పోరాటం చేశాడు. అలాంటి వ్యక్తికి ఇవ్వాలి’ అని సూచించారు. గతంలో ఎంఐఎంతో పొత్తు పెట్టించాడని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ ఉన్నోడికి ఇవ్వమంటరా అని మండిపడ్డారు. కొందరు పైసలకు అలవాటు పడి భజన చేస్తున్నారని, రేవంత్ వద్ద పైసలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. దీనిపై సీబీఐకి లేఖ రాస్తాననని అన్నారు. రేవంత్ ఊరికి పోయి ఆయన చరిత్ర బయటికి తీస్తానని సవాల్ విసిరారు. చివరిసారి అడుతున్నానని.. తామంటే లెక్కలేదా.. పీసీసీ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. పీసీసీ పదవి రెడ్డిలకు ఇవ్వాలనుకుంటే అసలైన రెడ్డికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భట్టి విక్రమార్క పదవి నుంచి తీస్తారని అంటున్నారు. ఆయన్ను ఎందుకు తీస్తారు అని వీహెచ్ ప్రశ్నించారు. ఇవాళ ఉదయం కూడా పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క అందరితో మాట్లాడినట్లు తెలిపారు. -
టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక: తెరపైకి విభేదాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం రసకందాయంలో పడింది. అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. అధ్యక్ష పదవికి రేసులో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలోని సీనియర్లతో జట్టు కట్టారు. నలుగురు ఎమ్మెల్యేలతో వెళ్లి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌ను కలసి తమ వాదనను వినిపించారు. అభిప్రాయ సేకరణ ప్రక్రియలో చివరిరోజు శనివారం ఆసక్తికర పరిణామా లు చోటు చేసుకున్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్యలు అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ను నియమిస్తారనే ఊహాగానాల నేపథ్యంలోనే వీరంతా సమావేశమయ్యారని చర్చ మొదలైంది. ఎంపీ, ఎమ్మె ల్యేలు కలిసికట్టుగా గాంధీభవన్‌కు చేరుకుని... పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై తమ అభిప్రాయాన్ని ఠాగూర్‌కు తెలియజేశారు. వీరు వచ్చిన ఐదు నిమిషాలకే రేవంత్ కూడా గాంధీభవన్‌కు వచ్చి ఠాగూర్ వద్దకు వెళ్లారు. రేవంత్ రావడంతో ముం దుగా వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు, ఎంపీ కోమటిరెడ్డి కొద్దిసేపటికే బయటకు వచ్చారు. ఇన్చార్జికి అన్నీ వివరించాం: జగ్గారెడ్డి మాణిక్యంను కలిసిన అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఎంపీ కోమటిరెడ్డితో కలిసి తమ మనసులో ఏముందో ఇంచార్జికి చెప్పామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ మామూలే అంటూనే... ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చీలిపోకుండా ఉండేందుకే ఠాగూర్‌ను కలిశామని చెప్పడం గమనార్హం. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని, పార్టీలో ఏం జరుగుతోందన్నది గమనించాలని ఇంచార్జికి సూచించినట్టు వెల్లడించారు. పీసీసీ అధ్యక్ష ఎంపిక వ్యవహారంలో మెజారిటీ అభిప్రాయం అని కాకుండా... ఏకాభిప్రాయం సాధించాలని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటా రని జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీకి ఠాగూర్ టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం ఢిల్లీకి చేరింది. మాణిక్యం ఠాగూర్ తన పర్య టనను ముగించుకుని శనివారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లిపోయారు. ఈనెల 9 నుంచి 12 వరకు ఆయన దాదాపు 160 మంది రాష్ట్ర కాంగ్రెస్ నేతలను కలిసి కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందన్న దానిపై వేర్వేరుగా అభిప్రా యాలను తెలుసుకున్నారు. వీటిని క్రోడీకరించి ఏఐసీసీ అధ్యక్షురాలు సోని యాకు నివేదిక ఇవ్వనున్నారు. దీనిపై సోనియా తుది నిర్ణయం తీసుకుంటారు. -
ఢిల్లీ వైపు ఉత్తమ్ చూపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)లో త్వరలో మార్పులు జరగబోతున్నాయి. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంకల్లా టీపీసీసీ అధ్యక్షుని మార్పుతో పాటు ఏఐసీసీ స్థాయిలో పలువురికి పదవులు లభించనున్నట్టు గాంధీభవన్‌లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా తీసుకుంటారనీ, ఆయన స్థానంలో భువనగిరి ఎంపీ, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమిస్తారని తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా కోమటిరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టేనని, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్లు తుది పరిశీలనలో ఉన్నాయని, దీనిపై త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ఉత్తమ్ సేవలను ఢిల్లీ స్థాయిలో ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ఆయనకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అవకాశమిచ్చి ఒకటి లేదా రెండు రాష్ట్రాలకు పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా నియమించనున్నట్టు తెలుస్తోంది. ఉత్తమ్‌తో పాటు ఒకరిద్దరు తెలంగాణ నేతలకు ఏఐసీసీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. కోమటిరెడ్డి.. ఖరారే! టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఖరారైనట్టేనని గాంధీభవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో ఆయన ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్‌లో.. తర్వాత ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని కూడా వదులుకున్నారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొని మూడు మున్సిపాలిటీలపై పార్టీ జెండా ఎగురవేయడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే. ఆయన గతంలో పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా.. ప్రస్తుతం కాంగ్రెస్‌తోనే సర్దుకుపోయి పనిచేస్తున్నారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో మెరుగైన ఫలితాలు సాధించారు. ఈ ఇద్దరు సోదరులు.. టీపీసీసీ పగ్గాలు ఇస్తే దీటుగా పనిచేస్తామని, పార్టీని అధికారంలోకి తెస్తామని చాలాకాలంగా పార్టీ అధిష్టానానికి చెబుతూ వస్తున్నారు. మరోవైపు వెంకటరెడ్డి లోక్‌సభకు ఎన్నికైనప్పటి నుంచీ కేంద్రంలోని పెద్దలందరినీ కలుస్తూ తన నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు నిధుల కోసం చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటూ సోనియాగాంధీకి విధేయుడిగా ముద్రపడిన ఆయనకు అవకాశమివ్వాలని అధిష్టానం దాదాపు నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం టీపీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు. ఈ పదవుల్ని ఒకటి లేదా రెండుకు పరిమితం చేసి.. ఒక బీసీ, మరో ఎస్సీ నేతకు ఈ హోదా కల్పించవచ్చని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. రాహుల్ టీమ్‌లో రేవంత్! వాస్తవానికి, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి టీపీసీసీ పగ్గాలు అప్పగించే అంశాన్ని ఏఐసీసీ సీరియస్‌గానే పరిశీలించింది. రేవంత్ కూడా పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో తనకు అవకాశమివ్వాలని అధిష్టానాన్ని కోరారు కూడా. అయితే, రేవంత్‌రెడ్డి రాష్ట్ర పార్టీలో కీలక నాయకుడని, ఎన్నికలకు ముందు రేవంత్ అస్త్రాన్ని ప్రయోగించాలనే భావనతో ప్రస్తుతానికి ఆయనను రాహుల్ టీంలో నియమించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో యాత్రను ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ యాత్రను సమన్వయం చేసే బాధ్యతను రేవంత్‌కు అప్పగిస్తారని, ఆయనతో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు, ఏఐసీసీ కార్యదర్శులు ఎస్.సంపత్‌కుమార్, చల్లా వంశీచందర్‌రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్‌కు రాహుల్ టీంలో చోటు కల్పిస్తారనే చర్చ పార్టీవర్గాల్లో జరుగుతోంది. గీతారెడ్డికి కీలక పదవి మహిళా కోటాలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డికి ఏఐసీసీలో కీలక పదవి లభిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్‌గా ఉన్న ఆమెను కూడా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించనున్నట్టు సమాచారం. ఏఐసీసీ పదవుల రేసులో మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ కాంగ్రెస్ నేత, సీఎల్పీ మాజీ నాయకుడు కె.జానారెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దామోదర రాజనర్సింహకు కూడా ఏఐసీసీ అనుబంధ విభాగాల్లో చోటు లభిస్తుందని సమాచారం.