పొన్నాల అరెస్ట్ పై కాంగ్రెస్ శ్రేణుల నిరసన | congress agitation on ponnala's arrest | Sakshi
Sakshi News home page

పొన్నాల అరెస్ట్ పై కాంగ్రెస్ శ్రేణుల నిరసన

Published Sun, Feb 8 2015 7:23 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

congress agitation on ponnala's arrest

అచ్చంపేటరూరల్ (మహబూబ్‌నగర్): తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల తదితర నేతలను ప్రభుత్వం అరెస్టు చేయటంపై మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు.అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..కేసీఆర్ అరాచక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఛాతీ వ్యాధుల ఆస్పత్రిని మరో చోటికి తరలించటం సరికాదని హితవు పలికారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ రాధ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement