ఆలేరు, న్యూస్‌లైన్,కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కోరారు. ఆలేరులో బుధవారం ఆయన ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌తో కలిసి ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.700 కోట్లతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశానని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని కోరాఉఉ. అంతకుముందు టీఆర్‌ఎస్ నాయకులు కొలుపుల హరనాథ్, మొరి గాడి వెంకటేశ్ ఆధ్వర్యంలో 250 మంది కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు.
కార్యక్రమంలో వరంగల్ డీసీసీబీ ైచైర్మన్ జంగ రాఘవరెడ్డి, స్థానిక మార్కెట్ చైర్మన్ శం కర్‌నాయక్, నాయకులు ఎంఎస్ విజయ్‌కుమార్, ఇల్లందుల మల్లేషం గౌడ్, ఎలుగల కృష్ణ, సర్పంచ్ కందగట్ల నిర్మల, నీలం పద్మ, నీలం వెంటస్వామి, గ్యాదపాక నాగరాజు, కందుల శంకర్, కె సాగర్‌రెడ్డి, యాదగిరి, మల్‌రెడ్డి నర్సింహారె డ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, ఎలుగల వెంకటేష్, ఎజాజ్, జూకంటి రవీందర్, జూకంటి ఉప్పలయ్య, సముద్రాల కల్పన పాల్గొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
భువనగిరి : తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రజలను కోరారు. శుక్రవారం ఆయన వరంగల్ వెళ్తూ కొద్దిసేపు భువనగిరి బైపాస్ టీచర్స్ కాలనీ వద్ద ఆగారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను తీర్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోత్నక్ ప్రమోద్‌కుమార్, నాయకులు ఎంఎ మాజీద్ బాబా, చిందం మల్లిఖార్జున్, దొనకొండ వనిత, అలీకౌసర్ పాలొన్నారు.