local body elections 2014
-
పదవులొచ్చినా పగ్గాలేవి!
సాక్షి, ఏలూరు : జిల్లాలో నగర, పురపాలక సంఘాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగినా పాలకవర్గాలు ఎప్పుడు కొలువు తీరతాయనే దానిపై స్పష్టత కొరవడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గెలిచిన అభ్యర్థులు పదవులు చేపట్టకుండా స్తబ్దుగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. స్థానిక సంస్థలు దాదాపు మూడేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలోనే ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు విడుదల కాలేదు. పాలన గాడిన పడే రోజు కోసం ప్రజలు, పదవి చేపట్టే సమయం కోసం గెలిచిన అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. రెండు నెలల నిరీక్షణ 2010 సెప్టెంబర్‌తో పాలకవర్గం గడువు ముగిసిన ఏలూరు నగరపాలక సంస్థ, నిడదవోలు, కొవ్వూరు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాలు, కొత్తగా ఏర్పడిన జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి మార్చి 30న ఎన్నికలు జరిగాయి. 4 స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవం కాగా, 287 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. నిజానికి ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. అదేనెల 7న మేయర్, డెప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టాలని నిర్ణయించారు. అయితే, కోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కిం పు వాయిదా పడింది. ఈ నెల 12న పురపాలక ఫలితాలు ప్రకటించారు. ఇందుకోసం 43 రోజులు ఎదురుచూసిన అభ్యర్థులు గెలిచిన తర్వాత కూడా పదవి చేపట్టడానికి నిరీక్షించక తప్ప డం లేదు. మునిసిపల్ కౌన్సిల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటా రు. కొన్ని సందర్భాల్లో వీరి ఓటు అత్యంత కీలకం అవుతుంటుంది. అయితే గత శాసనసభ రద్దు కావడంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైతే తప్ప పాలకవర్గం ఏర్పాటుకు మార్గం ఏర్పడలేదు. ఈనెల 7న సార్వత్రిక ఫలితాలు వచ్చాక కూడా పురపాలక సంఘాల పాలకమండళ్ల ఏర్పాటుపై చలనం లేదు. ఎంపీల పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. జూన్ రెండు తర్వాత కొత్త ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవీ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాతే స్థానిక సంస్థలకు పాలకవర్గాలు ఏర్పాటవుతాయి. పాలకవర్గాలు ఉంటే తప్ప నిధులు విడుదలచేయడం కుదరదని కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పడంతో మునిసిపాలిటీలకు రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. అవి రావాలంటే మరికొంత సమయం వేచి చూడక తప్పదు. -
వైఎస్సార్ సీపీ దూకుడు
సాక్షి, ఒంగోలు: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు పడ్డాయి. పరిషత్‌పోరులో ఇప్పటికే ఆధిక్యత చాటుకుని జెడ్పీపీఠాన్ని కైవసం చేసుకున్న ఆపార్టీ ... సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత బలీయమైన శక్తిగా అవతరించింది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ మరింత బలోపేతమైంది. అన్నివర్గాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఇటు లోక్‌సభ, అటు శాసనసభ ఎన్నికల్లోనూ ఆపార్టీకి ఓట్లశాతం కూడా గణనీయంగా పెరిగింది. అసెంబ్లీ కంటే లోక్‌సభ ఎన్నికల్లో 10 నుంచి 14 శాతం ఓట్లు అధికంగా వైఎస్సార్ సీపీకి నమోదుకావడం విశేషం. మొత్తంమీద జిల్లాలో ఓట్లశాతంలో, సీట్ల సాధనలో వైఎస్సార్ సీపీ దూసుకుపోయింది. గిరగిరమంటూ ‘ఫ్యాన్’గాలి జిల్లాలో ఒంగోలు, బాపట్ల లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీలు, నెల్లూరు కిందనున్న కందుకూరు అసెంబ్లీలో వైఎస్సార్ సీపీకి పోలైన ఓట్లను పరిశీలిస్తే.. 49.06 శాతం మంది ఓటర్లు వైఎస్సార్ సీపీకి జేజేలు పలికారు. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 24.5 లక్షల మంది ఓటర్లున్నారు. ఎన్నికల్లో 20,85,923 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వారిలో వైఎస్సార్ సీపీకి 9,80133, టీడీపీకి 9,72,310, కాంగ్రెస్‌కు 16,837 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీకి పోలయిన ఓట్లలో వైఎస్సార్ సీపీకి 46.98 శాతం, టీడీపీకి 45.99, కాంగ్రెస్‌కు 0.76 శాతం ఓట్లు లభించాయి. లోక్‌సభ అభ్యర్థులకు పోలయిన ఓట్లలో వైఎస్సార్ సీపీకే అధికంగా 49.06 శాతం నమోదుకావడం విశేషం. ఆధిక్యతల విషయంలోనూ టీడీపీ కంటే వైఎస్సార్ కాంగ్రెస్ మంచి రికార్డు సాధించింది. జిల్లాలోని 12 అసెంబ్లీలకు గాను 6 స్థానాల్లో పార్టీ పాగా వేసింది. యర్రగొండపాలెంలో పోలైన ఓట్లు మొత్తం 1,57,090 కాగా, ఇందులో 85,417 ఓట్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థి పాలపర్తి డేవిడ్‌రాజుకు అనుకూలంగా పడ్డాయి. సమీప టీడీపీ ప్రత్యర్థి బూదాల అజితారావు కంటే 19,150 ఓట్లు అధికంగా డేవిడ్‌రాజుకు మెజార్టీ రావడం విశేషం. గిద్దలూరు నుంచి ముత్తుముల అశోక్‌రెడ్డి 12,893 ఓట్ల మెజార్టీ సాధించారు. మిగిలిన నాలుగుస్థానాల్లో 10 వేలలోపు మెజార్టీ వచ్చింది. ఇదే ఉత్సాహం.. ఊపును భవిష్యత్‌లోనూ చూపేందుకు ఉద్యమ చైతన్యాన్ని పార్టీకేడర్లో నూరిపోసేందుకు నాయకులు కసరత్తు చేస్తున్నారు. -
అదృష్టలక్ష్మి ఎవరో..?
హన్మకొండ, న్యూస్‌లైన్: జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠం చిక్కుముడి వీడడం లేదు. 24 స్థానాలను దక్కించుకుని మెజార్టీలో ఉన్న కాంగ్రెస్... చైర్పర్సన్ అభ్యర్థిత్వం ఇంకా ఖరారు చేయడం లేదు. 18 స్థానాల్లో గెలిచిన టీఆర్ఎస్ కూడా దోస్తీ కోసం కుస్తీ పడుతోంది. ఆయా పార్టీల తరఫున ఎస్సీ మహిళ రిజర్వ్డ్ స్థానాల్లో గెలిచిన మహిళలను చైర్పర్సన్ పీఠం కోసం ఎంపిక చేయడం పార్టీలకు తలనొప్పిగా మారింది. జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ రెండు అడుగుల దూరంలో ఉన్నా... డీసీసీ మాజీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి తీరు ఆ పార్టీని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తన వర్గానికే చైర్పర్సన్ పీఠం ఇవ్వాలని దొంతి పట్టుబడుతున్న విషయం విదితమే. కానీ... కాంగ్రెస్ ఇటీవల భీమారంలోని ఓ ఫంక్షన్ హాల్ నుంచి పార్టీ తరఫున గెలిచిన జెడ్పీటీసీ సభ్యులను క్యాంపునకు తరలించింది. అంతకుముందు నిర్వహించిన పార్టీ నేతల సమావేశంలో గోవిందరావుపేట నుంచి గెలిచిన నామవరపు విజయలక్ష్మిని చైర్పర్సన్ అభ్య ర్థిగా సూచనప్రాయంగా పేర్కొన్నారు. ఇక... టీఆర్ఎస్ కూడా జెడ్పీ పీఠంపై మంతనాలు సాగిస్తోంది. లోకల్ అలయెన్స్‌లో భాగంగా అవసరమున్న పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు చర్చలు జరుపుతోంది. తమ పార్టీ తరఫున పర్వతగిరి ఎస్సీ జనరల్ స్థానం నుంచి గెలిచిన మాదా సి శైలజకు చైర్పర్సన్ అభ్యర్థిత్వం ఖరారు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇదే పార్టీలో నర్మె ట నుంచి గెలిచిన గద్దల పద్మ కూడా జెడ్పీ పీఠా న్ని ఆశిస్తున్నారు. ఇదే అనువైన సమయంగా త మ గాడ్ఫాదర్ల వద్ద నుంచి వారు చక్రం తిప్పుతున్నారు. పోటీ వీరికే... ఎస్సీ మహిళా స్థానాల్లో కాంగ్రెస్ తరఫున దేవరుప్పుల నుంచి నల్ల అండాలు, కొడకండ్ల నుంచి బాకి లలిత, గోవిందరావుపేట నుంచి నామవరపు విజయలక్ష్మి, ఎస్సీ జనరల్ స్థానంలో నె క్కొండ నుంచి బక్కి కవిత గెలిచారు. టీఆర్ఎస్లో ఎస్సీ మహిళా స్థానం నర్మెట నుంచి గద్దల పద్మ నర్సింహారావు, పర్వతగిరి ఎస్సీ జనరల్ నుంచి మాదాసి శైలజ గెలుపొందారు. జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాల్లో 24 కాంగ్రెస్, 18 టీఆర్ఎస్, 6 టీడీపీ, ఒక్కో స్థానం చొప్పున బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించా రు. తాడ్వాయి నుంచి కాంగ్రెస్ రెబల్‌గా సరోజన బరిలోకి దిగి గెలుపొందారు. ఆమె తమ పార్టీలో కే వస్తుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉన్న కాం గ్రెస్ పెద్దలు ఇప్పటికే తమ పార్టీ జెడ్పీటీసీ సభ్యులను క్యాంపునకు తరలించారు. ఈ క్యాంపునకు డీసీసీ మాజీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి వర్గం దూరంగా ఉంది. తన వర్గంలో 8 మంది జెడ్పీటీసీ సభ్యులున్నారని దొంతి వర్గం ఇప్పటికే ప్ర చారం చేసుకుంటోంది. జెడ్పీ పీఠం తన సెగ్మెం ట్లోని నెక్కొండకు ఇస్తే... మద్దతు ఇస్తానంటూ దొంతి డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ... కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మాత్రం గోవిందరావుపేట జెడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి వైపే మొగ్గు చూపుతున్నారు. దొంతి మద్దతు తప్పనిసరి కావాల్సిన పరిస్థితి ఉండడంతో కాంగ్రెస్ నేతలు తలపట్టుకుంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో... ఆ పార్టీకి చెందిన జిల్లా నేతలు జెడ్పీ పీఠంపై ఆశతో ఉన్నారు. ప్ర భుత్వం వస్తుందనే ధీమాతో తమ పార్టీని వదిలి ఎవరూ వెళ్లరని భావించిన టీఆర్ఎస్ నిన్నటి దాకా నిర్వహించిన క్యాంపును రద్దు చేసింది. ఆ పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులను ఇళ్లకు పం పించారు. ఈ పార్టీ నుంచి పర్వతగిరి జెడ్పీటీసీ స భ్యురాలు మాదాసి శైలజ, నర్మెట జెడ్పీటీసీ గద్దల పద్మ పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఈ మే రకు గులాబీ నేతలు టీడీపీ, బీజేపీ, స్వతంత్ర జెడ్పీటీసీ సభ్యులతో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. వీరందరి మద్దతు కూడగడితే... టీఆర్ఎస్కే జెడ్పీ పీఠం దక్కుతుంది. -
నంద్యాల ఓటరు లెక్కతప్పింది!
నంద్యాల, న్యూస్‌లైన్ : మూడు దశాబ్ధాల తర్వాత నంద్యాల ఓటర్ల లెక్కతప్పింది. ప్రతిసారి నంద్యాల నియోజకవర్గంలో అధికార పక్షానికి పట్టం కట్టడం సంప్రదాయంగా వస్తుండేది. అయితే ఈ సారి మాత్రం ఓటర్లు భిన్నంగా తీర్పు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో ఎన్నికలు రెండు ప్రధాన సెంటిమెంట్లు ఉన్నాయి. ఈసారి అందులో ఒకటి విఫలం కాగా మరొకటి సఫలమైంది. ఫలితం తారుమారైంది నంద్యాల ఎమ్మెల్యేగా ఏ పార్టీకి చెందిన వారు గెలుపొందితే అదే పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపడుతుండేది. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో నంద్యాల నుంచి టీడీపీ అభ్యర్థులు సంజీవరెడ్డి, ఫరూక్ గెలుపొందగా రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా కొనసాగారు. 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు స్థానికంగా గెలుపొందగా రాష్ట్రంలో కూడా ఇదే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏడు ఎన్నికలు తర్వాత మొదటి సారి సెంటిమెంట్‌ను స్థానిక ఓటర్లు తిరగరాశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోగా నంద్యాలలో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమానాగిరెడ్డి విజయం సాధించారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే లేనేలేడు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేనే లేడు. నియోజకవర్గం మొదటి ఎమ్మెల్యే మల్లు రామచంద్రారెడ్డి, ఫరూక్, బొజ్జా వెంకటరెడ్డి రెండు సార్లు వరుసగా గెలుపొంది మూడోసారి ఓడిపోయారు. ఈ సారి చరిత్ర తిరగరాయాలని శిల్పామోహన్‌రెడ్డి ప్రయత్నం చేశారు. ఆయన రెండుసార్లు వరుసగా గెలుపొందారు. అయినా మూడోసారి ఓటమి చూడక తప్పలేదు. దీంతో హ్యాట్రిక్ మిస్ అయినా నాయకుల్లో శిల్పా కూడా చేరారు. -
ఆమెకు ఎదురులేదు!
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని విషయాల్లో ప్రతిభ చాటుతున్నారు. ఈ పనులు పురుషులు మాత్రమే చేయగలరనే భావనను చెరిపేస్తూ.. అవకాశమిస్తే తాము దూసుకుపోతామని నిరూపిస్తున్నారు. అవనిలోనే కాదు.. అంతరిక్షంలోనూ ‘ఆమె’ ఎదురులేదని నిరూపిస్తోంది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన నేపథ్యంలో రాజకీయాల్లోనూ వీరి ప్రాతినిధ్యం పెరుగుతోంది. ఇటీవల ముగిసిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో వీరి సంఖ్య అమాంతం పెరిగిపోవడమే అందుకు నిదర్శనం. 2006కు ముందు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ మాత్రమే ఉండటంతో జిల్లాలోని 53 జెడ్పీటీసీ స్థానాల్లో 17 స్థానాలను మహిళలు కైవసం చేసుకున్నారు. అప్పటి రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు.. బీసీలు ఏడుగురు.. అన్ రిజర్వు కింద ఏడుగురు మహిళలు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రిజర్వేషన్ 50 శాతానికి చేరుకున్న నేపథ్యంలో 27 మంది మహిళలు జెడ్పీటీసీ స్థానాల్లో పాగా వేశారు. రిజర్వేషన్ ప్రకారం ఎస్టీలు 1, ఎస్సీలు 5, బీసీలు 11, అన్ రిజర్వు కింద 10 స్థానాలను మహిళలకే కేటాయించారు. గత నెల 6, 11 తేదీల్లో నిర్వహించిన ప్రాదేశిక ఎన్నికల్లో ఈ స్థానాల్లో మహిళలు విజయఢంకా మోగించారు. వీరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధికంగా 14 మంది మహిళలు.. టీడీపీ తరఫున 11, కాంగ్రెస్ తరఫున 1, ఆర్పీసీ తరఫున ఒకరు జెడ్పీ పాలనలో భాగస్వాములు కానుండటం విశేషం. టీడీపీ మహిళా జెడ్పీటీసీలు వి.సరస్వతి(కల్లూరు), ఎం.లక్ష్మిదేవి(క్రిష్ణగిరి), పి.జగదీశ్వరమ్మ(గోస్పాడు), నారాయణమ్మ(పాణ్యం), వెంకటలక్ష్మమ్మ(రుద్రవరం), పి.సుశీలమ్మ(ఆస్పరి), సరస్వతి(దేవనకొండ), లక్ష్మి(కౌతాళం), పుష్పావతి(నందవరం), ఈ.సుకన్య (పత్తికొండ), కె.వరలక్ష్మి(తుగ్గలి). కాంగ్రెస్, ఆర్పీఎస్ మహిళా జెడ్పీటీసీలు జి.శారదమ్మ(కోడుమూరు), రాధమ్మ(పగిడ్యాల). వైఎస్సార్సీపీ మహిళా జెడ్పీటీసీలు ఎం.పద్మావతమ్మ(బేతంచెర్ల), బి.కె.నాగజ్యోతి(గూడూరు), ఎం.కె.మాధవి(కర్నూలు), చింతకుంట లక్ష్మి(నందికొట్కూరు), బి.అశ్వర్థమ్మ(బండిఆత్మకూరు), టి.నాగమ్మ(చాగలమర్రి), వై.సరస్వతి(కొలిమిగుండ్ల), ఎం.లక్ష్మిదేవి(నంద్యాల), గోపిరెడ్డి సుభద్రమ్మ(ఉయ్యాలవాడ), రాములమ్మ(గోనెగండ్ల), కె.గంగమ్మ (హొళగుంద), దళవాయి మంగమ్మ(కోసిగి), రేణుకాదేవి(పెద్దకడుబూరు), జయమ్మ(ఎమ్మిగనూరు). -
వైఎస్సార్సీపీకే జెడ్పీ పీఠం
-
వైఎస్ఆర్ సీపీ.. నిర్ణయాత్మక శక్తి
చైర్మన్ల ఎంపికలో వారే కీలకం మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర రాజకీయాల్లో తనదైన లక్ష్యం, సిద్ధాంతాలతో వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో కూడా పోరు బరిలో నిలచి తనవంతు పాత్రను పోషించింది. రాజకీయ సంక్లిష్టత ఉన్న తరుణంలో కూడా పార్టీ తన ముద్ర వేసేందుకు జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి గట్టి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించి వ్యూహాత్మకంగా పార్టీకి ఊపునివ్వగలిగారు. తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రమైన కల్వకుర్తి మునిసిపాలిటీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను పోటీలోకి దించి నిబద్దత ను చాటుకున్నారు. ప్రత్యర్థి పార్టీలన్నీ ఏకమై తలపడినప్పటికీ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల గెలుపు కోనం పార్టీ శ్రేణులు సమష్టి కృషిచేసి గట్టి పోటీనిచ్చారు. కల్వకుర్తిలోని 12వ వార్డు నుంచి జానకమ్మ టీఆర్ ఎస్ అభ్యర్థిపై, 15వ వార్డు నుంచి ఖుర్షీద్ బేగం బీజేపీ అభ్యర్థిపై , 20వ వార్డు నుంచి మహ్మద్ షాహిద్ కాంగ్రెస్ అభ్యర్థిపై, 5వ వార్డు నుంచి సౌజన్య టీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. కాగా, రాజకీయ సమీకరణల్లో భాగంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన వైఎస్ఆర్ సీపీ నాయకురాలు శ్రావణికూడా టీఆర్ఎస్ అభ్యర్థిపై గెలిచింది. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ మునిసిపాలిటీలోని 36వ వార్డులో వైఎస్ఆర్ సీపీ నుంచి పోటీచేసి సమీప స్వతంత్ర అభ్యర్థిపై విజయం సాధించి చైర్మన్ ఎంపికలో ప్రధాన భూమిక పోషించనున్నారు. -
పుంగనూరులో టీడీపీ ఘోర పరాజయం
పుంగనూరు, న్యూస్‌లైన్: పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దెబ్బ కు వెంకటరమణరాజు కుటుంబం చతి కిలపడింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరమణరాజు సోదరుడు రామక్రిష్ణంరాజు, ఆయన సతీమణి చంద్రకళ కౌన్సిలర్లుగా ఓడిపోయారు. చంద్రకళను టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా నిలపాల ని వెంకటరమణరాజు కలలుకన్నారు. ఆయన ఆశలు నెరవేరకపోగా ఆమె కౌన్సిలర్‌గా కూడా విజయం సాధించలేకపోయారు. పట్టణంలోని 24వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఇబ్రహీం చేతిలో రామక్రిష్ణంరాజు 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన సతీమణి చంద్రకళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లలిత చేతిలో 266 ఓట్ల తేడాతో ఓటమి పాల య్యారు. అలాగే పట్టణంలో ప్రముఖ నేతలుగా ఉన్న మూడవ వార్డు అభ్యర్థి చనకంటి సాంబమూర్తి వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎండి.రహంతుల్లా చేతిలో 334 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. 9వ వార్డులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆవుల అమరేంద్ర చేతిలో టీడీపీ నాయకుడు కేశవమూర్తి సోదరుడు క్రిష్ణమూర్తి 198 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. -
‘పుర’ కౌంటింగ్ ప్రశాంతం
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. నాలుగు గంటల్లో కౌంటింగ్ ప్రక్రియను ముగించారు. ఈవీఎంల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సాఫీగా లెక్కింపు జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం ఉదయం పూతలపట్టు మం డలంలోని వేము ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాలోని చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు, ఆరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు జరి గింది. ఉదయం 7.30 గంటలు ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, సంబంధిత పోలీసు అధికారులు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లు తెరిచారు. సరిగ్గా 8 గంటలకు అన్ని మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. డివిజన్, వార్డులకు సంబంధించి ఆయా కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థి, లేని పక్షంలో అతని తరపున ఏజెంట్‌ను అనుమతించారు. తొలుత లెక్కించిన బ్యాలెట్ ఓట్ల లో చాలా చెల్లని ఓట్లు వచ్చాయి. దీంతో అభ్యర్థులకు బ్యాలెట్ ఓట్లు నిరాశనే మిగిల్చాయి. తర్వాత ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు చేపట్టారు. మున్సిపాలిటీల వారీగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. అత్యధికంగా మదనపల్లి మున్సిపాలిటీకి 12 టేబుల్స్ వేశారు. మిగిలిన మున్సిపాలిటీలకు 6 నుంచి 8 టేబుల్స్, చిత్తూరు కార్పొరేషన్‌కు మాత్రం 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అన్ని మున్సిపాలిటీల్లోని తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు 8.30 గంటలకు ముగిసింది. తర్వాత రౌండ్లు వెంటవెంటనే చేపట్టడంతో చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు ఐదు మున్సిపాలిటీల ఓట్లు లెక్కింపు 10.45 గంటలకు పూర్తి చేశారు. అయితే నగరి మున్సిపాలిటీ మాత్రం 11.15 నిమిషాలకు ముగిసింది. ఓట్ల లెక్కింపు సమయంలో కొన్ని డివిజన్లు సంబంధించి ఈవీఎం రిజల్ట్ బటన్ నొక్కినా నాట్ పోల్డ్ రావడంతో సాంకేతిక నిపుణుల సాయంతో వాటిని సరిచేసి అభ్యర్థులకు పోలైన ఓట్లు చూపించారు. రౌండ్లు వారీగా ఓట్లు లెక్కింపు చేపట్టడంతో గెలుపొందిన అభ్యర్థులతో కౌంటింగ్ కేంద్రం సందడిగా మారింది. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గెలుపొందిన అభ్యర్థుల డిక్లరేషన్ ఫారాలను రిటర్నింగ్ అధికారులు కాకుండా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్లు అందజేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆయా మున్సిపాలిటీల ప్రత్యేక పరిశీలకులు పర్యవేక్షించారు. మొత్తం మీద మధ్యాహ్నం 12 గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో అటు అధికారులు, ఇటు పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. -
‘స్థానిక’ వీరుడు ఎవరో?
చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలఫలితాలు వెలువడ్డాయి. ఇక రెండో అంకం స్థానిక సంస్థల ఫలితాలు. జిల్లాలోని 65 జెడ్పీటీసీ, 887 ఎంపీటీసీ స్థానాలకు ప్రజలు ఇచ్చిన తీర్పు మంగళవారం బహిర్గతం కానుంది. జెడ్పీ పీఠాన్ని అధిరోహించాలంటే 33 జెడ్పీటీసీ స్థానాలను కైవశం చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాలెట్‌పత్రాల రూపంలో ఇచ్చిన తీర్పును లెక్కించడానికి అధికారులు ఆరుచోట్ల కేంద్రాలు ఏర్పాటు చేశారు. 35 లక్షలకు పైగా ఓట్లు జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి గతనెల మదనపల్లె, తిరుపతి, చిత్తూరు డివిజన్లకు రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. మదనపల్లె డివిజన్లోని 31 మండలాల్లో జెడ్పీటీసీ స్థానాలకు 144 మంది పోటీ చేయగా 8,74,292 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీటీసీలకు 8,78,339 మంది బ్యాలెట్ ద్వారా ఓట్లు వేశారు. తిరుపతి డివిజన్లో 9,19,978 మంది, చిత్తూరులో 8,98,184 మంది ఓట్లు వేశారు. మొత్తం 35,70,793 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓట్లన్నీ బ్యాలెట్ పత్రాల రూపంలో ఉండటంతో లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టే అవకాశముంది. పూర్తిస్థాయి ఫలితాలు రాత్రి 10 గంటలకు తెలిసే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మ్యాజిక్ ఫిగర్ ఎవరికో? జెడ్పీ చైర్పర్సన్ స్థానం ఈసారి మహిళలకు కేటాయించిన విషయం తెలిసిందే. ఓసీ మహిళకు రావడంతో ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలంటే జిల్లాలోని 65 స్థానాలకుగానూ 33 ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీకే చైర్పర్సన్ స్థానం దక్కుతుంది. కౌంటింగ్ జరిగే ప్రాంతాలివే చిత్తూరు మండలంలోని చిత్తూరు, గుడిపాల, యాదమరి, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, పెనుమూరు, బంగారుపాళెం, తవణంపల్లె, ఐరాల, ఎస్ఆర్.పురం, వెదురుకుప్పం, రామచంద్రాపురం, వడమాలపేట, పుత్తూరు, పాలసముద్రం, కార్వేటినగరం, నారాయణవనం, నగరి, నిండ్ర, విజయపురానికి చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను పూతలపట్టు మండల సమీపంలోని వేము ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కిస్తారు. పలమనేరులో రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం, కుప్పం, పలమనేరు, గంగవరం, బెరైడ్డిపల్లె, వీ.కోట, రామసముద్రం, పెద్దపంజాణి, పుంగనూరు, చౌడేపల్లె, పీలేరు, ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు, కేవీ.పల్లె, రొంపిచెర్ల, సదుం, సోమల మండలాలకు చెందిన బ్యాలెట్ పత్రాలను పలమనేరులోని మదర్ థెరిస్సా జూనియర్ కళాశాలలో లెక్కిస్తారు. మదనపల్లెలోని మాచిరెడ్డిగారిపల్లెలో ఉన్న కేశవరెడ్డి పాఠశాలలో నిమ్మనపల్లె, కలికిరి, కలకడ, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాలకు చెందిన బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. వశిష్ట పాఠశాలలో మదనపల్లె, కురబలకోట, బీ.కొత్తకోట, పెద్దమండ్యం, తంబళ్లపల్లె, పీటీఎం, ములకలచెరువు మండలాలకు సంబంధించి ఓట్లను లెక్కిస్తారు. తిరుపతిలోని శ్రీపద్మావతి డిగ్రీ కళాశాలలో పాకాల, చంద్రగిరి, తిరుపతి, రేణిగుంట, ఏర్పేడు, పులిచెర్ల, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, బీఎన్.కండ్రిగ, కేవీబీ.పురం, వరదయ్యపాళెం మండలాలకు సంబంధించి బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. -
పురపోరులో ఫ్యాన్ హోరు
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఆరు మున్సిపాల్టీల్లో మొత్తం 169 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా, అత్యధికంగా 84 వార్డులను గెలుచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రథమస్థానంలో నిలిచింది. టీడీపీ 73వార్డుల్లో విజయం సాధించి రెండో స్థానం పొందింది. పుంగనూరు, పలమనేరు మున్సిపాల్టీల్లో 24 వార్డుల చొప్పున ఉండగా, ఈ రెండింటిలోనూ వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. పుంగనూరులో 17, పలమనేరులో 17 వార్డుల్లో గెలుపొందింది. చైర్మన్ల ఎన్నికకు అవసరమైన స్పష్టమైన ఆధిక్యతను సాధించింది. టీడీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమయింది. మదనపల్లె మున్సిపాల్టీలో మొత్తం 35 వార్డులకుగాను వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాలు సాధించింది. వైఎస్సార్సీపీ 17 స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ అభ్యర్థులు 16 మంది గెలుపొందారు. కాంగ్రెస్ అడ్రస్సు గల్లంతయింది. ఇక్కడ ఇద్దరు స్వతంత్రులు గెలవటంతో చైర్మన్ ఎన్నికలో వీరు కీలకం కానున్నారు. దీనికి తోడు ఎక్స్అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు కలిస్తే మదనపల్లెలో చైర్మన్ సీటు వైఎస్సార్సీపీ అభ్యర్థిని వరించే అవకాశం ఉంది. పూతలపట్టు మండలంలోని పీ కొత్తకోట వద్ద వేము ఇంజనీరింగ్ కాలేజీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 11 గంటల కల్లాపూర్తయింది. ఒక్కో రౌండ్‌కు 10 వార్డుల చొప్పున అధికారులు పకడ్బందీగా ఓట్లలెక్కింపు చేపట్టారు. ఎన్నికల పాస్‌లు ఉన్నవారిని మాత్రమే లోపలకు అనుమతించారు. మదనపల్లె వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థి షమీమ్‌అస్లాం 972 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. పలమనేరు, పుంగనూరు, పుత్తూరు,నగరిలో కూడా వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థులందరూ వార్డు సభ్యులుగా విజయం సాధించారు. నగరి, పుత్తూరులో పోటాపోటీ.... నగరి, పుత్తూరు మున్సిపాల్టీల్లో వైఎస్సార్‌కాంగ్రెస్,తెలుగుదేశం పోటాపోటీగా వార్డులను గెలుచుకున్నారుు. నగరి మున్సిపాల్టీలో తెలుగుదేశం 13 వార్డులను గెలుచుకోగా, వైఎస్సార్సీపీ 11 స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్రులు ముగ్గురు గెలిచారు. ఇప్పుడు వీరి మద్దతు కూడగట్టుకున్నవారే చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. దీనికితోడు ఎక్స్అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ఓటు వేయనుండడంతో చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకునే అవకాశం ఎంత ఉందో, వైఎస్సార్సీపీకీ అంతే అవకాశం ఉంటుంది. పుత్తూరు మున్సిపాల్టీలో తెలుగుదేశం 13 స్థానాల్లో, వైఎస్సార్సీపీ 11 స్థానాల్లో గెలుపొందారు. ఇక్కడ రెండు పార్టీలకు మధ్య రెండు స్థానాలే వ్యత్యాసం. నాలుగైదు వార్డుల్లో టీడీపీ స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించింది. నగరి, పుత్తూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో చివరివరకు ఉత్కంఠ నెలకొంది. శ్రీకాళహస్తి మున్సిపాల్టీలో మొత్తం 35 వార్డులుండగా, తెలుగుదేశానికి 18 స్థానాలు వచ్చారుు. వైఎస్సార్సీపీ గట్టి పోటీ ఇచ్చి 11 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ మున్సిపాల్టీలో మాత్రమే కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో విజయం సాధించి బోణీకొట్టింది. చిత్తూరు కార్పొరేషన్లో టీడీపీ విజయం చిత్తూరు కార్పొరేషన్లో 50 డివిజన్లకుగాను అత్యధికంగా 33 డివిజన్లలో తెలుగుదేశం విజయం సాధించింది. స్వతంత్రులు 13 స్థానాల్లో, వైఎస్సార్సీపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఒకటో డివిజన్ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు భార్య సీకే లావణ్య ఓటమిపాలయ్యారు. అత్యధిక స్థానాల్లో స్వతంత్రులు ఓట్లు చీల్చటంతో వైఎస్సార్సీపీ స్వల్ప ఓట్ల తేడాతో చాలా స్థానాల్లో ఓడింది. టీడీపీ మేయర్ అభ్యర్థి కఠారి అనురాధ విజయం సాధించారు. -
నేడు ‘పల్లె’ ఫలితాలు
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్: నెల రోజులపాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీస్‌గా సాగిన పల్లె పోరులో పోటీ పడిన నేతల భవితవ్యం మంగళవారం తేలనుంది. ఉదయం 8 గంటలకు ప్రాదేశిక ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ 6, 11వ తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగారుు. జిల్లాలోని 50 జెడ్పీటీసీ స్థానాల్లో 337 మంది... 705 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఏకగ్రీవం కాగా, విగిలిన వాటిలో 2,989 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ మేరకు ఓట్ల లెక్కింపు కోసం జిల్లాలోని ఐదు డివిజన్ల పరిధిలో ఏడు కేంద్రాలు కేటారుుంచారు. వరంగల్, నర్సంపేట, జనగామ డివిజన్లకు ఒకటి చొప్పున, మహబూబాబాద్, ములుగు డివిజన్లకు రెండు చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా మొత్తం 2,214 మంది అధికారులను నియమించారు. కౌంటింగ్‌కు మొత్తం 491 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ముందుగా ఎంపీటీసీ ఫలితాలు వెల్లడించిన అనంతరం జెడ్పీటీసీ ఫలితాలు వెలువడనున్నారుు. బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఫలితాలు ఆలస్యంగా వెలువడే అవకాశాలున్నారుు. బ్యాలెట్ బాక్స్‌లను తెరిచి 25 చొప్పున కట్టలు కట్టడం మధ్యాహ్నం వరకు సాగుతుంది. ఆ తర్వాతే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండడంతో పూర్తి స్థాయిలో ఫలితాలు కోసం అర్ధరాత్రి వరకు వేచి చూడాల్సిందే. మండలాలవారీగా కౌంటింగ్ కేంద్రాలు... ములుగు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు, వెంకటాపురం మండలాల ఓట్ల లెక్కింపునకు ములుగులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కేంద్రం ఏర్పాటు చేశారు. అదేవిధంగా.. భూపాలపల్లి, మొగుళ్లపల్లి, శాయంపేట, గణపురం, చిట్యాల, పరకాల, రేగొండ మండలాల ఓట్ల లెక్కింపును పరకాలలోని గణపతి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు. నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని చెన్నారావుపేట, దుగ్గొండి, గూడూరు, ఖానాపురం, కొత్తగూడ, నల్లబెల్లి, నర్సంపేట మండలాల ఓట్ల లెక్కింపు కోసం నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కేంద్రం ఏర్పాటు చేశారు. జనగామ డివిజన్ పరిధిలో స్థానిక ప్రసాద్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో బచ్చన్నపేట, చేర్యాల, దేవరుప్పుల, జనగామ, కొడకండ్ల, లింగాల ఘనపురం, మద్దూరు, నర్మెట, పాలకుర్తి, రఘునాథపల్లి మండలాల ఓట్లను లెక్కించనున్నారు. మహబూబాబాద్ డివిజన్ పరిధిలోని కేసముద్రం, కురవి, మహబూబాబాద్, నర్సింహులపేట, నెల్లికుదురు మండలాల్లోని ఓట్ల లెక్కింపు కోసం ఏపీ మోడల్ స్కూల్(అనంతారం)లో... మరిపెడ, తొర్రూరు, నెక్కొండ, డోర్నకల్ మండలాల ఓట్ల లెక్కింపునకు మానుకోటలోని ఫాతిమా హైస్కూల్లో కేంద్రం ఏర్పాటు చేశారు. వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆత్మకూరు, ధర్మసాగర్, గీసుకొండ, స్టేషన్‌ఘన్‌పూర్, హన్మకొండ, హసన్‌పర్తి, పర్యతగిరి, రాయపర్తి, సంగెం, వర్ధన్నపేట, జఫర్‌గఢ్ మండలాల ఓట్ల లెక్కింపు కోసం జిల్లాకేంద్రంలోని నిట్‌లో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. -
మునిసి‘పల్స్’పై కుస్తీ
వరంగల్, న్యూస్‌లైన్ : మునిసిపల్ ఫలితా ల తీరుతో కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకు లు సందిగ్ధంలో పడ్డారు. తెలంగాణ రా ష్ట్రంలో తొలి సర్కారు మాదంటే మాదం టూ భరోసా వ్యక్తం చేస్తున్న నేతలు విశ్లేషణల్లో మునిగిపోయారు. ఈ ఫలితాలు దేనికి సంకేతమనే చర్చ రెండు పార్టీల్లో జోరుగా సాగుతోంది. స్థానిక, సాధారణ ఎన్నికలకు పూర్తిస్థాయిలో ముడిపెట్టే పరిస్థితి లేకపోయినప్పటికీ వరుస ఎన్నికల నేపథ్యంలో ఈ ఫలితాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మునిసిపోల్స్ పట్ట ణ ఓటర్ల నాడిని తెలియజేస్తే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలతో గ్రామీణ ఓటరు అంతరంగం బయటపడే అవకాశం ఉం దంటున్నారు. ఇదే తరహా రేపటి ఫలి తాలు వస్తాయనే వాదనలేనప్పటికీ.. ఒక అంచనాకు వచ్చేందుకు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. అన్ని పక్షాలు ఫలి తాల సరళిపై విశ్లేషించుకుంటున్నాయి. నేతల్లో భిన్నస్వరం సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ సానుకూల పవనాలు వీచాయని, 10కి తక్కువ కాకుండా అసెంబ్లీ స్థానాలు గెలుస్తామనే అంచనాతో ఉన్న టీఆర్ఎస్ నేతలు సందిగ్ధంలో పడ్డారు. ఏకపక్షంగా ఫలితాలుండే సవాలే లేదంటూ.. ఐదు స్థానాల్లోనైనా తాము విజయం సాధిస్తామనే విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ నేతల్లో మనోధైర్యం పెరిగింది. ఈ ఫలితాల తీరుతో పూర్తిస్థా యి గెలుపు ఆశలు లేకపోవడంతో డీలా పడుతున్నారు. నిన్నటికి, నేటికి నేతల్లో భిన్నస్వరం వినిపిస్తోంది. స్థానిక, సార్వత్రిక ఎన్నికలు సరిగ్గా నెలరోజుల తేడాతో జరిగాయి. ఈలోపే ఓటర్లు పూర్తిగా మారే అవకాశం లేదని, ఈ ఫలితాలు పట్టణ ఓటర్ల నాడికి ప్రతిబింబంగాకొందరు, రెండింటి ఫలితాలు భిన్నంగా ఉంటాయని మరికొందరు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇదే తరహాలో ఉండే అవకాశం ఉందని, ఏకపక్షంగా ప్రజాతీర్పు ఉండే అవకాశం లేదనే చర్చలు సాగుతున్నాయి. మిశ్రమ ఫలితం జనగామ, పరకాల, భూపాలపల్లి, నర్సం పేట, మహబూబాబాద్ ఈ ఐదు అసెం బ్లీ కేంద్రాలుగా ఉన్నాయి. పట్టణ ఓటర్లతోపాటు పరిసర ప్రాంతాలను రాజకీయంగా ప్రభావితం చేసే సెంటర్లుగా కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి ముఖ్య నాయకులు నిన్నటి వరకు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. జనగామ నుంచి మాజీ మంత్రి పొన్నాల, భూపాలపల్లి నుంచి మాజీ చీఫ్‌విప్ గండ్ర, మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే కవిత , పరకాల నుంచి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బిక్షపతి, నర్సంపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి ప్రాతినిధ్యం విహ స్తున్నారు. ఈ ఎన్నికల్లో పట్టుకోసం దృఢ సంకల్పంతో పనిచేశారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో సర్వశక్తులొడ్డారు. జనగామ, నర్సంపేట మినహా మిగిలిన మూడు సెంటర్లలో మిశ్ర మ ఫలితమే రావడంతో ఇరువైపుల అయోమయం నెలకొంది. ఇదే తరహాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలుంటాయనే ఆందోళన నెలకొంది. ఇక ఓట్ల చీలిక గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టు టీఆర్ఎస్తో పోల్చితే తమకు క్షేత్రస్థాయిలో నిర్మా ణం, కేడర్ బలంగా ఉందనేది కాంగ్రెస్ వాదన. గ్రామస్థాయిలో పూర్తి బలంలేని టీఆర్ఎస్కు ఈ స్థాయి ఫలితాలు రావడంతో కొంత వణుకుపుడుతోంది. నిర్మాణపరంగా బలహీనతలున్నప్పటికీ, తెలంగాణ సానుకూల పవనాలు తమకు పూర్తి అం డగా నిలుస్తాయనే ధీమాతో టీఆర్ఎస్ నేతలున్నారు. పట్టణ ఓటర్లు తమకంటే కాంగ్రెస్‌కు కొంత మొగ్గు చూపడం టీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది. -
స్వతంత్రులే కీలకం..!
సాక్షి, హన్మకొండ : జిల్లాలోని రెండు మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయతీల పరిధిలో ఓటర్లు భిన్నమైన తీర్పు ఇచ్చారు. జనగామ మునిసిపాలిటీ, నర్సంపేట నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. భూపాలపల్లి, పరకాల నగర పంచాయతీ, మహబూబాబాద్ మునిసిపాలిటీలో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. ఈ మూడింటిలోనూ హంగ్ ఏర్పడడంతో స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. ఈ మేరకు వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు పుర పీఠాన్ని ఆశిస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్వతంత్రులకు చైర్మన్ పదవులు ఇచ్చేందుకు పార్టీలు సైతం సై అంటున్నారుు. మహబూబాబాద్ మునిసిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా, చైర్పర్సన్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించారు. సోమవారం వెల్లడించిన ఫలితాల్లో కాంగ్రెస్ -7, టీఆర్ఎస్-7, సీపీఏం-5, సీపీఐ-3, టీడీపీ-3, స్వతంత్రులు-3 స్థానాల్లో విజయం సాధించారు. సీపీఎం పార్టీ నుంచి గెలిచిన ఐదుగురు వార్డు కౌన్సిలర్లు, స్వతంత్రుల మద్దతు ఎవరికి లభిస్తే.. వారే చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి 14వ వార్డులో భూక్యా ఉమ, 15వ వార్డులో బానోతు స్వాతి, 20వ వార్డులో భూక్యా స్వప్న గెలుపొందారు. వీరు కాంగ్రెస్ తరఫున చైర్పర్సన్ రేసులో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అవకాశం వస్తే 17వ వార్డు నుంచి విజయం సాధించిన బానోతు ఇషాకు అవకాశం ఉంది. పరకాల నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఇక్కడ చైర్పర్సన్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అరుుంది. కాంగ్రెస్-6, టీఆర్ఎస్-8, బీజేపీ-2, బీఎస్పీ-1, స్వతంత్రులు-3 స్థానాలను గెలుచుకున్నారు. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది. ఎక్కువ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించినా.. ఆ పార్టీ నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరూ విజయం సాధించలేదు. ఫలితంగా టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే స్వతంత్రులు, ఇతర పార్టీల వార్డు సభ్యులు చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2వ వార్డు నుంచి గెలుపొందిన బొచ్చు దిలీప్ (బిక్షపతి-స్వతంత్ర), 20వ వార్డు నుంచి విజయం సాధించిన మార్త రాజభద్రయ్య (స్వతంత్ర)తోపాటు 3వ వార్డు నుంచి ఒంటేరు స్వప్న (బీఎస్పీ) చైర్పర్సన్ రేసులో ముందుకొచ్చారు. ఒకవేళ పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలిస్తే ఒకటో వార్డు అభ్యర్థి మడికొండ సంపత్, 12వ వార్డు అభ్యర్థి కొయ్యాడ మల్లికాంబలో ఎవరో ఒకరు చైర్పర్సన్ పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది. భూపాలపల్లి నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఇక్కడ చైర్మన్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అరుుంది. సోమవారం వెల్లడించిన ఫలితాల్లో టీఆర్ఎస్-7, కాంగ్రెస్-7, బీజేపీ-2, టీడీపీ 2, సీపీఐ-1, స్వతంత్రులు-1 స్థానాల్లో విజయం సాధించారు. ఇక్కడా హంగ్ ఏర్పడడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్‌తోపాటు మద్దతిచ్చే ఇతర పార్టీలు కూడా కీలకమైన చైర్పర్సన్ స్థానాన్ని ఆశించే అవకాశం ఉంది. ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున 19వ వార్డు అభ్యర్థి బండారి సంపూర్ణ విజయం సాధించారు. బీజేపీ నుంచి 4వ వార్డులో బి.పద్మ గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 17వ వార్డులో దార పులమ్మ, 20వ వార్డులో చల్లూరి సమ్మయ్య విజయబావుటా ఎగురవేశారు. వీరందరూ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. జనగామ మునిసిపాలిటీలో 28 వార్డులు ఉన్నాయి. చైర్పర్సన్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మెజార్జీ వార్డులను గెలుచుకుంది. ఆ పార్టీకి చెందిన వెన్నం శ్రీలత, వేమల్ల పద్మ, జక్కుల అనిత, వంగాల కళ్యాణి చైర్పర్సన్ రేసులో ఉన్నారు. నర్సంపేట నగర పంచాయతీలో 20 వార్డులు ఉండగా... చైర్మన్ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్ అరుుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది అభ్యర్థులు విజయం సాధించారు. బీసీ సామాజిక వర్గం నుంచి విజయం సాధించిన పాలాయి శ్రీనివాస్ , పాలెల్లి రాంచంద్రయ్య, నాగెళ్లి వెంకటనారాయణగౌడ్లో ఎవరో ఒకరు చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. -
పట్టణ ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఆధిక్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : పురపాలక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధిక్యం చూపింది. రెండు మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో ఒక మునిసిపాలిటీని, ఒక నగరపంచాయతీని కైవసం చేసుకుంది. ఇతరుల మద్దతుతో మరో మునిసిపాలిటీలో పాగా వేసే స్థాయిలో ఉంది. టీఆర్ఎస్ ఇతరుల మద్దతుతో రెండు నగర పంచాయతీల్లో చైర్మన్ పదవి దక్కించుకునే స్థితిలో నిలిచింది. జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు... పరకాల, భూపాలపల్లి, నర్సంపేట నగరపంచాయతీలకు ఈ ఏడాది మార్చి 30న ఎన్నికలు జరిగాయి. ఈ ఓట్ల లెక్కింపు సోమవారం జరిగింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు నాలుగు రోజుల ముందు వెలువడిన ఈ ఫలితాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మునిసిపల్ ఫలితాల మాదిరిగానే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆధిక్యం చూపుతామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మునిసిపల్ ఫలితాలు తాము ఊహించిన విధంగానే ఉన్నాయని... సాధారణ ఎన్నికల్లో తమకే ఆధిక్యం ఉంటుందని టీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక.. మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దయనీయమైన ఫలితాలు వచ్చాయి. మొత్తం 116 వార్డులకు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం ఆరు వార్డుల్లోనే విజయం సాధించింది. బీజేపీ ఎనిమిది వార్డులతో మూడో స్థానం దక్కించుకుంది. సీపీఎం 6, సీపీఐ 4 వార్డులను గెలుచుకున్నాయి. పరకాలలోని ఒక వార్డును బీఎస్పీ దక్కించుకుంది. ఐదు పాలకవర్గాల్లో కలిపి 11 మంది స్వతంత్రులు కౌన్సిలర్లుగా గెలిచారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గ కేంద్రం జనగామ మునిసిపాలిటీలో కాంగ్రెస్ మెజారిటీ వార్డులు గెలుచుకుంది. పోలింగ్‌కు ముందే ఒక వార్డును హస్తగతం చేసుకుంది. తుది ఫలితాల్లో కాంగ్రెస్ మరో 13 వార్డులను గెలుచుకుంది. 28 వార్డులు ఉన్న జనగామ మునిసిపాలిటీలో 14 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు విజయబావుటా ఎగురవేశారు. మహబూబాబాద్ మునిసిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే కవితకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఇక్కడి చైర్మన్ ఎన్నిక... ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంపై ఆధారపడనుంది. కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్-సీపీఐలకు 10 వార్డులు వచ్చాయి. టీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా భావించిన నేత కౌన్సిలర్‌గా ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులుగా పోటీ చేసిన ముగ్గురు గెలిచారు. వీరితోపాటు సీపీఎం మద్దతుతో చైర్పర్సన్ సీటును దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మునిసిపల్ ఎన్నికలు జరిగిన సమయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దొంతి మాధవరెడ్డి సొంత నియోజకర్గ కేంద్రం నర్సంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటారు. నర్సంపేటలో కాంగ్రెస్‌కు 12 స్థానాలు దక్కాయి. సాధారణ ఎన్నికల్లో టికెట్ దక్కపోవడంతో దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా నర్సంపేట ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నర్సంపేటలో కాంగ్రెస్ కౌన్సిలర్లుగా ఎన్నికైన 12 మంది దొంతి మాధవరెడ్డితోనే ఉంటామని చెప్పారు. దీంతో ఇక్కడ పాలకవర్గం కాంగ్రెస్‌లో ఉంటుందా.. లేదా అనేది మాధవరెడ్డి ఎన్నికల ఫలితాన్ని బట్టి తేలనుంది. పరకాల నగరపంచాయతీలో మిగిలిన పార్టీల కంటే ఎక్కువగా టీఆర్ఎస్ ఎనిమిది సీట్లు గెలుచుకుంది. ఇక్కడి చైర్పర్సన్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. టీఆర్ఎస్ తరఫున ఎన్నికైన కౌన్సిలర్లలో ఈ వర్గం వారు ఒక్కరూ లేరు. టీఆర్ఎస్ రెబెల్‌గా పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్‌ను చైర్మన్‌గా చేసి గులాబీ పార్టీ ఇక్కడ పాలకవర్గవర్గాన్ని కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. భూపాలపల్లి నగరపంచాయతీలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్లకు సమానంగా ఏడు వార్డులు దక్కాయి. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన సీపీఐ ఒక వార్డును గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఒక కౌన్సిలర్ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించినట్లు తెలిసింది. రెండు చొప్పన వార్డులను గెలుచుకున్న బీజేపీ, టీడీపీ ఇక్కడ టీఆర్ఎస్కు మద్దుతు ఇచ్చే అవకాశం ఉంది. -
ఇక ‘ప్రాదేశిక’ వంతు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రంగారెడ్డి జిల్లాలోని 33 మండలాలకు సంబంధించి ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పది లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండలాల వారీగా ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ముందు మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుల ఫలితాలు, ఆ తర్వాత జెడ్పీటీసీల ఫలి తాలు వెల్లడించనున్నారు. ప్రాదేశిక ఎన్నికలు ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పద్ధతిన జరిగాయి. దీంతో ఫలితాలు పురపాలక సంఘాల మాదిరిగా త్వరితంగా కాకుండా ఆలస్యంగా రానున్నాయి. ‘పుర’ ఫలితాల నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో ప్రాదేశిక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ రెట్టింపైంది. జిల్లాలో 33 జెడ్పీటీసీ స్థానాలు, 614 ఎంపీటీసీ స్థానాలకు గతనెలలో ఎన్నికలు నిర్వహించారు. రెండు విడతలుగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల తరఫున 2,623 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో జెడ్పీటీసీ స్థానాలకు 187 మంది పోటీ పడగా.. ఎంపీటీసీ స్థానాలకు 2,436 మంది బరిలో నిలిచారు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రాదేశిక ఎన్నికలు జరగడంతో స్థానిక నేతలు ప్రత్యేక ఆసక్తి కనబర్చారు. వాస్తవానికి గతనెలలోనే ఫలితాలు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ సాధారణ ఎన్నికల్లో వీటి ప్రభావం పడుతుందని పేర్కొంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఫలితాల వెల్లడి వాయిదా పడింది. -
‘పుర’పోరులో ఫిఫ్టీ ఫిఫ్టీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఉత్కంఠభరితంగా సాగిన పురపోరులో భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ రెండు, టీడీపీ రెండు గెలుచుకోగా.. ఒక దాంట్లో మిశ్రమ ఫలితం వచ్చింది. జిల్లాలోని వికారాబాద్, బడంగ్‌పేట పురపాలక సంఘాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట నగర పంచాయతీలను తెలుగుదేశం చేజిక్కించుకుంది. మరోవైపు తాండూరులో మజ్లిస్ పుంజుకోవడమే కాకుండా అతిపెద్ద పార్టీగా అవతరించింది. టీఆర్ఎస్తో సమానంగా పది వార్డులను గెలుచుకుని చైర్మన్ రేసులో నిలిచింది. నగర పంచాయతీగా ఏర్పడిన తర్వాత బడంగ్‌పేటకు తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మొత్తం 20 వార్డుల్లో 15 స్థానాలను గెలుచుకొని ఆధిక్యత కనబరిచింది. ఇక్కడ టీడీపీ ఒక వార్డుతోనే సరిపెట్టుకుంది. స్వతంత్ర అభ్యర్థులు 4 వార్డులు గెలుచుకున్నారు. కొత్తగా ఏర్పడిన పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలను టీడీపీ కైవసం చేసుకుంది. ఈ రెండింటిలోనూ మిత్రపక్షమైన బీజేపీతో కలిసి చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించింది. పెద్దంబర్పేటలో 20 వార్డులకు టీడీపీ 9, కాంగ్రెస్ 6, బీజేపీ 3, స్వతంత్రులు 1, ఒకరు ఏకగ్రీవంగాను ఎన్నికయ్యారు. ఇబ్రహీంపట్నంలో 20 వార్డులకు గాను టీడీపీ 10, కాంగ్రెస్ 4, బీజేపీ 4, టీఆర్ఎస్ 1, స్వతంత్రులు 1 స్థానాలు గెలుపొందారు. కాంగ్రెస్ నైతల అనైక్యత, లుకలుకలను అనూకులంగా మలుచుకుని విజయం సాధించింది. -
అన్నమో.. హరికిరణ్..
విజయవాడ, న్యూస్‌లైన్ : నగరపాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ విధుల్లో పాల్గొన్న కార్మికులు ఆకలి కేకలు పెట్టారు. తెల్లవారుజాము నుంచే పనులు చేయించిన అధికారులు మధ్యాహ్నం భోజనం పెట్టలేమని తెగేసి చెప్పారు. దీంతో కార్మికులు ఆందోళనకు దిగారు. అయినప్పటికీ నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు... అన్న రీతిలో అధికారులు భోజనాలు పెట్టేది లేదని తేల్చి చెప్పేశారు. చేసేదేమీ లేక ఉసూరుమంటూ కార్మికులు ఖాళీ కడుపులతో ఇంటిదారి పట్టారు. వివరాల్లోకి వెళితే... నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రజారోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు విధులు కేటాయించారు. తెల్లవారుజామున 5.30గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియానికి కార్మికులు చేరుకున్నారు. బ్యాలెట్ బాక్స్‌లు మోసుకెళ్లడం దగ్గర నుంచి వెట్టిచాకిరీ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు అధికారులకు భోజనాలు వచ్చాయి. ఆ తరువాత తమకు వస్తాయని కార్మికులు ఆశపడ్డారు. ఎంతకీ భోజనాలు రాకపోవడంతో ఆకలేస్తోందని అధికారుల వద్ద నోరు తెరిచి అడిగారు. ఈ విషయాన్ని నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పి.రత్నావళి, అసిస్టెంట్ సిటీప్లానర్ వి.సునీతలు కమిషనర్ సి.హరికిరణ్ దృష్టికి తీసుకెళ్లారు. ‘కార్మికులకు భోజనాలు పెట్టాల్సిన పనిలేదు. వాళ్లను వెళ్లిపోవాలని చెప్పండి..’ అని హరికిరణ్ బదులిచ్చారు. ఏం చేయాలో తెలియక అధికారులు బిక్క మొహాలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న కార్మికులు సమాచార కేంద్రం వద్ద కొద్దిసేపు ఆందోళన చేసినా ఫలితం లేకపోవడంతో ఇంటిదారి పట్టారు. విధుల్లో సుమారు 600 మంది పాల్గొన్నప్పటికీ కేవలం 370 మందికి మాత్రమే భోజనాలు తెప్పించారు. కమిషనర్ తీరుపై ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అంతా గందరగోళం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రారంభం నుంచి కౌంటింగ్ వరకు అంతా గందరగోళం చోటు చేసుకుంది. కమిషనర్‌కు ఎన్నికల నిర్వహణపై అనుభవం లేకపోవడం, కిందిస్థాయి ఉద్యోగులను నమ్మకపోవడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఉదయం 8గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ సాయంత్రం 4గంటల వరకు కొనసాగింది. ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఒక్కో రౌండ్ గంట వ్యవధిలో ఓట్ల లెక్కింపు పూర్తి కావాల్సి ఉండగా.. రెండున్నర గంటల సమయం పట్టింది. రిటర్నింగ్ అధికారులు చురుగ్గా పని చేయలేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని మునిసిపాలిటీలతోపాటు పొరుగు జిల్లాల్లోని కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పటికీ విజయవాడ ఫలితం వెల్లడిలో జాప్యం చోటుచేసుకుంది. అధికారుల్లో అవగాహనా లోపం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. -
ప్రాదేశిక ఫలితాలు నేడే
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. జిల్లాలోని 49 జెడ్పీటీసీ, 812 ఎంపీటీసీ స్థానాలకు గత నెలలో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బ్యాలెట్ పత్రాల ద్వారా ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. వీటి లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. జిల్లాలో 49 జెడ్పీటీసీ స్థానాలకు 177 మంది, 812 ఎంపీటీసీ రీ-పోలింగ్ నేడే మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలోని ఐదు అసెంబ్లీ, ఐదు లోక్‌సభ స్థానాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం రీ-పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల ఏడో తేదీన నిర్వహించిన సాధారణ ఎన్నికల పోలింగ్‌లో ఈవీఎంలలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో రీ-పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు తెలిపారు. జిల్లాలో పది పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ జరుగుతున్నందున 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఒపీనియన్ పోల్స్ ప్రకటించటంపై నిషేదం విధించినట్లు కలెక్టర్ చెప్పారు. -
తెగబడిన టీడీపీ శ్రేణులు
నూజివీడు, న్యూస్‌లైన్ : వైఎస్సార్సీపీ అభ్యర్థి కుటుంబ సభ్యులపై తెలుగుదేశం పార్టీకి చెందినవారు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన నూజివీడులోని రామాయమ్మరావుపేటలో సోమవారం జరిగింది. అదే పేటకు చెందిన చల్లా పల్లవి వైఎస్సార్సీపీ తరఫున ఏడో వార్డు అభ్యర్థిగా మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేశారు. ఆమెపై టీడీపీ తరఫున దేరంగుల పద్మావతి గెలుపొందారు. సోమవారం నిర్వహించిన కౌంటింగ్‌లో పల్లవి ఓటమి చెందగా, పద్మావతి విజయం సాధించారు. ఓటమి చెందిన పల్లవి కౌంటింగ్ కేంద్రం నుంచి 11 గంటల సమయంలో రామాయమ్మరావుపేటలోని తన ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపటి తరువాత టీడీపీకి చెందిన పద్మావతి వర్గానికి చెందినవారు తమ వాహనాలతో పల్లవి ఇంటివైపుగా అరుపులు, కేకలు వేసుకుంటూ వెళ్తుండటంపై వారి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఒక్కసారిగా టీడీపీకి చెందినవారు కర్రలు, కత్తులతో వారిపై దాడికి దిగారు. ఈ ఘటనలో చల్లా పల్లవితో పాటు చల్లా కుమారి (40), చల్లా ఆంజనేయులు (30), చల్లా రంగబాబు (28), చల్లా వెంకటేశ్వరరావు (50)లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు... తమపై దాడికి పాల్పడినవారిపై బాధితులు దేరంగుల పోతురాజు, దేరంగుల ఏసు, దేరంగుల దుర్గ, మక్కళ్ల సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిచేసినవారిలో దేరంగుల పోతురాజు, దేరంగుల మల్లిర్జునరావు, మక్కళ్ల సుబ్బారావు, మహేష్, దేరంగుల యస్సయ్య, దేరంగుల భలే రాజేష్, దేరంగుల దుర్గ, దేరంగుల భారతి, దేరంగుల ఉమా, తమ్మిశెట్టి భవాని, వెంకటేశ్వరి, మక్కళ్ల జయ, దేరంగుల పద్మ తదితరులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బోనం ఆదిప్రసాద్ తెలిపారు. బాధితులకు మేకా ప్రతాప్ పరామర్శ టీడీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నాయకులను ఆ పార్టీ నాయకుడు, నూజివీడు అభ్యర్థి మేకా ప్రతాప్ అప్పారావు నూజివీడు ఏరియా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులను అడిగి పరిస్థితిని తెలుసుకుని ఇంకా మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇలాంటి చెడు సంస్కృతి రావడం మంచిది కాదన్నారు. రాజకీయాలలో ఎంత ఒదిగి ఉంటే అంత మంచిదని హితవు పలికారు. -
హోరాహోరీగా సాగిన పురపోరు
జిల్లాలో హోరాహోరీగా సాగిన పురపోరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ చెరి సగం వార్డులు సాధించాయి. 218 వార్డులకు గాను వైఎస్సార్సీపీ 104, టీడీపీ 104 గెలుచుకున్నాయి. నాలుగు మున్సిపాలిటీల్లో టీడీపీ, మూడు మున్సిపాలిటీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగుర వేశాయి. ఉయ్యూరు నగర పంచాయతీలో రెండూ చెరి సగం వార్డులు సాధించడంతో హంగ్ ఏర్పడింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో మట్టికరిచింది. ఆ పార్టీకి జిల్లాలో ఒకే ఒక్క వార్డు దక్కింది. - సాక్షి, మచిలీపట్నం జగ్గయ్యపేటలో వైఎస్సార్సీపీ జయకేతనం.. తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న జగ్గయ్యపేట మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో 27 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 17 వార్డుల్లోనూ, టీడీపీ అభ్యర్థులు 10 వార్డుల్లోనూ గెలుపొందారు. మొత్తం టౌన్లో 29,602 ఓట్లు పోలవ్వగా వైఎస్సార్సీపీ అభ్యర్థులకు 13,724 ఓట్లు, టీడీపీ అభ్యర్థులకు 14,048 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థులకు 119, బీజేపీ అభ్యర్థులకు 175, సమైక్య తెలుగు రాజ్యం అభ్యర్థులకు 656, స్వతంత్ర అభ్యర్థులకు 704ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పట్టణంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులకంటే టీడీపీ అభ్యర్థులకు సుమారు 300ఓట్లు ఎక్కువ వచ్చినప్పటికీ ఎక్కువ మంది అభ్యర్థులను గెలిపించుకున్న వైఎస్సార్సీపీకే జగ్గయ్యపేట పురపాలక పీఠం దక్కింది. దీంతో జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జగ్గయ్యపేట అసెంబ్లీ అభ్యర్థి సామినేని ఉదయభాను, ఆయన అభిమానులు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. నూజివీడు మున్సిపాల్టీలోనూతనశకం నూజివీడు మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనంతో నూతన శకం మొదలైంది. నూజివీడు మున్సిపాలిటీలో మొత్తం 30వార్డులకు గానూ వైఎస్సార్సీపీ 22, టీడీపీ 7, స్వంతంత్ర అభ్యర్థి ఒక వార్డును దక్కించకున్నారు. నూజివీడు మున్సిపాలిటీలో 29,018 ఓట్లు పోలవ్వగా వైఎస్సార్సీపీకి 15,074, టీడీపీకి 11,843 ఓట్లు లభించాయి. టీడీపీ కంటే 4,750ఓట్లు అదనంగా వైఎస్సార్సీపీకి ఓట్లు దక్కాయి. దీంతో వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి మేకా ప్రతాప్ అప్పారావు కేడర్‌లో ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి. పెడనలో నైతిక విజయం టీడీపీకి పెట్టని కోట పెడన మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ దెబ్బకు బీటలు వారింది. రెండు పర్యాయాలుగా ఇక్కడ మున్సిపల్ చైర్మన్‌గా నెగ్గుకొస్తున్న టీడీపీ నాయకుడు బొడ్డు వేణుగోపాలరావు ప్రస్తుత ఎన్నికల్లో 10వ వార్డులో పరాజయం పాలయ్యారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి వీరంకి నర్శింహా రావు 46ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల నాటికి వైఎ స్సార్సీపీ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్, బందరు అసెంబ్లీఅభ్యర్థి పేర్ని నాని సమన్వయంతో బండారు ఆనందప్రసాద్‌ను బరిలో దించడంతో సమీకరణలు మారాయి. నువ్వా నేనా అనే రీతిలో జరిగిన ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ చెరి11వార్డులు గెలుచుకున్నాయి. 11వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థికి 319, టీడీపీకి 319ఓట్లు వచ్చి టై అయ్యింది. దీంతో లాటరీ తీయడంతో టీడీపీకి ఆధిక్యత లభించింది. రెండు పార్టీలకు చెరో 11వార్డులు రాగా, 11వ వార్డే డ్రా కావడంతో అంతా 11-11-11 అని చర్చించుకున్నారు. మొత్తం 19,293 ఓట్లు పోలవ్వగా వైఎస్సార్సీపీ 9,666, టీడీపీకి 8,984, కాంగ్రెస్/స్వతంత్ర అభ్యర్థులకు 682 ఓట్లు వచ్చాయి. టీడీపీ కంటే వైఎస్సార్సీపీకి సుమారు700ఓట్లు అదనంగా రావడం విశేషం. గుడివాడ గుండెలో వైఎస్సార్సీపీ పదిలం.. గుడివాడ గుండెలో వైఎస్సార్సీపీకి పదిలమైన చోటు దక్కింది. తాజామాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని)కి వెన్నంటి ఉండే గుడివాడ పట్టణ ఓటర్లు ఆయన గతంలో టీడీపీలో ఉండగా ఆ పార్టీకి పట్టం కట్టారు. ఇప్పుడు వైఎస్సార్సీపీలోకి రావడంతో ఆయనకు మద్దతుగా నిలిచి పురపాలక పగ్గాలు వైఎస్సార్సీపీకే అప్పగించడం విశేషం. గుడివాడ మున్సిపాలిటీలో 36వార్డులకు గానూ వైఎస్సార్సీపీకి 21, టీడీపీకి 15 వార్డులు దక్కాయి. పట్టణంలో 71,752 ఓట్లు పోలవ్వగా వైఎస్సార్సీపీకి 36,156 ఓట్లు, టీడీపీకి 33,893 , కాంగ్రెస్‌కు 110, సీపీఎంకు 73, బీఎస్పీకి 38ఓట్లు వచ్చాయి. కాగా టీడీపీ కంటే వైఎస్సార్సీపీకి 2,263 ఓట్లు అదనంగా రావడం విశేషం. బందరులో స్వల్ప ఓట్లతో గట్టెక్కిన టీడీపీ జిల్లా కేంద్రమైన బందరులో టీడీపీకి విజయం దక్కినా చాలా వార్డుల్లో నామ మాత్రపు మెజార్టీతోనే టీడీపీ గట్టెక్కింది. ఒక్కో వార్డుకు రెండు వేల నుంచి నాలుగు వేల ఓట్లు ఉండే వార్డుల్లో కేవలం 5 నుంచి 15ఓట్ల మెజార్టీతో నాలుగు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. 2వ వార్డులో 2ఓట్ల మెజార్టీ ,4వ వార్డులో 13 ఓట్లు, 9వ వార్డులో 15ఓట్లు, 12వ వార్డులో 8 ఓట్లు తేడాతో టీడీపీ అభ్యర్థులు గట్టెక్కారు. పట్టణంలోని 42వార్డులకు గానూ వైఎస్సార్సీపీ 11వార్డులు, టీడీపీ 29వార్డులు, కాంగ్రెస్ 1, మరో వార్డు ఫలితం తేలాల్సి ఉంది. పట్టణంలో మొత్తం 89,201 ఓట్లు పోలవ్వగా వైఎస్సార్సీపీకి 39,031, టీడీపీకి 43,939, కాంగ్రెస్‌కు 3,195 ఓట్లు వచ్చాయి. అయితే మున్సిపల్ ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికల నాటికి ఉండే అవకాశం లేదని, ఇక్కడ అందరికి అందుబాటులో ఉండే పేర్ని వెంకట్రామయ్య(నాని)కి పరిస్థితి అనుకూలంగానే ఉంటుందని వైఎస్సార్సీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 30వ వార్డులో ఈవీఎం సాంకేతిక లోపం కారణంగా ఫలితాన్ని ప్రకటించలేదు. ఇదే వార్డులో మరో ఈవీఎంలో ఓట్ల లెక్కింపులో వైఎస్సార్సీపీ అభ్యర్థికి 40ఓట్లు ఆధిక్యత వచ్చినట్టు సమాచారం. కాగా, ఈవీఎం సాంకేతిక లోపం కారణంగా ఈ ఫలితాన్ని మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. ఉయ్యూరులో చెరి సగం.. ఉయ్యూరు నగర పంచాయతీలో వైఎస్సార్సీపీ, టీడీపీ నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. దీంతో రెండు పార్టీలకు చెరో సగం వార్డులు దక్కాయి. ఉయ్యూరు నగర పంచాయతీలో 20 వార్డులకు గానూ వైఎస్సార్సీపీ 9, టీడీపీ 9 వార్డులు గెలుచుకున్నాయి. కాగా, ఇద్దరు స్వతంత్రులు గెలుపొందగా వారు చెరో పార్టీలో చేరారు. దీంతో పదేసి వార్డులు గెలుచుకుని సమాన బలం సాధించడంతో పాలక పగ్గాలు ఎవరు చేపట్టాలనే దానిపై ఫలితం డ్రా అయ్యింది. దీంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఉయ్యూరు నగర పంచాయతీ పాలకవర్గం ఎన్నిక ఉంటుందని, అప్పుడు ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్లు కీలకంగా ఉంటాయనిఅంటున్నారు. మొత్తం 24,076 ఓట్లు పోలవ్వగా వైఎస్సార్సీపీకి 9,332, టీడీపీకి 9,422ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైఎస్సార్సీపీ కంటే టీడీపీకి కేవలం 90 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. తిరువూరులో టీడీపీకి 300ఓట్లే మిగులు తిరువూరు నగర పంచాయతీలో 12వార్డులు గెలుచుకుని పాలకపగ్గాలు చేపట్టే అవకాశం దక్కించుకున్న టీడీపీకి వైఎస్సార్సీపీ కంటే అదనంగా వచ్చింది కేవలం 300ఓట్లు మాత్రమే. ఇక్కడ మొత్తం 20,131ఓట్లు పోలవ్వగా వైఎస్సార్సీపీకి 7,851, టీడీపీకి 8,155ఓట్లు వచ్చాయి. అంటే 304ఓట్లు అదనంగా టీడీపికి వచ్చాయి. ఇక్కడ మొత్తం 20 వార్డుల్లో టీడీపీకి 12, వైఎస్సార్సీపీకి 7, సీపీఎంకు ఒక వార్డు దక్కాయి. నందిగామ దేశం పరం... నందిగామ నగర పంచాయతీగా ఏర్పడిన తొలి ఎన్నికల్లో టీడీపీకి పాలకపగ్గాలు దక్కాయి. మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్సీపీ 8, టీడీపీ 12వార్డులు వచ్చాయి. మొత్తం 25,110ఓట్లు పోలవ్వగా వైఎస్సార్సీపీకి 10,453, టీడీపీకి 11,429, స్వతంత్రులకు 3,474ఓట్లు వచ్చాయి. టీడీపీకి సుమారు వెయ్యి ఓట్లు అదనంగా వచ్చాయి. -
టీడీపీ ఖాతాలో ఆ ‘రెండు’
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో యల మంచిలి,నర్సీపట్నం మున్సిపాల్టీలను టీడీపీ దక్కించుకుంది. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో ఆ పార్టీ మెజార్టీ వార్డులను కైవసం చేసుకుంది. యలమంచిలి మున్సిపాల్టీలో 23 వార్డులకు 20వార్డులను చేజిక్కించుకుంది. వైఎస్సార్సీపీ మూడు వార్డుల్లో గెలుపొందింది. నర్సీపట్నంలో 27వార్డులకు టీడీపీకి 18 చోట్ల అనుకూల ఫలితాలు వచ్చా యి. వైఎస్సార్సీపీ ఆరింట విజయకేతనం ఎగురవేసింది. మార్చి 30న ఈ రెండు పట్టణాల్లో పోలింగ్ జరిగింది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్లలెక్కింపు చేపట్టారు. నర్సీపట్నంలో 27 వార్డులకు టీడీపీ 18, వైఎస్సార్సీపీ 6, కాంగ్రెస్ ఒకటి, సీపీఐ ఒకటి, టీడీపీ మద్దతుదారు మరో స్థానంలో విజయం సాధించారు. యలమంచిలి మున్సిపాల్టీలో మొత్తం 24 వార్డులకు ఒకటి ఏకగ్రీవం కావడంతో 23చోట్ల పోలింగ్ నిర్వహించారు. టీడీపీ 20 వార్డులను దక్కించుకుంది. వైఎస్సార్సీపీ మూడు వార్డుల్లో విజయ సాధించింది. సంస్థాగత సమస్యలున్నా దీటైన పోటీ : మున్సిపల్ ఫలితాల్లో వైఎస్సార్సీపీ సింహభాగం వార్డుల్లో దీటైన పోటీ ఇచ్చింది. వాస్తవానికి వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడం తొలిసారి. మున్సిపల్ ఎన్నికలనాటికి వైఎస్సార్సీపీ వార్డు ,బూత్ స్థాయి కమిటీలను పూర్తిగా నియమించలేదు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల నియామకం కూడా ఊపందుకోలేదు. ఇటువంటి సంస్థాగత ఏర్పాట్లు నిర్మాణం సమయంలో అనూహ్యంగా మున్సిపల్ ఎన్నికలు వచ్చిపడ్డాయి. పైగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు వెస్సార్సీపీ ప్రజలపక్షాన పలు సమస్యలపై పోరాటంలో నిమగ్నమైంది. ఇలా సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతున్న సమయంలో ఈ ఎన్నికలు సవాల్‌గా నిలిచా యి. అయినప్పటికీ అనుభవానికి మించి పోరాడింది. ఫలితంగా రెండు మున్సిపాల్టీల్లో టీడీపీతో పోటాపోటీగా నిలిచింది. టీడీపీ పలు వార్డుల్లో కేవలం సింగిల్ డిజిట్ మెజార్టీతోనే ఒడ్డున పడింది. సీట్ల పరంగా వ్యత్యాసం కనిపించినా చాలాచోట్ల టీడీపీకి దగ్గరగా వైఎస్సారీసీపీకి ఓట్లు పోలయ్యాయి. యలమంచిలి పట్టణం13వ వార్డులో 4 ఓట్లు, 19వ వార్డులో 3 ఓట్లు, 4వ వార్డులో 77 ఓట్లతో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. నర్సీపట్నం 15వ వార్డులో 28 ఓట్లు, 19వ వార్డులో 16ఓట్లతో టీడీపీ గట్టెక్కింది. మరోపక్క వైఎస్సార్సీపీ విజయం సాధించిన వార్డుల్లో అత్యధిక మెజార్టీ దక్కింది. నర్సీపట్నం నాలుగో వార్డులో 207, 11వ వార్డులో 177, 12వ వార్డులో 315, 16వ వార్డులో 753, 18వ వార్డులో 251 ఓట్ల చొప్పున అత్యధిక మెజార్టీ దక్కించుకుంది. యలమంచిలిలో మొత్తం పోలయిన 25,867 ఓట్లకు వైఎస్సార్సీపీ 10,460 ఓట్లు దక్కించుకుంది. టీడీపీకి 15,044ఓట్లు వచ్చాయి. నర్సీపట్నంలో పోలయిన మొత్తం 33,574 ఓట్లుకు వైఎస్సార్సీపీకి 12,009, టీడీపీకి 18,049 ఓట్లు దక్కాయి. -
ఫలితాలపై ఉత్కంఠ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: టిక్.. టిక్.. టిక్.. గడియారం చప్పుడు రాజకీయ పార్టీల నేతల గుండెల్లో దడ పుట్టిస్తోంది. మరికొద్ది సేపట్లో పురపాలక సంఘాల ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. గత మార్చి 30న జిల్లాలోని వికారాబాద్, తాండూరు, ఇబ్రహీంపట్నం, బడంగ్పేట్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫలితాల వెల్లడి వాయిదా పడింది. ఇప్పుడు అన్ని ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగియడంతో ఫలితాలను వెలువరించేందుకు ఎన్నికల సంఘం ఉపక్రమించింది. ఇందులో భాగంగా సోమవారం పురపాలక సంఘాలు, మంగళవారం ప్రాదేశిక స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపుచేపట్టనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తేలనున్న 663 మంది భవిష్యత్తు ఐదు మున్సిపాలిటీలు/నగర పంచాయతీల పరిధిలో 119 కౌన్సిలర్ స్థానాలకు వివిధ పార్టీలకు చెందిన 663 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. శక్తియుక్తులన్నీ కూడగట్టి జోరుగా ప్రచారం నిర్వహించి, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పలు ఫీట్లు చేశారు. ఓటింగ్ సమయం వరకు గెలుపు కోసం కృషి చేసిన వీరంతా.. నెలకు పైబడి ఫలితాల కోసం అంచనాలు వేసి తమ బలమెలా ఉందనే విషయమై రకరకాల సర్వేలు నిర్వహించారు. మొత్తంగా సోమవారం అభ్యర్థుల భవితవ్యం తేలనుండటంతో ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ ఎన్నికపై సందిగ్ధత నగర పంచాయితీ చైర్మన్ ఎన్నికపై ఎన్నికల కమిషన్ ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో చైర్మన్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. చైర్మన్ ఎన్నికపై జాప్యం జరిగిన కొద్దీ సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయి. -
రెండు గంటల్లో ‘పుర’ ఫలితాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను వెల్లడించారు. సోమవారం మునిసిపల్, 13న జరిగే ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపనకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. మునిసిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించినందున ఫలితాలు రెండు గంటల్లోపు తెలిసే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని మహబూబాబాద్, జనగామ, మునిసిపాలిటీలతోపాటు భూపాలపల్లి, నర్సపేట, పరకాల నగర పంచాయతీలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కేంద్రంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో చేపట్టనున్నట్లు వివరించారు. ఈ మేరకు అకాడమిక్ భవనంలో అన్ని రకాలు ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారులు శ్రీధర్, జగన్మోహన్రావులను ఎన్నికల సంఘం నియమించినట్లు వెల్లడించారు. వీరితోపాటు ఐదుగురు కౌంటింగ్ పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కోసం 109 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చి విధులు కేటాచించామన్నారు. 13న ప్రాదేశిక ఓట్ల లెక్కింపు ఈనెల 13న నిర్వహించనున్న ప్రాదేశిక ఓట్ల లెక్కింపునకు సైతం ఏర్పాట్లు పూర్తయ్యూయని కలెక్టర్ తెలిపారు. ఐదు రెవెన్యూ డివిజన్లలోని 50 జెడ్పీటీసీ, 701 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వివరించారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. నర్సింహులపేట మండలం రేపోణి, స్టేషన్ఘన్పూర్మండలం నిడిగొండ, హసన్‌పర్తి మండలం సిద్దాపూర్, కురవి మండలం మొగిలిచ్ల ఎంపీటీసీలు ఏక గ్రీవమైనట్లు గుర్తు చేశారు. సెల్ఫోన్లు నిషేధం కౌంటింగ్ హాలులోకి ఆర్ఓలు మినహా ఇతర ఉద్యోగులు, పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు సెల్ఫోన్లు, పాన్, సిగరెట్, గుట్కాలు తీసుకె ళ్లడం నిషేధమని కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలన కు ఏడుగురు పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. వీరిలో పరకాలకు ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావు, ములుగుకు మైనార్టీ సంక్షేమ శాఖ డీడీ ఎన్.భాగ్యమ్మ, వరంగల్‌కు ఏజేసీ కృష్ణారెడ్డి, జనగామకు డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, మహబూబాబాద్‌కు యూఎల్సీ జాన్‌వెస్లీ, కె.కృష్ణవేణి, నర్సం పేటకు ఎస్డీసీ డేవిడ్‌ను నియమించామన్నారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశామన్నా రు. ఐదు కంపెనీల ఏపీఎస్పీ బలగాలు ఉన్నాయని పే ర్కొన్నారు. 30పోలీస్చట్టం, 144 సెక్షన్ అమల్లో ఉంటుం దని చెప్పారు. సమావేశ ంలో జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, అడిషనల్ ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. రైతాంగాన్ని ఆదుకుంటాం... జిల్లాలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అదుకుంటామని కలెక్టర్ తెలిపారు. పంటనష్టంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ స్పందించారు. జిల్లాలో 5,546 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. తడిసిన ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించే విధంగా ఐకేపీ ద్వారా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. మార్కెట్ యార్డుల్లో తడిసిన ధాన్యానికి భీమా చెల్లించేలా ఏర్పా ట్లు చేస్తున్నామన్నారు. ధాన్యం తడవకుండా స్థానికంగా పాఠశాల్లో నిల్వ చేసుకునేలా అవకాశం కల్పిస్తామని, రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రాదేశిక ఓట్ల లెక్కింపు కేంద్రాలు.. డివిజన్ స్థలం వరంగల్ నిట్‌లో జనగామ ప్రసాద్ ఇంజినీరింగ్ కళాశాల మహబూబాబాద్ ఏపీ మోడల్‌స్కూల్, ఫాతిమా స్కూల్ పరకాల గణపతి ఇంజినీరింగ్ కళాశాల ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల -
కొనసాగుతున్న ఉత్కంఠ..
సాక్షి, హన్మకొండ: వరుస ఎన్నికల నేపథ్యంలో క్వార్టర్స్ ఫైనల్‌గా భావించిన పురపాలక పోరు క్లైమాక్స్ దశకు చేరింది. సార్వత్రిక ఎన్నికలకు కచ్చితంగా నెలరోజుల ముందు జిల్లాలోని రెండు మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగగా... సోమవారం ఈ ఫలితాలు వెల్లడి కానున్నారుు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటముల అంశం మునిసి‘పోల్స్’ ఫలితాలతో కొంతమేర తేటతెల్లం కానుండడంతో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ముఖ్య నేతల్లో ఉత్కంఠ నెలకొంది. జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు... నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నగర పంచాయతీలకు మార్చి 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. వీటిలో కాంగ్రెస్ తరఫున జనగామ అసెంబ్లీ అభ్యర్థిగా తెలంగాణపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, భూపాలపల్లి నుంచి మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి బరిలో ఉన్నారు. మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కవిత, నర్సంపేట నుంచి తెలంగాణ టీడీపీ అగ్రనేతల్లో ఒకరైన రేవూరి ప్రకాశ్‌రెడ్డి బరిలో నిలిచారు. మునిసిపాలిటీల్లో సాధించే ఓట్లను బట్టి సార్వత్రిక ఎన్నికల్లో ఆయూ పార్టీల అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధిస్తారా... గట్టిపోటీని ఎదుర్కొంటారా... అనేది వెల్లడికానుంది. దీంతో మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వారిని టెన్షన్‌కు గురిచేస్తున్నారుు. టార్గెట్ పొన్నాల... పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాసై...ఎన్నికల హడావుడి ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నేతలు వ్యూహం రచించారు. ఇందులో భాగంగానే పొన్నాలపై గులాబీ అధినేత కేసీఆర్ నిత్యం విమర్శలు గుప్పించినట్లు వినికిడి. మరోవైపు టీఆర్ఎస్ నాయకులు జనగామలో గల్లీగల్లీకి తిరుగుతూ విస్తృత ప్రచారం చేశారు. అంతేకాదు.. సొంత ఇలాకాలోనే పార్టీని గెలిపించడం పొన్నాలకు కష్టం అనిపించేలా గులాబీ శ్రేణులు ప్రచారం సాగించాయి. ఈ వ్యూహాలకు పొన్నాల సైతం దీటుగానే స్పందించారు. రాష్ట్ర వ్యాప్త బాధ్యతలు నిర్వర్తిస్తూనే... జనగామ మునిసిపాలిటీపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో ఒకే ఒక వార్డు ఏకగ్రీవం కాగా... అది జనగామలో కాంగ్రెస్ పార్టీనే దక్కించుకునేలా వ్యవహరించి పోలింగ్‌కు ముందే ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ప్రచార హోరు చెక్ పెట్టేందుకు ఎన్నికల ప్రచారం చివరి రోజు పొన్నాల స్వయంగా జనగామలో పర్యటించారు. అరుుతే మునిసిపాలిటీ పోరులో ఎవరు విజయం సాధిస్తారో.. అసెంబ్లీ ఎన్నికల్లో వారిదే పైచేరుుగా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తుండడంతో అందరి దృష్టి జనగామపైనే ఉంది. అదేవిధంగా.. కేబినేట్ హోదా కలిగిన గండ్ర వెంకటరమణారెడ్డికి భూపాలపల్లి మునిసిపల్ ఎన్నికల్లో విజయం కీలకంగా మారింది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం దక్కకుండా ఉండేందుకు ఆయన రెండు నెలలకు పైగా స్థానికంగా ఉంటూనే అనేక ఎత్తులు వేశారు. వైస్ చైర్మన్ ఇస్తామంటూ సీపీఐతో స్థానికంగా పొత్తు కుదుర్చుకున్నారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేశారు. ఆయన వ్యూహం ఫలించి భూపాలపల్లి మునిసిపాలిటీలో కాంగ్రెస్, సీపీఐ కూటమి విజయం సాధిస్తే... సార్వత్రిక ఎన్నికల్లో సానుకూల ఫలితాలను ఆయన ఆశించవచ్చు. లేనిపక్షంలో అక్కడ కూడా చివరి నిమిషం వరకు ఏమవుతుందో... ఏమోననే అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంది. సిట్టింగ్‌లకు సంకటం పరకాల నగర పంచాయతీలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతికి ఆ పార్టీ నాయకత్వం ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ నిరాకరించింది. ఇక... నర్సంపేట, మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మాలోతు కవిత ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు. దీంతోమునిసిపల్ పోలింగ్ సరళి ఏ విధంగా జరిగిందనే అంశంపై వీరిద్దరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పరకాల నగర పంచాయతీ పోలింగ్ జరిగే సమయానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి దిశానిర్ధేశం చేసే నాయకులు కరువయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి సహోదర్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఇనుగాల వెంకట్రాంరెడ్డి పోటీపడ్డారు. మునిసిపల్ ఎన్నికల్లో వచ్చే ఓట్లు, గెలిచే వార్డు మెంబర్ల సంఖ్యను బట్టి ఈ ముగ్గురు తమ విజయావకాశాలపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. -
జెడ్పీటీసీ, ఎంపీటీసీల కౌంటింగ్ రేపే
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. గత నెలలో రెండు విడతలుగా జరిగిన పోలింగ్‌కు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో 49 జెడ్పీటీసీ, 812 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మరోపక్క జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో కైవసం చేసుకునే స్థానాలపై ప్రధాన పార్టీలు ఇప్పటికే అంచనాలు వేస్తున్నాయి. తద్వారా జెడ్పీ చైర్పర్సన్, మండల అధ్యక్ష పదవులను దక్కించుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇందుకోసం ఆయా మండలాల్లో నాయకులు ఇప్పటికే నడుంబిగించినట్లు సమాచారం. జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీల ఎన్నిక ప్రక్రియ కోసం నోటిఫికేషన్ విడుదల కాకముందే తమ బలాబలాలను ఆయా పార్టీల నాయకులు అంచనా వేసుకుంటున్నారు. ఆధిపత్యం నిలుపుకోవటం కోసం ఫిరాయింపులు అవకాశం ఉండే ప్రాంతాలలో అవసరమైతే క్యాంపులు నిర్వహించే ప్రతిపాదనలపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. నాలుగు డివిజన్లలో కౌంటింగ్... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో నాలుగు డివిజన్ కేంద్రాల్లో ఆయా డివిజన్ల పరిధిలోని మండలాలకు సంబంధించి కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో 12 మండలాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మచిలీపట్నం వరలక్ష్మి పాలిటెక్నిక్ కళాశాలలో కృతివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు, బందరు, చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల, మొవ్వ, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలకు సంబంధించి కౌంటింగ్ జరుపుతారు. గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో తొమ్మిది మండలాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు, పెదపారుపూడి, పామర్రు, ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు, కలిదిండి మండలాల ఓట్ల లెక్కింపు చేపడతారు. నూజివీడులో 14 మండలాలకు సంబంధించి కౌంటింగ్ కోసం సారథి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, రెడ్డిగూడెం, విస్సన్నపేట, చాట్రాయి, ముసునూరు, నూజివీడు, ఆగిరిపల్లి, బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం, ఉయ్యూరు, పమిడిముక్కల మండలాలకు సంబంధించి కౌంటింగ్ జరుపుతారు. విజయవాడలో సిద్ధార్థ మహిళా కళాళాలలో డివిజన్లోని 14 మండలాల కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ విజయవాడ రూరల్, మైలవరం, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు మండలాలకు కౌంటింగ్ జరుపుతారు. భారీ బందోబస్తు కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. జెడ్పీ పీఠం దక్కేదెవరికో... జెడ్పీ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించారు. వైఎస్సార్సీపీ తరఫున తాతినేని పద్మావతి, టీడీపీ తరఫున గద్దె అనురాధ చైర్పర్సన్ అభ్యర్థులుగా బరిలో దిగారు. జిల్లాలోని 49 జెడ్పీటీసీలలో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీ అభ్యర్థి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అవకాశముంది. దీంతో ప్రధాన పార్టీలు జెడ్పీ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ఉభయ పార్టీల నాయకులు జెడ్పీటీసీలుగా గెలుపొందే తమ అభ్యర్థుల గురించి ఆరా తీస్తున్నారు. -
టీడీపీని వీడని విభేదాలు
సాక్షి, విజయవాడ : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది తెలుగుదేశం నేతల పరిస్థితి. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీ,ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలు వచ్చే సమయంలో తెలుగుదేశం నేతలు తమ విజయాలపై తరచితరచి లెక్కలు వేసుకుంటున్నారు. ఒక వైపు ఓటమి చెందుతామేమోనన్న అనుమానం వెంటాడుతున్నా, మరో వైపు పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ గెలుపు తమదేనంటూ సవాళ్లు విసురుతున్నారు. జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వీచిందని పరిశీలకులు ప్రకటిస్తుండడంతో నేతలు అంతర్మథనానికి లోనవుతున్నారు. గెలుస్తామంటూనే.... టీడీపీ అభ్యర్థులు తాము గెలుస్తామంటూనే మరోకవైపు ఎన్నికల్లోతమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని గుర్తించామని, వారిపై చర్యలకు సిఫార్సులు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. అయితే టీడీపీలో అభ్యర్థులకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వెన్నుపోటు పోడిచే కంటే ఒక అభ్యర్థికి మరోక అభ్యర్థివెన్ను పోటు పోడుచుకున్నారనే ప్రచారం పార్టీ నేతల నుంచి వస్తోంది. ఎన్నికల వేళ సమష్టిగా పోరాడాల్సిన నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించారు. అంతేకాకుండా ఎవరికి వారు తమ ఓటు వేయించుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప.. రెండవది వారికి పడే విధంగా ప్రయత్నాలు చేయలేదనే ఆ పార్టీ వర్గాల నుంచే వాదన వినబడుతోంది. ఈ లెక్కన టీడీపీ అధినేత ప్రక్షాళన ప్రారంభించాల్సి వస్తే తొలుత అభ్యర్థుల నుంచే ప్రారంభించాలని, ఆ తరువాతనే ఆ పార్టీ కోసం పనిచేసే ఇతర నేతలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం కలసి పనిచేయగలుగుతారా?..... స్థానిక సంస్థలు, అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల ఒకేసారి రావడంతో నేతల మధ్య విబేదాలు బాగా ముదిరాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఆశించి, భంగపడిన నేతలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం పెద్దగా పనిచేయలేదు. తామంటే లెక్కలేనప్పుడు తాము ఎందుకు పనిచేయాలనే భావనలో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. నేతల మధ్య మనస్పర్థలు తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ నేతలంతా కలసి పనిచేయగలరా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. -
తేలేది నేడే
మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల భవితవ్యం సోమవారంతో తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా మధ్యాహ్నానికే పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. అధికారులు కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలోని మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడి కానున్నాయి. జిల్లాలో ఒక కార్పొరేషన్, ఐదు పురపాలక సంఘాలు, మూడు నగర పంచాయతీలు ఉన్నాయి. వాటిలో కొత్తగా ఏర్పడిన నగర పంచాయతీలు ఉయ్యూరు, నందిగామ, తిరువూరులకు తొలి విడతగా పాలకవర్గాలు ఎన్నిక కానున్నాయి. పురపాలక సంఘాల్లో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున కౌంటింగ్ ఏజెంట్ల నియామకం పూర్తయింది. లెక్కింపులో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించారు. నాలుగేళ్లుగా వాయిదాలే... 2010 సెప్టెంబరులో పురపాలక సంఘాల పాలకవర్గాల పదవీకాలం పూర్తయింది. అప్పటి ప్రభుత్వం పురపాలక సంఘాల ఎన్నికలను వాయిదా వేసి ప్రత్యేకాధికారుల పాలనలోనే పురపాలక సంఘాలను నడిపింది. హైకోర్టు అక్షింతలు వేయడంతో దాదాపు 42 నెలల అనంతరం పురపాలక సంఘాల ఎన్నికలను ఈ ఏడాది మార్చి 30న నిర్వహించారు. ఏప్రిల్ రెండో తేదీనే పురపాలక సంఘాల ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సాధారణ ఎన్నికల నేపథ్యంలో పురపాలక సంఘాల కౌంటింగ్‌ను మే 12న నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 41 రోజుల తరువాత పురపాలక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు ఇవే... జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాల్లోని 218 వార్డులకు, విజయవాడ కార్పొరేషన్‌లోని 59 డివిజన్లలో మార్చి 30న ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహించగా సోమవారం కౌంటింగ్ జరగనుంది. మచిలీపట్నం పురపాలక సంఘంలోని 42 వార్డులకు చెందిన ఎన్నికల కౌంటింగ్ మచిలీపట్నం హిందూ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తారు. గుడివాడ పురపాలక సంఘంలోని 36 వార్డుల కౌంటింగ్‌ను గుడివాడలోని ఏఎన్నార్ కళాశాలలో నిర్వహించనున్నారు. నూజివీడు పురపాలక సంఘంలోని 30 వార్డులకు, తిరువూరు పురపాలక సంఘంలోని 20 వార్డులకు, ఉయ్యూరు పురపాలక సంఘంలోని 20 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపును నూజివీడు సారథి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నందిగామ పురపాలక సంఘంలోని 20 వార్డులకు, జగ్గయ్యపేట పురపాలక సంఘంలోని 27 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపును విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో నిర్వహించనున్నారు. పెడన పురపాలక సంఘంలోని 23 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపును మచిలీపట్నంలోని శ్రీవరలక్ష్మి పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.రఘునంద న్‌రావు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. అభ్యర్థుల్లో ఎడతెగని ఉత్కంఠ... ఈ ఏడాది మార్చి 30న పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. 41 రోజుల అనంతరం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏప్రిల్ రెండో తేదీనే పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని అభ్యర్థులు ఆశలు పెట్టుకోగా సాదారణ ఎన్నికల నేపధ్యంలో పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాల వెల్లడికి బ్రేక్ పడింది. ఆద్యంతం హోరాహోరీగా జరిగిన పురపాలక సంఘాల ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులూ నగదును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. కౌన్సిలర్ పదవి కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన అభ్యర్థులు ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై ఉత్కంఠ ఎదుర్కొంటున్నారు. ఎట్టకేలకు సోమవారం ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండటంతో ఈ ఉత్కంఠకు తె రపడనుంది. ఇప్పటికే అభ్యర్థులు తమ తరఫున కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకున్నారు. కౌంటింగ్ ఏజెంట్లు లోపలికి ప్రవేశించకుండా బారికేడ్లతో పాటు మెస్‌లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన లూ జరగకుండా అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గెలుపొందిన అభ్యర్థులకు ఆయా పురపాలక సంఘాల ఎన్నికల అధికారులు ధ్రువపత్రాలను జారీ చేస్తారు. జోరుగా బెట్టింగ్‌లు... పురపాలక సంఘాల్లో కౌంటింగ్ సోమవారం జరగనుండటంతో ఆయా పురపాలక సంఘాల్లో ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగ్‌ల జోరు ఊపందుకుంది. ఏ పురపాలక సంఘంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ వార్డులో ఎవరు గెలుస్తారు, వార్డుల వారీగా గెలిచే అభ్యర్థులకు ఎంత మెజారిటీ వస్తుంది తదితర అంశాల్లో బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. పందేల రాయుళ్లు అవతలి వ్యక్తులను రెచ్చగొట్టి మరీ పందేలకు పురిగొల్పుతున్నారు. సామాన్యుడి నుంచి ధనవంతుల వరకు అతి తక్కువగా వెయ్యి రూపాయల నుంచి లక్షల్లో పందేలు జరుగుతున్నాయి. -
ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి
తుమ్మపాల : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ అన్నారు. కొత్తూరు ఏఎంఏఎల్ కళాశాల కౌంటింగ్ కేంద్రాలను ఆదివారం పరిశీలించి ఏర్పాట్లపై ఆరాతీశారు. అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాల ఓట్ల లెక్కింపు ఇక్కడ జరగనుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఫలితాలు వెలువడే సరికి చీకటి పడే అవకాశం ఉన్నందున విద్యుత్ సదుపాయం ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జనరేటర్‌ను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. లెక్కింపు అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా పీడీ శ్రీనివాస్, ఆర్డీఓ వసంతరాయుడు మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రవర్తన సరిగా లేని ఏజెంట్లను సైతం బయటకు పంపాలని ఆదేశించారు. బ్యాలెట్ పత్రాలు కట్టలు కట్టేటప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రీకౌంటింగ్ కోరితే అందులోని వాస్తవికతను గుర్తించి చేపట్టాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లను ఏజెంట్లు సమక్షంలోనే తెరిచి బ్యాలెట్ బాక్స్‌లను లెక్కింపు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. చెల్లని ఓట్ల పట్ల అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని, పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే డ్రా తీసి విజేతను ప్రకటించాలని సూచించారు. కౌంటింగ్ ముందు పోలైన ఓట్ల మొత్తాన్ని పీఓ డైరీలో నమోదు చేసిన సంఖ్యతో సరిపోల్చుకుని అనంతరం లెక్కింపు ప్రారంభించాలన్నారు. అనంతరం అన్ని మండలాల ఎంపీడీఓలతో సమావేశమై సూచనలు చేశారు. -
నేడు ‘మున్సిపల్’ లెక్కింపు
యలమంచిలి/నర్సీపట్నంటౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం సోమవారం తేలనుంది. కొత్తగా ఏర్పడిన యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోనన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడనుంది. వాస్తవానికి ఏప్రిల్ రెండో తేదీనే పురఫలితాలు వెలువడాల్సి ఉన్నా సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కోర్టు ఆదేశాలతో ఈ ఓట్ల లెక్కింపు మే 12కు వాయిదాపడిన విషయం తెలిసిందే. అనకాపల్లి ఎఎంఎఎల్ కళాశాలలో యల మంచిలి ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. మొదటి ఫలితం 9గంటలకే వెలువడే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. యలమంచిలి మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో రెండో వార్డు నుంచి టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి పిళ్లా రమాకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 23వార్డుల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ, స్వతంత్రులు 52మంది పోటీలో ఉన్నారు. మున్సిపాలిటీలో 31,168మంది ఓటర్లు ఉండగా 23వార్డుల్లో 25,867మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలను వైఎస్సార్సీపీ, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వలస కూలీలు, కుటుంబాలను, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులను రప్పించి ఓటేయించారు. పలు వార్డుల్లో 90శాతానికి మించి పోలింగ్ నమోదయింది. 3,7, 12,13,19,21,22 వార్డుల్లో గెలుపు పందాలు రూ. లక్షల్లో జరిగాయి. దాదాపు 43 రోజులు ఫలితాల కోసం ఎదురుచూడవలసి వచ్చింది. దానికి సోమవారం తెరపడనుంది. నర్సీపట్నంలో... నర్సీపట్నం టౌన్ : నర్సీపట్నం మున్సిపాలిటి లో 27 వార్డులకు వివిధ పార్టీల నుంచి 85 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య పోటీ నెలకొంది. పెదబొడ్డేపల్లి డాన్‌బాస్కో కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. 54 పోలింగ్ కేంద్రాల ద్వారా 54 ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపుపై ఎట్టకేలకు చిక్కుముడి వీడనుంది. కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లును మున్సిపల్ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. కౌంటింగ్ ఏర్పాట్లును మున్సిపల్ ఆర్జేడీ ఆశాజ్యోతి, ఆర్డీవో సూర్యారావు స్వయంగా పరిశీలించి అధికారులు, సిబ్బందికి సూచనలు, సలహాలు అందించారు. -
ఫలితాలు వచ్చినా...క్యాంపులు తప్పవు
సాక్షి, చిత్తూరు: మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చినా క్యాంపు రాజకీయాలు తప్పేలా లేవు. ఇప్పటివరకు ఎన్నికల్లో గెలిస్తే చాలనుకున్న ప్రధాన రాజకీయ పార్టీలకు మరో కష్టం వచ్చి పడింది. మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను జూన్ మొదటి వారంలో కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాతే చేపట్టాల్సి ఉంది. ఎక్స్అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యే, ఎంపీలకు ఓటు హక్కు ఉండడంతో కొత్త అసెంబ్లీ, లోక్‌సభ ఏర్పడిన తరువాతే ఈ ఎన్నిక జరపాల్సి ఉంది. దీంతో చైర్మన్ పదవులు ఆశిస్తున్న వారికి గెలిచిన అభ్యర్థులు జారిపోకుండా క్యాంపు రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత గెలిచిన అభ్యర్థులు జారిపోకుండా చూసుకోవడం, అదే సమయంలో సంఖ్యపరంగా తమకు ఎక్కడైనా తేడా వస్తే స్వతంత్రుల మద్దతు కూడగట్టుకోవడం వంటివి అవసరం. ఈ క్రమంలో దాదాపు 20 రోజుల పాటు అభ్యర్థులను బయటి ప్రాంతాల్లో తిప్పుతూ ప్రత్యర్థులకు దొరక్కుండా చేయటం కూడాప్రధాన రాజకీయ పార్టీలకు ముఖ్యమైన అంశంగా ఉంది. క్యాంపు రాజకీయాలకు ఊపు జిల్లాలో ఒక్కసారిగా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి. ఫలితాల అనంతరం ఆధిపత్యం సాధించాలంటే క్యాంపు రాజకీయాలు తప్పనిసరి. దీంతో గతంలో జరిగిన తరహాలోనే ఈసారి కూడా క్యాంపు రాజకీయాలకు రాజకీయ పార్టీలు తెరలేపనున్నాయి. గెలిచే అభ్యర్థులను తీర్థయాత్రలకు తీసుకెళ్లటమా, పర్యాటక ప్రాంతాలకు పంపటమా ? లేదా జిల్లాలోనే ఒక క్యాంపు ఆర్గనైజ్ చేసి అక్కడే గెలిచిన వారిని ఉంచడమా అనే ఆలోచనలతో వివిధ పార్టీల నాయకులు ముఖ్యంగా ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు తర్జనభర్జన పడుతున్నారు. ఇందుకోసం ముందుగానే సన్నాహాలు కూడా ప్రారంభించారు. ఠారెత్తిపోతున్ననియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఇప్పటికే వరుస ఎన్నికలతో ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. డబ్బులు సర్దలేక తంటాలు పడిన ప్రధానపార్టీల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఇప్పుడు మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను క్యాంపులకు తీసుకెళ్లాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఖర్చు వ్యవహారమంతా ఆయా చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీపీ ఆశావహులకే వదిలేయడమా ? లేక పార్టీ తరఫున నిధులు అడగాలా ? అన్న సందేహం లో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేరు. అందరూ వెనుకంజ వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక ల్లో పార్టీ ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదని, ఇప్పుడు ఎవరో కుర్చీ ఎక్కేందుకు తాము ఎందుకు డబ్బులు ఖర్చు చేయాలని ఒకరిద్దరు టీడీపీ కీలక నాయకులు ఉసూరుమంటున్నారు. -
విజేతలెవరో?
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఆరు మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 12 గంటల కల్లా పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడి కానున్నాయి. మార్చి 30న చిత్తూరు కార్పొరేషన్, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. పార్టీల గుర్తులపై ఎన్నికలు జరగడంతో ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందనే సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ఫలితాలను వెల్లడించ లేదు. పూతలపట్టు సమీపంలోని వేము కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో స్ట్రాంగ్‌రూంలలో ఈవీఎంలను భద్రపరిచారు. అక్కడే ఓట్లను లెక్కించనున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగియటంతో సోమవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలను వెల్లడించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి జిల్లా కలెక్టర్ కె.రాంగోపాల్ ఆధ్వర్యంలో ఆయా మున్సిపల్ ఉద్యోగులతో ఏర్పాట్లు చేశారు. భారీఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్‌ల జారీ పరిమితం చేశారు. ప్రధాన మీడియా సంస్థలకు సంబంధించి ఒక్కొక్కరికే పాస్‌లు ఇచ్చారు. ఆరు మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్ ఫలితాలు సమాచారశాఖ ద్వారా తామే అందిస్తామని, ఒక్కొక్క మున్సిపాల్టీకి ఒక్కొక్క విలేకరికి పాస్‌లు ఇవ్వొద్దని మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆయా రిటర్నింగ్ అధికారులుగా ఉన్న మున్సిపల్ కమిషనర్లు జర్నలిస్టులకు పాస్‌ల జారీని నిలిపేశారు. తేలనున్న అభ్యర్థుల భవితవ్యం జిల్లాలోని ఆరు మున్సిపాల్టీల్లో 169 వార్డులకు, చిత్తూరు కార్పొరేషన్లో 50 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. పుత్తూరులో 24, శ్రీకాళహస్తిలో 35, మదనపల్లెలో 35, నగరిలో 27, పలమనేరులో 24, పుంగనూరులో 24 వార్డులకు ఎన్నికలు జరగ్గా, మొత్తం 169 వార్డులకు 1300 మందికి పైగా అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో ఎవరు విజేతలు, ఎవరు పరాజితులు అనేది సోమవారం తేలనుంది. అభ్యర్థులు ఇప్పటికే తమ సన్నిహితుల వద్ద లెక్కల్లో మునిగి తేలుతున్నారు. ఎన్ని ఓట్ల మెజారిటీ రావచ్చు.. ఏ పోలింగ్ బూత్‌లో తమకు ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.. అనే విషయూలను పోలింగ్ సరళిఆధారంగా విశ్లేషణలు చేస్తున్నారు. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లకు మున్సిపల్ రిటర్నింగ్ అధికారులు పాస్‌లు జారీ చేశారు. రాజకీయ పార్టీల తర్జనభర్జనలు మున్సిపాల్టీల్లో ఏ రాజకీయ పార్టీ ఆధిక్యత సాధిస్తుందనేది కూడా నేడు తేలనుంది. పార్టీ గుర్తులపై నిర్వహించిన ఎన్నికలు కావటంతో అన్ని రాజకీయ పార్టీలు తమకు ఎన్ని వార్డులు వస్తాయనే దానిపై లెక్కల్లో మునిగి తేలుతున్నాయి. జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్, ఆరు మున్సిపాల్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. శ్రీకాళహస్తిలో మాత్రమే కాంగ్రెస్ కొన్ని వార్డులకు అభ్యర్థులను బరిలో దింపింది. మిగిలిన మున్సిపాల్టీల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువయ్యా రు. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పదవులను కైవశం చేసుకునేందుకు వైఎస్సార్ సీపీ, టీడీపీ వ్యూహరచనలు సాగిస్తున్నాయి. అయితే అత్యధిక మున్సిపాల్టీల్లో వైఎస్సార్ సీపీ హవా సాగనుంది. -
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు మదనపల్లె, పలమనేరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల ఎన్నికల ఓట్ల లెక్కిం పునకు సంబంధించి పూతలపట్టు మండలంలోని వేము ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశా రు. అలాగే పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.రాంగోపాల్‌తో పాటు జిల్లా ఎస్పీ రామకృష్ణ పరిశీలించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అంతకుముందు అభ్యర్థుల సమక్షంలో ఉదయం 7.30 గంటలకు ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూంలను తెరవనున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 11 గంటలలోపు పూర్తి చేయడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. తొలుత పుంగనూరు ఫలితాలు మొదట పుంగనూరు మున్సిపల్ ఫలితం వెల్లడి కానుంది. ఈ మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి. 22వ వార్డు వైఎస్సార్ సీపీకి ఏకగ్రీవం అయింది. దీంతో 23 వార్డులకు ఎన్నికలు జరి గాయి. ఈ మున్సిపాలిటీలోని ఓట్ల లెక్కింపు కోసం అధికారులు 8 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 3 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో ఈ మున్సిపాలిటీ ఫలితం మొద ట వెలువడే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన మున్సిపాలిటీల విషయానికి వస్తే మదనపల్లె మున్సిపాలిటీలో 35 వార్డులు ఉండగా, 16వ వార్డు స్వతంత్ర అభ్యర్థికి ఏకగ్రీవం అయింది. 34 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కోసం 12 టేబుళ్లు ఏర్పాటు చేసి మూడు రౌం డ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో 35 వార్డుల్లోని ఓట్ల లెక్కింపుకుగాను 7 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఐదు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుం ది. పలమనేరులోని 24 వార్డుల ఓట్ల లెక్కింపునకు 6 టేబుళ్లు ఏర్పాటు చేశారు. నాలుగు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. నగరి మున్సిపాలిటీలో 27 వార్డుల ఓట్ల లెక్కింపునకు 7 టేబుళ్లు ఏర్పాటు చేశా రు. 4 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. పుత్తూరు మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను 6 టేబుళ్లు ఏర్పాటు చేశారు. నాలుగు రౌండ్లలో ఓట్ల లెక్కిం పు పూర్తవుతుంది. చివరిగా చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలోని ఓట్ల లెక్కింపు కోసం 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. రౌండ్‌కు 10 డివిజన్లు చెప్పున ఐదు రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. అభ్యర్థితో పాటు ఇద్దరు ఏజెంట్లకు అనుమతి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఆయా డివి జన్లు, వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థితో పాటు ఇద్దరు ఏజెంట్లను అనమతించనున్నారు. వీరు ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకుని ద్రువీకరణ పత్రాలు పొందాలి. అయితే ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థి లేదా ఏజెంట్లలో ఒకరిని మాత్రమే కేంద్రం లోకి అనుమతిస్తారు. వారి డివిజన్, వార్డుకు సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే సంబంధిత అభ్యర్థి, ఏజెంట్లు వెలుపలికి రావాల్సి ఉంది. కమిషనర్లచే డిక్లరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్లచే ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. వాస్తవానికి వీటిని ఆయా డివి జన్ల రిటర్నింగ్ అధికారులు ఇవ్వాల్సి ఉన్నా ఓట్ల లెక్కింపు సౌలభ్యంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్ట ర్ కె.రాంగోపాల్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు బందోబస్తు ఓట్ల లెక్కింపు కేంద్రమైన వేము ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల పోలీసులతో పాటు పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపారు. పోలింగ్ కేంద్రం నుంచి నిర్ధారిత ప్రాంతం వరకు 144 సెక్షన్ విధించారు. -
ఉత్కంఠ
సాక్షి, కర్నూలు : సార్వత్రిక ఎన్నికల సందడికి తెరపడింది. ఇప్పుడు అందరి దృష్టి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైనే. మరో 24 గంటల్లో భవితవ్యం తేలనుండటంతో అభ్యర్థులకు కంటి మీద కునుకు దూరమవుతోంది. జిల్లాలోని నంద్యాల, నందికొట్కూరు, డోన్, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు.. ఆళ్లగడ్డ, ఆత్మకూరు, గూడూరు నగర పంచాయతీలకు మార్చి 30న పోలింగ్ నిర్వహించారు. అయితే సాధారణ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్‌ను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేయడం తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు ఉత్కంఠకు లోనైన అభ్యర్థులు మరో రోజు గడిస్తే ఫలితం వెలువడనుండటంతో గుండెలు చిక్కబట్టుకుని ఎదురుచూస్తున్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిమానం చూరగొన్న వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడిన నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు కౌంటింగ్‌పైనే కేంద్రీకృతమైంది. నంద్యాల మున్సిపాలిటీలో 42 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఓంటరిగానే అన్ని వార్డులకు పోటీ చేయగా.. టీడీపీ 41 వార్డులు, ఎంఐఎం 8 వార్డుల్లో పోటీ చేశాయి. అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో కాంగ్రెస్ 8 వార్డులకే పరిమితమైంది. ఆదోనిలో 41 వార్డులు ఉండగా.. వైఎస్ఆర్సీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపింది. కాంగ్రెస్ 39 స్థానాల్లో, టీడీపీ 40, బీజేపీ 8, ఎంఐఎం 14 సీపీఎం 3, సీపీఐ 6 స్థానాల్లో పోటీ చేశాయి. సీపీఐ, బీజేపీ సొంతంగానే బరిలో నిలవడంతో ఓట్ల చీలిక భయం టీడీపీ అభ్యర్థులను వెంటాడుతోంది. ఎమ్మిగనూరులో 33 వార్డులు ఉండగా వైఎస్ఆర్సీపీ, టీడీపీ, కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో నిలిచాయి. అదేవిధంగా సీపీఎం 4, సీపీఐ 3, ఎస్డీపీఐ 8.. బీజేపీ, లోక్‌సత్తా ఒక్కో స్థానాల్లో పోటీ చేశాయి. డోన్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా.. రెండింటిని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. టీడీపీ, బీజేపీ, సీపీఐ కలిసి బరిలో నిలిచినా.. విజయావకాశాలు వైఎస్ఆర్సీపీకే అధికమనే చర్చ జరుగుతోంది. నందికొట్కూరులో 22 వార్డులు ఉండగా వైఎస్ఆర్సీపీ, టీడీపీ అన్ని స్థానాలకు పోటీ చేయగా.. రాయలసీమ పరిరక్షణ సమితి తరఫున 8 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇకపోతే ఆళ్లగడ్డ నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బరిలో నుంచి తప్పుకుంది. ఇక్కడ 20 వార్డులు ఉండగా వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తోంది. ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ, టీడీపీ మధ్య పోటీ నెలకొంది. గూడూరులోనూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు టీడీపీ పోటీనివ్వలేకపోయినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా అన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుందనే చర్చ కొనసాగుతోంది. రెండు గంటల్లో ఫలితం జిల్లాలోని మున్సిపల్, నగర పంచాయతీల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కర్నూలు శివారులో నందికొట్కూరు రహదారిలోని వెంకాయపల్లె సమీపంలో ఉన్న సెయింట్ జోసఫ్ బాలికల జూనియర్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఒక్కో మున్సిపాలిటీకి వార్డులను బట్టి కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను.. ఆ తర్వాత ఈవీఎంలను పోలింగ్ కేంద్రాల వారీగా లెక్కించనున్నారు. ఓట్ల సంఖ్యను బట్టి రౌండ్లను ఖరారు చేయనున్నారు. ఆయా వార్డుల్లోని మొత్తం ఓట్లు, అభ్యర్థులకు పోలైన ఓట్లతో సరిపోల్చుకుని ఫలితం వెల్లడించనున్నారు. ఈ ప్రక్రియంతా కేవలం రెండు గంటల్లోనే పూర్తవుతుందని అధికారులు తెలిపారు. -
మునిసిపల్ ఓట్ల లెక్కింపునకు భద్రతా ఏర్పాట్లు
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ నెల 12న ఏలూరు కార్పొరేషన్, ఏడు మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా జిల్లాలోని మునిసిపల్ కమీషనర్లతో ఆయన కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రతి కౌంటింగ్ సెంటరులో లెక్కింపు నిర్వహణకు అన్ని ఏర్పాట్లను ఆయా మునిసిపల్ కమిషనర్లు ముందుగానే పూర్తి చేసుకోవాలన్నారు. అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది ఉదయం 5 గంటలకే కౌంటింగ్ సెంటర్‌కు హాజరు కావాలన్నారు. వారి సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ చేపట్టి ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని చెప్పారు. కౌంటింగ్ సిబ్బంది ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ సెంటర్లోకి సెల్ఫోన్లు అనుమతించేది లేదన్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేసి వాటిలో కంప్యూటర్, ఇంటర్నెట్, టెలిఫోన్ తదితర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు వివరించేందుకు మీడియా సెంటరును ఏర్పాటు చేసి, అక్కడ ఓ ఉద్యోగిని నియమించాలని సూచించారు. కౌంటింగ్ సరళిని వీడియో తీయించాలని, సంబంధిత సీడీలు, డీవీడీలను భద్రపరచాలన్నారు. ఆరోజు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఈపీడీసీఎల్ ఎస్ఈని కలెక్టర్ ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు స్థానిక ఎన్నికల పరిశీలకులు కె.ప్రవీణ్‌కుమార్, విజయమోహన్ వస్తారని తెలిపారు. కౌంటింగ్ సెంటర్లు ఇవి.. ఏలూరు- సీఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ కొవ్వూరు- బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల తాడేపల్లిగూడెం- డీఆర్ గోయెంకా మహిళా డిగ్రీ కళాశాల నిడదవోలు- ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భీమవరం- మునిసిపల్ కార్యాలయంలో పాత కౌన్సిల్ హాల్ తణుకు- ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల నరసాపురం-పాలకొల్లు రోడ్డులోని స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కళాశాల పాలకొల్లు- సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాల జంగారెడ్డిగూడెం- ఏఎంసీ కార్యాలయం గోడౌన్ అదనపు పరిశీలకులుగా 9 మంది నియామకం కౌంటింగ్ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు 9 మంది అధికారులను అదనపు పరిశీలకులుగా కలెక్టర్ నియమించారు. ఏలూరుకు జెడ్పీ సీఈవో వెంకటరెడ్డి, కొవ్వూరుకు ఆర్డీవో గోవిందరావు, తాడేపల్లిగూడెంకు కేఆర్సీ ఎస్డీసీ కోగంటి ఉమారాణి, నిడదవోలుకు టీఎల్ఐఎస్ ఎస్డీసీ ఎం.సమజ, భీమవరానికి డ్వామా అదనపు పీడీ టి.సవరమ్మ, తణకుకు డీపీవో నాగరాజువర్మ, నరసాపురానికి ఆర్డీవో జె.ఉదయభాస్కర్, పాలకొల్లుకు మైక్రోఇరిగే షన్ పీడీ ఆర్వీ సూర్యనారాయణను నియమించారు. -
ఓట్ల లెక్కింపునకు భారీ బందోబస్తు
తాండూరు, న్యూస్‌లైన్: మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్ కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, అర్బన్ సీఐ వెంకట్రామయ్యలకు పలు సూచనలు చేశారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజకుమారి విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌తోపాటు జెడ్పీ మాజీ చైర్పర్సన్ సునీతారెడ్డిలపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు. వికారాబాద్ పరిధిలోని గుడిపల్లిలో గత నెల 28న ఎన్నికల ప్రచార సమయం అయిపోయిన తర్వాత రాత్రి సుమారు 8గంటల సమయంలో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ సమావేశం ఏర్పాటుచేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్నారు. తాండూరు మండలంలో ఓ రోడ్డు మీద సమావేశం ఏర్పాటు చేసినందుకు మాజీ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు. చేవెళ్ల లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి స్నేహితులు ఇద్దరు కౌకుంట్లలోని ఒక పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారని, వారిపైనా నమోదు చేశామని ఎస్పీ వివరించారు. మొత్తం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద జిల్లాలో 75 కేసులు నమోదు చేశామని, 200మందిని అరెస్టు చేశామన్నారు. దోమ, తాండూరులో ఎన్నికల సందర్భంగా గొడవ పడిన కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టామన్నారు. పోలీసు తనిఖీల్లో భాగంగా సుమారు రూ.70లక్షల నగదును, రూ. ఆరు లక్షల విలువచేసే మద్యంతోపాటు 11వేల లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్లలో మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఒక రోజుముందే ఆయా కౌంటింగ్ కేంద్రాలను ఆధీనంలోకి తీసుకొని, బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద వంద మీటర్ల అవతల వాహనాలను పార్కింగ్ చేసుకోవాలన్నారు.తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్లలో ఓట్ల లెక్కింపు కోసం సుమారు వెయ్యి మంది జిల్లా పోలీసు బలగాలతో గట్టి బందోబస్తు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం స్ట్రాంగ్ రూంల వద్ద బందోబస్తు చేస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)తోపాటు నాలుగు ప్లాటూన్ల ఏపీఎస్పీ బలగాలను అదనంగా బందోబస్తుకు ఉపయోగించనున్నట్టు ఎస్పీ వివరించారు. ఈనెల 12,13 తేదీల్లో మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఆయా పార్టీల నాయకులు, మద్దతుదారులు, అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటుపై నిషేధం విధించామన్నారు. పోలీసుల అనుమతితో ఈనెల 14న విజయోత్సవాలు జరుపుకోవచ్చని చెప్పారు. సమావేశంలో డీఎస్పీ షేక్‌ఇస్మాయిల్, అర్బన్ సీఐ వెంట్రామయ్య, ఎస్ఐ నాగార్జున్‌లు పాల్గొన్నారు. -
ముగిసిన తొలి ఘట్టం
నామినేషన్ల పర్వం పూర్తి మొత్తం అభ్యర్థులు 333 మూడు లోక్‌సభ స్థానాలకు 52 15 అసెంబ్లీ సెగ్మెంట్లకు 281 స్వతంత్రులుగా ఆసక్తి కనబరిచిన యువకులు 21న పరిశీలన 23న ఉపసంహరణ విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం శనివారంతో ముగిసింది. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభించిన ఈ పర్వంలో మొత్తం 333 మంది నామినేషన్లు సమర్పించారు. జిల్లాలోని 3 లోక్‌సభ స్థానాలకు 52 మం ది, 15 అసెంబ్లీ సెగ్మెంట్లకు 281 మం ది నామినేషన్లు దాఖలు చేశారు. 21న పరిశీలన, 23న ఉపసంహరణ ఉం టుంది. అనంతరం బరిలో ఉన్నది ఎవరన్నది నిర్ధారణ అవుతుంది. మే 7న పోలింగ్,16న ఓట్ల లెక్కింపు ఉం టుంది. కాగా అప్పుడే రెబెల్స్‌ను బుజ్జగించడంతోపాటు ప్రచారానికి ఆ యా పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుం టున్నారు. ఇంకా పది హేను రోజులే గడువున్నందున వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ప్రత్యేక వాహనాల్లో వెళ్లి ఓటర్లను నేరుగా కలిసేందుకు సన్నద్ధమవుతున్నారు. పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే ఆయా అసెం బ్లీ సెగ్మెంట్ల పరిధిలో ప్రచారం పూర్తి చేశారు. రెండో విడతగా ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ మందిని కలిసే ందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్వీకరించని అనితా నామినేషన్ విశాఖ లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు అనితా సకురు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌కు వచ్చారు. అప్పటికే సమయం దగ్గరపడడం, అలాగే బి-ఫారం లేకపోవడంతో ఆమె నామినేషన్‌ను అధికారులు స్వీకరించలేదు. ఆమె ఇప్పటికే భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున నామినేషన్ వేశారు. ఆ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గంటా శ్రీనివాసరావు బి-ఫారం సమర్పించారు. ఈమేరకు అనితా సకురు స్వతంత్ర అభ్యర్థిగా మిగిలిపోయారు. ఇదిలా ఉంటే ఆమెను పోటీ నుంచి తప్పించేందుకు అప్పుడే పార్టీ పెద్దలు చర్యలు చేపట్టారు. ఆమెను బుజ్జగించినట్లు సమాచారం. లోక్‌సభకు భారీగా స్వతంత్రులు జిల్లాలో మూడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో విశాఖ ఎంపీ స్థానానికి స్వతంత్రులు పోటీ పడి నామినేషన్లు వేశారు. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా16 మంది స్వతంత్రులు పోటీకి ఉత్సాహం కనబరిచా రు. యువకులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీగా నామినేషన్ కు అభ్యర్థులు రూ.25 వేలు దరావతు చెల్లించాల్సి ఉంది. అంత మొత్తం కట్టి మరీ భారీగా యువకులు, మహిళలు స్వతంత్రులుగా పోటీకి సన్నద్ధం కావడం సర్వత్రా ఆశ్చర్యం గొలుపుతోంది. ఈ నెల 23న ఉపసంహరణ అనంతరం ఎంతమంది ఉంటారన్నది నిర్ధారణ అవుతుంది. -
గోపాలపురంలో వైఎస్సాఆర్ జనభేరీలో విజయమ్మ ప్రసంగం
-
వైఎస్సార్సీపీ మేనిఫెస్టోప్రగతే లక్ష్యం
అంతర్జాతీయ విమానాశ్రయంగా గన్నవరం 8 లైన్లుగా జాతీయరహదారి నిర్మాణం గ్యాస్ వినియోగదారులకు ఊరట స్థిరీకరణ నిధితో రైతుకు మేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రగతి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కనిపించింది. అభివృద్ధిలో జిల్లాకు సముచితమైన చోటు దక్కింది. జిల్లా అభివృద్ధికి వరాలు ప్రకటించడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసిన మేనిఫెస్టోలో జిల్లాకు చోటు లభించింది. ఇతర పార్టీల మాదిరిగా ఆచరణకు సాధ్యంకాని హామీలను గుప్పించకుండా ప్రజాసమస్యల పరిష్కారం, నూతన రాజధాని నిర్మాణంతో పాటు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని ఆచరణాత్మకమైన హామీలను మేనిఫెస్టోలో చేర్చింది. అన్నదాతలు మొదలుకొని విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఇలా అన్ని వర్గాలకు మేలు చేసేలా తయారుచేసిన మేనిఫెస్టోని ఆదివారం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. ముఖ్యంగా జిల్లాకు వరాలు ప్రకటించారు. అంతర్జాతీయ విమానాశ్రయంగా ‘గన్నవరం’... ప్రధానంగా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రసుత్తం విమానాశ్రయం 500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిని విస్తరించాలని మరో 400 ఎకరాల భూసేకరణకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తొలి ప్రాధాన్య అంశంగా దీనిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దనున్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో తొలుత ఒక వృద్ధాశ్రమం, అనాథాశ్రమం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు, ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు, మండలంలో 102 సేవలు ప్రారంభం ఇలా అనేక ఆచరణాత్మక హామీలను పార్టీ ప్రకటించింది. మేనిఫెస్టో ప్రకటనపై జిల్లాలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అన్ని అంశాలపై, అన్ని వర్గాల ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని దీనిని రూపొందించారని, జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజల కష్టాలు కచ్చితంగా తొలగుతాయని మేనిఫెస్టో ద్వారా రుజువైందనే అభిప్రాయం జిల్లాలోని అన్నివర్గాల ప్రజల్లో వ్యక్తమవుతోంది. అన్నదాతకు మేలు... జిల్లాలో 7.35 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు ఉన్నాయి. ప్రధానంగా 6.35 లక్షల ఎకరాల్లో వరి, 1.30 లక్షల ఎకరాల్లో పత్తి, 45 వేల ఎకరాల్లో చెరుకుతో పాటు ఉద్యానవన పంటలు సుమారు 25 వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. ముఖ్యంగా వరి రైతుకు పంట సాగుకు క్వింటాలుకు సగటున రూ.1766 వరకు ఖర్చు అవుతుంటే ప్రభుత్వం రూ.1,355 మద్దతు ధర ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా వారు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇది రైతులకు పూర్తిగా మేలు చేస్తుంది. అమ్మ ఒడి పథకం ద్వారా వేలాది మంది విద్యార్థులు పూర్తిస్థాయిలో చదువుకునే అవకాశం కల్పించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2.50 లక్షల ఎకరాలకు విద్యుత్ మోటార్ల ద్వారానే నీటి సరఫరా జరగాల్సి ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొమ్మిది గంటల పాటు నిరంతరంగా వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా చేస్తారు. గ్యాస్ భారం నుంచి ఊరట... ముఖ్యంగా భారంగా మారిన గ్యాస్ ధరల నుంచి ప్రజలకు కొంత ఊరట కలగనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెరిగిన గ్యాస్ ధరలో రూ.100ను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. తద్వారా జిల్లాలో 11.61 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుంది. పింఛనుదార్లకు నెలకు రూ.500 అదనంగా అందనున్నాయి. -
ఓటెత్తారు
సాక్షి, కరీంనగర్ : చెదురుమదురు సంఘటనలు మినహా.. జిల్లాలో రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్, సిరిసిల్ల రెవెన్యూ డివిజన్లలో శుక్రవారం జరిగిన పోలింగ్‌కు ఓటర్లు పోటెత్తారు. మొత్తం 10,16,928 మందికి గాను 8,26,578 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండు డివిజన్లలో కలిపి 81.19 శాతం పోలింగ్ నమోదైంది. కరీంనగర్ డివిజన్లో 82.33 శాతం, సిరిసిల్ల డివిజన్లో 78.58 శాతం ఓటింగ్ నమోదైంది. మండలాల్లో అత్యధికంగా హుజూరాబాద్‌లో 86.90 శాతం, తక్కువగా గంభీరావుపేటలో 71.97 శాతం పోలింగ్ జరిగింది. తొలి విడత ఎన్నికల్లో మాదిరిగానే రెండో విడతలోనూ మహిళా చైతన్యం వెల్లివిరిసింది. ఉద యం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వృద్ధులు, వికలాంగులు మండుటెండను సైతం లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్, పెద్దూరులో పోలింగ్ ముగింపు సమయంలో ఒకేసారి మూడొందల మంది ఓటేసేందుకు రావడంతో అందరికీ అవకాశం కల్పించారు. దీంతో రాత్రి 6.30 గంటల దాకా పోలింగ్ జరిగింది. కరీంనగర్ మండలం బాహుపేటలో సాయంత్రం 5.30 వరకు ఓటేశారు. పోలింగ్ అనంతరం జిల్లా యంత్రాం గం బ్యాలెట్ బాక్సులను డివిజన్ కేంద్రాలకు తరలించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు, ఫలితాలు వచ్చే నెలలో ప్రకటించనున్నారు. అప్పటిదాకా ఉత్కంఠ తప్పదు. ఓట్ల గల్లంతు! కరీంనగర్ డివిజన్లో 18 జె డ్పీటీసీ, 282 ఎంపీటీసీ స్థానా లు, సిరిసిల్లలో 09 జెడ్పీటీసీ, 126 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. చాలా మండలాల్లో ఓటరు జాబితా నుంచి తమ పేర్లు గల్లంతవడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనకు దిగారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణాపూర్కాలనీలో బుడిగజంగాల కులస్తులవి 400 మందికి పైగా ఓట్లు గల్లంతు కావడంతో రాజీవ్ రహదారిపై బైఠాయించారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అక్కడికి వచ్చిన తహశీల్దార్ రజనిని బాధితులు నిలదీశారు. స్థానికంగా ఉండకపోవడంతో తొలగించామని, మళ్లీ చేర్చామని ఆమె సుముదాయించారు. కొత్త జాబితా రెండు రోజు ల్లో ప్రకటిస్తామని, 30న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పడంతో శాంతించారు. ఒక్క ముస్తాబాద్ మండలంలోనే 2వేలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయి. తెర్లుమద్దిలో 250, పోత్గల్‌లో 200, ముస్తాబాద్‌లో 300, చిప్పలపల్లిలో 50, బందనకల్‌లో 360 ఓట్లు గల్లంతయ్యాయి. చీకోడులో 270 మంది ఓట్ల జాడే లేదు. ఎల్లారెడ్డిపేటలో 87, వీణవంక మండలంలో 60 ఓట్లు, కరీంనగర్ మండలంలో సుమారు 200కు పైగా ఓట్లు గల్లంతు కావడం తో బాధితులు ఆందోళనకు దిగారు. పోల్ చీటీలు సరిగా అందక మొదటి విడత ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురైనా... రెండో విడతకు కూడా పరిస్థితి మారలేదు. బెజ్జంకి మండలం గన్నేరువరం పోలింగ్ కేంద్రంలో ఓటర్ల రద్దీ ఎక్కువవడంతో.. వారిని ‘క్యూ’లో నిలబట్టేందుకు పోలీసులు ఓటర్లను వెనకకు తోయగా క్యూలో నిల్చున ఎల్లవ్వ అనే వృద్ధురాలు కిందపడడంతో కాలు విరిగింది. ఓటేసిన ప్రముఖులు మానకొండూర్‌లో ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమలాపూర్‌లో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, హుజూరాబాద్ మండలం జూపాకాలో అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డి, సింగాపూర్‌లో మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఓటు వేశారు. కోనరావుపేట మండలం నాగారంలో కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు, చందుర్తి మండలం రుద్రంగిలో నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
తుది పోరు
సాక్షి, కడప : స్థానిక తుది పోరుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం జరిగే పోలింగ్‌కుగాను సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది, పోలీసులు గురువారం సాయంత్రానికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. శాంతిభద్రతల పరంగా ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలింగ్ జరిగే ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఎన్నికలు జరిగే జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు నియోజకవర్గాలు సమస్యాత్మకం, కీలకం కావడంతో పోలీసులు విసృ్తత బందోబస్తును ఏర్పాటు చేశారు. బరిలో ఉన్న అభ్యర్థులు ఎలాగైనా గెలవాలనే కృతనిశ్చయంతో మంచినీళ్లప్రాయంగా డబ్బులను ఖర్చు చేశారు. మద్యంను విచ్చలవిడిగా పంపిణీ చేశారు. కమలాపురం నియోజకవర్గంలోని చిన్నపుత్త, దేవరాజుపల్లె, మాచిరెడ్డిపల్లె, కోగటం వంటి గామాల్లో ఓ పార్టీ దౌర్జన్యం చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేట్ సైన్యాలను మోహరిస్తున్నట్లు సమాచారం. జమ్మలమడుగు ప్రాంతంలోని కొన్ని ఎంపీటీసీ స్థానాల పరిధిలో వైఎస్ఆర్సీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తుండగా, మరికొన్నిచోట్ల ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. పులివెందుల నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్సీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశముంది. ప్రొద్దుటూరు పరిధిలో కొన్ని ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్నాయి. మొత్తం రెండో విడతలో 227 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఇందులో 18 స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 209 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 16 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రలోభాలు గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఎలాగోలా ప్రసన్నం చేసుకునేందుకు బరిలో ఉన్న అభ్యర్థులు తుది ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓటర్లతో బేరసారాలు సాగిస్తున్నారు. తాయిలాలను ఎరగా చూపుతున్నారు. కొన్నిచోట్ల ఓటర్లను గుంపగుత్తగా కొనేస్తున్నారు. దీనికితోడు రకరకాల హామీలు ఇచ్చి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. గురువారం రాత్రి భారీగా డబ్బు, మద్యం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజు కూడా ఓటర్లను ఎలాగోలా మభ్యపెట్టేందుకు తమ ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు. -
నేడు పరిషత్ తుది పోరు
సాక్షి, నెల్లూరు జిల్లాలో పరిషత్ ఎన్నికల రెండో విడత పోరు శుక్రవారం జరగనుంది. మొత్తం 25 జెడ్పీటీసీ స్థానాలకు, 311 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో 7,83,654 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 3,87,068 మంది, స్త్రీలు 3,96,583 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఈ నెల 6న తొలివిడత ఎన్నికల్లో భాగంగా 21 జెడ్పీటీసీ, 258 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం జరగనున్న మలివిడత ఎన్నికల్లో మొత్తం 25 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 100 మంది, 311 ఎంపీటీసీ స్థానాలకు 883 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 1,062 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికలు జరగనున్న 25 మండలాల్లో 112 అతి సమస్యాత్మక గ్రామాలు, 207 సమస్యాత్మక గ్రామాలుగా అధికారులు గుర్తించారు. ఈ గ్రామాలపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఇప్పటికే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వాటిని ఏ విధంగా చక్కబెట్టాలనే విషయమై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా ప్రిసైడింగ్ అధికారులకు జిల్లా పాలనాధికారి ఎన్.శ్రీకాంత్ పదేపదే జాగ్రత్తలు చెప్పడంతో పాటు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో వెబ్‌కెమెరాలు, వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేసి అన్ని అంశాలను చిత్రీకరించే విధంగా చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికలకు సంబంధించి 5,848 మంది ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు విధులను నిర్వర్తించనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఇప్పటికే అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రితో పాటు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం జరగనున్న ఎన్నికల్లో ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. కౌంటిగ్ కేంద్రాలు ఇవే : 25 జెడ్పీటీసీ స్థా నాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి నెల్లూరులోని డీకే మహిళా కళాశాల, గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల, నాయుడుపేటలోని నారాయణ జూని యర్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు చర్యలు చేపట్టారు. చేజర్ల, కలువాయి, ఇందుకూరుపేట, నెల్లూరు, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, పొదలకూరు, రాపూరు మండలాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను నెల్లూరులోని డీకే ప్రభుత్వ మహిళా కళాశాలకు చేర్చడంతో పాటు అక్కడే నిర్ణయించిన తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మనుబోలు, గూడూరు, చిల్లకూరు, చిట్టమూరు, కోట, వాకాడు, సైదాపురం, డక్కిలి, వెంకటగిరి, బాలాయపల్లి, మండలాలకు సంబంధించి గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ మండలాలకు సంబంధించి నాయుడుపేటలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
ఎటు వెళ్దాం?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఆత్మకూరు నుంచే మళ్లీ బరిలోకి దిగాలా? లేక నెల్లూరు రూరల్‌కు వెళ్లాలా? ఈ రెండింటిలో ఏదైతే మనకు సేఫ్? మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మెదడును ఈ ప్రశ్నలు తొలచివేస్తున్నట్లు సమాచారం. అటో, ఇటో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నం కావడంతో ఆయన శుక్రవారం తన సన్నిహితులైన ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. రామనారాయణరెడ్డి ఆత్మకూరు నుంచి గత ఎన్నికల్లో గెలుపొంది కీలకమైన ఆర్థిక మంత్రి పదవి సంపాదించారు. అధికార బలంతో వందల కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి పేరుతో నియోజకవర్గంలో కుమ్మరింపజేశారు. ఇందులో వాస్తవంగా జరిగిన అభివృద్ధి ఎంత? అనే విషయం పక్కన పెడితే ఆయన మద్దతుదారులు, స్థానిక కాంగ్రెస్ నేతలు మాత్రం ఆర్థికంగా బాగానే అభివృద్ధి చెందారనేది నిర్వివాదాంశం. ఈ ధీమాతోనే మళ్లీ ఆత్మకూరులో తాను గట్టెక్కగలననే ధీమాతో ఆనం నిశ్చయంగా గడుపుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చిన ప్రభావం అన్ని ప్రాంతాల్లో మాదిరిగానే ఆనం ఇలాకాలో కూడా పడింది. కాంగ్రెస్ పేరు చెబితేనే జనం మాట అటుంచి నిన్నమొన్నటి దాకా ఆ పార్టీతో మమేకమైన నాయకులే ఆమడ దూరం పారిపోయే పరిస్థితి ఏర్పడింది. తాను చేసిన అభివృద్ధి మంత్రం వర్కవుట్ అవుతుందేమోనని మున్సిపల్ ఎన్నికల్లో ట్రయల్ రన్ నిర్వహించిన ఆనంకు ఆశించిన ఫలితం దక్కే సూచనలు కనిపించలేదు. ఆ ఎన్నికల్లో అన్ని వార్డులకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఇదే సీన్ పునరావృతం అయింది. పిలిచి టికెట్ ఇస్తానని చెప్పినా మా కొద్దు బాబోయ్ అంటూ పార్టీ నేతలు పరుగులెత్తడం ప్రారంభించారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రామనారాయణరెడ్డి చేతులెత్తేశారు. కనీసం హస్తం గుర్తుకు ఓటేయండి అని గ్రామాల్లో ప్రచారం చేయడానికి కూడా ఆయన సాహసించలేక పోయారు. ఇలాంటి అనానుకూల వాతావరణంలో మళ్లీ ఆత్మకూరు నుంచే పోటీ చేస్తే సీన్ సితార్ అవుతుందని ఆనం ఆందోళన చెందుతున్నారు. పోటీ చేస్తే ఒక ఇబ్బంది, చేయక పోతే భయపడి పోయాడనే పేరు వస్తుంది. ఏం చేయాలబ్బా అని కిందా మీదా పడుతూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్న తరుణంలో టీడీపీ- బీజేపీ పొత్తు రాజకీ యం ఆయన నెత్తిన పాలుపోసినంత పనిచేసిందని రామనారాయణరెడ్డి సన్నిహితులు అంటున్నారు. ఈ స్థానం బీజేపీకి కేటాయించడం, ఆరు నూరైనా తాము ఇక్కడి నుంచే బరిలోకి దిగుతామని ఆ పార్టీ నాయకులు ప్రకటించడం ఆనం ఆశలకు మరింత బలమిచ్చినట్లు సమాచారం. నెల్లూరు రూరల్ తమ సొంత నియోజకవర్గం కావడం, ఇక్కడ ప్రతి గ్రామంలో ఎవరు ఏమిటో తమకు అవగాహన ఉండటంతో ఈసారి ఎన్నికల్లో రూరల్ సీటు ఎంచుకోవడమే శ్రేయస్కరంగా ఆనం అంచనా వేశారని తెలిసింది. తాను ఇక్కడి నుంచి పోటీకి దిగితే తెలుగుదేశం శ్రేణుల మద్దతు సంపాదించి, తమ సొంత బలం జోడిస్తే కనీసం పోటీలో అయినా నిలవచ్చని ఆయన లెక్కలు కట్టినట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. తన మనసులోని మాటను, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను తన సన్నిహితులైన ముఖ్యుల ముందుంచి వారి మద్దుతు సంపాదించాలని రామనారాయణరెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆత్మకూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలను నెల్లూరులోని తన నివాసంలో జరిగే సమావేశానికి ఆహ్వానించారు. వారి నుంచి కూడా సరేననిపించుకున్న తర్వాతే సీటు మార్పిడి ప్రకటన చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సిటీ నుంచి సుబ్బారెడ్డి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కుమారుడు ఏసీ సుబ్బారెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయించడానికి ఆనం కుటుంబీకులు నిర్ణయించారు. వివేకానందరెడ్డి ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచీ పోటీ చేయరాదని భావిస్తున్నట్లు సమాచారం. నేను రాను... టీడీపీలో చేరాలని ఆహ్వానం అం దుకున్న డీసీసీ బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి ఇందుకు నో చెప్పారు. ఆత్మకూరు టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చిన టీడీపీ నేతలు రెండు రోజుల్లో ఏ నిర్ణయం చెప్పాలని మెట్టుకూరును కోరారు. ఆనం రామనారాయణరెడ్డితో చర్చించిన అనంతరం ధనుం జయరెడ్డి మీతో కలవలేనని టీడీపీ నేతలకు స్పష్టం చేశారని తెలిసింది. -
జగన్ జనభేరి 13కి వాయిదా
సాక్షి ప్రతినిధి, కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13న జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు. 12న నిర్వహించ తలపెట్టిన జనభేరి.. 13వ తేదీకి వాయిదా పడిందన్నారు. 13న ఉదయం 10 గంటలకు కోడుమూరుకు చేరుకోనున్న జననేత రోడ్‌షో నిర్వహించి, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. అక్కడి నుంచి నేరుగా ఆలూరుకు వెళ్తారని.. మార్గమధ్యలో స్థానికులను కలుసుకుంటారన్నారు. సాయంత్రం 3.30 గంటలకు ఆలూరులో రోడ్‌షో నిర్వహించి బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారన్నారు. అనంతరం పత్తికొండకు చేరుకుని రోడ్‌షో చేపడతారని.. ఆ తర్వాత జనభేరిలో ప్రసంగిస్తారని వెల్లడించారు. -
ఓటుకు నోటు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అడక్కుండానే ఇంటికి ఓ బాయిలర్ కోడి, మద్యం సీసా పంపిణీ చేశారు.. అలాగే చీర, జాకెట్ కూడా ఇచ్చారు. ఓటుకు రూ.300 నుంచి రూ.500 ప్రకారం అందించారు.. ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకుల ప్రలోభాల పర్వమిది. తామేమీ తక్కువ తినలేదన్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం.. ఓటర్లకు కర్ణాటక మద్యం సీసాలతో ఎర వేస్తున్నారు. జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు శుక్రవారం ఆదోని రెవెన్యూ డివిజన్లో జరుగనున్నాయి. ఓటమి భయంతో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. గురువారం రాత్రి విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారు. జిల్లాలోని ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల పరిధిలో ప్రలోభాలు తారాస్థాయికి చేరాయి. మొదటి విడత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నామని తెలుసుకున్న తమ్ముళ్లు రెండో విడతలోనైనా పరువు నిలుపుకోవాలని అడ్డదారులు తొక్కారు. అదే విధంగా ఆలూరు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ నాయకులు కూడా పరువు కాపాడుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. అందులో భాగంగానే ఈ రెండు పార్టీలు గురువారం అర్ధరాత్రి దాటాక కూడా నగదు, చీరలు, కుంకుమ బరిణెలు, మద్యం బాటిళ్లను పంపిణీ చేశారు. ఓటుకు రూ.300 నుంచి రూ. 1,500, రూ.2 వేలు వరకు పంపిణీ చేశారు. కొన్ని చోట్ల మహిళలకు చీరలు, బొట్టు బిళ్లలు, గాజులు పంపిణీ చేయటం కనిపించింది. పురుష ఓటర్లకు డబ్బులతో పాటు మద్యం బాటిళ్లను ఇచ్చారు. తాగిన వారికి తాగినంత పంపిణీ చేసి ఓటేయమని ప్రాధేయపడ్డారు. కొన్నిచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను బెదిరించారు. ఓటేయకపోతే నీ అంతు చూస్తామంటూ హెచ్చరికలు చేశారు. తమ అభ్యర్థులు గెలిస్తే ‘మీకు ఏం కావాలన్నా చేస్తాం.. రుణాలన్నీ మాఫీ చేస్తాం... ఇళ్లు కట్టిస్తాం.. తిరిగి రుణాలు ఇస్తాం’ అంటూ ఉత్తుత్తి హామీలు గుప్పిస్తూ ఓటర్లను ప్రాధేయపడ్డారు. ఏరులై పారిన కర్ణాటక మద్యం. ఎన్నికలకు ముందు మద్యం దుకాణాలను మూసివేయటంతో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు కొందరు కర్ణాటక నుంచి దిగుమతి చేసుకున్నారు. మరి కొందరు నాటుసారా తయారు చేసి విచ్చలవిడిగా పంపిణీ చేశారు. ఇలా ఓటర్లను రకరకాల ప్రలోభాలకు గురిచేస్తూ ఓట్లను రాబట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొన్ని గ్రామాల్లో టీడీపీ నేతలు మద్యం తాగించి ప్రత్యర్థుల నివాసాల ముందు దుర్భాషలాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటంతో ఆలూరు నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల ప్రజలు రాత్రంతా జాగారం చేశారు. -
మలి ‘పోరు’నేడే
ఆదోని రెవెన్యూ డివిజన్లో పటిష్ట బందోబస్తు 17 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ 123 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు ఇంజనీరింగ్ విద్యార్థులతో వెబ్ కాస్టింగ్ రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు సర్వం సిద్ధం కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్: మలి విడత ప్రాదేశిక పోరుకు అంతా సిద్ధమైంది. ఆదోని రెవెన్యూ డివిజన్లో శుక్రవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలతో సహా అవసరమైన ఎన్నికల సామగ్రి తీసుకొని ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్లలో మొదటి విడత ప్రాదేశిక ఎన్నికలు ఈ నెల 6వ తేదీన పూర్తయిన విషయం విదితమే. ఆదోని డివిజన్లోని 17 జెడ్పీటీసీ, 289 ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల నిర్వహణకు 859 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 123 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటిలో పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులతో వెబ్‌కాస్టింగ్‌ను నిర్వహిస్తున్నారు. అలాగే 191 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. పోలింగ్ విధుల్లో 4,295 మంది పీఓ, ఏపీఓ, క్లరికల్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఆదోని డివిజన్‌ను 50 జోన్లగా విభజించారు. 98 రూట్లను ఏర్పాటు చేశారు. ఈ డివిజన్లో పురుషుల కంటే దాదాపు మహిళా ఓటర్లు 2,000 మంది ఎక్కువగా ఉన్నారు. పలు చోట్ల అభ్యర్థుల గెలుపోటముల్లో వీరు కీలక పాత్ర పోషించనున్నారు. గట్టి బందోబస్తు.. ఆదోని, న్యూస్‌లైన్, రెండో విడత ప్రాదేశిక సమరానికి ఆరుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు, రెండు వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. వీరితోపాటు 17స్ట్రైకింగ్ మొబైల్ ఫోర్స్, 98 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు పనిచేయనున్నాయి. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, ఎన్సీసీ కేడెట్స్ సేవలను కూడా వినియోగించుకుంటున్నారు. ఎన్నికల్లో అల్లర్లు సృష్టించ వచ్చని భావిస్తున్న 2500 మందిపై ఇప్పటికే బైండోవర్ కేసులు బనాయించారు. మరో 53 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. పోలింగ్ రోజున ముఖ్యమైన నాయకులను హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పోలింగ్‌కు రెండు రోజుల ముందే ఆదోని రెవెన్యూ డివిజన్లో మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. -
అభ్యర్థులూ గుర్తుంచుకోండి..!
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : స్థానిక ఎన్నికలు శుక్రవారంతో ముగియనున్నాయి. శనివారం నుంచి సార్వత్రిక ఎన్నికల హడావుడి ప్రారంభం కానుంది. ఈ నెల 12న సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. 19వ తేదీ వరకు నామినేషన్లను సమర్పించవచ్చు. 13వ తేదీ ఆదివారం, 14 అంబేద్కర్ జయంతి, 18 గుడ్‌ఫ్రైడే సెలవు దినాలు కావడంతో కేవలం మిగిలిన అయిదు రోజులు మాత్రమే స్వీకరిస్తారు. నామినేషన్ ఫారాలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. వాటిని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు పంపిణీ చేశారు. జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ, 3 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కో సెగ్మెంట్‌కు ఒక్కో రిటర్నింగ్ అధికారిని నియమించారు. ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా రిటర్నింగ్ అధికారులకే నామినేషన్లు సమర్పించాలి. ఈ విషయంలో అభ్యర్థులు జాగ్రత్తలు వహించకపోతే తిరస్కరణకు గురై ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోవాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. నామినేషన పత్రాలు ఆయా ఆర్వో కార్యాలయాల్లో తీసుకుని, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దాఖలు చేయవచ్చు ఒక్కో అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్లు వరకు నామినేషన్లు వేసే అవకాశముంది. సక్రమంగా ఉన్న ఒక సెట్ నామినేషన్ వేసినా సరిపోతుంది. గుర్తింపు పొందిన పార్టీలు(ఉదా:బీజేపీ, కాంగ్రెస్,టీడీపీ,టీఆర్ఎస్) అభ్యర్థికి ఒక ప్రపోజర్ ఉంటే సరిపోతుంది. అభ్యర్థికి ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉండవచ్చు. ఒక చోట ఓటు ఉండి, మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసే వారు ఓటు హక్కు కలిగిన ప్రాంతంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్ఓ) నుంచి ధృవీకరణ పత్రం తీసుకొని నామినేషన్‌తో పాటు సమర్పించాలి. అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే ప్రపోజర్‌కు మాత్రం ఆ అభ్యర్థి పోటీ చేసే నియోజకవర్గంలో ఓటరై ఉండాలి. గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులకు(ఉదా. వైఎస్ఆర్సీపీ, జై సమైక్యాంధ్ర పార్టీలు) మాత్రం 10 మంది ప్రపోజర్లు సంతకం చేయాల్సి ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఇంతే సంఖ్యలో ప్రపోజర్లు ఉండాలి. అయితే రిటర్నింగ్ అధికారుల కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో అభ్యర్థుల అనుచరులను, వాహనాలను నిలిపివేస్తారు. మూడు వాహనాలను, అభ్యర్థితో పాటు మరో నలుగురు ప్రపోజర్లను కార్యాలయంలోకి అనుమతిస్తారు. ముందుగానే అభ్యర్థులు తమ 10 మంది ప్రపోజర్లతో నామినేషన్ పత్రాలను సంతకాలు చేయించాలి. ఒకవేళ ఎవరైనా ప్రపోజర్స్ సంతకం చేయకుండా వేలిముద్ర వేయాల్సి వస్తే అటువంటి వారు రిటర్నింగ్ అధికారి సమక్షంలోనే ముద్ర వేయాలి. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థి రూ.25 వేలు, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి రూ.10 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది. వారు కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. నామినేషన్ పత్రంతో పాటు ప్రధానమైన ఫారం-26 అఫిడవిట్‌ను అభ్యర్థులు సమర్పించాలి. ఇందులో ప్రతీ కాలమ్‌ను అభ్యర్థులు నింపాల్సి ఉంటుంది. అఫిడవిట్లో వ్యక్తిగత వివరాలు ఈ అఫిడవిట్‌ను రూ.10 స్టాంప్‌తో నోటరీ చేయించాలి. ఇందులో అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు, కుటుంబ, ఆస్తులు, కేసులు, ప్రభుత్వ సంస్థలకు బకాయిలు, ఇలా అన్ని వివరాలు పొందుపర్చాలి. ఒకవేళ అభ్యర్థికి సంబంధించిన కాలమ్‌లు ఉన్నప్పటికీ వాటిని ఖాళీగా లేదా గీత పెట్టి వదిలేయకూడదు. అలాంటి కాలమ్‌లో నిల్ అని గాని, నాట్ అప్లికబుల్ అని గాని, నాట్ నోన్ అని గాని రాయాలి. కొంత మంది అభ్యర్థులకు అసలు పేరుతో పాటు మరో పేరు కూడా ఉంటుంది. అటువంటి వారు ఈవీఎంలో పేరును ఏ విధంగా రాయోలో నామినేషన్‌ను సమర్పించిన సమయంలోనే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి. దాని ప్రకారమే ఈవీఎంలో పేరును, గుర్తును ముద్రిస్తారు. గుర్తింపు పొందిన జాతీయ పార్టీల అభ్యర్థుల పేర్లును బట్టి తెలుగు అక్షరమాల ప్రకారం ఈవీఎంలో ముందు స్థానాలను కేటాయిస్తారు. తరువాత రాష్ట్ర పార్టీ, అనంతరం గుర్తింపు లేని రిజిస్టర్ పార్టీల వారిని చేరుస్తారు. పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పార్టీల గుర్తింపు పత్రాలు లేకుండానే ముందు నామినేషన్లు సమర్పించినప్పటికీ 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలులోగా పార్టీల ‘ఎ’, ‘బి’ ఫారాలు సమర్పించాలి. అలాకాని పక్షంలో స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తారు. నామినేషన్ సమర్పణ తరువాత అందులో పేర్కొన్న అంశాలన్నీ సత్యమేనని రిటర్నింగ్ అధికారి అభ్యర్థితో ప్రతిజ్ఞ చేయిస్తారు. ఇందుకు సంబంధించిన సర్టిఫికేషన్‌ను కూడా అందజేస్తారు. ఎన్నికల ఏజెంట్‌ను నియమించుకొనే వారు అప్పుడే దరఖాస్తు ఇవ్వవచ్చు. అభ్యర్థివి 2, సంబంధిత ఏజెంట్‌వి 2 పాస్‌పోర్టు సైజు ఫొటోలు ఇవ్వాలి. అలాగే నామినేషన్ల సమర్పించిన తరువాత రిటర్నింగ్ అధికారి అభ్యర్థికి రెండు సర్క్యులర్లు అందజేస్తారు. వ్యయ పుస్తకాలు మూడు, రోజువారీ క్యాష్ బుక్, రోజువారి బ్యాంకు బుక్, రోజు వారి ఖర్చుల వివరాలకు సంబంధించి పుస్తకాలు అందజేస్తారు. -
‘ప్రాదేశిక’ ప్రచారం సమాప్తం
-
‘ప్రాదేశిక’ ప్రచారం సమాప్తం
374 ఎంపీటీసీ, 28 జెడ్పీటీసీలకు ఎన్నికలు రేపు ఎంపీటీసీ బరిలో 969 మంది అభ్యర్థులు జెడ్పీటీసీ స్థానాల్లో వంద మంది అభ్యర్థుల పోటీ ఒంగోలు, న్యూస్‌లైన్: మలిదశ ప్రాదేశిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం 5 గంటలతో తెరపడింది. ఆరు నియోజకవర్గాల్లోని 9,42,722 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 28 మండలాల్లో ఎన్నికలు: రెండో దశ ప్రాదేశిక ఎన్నికలు ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి, కనిగిరి, కందుకూరు, దర్శి నియోజకవర్గాల్లో 28 మండలాల్లోని 381 ఎంపీటీసీ స్థానాలకు జరగాల్సి ఉంది. వీటిలో దర్శి -2, క్రిస్టియన్‌పాలెం, తాళ్లూరు మండలం మల్కాపురం మండల ప్రాదేశికాలు వైఎస్సార్ సీపీకి ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా కనిగిరి మండలం చాకిరాలు, పీసీపల్లి మండలం గుదేవారిపాలెం స్థానాలు టీడీపీ ఖాతాకు జమయ్యాయి. ఉలవపాడు మండలం పెదపట్టపుపాలెం, లింగసముద్రం మండలం ముత్యాలపాడు, తాళ్లూరు మండలం మన్నేపల్లి ఎంపీటీసీ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులు ఏకగ్రీవమయ్యాయి. ఏడు ప్రాదేశికాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 374 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 969 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో బీఎస్పీ 5, బీజేపీ 8, సీపీఐ 11, సీపీఎం 16, కాంగ్రెస్ 35, వైఎస్సార్ సీపీ 363, టీడీపీ 363, లోక్‌సత్తా 2, స్వతంత్రులు 166 మంది పోటీలో ఉన్నారు. రెండో దశలో 28 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీఎస్పీ 5, బీజేపీ 2, సీపీఐ 3, సీపీఎం 2, కాంగ్రెస్ 7, వైఎస్సార్ సీపీ 27, టీడీపీ 28, లోక్‌సత్తా 1, స్వతంత్రులు 25 మంది వెరసి మొత్తం వంద మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ తరఫున వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, చైర్మన్ అభ్యర్థి నూకసాని బాలాజీ జిల్లా అంతటా ప్రచారం నిర్వహించి అభ్యర్థులను, కార్యకర్తలను ఉత్సాహపరుస్తుంటే టీడీపీ నేతలు మాత్రం టికెట్ల వేటలో రాజధానిలో మకాం వేశారు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర నిరాసక్తత కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణకు 6,855 మంది సిబ్బంది: రెండో దశ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 6,855 మంది సిబ్బందిని జిల్లా అధికారులు వినియోగిస్తున్నారు. 1270 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు. 1,395 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,395 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 4,065 మంది ఇతర పోలింగ్ అధికారులు ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది మొత్తం గురువారం ఉదయం 7 గంటలకల్లా సంబంధిత మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద రిపోర్టు చేయాలని ఇప్పటికే జిల్లా అదనపు ఎన్నికల అధికారి ఆదేశించారు. బ్యాలెట్ బాక్సుల పంపిణీ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఇతర మెటీరియల్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒంగోలు డివిజన్లో 7 మండలాల్లో, కందుకూరు డివిజన్లోని 21 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
రూ.కోటితో అభివృద్ధి చేశా
శెట్టిపల్లెకు గల్లా ఏం చేశారో చెప్పాలి : చెవిరెడ్డి తిరుపతి రూరల్, న్యూస్‌లైన్: శెట్టిపల్లె పంచాయతీలోని దాదాపు అన్ని వీధులకు తుడ చైర్మన్‌గా తాను కోటి రూపాయలతో సీసీ రోడ్లు, చెట్లపెంపకం, మురుగు కాలువల నిర్మాణం చేపట్టానని వైఎస్ఆర్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన జెడ్పీటీసీ అభ్యర్థి తలారి ఆనందమ్మ, శెట్టిపల్లె పంచాయతీలోని ఆరుగురు ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ప్రచా రం చేపట్టారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ కొత్తగా కాల నీ ఏర్పడినప్పుడు ఈ ప్రాంతం అడవి ని తలపించేలా ఉండేదన్నారు. అలాం టి ప్రాంతాన్ని మంత్రిగా ఉన్న గల్లా అరుణకుమారి పట్టించుకోలేదన్నారు. ఇక్కడి ఓట్లతో గెలిచి రెండుసార్లు మంత్రిగా ఉన్న గల్లా శెట్టిపల్లె పంచాయతీకి ఏం చేశారో చెప్పాలన్నారు. తాను చిన్నపదవి తుడ చైర్మన్ హోదా లో శెట్టిపల్లె పంచాయతీలో ఎవరూ చేయలేనంత అభివృద్ధి చేశానన్నారు. తాను గతంలో ఏనాడూ ఓట్లు అడగలేదన్నారు. తొలిసారిగా మీ ముందుకు వస్తున్నా ఆదరించండి, ఫ్యాను గుర్తుకు ఓటేసి గెలిపించండి అని కోరారు. తాము గెలిస్తే శెట్టిపల్లె పంచాయతీలో మిగిలిన అన్ని వీధులకు సీసీ రోడ్లు, మురుగు కాలువలు, పక్కా గృహాలు నిర్మిస్తామని చెప్పారు. శెట్టిపల్లె వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు మునిలక్ష్మి, కె.కళావతి, వసంతు, అశోక్‌కుమార్‌రెడ్డి, బీ.రేణుక, రాంకుమార్, ఉమామహేశ్వరితో పాటు పార్టీ నాయకులు రుద్రగోపి, పీఎం.లక్ష్మీనారాయణ, ఓబులరెడ్డి, నాగయ్య, ఎస్సీసెల్ కన్వీనర్ వెంకటరమణ, బాబు, భాస్కర్‌రెడ్డి, మహ్మద్ ఖాసీం, ప్రసాద్, మస్తాన్, వెంకటేష్, హనుమంత నాయక్, రాంబాబు, రమేష్, ఎంఎస్ఆర్, గురవరాజు, రామాంజులరెడ్డి, శివానందరెడ్డి, మహేష్‌రెడ్డి బ్రహ్మయ్య, నాగిరెడ్డి, సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
12న విజయమ్మ పర్యటన
ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండోదశ ఎన్నికల నేపథ్యంలో వాయిదా రెవెన్యూ, పోలీసు అధికారుల సూచన మేరకు నిర్ణయం సాక్షి, గుంటూరు: నేటి నుంచి జిల్లాలో జరగవలసిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, జిల్లాపార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో దశ ఎన్నికలు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 11న జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ, పోలీస్ అధికారుల సూచన మేరకు పర్యటన వాయిదా వేసినట్టు వారు తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి వైఎస్. విజయమ్మ పర్యటన జిల్లాలో ప్రకటించిన షెడ్యూల్ మేరకు యథావిధిగా జరుగుతుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు. -
పరిషత్ ప్రచారానికి తెర
సాక్షి, గుంటూరు: మలి విడత ‘స్థానిక’ ఎన్నికలకు ప్రచారం చివరిరోజు కావడంతో బుధవారం అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం పరిసమాప్తం కావడంతో ఆయా పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు, కార్యకర్తలు ఓటుకు నోటు, ప్రలోభాల పర్వంలో బిజీగా మారారు. పల్లెల్లో మద్యం, కాపు సారా ఏరులై పారిస్తున్నారు. ఓటర్లను మద్యం మత్తులో తేలుస్తున్నారు. రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఇంకా 24 గంటలే గడువుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా వైఎస్సార్సీపీ, టీడీపీ నడుమే పోటీ ఉంది. ఓటుకు నోటునే నమ్ముకున్న టీడీపీ నేతలు గ్రామాల్లో ఓటర్లకు రూ.వెయ్యి వంతున పంపిణీ చేస్తున్నారు. మరో రూ.500 పోలింగ్ రోజున అందిస్తామని చెబుతున్నారు. మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. తాడేపల్లి మండలం కొలనుకొండలో టీడీపీ అభ్యర్థులు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని పంపిణీని అడ్డుకున్నారు. ఆటోలను సీజ్ చేశారు. ఇప్పటికే ఓటమి సంకేతాలు అందుతున్న నేపథ్యంలో టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. చివరి నిమిషం వరకు ప్రలోభాల పర్వం కొనసాగించేందుకు శతవిధాలా యత్నిస్తోంది. మహిళా ఓటు బ్యాంకు వైఎస్సార్ సీపీ వైపు ఉందని అంచనా వేస్తున్న టీడీపీ నేతలు చీరెలు, ముక్కు పుడకలు, కుంకుమ భరిణలు వంటివి అందిస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇంటింటికీ ప్రచారం పూర్తి చేసిన వైఎస్సార్సీపీ ప్రజాదరణనే నమ్ముకున్న వైఎస్సార్సీపీ ఇంటింటి ప్రచారాన్ని పూర్తి చేసింది. గత 20 రోజులుగా పల్లెల్లో గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. మలి దశలో మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, తుళ్ళూరు మండలంలో గుంటూరు పార్లమెంటు సమన్వయకర్త బాలశౌరి మండు టెండలో ప్రచారాన్ని హోరెత్తించారు. వైఎస్ పథకాల్ని గుర్తు చేస్తూ మళ్లీ వైఎస్ సువర్ణయుగం జగన్‌తోనే సాధ్యమని వివరిస్తూ ప్రచారాన్ని ముమ్మరంగా చేశారు. ప్రత్తిపాడులో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను తన భుజస్తంధాలపై వేసుకుని పల్లెల్లో సుడిగాలి పర్యటన చేశారు. పొన్నూరు నియోజకవర్గంలో గెలుపును పార్టీ సమన్వయకర్త రావి వెంకటరమణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు. పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో నరసరావుపేట పార్లమెంటు అభ్యర్ధి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ సమన్వయకర్తలు అంబటి రాంబాబు, బొల్లా బ్రహ్మనాయుడు, జంగా కృష్ణమూర్తి విస్తృత ప్రచారం నిర్వహించారు. టీడీపీ తరఫున గుంటూరు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థులు గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు మొక్కుబడి ప్రచారాన్ని నిర్వహించారు. జయదేవ్ పెదకాకానిలో రోడ్ షో నిర్వహించగా, రాయపాటి సత్తెనపల్లి నియోజకవర్గంలో కొండమోడులో పర్యటించారు. -
మోగనున్న ‘సార్వత్రిక’ నగారా
12 నుంచి నామినేషన్ల స్వీకరణ 21న పరిశీలన 23న ఉపసంహరణ నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న దృష్ట్యా రిటర్నింగ్ అధికారులు భారత ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి పగడ్బంధీగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్వోలతో సమావేశమయ్యారు. అభ్యర్థుల నామినేషన్లు,వాటి పరిశీలన, ఉపసంహరణ, ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. సెలవు రోజులైన ఈ నెల 13, 14, 18 తేదీల్లో నామినేషన్లను స్వీకరించరాదన్నారు. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన, 23న ఉపసంహరణ ఉంటుందని వివరించారు. రిటర్నింగ్ అధికారులు ప్రతీ నియోజకవర్గానికి పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు జాబితాను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ విధిగా చేపట్టాలని ఆదేశించారు. అభ్యర్థులు వేసే నామినేషన్ల పత్రాలను జాగ్రత్తగా పరిశీలించి ఎక్కడైనా ఖాళీలు వదిలితే వారికి చెప్పి రాయించాలన్నారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు పార్లమెంట్ స్థానానికి రూ.25 వేలు, అసెంబ్లీ స్థానానికి రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అందులో 50 శాతం చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థులు సమర్పించే కులధ్రువీకరణ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల వయస్సు 25 ఏళ్లు పూర్తయి ఉండాలన్నారు. సమావేశంలో జేసీ ప్రవీణ్‌కుమార్, ఐటీడీఏ పీవో వినయ్‌చంద్, డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
85.86% తొలి విడత పోలింగ్
చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం నల్లగొండ, న్యూస్‌లైన్, ప్రాదేశిక ఎన్నికల తొలి విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్ల పరిధిలోని 33 మండలాలకు ఎన్నికలు జరిగాయి. తొలి విడత ఎన్నికల్లో మొత్తం 11,94,075 ఓట్లు కాగా, 10,25,195 ఓట్లు పోల య్యాయి. 85.86 శాతం పోలింగ్ నమోదైంది. మూడు డివిజన్ల పరిధిలోని ఎంపీటీసీ 459 స్థానాలు, జెడ్పీటీసీ 33 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఎంపీటీసీ స్థానాలకు 1,699 మంది, జెడ్పీటీసీ స్థానాలకు 213 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పురుషులకు సరిసమానంగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు మండలాల నుంచి పోలైన ఓట్లకు సంబంధించి వివరాలు విడివిడిగా రావడం ఆలస్యం కావడంతో అధికారులు ఆమేరకు పురుషులు, మహిళల ఓటర్ల సంఖ్యను నిర్ధారించలేకపోయారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. కాగా తుంగతుర్తి, వేములపల్లి, చందంపేట, మిర్యాలగూడ మండలాల పరిధిలో రాత్రి పొద్దుపోయే వరకు పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్న ఓటర్లను ఓటు వేసేందుకు అవకాశం కల్పించడంతో ఆయా స్థానాల్లో ఎన్నికల తంతు ఆలస్యంగా ముగిసింది. తుంగతుర్తిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడం వల్ల పోలింగ్ మరింత జాప్యమైంది. రికార్డు స్థాయిలో పోలింగ్... ఎండతీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ 12 శాతం నమోదు కాగా, ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 11 గంటలకు 31 శాతంగా నమోదైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 55 శాతానికి పెరిగింది. దాదాపు మొత్తం పోలింగ్ శాతం సగానికి పూర్తయ్యింది. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల వరకు 31 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కాగా, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసే సమయానికి కేవలం 16.85 శాతంతో పూర్తయింది. పలు చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులుతీరడంతో పోలీసులు, పోలింగ్ సిబ్బంది కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డివిజన్ కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు... పోలింగ్ పూర్తయిన తర్వాత పోలీసుల సాయంతో బ్యాలెట్ బాక్సులను రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు తరలించారు. తొలుత నియోజకవర్గ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలనకున్నారు. అయితే సుప్రీంకోర్టు ఓట్ల లెక్కింపు మే నెలకు వాయిదా వేయాలని ఆదేశించడంతో ఎన్నికల కమిషన్ ఈ మార్పు చేయాల్సి వచ్చింది. ఓట్ల లెక్కింపు కూడా డివిజన్ కేంద్రాల్లోనే నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.దామోదర్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. తాగునీరూ కరువే.... పోలింగ్ కేంద్రాలో ఓటర్లకు సౌకర్యాలు కల్పించడంతో అధికార యంత్రాంగం తీవ్రంగా విఫలమైంది. కనీసం గొంతు తడుపుకునేందుకు మంచినీళ్లు సమకూర్చిన పాపాన పోలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు కూడా వేయలేదు. దీంతో ఓటర్లు ఎర్రటి ఎండలోనే గంటల తరబడి క్యూలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వచ్చింది. అర్వపల్లిలోని 24వ పోలింగ్ బూతు వద్ద ఎండలోనే గంటల కొద్దీ ఓటర్లు బారులు తీరారు. అయినా క్యూ ముందుకు వెళ్లకపోవడంతో మహిళా ఓటర్లు ఒక్కసారిగా కేంద్రంలోకి చొచ్చుకపోయారు. అధికారుల తప్పిదం... ప్రాదేశిక ఎన్నికల నిర్వహణలో అధికారుల తప్పిదం కొట్టొచ్చినట్లు కనిపించింది. వేములపల్లి -1 ఎంపీటీసీ పరిధిలోని పోలింగ్ కేంద్రం 36 (ప్రభుత్వ ఉన్నత పాఠశాల)లో చెట్లచెన్నారం గ్రామానికి సంబంధించిన రెండు ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్లు అందజేశారు. ఓటర్లు గుర్తించేంత వరకుగానీ అధికారులు మేల్కోలేదు. ఓటర్లు అభ్యంతరం చెప్పడంతో చివరకు పరిశీలించారు. దీంతో 45 నిమిషాల పాటు పోలింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. తప్పును సరిదిద్దాక పోలింగ్‌ను కొనసాగించారు. -
‘గెలిచేది తెలంగాణ వాదమే’
చల్లంపల్లి(తలకొండపల్లి), న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణవాదమే గెలుస్తుందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆదివారం మండలంలోని చల్లంపల్లిల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడా రు. ఇతర పార్టీల నాయకులు డబ్బు, మద్యం తదితర ప్రలోభాలకు గురి చేసినా ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఫలితంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఐదు జెడ్పీటీసీలతో పాటు ఐదు ఎంపీపీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. టీఆర్ఎ స్ హయూంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుం దని చెప్పారు. 10 జిల్లాల తెలంగాణను 24 జిల్లాలుగా విభజిం చి, సంక్షేమాభివృద్ధి పథకాలను అమలుపరుస్తామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి తాగు, సాగు నీరు అందిం చి వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసి రైతంగాన్ని ఆదుకుం టామన్నారు. బ్యాక్‌లాక్ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగుల కు ఉపాధి కల్పిస్తామన్నారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ నర్సింహ్మ, మాజీ ఎంపీపీ పర్వతాలుయాదవ్, రమేశ్, భిక్షపతి, బిచ్చానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటెత్తిన పల్లె
సాక్షి, కరీంనగర్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలివిడత ఎన్నికల పోలింగ్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జగిత్యాల, పెద్దపల్లి, మంథని డివిజన్ల పరిధిలోని 30 జెడ్పీటీసీ స్థానాలు, 403 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. జెడ్పీటీసీ స్థానాలకు 183 మంది, ఎంపీటీసీ స్థానాలకు 1,790 మంది బరిలో నిలిచారు. మంథనిలో ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగితే.. జగిత్యాల,పెద్దపల్లిలో ఐదు గంటల వరకు కొనసాగింది. 10,16,165 మంది ఓటర్లకు 7,90,887మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగిత్యాలలో అత్యధికంగా 2,20,936 మంది, మంథనిలో 4,21,331మంది మహిళలు ఓటేశారు. జిల్లా వ్యాప్తంగా 77.93శాతం పోలింగ్ నమోదైంది. 2006లో జరిగిన పోలింగ్ (72.78శాతం)తో పోల్చుకుంటే ఈసారి 5శాతం పెరిగింది. అధికారులు ఈసారి 80 నుంచి 90శాతం వరకు పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నా.. పలు గ్రామాల్లో ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో ఆశించిన మేరకు ఓటింగ్ జరగలేదు. ఎండ తీవ్రత కూడా పోలింగ్‌పై ప్రభావం చూపింది. గ్రామాల్లో ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎండ తీవ్రత పెరగడంతో ముగింపు సమయంలో పోటెత్తారు. పోలింగ్ జరిగిందిలా.. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ సరళిని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, ఎన్నికల పరిశీలకులు, ఎస్పీ వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. కలెక్టర్ వీరబ్రహ్మయ్య సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి జెడ్పీ హైస్కూల్, నర్సయ్యపల్లి మండల పరిషత్ పాఠశాల, శివపల్లి పీఎస్, ఎలిగేడు జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. మహాముత్తారం మండలం కనుకునూరి-సింగారం గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై రాళ్లు పెట్టారు. అది మావోయిస్టులపనే అని పుకార్లు లేవడంతో స్థానికులే రోడ్డుపై అడ్డంగా రాళ్లు పెట్టారని పోలీసులు చెప్పారు. జగిత్యాల మండలం అనంతారం, బాలపల్లి గ్రామాల్లోని పోలింగ్ బూత్‌లో సాయత్రం ఐదు గంటలకు ఒకేసారి 50 మందికి పైగా ఓటర్లు రావడంతో అధికారులు అవకాశమిచ్చారు. కమాన్‌పూర్ మండలం రాణాపూర్లోని ఓ పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పేపర్లు ఉల్టా ప్రచురితం కావడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అక్కడ మధ్యాహ్నం రెండు గంటలకు నిలిచిన పోలింగ్ 45నిమిషాల తర్వాత ప్రారంభమైంది. మహాదేవ్‌పూర్ మండలం బెగ్లూర్‌లో ఓ పోలింగ్ కేంద్రం వద్దే అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తుండడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు.పోలింగ్ పూర్తయిన తర్వాత పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులను రెవెన్యూ డివిజన్ కేంద్రాలకు తరలించారు. మే 9 తర్వాత ఫలితాలు ప్రకటించాలని ప్రభుత్వం ఎప్పుడు ఆదేశించినా దానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 11న జరిగే రెండో విడత ఎన్నికల పోలింగ్‌పై అధికారులు దృష్టిసారించారు. -
తొలి విడతలో వైఎస్ఆర్సీపీ హవా
సాక్షి ప్రతినిధి, అనంతపురం : మహిళలు, వృద్ధులు, యువతీ యువకులు, రైతులు ఓటుహక్కును వినియోగించుకోవడానికి పోటీపడ్డారు. ఫలితంగా మునిసిపల్ ఎన్నికలకన్నా అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ శాతం పెరగడం.. ప్రధానంగా మహిళలు అధికంగా పోలింగ్‌లో పాల్గొనడం.. గ్రామాల్లో వైఎస్సార్సీపీకి ఆదరణ అధికంగా ఉండటంతో తొలి విడత ప్రాదేశిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలి స్పీడు స్పష్టంగా కన్పించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లోని జెడ్పీటీసీ స్థానాలు స్వీప్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కళ్యాణదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాల్లో ఒకట్రెండు జెడ్పీటీసీ స్థానాల్లో మాత్రమే వైఎస్సార్సీపీకి టీడీపీ దీటైన పోటీ ఇవ్వగలిగిందని విశ్లేషిస్తున్నారు. పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి. వివరాల్లోకి వెళితే.. ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం తొలి విడత గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం, మడకశిర, పెనుకొండ, హిందూపురం నియోజకవర్గాల్లోని 31 జెడ్పీటీసీ, 437 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. జెడ్పీటీసీసీ స్థానాల్లో 83.01 శాతం, ఎంపీటీసీ స్థానాల్లో 83.11 శాతం ఓట్లు పోలయ్యాయి. మునిసిపల్ ఎన్నికల్లో సగటున 71.49 శాతం ఓట్లు మాత్రమే పోలవ్వడం గమనార్హం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలతో పల్లెల్లో సింహభాగం ప్రజలు లబ్ధి పొందారు. ప్రధానంగా రైతు, రైతు కూలీ వర్గాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి దన్నుగా నిలిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలను సమర్థంగా అమలు చేయగల సత్తా ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డిలో మాత్రమే ఉందని ప్రజానీకం విశ్వసిస్తున్నారు. ఇది సహకార, పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ప్రజలు అదే రీతిలో తీర్పు ఇచ్చారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని ఐదు జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ స్వీప్ చేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాతో ఆ నియోజకవర్గ టీడీపీ కీలక నేతలు కూడా ఏకీభవిస్తుండటం గమనార్హం. ఉరవకొండ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి బలంగా ఉన్న కూడేరు, బెళుగుప్ప మండలాల్లో ఫ్యాన్ గాలి బలంగా వీచింది. వజ్రకరూరు, విడపనకల్లు మండలాల్లో ఓటింగ్ వైఎస్సార్సీపీకి మద్దతుగా ఏకపక్షంగా సాగింది. ఉరవకొండ జెడ్పీటీసీ స్థానంలో ఇరు పక్షాల మధ్య పోటాపోటీగా పోలింగ్ సాగినా.. అంతిమంగా వైఎస్సార్సీపీదే విజయమని విశ్లేషిస్తున్నారు. అంటే.. ఉరవకొండ నియోజకవర్గంలో కూడా అన్ని జెడ్పీటీసీ స్థానాలనూ వైఎస్సార్సీపీ స్వీప్ చేయబోతోంది. గుంతకల్లు నియోజకవర్గంలో గుత్తి, పామిడి జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలో చేరడం ఖాయం. టీడీపీకీ పట్టున్న గుంతకల్లు మండలంలో ఓటర్లు వైఎస్సార్సీపీకి దన్నుగా నిలిచినట్లు పోలింగ్ సరళి స్పష్టీకరిస్తోంది. గుంతకల్లు జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ-టీడీపీల మధ్య నున్వా-నేనా అన్నట్లుగా పోటీ సాగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయభేరి మోగించడం ఖాయం. కంబదూరు, కళ్యాణదుర్గం మండలాల్లో వైఎస్సార్సీపీ, టీడీపీల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లుగా సాగింది. పీసీసీ చీఫ్ రఘువీరా ప్రాతినిధ్యం వహిస్తోన్న కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని జెడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదు.మడకశిర నియోజకవర్గంలో గుడిబండ, రొళ్ల జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలో చేరనున్నాయి. అమరాపురం, మడకశిర, అగళి మండలాల్లో వైఎస్సార్సీపీ-టీడీపీల మధ్య పోటా నువ్వానేనా అన్నట్లుగా సాగింది. పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ కంచుకోటలు బీటలు వారక తప్పదని పోలింగ్ సరళి స్పష్టం చేసింది. గోరంట్ల, పెనుకొండ జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయం. సోమందేపల్లి, పరిగి మండలాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపు దిశగా సాగుతున్నారు. రొద్దం మండలంలో మాత్రమే వైఎస్సార్సీపీ-టీడీపీ అభ్యర్థుల మధ్య పోటీ ఉత్కంఠగా సాగింది.టీడీపీ ఆవిర్భావం నుంచి ఆపార్టీకి దన్నుగా నిలుస్తోన్న హిందూపురంలోనూ ప్రాదేశిక ఎన్నికల్లో ఎదురుగాలి వీచింది. చిలమత్తూరు జెడ్పీటీసీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి భారీ ఆధిక్యంతో విజయం సాధించడం ఖాయం. హిందూపురం, లేపాక్షి జెడ్పీటీసీ స్థానాల్లో ఇరు పక్షాల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది. -
తెలుగుదేశం దాష్టీకం
సాక్షి, మచిలీపట్నం/ మోగులూరు (కంచికచర్ల రూరల్), న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల తొలివిడత పోలింగ్‌ను పురస్కరించుకొని జిల్లాలో పలు ప్రాంతాల్లో ఓటమి ఉక్రోషంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాష్టీకానికి పాల్పడ్డాయి. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయిలో సామినేని ఉదయభాను అల్లుడు విజయనర్శింహారెడ్ది కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. మక్కపేటలో పోలింగ్ సరళిని చూసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఉదయభానుపై కవ్వింపు చర్యలు చేపట్టారు. మీరెందుకు ఇక్కడికి వచ్చారంటూ వాగ్వివాదానికి దిగారు. వైఎస్సార్సీపీ నేతలకు తీవ్ర గాయాలు... కంచికచర్ల మండలం పరిటాలలో వైఎస్సార్ సీపీ నాయకుడు బత్తిన తిరుపతిరావుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కంచికచర్ల మండలంలోని నక్కలపేటలో టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేసి కొట్టడంతో ముగ్గురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. రాళ్లు రువ్వి.. కర్రలతో దాడి.. కంచికచర్ల మండలం మోగులూరులో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బండి జానకిరామయ్యపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటు అడగడాన్ని వారించిన ఆయనపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్లు రువ్వి, కర్రలతో దాడికి దిగారు. దీంతో జానకిరామయ్య తలకు గాయమైంది. ఆయనతోపాటు కన్నెకంటి కృష్ణయ్య, గద్దె వెంకటకృష్ణ, ఆవుల గోపయ్య, షేక్ ఖుద్దూస్, బండి వెంకటేశ్వరరావు కూడా గాయపడ్డారు. పోలీసులు వారిని నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జానకిరామయ్యకు తలపై ఐదు కుట్లు పడ్డాయి. మిగిలిన వారు వైద్య సేవలు పొందుతున్నారు. శనివారం రాత్రి గనిఆత్కూరు గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ పాటిబండ్ల హరిజగన్నాధరావుపై టీడీపీ స్థానిక నేతలు దాడి చేసి గాయపరిచారు. కుటుంబ సభ్యులు ఆయన్ను నందిగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మచిలీపట్నంలోనూ... మచిలీపట్నం మండలంలోని పల్లెతాళ్లపాలెంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఆ ఘటనలో వైఎస్సార్సీపీ నాయకుడు చెక్కా కృష్ణారావుకు గాయాలయ్యాయి. తాళ్లపాలెం తదితర ప్రాంతాల్లో టీడీపీ నేతలు కొనకళ్ల బుల్లయ్య, కొల్లు రవీంద్రలు హడావుడి చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మచిలీపట్నం మండలం గుండుపాలెంలో గెలుపు తమదేనంటూ టీడీపీ కార్యకర్త వీరంగం సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే తొడలు కొట్టి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. -
వైఎస్సార్సీపీ ఏజెంట్ హఠాన్మరణం
పగిడ్యాల, న్యూస్‌లైన్: స్థానిక 18వ పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి తరఫున ఏజెంట్‌గా ఉన్న కుమ్మరి నరసింహులు(30) హఠాన్మరణం చెందాడు. ఉదయం 7 గంటలకు ఏజెంట్‌గా కూర్చున్న ఆయన మధ్యాహ్నం 12 గంటలకు పోలింగ్ కేంద్రంలోనే మూర్చ వచ్చి కింద పడిపోయాడు. గమనించిన పోలింగ్ సిబ్బంది వెంటనే స్థానిక ఆర్ఎంపీ వైద్యుదుడికి వద్దకు తీసుకెళ్లగా ఆయన చికిత్స చేస్తుండగా కొద్ది సేపటికే మృతి చెందాడు. మృతునికి విజయలక్ష్మి, భార్గవి, వైష్ణవి, హేమంత్‌కుమార్ నలుగురు పిల్లలు సంతానం. భార్య కూడా ఆరు నెలల క్రితమే మృతి చెందింది. పిల్లలకు తల్లిదండ్రులు ఇద్దరు దూరం కావడంతో వృద్ధురాలైన మృతుని తల్లి నాగమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. విషయం తెలుసుకున్న వైఎఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి పగిడ్యాలకు చేరుకుని మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. నలుగురు పిల్లలను బాగా చదివించే బాధ్యతను తీసుకుంటానని మాండ్ర శివానందరెడ్డి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. పగిడ్యాల -2 ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసిన రమాదేవి కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే ఒక ఆడపిల్లను దత్తత తీసుకుంటానని ముందుకు వచ్చారు. పలువురు నాయకులు మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
దేశం నేతల బరితెగింపు
నంద్యాల, న్యూస్‌లైన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ నాయకులు బరితెగించారు. మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుని హోదాలో ఉన్న పీపీనాగిరెడ్డి తన సమీప బంధువు గోస్పాడు జెడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి జగదీశ్వరమ్మను గెలిపించుకోవడానికి నానా యాతన పడ్డారు. జనరల్ ఏజెంట్‌గా మండలంలో తిరిగేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు ఎన్నికల అధికారి సుధాకర్ కూడా అనుమతి ఇచ్చారు. అయితే పీపీపై కొన్ని కేసులు ఉన్నాయని, ఆయనను జనరల్ ఏజెంట్‌గా నియమించవద్దని పోలీసు అధికారులు స్థానిక ఎన్నికల అధికారులకు ఆదేశించారు. అయినా సుధాకర్ ఏ మాత్రం ఖాతరు చేయలేదు. దీంతో పీపీ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఆదివారం గన్‌మెన్‌తో కలిసి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గోస్పాడు మండలానికి చెందిన ఇతర పార్టీల నాయకులు జిల్లా ఎస్పీకి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో సుధాకర్ జోక్యం చేసుకొని జనరల్ ఏజెంట్‌ను రద్దు చేసి ఆయన సమీపం బంధువు మాజీ ఎంపీపీ రాజశేఖర్‌రెడ్డిని నియమించారు. అంతేగాక పీపీని కూడా పోలింగ్ ముగిసే వరకు దీబగుంట్లలో స్వగృహం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. కొత్తపల్లె పోలింగ్ బూత్‌లో డమ్మీ బ్యాలెట్లు? కొత్తపల్లెలో టీడీపీ నాయకులు గెలుపు కోసం వ్యూహాత్మకంగా తెగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ గ్రామంలో వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారనే అనుమానించిన ఓటర్లకు ప్రచారంలో ఇచ్చిన డమ్మీ బ్యాలెట్ పేపర్‌ను పోలింగ్ బూత్‌లో వేసి ఒరిజనల్ బ్యాలెట్ పత్రాలను బయటకు తెచ్చి స్థానిక నాయకునికి ఇచ్చారని వైఎస్సార్సీపీ నాయకులు తాడి నరేంద్రకుమార్‌రెడ్డి, తదితరులు విలేకరులతో అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘం పరిశీలించాలని కోరారు. కానాలలో హల్చల్... కానాల మేజర్ పంచాయతీలో కొందరు పోలీసు అధికారులు అండదండలతో దేశం నాయకుడు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్‌రెడ్డి హల్చల్ సృష్టించారు. గత సర్పంచ్ ఎన్నికల్లో దారుణ ఓటమి చవి చూసిన విజయశేఖర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో అక్రమాలకు పాల్పడి గెలుపొందాలని చేసిన ప్రయత్నాలను వైఎస్సార్సీపీ వర్గాలు అడ్డుకున్నాయి. విజయశేఖర్‌రెడ్డి పోలింగ్ కేంద్రం ఆవరణంలో ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతండటంతో వైఎస్సార్సీపీ నాయకుడు, సర్పంచ్ నరేంద్రకుమార్‌రెడ్డి అడ్డుచెప్పారు. అయితే విజయశేఖర్‌రెడ్డికి పోలీసులు అండగా నిలువడంతో నరేంద్ర పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘పొత్తు’ చిక్కులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన బీజేపీ, టీడీపీలు ఎట్టకేలకు జతకట్టాయి. ఈ పొత్తు తమ్ముళ్లకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. మైనార్టీలు వ్యతిరేకిస్తున్న బీజేపీతో టీడీపీ కలిసి నడిచేందుకు నిర్ణయించుకోవడం మొదటికే మోసం తీసుకొస్తుందనే చర్చ జరుగుతోంది. ఓటమి భయంతో అధినేత చంద్రబాబు ముందూ వెనుక ఆలోచించకుండా తీసుకుంటున్న నిర్ణయాలు జిల్లా టీడీపీ శిబిరానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో జయాపజయాలను శాసించే ముస్లిం మైనారిటీలు ఇకపై టీడీపీకి ఓట్లేసే పరిస్థితి లేదని ఈ పొత్తుతో స్పష్టమైపోయింది. జిల్లాలోని కర్నూలు, నంద్యాల, ఆదోని, ఆత్మకూరు, బనగానపల్లె, పాణ్యం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో ఆ ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. రాష్ట్రాన్ని విభజించటంలో ప్రధాన భూమిక పోషించిన బీజేపీతో టీడీపీ జతకట్టడంతో విభజన వాదులంతా ఒకే గూటికి చేరినట్లయింది. బీజేపీతో పొత్తు ఖరారైనప్పటికీ జిల్లాలో ఆ పార్టీకి ఏ సీట్లు కేటాయిస్తారనే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే బీజేపీ నేతలు మాత్రం మూడు అసెంబ్లీ స్థానాలు ఆశిస్తున్నారు. ఇందులో పాణ్యం, ఆదోని, నంద్యాల అసెంబ్లీ స్థానాలు ఉన్నట్లు సమాచారం. టీడీపీ నేతలు మాత్రం అభ్యర్థే లేని కోడుమూరు అసెంబ్లీని కేటాయిస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను కమల దళం వ్యతిరేకిస్తోంది. ఆ మూడు బీజేపీకి కేటాయిస్తే... కమల దళం కోరినట్లు నంద్యాల, ఆదోని, పాణ్యం అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తే టీడీపీ పుట్టి మునిగినట్లేననేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. విభజన భయంతో కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి, ఆదోని టీడీపీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, పాణ్యాన్నే నమ్ముకుని పచ్చకండువా కప్పుకున్న మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డికి బీజేపీ డిమాండ్లు మింగుడు పడటం లేదు. పాణ్యం సీటు తనదేనని.. అధినేత హామీ ఇచ్చాడంటూ కోట్లు ఖర్చు చేస్తూ ప్రచారంలో తలమునకలవుతున్న కేజే రెడ్డి పరిస్థితి ఎటూ తేలడం లేదు. బీజేపీ నేతలు అడిగిన డిమాండ్‌కు తలొగ్గితే ఆ ముగ్గురు నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లేనని తెలుస్తోంది. ఒక వేళ్ల ఆ మూడు సీట్లు కేటాయిస్తే అధిష్టానాన్ని ధిక్కరించేందుకైనా సిద్ధమవుతామని తమ్ముళ్లు తెగేసి చెబుతున్నారు. సమైక్యవాదుల ఆగ్రహం: విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు ప్రత్యేక తెలంగాణకు తమ పార్టీ అనుకూలమని ప్రకటించారు. అదేవిధంగా పార్లమెంట్లో విభజన బిల్లు ఆమోదం పొందేందుకు పూర్తి స్థాయిలో సహకరించిన పార్టీ బీజేపీ. ఈ రెండు పార్టీలు అధికారం కోసం చేతలు కలపటాన్ని సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. -
ఓటెత్తిన చైతన్యం
80.23 శాతం పోలింగ్ నమోదు సాక్షి, కర్నూలు/అర్బన్, న్యూస్‌లైన్: తొలి విడత ప్రాదేశిక పోరు ఆదివారం ముగిసింది. ఉదయం నెమ్మదిగా ప్రారంభమైన పోలింగ్ సరళి మధ్యాహ్నానికి ఊపందుకుంది. ఓటర్లు తక్కువున్న గ్రామాల్లో ఉదయం 11 గంటలకే దాదాపు 70 శాతం పోలింగ్ నమోదైంది. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేృందుకు యువత ఉత్సాహం చూపింది. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించడంతో పాటు సూక్ష్మ పరిశీలకులు నిరంతరం పర్యవేక్షించారు. మొత్తంగా 36 జెడ్పీటీసీ, 496 ఎంపీటీసీ స్థానాల్లో 80.23 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. అత్యధికంగా బండిఆత్మకూరులో 88.34 శాతం, అత్యల్పంగా అవుకులో 73.03 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలిదశలో నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్లలో మొత్తం 12,98,190 మంది ఓటర్లు ఉండగా.. 10,41,473 మంది ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. బండిఆత్మకూరు మండలం లింగాపురం గ్రామంలోని 35వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నెం.501 నుంచి 600 వరకు బ్యాలెట్ పత్రాలు గల్లంతయ్యాయి. ఘటనపై పోలింగ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలింగ్ ప్రక్రియను యథావిధిగా నిర్వహించారు. కోడుమూరు మండలంలోని 34వ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధుల్లోని పోలింగ్ క్లర్క్ సుజాత హస్తం గుర్తుకు ఓటు వేయండంటూ కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫలితంగా గంట పాటు పోలింగ్ నిలిచిపోయింది. ప్రిసైడింగ్ అధికారులు ఈ విషయాన్ని ఎన్నికల ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లడంతో ఆమెను విధుల నుంచి తప్పించారు. అదేవిధంగా 16వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఆర్పీఎస్ తరఫున పగిడ్యాల సర్పంచ్ చిన్న ఎర్రన్న ఏజెంట్‌గా కూర్చోవడాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో దాదాపు 20 నిమిషాల పాటు అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. అనంతరం ఎన్నికల అధికారి అతన్ని ఏజెంట్‌గా తొలగించడంతో పోలింగ్ తిరిగి ప్రారంభమైంది. వెల్దుర్తి మండలం బుక్కాపురంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ కార్యకర్తలు ప్రచారం చేస్తుండంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న చెంచులు ఆత్మకూరు మండలం కొట్టాలచెరువు ఎంపీటీసీ స్థానంలో ఓటర్లుగా ఉన్న పెచ్చెర్వు చెంచుగూడెంకు చెందిన 130 మంది చెంచులు మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెచ్చె ర్వు నుంచి కొట్టాల చెరువు పోలింగ్ కేంద్రానికి దాదాపు 50 కిలోమీటర్లు దూరం కావడంతో.. ప్రభుత్వమే వీరిని రెండు లారీల్లో తరలించింది. -
ఓటమి భయంతోనే సర్వేల జిమ్మిక్కులు
గారడీల బాబుకి ప్రజలే బుద్ధి చెబుతారు ఎల్లోమీడియా భజనను ప్రజలు చూడడం, వినడం మానేశారు జనం గుండెల్లో జగన్‌కే స్థానం తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: జనంలో ఆదరణ పూర్తిగా లేకుండా పోయింది.. రాబోయే ఎన్నికల్లో ఎలా గెలవాలన్న ఓటమి భయంతోనే ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని సర్వేల్లో టీడీపీకే బాగుంది.. అంటూ చంద్రబాబునాయుడు జిమ్మిక్కులు చేస్తున్నాడని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి పరిధిలోని జయనగర్, లక్ష్మీపురం ప్రాంతాల్లో పార్టీ నాయకుడు మల్లం రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలను అనేక రకాలుగా కష్టాలు పెట్టి కన్నీళ్లు పెట్టించిన చంద్రబాబుకు ఓట్లు వేయరనే భయంతో ఉత్తుత్తి సర్వేలు చేయిస్తున్నారన్నారు. ఈ సర్వేల్లో తమ పార్టీకే బాగుందని సంకలు గుద్దుకుంటున్నాడన్నారు. ఇలాంటి గారడీలు, జిమ్మిక్కులు ఎన్ని చేసినా చంద్రబాబును ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. తొమ్మిదేళ్లపాటు ప్రజలను కష్టాలపాలు చేసిన పాపం ఊరికే పోదన్నారు. చంద్రబాబును ఎలాగైనా అధికారంలోకి తేవాలన్న ఉద్దేశంతో ఎల్లోమీడియాలో రాస్తున్న రాతలను చదవడం, చూడడం ప్రజలు మానేశారన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా జనం గుండెల్లో జగన్‌కు మాత్రమే స్థానముందని స్పష్టం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరేళ్లపాటు పేదల సంక్షేమం కోసం అందించిన పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. జగనన్న అధికారంలోకి రాగానే పొదుపు సంఘాల్లోని 20వేల కోట్ల మహిళా రుణాలను పూర్తిగా రద్దు చేస్తారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తారని తెలిపారు. అమ్మఒడి పేరుతో బిడ్డలను బడికి పంపించే ప్రతి తల్లిదండ్రులకు నెలకు రూ.500 చొప్పున ప్రతినెలా వారి ఖాతాలో వేస్తామన్నారు. పేదల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే జగన్మోహన్రెడ్డిని రాబోయే ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో గెలిపించి ప్రజలను కష్టపెడితే ప్రజలు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో చంద్రబాబుకు రుచి చూపించాలని కోరారు. పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నాయకులు పులుగోరు ప్రభాకరరెడ్డి, ఎస్కె. బాబు, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, కొమ్ము చెంచయ్యయాదవ్, పోతిరెడ్డి వెంకటరెడ్డి, కె.అమరనాథ్‌రెడ్డి, తాల్లూరి ప్రసాద్, ఆమోస్‌బాబు, నల్లాని బాబు, నూరుల్లా, గౌస్‌బాషా, ఎర్రబెల్లి వెంకి, నరసింహారెడ్డి, చెలికం కుసుమారెడ్డి, పునీత, గీతాయాదవ్, శాంతారెడ్డి, సులోచన, కృష్ణవేణమ్మ పాల్గొన్నారు. -
తొలిపోరు నేడే
సాక్షి, నెల్లూరు : ప్రచార, ప్రలోభాల పర్వం ముగిసింది. తొలివిడత పరిషత్ సమరానికి తెరలేచింది. జిల్లాలోని 21 మండలాల పరిధిలో జరుగుతున్న తొలివిడత పరిషత్ ఎన్నికలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. 21 మండలాలకు చెందిన జెడ్పీటీసీ స్థానాలతోపాటు ఆ మండలాల పరిధిలోని 267 ఎంపీటీసీ స్థానాలకుగాను తొమ్మిది స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 258 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 698 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, జెడ్పీటీసీ స్థానాలకు 73 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందుకోసం 911 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 7,04,671 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 3,47,992 మంది పురుషులు కాగా, 3,56,669 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 10 మంది ఉన్నారు. తొలి విడత ఎన్నికల కోసం 1,740 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. ఐదు వేల మందికిపైగా అధికారులు పోలింగ్ నిర్వహణలో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 148 అతి సమస్యాత్మక, 158 సమస్యాత్మక, 11 తీవ్రవాదుల అలికిడి ఉన్న పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు 47 చోట్ల వెబ్‌కెమెరాలు, 152 చోట్ల వీడియోగ్రాఫర్లను నియమించారు. తొలి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలిదశ పోలింగ్... జిల్లాలోని ఆత్మకూరు, అనంతసాగరం, అనుమసముద్రంపేట, మర్రి పాడు, సంగం, ఉదయగిరి, సీతారామపురం, వింజమూరు, కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి, జలదంకి, కలిగిరి, వరికుంటపాడు, కొండాపురం, దుత్తలూరు, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, కొడవలూరు, విడవలూరు, మండలాల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. బరిలో ఉన్న అభ్యర్థులు జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 21 మండలాల పరిధిలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు 21 మంది పోటీలో ఉండగా టీడీపీకి సంబంధించి 21 మంది బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కేవలం ఆరు చోట్ల మాత్రమే పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు రెండు చోట్ల, బీఎస్పీ అభ్యర్థులు నాలుగు చోట్ల, సీపీఎం రెండు చోట్ల, ఇండిపెండెంట్లు 17 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 73 మంది జెడ్పీటీసీ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక ఎంపీటీసీలకు సంబంధించి 21 మండలాల పరిధిలో వైఎస్సార్సీపీ తరపున 255 మంది పోటీలో ఉండగా, టీడీపీ తరపున 243 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 44 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి తొమ్మిది మంది, బీఎస్పీ నుంచి నలుగురు, సీపీఐ నుంచి ఐదుగురు పోటీలో ఉండగా, సీపీఎం నుంచి 27 మంది, 111 మంది ఇండిపెండెంట్లు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 698 మంది పోటీలో ఉన్నారు. బ్యాలెట్ వివరాలు... జెడ్పీటీసీకి సంబంధించి మొదటి విడత ఎన్నికల్లో 7,85,350 బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయగా, ఎంపీటీసీకి సంబంధించి 7,63,300 బ్యాలెట్ పేపర్లను తొలివిడత ముద్రించి సిద్ధంగా ఉంచారు. -
ఇంటింటికి కిలో చికెన్
కోవెలకుంట్ల, న్యూస్‌లైన్: ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నాయకులు ఓ విన్నూత పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఉయ్యాలవాడ మండలంలోని అల్లూరు గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి కిలో చికెన్ పథకం అమలు చేసేందుకు రంగంలోకి దిగారు. స్థానికంగా చికెన్‌ధర కిలో రూ. 120 నుంచి రూ. 150 వరకు ధర పలుకుతుండటంతో తాడిపత్రిలో కిలో రూ. 80 ధర ఉందని తెలుసుకుని దాదాపు 200 కిలోల చికెన్ తెప్పించారు. శనివారం చీకటిపడ్డాక ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీకి శ్రీకారంచుట్టారు. గ్రామంలో నాలుగు ఇళ్లకు సరఫరా చేయగానే ఎండ వేడిమికి చికెన్ చెడిపోయిన వాసన వస్తున్నట్లు గమనించిన నాయకులు కంగుతిన్నారు. అదే చికెన్‌ను పంపిణీ చేస్తే ఓటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సివస్తుందని భావించి గుట్టుచప్పుడు కాకుండా చికెన్‌ను తీసుకె ళ్లి గ్రామ శివారులోని పాలేరు వాగులో పడేసినట్లు తెలుస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో ఓటర్లను మభ్యపెట్టేందుకు టీడీపీ నాయకులు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ముందు రోజు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు ఆ నాయకులు ప్రయత్నించారు. అయితే ఓటర్లు తిరస్కరించడంతో చికెన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా వేసవికాలం కావడంతో అక్కడి నుంచి గ్రామానికి తీసుకొచ్చే క్రమంలో సుమారు 3 గంటల సమయం పట్టింది. దీంతో వేడి కారణంగా చికెన్ చెడిపోవడంతో టీడీపీ నాయకుల పథకం బెడిసికొట్టింది. -
తొలి విడత సమరం
జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ 182 సమస్యాత్మక,140 అత్యంత సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు 29 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, 225 మంది వీడియోగ్రాఫర్ల ఏర్పాటు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : తొలి విడత ప్రాదేశిక పోరులో ఓటర్ల నిర్ణయం ఆదివారం వెలువడనుంది. సుదీర్ఘకాలం తరువాత జరగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత కూడా ఓటర్లు ఎక్కువగా ఉంటే క్యూలో ఉన్నవారందరికీ స్లిప్పులు అందజేస్తారు. వారిని మాత్రమే ఓటేయడానికి అనుమతిస్తారు. గత నెల రోజులుగా ప్రచారాలతో హోరెత్తించిన అభ్యర్థుల జాతకాలు బ్యాలెట్ బాక్సుల్లోకి చేరనున్నాయి. పోలింగ్ కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో తొలి దశలో 22 జెడ్పీటీసీ, 379 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. జెడ్పీటీసీలకు 88 మంది, ఎంపీటీసీలకు 912 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 9,65,504 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 4,75,395 మంది పురుషులు, 4,90,108 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరి కోసం మొత్తం 1177 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2397 బ్యాలెట్ బాక్సులను వినియోస్తున్నారు. ఎన్నిల నిర్వహణకు 1295 మంది పీవో, 3883 మంది ఏపీవో, 1295 మంది ఓపీవో మొత్తంగా 6,473 మంది సిబ్బందిని నియమించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత విశాఖ,అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ల పరిధిలో పోలింగ్ జరిగే 22 మండలాల్లో 182 సమస్యాత్మక, 140 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని 395 పోలింగ్ కేంద్రాలకు ఒక్కోదానికి నలుగురు,అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోని 366 పోలింగ్ కేంద్రాలకు ఒక్కోదానికి ఐదుగురు చొప్పున పోలీసు బందోబస్తు ఏర్పాటు చే స్తున్నారు. ఈ ఎన్నికలకు విశాఖ పోలీస్ కమిషనర్ పరిధిలో 1200, రూరల్ ఎస్పీ పరిధిలో 3100 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. 29 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉన్న పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ సరళిని జిల్లా కేంద్రం నుంచి స్వయంగా పర్యవేక్షించేందుకు 29 కేంద్రాల్లో ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అలాగే ఇంటర్నెట్ సదుపాయం లేని 225 కేంద్రాల్లో పోలింగ్‌ను వీడియో తీసేందుకు వీడియోగ్రఫర్లను, స్టాటిక్ ఫోర్స్‌ను నియమించారు. 68 కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నారు. రెవెన్యూ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్‌లు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు మే7వ తేదీ తరువాత జరగనుంది. దీంతో అప్పటి వరకు బ్యాలెట్ బాక్సులను రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో భద్రపర్చాలని అధికారులు నిర్ణయించారు. పోలింగ్ అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ఆయా మండలాల రిసెప్షన్ సెంటర్‌కు తీసుకువచ్చి అక్కడ నుంచి పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తారు. విశాఖ డివిజన్ కు శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లోను, అనకాపల్లి డివిజన్‌కు ఏఎంఏఎల్ కళాశాలలోను, నర్సీపట్నం డివిజన్‌కు డాన్‌బాస్కో స్కూల్లోను స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. -
బీజేపీలో ‘స్థానిక’ పోరు!
పొత్తులతో చిక్కులు స్థానికులకే టికెట్ ఇవ్వాలంటున్న నేతలు గెలుపే ముఖ్యమంటున్న మరి కొందరు నేతలు సాక్షి, విజయవాడ : టీడీపీతో పొత్తు బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. పొత్తు దాదాపుగా ఖరారవుతుండటంతో టికెట్లు ఆశించేవారిలో ఆందోళన ప్రారంభమయింది. పొత్తులో భాగంగా విజయవాడ సెంట్రల్, పశ్చిమం, కైకలూరు అసెంబ్లీ సీట్లలో ఒకటి రెండే బీజేపీకి దక్కే అవకాశం ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీలోనూ అంతర్గత పోరు మొదలైంది. విజయవాడ సెంట్రల్ సీటు తమకే కావాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. అయితే పశ్చిమం లేదా కైకలూరు సీట్లలో ఒకటే ఇస్తామంటూ టీడీపీ నేతలు సూచిస్తున్నారు. చివరకు సెంట్రల్ బీజేపీకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన సీనియర్లు చాలా మంది ఉన్నారని, వారికే అవకాశం కల్పించాలని, కొత్తవారిని తీసుకొస్తే ఊరుకొనేది లేదని ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే నిరసన గళం వినిపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకునేవారి వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగమేమీ ఉండదని సలహాలిస్తున్నారు. వారు గెలి చినా, ఓడిపోయినా హైదరాబాద్‌లోనే ఉంటారని, దీనివల్ల స్థానికంగా పార్టీ అభివృద్ధి చెందదని పేర్కొంటున్నారు. బీజేపీ కూడా టీడీపీలాగానే ‘కార్పొరేట్ సంస్థ’గా మారిపోయిం దని, హైదరాబాద్‌లో నేతలకు డబ్బు సంచులు ఇచ్చి సీట్లు తెచ్చుకోవచ్చని కొంతమంది నేతలు భావిస్తున్నారని, అందువల్లనే స్థానికేతరుడికి సీటు ఇవ్వకూడదని బలంగా వాదిస్తున్నారు. ఏనాడూ పార్టీ జెండా పట్టుకోనప్పటికీ ముఖ్యనేతలను సంతృప్తి పరిచి బీఫారంతో దిగుమతి అయితే సహించబోమని ఈ సందర్భంగా తేల్చిచెబుతున్నారు. స్థానికుల కోటాలో బీజేపీ సీమాంధ్ర కన్వీనర్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు, సీనియర్ నేతలు వీరమాచినేని రంగ ప్రసాద్, రామసాయి తదితర పేర్లు పరిశీలించవచ్చని సూచిస్తున్నారు. గెలుపుగుర్రాలపైనే దృష్టిపెట్టాలి సెంట్రల్ సీటు బీజేపీకి దక్కితే పార్టీని గెలిపించే వారికే అవకాశం కల్పించాలి తప్ప స్థానికుడికే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని అర్బన్ పార్టీలోనే మరికొంతమంది నేతలు వ్యాఖానిస్తున్నారు. సీనియార్టీనే ప్రాధాన్యతగా తీసుకుంటే జనసంఘ్ నుంచీ పనిచేసే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారని, వారికే టికెట్ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గతంలో టికెట్ ఆశించి భంగపడి, కొన్నేళ్లుగా పార్టీకి దూరంగా ఉన్న కొందరు నేతలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చి ‘స్థానికుడికే సీటు’ అంటూ కొత్తవాదనలు తెస్తున్నార ని ఈ వర్గం వాదిస్తోంది. బీజేపీకి ఉన్న ఓటింగ్‌కు తోడు తన ప్రభావంతో పార్టీకి పది ఓట్లు తీసుకొచ్చే అభ్యర్థి అవసరమని, కేవలం సీనియార్టీని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. వాణిజ్య, వ్యాపార, ఉద్యోగ వర్గాలతో మంచి సంబంధాలు, సినీ రంగంతో పరిచయం ఉన్నవారైతే నాలుగు ఓట్లు ఎక్కువ వస్తాయని వివరిస్తున్నారు. కొత్తవారి కోటాలో వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగుల అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సూర్యనారాయణ, సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని తెలుస్తోంది. పశ్చిమం, కైకలూరు సీటు లభించినా అక్కడ నుంచి కూడా పోటీ చేసేందుకు నలుగురైదుగురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే లభించే ఒకటి రెండు సీట్ల విషయంలో ఆచి తూచి అడుగు వేయాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారని సమాచారం. -
పోలింగ్ నేడే
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల తొలి విడత పోరుకు రంగం సిద్ధమైంది. విజయవాడ, మచిలీపట్నం రెవెన్యూ డివిజన్లలోని 26 మండలాల్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, ఆయా మండలాల రిటర్నింగ్ అధికారులు శనివారం పర్యవేక్షించారు. విజయవాడ డివిజన్లోని 293 ఎంపీటీసీ స్థానాల్లో 774 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 14 జెడ్పీటీసీ స్థానాల్లో 48 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మచిలీపట్నం డివిజన్లోని 12 మండలాల్లో 157 ఎంపీటీసీ స్థానాలకు 413 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 12 జెడ్పీటీసీ స్థానాలకు 51 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. విజయవాడ డివిజన్లోని 14 మండలాల్లో 7,41,619 మంది, మచిలీపట్నం డివిజన్లోని 12 మండలాల్లో 4,14,503 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా రెండు డివిజన్లలోని 26 మండలాల్లో 11,56,122 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికారులు బీఎల్వోల ద్వారా ఓటరు స్లిప్‌లను పంపిణీ చేశారు. ఇంకా ఎవరికైనా ఓటరు స్లిప్‌లు అందకుంటే పోలింగ్ స్టేషన్ల వద్ద ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో పోలింగ్ స్టేషన్ల వద్ద షామియానాలు, తాగునీటి వసతి కల్పించారు. ఎన్నికల సామాగ్రి అందజేత... మండల పరిషత్ కార్యాలయాల వద్ద ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్ పత్రాలు, బాక్సులు, ఓటర్ల జాబితాలు ఇతరత్రా ఎన్నికల సామగ్రిని శనివారం అందజేశారు. మండల విస్తీర్ణాన్ని బట్టి రూట్లు, జోన్లుగా విభజించి ఎన్నికల సిబ్బందిని గ్రామాలకు పంపారు. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్‌కు ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారితో పాటు మరో ముగ్గురిని నియమించారు. మొదటి విడతలో జరిగే ఎన్నికలకు 7,185 మంది సిబ్బందితో పాటు 719 మందిని రిజర్వులో ఉంచారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ఎస్పీ జె.ప్రభాకరరావు నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎన్నికలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిఘా ఉంచుతామని, ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వెంటనే అరెస్టు చేస్తామని చెప్పారు. తొలివిడత ఎన్నికలు జరిగే మండలాలివే... విజయవాడ రెవెన్యూ డివిజన్లోని చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనుమలూరు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు, వత్సవాయి, వీరులపాడు, విజయవాడ రూరల్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మచిలీపట్నం డివిజన్లోని అవనిగడ్డ, బంటుమిల్లి, చల్లపల్లి, ఘంటసాల, గూడూరు, కోడూరు, కృత్తివెన్ను, మచిలీపట్నం, మోపిదేవి, మొవ్వ, నాగాయలంక, పెడన మండలాలు ఉన్నాయి. జోరుగా మద్యం, నగదు పంపిణీ : తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఒక్కరోజు వ్యవధే మిగిలి ఉండటంతో శనివారం గ్రామాల్లో నగదు, మద్యం పంపిణీ జోరుగా సాగాయి. పోలీసుల బందోబస్తు ఉన్నా అభ్యర్థుల అనుచరులు గుట్టుచప్పుడు కాకుండా తమ పని కానిచ్చేశారు. శుక్రవారం సాయంత్రమే ప్రచారం ముగియటంతో శనివారం అంతా ఆయా గ్రామాల పెద్దలు, ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కుల సంఘాలు, ఆయా సామాజిక వర్గాల పెద్దలు తదితరులతో చర్చలు జరిపి ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. -
నేడే తొలి విడత ప్రాదేశిక పోరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలివిడత ‘ప్రాదేశిక’ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఆదివారం మల్కాజిగిరి, రాజేంద్రనగర్, వికారాబాద్ డివిజన్లలోని 303 ఎంపీటీసీ స్థానాలు, 16 జెడ్పీటీసీ స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు జిల్లా యంత్రాంగం 1,110 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలివిడత ప్రాదేశిక ఎన్నికల్లో 16,43,681 మంది ఓటర్లు తమ ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. ఇందు లో 8,45,218 మంది పురుషులు, 7, 98,463 మంది మహిళలున్నారు. ఈ మండలాల్లోనే.. తొలివిడతలో భాగంగా జిల్లాలోని 16 మండలాల్లో ఆదివారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ కొనసాగనుంది. బంట్వారం, బషీరాబాద్, ధారూరు, ఘట్కేసర్, కీసర, మర్పల్లి, మేడ్చల్, మోమీన్‌పేట, పెద్దేముల్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శామీర్‌పేట, శంషాబాద్, తాండూరు, వికారాబాద్, యాలాల మండలాల్లో ఓటింగ్‌కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. శనివారం సాయంత్రానికే సిబ్బంది పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులతో సహా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. తొలివిడత పోలింగ్ ప్రక్రియలో 5,550 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. మరో పది శాతం మంది ఉద్యోగులను రిజర్వులో ఉంచారు. జిల్లాలో 215 సున్నితమైన, 165 అతి సున్నిత పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో వెబ్‌కాస్టింగ్‌తోపాటు వీడియో చిత్రీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బరిలో 1,291 మంది అభ్యర్థులు ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా తొలివిడతలో జరుగుతున్న మండలాల్లో మొత్తం 1,291 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 303 ఎంపీటీసీ స్థానాలకు 1,211 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, 16 జెడ్పీటీసీ స్థానాలకు 80 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వికారాబాద్ డివిజన్లోని 9 జెడ్పీటీసీ స్థానాలకు 36 మంది పోటీలో ఉండగా.. రాజేంద్రనగర్ డివిజన్లోని రెండు స్థానాలకు 12 మంది బరిలో ఉన్నారు. మల్కాజిగిరి డివిజన్లోని ఐదు స్థానాలకు 32 మంది పోటీ పడుతున్నారు. నెల తర్వాతే ఫలితాలు ప్రాదేశిక ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం ఇప్పట్లో వెల్లడికావు. ఫలితాలు ప్రకటిస్తే వాటి ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని పేర్కొంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. ఫలితాలను సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాతే వెల్లడించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఎన్నికలు నిర్వహించడంతో సరిపెట్టనున్న యంత్రాంగం.. ఫలితాలను మాత్రం వచ్చేనెలలో ప్రకటించనుంది. -
నేడు ‘తొలి’ పోలింగ్
గ్రామాలకు తరలివెళ్లిన పోలింగ్ సిబ్బంది ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ 1,315 పోలింగ్ కేంద్రాలు.. 3,967 బ్యాలెట్ బాక్సులు 22 మండలాల్లో 10,72,793 మంది ఓటర్లు అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 13 6,802 మందితో భారీ పోలీస్ బందోబస్తు ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్ తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లలో ఆదివారం ఉద యం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 75 జోన్ల పరిధిలోని 139 రూట్లలో పోలీస్ బందోబస్తు నడుమ ఎన్నికల సిబ్బం ది సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. 22 మండలాల్లో 413 ఎంపీటీసీ పదవులకు వెయ్యి మంది, 22 జెడ్పీటీసీ పదవులకు 64 మంది తలపడుతున్నారు. మొత్తం 1,315 పోలింగ్ కేంద్రాల పరి దిలో 10,72,793 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. పోలింగ్‌కు 3,967 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. వీటిలో 2,775 చిన్నవి, 277 మధ్య తరహా సైజు, 915 పెద్ద బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. వీటిని ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు తరలించారు. మొత్తంగా 6,575మంది పోలింగ్ సిబ్బంది, 6,802మంది పోలీసులు విధుల్లో పాలు పంచుకుంటున్నారు. పోలింగ్ ఇక్కడే.. జిల్లాలో ఏలూరు, పెదపాడు, పెదవేగి, దెందులూరు, భీమడోలు, నిడమర్రు, చింతలపూడి, ద్వారకాతిరుమల, గణపవరం, ఉంగుటూరు, టి.నర్సాపురం, కామవరపుకోట, లింగపాలెం, తాడేపల్లిగూడెం, పెంటపాడు, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాలలో పోలింగ్ జరగనుంది. 24.86 లక్షల బ్యాలెట్ పత్రాలు జెడ్పీటీసీ అభ్యర్థుల కోసం 12,43,050 తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను, ఎంపీటీసీ అభ్యర్థుల కో సం 12,43,050 గులాబీ రంగు బ్యాలె ట్ పత్రాలను సిద్ధం చేశారు.తొలివిడతలో మొత్తం 24,86,100 బ్యాలెట్ పత్రాలను వినియోగించనున్నారు. కలెక్టరేట్, జెడ్పీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా, ఓటర్లను ప్రలోభ పెడుతున్నా, పోలింగ్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైనా కలెక్టరేట్లోని 1800-425-1365, జెడ్పీ కార్యాలయంలో 08812-232351 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. జెడ్పీలో కంట్రోల్ రూమ్ 24గంటలూ పనిచేస్తుందన్నారు. -
రేపు తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
హైదరాబాద్: తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అన్ని ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుందని తెలిపారు. ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తామని రమాకాంత్ రెడ్డి చెప్పారు. కరీంనగర్ జిల్లా మంథని రెవిన్యూ డివిజన్లో మాత్రం ఉదయం 7 నుంచి 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. జెడ్పీటీసీకి తెలుపు రంగు, MPTC గులాబి రంగు బ్యాలెట్ పత్రాలను వాడనున్నట్టు రమాకాంత్ రెడ్డి చెప్పారు. 6,370 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి 95,031 మంది పోలీసులను మోహరించినట్టు తెలిపారు. -
ఏకపక్షం
సాక్షి ప్రతినిధి, కడప, ఎన్నికలు ఏవైనా సరే ప్రజల లక్ష్యం ఒక్కటే. పార్టీ రహిత ఎన్నికలైనా, పార్టీ గుర్తులతో పోటీ చేసినా అంతిమ విజయం ప్రజాపక్షానిదేనని రుజువు చేస్తున్నారు. ప్రజానీకానికి అండదండగా నిలుస్తున్న వారికే పట్టం కడుతున్నారు. వరుసగా విజయాలను అప్పగిస్తూ ఏకపక్ష తీర్పుకు మొగ్గుచూపుతున్నారు. మూడేళ్లుగా జిల్లాలో చోటు చేసుకున్న ప్రతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీకే అండగా ఫలితాలు నిలుస్తున్నాయి. జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అదే ఊపు కన్పిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. జిల్లాలో 2011 నుంచి ప్రత్యక్ష ఎన్నికలు ఏవైనా అంతిమ విజయం వైఎస్సార్‌సీపీదేనని ఫలితాలు రుజువు చేస్తున్నాయి. 2011 మేనెల 8న కడప పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి 6,92,251 ఓట్లు లభించాయి. ప్రత్యర్థుల కంటే అత్యధికంగా 5,45,672 ఓట్ల మెజార్టీని కడప పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఓటర్లు కట్టబెట్టారు. 2012 మే12న చోటు చేసుకున్న ఉప ఎన్నికల్లో కూడా జిల్లా ప్రజలు వైఎస్సార్సీపీ కి అండగా నిలిచారు. రాయచోటిలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గడికోట శ్రీకాంత్‌రెడ్డికి 56,891 ఓట్ల మెజార్టీ సమకూరింది. రైల్వేకోడూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కొరముట్ల శ్రీనివాసులుకు 31,991 ఓట్ల మెజార్టీ లభించింది. రాజంపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆకేపాటికి 38,732 ఓట్ల మెజార్టీ దక్కింది. ఉప ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సహకార, పంచాయితీ ఎన్నికల్లోనూ... ఎన్నికలు ఏవైనా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబానికి అండగా నిల్చిన వ్యక్తులకే ఓటర్లు మద్దతు పలుకుతున్నారు. అందుకు సహకార సంఘాలు, పంచాయితీ ఎన్నికలు దర్పం పడుతున్నాయి. జిల్లాలో 77 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించగా 57 పాలక మండళ్లను వైఎస్సార్సీపీ మద్దతు దారులు దక్కించుకున్నారు. తద్వారా డీసీసీబీ, డీసీఎంఎస్ పీఠాలు వైఎస్సార్సీపీ నేతలకు దక్కాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పంచాయితీ ఎన్నికల్లో సైతం ఆపార్టీ మద్దతుదారులు విజయబావుటా ఎగురవేశారు. 783 పంచాయితీలకు ఎన్నికలు నిర్వహిస్తే అందులో 453 సర్పంచ్ స్థానాలను వైఎస్సార్సీపీ మద్దతుదారులు దక్కించుకున్నారు. 152చోట్ల కాంగ్రెస్ పార్టీ వర్గీయులు, 143 స్థానాలను తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీకి అండగా ప్రజానీకం నిలిచినట్లు తెలుస్తోంది. కడప కార్పొరేషన్‌తో బాటు, పులివెందుల, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాయచోటి, బద్వేలు మున్సిపాలిటీలను కైవ సం చేసుకోనున్నట్లు విశ్లేషకులు అంచనాకు వచ్చారు. మైదుకూరు మున్సిపాలిటీలో మాత్రమే నువ్వానేనా అన్నట్లుగా పోటీ ఉందని అభిప్రాయ పడుతున్నారు. జిల్లాలో ఎన్నికలు అంటే వైఎస్సార్సీపీ నేతలదే విజయం అన్నట్లుగా ప్రజానీకం తీర్పు కట్టబెడుతున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం... ఇప్పటి వరకూ ఏకపక్ష తీర్పును కట్టబె డుతున్న ప్రజానీకం మరోమారు జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అంతే ఉత్సాహాన్ని ప్రదర్శించనున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఏకగ్రీవంగా 24 ఎంపీటీసీలు ఎంపికైతే 16చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు, ఒక చోట ఆపార్టీ సానుభూతి పరుడు స్వతంత్రుడుగాను ఎంపికయ్యారు. 6 స్థానాలను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దక్కించుకోగా, రైల్వేకోడూరు మండలంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని దక్కించుకోగల్గింది. ఆదివారం జిల్లాలో తొలివిడతగా 29 మండలాల్లో ఎన్నికలు చోటుచేసుకోనున్నాయి. అందులో 80శాతం జెడ్పీటీసీలు వైఎస్సార్సీపీ అభ్యర్థులకు దక్కనున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. ఓటరు నాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఉందని, ఈపరిస్థితుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఆపార్టీ విజయఢంకా మోగించనున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడమే మినహా అధికారిక పగ్గాలు చేజిక్కించుకోలేకున్నామనే బెంగ తెలుగుదేశం పార్టీ నేతలకు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లోనైనా సత్తా చాటుదామనుకుంటే పాచికలు పారడంలేదని ఆపార్టీ సీనియర్ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. -
బేరసారాలు
సాక్షి, కడప : స్థానిక సమరం కీలక దశకు చేరుకుంది. శుక్రవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. దీంతో అభ్యర్థులు తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బేరసారాలు, ప్రలోభాల పర్వానికి శ్రీకారం చుట్టారు. ఆయా ప్రాంతాలను బట్టి ఓటుకు రేటును నిర్ణయిస్తున్నారు. మీ ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయి అంటూ గుంపగుత్తగా బేరం సాగిస్తున్నారు. మద్యంను విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. ఓటర్లకు తాయిలాలు చూపెట్టి గాలం వేసేందుకు పన్నాగం పన్నుతున్నారు. సకల మర్యాదలతో మచ్చిక చేసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా అస్త్ర శస్త్రాలను సంధిస్తున్నారు. గెలువలేమనే ప్రాంతంలో కొన్నిచోట్ల ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఎన్నికలు జరిగే ప్రాంతాలివే! మొదటి విడతలో మైదుకూరు, బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాల్లోని 29 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 326 ఎంపీటీసీ స్థానాలు, 29 జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1088 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఓటుకు రూ. 200 నుంచి రూ. 300 వరకు ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థులను బట్టి ఇంకా ఎక్కువ మొత్తాన్ని కొన్నిచోట్ల ఇస్తున్నారు. రైల్వేకోడూరు మండలం మినహా మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై పరువు కోసం పాకులాడుతున్నాయి. బద్వేలు నియోజకవర్గంలో ఓటు రూ. 300 నుంచి రూ. 500 పలుకుతోంది. బలహీనంగా ఉన్న మండలాల్లో ఓటుకు రూ. 1000 కూడా ఇచ్చి పరువు నిలుపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రాజంపేట నియోజకవర్గంలో ఇటీవల ఓ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మారిన నేత స్థానిక ఎన్నికల్లో పట్టు నిలుపుకోకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ రాదేమోనని విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తూ ఉనికి కోసం పాట్లు పడుతున్నారు. ఓటుకు రూ. 500కు పైగా ఇస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. మైదుకూరు నియోజకవర్గంలో సైతం ఓటుకు రూ. 300 నుంచి రూ. 500 ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కొన్ని ఎంపీటీసీ స్థానాల్లో ఓటు రూ. 1000-1500 పలుకుతున్నట్లు సమాచారం. మొత్తం మీద మొదటి విడత స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రజాబలంతో ముందుకు దూసుకు వెళుతుండగా, టీడీపీ కేవలం డబ్బు మీద ఆధారపడి ఎన్నికల్లో పరువు నిలుపుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. -
ప్రచారం బంద్
సాక్షి,నెల్లూరు: తొలివిడత పరిషత్ ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో ప్రచారానికి శుక్రవారంతో తెరపడింది. మరోవైపు ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమానికి తెరలేచింది. మద్యం, డబ్బు పంపిణీ ఊపందుకుంది. విజయమే లక్ష్యంగా అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలతో అడ్డదారులు తొక్కుతున్నాయి. మొత్తంగా పరిషత్ ఎన్నికల ఘట్టం కీలక దశకు చేరుకుంది. తొలివిడతలో భాగంగా జిల్లాలోని 21 మండలాల్లో ఎన్నికలు ఈ నెల 6న జరగనున్నాయి. 911 పోలింగ్ కేంద్రాల పరిధిలో 7,04,671 మంది గ్రామీణ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. విజయమే లక్ష్యంగా.. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరలేపారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచే మద్యం పంపిణీ షురూ చేశారు. ఓటు కు రూ.500 నుంచి రూ.2 వేల వరకూ వెచ్చిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కుటుంబాలనే పెద్ద మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. కనీసం 10 నుంచి ఆ పైన ఓటర్లను ప్రభావితం చేయగలిగే నేతలను మరింత మచ్చిక చేసుకుని పెద్ద మొత్తం వెచ్చించి వారిని కొనుగోలు చేస్తున్నారు. ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ఈ మొత్తం రెండు మూడు రె ట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. యువకులకు క్రికెట్ కిట్లు, మహిళలకు చీరలు, తదితర వస్తువులను సైతం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రానికి అధికారికంగా ప్రచారం ముగియడంతో పల్లెల్లో చీకటి రాజకీయాలు జోరందుకున్నాయి. రాత్రి పొద్దుపోయాక గుట్టు చప్పుడు కాకుండా డబ్బు పంపిణీ కార్యక్రమాన్ని కానిచ్చేస్తున్నారు. అభ్యర్థులు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడడంలేదు. సరాసరి ఒక్కొక ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి రూ.25 లక్షలు తగ్గకుండా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జనరల్ కేటగిరీకి కేటాయించిన జెడ్పీటీసీ స్థానాల్లో కోట్లలోనే ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ప్రధాన పార్టీల నేతలు పల్లెల్లో మకాం వేసి ఓటర్లను ప్రభావితం చేసే పనిలో నిమగ్నమయ్యారు. శనివారం సాయంత్రానికి ప్రలోభాల పర్వం మరింత జోరందుకోనుంది. మద్యం ఏరులై పారుతోంది. నిబంధనలను ఎక్కడా పాటిస్తున్న దాఖలాలు కానరావడంలేదు. ఇక జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పారీ అభ్యర్థ్టుల విజయాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు పన్ని అందుకు అవసరమైన అడ్డదారులన్నీ తొక్కుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులెవరూ ముందుకు రాని పరిస్థితి. దీంతో టీడీపీతో కుమ్మక్కై వైఎస్సార్సీపీకి అడ్డుకట్ట వేయాలని ఆ పార్టీ నేతలు టీడీపీతో చీకటి ఒప్పందాలకు దిగారు. చాలా ప్రాంతాల్లో ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. కాంగ్రెస్,టీడీపీలకు బుద్ధి చెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నది పరిశీలకుల అభిప్రాయం. -
హింసకు పాల్పడితే కాల్పులే!
కర్నూలు, న్యూస్‌లైన్: స్థానిక ఎన్నికల్లో హింసకు పాల్పడేవారిపై నేరుగా కాల్పులు జరిపేందుకు పోలీసులకు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారం గడువు ముగిసింది. కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 35 మండలాల్లో ఈనెల 6వ తేది మొదటి విడత పోలింగ్ జరగనుంది. రెండో విడత 11వ తేదీ ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని 19 మండలాల పరిధిలో పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తే అలాంటి వారిపై అన్‌లాఫుల్ యాక్టివిటీస్(ప్రివెన్షన్ యాక్ట్ 1967, (2008 సవరణ)) చట్టం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు లేదా ఓటర్లను బెదిరించి వారి ఓటు హక్కుకు భంగం కలిగించేవారిపై ఇటీవల సవరించిన ఎస్సీ, ఎస్టీ నివారణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని ఎస్పీ రఘురామిరెడ్డి క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు. విధి నిర్వహణలో ఉండే సిబ్బందిపై దాడులకు పాల్పడటం, బల ప్రయోగం ద్వారా దాడి చేయడం, హత్యాయత్నానికి పాల్పడటం వంటి సంఘటనలను తీవ్రంగా పరిగణించాలని ఆదేశాలిచ్చారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై తీవ్రవాద కార్యకలాపాలు, దేశ ద్రోహులు, ఉగ్రవాదులు, నక్సలైట్లు తదితర సంఘ విద్రోహ శక్తులపై ఉపయోగించే అన్‌లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ 1967 చట్టం ప్రకారం సెక్షన్ 15(బి) రెడ్ విత్ 16(బి) కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ కేసుల్లో నేరం రుజువైతే సాధారణ శిక్షలతో పోలిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి. జీవిత ఖైదు శిక్షను కూడా కోర్టు విధించే అవకాశం ఉంటుందని ఎస్పీ తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, పత్రాలు ఎత్తుకుపోవడం, ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం వంటి ఘటనలను పోలీస్‌శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. రంగంలోకి షాడోపార్టీలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌కు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో జిల్లా కేంద్రం నుంచి పారా మిలిటరీ బలగాలు మండలాలకు చేరుకున్నాయి. సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ సిబ్బంది సేవలను ఎన్నికల బందోబస్తుకు వినియోగిస్తున్నారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 57 మంది సీఐలు, 170 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, 776 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 2686 మంది కానిస్టేబుళ్లు, 880 మంది హోంగార్డులు, ఏపీఎస్పీ 8 ప్లటూన్లతో రిటైర్డ్ సీఆర్పీఎఫ్, సైనిక పోలీసు అధికారులను ఎన్నికల బందోబస్తు విధులకు నియమించారు. స్పెషల్ స్ట్రయికింగ్, స్ట్రయికింగ్ ఫోర్స్‌తో పాటు షాడో పార్టీలను ఇప్పటికే రంగంలోకి దింపారు. జిల్లాలో మొత్తం 1183 మంది లెసైన్స్ కలిగిన ఆయుధాలుండగా, బ్యాంకులకు రక్షణగా ఉపయోగించే తుపాకులు మినహాయింపు ఇప్పటి వరకు 1104 ఆయుధాలను జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్డ్ హెడ్ క్వార్టర్స్‌తో పాటు ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్లు చేసే విధంగా చర్యలు చేపట్టారు. -
రేపు తొలి విడత ‘స్థానిక’ పోరు
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 6వ తేదీన పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. కర్నూలు, నంద్యాల డివిజన్లలోని 36 మండలాల్లో 36 జెడ్పీటీసీ, 512 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. మొత్తం 2,434 పోలింగ్ కేంద్రాల్లో 162 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో 400 మంది ఇంజనీరింగ్ విద్యార్థులచే వెబ్‌క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పరిశీలనకు 400 మంది సూక్ష్మ పరిశీలనకులను నియమించారు. ఎన్నికలు జరగనున్న మండలాలకు ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను, బ్యాలెట్ పేపర్లను అవసరమైన మేరకు తరలించారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణనిచ్చారు. ఇకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపోటములను మహిళా ఓటర్లే నిర్దేశించనున్నారు. మార్చి 10, 2014 నాటి కి సేకరించిన లెక్కల ప్రకారం జిల్లాలో గ్రామీణ ఓటర్లు 20,21,330 మంది కాగా.. పురుషులు 10,05,352, మహిళలు 10,15,976 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు మహిళా ఓటర్లపైనే అత్యధికంగా దృష్టి సారించారు. -
రేపే తొలి విడత
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలి విడత ఎన్నికల ప్రచారానికి శుక్రవారం తెరపడింది. పెద్దపల్లి, మంథని, జగిత్యాల డివిజన్లలోని 30 జెడ్పీటీసీ, 409 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 6న పోలింగ్ జరగనుంది. ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ జరగనుంది. శుక్రవారం సాయంత్రమే ప్రచారానికి తెరపడడంతో ఓటర్లకు గాలం వేయడంలో అభ్యర్థులు బిజీ అయ్యారు. యువజన సంఘాలు, మహిళా సంఘాలు, కుల సంఘాల వారీగా రాత్రి నుంచే ప్రత్యేక సమావేశాలు గుట్టుగా నిర్వహిస్తున్నారు. పార్టీల అభ్యర్థుల తరఫున ఇప్పటికే ప్రధాన నాయకులు జిల్లా అంతటా ప్రచారం సాగించారు. ఎక్కడి ఎమ్మెల్యేలు అక్కడే తమ అభ్యర్థుల తరఫున ఊరూరూ తిరిగారు. టీఆర్ఎస్ అభ్యర్థుల పక్షాన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మంథని, వెల్గటూరు, కథలాపూర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ను ఎండగడుతూ ఆమె ప్రచారం సాగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో పాటు స్థానికంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందనే అంశానికే ప్రచారంలో వారు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. సీట్ల అవగాహనతో పోటీ చేసిన బీజేపీ, టీడీపీ నేతలు ప్రాదేశిక ఎన్నికలను పెద్దగా పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరపున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రచారం చేపట్టారు. కీలకస్థానాలు ఇక్కడే.. తొలివిడత ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం పై గురిపెట్టిన అభ్యర్థుల స్థానాలే ఎక్కువగా ఉన్నాయి. తొలిసారి జెడ్పీ చైర్పర్సన్ పదవి మహిళకు రిజర్వ్ కావడంతో, కాంగ్రెస్, టీఆర్ఎస్ల నుంచి మహిళా నాయకులు, నేతల భార్యలు బరిలోకి దిగారు. ఆయా పార్టీలు అధికారికంగా చైర్పర్సన్ అభ్యర్థులను ప్రకటించకున్నా, టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీర్ల వెంకటేశ్వర్రావు భార్య వీర్ల కవిత, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కొడూరి సత్యనారాయణగౌడ్ భార్య కోడూరి అరుణ ప్రచారంలో ఉన్నారు. తుల ఉమ కథలాపూర్ నుంచి పోటీలో ఉండగా, వీర్ల కవిత రామడుగు నుంచి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ ముఖ్యనేతల ఆశీస్సులు తమకే ఉన్నాయనే భరోసాతో ఇద్దరూ ప్రచార బరిలో దూసుకుపోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్ భార్య కోడూరి అరుణ గంగాధర స్థానం నుంచి పోటీలో ఉన్నారు. గతంలో కరీంనగర్ మేయర్ విషయంలో తనకు అన్యాయం జరిగినందున ఈ సారి జెడ్పీ చైర్పర్సన్ స్థానం తమకే దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. పార్టీ ప్రధాన నాయకుల హామీతోనే పోటీకి దిగినట్లు శ్రేణులు చెబుతున్నాయి. చైర్పర్సన్ అభ్యర్థులు సొంత పార్టీలతోపాటు ఇతర పార్టీల నేతలను, ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా మచ్చిక చేసుకొనే పనిలో పడ్డారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో అవసరం పడతారనే ముందుచూపుతో ఇప్పటినుంచే మంతనాలు సాగిస్తున్నారు. -
తొలి విడత సమరానికి పటిష్ట బందోబస్తు
విజయనగరం లీగల్, న్యూస్‌లైన్ : జిల్లాలో తొలి విడతగా పార్వతీపురం రెవెన్యూ డివిజన్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఎన్నికల విధులకు సంబంధించి ఎన్నికల సిబ్బందితో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల సమరంలో ఆదివారం జరగనున్న తొలి విడత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలు సూచనలు చేశారు. పోలింగ్ రోజున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేసి ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా పోలింగ్ జరిగేందుకు కృషి చేయూలన్నారు. తొలి విడతగా పార్వతీపురం రెవెన్యూ డివిజన్లో ఆదివారం 230 ఎంపీటీసీలకు, 15 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 108 రూట్ మొబైల్‌లు, 20 స్ట్రైకింగ్ ఫోర్సులు, 15 స్పెషల్ స్ట్రైకింగ్ పారుుంట్ల బందోబస్తుతో అదనపు పోలీసు బలగాలు కలిపి సుమారు మూడు వేల మంది విధుల్లో పాల్గొననున్నట్టు చెప్పారు. ఇప్పటికే చెక్‌పోస్టులు, వాహనాల తనిఖీల ద్వారా అక్రమ మద్యం, నగదు రవాణాను అడ్డుకోగలిగామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కోటీ 51 లక్షల 56 వేల 390 రూపాయల నగదు, 4088 మద్యం బాటిళ్లను, వాటిని తరలించే ఎనిమిది వాహానాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 478 లెసైన్స్డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, 13,245 మందిపై ముందస్తు చర్యగా బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఓటర్లు కింది నిబంధనలు పాటించాలని సూచించారు. ఓటు హక్కు కలిగిన ప్రతీ ఒక్కరి వద్ద తగిన గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఎలాంటి వివాదాలకు పాల్పడినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక, ముఖ్యమై న పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ విధానం ద్వారా ఓటింగ్ సరళిని చిత్రీకరిస్తాం. ఓటర్లు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే పుటేజీ ద్వారా గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక వీడియో కెమెరాల ద్వారా పోలింగ్ తీరును చిత్రీకరించటం జరుగుతుంది. ఓటర్లు ఓటుహక్కును వినియోగించే సమయంలో క్యూలైన్ పాటించాలి. ఓటింగ్ జరిగే ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా ఉండరాదు. ఓటింగ్ జరిగే ప్రాంతాల్లో మఫ్టీలో పోలీసు లు గస్తీ నిర్వహిస్తారని, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచటం జరుగుతుంది. నగదు, మద్యం వంటివి పంపిణీ చేస్తూ పట్టుబడితే, అటువంటి వారిపై నాన్బెయిల్తో పాటు కేసులు నమోదు చేయటం జరుగుతుం ది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఏదైనా సమాచారం అందించాలంటే 9440904730 సెల్ నంబరుకుగానీ 08922-226927 ఫోన్ నంబరుకు గాని తెలియజేయాల న్నారు. ప్రజలు పై విషయాలను గమనించి పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు -
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
రెంజల్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా గురువారం మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన పలు గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..గతంలో టీడీపీ పాలనను స్వ యంగా చూశామన్నారు. ఒకరు చస్తేనే మరొకరికి పింఛన్ ఇచ్చే సాంప్రదాయం ఉండేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను తీర్చేం దుకు అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, రైతులకు మద్దతు ధర, జలయజ్ఞం, పింఛన్లు పెంచడం తదితర పథకాలతో అనేక వర్గాల ప్రజలకు కాంగ్రెస్ లబ్ధిచేకూర్చిందని వివరించారు. ప్రజలు అభివృద్ధి చేసే పార్టీలనే ఆదరించాలని సూచించారు. 40 ఏళ్లుగా లేని మెడికల్ కళాశాలను మీ దయ వల్ల మంజూరు చేయించినట్లు తెలిపారు. అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా చివరి ఆయకట్టు గ్రామాల వరకు సాగు నీరందిస్తున్నట్లు తెలిపారు.కందకుర్తి ఎత్తిపోతలను జూలై వరకు పూర్తిచేయిస్తామన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం వల్లే అనేక రకాల పథకాలు వచ్చాయన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోని యా గాంధీ వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. తెలంగాణ పునర్మిర్మాణం కాంగ్రెస్‌తోనే జరుగుతుందన్నారు. తాను అవినీతికి అవకాశం ఇవ్వకుండా అధికారులతో పనులు చేయించానని అన్నారు. గ్రామాల్లో చిన్న సమస్యలు స్థానిక నాయకులు పరిష్కరించుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను విడతల వారీగా పరిష్కరించినట్లు తెలిపారు. కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న అభ్యర్థులను గెలిపిం చాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి నాగభూషణంరెడ్డి, సర్పంచ్‌లు సవిత, జావిద్, పోశెట్టి,ఆయా గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మహిళలే ‘కీ’లకం
నల్లగొండ, న్యూస్‌లైన్: ఈనెల 6, 11వ తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో మహిళా ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. వారు ఎటు మొగ్గు చూపుతారో ఆ పార్టీ అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకగా మారనుంది. పురుష, స్త్రీ ఓటర్ల నిష్పత్తిని చూస్తే ఈ విషయం అవగతమవుతోంది. ప్రాదేశిక ఎన్నికల్లో ఓటర్లు జిల్లా వ్యాప్తంగా 2 0,77, 581 మంది ఉండగా వీరిలో పురుషులు 10,45,068, మహిళలు 10,32,493 మంది ఉన్నారు. ఇతరులు 20 మంది ఉన్నారు. అత్యధికం.. అత్యల్పం జిల్లాలోని 59 మండలాలకుగాను మేళ్లచెర్వు మండలంలో అత్యధికంగా 54,048 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో చౌటుప్పల్(49,605), గరిడేపల్లి(38,576), నేరేడుచర్ల(48,978) మండలాలు ఉన్నాయి. అత్యల్పంగా హుజూర్నగర్ మండలంలో 18,513, తుర్కపల్లిలో 23,505 మంది ఉన్నారు. 18 మండలాల్లో ప్రభావితం జిల్లాలో 18 మండలాల్లో మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆయా మండలాల్లో అన్ని రాజకీయ పార్టీలకు మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. ఈ స్థానాల్లో మహిళలకు రిజర్వ్ అయిన వాటితో పాటు జనరల్ మహిళ, జనరల్ స్థానాలు ఉన్నాయి. జనరల్ మహిళల స్థానాల్లో ప్రధాన పార్టీల నాయకుల సతీమణులు ఎంపీపీ అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. మిగిలిన స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రిజర్వు చేశారు. ఆయా పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్ల మద్దతు పొందితే తప్ప.. లేకుంటే వారి గెలుపు నల్లేరు మీద నడక కాదని తెలుస్తోంది. జెడ్పీటీసీ స్థానాల్లో.. మేళ్లచెర్వు, మఠంపల్లి, నాంపల్లి, పీఏ పల్లి జెడ్పీటీసీ స్థానాలు జనరల్ మహిళలకు, చిలుకూరు ఎస్టీ జనరల్, గరిడేపల్లి, మునగాల, నడిగూడెం, పెన్‌పహాడ్ స్థానాలను బీసీ జనరల్‌కు కేటాయించారు. మిగిలిన 9 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిజర్వు చేశారు. అయితే జనరల్ స్థానాల్లో పురుషులు పోటీ చేస్తుండటంతో ఆ మండలాల్లో మహిళా ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో.. ఆ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎంపీపీ స్థానాల్లో పోటాపోటీ చిలుకూరు ఎంపీపీ స్థానం జనరల్‌కు రిజర్వ్ కాగా, కేతేపల్లి, మునగాల, నడిగూడెం, నాంపల్లి, వేములపల్లి స్థానాలు జనరల్ మహిళ, మేళ్లచెర్వు, పెన్‌పహాడ్ ఎస్టీ జనరల్, సూర్యాపేట, పీఏపల్లి బీసీ జనరల్‌కు కేటాయించారు. మిగిలిన 8 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిజర్వు చేశారు. ఎస్టీ, బీసీ జనరల్ స్థానాలను మినహాయిస్తే మిగిలిన స్థానాల్లో మహిళా అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగానే ఉండనుంది. వీరిలో మహిళా ఓటర్లను ఆకర్షించిన వారికే గెలుపు సునాయసం కానుంది.