12న విజయమ్మ పర్యటన | on 12th vijayamma tour | Sakshi
Sakshi News home page

12న విజయమ్మ పర్యటన

Published Thu, Apr 10 2014 1:32 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

on 12th vijayamma tour

ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండోదశ
ఎన్నికల నేపథ్యంలో వాయిదా
రెవెన్యూ, పోలీసు అధికారుల సూచన మేరకు నిర్ణయం

 
 సాక్షి, గుంటూరు: నేటి నుంచి జిల్లాలో జరగవలసిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, జిల్లాపార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు.

ఈ నెల 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో దశ ఎన్నికలు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 11న జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ, పోలీస్ అధికారుల సూచన మేరకు పర్యటన వాయిదా వేసినట్టు వారు తెలిపారు.

ఈ నెల 12వ తేదీ నుంచి  వైఎస్. విజయమ్మ పర్యటన జిల్లాలో ప్రకటించిన షెడ్యూల్ మేరకు యథావిధిగా జరుగుతుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement