
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు మదనపల్లె, పలమనేరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల ఎన్నికల ఓట్ల లెక్కిం పునకు సంబంధించి పూతలపట్టు మండలంలోని వేము ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశా రు. అలాగే పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.రాంగోపాల్‌తో పాటు జిల్లా ఎస్పీ రామకృష్ణ పరిశీలించారు.
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం
సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అంతకుముందు అభ్యర్థుల సమక్షంలో ఉదయం 7.30 గంటలకు ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూంలను తెరవనున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 11 గంటలలోపు పూర్తి చేయడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.
తొలుత పుంగనూరు ఫలితాలు
మొదట పుంగనూరు మున్సిపల్ ఫలితం వెల్లడి కానుంది. ఈ మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి. 22వ వార్డు వైఎస్సార్ సీపీకి ఏకగ్రీవం అయింది. దీంతో 23 వార్డులకు ఎన్నికలు జరి గాయి. ఈ మున్సిపాలిటీలోని ఓట్ల లెక్కింపు కోసం అధికారులు 8 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 3 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో ఈ మున్సిపాలిటీ ఫలితం మొద ట వెలువడే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన మున్సిపాలిటీల విషయానికి వస్తే మదనపల్లె మున్సిపాలిటీలో 35 వార్డులు ఉండగా, 16వ వార్డు స్వతంత్ర అభ్యర్థికి ఏకగ్రీవం అయింది. 34 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కోసం 12 టేబుళ్లు ఏర్పాటు చేసి మూడు రౌం డ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో 35 వార్డుల్లోని ఓట్ల లెక్కింపుకుగాను 7 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఐదు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుం ది. పలమనేరులోని 24 వార్డుల ఓట్ల లెక్కింపునకు 6 టేబుళ్లు ఏర్పాటు చేశారు.
నాలుగు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. నగరి మున్సిపాలిటీలో 27 వార్డుల ఓట్ల లెక్కింపునకు 7 టేబుళ్లు ఏర్పాటు చేశా రు. 4 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. పుత్తూరు మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను 6 టేబుళ్లు ఏర్పాటు చేశారు. నాలుగు రౌండ్లలో ఓట్ల లెక్కిం పు పూర్తవుతుంది. చివరిగా చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలోని ఓట్ల లెక్కింపు కోసం 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. రౌండ్‌కు 10 డివిజన్లు చెప్పున ఐదు రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి.
అభ్యర్థితో పాటు ఇద్దరు ఏజెంట్లకు అనుమతి
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఆయా డివి జన్లు, వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థితో పాటు ఇద్దరు ఏజెంట్లను అనమతించనున్నారు. వీరు ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకుని ద్రువీకరణ పత్రాలు పొందాలి. అయితే ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థి లేదా ఏజెంట్లలో ఒకరిని మాత్రమే కేంద్రం లోకి అనుమతిస్తారు. వారి డివిజన్, వార్డుకు సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే సంబంధిత అభ్యర్థి, ఏజెంట్లు వెలుపలికి రావాల్సి ఉంది.
కమిషనర్లచే డిక్లరేషన్
ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్లచే ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. వాస్తవానికి వీటిని ఆయా డివి జన్ల రిటర్నింగ్ అధికారులు ఇవ్వాల్సి ఉన్నా ఓట్ల లెక్కింపు సౌలభ్యంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్ట ర్ కె.రాంగోపాల్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పోలీసు బందోబస్తు
ఓట్ల లెక్కింపు కేంద్రమైన వేము ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల పోలీసులతో పాటు పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపారు. పోలింగ్ కేంద్రం నుంచి నిర్ధారిత ప్రాంతం వరకు 144 సెక్షన్ విధించారు.