రెండు గంటల్లో ‘పుర’ ఫలితాలు | elections results with in two hours | Sakshi
Sakshi News home page

రెండు గంటల్లో ‘పుర’ ఫలితాలు

Published Mon, May 12 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM

రెండు గంటల్లో ‘పుర’ ఫలితాలు

రెండు గంటల్లో ‘పుర’ ఫలితాలు

 కలెక్టరేట్, న్యూస్‌లైన్: మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను వెల్లడించారు. సోమవారం మునిసిపల్, 13న జరిగే ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపనకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. మునిసిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించినందున ఫలితాలు రెండు గంటల్లోపు తెలిసే అవకాశం ఉందన్నారు.

జిల్లాలోని మహబూబాబాద్, జనగామ, మునిసిపాలిటీలతోపాటు భూపాలపల్లి, నర్సపేట, పరకాల నగర పంచాయతీలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కేంద్రంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో చేపట్టనున్నట్లు వివరించారు. ఈ మేరకు అకాడమిక్ భవనంలో అన్ని రకాలు ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారులు శ్రీధర్, జగన్మోహన్‌రావులను ఎన్నికల సంఘం నియమించినట్లు వెల్లడించారు. వీరితోపాటు ఐదుగురు కౌంటింగ్ పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కోసం 109 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చి విధులు కేటాచించామన్నారు.
 
 13న ప్రాదేశిక ఓట్ల లెక్కింపు

 ఈనెల 13న నిర్వహించనున్న ప్రాదేశిక ఓట్ల లెక్కింపునకు సైతం ఏర్పాట్లు పూర్తయ్యూయని కలెక్టర్ తెలిపారు. ఐదు రెవెన్యూ డివిజన్లలోని 50 జెడ్పీటీసీ, 701 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వివరించారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. నర్సింహులపేట మండలం రేపోణి, స్టేషన్‌ఘన్‌పూర్‌మండలం నిడిగొండ, హసన్‌పర్తి మండలం సిద్దాపూర్, కురవి మండలం మొగిలిచ్ల ఎంపీటీసీలు ఏక గ్రీవమైనట్లు గుర్తు చేశారు.
 
 సెల్‌ఫోన్లు నిషేధం
 కౌంటింగ్ హాలులోకి ఆర్‌ఓలు మినహా ఇతర ఉద్యోగులు, పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు సెల్‌ఫోన్లు, పాన్, సిగరెట్, గుట్కాలు తీసుకె ళ్లడం నిషేధమని కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలన కు ఏడుగురు పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. వీరిలో పరకాలకు ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావు, ములుగుకు మైనార్టీ సంక్షేమ శాఖ డీడీ ఎన్.భాగ్యమ్మ, వరంగల్‌కు ఏజేసీ కృష్ణారెడ్డి, జనగామకు డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, మహబూబాబాద్‌కు యూఎల్‌సీ జాన్‌వెస్లీ, కె.కృష్ణవేణి, నర్సం పేటకు ఎస్‌డీసీ డేవిడ్‌ను నియమించామన్నారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశామన్నా రు. ఐదు కంపెనీల ఏపీఎస్పీ బలగాలు ఉన్నాయని పే ర్కొన్నారు. 30పోలీస్‌చట్టం, 144 సెక్షన్ అమల్లో ఉంటుం దని చెప్పారు. సమావేశ ంలో జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, అడిషనల్ ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.
 
 రైతాంగాన్ని ఆదుకుంటాం...
 జిల్లాలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అదుకుంటామని కలెక్టర్ తెలిపారు. పంటనష్టంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ స్పందించారు. జిల్లాలో 5,546 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. తడిసిన ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించే విధంగా ఐకేపీ ద్వారా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. మార్కెట్ యార్డుల్లో తడిసిన ధాన్యానికి భీమా చెల్లించేలా ఏర్పా ట్లు చేస్తున్నామన్నారు. ధాన్యం తడవకుండా స్థానికంగా పాఠశాల్లో నిల్వ చేసుకునేలా అవకాశం కల్పిస్తామని,  రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
 
 ప్రాదేశిక ఓట్ల లెక్కింపు కేంద్రాలు..
 డివిజన్    స్థలం
 వరంగల్    నిట్‌లో
 జనగామ    ప్రసాద్ ఇంజినీరింగ్ కళాశాల
 మహబూబాబాద్    ఏపీ మోడల్‌స్కూల్,
     ఫాతిమా స్కూల్
 పరకాల    గణపతి ఇంజినీరింగ్ కళాశాల
 ములుగు    ప్రభుత్వ డిగ్రీ కళాశాల
 నర్సంపేట    ప్రభుత్వ డిగ్రీ కళాశాల

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement