G.kishan
-
ఉద్యమంలా స్వచ్ఛ భారత్
విద్యారణ్యపురి : అన్ని పాఠశాలల్లోను స్వచ్ఛభారత్‌ను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని, సంకల్పమే ఆయుధంగా నిరంతరం దీనిని కొనసాగించాలని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. స్వచ్ఛభారత్ కోసం ఉపాధ్యాయులు కంకణబద్ధులు కావాలన్నారు. సోమవారం సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ఆధ్వర్యంలో హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, సీఆర్పీలు, డిప్యూటీ డీఈఓల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈనెల 14వతేదీ నుంచి 19వతేదీ వరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టలని పిలుపునిచ్చారు. జిల్లాలోని 4,807 పాఠశాలల్లో చదువుకుంటున్న ఐదు లక్షల మంది విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. స్వచ్ఛభారత్ తొలుత వ్యక్తిగతంగానే ప్రారంభం కావాల్సిన అవసరం ఉందన్నారు. కాలకృత్యాల్లాగే అదికూడ నిత్యకృత్యం కావాలన్నారు. వారానికి కనీసం రెండుగంటలు కేటాయించాలన్నారు. పనిష్మెంట్గా భావించొద్దు స్వచ్ఛభారత్‌లో విద్యార్థులను భాగస్వాములుగా చేస్తే దానిని వారు కార్పొరేట్ తరహా పనిష్మెంట్గా భావించకూడదని సూచించారు. జిల్లాలో 2.55లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా ఎవరూ సరిగా నిర్మించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఇళ్లలో మరుగుదొడ్లు ఉండేలా వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. ‘ఆసరా’కింద లబ్ధిపొందేవారి వద్ద కూడా సెల్ఫోన్లు ఉంటున్నాయని, కానీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా నిర్మించుకోవడం లేదన్నారు. విద్యార్థులకు తాగునీరు, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం వంటి అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు వాటిపై వారికి వ్యాసరచన, ఉపన్యాస పోటీలను ప్రతినెలా నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం పాఠశాల నిర్వహణ నిధుల నుంచి రూ.పదివేల వరకు ఖర్చు చేసుకోవచ్చన్నారు. గుడి కంటే బడి గొప్పది గుడి కంటే బడి ఎంతో గొప్పదని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ వై.బాలయ్య అన్నారు. బడిలో అన్ని కులాలు, మతాలకు చెందిన విద్యార్థులుంటారన్నారు. తాను కొన్ని పాఠశాలలను పర్యవేక్షించానని, కొన్నింటిలో పరిశుభ్రత పాటిస్తుండగా మరికొన్నింటిలో ఉపాధ్యాయులు అంతగా పట్టించుకోవడం లేదన్నారు. ముల్కలపల్లి పాఠశాలకు తాను తనిఖీకి వెళ్లినప్పుడు స్కూలు వరండాలోనే ఉపాధ్యాయులు తమ వాహనాలను పార్కింగ్ చేశారని, దీంతో అక్కడ అపరిశుభ్రత చోటుచేసుకుందన్నారు. దీంతో అక్కడి హెడ్మాస్టర్ను సస్పెండ్ చేశానన్నారు. ఉపాధ్యాయులు స్కూలుకు గంట ముందుగా వెళ్లి.. బడి ముగిశాక మరో గంట ఉండి పనిచేస్తే స్వచ్ఛభారత్ విజయవంతం అవడంతోపాటు బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. అందరినీ భాగస్వాములు చేయాలి హెచ్ఎంలు.. ఉపాధ్యాయులను, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను స్వచ్ఛభారత్‌లో భాగస్వాములుగా చేయాల్సిన అవసరం ఉందని ఏజేసీ కృష్ణారెడ్డి అన్నారు. 14వ తేదీన ప్రతి పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టాలని, 15న మధ్యాహ్న భోజనం వండే ప్రాంతంలో శుభ్రం చేయాలని, 17న వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, 18న తాగునీరు, 19న టాయిలెట్లను శుభ్రం చేసే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సభలో డిప్యూటీ డీఈఓ డి.వాసంతి అందరితో స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తీగలవేణి హెచ్ఎం మైస శ్రీనివాస్, కోయడ జెడ్పీఎస్ఎస్ హెచ్ఎం సుదర్శన్‌రెడ్డి, కంఠాయిపాలెం జెడ్పీఎస్ఎస్ హెచ్ఎం కృష్ణమూర్తి తమ పాఠశాలల్లోని సమస్యలను, చేపడుతున్న స్వచ్ఛభారత్ కార్యక్రమం గురించి వివరించారు. భీమారం జెడ్పీఎస్ఎస్ హెచ్ఎం సంధ్యశ్రీ తమ పాఠశాలలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్కూలుకు ప్రహరీ లేకపోవడంతో రాత్రివేళ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్ సమస్యలు పరిష్కరిస్తామని, ఇంకా ఏవైనా సమస్యలుంటే తనకు మెసేజ్ చేయాలంటూ తన మొబైల్ నంబర్ ఇచ్చారు. సభలో డిప్యూటీ ఎస్ఎస్ఏ అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ వి.మురళి, డిప్యూటీ డీఈఓలు రవీందర్‌రెడ్డి, కృష్ణమూర్తి, శ్రీరాములు మాట్లాడారు. -
రైతుల ఇంటికే అధికారులు
రుణమాఫీ విషయంలో ఇబ్బందులుండవు మాట వినని బ్యాంకుల విషయం ప్రభుత్వం దృష్టికి.. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు : కలెక్టర్ కిషన్ హన్మకొండ అర్బన్ : రైతులకు బ్యాంకుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటివద్దనే రుణమాఫీ, రెన్యూవల్‌కు సంబంధించి దరఖాస్తులపై వ్యవసాయ అధికారులు సంతకాలు తీసుకుం టారని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో రుణమాఫీ, ప్రభుత్వ పథకాల మంజూరు తదితర విషయాలను విలేకరుల సమావేశంలో వివరించారు. రుణమాఫీలో ప్రభుత్వం తొలివిడతగా 25శాతం జిల్లాకు రూ.472కోట్లు విడుదల చేసిందని, ఆ మొత్తా న్ని రైతుల వ్యక్తిగత ఖాతాల్లో జమచేయాలని బ్యాంకర్లను ఆదేశించినట్లు చెప్పారు. అయితే కొన్ని బ్యాంకులు రుణాల రెన్యూవల్ విషయంలో నిబంధనల పేరుతో రైతులను ఇబ్బం దులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిం దని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. ప్రస్తుతం రబీ సీజన్ ప్రారంభంలో ఉన్నందున బ్యాంకులకు తిరగడం ఇబ్బందిగా ఉంటుందని భావించి వ్యవసాయ అధికారులు నేరుగా రైతుల ఇంటికి వెళ్లి రుణా ల రెన్యూవల్ దరఖాస్తులపై సంతకాలు తీసుకుని పనులు పూర్తి చేస్తారని తెలిపారు. జిల్లా లో ఇప్పటివరకు 97వేల బ్యాంకు అకౌంట్లు మాత్రమే రైతులవి అందుబాటులో ఉన్నం దున వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నార ని, ఇంకా 22వేల ఖాతాల వివరాలు అందాల్సి ఉందని పేర్కొన్నారు. మితగావారు కూడా జన్‌ధన్ ఖాతాలు తెరిచి అధికారులకు వివరా లు ఇవ్వాలని కోరారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు ప్రస్తుతం ఆహార భద్రత కార్డులకోసం 9.65లక్షలు, పింఛన్లకోసం 5.81లక్షల దరఖాస్తులు అధికారులకు అందాయని కలెక్టర్ తెలిపారు. వాటి పరిశీలనకు ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేశామన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రజ లు ఆందోళన చెందవద్దని సూచించారు. 20వ తేదీ గడువు అయినప్పటికీ తరువాత కూడా మండల కార్యాలయాల్లో దర ఖాస్తులు స్వీకరి స్తారని చెప్పారు. దరఖాస్తుల పరిశీలనకు అధికారులు ఎప్పుడు వచ్చేది వార్డుల వారీగా తేదీలు ముందే ప్రకటిస్తారని, ఇంటివద్ద అం దుబాటులో ఉండి తగిన సమాచారం ఇవ్వాల ని కోరారు. సమగ్ర సర్వే సమయంలో పూర్తి వివరాలు ఇవ్వని వారు.. అసంపూర్తి సమాచా రం ఇచ్చిన వారు ప్రస్తుతం మార్చుకునే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా రశీదు ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఫాస్ట్ పథకానికి సంబంధించి కులం, నివాసం విషయంలో విధివిధానాలు వచ్చినప్పటికీ ఆదాయం విషయంలో ప్రభుత్వం నుంచి కొంత స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. అయితే ముందుగా దరఖాస్తులు తెల్ల కాగితాలపై ఇస్తే సరిపోతుందని తరువాత అధికారులే విచారణ జరిపి ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారని చెప్పారు. ఈవిషయంలో అధికారులకు మరోసారి స్పష్టమైన ఉత్తర్వులు ఇస్తామన్నారు. ఓటర్ల నమోదు.. జిల్లాలో నవంబర్ ఒకటిన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ ఉంటుందని, దానిని పరిశీలించి అభ్యంతరాలుంటే నవంబర్ 25వ తేదీలోగా సంబంధిత అధికారులకు దరఖాస్తు లు చేసుకోవాలని చెప్పారు. నవంబర్ 9, 16 తేదీల్లో బూత్‌లవారీగా జాబితాల ప్రదర్శన ఉంటుందని, డిసెంబర్ 25నాటికి డాటాఎంట్రీ పూర్తి చేసి జనవరి 5న తుదిజాబితా ప్రచురిస్తామని పేర్కొన్నారు. 18 సంవత్సరా లు నిండిన ప్రతి ఒక్కరూ జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశంలో డీఆర్వో సురేంద్రకరణ్, జేడీఏ రామారావు, డీఆర్డీఏ పీడీ శంకరయ్యతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చట్టం అమలుకు ప్రజలు కలిసి రావాలి
వరంగల్‌క్రైం : ప్రజా సంరక్షణ చట్టం అమలులో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ జి.కిషన్ పిలుపునిచ్చారు. ప్రజా సంరక్షణ చట్టం-2013పై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించేందుకు వరంగల్ అర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అర్బన్ పరిధిలోని మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, సినిమా హాల్స్, అపార్ట్మెంట్స్ యజమానులతోపాటు అర్బన్ పరిధికి చెందిన పలువురు వ్యాపారస్తులు హాజ రయ్యూరు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని వ్యాపార వర్గాలకు చెందిన వారు అక్టోబర్ 2వ తేదీలోపు తప్పకుండా సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. 2013లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన చట్టం విధివిధానాలకు సంబంధించి వరంగల్ అర్బన్ అదనపు ఎస్పీ యాదయ్య వివరిస్తూ దిల్‌సుఖ్‌నగర్‌లో ఉగ్రవాదులు పాల్పడిన రెండు బాంబు పేలుళ్లలో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయూరని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్పటి ప్రభుత్వం ప్రజాభద్రత చట్టం- 2013 ప్రవేశపెట్టిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో వివిధ ప్రైవేటు సంస్థలు, వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక, ఆస్పత్రులు, క్రీడాప్రాంగణాలు, రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లతోపాటు అపార్టుమెంట్లు, సమావేశ స్థలాలు తదితర ప్రదేశాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు, ప్రవేశ మార్గంలో తనిఖీ పరికరాలు(డోర్‌ఫ్రేమ్‌లు) ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ చట్టం అమలును అర్బన్ పరిధిలో మునిసిపల్ విభాగంకు చెందిన సిటీ ప్లానర్, ఆర్ఐతోపాటు సబ్ డివిజనల్ స్థాయి పోలీసు అధికారితో కూడిన కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే మెుదటి సారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు జరిమా నా విధిస్తారని, మూ డోసారి మాత్రం భవనాన్ని సీజ్ చేయనున్న ట్లు తెలిపారు. మునిసిపల్ కమిషనర్ సువర్ణ పాండాదాస్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ చట్టాన్ని అనుసరించి భవన నిర్మాణ అనుమతులను ఇస్తామన్నారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ ప్రజాసంరక్షణ బాధ్యత ఏ ఒక్కరికో సంబంధించిన అంశం అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ సమష్టి బాధ్యతగా గుర్తించాలని కోరారు. సదస్సులో వరంగల్ అర్బన్ పోలీస్ బాంబ్ డిస్పోజల్ విభాగం సిబ్బంది తమ పరికరాలను ప్రదర్శించారు. భద్రత కోసం చేపట్టే సాధనాలను ఉత్పత్తి చేసే పలు కంపెనీ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. భారీ స్క్రీన్‌పై సీసీ కెమెరాల ద్వారా రికార్డరుున నేరాల పుటేజీలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఓఎస్డీ నాగరాజు, వరంగల్, హన్మకొండ, కాజీపేట, మామునూరు, ఎస్బీ, ట్రాఫిక్, క్రైం డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
హన్మకొండ అర్బన్ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్ లో రహదారులు-భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్లు భవనాలు, జాతీయ రహదారులు, నగరపాలక సంస్థ అధికారులు సమన్వయం తో పనిచేయాలని సూచించారు. కరీంనగర్ నుంచి ఖమ్మం రోడ్డుకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తే నగరంలోకి భారీ వాహనాలు రాకుండా ఉంటాయని, ఇం దుకోసం పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. పార్కింగ్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, నగరంలో పెయిడ్ పార్కింగ్ స్థలాలు పరిశీలించాలని తెలిపారు. కాజీపేట నుంచి ఎంజీఎం వరకు బైక్‌లు, ఆటోలకు వేరువేరుగా లేన్లు ఏర్పాటు చేసి ప్ర యోగాత్మకంగా నడిపి ఫలితాలు గమనించాలని పే ర్కొన్నారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు మాట్లాడు తూ బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్ మాల్స్‌కు అనుమతులు ఇచ్చే ముందు పోలీస్ శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకోవాలని, భద్రతా చర్యలు పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలన్నారు. అనుమతులు ఇచ్చే వారికి భద్రతా చర్యల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. రూరల్ ఎస్పీ కాళిదాసు మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న రోడ్లవల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. డివైడర్లున్న చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. మునిసిపల్ కమిషనర్ పండాదాస్, డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్, విద్యుత్, ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలి
హన్మకొండ అర్బన్ : ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన లబ్దిదారులకు మాత్రమే అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దా ర్లు, ఇతర డివిజన్, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా భూ పంపిణీపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక గ్రామం ఎంపిక చేసుకుని ఆ గ్రామాల నుంచి 12మంది అబ్దిదారులను ఎంపిక చేసుకుని వారికి భూమి ఇచ్చేందుకు, ఆ భూమి అభివృద్ధి చేసి సాగు యోగ్యంగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చే యాలని కోరారు. ఇటీవల చేసిన సమగ్ర కు టుంబ సర్వేకు సంబంధించి డాటా ఎంట్రీ చేసేందుకు ఆపరేటర్లకు శిక్షణ పూర్తయిందని, ఆ ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. రుణ మాఫీ, కొత్త రుణాల మంజూరు తదితర అంశాలపై గ్రామా లు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహిం చి అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయాలని చెప్పారు. 25నుంచి 27 తేదీల మధ్య మండల స్థాయి సమావేశాలు పూర్తిచేయాలని, 29నాటికి అర్హుల జాబితా సిద్ధం చేయాలన్నారు. ‘ఇందిరమ్మ’ అక్రమాలపై దృష్టి 2004-2013 మధ్యలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించామని, ఇందులో మొత్తం 5,934 మంది నుంచి రూ.17.45లక్షలు రికవరీ చేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ కిషన్ తెలిపారు. ఇప్పటివరకు 1,913మంది నుంచి రూ.4.61లక్షలు మాత్రమే రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో తహసీల్దార్లు తక్షణం చర్యలు తీసుకోవాలని, బాధ్యులకు నోటీసులు జారీ చేసి ఆర్ఆర్ చట్టం ప్రకారం వసూలు చేయాలన్నారు. అదేవిధంగా వర్షాభావం వల్ల తాగునీటి సమస్య ఏర్పడిన ప్రాంతాల్లో ఆర్డీఓలు పర్యటించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చిట్యాల, ములుగు, మహబూబాబాద్ మండలాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నట్లు సమాచారం ఉందని, దీనిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యులు స్థానికంగా అందుబాటులో లేని విషయం తహసీల్దార్లు రిపోర్టు చేయాలని, ముఖ్యంగా రెడ్యాలకు ప్రత్యేక బృందం పంపి తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావు, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ ఇన్చార్జ్ పీడీ రాము, హౌసింగ్ పీడీ లక్ష్మణ్, వరంగల్ ఆర్డీఓ మాధవరావు పాల్గొన్నారు. -
వీరిటు.. వారటు
కలెక్టర్, జేసీ, ఇద్దరు ఎస్పీలు తెలంగాణకు.. ముగ్గురు డీఎఫ్ఓలు, ఒక ఓఎస్డీ ఇక్కడే... డీఐజీ కాంతారావు, కమిషనర్ పండాదాస్ ఆంధ్రప్రదేశ్‌కు.. సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. జిల్లాలో ముగ్గురు ఐఏఎస్ అధికారులుండగా... కేంద్ర ప్రభుత్వం ఒకరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది. నలుగురు ఐపీఎస్ అధికారులు ఉంటే... ఒక్కరిని ఆంధ్రప్రదేశ్‌కు అలాట్ చేసింది. ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులుండగా, వీరందరనీ తెలంగాణకే కే టాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన ఒక ఐఏఎస్, మరో ఐపీఎస్ సొంత రాష్ట్రం ఏపీ కావడం గమనార్హం. త్వరలోనే వీరికి కొత్త పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. జిల్లా కలెక్టర్ జి.కిషన్(2001) తెలంగాణకు ఆప్షన్ పెట్టుకున్నారు. కేంద్ర నిర్ణయం ప్రకారం కిషన్ తెలంగాణకే అలాట్ అయ్యారు. కిషన్ సొంతజిల్లా నల్లగొండ. జేసీ పౌసుమి బసు (2007) తెలంగాణకు ప్రాధాన్య మివ్వగా, కేంద్రం ఈమెను మన రాష్ట్రానికే కేటాయించింది. బసు సొంత రాష్ట్రం పశ్చిమబెంగాల్. వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ గొర్రె ల సువర్ణ పండాదాస్(2006) తెలంగాణకు ప్రాధాన్యంఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈయనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. పండాదాస్ సొంత జిల్లా పశ్చిమగోదావరి. పోలీసు శాఖకు సంబంధించి వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు(1999) ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్రం ఆయన ఆప్షన్ ప్రకారమే అలాట్ చేసింది. కాంతారావు సొంత జిల్లా పశ్చిమగోదావరి. వరంగల్ అర్బన్ ఎస్పీ వెంకటేశ్వరరావు తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చా రు. కేంద్రం ఇదే రాష్ట్రానికి కేటాయిం చింది. ఆయన సొంతజిల్లా కరీంనగర్. వరంగల్ రూరల్ ఎస్పీ ఎల్‌కేవీ.రంగారావు రెండు రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చారు. రోస్టర్ పాయింట్ల ప్రకా రం కేంద్రం ఈయనను తెలంగాణకు కేటాయించింది. రంగారావు సొంత జిల్లా విశాఖపట్నం. వరంగల్ ఓఎస్డీ అంబర్‌కిషోర్‌ఝా (2009) తెలంగాణకు ఆప్షన్ పెట్టుకున్నారు. బీహార్‌కు చెందిన ఆయనను కేంద్రం తెలంగాణకు కేటాయించింది. అటవీశాఖ ముఖ్య పర్యవేక్షణ అధికారి (సీఎఫ్) పి.వెంకటరాజారావు(1997) తెలంగాణకు అలాట్ అయ్యారు. రా జారావు హైదరాబాద్‌కు చెందినవారు. ఫారెస్ట్‌కు శాఖలో జెనటసిస్ట్గా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారి ఎస్.రమేశ్(2004) తెలంగాణకు అలాట్ అయ్యారు. రమేశ్ తమిళనాడుకు చెందినవారు. జిల్లా అటవీ భాగంలో కొంత మేర విధులు నిర్వర్తించే కరీంనగర్ పశ్చిమ డివిజన్ డీఎఫ్ఓ జి.నర్సయ్య(2001) తెలంగాణకు అలాట్ అయ్యారు. కరీంనగర్ ఈయన సొంత జిల్లా. -
సర్వేజన కష్టాలు
ప్రచార ఆర్భాటమెక్కువ..ఏర్పాట్లు తక్కువ సమగ్ర సర్వే నిర్వహణలో అధికారుల వైఫల్యం వరంగల్ నగరంలో మరీ అధ్వానం వివరాల నమోదుకు ఆసక్తి చూపిన ప్రజానీకం అయినా.. ఇళ్లకు రాని సిబ్బంది ఇబ్బందులు పడిన కుటుంబాలు స్పందించని టోల్‌ఫ్రీ నంబర్లు కలెక్టర్ మొబైల్ స్విచ్ ఆఫ్ రాత్రి వరకూ కొనసాగిన సర్వే సాక్షి ప్రతినిధి, వరంగల్ : సరిపోని ఎన్యూమరేటర్లు, తక్కువ పడిన నమోదుపత్రాలు, ఉన్నతాధికారుల ప్రణాళికలేమి, కిక్కిరిసిన బస్సులు, ఊళ్లకు చేరేందుకు ప్రజల అవస్థలు, అవసరమైన సమాచారం కాకుండా అనవసర విషయాలు తెలుసుకోవడం.. వీటి మధ్య జిల్లాలో మంగళవారం సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. సర్వేపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించడంలో సఫలమైన ఉన్నతాధికారులు, నిర్వహణ ఏర్పాట్లు మాత్రం సరిగా చేయలేకపోయారు. ముందుగా గుర్తించిన 10.69 లక్షల కుటుంబాల వివరాలు సేకరించేందుకు అవసరమైన ఎన్యూమరేటర్ల(వివరాలు సేకరించేవారు)ను సమకూర్చుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. చివరి నిమిషంలో విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులను తీసుకోవడంతో సర్వేకు మొదట్లో ఉన్న ప్రాధాన్యత తగ్గినట్లు కనిపించింది. సరిపడా ఎన్యూమరేటర్లు లేకపోవడంతో చాలా కుటుంబాల వివరాలు నమోదు కాలేదు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు నిర్వహించారు. కలెక్టరేట్లో, కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు పని చేయకపోవడంతో సర్వే వివరాలు సేకరించే వారు తమ ఇళ్లకు రాకపోవడంపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన వారికి నిరాశే మిగిలింది. ఇబ్బందులు ఉంటే మెస్సేజ్ చేయాలని సూచిస్తూ ప్రకటించిన కలెక్టర్ జి.కిషన్ మొబైల్ సైతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో ప్రజలు నిరసన తెలిపారు. వివరాలు నమోదు చేసికోని వారు, ఎన్యూమరేటర్లు రాని వారి పరిస్థితి ఏమిటనే విషయంలో స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఉత్సాహం చూపినా... సమగ్ర కుటుంబ సర్వేలో వరంగల్ నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది ప్రణాళిక లోపం స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే విషయంలో ప్రజలనుంచి అనూహ్య స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు ఉదయం నుంచి ఎన్యూమరేటర్ల కోసం ఎదురు చూశారు. ప్రజలు ఉత్సాహంపై బల్దియా అధికారులు నీళ్లు చల్లారు. ఎన్యూమరేటర్లకు కేటాయించిన ఇళ్ల వివరాల విషయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు చేసిన తప్పిదాలతో సర్వే అస్తవ్యస్తంగా జరిగింది. ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ఇంటి నం బర్ల పరిధికి మాత్రమే పరిమితమయ్యారు. వం దలాది మంది కుటుంబాల వివరాలు నమోదు చేయలేదు. 400 మంది ఎన్యూమరేటర్ల కొరత ఏర్పడింది. ఎంపిక చేసి శిక్షణ ఇచ్చిన మరో 100 మంది విధులకు హజరుకాలేదు. నగరంలో 2,44,646 కుటుంబాలు ఉంటే దాదాపు 25వేల కుటుంబాల వివరాలను సేకరించలేకపోయారు. హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం 100 ఫీట్ల రోడ్డు మార్గలోని జవహన్కాలనీ, రాంనగర్‌లోని కొన్నిప్రాంతాలు, ఎన్ఐటీ ఎదురుగా ఉన్న కాలనీలు, జూలైవాడ, రెవెన్యూకాలనీ, ప్రకాష్‌రెడ్డిపేట తదితర కాలనీల నుంచి ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చి అధికారులను కలిసి పరిస్థితి వివరించారు. తమకు సంబంధంలేదని నగరపాలకసంస్థ వారికి ఫిర్యాదు చేయాలని డీఆర్వో సురేందర్‌కరణ్ నిర్లక్ష్యంగా చెప్పడంతో ఆగ్రహించిన బాధితులు కొందరు కలెక్టర్ అధికారిక నివాసం ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. సుబేదారి పోలీసులు నచ్చజెప్పి పంపించారు. నగరంలోని కొత్తవాడ, మర్రివెంకటయ్య కాలనీ, నవయుగ కాలనీ, రామన్నపేట, హన్మకొండలోని కొత్తూరు, కుమార్‌పల్లి, పోలీస్ హెడ్ క్వార్టర్స్, రెడ్డికాలనీ, వడ్డేపల్లి టీచర్స్ కాలనీ, రామకృష్ణ కాలనీ తదితర కాలనీల్లో అసలు సర్వే కోసం ఎన్యూమరేటర్లు వెళ్లలేదు. 19 డివిజన్లోని రఘునాథ్‌నగర్ కాలనీవాసులు 200 మంది కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. మరికొందరు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. జనగామ పట్టణం 5 వార్డులో ఎన్యూమరేటర్ ఒకే చోట కూర్చుని సర్వే చేస్తుండగా కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని 8వ వార్డులో పలు ఇళ్లకు, జనగామ మండలం గానుగుపాడ్, వడ్లకొండ, వెంకిర్యాలలో ఇందిరమ్మ ఇళ్లకు, బచ్చన్నపేట మండలం చిన్నరాంచెర్ల జీపీ పరిధిలోని గోపాల్‌నగర్‌లో బుడిగె జంగాలకు చెందిన 50 గుడిసెలకు, నర్మెట మండల కేంద్రంలో పలు ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో ఎన్యూమరేటర్లు సర్వే చేయడానికి మొండికేయడంతో ప్రజలు ఆందోళన చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నంబర్లు లేకపోవడంతో పాత ఇళ్లలో తల్లిదండ్రులు ఉంటున్న చోట ఉమ్మడి కుటుంబంగా వివరాలు ఇవ్వాల్సి వచ్చింది. మానుకోట నియోజకవర్గంలో ఒకే ఇంటి నంబరుపై పలు కుటుంబాలు నివాసం ఉన్నా వేర్వేరుగా నంబర్లు ఇవ్వకపోవడంతో సమస్య తలెత్తింది. మానుకోట పట్టణ శివారు పత్తిపాక, మంగలికాలనీ, తదితర కాలనీలలో ఇండ్లకు నంబర్లు ఇవ్వకపోవడంతో పూర్తిస్థాయిలో సర్వే జరుగలేదు. కేసముద్రంలోనూ రెండుమూడు కుటుంబాలు ఉండే ఇళ్లకు ఒకే నంబరు ఇవ్వడంతో కుటుంబ యజమానులు సిబ్బందితో గొడవపడ్డారు. నెల్లికుదురు మండలం నర్సింహులగూడెం, మునిగలవీడు, చిన్న నాగారం గ్రామాల్లో సూరత్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించేందుకు సిబ్బంది నిరాకరించగా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గూడురు మండలంలోనూ నంబర్ల సమస్య తలెత్తింది. భూపాలపల్లి పట్టణంలో పలు కాలనీల్లో ఇంటి నంబర్ల ఆధారంగా ఇళ్లను గుర్తించేందుకు ఎన్యూమరేటర్లు కష్టపడాల్సి వచ్చింది. భూపాలపల్లి, గణపురం, చిట్యాల మండలాల అధికారులు సకాలంలో టిఫిన్, భోజనం అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిట్యాలలో కనీసం వాహన సౌకర్యం కల్పించకపోవడంతో కేటాయించిన ప్రాంతాలకు వెళ్లడానికి నానా తిప్పలు పడ్డారు. రేగొండ, భూపాలపల్లి, చిట్యాల మండలాల్లో పలు చోట్ల పలు కుటుంబీకుల పేర్లు లిస్టులో లేకపోవడంతో బాధితులు వాగ్వివాదానికి దిగారు. నర్సంపేట పట్టణంలో 45 వుంది ఎన్యూవురేటర్లు గైర్హాజరయ్యూరు. సూపర్వైజర్లు ఇంటి నంబర్ల జాబితాను సరిగా రూపొందించకపోవడంతో సర్వే సిబ్బంది ఇబ్బంది పడ్డారు. పలు వార్డుల్లో సర్వే టీం ఇంటికి వెల్లని వారి కోసం స్థానిక బాలుర హైస్కూల్లో వుూడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. గైర్హాజరైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటావుని ఆర్డీఓ తెలిపారు. నల్లబెల్లి మండల కేంద్రంలో ఒక ఇంటిలో పలు కుటుంబాలున్నా ఒకే ఫారంలో వివరాలు నమోదు చేయడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పరకాల నగర పంచాయతీ పరిధి 13వ వార్డులో ఎన్యూమరేటర్లతో స్థానికులు ఘర్షణకు దిగారు. కుటుంబంలో కొందరి పేర్లు మాత్రమే రావడంతో తప్పుడు సర్వే చేస్తున్నారని వాదించారు. పట్టణంలోని ఒక వాడలో ఇద్దరు భార్యలు నా పేరు అంటే నా పేరు రాయమంటూ గొడవకు దిగడంతో ఎన్యూమరేటర్ ఆ ఇంటిని సర్వే చేయకుండా వదిలి వేశారు. పరకాల మండలంలోని వెంకటాపూర్, నాగారం గ్రామాల్లో పలువురి పేర్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. గీసుకొండ మండలం విలీన గ్రామాల్లో ఇంటి యజమానుల కుటుంబాలను మాత్రమే సర్వే చేశారు. వృద్ధుల పేర్లను లేకుండా చేశారు. సంగెం మండలంలోని తిమ్మాపురం, ఎల్గూరు స్టేషన్, మొండ్రాయిలో ఎన్యూమరేటర్లు సర్వే చేయడంలో ఇబ్బంది పడగా కొత్తవారితో చేయించారు. ఆత్మకూరు మండలంలో సిబ్బందికి ఇంక్ ప్యాడ్లకు బదులు స్కేచ్ పెన్నులు ఇచ్చారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సమగ్ర సర్వే ప్రశాంతంగా జరిగింది. పలువురి ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో ఎన్యూమరేటర్లు ఆయా కుటుంబాల వివరాలు నమోదు చేసుకోలేదు. దీంతో బాధితులు గొడవకు దిగడంతో అధికారులు కల్పించుకొని సమస్యను పరిష్కరించారు. నియోజకవర్గం మొత్తం సర్వే తీరును జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డెరైక్టరు వి.వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట, పర్వతగరి, హసన్‌పర్తి(రూరల్), హన్మకొండ గ్రామీణ మండలాల్లో అర్ధరాత్రి సర్వే జరిగింది. 150 మంది ఎన్యూమరేటర్లు విధులకు డుమ్మాకొట్టడంతో కానిస్టేబుళ్లు ఆ విధులు నిర్వర్తించారు. ఎల్లాపురంలో సర్వే ఆలస్యం కావడంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. కుమ్మరిగూడెం, మడికొండలోని కొన్ని ప్రాంతాల్లో సర్వే జరగలేదు. వర్ధన్నపేట మండలంలో ప్రత్యేక అధికారి బి.సంజీవరెడ్డి సర్వేను పర్యవేక్షించారు. పాలకుర్తి మండలం బమ్మెర శివారు పలుగుబోడు తండాలో ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబం సర్వే కోసం సొంత ఊరికి వచ్చింది. ఆ ఇంటి దూలం విరిగి పడి లకావత్ ధర్మా కుమారుడు నితిన్ రెండు కాళ్లు విరిగిపోయాయి. ఇంటి నంబర్ల కేటాయింపులో పొరపాట్లపై దేవరుప్పుల మండలం గొల్లపల్లిలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్రావును ప్రజలు నిలదీసారు. తొర్రూరు, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల మండలంలోని పలు గ్రామాల్లో ఇదే విషయంపై ప్రజలు ఎన్యూమరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డోర్నకల్ మండలంలో 46 మంది ఎన్యూమరేటర్లు విధులకు రాలేదు. మరిపెడ మండలంలో ఫారాలు సరిపోలేదు. నర్సింహులపేట మండలం బొజ్జన్నపేటలో ఎన్యూమరేటర్ ఐ.మధు కళ్లు తిరిగి పడిపోయాడు. కురవి మండలం బలపాల, గుండ్రాతిమడుగులో అర్ధరాత్రి వరకు సర్వే జరిగింది. ఏటూరునాగారం మండలంలో ఒక దగ్గరే కూర్చుని వివరాలు నమోదు చేయడం కని పించింది. కొత్తగూడ మండలంలో సర్వే ప్రశాతంగా ముగిసింది. వెంకటాపురం మం డలంలో ఎన్యూమరేటర్ల కొరత ఏర్పడడం తో ప్రేవేటు ఉపాధ్యాయులను, యువజన సంఘాల సభ్యులతో సర్వే చేయించారు. తాడ్వాయి మండలంలో ఇంటి నంబర్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. మంగపేట మండలంలో అధికారులు చేసిన తప్పులపై ప్రజలు నిలదీశారు. కొన్ని ఇళ్లను విస్మరించడంతో బాధితులు గ్రామ పంచాయతీకి చేరుకుని ఆందోళన నిర్వహించారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు. గోవిందరావు పేట మండలంలో సర్వే ప్రశాతంగా జరిగింది. -
కాకతీయుల కోటలో జెండా పండుగ!
ఖిలా వరరంగల్ : స్వాతంత్య్ర వేడుకలను ఈ ఏడాది కాకతీయులు నిర్మించిన కోట ఆవరణలో నిర్వహించాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నందున వరంగల్లోనూ చారిత్రక కాకతీయుల కోటలో నిర్వహించాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తోంది. భద్రత పరమైన అంశాలను పరిశీలించి ఈ విషయంపై రెండు రోజుల్లో తు ది నిర్ణయం తీసుకోనున్నట్లు కలెక్టర్ జి.కిషన్ మంగళవారం చెప్పారు. పంద్రాగస్టు వేడుకలు వరంగల్ కోటలో నిర్వహించాలని విజ్ఞప్తులు రావడంతో అక్కడి స్థలాన్ని స్వయంగా పరిశీ లించినట్లు కలెక్టర్ తెలిపారు. స్థలం విస్తీర్ణం విషయంలో చిన్న పాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ... భద్రతాపరంగా పోలీస్ శాఖ ఇచ్చే నివేదిక బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాకతీయుల కోట ప్రాంతాంలోని ఖుష్‌మహల్ ప్రాంతం స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు అనువుగా ఉందని కలెక్టర్ పేర్కొ న్నారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ కోటలో స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించే విషయంపై అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వరరావు, వరంగల్ నగర కమిషనర్ సువర్ణ పండాదాస్, ఇతర జిల్లా స్థాయి అధికారులతో కలిసి కలెక్టర్ కిషన్ మంగళవారం ఉదయం కోట ప్రాంతాన్ని సందర్శించా రు. చారిత్రక కోటలోని ఖుష్‌మహల్ పక్కన, కాకతీయలు కీర్తితోరణాల నడుమ అందమైన శిల్పాల మధ్య ప్రదేశాలను పరిశీలించారు. అధికారుల పర్యటనలో భాగంగా కోటలో ప్ర త్యేక పోలీసులు, బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది శి ల్పాల ప్రాంగణం, ఖుష్‌మహల్ తదితర ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం కలెక్టర్ కిషన్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి స్వా తంత్య్ర వేడుకలను చారిత్రక ప్రదేశాల్లోనే నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు. పంద్రాగస్టు వేడుకల పరేడ్ నిర్వహణకు ఒక్కచోటే ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల విస్తీర్ణం అవసరమవుతుందని, ఖుష్‌మహల్‌ను ఆనుకుని ఉన్న రెండు ఎకరాల ప్రైవేట్ వ్యక్తుల భూమి, ఆ పక్కన మినీపార్క్ స్థలం, కాకతీయుల కళాతోరణాల నడుమ స్థలాలను గుర్తించడం జరిగిందన్నారు. కేంద్ర పురావస్తుశాఖ, ప్రైవేటు భూమి యజమానులను సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పా రు. మధ్యకోటలో స్వాతంత్య్ర దినోత్సవాల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించి త్వరలో తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని కలెక్టర్ తెలిపారు. భద్రతపై సమీక్షిస్తాం : అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు స్వాతంత్య్ర వేడుకలను కోట ఆవరణలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణరుుస్తే తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సమీక్షిస్తామని వరంగల్ అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్రావు చెప్పారు. ఖిలావరంగల్ కోట ప్రాంతంలో గతంలో ఉన్న మావోయిస్టుల ప్రాబల్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్థలాన్ని, ప్రాంతాన్ని పరిశీ లించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉత్సవాలు కోటలోనే జరిగితే ట్రాఫిక్ నియంత్రణ ప్రధాన సమస్య అవుతుందని చెప్పారు. కోట లో వేడుకల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై తనకు నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్‌ను ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ఆదేశిం చారు. ఈమేరకు నివేదిక రూపొందిస్తున్నారు. ఖిలా వరంగల్ పరిశీలన కార్యక్రమంలో నగర మాజీ డిప్యూటీ మేయర్ కక్కె సారయ్య, డీఆర్వో సురేంద్రకరణ్, కేంద్ర పురావస్తు శాఖ సమన్వయకర్త సుబ్బారావు, పర్యాటక శాఖ గైడ్ దేనబోయిన రవి, స్థానిక నాయకులు సం గరబోయిన చందర్, బొలుగొడ్డు శ్రీనివాస్, ప్రభాకర్, బి.దామోద ర్, బిల్ల రవి, కరుణాకర్, మేకల ఎల్లయ్య, పుట్ట మోహన్, పుప్పాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమంలా సర్వే
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ప్రజల సామాజిక స్థితిగతులపై ఈ నెల 19న నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ గంగాధర కిషన్ కోరారు. తెలంగాణ వ్యాప్తంగా తలపెట్టిన ఈ సర్వే.. ప్రభుత్వం భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలకు ప్రధాన ఆధారమవుతుందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా చేపడుతున్న ఈ సర్వేలో ప్రజలు, అధికారులు ఉద్యమ స్ఫూర్తితో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వేపై జిల్లా కలెక్టర్ జి.కిషన్ కలెక్టరేట్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘ప్రతి తెలంగాణ పౌరుడు సర్వే కార్యక్రమంలో పాల్గొని వ్యక్తిగత, కుటుంబ వివరాలు అంద జేయాలి. తద్వారా బంగారు తెలంగాణ ఏర్పాటులో తోడ్పాటు అందించినట్లు అవుతుంది. తెలంగాణ పౌరులుగా గుర్తింపు పొందడం, ప్రభుత్వ పథకాలను వినియోగించుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. సమాచార సేకరణ కోసం మీ దగ్గరికి వచ్చే ప్రభుత్వ సిబ్బందికి కచ్చితమైన సమాచారం ఇవ్వాలి. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చర్యలు ఉంటాయి. ఉద్యమంలా సాగుతున్న సర్వేకు అందరూ సహకరించాలి’ అని కలెక్టర్ కోరారు. జిల్లాలోని మొత్తం 3256 ఆవాస ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తామని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన సంఖ్యను కేటాయిస్తామని తెలిపారు. ఇది కుటుంబ సర్వే అని, ఇళ్లు(ఆవాసం) ఉన్న వారి వివరాలను మాత్రమే సేకరిస్తామని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించే 19వ తేదీన ప్రభుత్వం సెలవుగా ప్రకటించిందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో లోపాలున్నాయన్న భావనతో ప్రభుత్వం ఈ సమగ్ర సర్వేకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. సర్వే అధికారులకు ప్రజలు వాస్తవ వివరాలు ఇచ్చి సహకరించాలని, దీని వల్ల అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు. సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయిలో విృ్తత ప్రచారం నిర్వహిస్తున్నామని, విద్యార్థులతో ర్యాలీలు, గ్రామాల్లో చాటింపు ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. ఒక ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకు ప్రత్యేకంగా ఒక ప్రత్యేక సంఖ్య(యునిక్ నెంబర్)ను కేటాయిస్తామని చెప్పారు. ఈ ప్రత్యేక సంఖ్య భవిష్యత్తులో అన్ని అంశాలకు ఉపయోగపడుతుందని అన్నారు. స్థానికంగా లేకుంటే... ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ వివరాలు సేకరించడానికి వచ్చే ప్రభుత్వ సిబ్బందికి అందుబాటులో ఉండాలని కలెక్టర్ కోరారు. ఉపాధి, విద్య, ఇతర అవకాశాలపై ఇతర ప్రాంతాల్లో నివాసం ఉన్నవారు సర్వే రోజున సొంత ఇళ్లలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇది వీలుకాని సందర్భంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి సంబంధించిన రుజువులు(ధ్రువీకరణ పత్రాలు) అధికారులకు చూపిస్తే సరిపోతుందని తెలిపారు. ఒక కుటుంబంలోని కొందరు వ్యక్తులు, సర్వే రోజు ఏదైనా కారణంతో స్థానికంగా అందుబాటులో లేనట్లయితే అందుకుగల కారణాలు రుజువుతో సహా చూపివారి వివరాలు నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఉదాహరణకు ఇతర రాష్ట్రాల్లో చదివే వారు వారి ఐడీ కార్డు, సీట్ అలాట్మెంట్ లెటర్, ఇతర దేశాలకు వెళ్లినవారు వారి పాస్‌పోర్టు వివరాలు చూపి వారి వివరాలు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లాలో 9,39,731 కుటుంబాలు ఉంటాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో 7,47,786 కుటుంబాలు, పట్టణ ప్రాంతంలో 1,89,945 కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు. సమగ్ర సర్వేకు వివరాలు సేకరించే సిబ్బందికి ఈ నెల 7న మున్సిపల్, మండల స్థాయిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణ తరహాలోనే సర్వేలో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందిని గ్రామాలకు తరలించేందుకు 1500 వాహనాల వినియోగించనున్నట్లు చెప్పారు. -
సామాజిక సర్వేకు సిద్ధం
హన్మకొండ అర్బన్: ఈ నెల 19న సామాజిక, ఆర్థిక సర్వే చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. హైదరాబాద్ నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరె న్స్లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2014 జనాభా లెక్కల ప్రకారం 9.39 లక్షల కుటుంబాలు ఉన్నాయని, వీటి సర్వే చేసేందుకు 39,552 మంది అధికారులను నియమిస్తున్నట్టు తెలిపారు. వీరిని సర్వే ప్రాంతాలకు తరలించేందుకు వెరుు్య వాహనాలు సిద్ధం చేస్తున్నామన్నారు. సేకరించిన డాటాను కంప్యూటరీకరించేందుకు మొత్తం 2500 కంప్యూటర్లు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. ప్రతి మండలానికి ముగ్గురు ఏడీ స్థాయి అధికారులను నియమిస్తున్నామని, సర్వే తీరును వీరు పరిశీలిస్తుంటారని తెలిపారు. సర్వే నిర్వహణపై ఈనెల 6న శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జారుుంట్ కలెక్టర్ పౌసుమిబసు, అడిషనల్ జేసీ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ పండాదాస్, ఆర్డీవో సురేందర్‌కరణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రజల ఆకాంక్షలే ప్రణాళికలు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : గ్రామ ప్రజల ఆశలు, ఆకాంక్షలకనుగుణంగా గ్రామ, మండల, జిల్లా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ జి.కిషన్ పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా మెరుగైన ప్రణాళిక రూపకల్పనకు ప్రజాప్రతినిధులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ‘మన ఊరు... మన ప్రణాళిక, మన మండలం... మన ప్రణాళిక, మన జిల్లా... మన ప్రణాళిక’ అంశంపై హన్మకొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం వర్క్‌షాప్ జరిగింది. జిల్లాలోని ప్రజాప్రతినిధులను ప్రణాళిక రూపకల్పనలో భాగస్వాములను చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జి.కిషన్ మాట్లాడుతూ గ్రామ ప్రాధాన్యతలు ప్రతిబింబించేలా ప్రణాళికలు ఉండాలన్నారు. ప్రతి గ్రామంలో విద్య, ఉపాధి, మౌలిక వసతులు, వనరుల లభ్యత వంటి అన్ని అంశాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. గ్రామ స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలకు ఎక్కువ మంది ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామసభల్లో కమిటీ నిర్ణయం ప్రకారం పనుల ప్రతిపాదనలు ఉండాలని, అధికారులు కేవలం సహాయకులుగా మాత్రమే ఉంటారని కలెక్టర్ పేర్కొన్నారు. 40 లక్షల మొక్కలు.. హరితహారం పేరుతో జిల్లాలో 40 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకు అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. అడవుల్లో మామిడి, నేరేడు, వెలగ, రేగు మొక్కలు నాటేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని... రైతులు తమ పంట చేల పక్కన నాటుకునేందుకు మొక్కలు అందజేస్తామని తెలిపారు. నగరంలో పూల మొక్కలు నాటేందుకు ప్రాధాన్యమివ్వన్నుట్లు తెలిపారు. గ్రామాల్లో జాబ్ కార్డు ఉండి సుమారు మూడేళ్లుగా పనిచేస్తున్న వారికి మాత్రమే భూ పంపిణీలో ప్రాధాన్యమివ్వాలన్నారు. దీని కోసం ప్రభుత్వ భూముల గుర్తింపు చేపట్టినట్లు వెల్లడించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు వివరించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారుల సహాకారంతో అభివృద్ధి కార్యక్రమాలు విజవంతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ భవనాలు నిర్మించండి : కొండా సురేఖ గ్రామాల్లో ప్రణాళికలు తయారు చేసే క్రమంలో అంగన్వా డీ, పీహెచ్సీ, పీఏసీఎస్, గ్రామ పంచాయతీ, పాఠశాల, వంటగదులకు శాశ్వత భవనాలు నిర్మించడంపై దృష్టి పెట్టాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ సూ చించారు. ఈ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని... వికలాంగులు, ఇతర సంక్షేమ పథకాల అబ్ధిదారుల గుర్తింపు విషయంలో పారదర్శకంగా వ్యవహరించి అర్హులకు న్యాయం చేయాలన్నారు. బోగస్ లబ్ధిదారుల ఏరివేతపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. చెక్‌డ్యాంలు, చెరువుల మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. అభివృద్ధికి బాటలు వేయాలి : దొంతి మాధవరెడ్డి అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలోనే మన జిల్లా ముందంజలో ఉందని,మన ఊరు- మన ప్రణాళిక కార్యక్రమం స మగ్రంగా అమలైతే అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆకాం క్షించారు. లింకురోడ్లు, స్కూల్ భవనాల నిర్మించడంలో శ్రద్ధ చూపాలని కోరారు. ప్రజాప్రతినిధులు కొన్ని అంశాల్లో విభేదించినా, అధికారులు సమన్వయంతో పను లు చేయాలన్నారు. ఈ విషయంపై గ్రామస్థాయి నుంచి రాజకీయ పార్టీల కార్యకర్తలకు అవగాహన కల్పించాలని కోరారు. అన్ని రంగాలకు ప్రాధాన్యమివ్వాలి : ఎన్.రాజలింగం అన్ని రంగాల్లో ప్రజల అవసరాలను ప్రణాళికల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ నాగపురి రాజ లింగం కోరారు. చేర్యాల చెరువు శిఖం హద్దులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో డీఆర్సీలో ఈ విషయంపై వివరించినా.. అధికారులు పట్టించుకోలేదన్నారు. కోతులు రాకుండా చేయాలి : వెంకటేశ్వర్లు చాలా గ్రామాల్లో రైతులు, ప్రజలు కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు తెలి పారు. కొన్ని గ్రామాల్లోని రైతులు, అభివృద్ధి కంటే కోతులు లేకుండా చేస్తే చాలు అంటున్నారని పేర్కొన్నారు.గంగదేవిపల్లిని స్ఫూర్తిగా తీసుకుని అన్ని గ్రామాలకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఎక్కువ మంది డుమ్మా... తెలంగాణలో టీఆర్ఎస్ నేతృత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం మన ఊరు... మన ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని రంగాల అభివృద్ధితో బంగారు తెలంగాణ ఏర్పాటుకు ఈ ప్రణాళికలే ముఖ్యమని భావిస్తోంది. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ప్రణాళిక రూపకల్పనలో భాగస్వామ్యులను చేయడం ప్రధాన ఉద్దేశంగా కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు. ముఖ్యంగా స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం టి.రాజయ్య సహా టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు జిల్లాలో ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో కొండా సురేఖ ఒక్కరే ఈ సమావేశానికి హాజరయ్యారు. టీఆర్ఎస్కు చెందిన ఎంపీలే అయినా కడియం శ్రీహరి, ఎ.సీతారాంనాయక్, బి.నర్సయ్యగౌడ్లో ఎవరూ హాజరు కాలేదు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు డీఎస్.రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, చల్లా ధర్మారెడ్డి సదస్సుకు హాజరుకాలేదు. జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, డ్వామా పీడీ వి.వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మన ఊరు... మన ప్రణాళిక నేడు జిల్లావ్యాప్తంగా ప్రారంభం హన్మకొండ అర్బన్ : తెలంగాణ సమగ్ర అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమం సోమవారం మొదలవుతోంది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య సోమవారం జఫర్‌గఢ్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిం చనున్నారు. ఈ నెల 18 వరకు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో 19 నుంచి 23 వరకు, జిల్లా స్థాయిలో 24 నుంచి 28 వరకు ప్రణాళికలు రూపొందించనున్నారు. దీనికి సంబంధించి అధికారు లు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేశారు. గ్రామ అభివృద్ధి, అవసరాలు ప్రాతిపదికగా గ్రామస్తుల సూచనలు మేరకు సర్పంచ్, ఎంపీటీసీ, వార్డుమెం బర్లు, వీఆర్వో, గ్రామ కార్యదర్శి, ఇతర శాఖల సిబ్బం దితో కలిసి అభ్యుదయ అధికారి ప్రణాళికలు రూపొం దిస్తారు. ప్రతి ప్రభుత్వ శాఖ గ్రామస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రణాళికలో 14 అంశాలు గ్రామ స్థాయి ప్రణాళిక రూపకల్పనలో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రణాళిక రూపలక్పనకు సంబంధించి ప్రభుత్వం ప్రధానంగా 14 అంశాలను గుర్తించింది. ఈ అంశాలకు ప్రకారం ప్రజల నుంచి వివరాలు సేకరించి ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా నివేదిక తయారు చేస్తారు. పంచాయతీ పరిధిలోని ప్రధాన గ్రామంలోనే కాకుండా అనుబంధంగా ఉండే ఆవాసాల (పల్లె, గూడెం, తండాలు)కు సంబంధించి వివరాలు సేకరిస్తారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సాగునీటి సరఫరా, మహిళా సాధికారత, ఉపాధి, మౌలిక సదుపాయాలు, వనరుల సమీకృత వంటికి ప్రాధాన్యం ఇస్తారు. అన్ని అంశాల్లో సూక్ష్మ స్థాయిలో వివరాలు సేకరించడంతోపాటు అవసరాలను గుర్తిస్తారు. -
నాబార్డ కృషి అభినందనీయం
కలెక్టరేట్ : జిల్లాలో గ్రామీణాభివృద్ధికి, పల్లె ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో నాబార్డ్ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ జి.కిషన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నాబార్డ్ 33వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా వివిధ రంగాల అభివృద్ధికి కృషిచేసిన బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు, రైతు క్లబ్‌లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. అనంతరం నాబార్డ్ ఏజీఎం ఉదయ్‌భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో నాబార్డ్ ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్ఐడీఎఫ్(రూ.480కోట్లు) అమలవుతోందని, ఇందులో అంగన్వాడీ కేంద్రాలు, గ్రామీణ గిడ్డంగులు, రోడ్లు, వంతెనల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఏటూరునాగారం, తాడ్వాయి, మరిపెడ మండలాల్లో సుమారు *2.50కోట్లతో తోటలు పెంచుతున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్ డీజీఎం ధనుంజయ్, డీఆర్డీఏ పీడీ శంకరయ్య, ఏడీఎం.సాయిప్రసాద్, ఉమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీసీసీబీకి నాబార్డ్ అవార్డు హన్మకొండ సిటీ : ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందించినందుకు డీసీసీబీ నాబార్డ్ అవార్డుకు ఎంపికయింది. కలెక్టర్ చేతుల మీదుగా డీసీసీబీ జనరల్ మేనేజర్ వి.సురేం దర్ అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. డీసీసీబీ 31 ఏళ్ల తరువాత రూ.1.37 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది రైతులకు రూ.330 కోట్ల రుణాలందించింది. రూ.124కోట్ల డిపాజిట్ సేకరించి, జిల్లాలో మల్టీపర్పస్ బిజినెస్ కింద 26 గోదాంలు నిర్మించిందని మేనేజర్ సురేందర్ చెప్పారు. -
రెండు గంటల్లో ‘పుర’ ఫలితాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను వెల్లడించారు. సోమవారం మునిసిపల్, 13న జరిగే ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపనకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. మునిసిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించినందున ఫలితాలు రెండు గంటల్లోపు తెలిసే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని మహబూబాబాద్, జనగామ, మునిసిపాలిటీలతోపాటు భూపాలపల్లి, నర్సపేట, పరకాల నగర పంచాయతీలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కేంద్రంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో చేపట్టనున్నట్లు వివరించారు. ఈ మేరకు అకాడమిక్ భవనంలో అన్ని రకాలు ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారులు శ్రీధర్, జగన్మోహన్రావులను ఎన్నికల సంఘం నియమించినట్లు వెల్లడించారు. వీరితోపాటు ఐదుగురు కౌంటింగ్ పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కోసం 109 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చి విధులు కేటాచించామన్నారు. 13న ప్రాదేశిక ఓట్ల లెక్కింపు ఈనెల 13న నిర్వహించనున్న ప్రాదేశిక ఓట్ల లెక్కింపునకు సైతం ఏర్పాట్లు పూర్తయ్యూయని కలెక్టర్ తెలిపారు. ఐదు రెవెన్యూ డివిజన్లలోని 50 జెడ్పీటీసీ, 701 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వివరించారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. నర్సింహులపేట మండలం రేపోణి, స్టేషన్ఘన్పూర్మండలం నిడిగొండ, హసన్‌పర్తి మండలం సిద్దాపూర్, కురవి మండలం మొగిలిచ్ల ఎంపీటీసీలు ఏక గ్రీవమైనట్లు గుర్తు చేశారు. సెల్ఫోన్లు నిషేధం కౌంటింగ్ హాలులోకి ఆర్ఓలు మినహా ఇతర ఉద్యోగులు, పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు సెల్ఫోన్లు, పాన్, సిగరెట్, గుట్కాలు తీసుకె ళ్లడం నిషేధమని కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలన కు ఏడుగురు పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. వీరిలో పరకాలకు ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావు, ములుగుకు మైనార్టీ సంక్షేమ శాఖ డీడీ ఎన్.భాగ్యమ్మ, వరంగల్‌కు ఏజేసీ కృష్ణారెడ్డి, జనగామకు డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, మహబూబాబాద్‌కు యూఎల్సీ జాన్‌వెస్లీ, కె.కృష్ణవేణి, నర్సం పేటకు ఎస్డీసీ డేవిడ్‌ను నియమించామన్నారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశామన్నా రు. ఐదు కంపెనీల ఏపీఎస్పీ బలగాలు ఉన్నాయని పే ర్కొన్నారు. 30పోలీస్చట్టం, 144 సెక్షన్ అమల్లో ఉంటుం దని చెప్పారు. సమావేశ ంలో జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, అడిషనల్ ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. రైతాంగాన్ని ఆదుకుంటాం... జిల్లాలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అదుకుంటామని కలెక్టర్ తెలిపారు. పంటనష్టంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ స్పందించారు. జిల్లాలో 5,546 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. తడిసిన ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించే విధంగా ఐకేపీ ద్వారా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. మార్కెట్ యార్డుల్లో తడిసిన ధాన్యానికి భీమా చెల్లించేలా ఏర్పా ట్లు చేస్తున్నామన్నారు. ధాన్యం తడవకుండా స్థానికంగా పాఠశాల్లో నిల్వ చేసుకునేలా అవకాశం కల్పిస్తామని, రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రాదేశిక ఓట్ల లెక్కింపు కేంద్రాలు.. డివిజన్ స్థలం వరంగల్ నిట్‌లో జనగామ ప్రసాద్ ఇంజినీరింగ్ కళాశాల మహబూబాబాద్ ఏపీ మోడల్‌స్కూల్, ఫాతిమా స్కూల్ పరకాల గణపతి ఇంజినీరింగ్ కళాశాల ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల -
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల సంఘానికి కళ్లు, చెవుల మాదిరిగా ఉంటూ, ఎన్నికల విధులు సక్రమం గా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి. కిషన్ సూచించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్హాల్లో మంగళవారం సూక్ష్మ పరిశీలకుల రెండురోజుల శిక్షణ తరగతులకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాల్సి ఉంటుందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న వారిని ఎన్నికల సంఘం సూక్ష్మ పరిశీలకులుగా నియమించిందని చెప్పారు. సాధారణ పరిశీలకుడు కింగ్లే మాట్లాడుతూ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు సూక్ష్మ పరిశీలకులు కీలకపాత్ర వహించాలని అన్నారు. నివేదికలు నిర్ణీత నమూనాలో పంపాలని సూచించారు. ఈనెల 29, 30 తేదీల్లో సూక్ష్మ పరిశీలకులు వారికి కేటాయించిన కేంద్రాల్లో విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ సమయంలో అత్యవసర సమాచారాన్ని సాధారణ పరిశీలకులకు తెలియజేయాలని కోరారు. -
సంక్షేమ పథకాలు అందరికీ అందాలి
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలందరికీ అందాలి.. ఆ బాధ్యత అధికారులపై ఉం ది.. నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ జి.కిషన్ స్పష్టం చేశారు. పట్టణంలోని బాలాజీ గార్డెన్లో బుధవారం మహబూబాబాద్, నర్సంపేట డివిజన్లకు సంబంధించి అన్ని శాఖ ల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పథకాల అమలుపై చర్చించి అధికారులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం అభ్యుదయ అధికారులను కేటాయించామని, వారు ప్రతి శుక్రవా రం కేటాయించిన గ్రామాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారుల కు తెలియజేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రజలు ఫిర్యాదు చేయగానే స్వీకరించి పరిష్కా రం మార్గం చూపినపుడే అభ్యుదయ అధికారులపై వారికి నమ్మకం కలుగుతుందన్నారు. గ్రా మంలోని సమస్యలు తెలుసుకోవడానికి సర్పంచ్‌లకు ప్రభుత్వం ఉచితంగా సిమ్‌కార్డులను అందిస్తోందని, ఆ ప్రక్రియ వారంలో పూర్తవుతుందని చెప్పారు. ప్రతి గ్రామంలో పింఛన్లు, రేషన్‌కార్డులు ఇతరాత్ర సంక్షేమ పథకాలకు సంబంధించిన జాబితాను పంచాయతీ కార్యాలయంలో అంటించి అందరికీ అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత కార్యదర్శిపైనే ఉందన్నారు. మహిళా సాధికారత, ఓటరు నమోదు కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో నిర్మల్ భారత్ అభియాన్ పథకాన్ని వినియోగించుకునేలా ప్రజలను చైతన్య పర్చడంతోపాటు నిర్మించుకున్న వారికి సకాలంలో బిల్లులు అందించేలా చూడాలని చెప్పారు. ప్రతి నెలా రెండో శనివారం గ్రామ సమస్యల ను సర్పంచ్ల ద్వారా తెలుసుకోవడానికి తాను అందుబాటులో ఉంటానని కలెక్టర్ తెలిపారు. అధికారులకు క్విజ్ పోటీ సమీక్ష సమావేశంలోనే వివిధ అంశాలపై అధికారులకు క్విజ్ పోటీ నిర్వహించారు. సరైన సమాధానం చెప్పినవారికి బహుమతులు అందజేశారు. అధికారులు సైతం ఆసక్తిగా పోటీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏజేఏసీ సంజీవయ్య, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, డీఎంఅండ్‌హెచ్‌ఓ సాంబశివరావు, డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్, డ్వామా పీడీ హైమావ తి, మానుకోట, నర్సంపేట డివిజన్ల ఆర్డీఓలు మధుసూదన్‌నాయక్, అరుణకుమారి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
2013 క్యాలెండర్ గిర్రున తిరిగింది
జనవరి 2 పరకాల నుంచి బొగ్గు లోడుతో వస్తున్న లారీ మైలారం ప్రధాన కూడలి వద్ద భూపాలపల్లికి చెందిన సంఘమిత్ర డిగ్రీ కళాశాల బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని బండి మౌనిక(20), బస్సు డ్రైవర్ అమరేందర్(45) మృతిచెందారు. 40మంది విద్యార్థులు గాయపడ్డారు. ‘కుడా’ వైస్ చైర్మన్‌గా అనురాధ నియమితులయ్యారు. 3 వరంగల్‌లోని చింతల్ ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న పాపయ్యపేట చమన్‌కు చెందిన రఫీక్ అహ్మద్ అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకు పొక్కింది. అమ్మాయి తల్లిదండ్రులు పాఠశాలపై దాడిచేశారు. భూపాలపల్లి మండలం నేరేడుపల్లికి చెందిన పబ్బ శ్రీనివాస్, శారద దంపతుల కుమారుడు మన్మోహన్(10), అదే గ్రామానికి చెందిన ఆరవేని తిరుపతి, మల్లమ్మ దంపతుల కుమారుడు అనిల్(8) కలిసి గ్రామ సమీపంలోని ఆరవేని కుంటలో చేపలు పట్టడానికి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారు. 4 శృంగేరి శ్రీ శార దా పీఠం పండితులు శ్రీ భారతీతీర్థ మహాస్వామి ఆధ్వర్యంలో వరంగల్‌లోని చారిత్రక భద్రకాళి దేవాలయంలో మహాకుంబాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. వేదపాఠశాలను ప్రారంభించారు. 5 గుప్తనిధుల కోసం అన్వేషణ చేసే ముఠాలో తగాదాలు రావడంతో భూపాలపల్లిలోని కారల్‌మార్క్స్ కాలనీకి చెందిన ధర్మారావు(50)ను ముఠా సభ్యులు హత్య చేశారు. ధర్మారావు ఏరియాలోని కాకతీయలాంగ్‌వాల్ ప్రాజెక్టులో లాంప్రూప్ అటెండెంట్‌గా పనిచేసేవాడు. హత్య విషయం ఎనిమిది రోజుల తర్వాత వెలుగుచూసింది. 8 కురవి మండలం బేతోలు శివారు మల్యాల క్రాస్‌రోడ్డు వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మానుకోటకు చెందిన దేవి(12) మృతిచెందింది. మహబూబాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సూర్యాపేట వెళ్తుండగా బస్సు అదుపు తప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. 8 పెద్దలను ఎదిరించే ధైర్యం లేని ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిట్యాల గ్రామానికి చెందిన పంజాల పూజ(20) మద్దూరు మండలం అర్జునపట్లకు చెందిన తాళ్ల పల్లిరాజు(20) నల్గొండ జిల్లా ఆలేరు వద్ద రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. 9 విద్యుత్ చార్జీల పెంపును, కోతలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా సబ్స్టేషన్ల ఎదుట ఆందోళను నిర్వహించారు. 11 గణపురం మండలం చెల్పూరులో జరిగిన అగ్నిప్రమాదంలో గ్రామానికి చెందిన తోట సాంబయ్య ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.14.5లక్షల నగదు, పది తులాల బంగారం, 70క్వింటాళ్ల పత్తి కాలి బూడిదైంది. 13 హన్మకొండలోని వికాస్‌నగర్‌కు చెందిన ఆర్డబ్ల్యూఎస్ డీఈ బొడ్డు రాజేందర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. 15 వరంగల్ ఆర్డీఓగా మధు నియమితులయ్యారు. 17 వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్‌గా మర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమేష్‌బాబు నియమితులయ్యారు. 22 : కాళోజీ సతీమణి రుక్మిణి మరణించారు. 29 : వర్ధన్నపేట మండలం పున్నేలు క్రాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చెన్నారావుపేట మండలం లింగాపురానికి చెందిన ఆరుగురు దుర్మణం చెందారు. ఈ దుర్ఘటనలో మరో పక్షం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన {సవంతి(18) కూడా దుర్మరణం పాలైంది. ఫిబ్రవరి 1 సంగెం మండలం నల్లబెల్లికి చెందిన మేరుగు అశోక్(36), అతని కుమారుడు పండు(3)లను ఆస్తి తగాదాల నేపథ్యంలో ఆయన సోదరులు ఇదే మండలంలోని పల్లారుగూడ వద్ద దారికాచి హతమార్చారు. ఈ ఘటనలో అశోక్ భార్య నీలాదేవి తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. 4 ఆత్మకూరు మండలం గుడెప్పాడ్‌లోని విట్స్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి కడవెండి నీరజ్ భరద్వాజ్(19) తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 13 గణపురం మండలంలోని కాకతీయ లాంగ్వాల్ ప్రాజెక్టు సమీపంలో పెళ్లివ్యాను బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు. 14 జిల్లాలో కురిసిన వర్షానికి వరి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. రూ.128కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. మార్చి 18 2011-12 బెస్ట్ హెరిటేజ్ సిటీ వరంగల్ అవార్డును న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ప్రణబ్, కేంద్రమంత్రి చిరంజీవి చేతుల మీదుగా కలెక్టర్ రాహుల్ బొజ్జా అందుకున్నారు. 19 49 శివారు గ్రామాలను విలీనం చేస్తూ గ్రేటర్ వరంగల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 31 ధర్మసాగర్ మండలం ఉప్పుగల్లులోని చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో మునిగి రజిత(11), రవి(9), రాంబాబు, లక్ష్మయ్య(7) మృతిచెందారు. వీరిలో రాంబాబు తప్ప మిగతావారు ధర్మసాగర్ మండలం మద్దెలగూడేనికి చెందిన కమల మ్మ పిల్లలు. రాంబాబు ఆమె బంధువుల కుమారుడు. ఏప్రిల్ 1 ములుగు రోడ్డు శివారులోని శివానీ ఫార్మసీ కళాశాలలో జరుగుతున్న ఫార్మసీ సప్లిమెంటరీ పరీక్షలను ఒకరికిబదులు మరొకరు రాస్తూ 14మంది పట్టబడ్డారు. మరో ఇద్దరు పారిపోయారు. గూడూరు మండలం భూపతిపేట ప్రధాన రహదారిపై ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో గోవిందరావుపేట మండలం పస్రాకు చెందిన లకావత్ రజిత(33), చిన్న ఎల్లారం శివారు హామ్తండాకు చెందిన మాతంగి కమలమ్మ(50), వడ్డెరగూడేనికి చెందిన శివరాత్రి కొమురయ్య(65) మృతిచెందారు. 2 రూ.40వేలు లంచం తీసుకుంటూ దేవరుప్పులలో పనిచేస్తున్న ప్రొబేషనరీ ఎస్సై హమీద్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 7 హన్మకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలోని స్పేస్ అంధుల ఆశ్రమ నిర్వాహకురాలి భర్త బండారి భాస్కర్(45) రెండేళ్లుగా ఓ అంధ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. బాలిక పోలీసులను ఆశ్రయించడంతో బండారం బయటపడింది. 12 {పపంచ వారసత్వ వారోత్సవాలు ఖిలావరంగల్‌లో కనుల పండువగా ప్రారంభమయ్యాయి. 14 నకిలీ బధిర సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన 18మంది ఉపాధ్యాయుల గుట్టు రట్టయింది. 16 ఛత్తీస్‌గఢ్‌లోని జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుమ్మరితోపు అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో కేకేడబ్ల్యూ కీలక నేతలు హతమయ్యారు. 25 బంగారం రికవరీలో చేతివాటం ప్రదర్శించిన క్రైం డీఎస్పీ జోగయ్య, అర్బన్ సీసీఎస్ సీఐ మదన్‌లాల్‌తోపాటు మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. మే 1 హైకోర్టు జడ్జి రామ్మోహన్రావు కాజీపేటలో రైల్వే రెగ్యులర్ కోర్టును ప్రారంభించారు. 4 రాష్ట్రంలోనే మొదటిసారిగా రూ.60లక్షలతో వరంగల్‌లోని స్థానిక కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐబ్యాంకును మంత్రి సారయ్య ప్రారంభించారు. 17 పదోతరగతి పరీక్ష ఫలితాల్లో తెలంగాణ జిల్లాల్లో వరంగల్ మొదటిస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. 24 కేటీపీపీలో రికార్డుస్థాయిలో 50.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లావ్యాప్తంగా 26మంది వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. జూన్ 1 ఆర్వీఎం ఆధ్వర్యంలో విద్యా పక్షోత్సవాలు ప్రారంభం. 2 నల్గొండ జిల్లా రాయగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లింగాల ఘనపురం మండలంలోని వడిచర్లకు చెందిన కొలువుల బీరయ్య(47), అతడి కుమారుడు(24) మృతి చెందారు. 3 స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన సభలో కేసీఆర్ సమక్షంలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కడియం శ్రీహరి టీఆర్ఎస్లో చేరారు. 6 వరంగల్ కార్పొరేషన్‌కు రెండు అత్యుత్తమ పురస్కారాలు. హైదరాబాద్‌లో జరిగిన క్లీన్ ఇండియా-13 సదస్సులో సెరికల్చర్ కమిషనర్ రామలక్ష్మి, బ్లూక్రాస్ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల చేతుల మీదుగా కమిషనర్ వివేక్ యాదవ్ హరితమిత్ర, గ్రీన్లీఫ్-2013 అవార్డులను అందుకున్నారు. 22 ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న జిల్లావాసుల్లో కొందరు ఢిల్లీ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేట చేరుకున్నారు. 30 కలెక్టర్ రాహుల్ బొజ్జా బదిలీ అయ్యారు. వరంగల్ శివనగర్‌కు చెందిన రవికుమార్(27), రామన్నపేటకు చెందిన కుసుమ మధుసూదన్(27) పాకాల సరస్సులో మునిగి మృతిచెందారు. జూలై 2 జిల్లా కలెక్టర్‌గా జి.కిషన్ బాధ్యతలు స్వీకరించారు. 3 హన్మకొండలోని అభిరామ్ గార్డెన్స్‌లో జరిగిన పార్టీ పంచాయతీరాజ్ సమ్మేళనం, మరిపెడలో నిర్వహించిన సభలో వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. 6 ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరిపెడ మండలం విస్సంపల్లికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. 14 ‘నకిలీ బధిరుల’ బాగోతంలో నర్సింహులపేట మండలం పెద్దముప్పారం హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు జె.భాస్కర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 19 ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జిల్లా జలమయమైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. రాకపోకలు స్తంభించాయి. 23 తాడ్వాయిని సమ్మక్క-సారలమ్మ మండలంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 30 యూపీఏ సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయడంతో జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులు, ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఆగస్టు 2 ఎగువ ప్రాంతాల్లో కురిసిన వానలతో గోదావరి నది నీటిమట్టం 11.25 మీటర్లకు పెరిగింది. 23 జనగామ సమీపంలో లింగాల ఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన శివరాత్రి విజయ్ను గుర్తుతెలియని వ్యక్తులు రివాల్వర్‌తో కాల్చి చంపారు. 25 ‘నకిలీ బధిర’ సర్టిఫికెట్ల కేసులో సూత్రధారి బండి రమేష్‌ను వరంగల్ అర్బన్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 26 మహబూబాబాద్ మండలం బాబునాయక్‌తండాకు చెందిన ఆంగోతు లక్ష్మణ్పామర్ హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏకధాటిగా 22గంటలపాటు లెక్చర్ ఇచ్చి రికార్డు సృష్టించాడు. 28 హైదరాబాద్‌లోని జూబ్లీహాల్ జరిగిన కార్యక్రమంలో కవి చక్రవర్తి గుర్రం జాషువా పురస్కారాన్ని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ చేతుల మీదుగా డాక్టర్ అంపశయ్య నవీన్ అందుకున్నారు. అక్టోబర్ 3 భూములు, కొలతల అసిస్టెంట్ డెరైక్టర్ ఎస్.సమీనాబేగం, సర్వే ఇన్స్పెక్టర్ రాథోడ్ సుదర్శన్ ఏసీబీకి చిక్కారు. 5 మాజీ ఎమ్మెల్యే ఉమారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. 8 తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన పౌసుమిబసు వరంగల్ జేసీగా బదిలీ అయ్యారు. బల్దియా కమిషనర్ వివేక్ యాదవ్ గుంటూరు జేసీగా బదిలీ అయ్యారు. 9 కొత్త జేసీ పౌసుమిబసు విధుల్లో చేరారు. 15 నిట్‌లో జరిగిన 11వ స్నాతకోత్సవంలో ఆరు బంగారు పతకాలు, 550 పట్టాలు ప్రదానం చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్‌గా ముత్తినేని సోమేశ్వరరావు నియమితులయ్యారు. 24 విజయవాడ కమిషనర్ సువర్ణ పండాదాస్ వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. 27 రూరల్ ఎస్పీ పాలరాజు హైదరాబాద్ క్రైం డీసీపీగా బదిలీ అయ్యారు. 30 భారీ వర్షాలకు పంటలు నష్టపోవడంతో తట్టుకోలేక రెండు రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 19మంది తహసీల్దార్లు, ఏడుగురు డీటీలను ప్రభుత్వం బదిలీ చేసింది. నవంబర్ 5 అంతర్జిల్లా దొంగలను నర్సంపేట పోలీసులు పట్టుకుని 16 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 6 వరంగల్‌లోని నాయుడు పెట్రోల్ పంపులో ఫయీమ్ గ్యాంగ్‌కు చెందిన నలుగురు రౌడీషీటర్లు ఇద్దరు వర్కర్లపై దాడిచేశారు. రాయపర్తి పోలీసులు ఛేజ్ చేసి వారిని పట్టుకున్నారు. 9 హన్మకొండ జేఎన్ఎస్లో కాంగ్రెస్ నిర్వహించిన కృతజ్ఞత సభ విజయవంతమైంది. కేంద్రమంత్రులు జైపాల్‌రెడ్డి, బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. 11 ఓరుగల్లు క్రీడాకారిణి సిక్కిరెడ్డి బ్యాడ్మింటన్ డబుల్స్‌లో స్వర్ణం, మిక్స్డ్ డబుల్స్‌లో రజతం సాధించింది. 15 కాకతీయ యూనివర్సిటీలో సెంట్రల్ జోన్ హ్యాండ్‌బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. 18 కేయూలో 29వ అంతర్ యూనివర్సిటీ సెంట్రల్ జోన్ యువజనోత్సవాలు ప్రారంభమయ్యాయి. 23 : బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడడంతోపాటు ఆ వికృత చేష్టలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించిన ముగ్గురు బాలురపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. 28 : ప్రకృతి వ్యవసాయంపై హసన్‌పర్తి మండలంలోని చింతగట్టులో మూడు రోజులపాటు నిర్వహించ తలపెట్టిన శిక్షణ శిబిరానికి ప్రకృతి వ్యవసాయ పరిశోధకుడు సుభాష్‌పాలేకర్ హాజరయ్యారు. డిసెంబర్ 5 మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో చేర్యాల మండలం గౌరాయపల్లికి చెందిన తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెలు దుర్మరణం చెందారు. 8 తొర్రూరు మండలంలోని మాటేడు వద్ద ఓ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. 18 కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. 20 వరంగల్ కోట, వేయిస్తంభాల గుడి, రామప్ప దేవాలయంలో ఒకే సమయంలో కాకతీయ ముగింపు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 28 : కేయూలో సెంట్రల్ క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఆరు రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. -
జాతరకు సర్కారు సరుకు
మేడారంలో ఏపీబీసీఎల్ దుకాణాలు =ధరలు, నాటుసారా నియంత్రణకు చర్యలు =ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు సాక్షిప్రతినిధి, వరంగల్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. అధిక ధరలతో వ్యాపారుల దోపిడీని, నాటుసారాను నియంత్రించడం కోసం ప్రభుత్వ తరఫున ప్రత్యేకంగా దుకాణాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేడారం జాతర ఏర్పాట్లపై కలెక్టర్ జి.కిషన్ సమక్షంలో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు ప్రాథమికంగా నిర్ణయించారు. గిరిజనులకు ఇచ్చే లెసైన్స్ దుకాణాలకు తోడుగా ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్(ఏపీబీసీఎల్)తో జాతరలో దుకాణాలు పెట్టించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ దుకాణాలు ఉంటేనే లెసైన్స్‌దారులు ధరలు అదుపులో ఉంచుతారని, దీని వల్ల జాతరలో నాటు సారా, నాసిరకం మద్యాన్ని నియంత్రించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. జాతరలో ఏపీబీసీఎల్ దుకాణాల ఏర్పాటుపై జిల్లా స్థాయిలో తుది నిర్ణయం జరిగిన తర్వాత అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. మేడారం జాతరలో ముఖ్యంగా ఉండేది మద్యం, మాంసమే. ఇవే జాతరలో వ్యాపారులకు పెద్ద ఆదాయ వనరులు. మద్యం అమ్మకాల్లో గరిష్ట చిల్లర అమ్మకం ధర(ఎంఆర్పీ) అనేది ఇక్కడ ఎవరికీ పట్టని విషయం. జాతరకు వచ్చిన వారి అవసరం, అమ్మకందారుల ఇష్టం ప్రాతిపదికగా ధరలు ఉంటాయి. ప్రస్తుతం రూ.75 ఎంఆర్పీ ఉన్న క్వార్టర్ బాటిల్ మేడారంలో ఇప్పుడే రూ.130 ఉంది. జాతర సమయంలో ఏకంగా రూ.200కు విక్రయిస్తారు. ఒక్కోసారి ఈ ధరకు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణ ఎంత ఉన్నా ధరల నియంత్రణ సాధ్యంకాని అంశం. జాతర సమయంలో ఎంఆర్పీ ప్రకారమే తాడ్వాయి మండలం పరిధిలో సగటున కోటి రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతాయి. లెసైన్స్‌దారుల విక్రయించిన ప్రకారమైతే ఇది నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. మేడారం జాతరలో గిరిజన సంస్థలు, గిరిజనులే మద్యం దుకాణాలను నిర్వహించాల్సి ఉంటుంది. 2012లో జరిగిన జాతర కోసం ఎక్సైజ్ శాఖ 22 దుకాణాలకు లెసైన్స్‌లు జారీ చేసింది. ఈ దుకాణాల కోసం ప్రతిరోజు రూ.6 వేల లెసైన్స్ ఫీజు వసూలు చేయగా, రూ.కోటి వరకు వ్యాపారం జరిగింది. వచ్చే జాతరలో ఇది రెండు కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీబీసీఎల్ తరఫున దుకాణాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే జాతరలో సర్కారు దుకాణాల ఏర్పాటు మాత్రం స్థానిక గిరిజనుల స్పందనపైనే ఆధారపడి ఉండనుంది.