జనవరి
2 పరకాల నుంచి బొగ్గు లోడుతో వస్తున్న లారీ మైలారం ప్రధాన కూడలి వద్ద భూపాలపల్లికి చెందిన సంఘమిత్ర డిగ్రీ కళాశాల బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని బండి మౌనిక(20), బస్సు డ్రైవర్ అమరేందర్(45) మృతిచెందారు. 40మంది విద్యార్థులు గాయపడ్డారు. ‘కుడా’ వైస్ చైర్మన్‌గా అనురాధ నియమితులయ్యారు.
3 వరంగల్‌లోని చింతల్ ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న పాపయ్యపేట చమన్‌కు చెందిన రఫీక్ అహ్మద్ అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకు పొక్కింది. అమ్మాయి తల్లిదండ్రులు పాఠశాలపై దాడిచేశారు.
భూపాలపల్లి మండలం నేరేడుపల్లికి చెందిన పబ్బ శ్రీనివాస్, శారద దంపతుల కుమారుడు
మన్మోహన్(10), అదే గ్రామానికి చెందిన ఆరవేని తిరుపతి, మల్లమ్మ దంపతుల కుమారుడు అనిల్(8) కలిసి గ్రామ సమీపంలోని ఆరవేని కుంటలో చేపలు పట్టడానికి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారు.
4 శృంగేరి శ్రీ శార దా పీఠం పండితులు శ్రీ భారతీతీర్థ మహాస్వామి ఆధ్వర్యంలో వరంగల్‌లోని చారిత్రక భద్రకాళి దేవాలయంలో మహాకుంబాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. వేదపాఠశాలను ప్రారంభించారు.
5 గుప్తనిధుల కోసం అన్వేషణ చేసే ముఠాలో తగాదాలు రావడంతో భూపాలపల్లిలోని కారల్‌మార్క్స్ కాలనీకి చెందిన ధర్మారావు(50)ను ముఠా సభ్యులు హత్య చేశారు. ధర్మారావు ఏరియాలోని కాకతీయలాంగ్‌వాల్ ప్రాజెక్టులో లాంప్‌రూప్ అటెండెంట్‌గా పనిచేసేవాడు. హత్య విషయం ఎనిమిది రోజుల తర్వాత వెలుగుచూసింది.
8 కురవి మండలం బేతోలు శివారు మల్యాల క్రాస్‌రోడ్డు వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మానుకోటకు చెందిన దేవి(12) మృతిచెందింది. మహబూబాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సూర్యాపేట వెళ్తుండగా బస్సు అదుపు తప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.
8 పెద్దలను ఎదిరించే ధైర్యం లేని ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిట్యాల గ్రామానికి చెందిన పంజాల పూజ(20) మద్దూరు మండలం అర్జునపట్లకు చెందిన తాళ్ల పల్లిరాజు(20) నల్గొండ జిల్లా ఆలేరు వద్ద రైలుకిందపడి
ఆత్మహత్య చేసుకున్నారు.
9 విద్యుత్ చార్జీల పెంపును, కోతలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా సబ్‌స్టేషన్ల ఎదుట ఆందోళను నిర్వహించారు.
11 గణపురం మండలం చెల్పూరులో జరిగిన అగ్నిప్రమాదంలో గ్రామానికి చెందిన తోట సాంబయ్య ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.14.5లక్షల నగదు, పది తులాల బంగారం, 70క్వింటాళ్ల పత్తి కాలి బూడిదైంది.
13 హన్మకొండలోని వికాస్‌నగర్‌కు చెందిన ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ బొడ్డు రాజేందర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
15 వరంగల్ ఆర్డీఓగా మధు నియమితులయ్యారు.
17 వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్‌గా మర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమేష్‌బాబు నియమితులయ్యారు.
22 : కాళోజీ సతీమణి రుక్మిణి మరణించారు.
29 : వర్ధన్నపేట మండలం పున్నేలు క్రాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చెన్నారావుపేట మండలం లింగాపురానికి చెందిన ఆరుగురు దుర్మణం చెందారు. ఈ దుర్ఘటనలో మరో పక్షం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన
{సవంతి(18) కూడా దుర్మరణం పాలైంది.
ఫిబ్రవరి
1 సంగెం మండలం నల్లబెల్లికి చెందిన మేరుగు అశోక్(36), అతని కుమారుడు పండు(3)లను ఆస్తి తగాదాల నేపథ్యంలో ఆయన సోదరులు ఇదే మండలంలోని పల్లారుగూడ వద్ద దారికాచి హతమార్చారు. ఈ ఘటనలో అశోక్ భార్య నీలాదేవి తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది.
4 ఆత్మకూరు మండలం గుడెప్పాడ్‌లోని విట్స్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి కడవెండి నీరజ్ భరద్వాజ్(19) తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
13 గణపురం మండలంలోని కాకతీయ లాంగ్‌వాల్ ప్రాజెక్టు సమీపంలో పెళ్లివ్యాను బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు.
14 జిల్లాలో కురిసిన వర్షానికి వరి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. రూ.128కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
మార్చి
18 2011-12 బెస్ట్ హెరిటేజ్ సిటీ వరంగల్ అవార్డును న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్, కేంద్రమంత్రి చిరంజీవి చేతుల మీదుగా కలెక్టర్ రాహుల్ బొజ్జా అందుకున్నారు.
19 49 శివారు గ్రామాలను విలీనం చేస్తూ గ్రేటర్ వరంగల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
31 ధర్మసాగర్ మండలం ఉప్పుగల్లులోని చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో మునిగి రజిత(11), రవి(9), రాంబాబు, లక్ష్మయ్య(7) మృతిచెందారు. వీరిలో రాంబాబు తప్ప మిగతావారు ధర్మసాగర్ మండలం మద్దెలగూడేనికి చెందిన కమల మ్మ పిల్లలు. రాంబాబు ఆమె బంధువుల కుమారుడు.
ఏప్రిల్
1 ములుగు రోడ్డు శివారులోని శివానీ ఫార్మసీ కళాశాలలో జరుగుతున్న ఫార్మసీ సప్లిమెంటరీ పరీక్షలను ఒకరికిబదులు మరొకరు రాస్తూ 14మంది పట్టబడ్డారు. మరో ఇద్దరు పారిపోయారు.
గూడూరు మండలం భూపతిపేట ప్రధాన రహదారిపై ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో గోవిందరావుపేట మండలం పస్రాకు చెందిన లకావత్ రజిత(33), చిన్న ఎల్లారం శివారు హామ్‌తండాకు చెందిన మాతంగి కమలమ్మ(50), వడ్డెరగూడేనికి చెందిన శివరాత్రి
కొమురయ్య(65) మృతిచెందారు.
2 రూ.40వేలు లంచం తీసుకుంటూ దేవరుప్పులలో పనిచేస్తున్న ప్రొబేషనరీ ఎస్సై హమీద్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
7 హన్మకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలోని స్పేస్ అంధుల ఆశ్రమ నిర్వాహకురాలి భర్త బండారి భాస్కర్(45) రెండేళ్లుగా ఓ అంధ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. బాలిక పోలీసులను ఆశ్రయించడంతో బండారం బయటపడింది.
12 {పపంచ వారసత్వ వారోత్సవాలు ఖిలావరంగల్‌లో కనుల పండువగా ప్రారంభమయ్యాయి.
14 నకిలీ బధిర సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన 18మంది ఉపాధ్యాయుల గుట్టు రట్టయింది.
16 ఛత్తీస్‌గఢ్‌లోని జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుమ్మరితోపు అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేకేడబ్ల్యూ కీలక నేతలు హతమయ్యారు.
25 బంగారం రికవరీలో చేతివాటం ప్రదర్శించిన క్రైం డీఎస్పీ జోగయ్య, అర్బన్ సీసీఎస్ సీఐ మదన్‌లాల్‌తోపాటు మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు.
మే
1 హైకోర్టు జడ్జి రామ్మోహన్‌రావు కాజీపేటలో రైల్వే రెగ్యులర్ కోర్టును ప్రారంభించారు.
4 రాష్ట్రంలోనే మొదటిసారిగా రూ.60లక్షలతో వరంగల్‌లోని స్థానిక కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐబ్యాంకును మంత్రి సారయ్య ప్రారంభించారు.
17 పదోతరగతి పరీక్ష ఫలితాల్లో తెలంగాణ జిల్లాల్లో వరంగల్ మొదటిస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది.
24 కేటీపీపీలో రికార్డుస్థాయిలో 50.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లావ్యాప్తంగా 26మంది వడదెబ్బతో మృత్యువాత పడ్డారు.
జూన్
1 ఆర్వీఎం ఆధ్వర్యంలో విద్యా
పక్షోత్సవాలు ప్రారంభం.
2 నల్గొండ జిల్లా రాయగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లింగాల ఘనపురం మండలంలోని వడిచర్లకు చెందిన కొలువుల బీరయ్య(47), అతడి కుమారుడు(24) మృతి చెందారు.
3 స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన సభలో కేసీఆర్ సమక్షంలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కడియం శ్రీహరి టీఆర్‌ఎస్‌లో చేరారు.
6 వరంగల్ కార్పొరేషన్‌కు రెండు అత్యుత్తమ పురస్కారాలు. హైదరాబాద్‌లో జరిగిన క్లీన్ ఇండియా-13 సదస్సులో సెరికల్చర్ కమిషనర్ రామలక్ష్మి, బ్లూక్రాస్ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల చేతుల మీదుగా కమిషనర్ వివేక్ యాదవ్ హరితమిత్ర, గ్రీన్‌లీఫ్-2013 అవార్డులను
అందుకున్నారు.
22 ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న జిల్లావాసుల్లో కొందరు ఢిల్లీ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేట చేరుకున్నారు.
30 కలెక్టర్ రాహుల్ బొజ్జా బదిలీ అయ్యారు.
వరంగల్ శివనగర్‌కు చెందిన రవికుమార్(27), రామన్నపేటకు చెందిన కుసుమ మధుసూదన్(27) పాకాల
సరస్సులో మునిగి మృతిచెందారు.
జూలై
2 జిల్లా కలెక్టర్‌గా జి.కిషన్ బాధ్యతలు
స్వీకరించారు.
3 హన్మకొండలోని అభిరామ్ గార్డెన్స్‌లో జరిగిన పార్టీ పంచాయతీరాజ్ సమ్మేళనం, మరిపెడలో నిర్వహించిన సభలో వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు.
6 ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరిపెడ మండలం విస్సంపల్లికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.
14 ‘నకిలీ బధిరుల’ బాగోతంలో నర్సింహులపేట మండలం పెద్దముప్పారం హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు జె.భాస్కర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
19 ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జిల్లా జలమయమైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. రాకపోకలు స్తంభించాయి.
23 తాడ్వాయిని సమ్మక్క-సారలమ్మ మండలంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
30 యూపీఏ సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయడంతో జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులు, ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
ఆగస్టు
2 ఎగువ ప్రాంతాల్లో కురిసిన వానలతో గోదావరి నది నీటిమట్టం 11.25 మీటర్లకు పెరిగింది.
23 జనగామ సమీపంలో లింగాల ఘనపురం మండలం
నెల్లుట్లకు చెందిన శివరాత్రి విజయ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు రివాల్వర్‌తో కాల్చి చంపారు.
25 ‘నకిలీ బధిర’ సర్టిఫికెట్ల కేసులో సూత్రధారి బండి రమేష్‌ను వరంగల్ అర్బన్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సెప్టెంబర్
26 మహబూబాబాద్ మండలం బాబునాయక్‌తండాకు చెందిన ఆంగోతు లక్ష్మణ్‌పామర్ హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏకధాటిగా 22గంటలపాటు లెక్చర్ ఇచ్చి రికార్డు సృష్టించాడు.
28 హైదరాబాద్‌లోని జూబ్లీహాల్ జరిగిన కార్యక్రమంలో కవి చక్రవర్తి గుర్రం జాషువా పురస్కారాన్ని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ చేతుల మీదుగా డాక్టర్ అంపశయ్య నవీన్ అందుకున్నారు.
అక్టోబర్
3 భూములు, కొలతల అసిస్టెంట్ డెరైక్టర్ ఎస్.సమీనాబేగం, సర్వే ఇన్‌స్పెక్టర్ రాథోడ్ సుదర్శన్ ఏసీబీకి చిక్కారు.
5 మాజీ ఎమ్మెల్యే ఉమారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు.
8 తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన
పౌసుమిబసు వరంగల్ జేసీగా బదిలీ అయ్యారు.
బల్దియా కమిషనర్ వివేక్ యాదవ్ గుంటూరు జేసీగా బదిలీ అయ్యారు.
9 కొత్త జేసీ పౌసుమిబసు విధుల్లో చేరారు.
15 నిట్‌లో జరిగిన 11వ స్నాతకోత్సవంలో ఆరు బంగారు పతకాలు, 550 పట్టాలు ప్రదానం చేశారు.
వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్‌గా ముత్తినేని సోమేశ్వరరావు
నియమితులయ్యారు.
24 విజయవాడ కమిషనర్ సువర్ణ పండాదాస్ వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.
27 రూరల్ ఎస్పీ పాలరాజు హైదరాబాద్ క్రైం డీసీపీగా బదిలీ అయ్యారు.
30 భారీ వర్షాలకు పంటలు నష్టపోవడంతో తట్టుకోలేక రెండు రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
19మంది తహసీల్దార్లు, ఏడుగురు డీటీలను ప్రభుత్వం బదిలీ చేసింది.
నవంబర్
5 అంతర్‌జిల్లా దొంగలను నర్సంపేట పోలీసులు పట్టుకుని 16 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
6 వరంగల్‌లోని నాయుడు పెట్రోల్ పంపులో ఫయీమ్ గ్యాంగ్‌కు చెందిన నలుగురు రౌడీషీటర్లు ఇద్దరు వర్కర్లపై దాడిచేశారు. రాయపర్తి పోలీసులు ఛేజ్ చేసి వారిని పట్టుకున్నారు.
9 హన్మకొండ జేఎన్‌ఎస్‌లో కాంగ్రెస్ నిర్వహించిన కృతజ్ఞత సభ విజయవంతమైంది. కేంద్రమంత్రులు జైపాల్‌రెడ్డి, బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.
11 ఓరుగల్లు క్రీడాకారిణి సిక్కిరెడ్డి బ్యాడ్మింటన్ డబుల్స్‌లో స్వర్ణం, మిక్స్‌డ్ డబుల్స్‌లో రజతం సాధించింది.
15 కాకతీయ యూనివర్సిటీలో సెంట్రల్ జోన్ హ్యాండ్‌బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి.
18 కేయూలో 29వ అంతర్ యూనివర్సిటీ సెంట్రల్ జోన్ యువజనోత్సవాలు ప్రారంభమయ్యాయి.
23 : బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడడంతోపాటు ఆ వికృత చేష్టలను మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించిన ముగ్గురు బాలురపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు.
28 : ప్రకృతి వ్యవసాయంపై హసన్‌పర్తి మండలంలోని చింతగట్టులో మూడు రోజులపాటు నిర్వహించ తలపెట్టిన శిక్షణ శిబిరానికి ప్రకృతి వ్యవసాయ పరిశోధకుడు సుభాష్‌పాలేకర్ హాజరయ్యారు.
డిసెంబర్
5 మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో చేర్యాల మండలం గౌరాయపల్లికి చెందిన తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెలు దుర్మరణం చెందారు.
8 తొర్రూరు మండలంలోని మాటేడు వద్ద ఓ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
18 కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు.
20 వరంగల్ కోట, వేయిస్తంభాల గుడి, రామప్ప దేవాలయంలో ఒకే సమయంలో కాకతీయ ముగింపు
ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
28 : కేయూలో సెంట్రల్ క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఆరు రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు.
2013 క్యాలెండర్ గిర్రున తిరిగింది
Published Tue, Dec 31 2013 4:55 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement
Advertisement