anuradha
-
సినిమాను మించిన స్టోరీ.. విడాకుల తర్వాత ఆరేళ్లకు..!
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా లైఫ్.. సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదు. అనురాధ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లపాటు కలిసి కాపురం చేసిన వీరు అంతలోనే విడిపోయారు. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. కానీ ఆ దూరాన్ని ఎంతోకాలం భరించలేకపోయారు. ఆరేళ్ల తర్వాత ఒకరి కోసం మరొకరు తీవ్రంగా తపించారు. తిరిగి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ మళ్లీ పెళ్లి ఒక సెన్సేషన్..ఇద్దరి తప్పుతాజాగా అనురాధ.. భర్త సంజయ్‌తో తన అనుబంధం గురించి మాట్లాడింది. 'మేము విడిపోవడానికి సంజయ్ ఒక్కడే కారణం కాదు. నా వాటా కూడా ఉంది. ఒకానొక సమయంలో ఇక చాలు, నా వల్ల కాదు అనిపించింది. అందుకే విడాకులు తీసుకున్నాం. అయితే అప్పట్లో నా భర్తకు ఎఫైర్స్ ఉన్నాయని రూమర్స్ వచ్చాయి. కానీ నేను అవేమీ నమ్మలేదు. అందరికంటే ఎక్కువగా నా భర్తనే నమ్మాను. విడిపోయినప్పుడు కూడా అతడు నాతో, నా కుటుంబంతో టచ్‌లోనే ఉన్నాడు.విడిపోయాక కూడా..సంజయ్ అంటే నా కుటుంబానికి ఎంతో ఇష్టం. విడాకుల తర్వాత తన బంగ్లాలో ఎప్పుడూ ఏదో ఒక పార్టీ నిర్వహించేవాడు. మాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. అలా కొన్నిసార్లు నేను కూడా తన పార్టీలకు హాజరయ్యేదాన్ని. ఫ్రెండ్స్‌తో కాసేపు చిల్ అయి వెళ్లిపోయేదాన్ని. ప్రతి ఆరు నెలలకోసారి మళ్లీ కలిసిపోదామా అని అడిగేవాడు. అలా చివరకు మళ్లీ పెళ్లి చేసుకున్నాం' అని చెప్పుకొచ్చింది. కాగా అనురాధ ఇటీవలే మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ 2024 కిరీటం అందుకుంది.చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ సినిమా -
అయినవాళ్లు సహకరిస్తలేరని.. తల్లీకూతుళ్ల విషాదం!
మహబూబ్‌నగర్: వారసత్వ భూమి విక్రయించగా వచ్చిన డబ్బుల్లో వాటా ఇచ్చి.. తమ బిడ్డ పెళ్లి, కుమారుడి చదువుకు సహకరించాలని అయిన వాళ్లను ప్రాధేయపడినా పట్టించుకోకపోవడంతో ఓ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. కూతురితో సహా భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డారు. మొదట తల్లీకూతురు పురుగు మందు తాగగా.. తండ్రి భయపడి మిన్నంకుండిపోయాడు.విషయం తెలుసుకున్న స్థానికులు తల్లీకూతురిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే కన్నుమూసిన విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఏ బూడిదపాడు గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. ఏ బూడిదపాడుకు చెందిన మాల హరన్నకు నలుగురు కుమారులు ఉండగా.. ఎకరా పట్టా పొలం, 30 గుంటల అసైన్డ్ (సీలింగ్) పొలాన్ని అన్నదమ్ముళ్లకు పంచారు.పట్టా పొలం రెండవ, మూడవ కుమారుడికి పంపకాల్లో రాగా.. పెద్ద కుమారుడైన నర్సింహులు, చిన్న కుమారుడికి 30 గుంటల సీలింగ్ భూమి వచ్చింది. కొన్నేళ్ల కిందట ఇద్దరు అన్నదమ్ములు పట్టా పొలాన్ని అమ్ముకున్నారు. సీలింగ్ పొలాన్ని ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో నర్సింహులు కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కూతురి పెళ్లి, కుమారుడి చదువు వారికి భారంగా మారింది. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందులు తోడయ్యాయి. దీంతో అమ్మిన పట్టా పొలం డబ్బులను అందరికీ సమానంగా పంచాలని అన్నదమ్ముళ్లతో గొడవ పెట్టుకోవడంతోపాటు పెద్దలను ఆశ్రయించారు.తన బిడ్డ పెళ్లి, కుమారుడి చదువు కోసం డబ్బులు అవసరమని.. పట్టా పొలంలో తనకూ వాటా ఇవ్వాలని ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో నర్సింహులు, అతడి భార్య వరలక్ష్మి (39), కూతురు అనురాధ(18) పురుగు మందు తాగి, చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో మొదట వరలక్ష్మి, ఆమె కూతురు పురుగు మందు తాగారు. నరసింహులు పురుగుల మందు తాగడానికి భయపడి విరమించుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు.. తల్లీకూతురిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.కళ్ల ముందే భార్య, కూతురు చనిపోవడంతో నర్సింహులు కుప్పకూలిపోయాడు. తల్లీ కూతురి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు శాంతినగర్ ఏఎస్ఐ అయ్యన్న తెలిపారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
నాపై జగనన్న ఉంచిన నమ్మకాన్ని నిలపెట్టుకుంటాను: అనురాధ
-
ఆళ్ల రామకృష్ణ రెడ్డి కౌంటర్
-
Lok sabha elections 2024: బీజేపీలో చేరిన అనురాధా పౌడ్వాల్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రముఖ బాలీవుడ్ గాయని అనురాధా పౌడ్వాల్ బీజేపీలో చేరారు. శనివారం ఆమె ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేతలు అరుణ్ సింగ్, అనిల్ బలూనీ తదితరుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సనాతన ధర్మం కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, బీజేపీ విధానాలు ఎంతగానో నచ్చాయని అన్నారు. అందుకే బీజేపీలో చేరుతున్నట్లు ఆమె మీడియాతో పేర్కొన్నారు. మొదట్లో సినిమా పాటలు పాడిన అనురాధా పౌడ్వాల్ తర్వాత ఆధ్యాత్మిక గీతాల ద్వారా ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. 2017లో కేంద్రం ఆమెను ‘పద్మశ్రీ’తో గౌరవించింది. -
గ్యాంగ్‌స్టర్, లేడీ డాన్ల పెళ్లికి గ్యాంగ్‌వార్ ముప్పు? భారీ పోలీసు బందోబస్తు!
దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకలోగల సంతోష్ మ్యారేజ్ గార్డెన్లో గ్యాంగ్‌స్టర్ కాలా జఠేడి, లేడీ డాన్ అనురాధల వివాహం నేడు (మార్పి 12) జరగనుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. కొద్దిమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. అయితే గ్యాంగ్‌వార్ ముప్పును దృష్టిలో పెట్టుకుని మ్యారేజ్ గార్డెన్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అతిథులను బార్ కోడ్ ద్వారా గుర్తించి, ప్రవేశం కల్పించనున్నారు. మ్యారేజ్ గార్డెన్లో పలు సీసీటీవీలను ఏర్పాటు చేశారు. వీటి పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. మ్యారేజ్ హాల్ చుట్టూ ఉన్న రోడ్లను కూడా ఎప్పటికప్పుడు సీసీటీవీలతో పర్యవేక్షిస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నాలుగు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు ఈ వివాహంపై దృష్టి పెట్టాయి. గ్యాంగ్ వార్ ముప్పు దృష్ట్యా సంతోష్ గార్డెన్ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలు, దుకాణాలను పోలీసులు మూసివేయించారు. రెండు రోజుల క్రితం ఐదుగురు షూటర్లను పోలీసులు మ్యారేజ్ గార్డెన్ సమీపంలో అరెస్ట్ చేశారు. కాలా జఠేడికి పలు ముఠాల నుండి ముప్పు ఉంది. వాటిలో బంబిహా గ్యాంగ్ పేరు మొదట వినిపిస్తుంది. బంబిహా గ్యాంగ్‌కి చెందిన షూటర్లు కాలా జఠేడితో పాటు అతని గ్యాంగ్‌పై దాడి చేయడానికి నిత్యం వెదుకుతుంటారని పోలీసులు దగ్గర సమాచారం ఉంది. గ్యాంగ్‌స్టర్, లేడీ డాన్ల వివాహ వేదికను పూలతో అందంగా అలంకరించారు. అతిథులు కూర్చునేందుకు అద్భుతమైన సోఫాలను ఏర్పాటు చేశారు. అతిథుల విందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. VIDEO | Tight security for gangster Sandeep alias Kala Jathedi's marriage with "history-sheeter" Anuradha Choudhary alias 'Madam Minz' in #Delhi. The Delhi Police has made a strategic plan to avert any incident of gang-wars or possibility of Sandeep's escape from custody,… pic.twitter.com/9YQPB9950U — Press Trust of India (@PTI_News) March 12, 2024 -
‘సప్తపర్ణ’ శోభితం... సురభి ‘భక్త ప్రహ్లాద’ నాటకం
జంట నగరాలలోని నాటక కళాభిమానులకు మరోసారి కన్నుల విందయింది. ప్రసిద్ధ సాంస్కృతిక సభాంగణం ‘సప్తపర్ణి’ 20వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆరుబయలు ప్రాంగణంలో రెండురోజుల పాటు ‘సురభి’ వారి నాటకాల ప్రత్యేక ప్రదర్శనలు ఆనందాన్ని పంచాయి. శనివారం ‘మాయా బజార్’ నాటకం ప్రదర్శించగా, ఆదివారం క్రిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ‘భక్త ప్రహ్లాద’ నాటక ప్రదర్శన రెండుగంటల పైచిలుకు పాటు ఆద్యంతం రసవత్తరంగా నడిచింది. భాగవత పురాణ కథే అయినప్పటికీ, సంభాషణల్లో కొత్త తరానికి సులభంగా అర్థమయ్యే సమకాలీనతను జొప్పించడం గమనార్హం. 1932లో రిలీజైన తొలి పూర్తి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’కు సైతం ఈ నాటకమే ఆధారం కావడం విశేషం. కాగా, తాజా నాటక ప్రదర్శనలో రోజారమణి నటించిన ఏవీఎం వారి పాపులర్ ‘భక్త ప్రహ్లాద’ సినిమాలోని ‘నారాయణ మంత్రం...’, ‘జీవము నీవే కదా...’ లాంటి పాటలను సైతం జనాకర్షకంగా సందర్భోచితంగా వాడుకోవడం గమనార్హం. నటీనటులు, సంగీత, లైటింగ్ సహకారం అంతా చక్కగా అమరిన ఈ నాటకంలో ఆరేళ్ళ పసిపాప ప్రహ్లాదుడిగా నటిస్తూ, పాటలు, భాగవత పద్యాలను పాడడం అందరినీ మరింత ఆకర్షించింది. గాలిలో తేలుతూ వచ్చే సుదర్శన చక్రం, పామును గాలిలో ఎగురుతూ వచ్చి గద్ద తన్నుకుపోవడం, మొసలిపై ప్రహ్లాదుడు, స్టేజీ మీద గాలిలోకి లేచే మంటలు లాంటి ‘సురభి’ వారి ట్రిక్కులు మంత్రముగ్ధుల్ని చేశాయి. చిన్న పిల్లలతో పాటు పెద్దల్ని సైతం పిల్లల్ని చేసి, పెద్దపెట్టున హర్షధ్వానాలు చేయించాయి. ఏకంగా 150 ఏళ్ళ పై చిలుకు చరిత్ర కలిగిన ‘సురభి’ నాటక వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆరో తరానికి చెందిన ఆర్. జయచంద్రవర్మ సారథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 52 మంది దాకా నటీనటులు, సంగీత వాద్యకళాకారులు కలసి ఈ ప్రదర్శనలు చేయడం విశేషం. కిక్కిరిసిన ఆరుబయలు ప్రాంగణం, గోడ ఎక్కి కూర్చొని మరీ చూస్తున్న నాటక అభిమానులు, ఆద్యంతం వారి చప్పట్లు... వేదికపై ప్రదర్శన ఇస్తున్న నటీనటులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. కరోనా సమయంలో తమను ఎంతో ఆదుకొని, ప్రేక్షకులకూ – తమకూ వారధిగా నిలిచి, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసిన రంగస్థల పోషకురాలు – ‘సప్తపర్ణి’ నిర్వాహకురాలు అనూరాధను ‘సురభి’ కళాకారులు ప్రత్యేకంగా సత్కరించి, తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఎంబీఏ, సీఏ లాంటి పెద్ద చదువులు చదివిన పెద్దల నుంచి స్కూలు పిల్లల వరకు అందరూ ఈ రెండు రోజుల నాటక ప్రదర్శనల్లో నటించడం చెప్పుకోదగ్గ విశేషం. ఇది తెలుగు వారు కాపాడుకోవాల్సిన ప్రత్యేకమైన ‘సురభి’ కుటుంబ నాటక వారసత్వమని ప్రదర్శనలకు హాజరైన పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. -రెంటాల జయదేవ -
ఇల్లెందులో.. స్వతంత్ర అభ్యర్థిగా గుమ్మడి అనురాధ!
సాక్షి, భద్రాద్రి/ఇల్లెందు: ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు గుమ్మడి అనురాధ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. స్వతంత్రంగా పోటీ చేసే అనురాధకు తమ పార్టీ మద్దతు ఉంటుందని శనివారం సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ప్రకటించారు. దీంతో ఐదుసార్లు ఇల్లెందు ఎమ్మెల్యేగా ఎన్నికై న గుమ్మడి నర్సయ్య ఈసారి పోటీ చేయటం లేదని తేలిపోయింది. కారేపల్లి మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన గుమ్మడి నర్సయ్య– అమ్మక్కల కుమార్తె ఉస్మానియా లా కళాశాల అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, పీహెచ్డీ పూర్తి చేశారు. ఇవి చదవండి: సరిహద్దుల్లో పటిష్ట నిఘా! కలెక్టర్‌తో వ్యయ పరిశీలకుల భేటీ.. -
వేగుచుక్కల వెలుగు కథలు
చరిత్ర వలెనె సాహిత్య చరిత్ర కూడా ఎప్పటికప్పుడు ఉపాంతీకరణకు గురైన భిన్న సామాజిక వర్గాల క్రియాశీల శక్తి సామ ర్థ్యాలనూ, సృజన విమర్శ శక్తులనూ సమీకరించి, చేర్చుకొంటూ సమగ్రం కావాల్సిందే. అలా తెలుగు సాహిత్య చరిత్ర స్త్రీల, దళిత బహుజనుల, ముస్లిముల సాహిత్యంతో 1980ల నుండి చెతన్యవంతంగా సంపద్వంత మవుతూనే ఉంది. ఈ చరిత్రలో భాగంగానే ‘విరసం’ ఇప్పుడు ‘వియ్యుక్క’ అనే పేరుతో ఆరు కథా సంకలనాలు ప్రచురిస్తున్నది. ‘‘ఈ సంకలనాల్లో చేరిన కథలు అజ్ఞాత మావోయిస్టు ఉద్యమంలో పని చేసి అమరులైనవారూ, కొనసాగుతున్నవారూ, అరెస్టయినవారూ, ఏ ఇతర కారణాల వల్లనైనా కొంత కాలం పని చేసి బయట ఉన్నవారూ రాసిన కథలు’’ అంటారు సంకలనాల సంపాదకు రాలు బి. అనురాధ. ఆ రకంగా అటు విప్లవ సాహిత్యంలోనూ ఇటు స్త్రీల సాహిత్యంలోనూ ఇది ఒక చారిత్రక ఘట్టం. 2007 నుండి అజ్ఞాత రచయిత్రుల కథల సేకరణ చేస్తూ వచ్చిన అనురాధ స్త్రీల పేర్లతో ఉన్న కథలు అన్నీ స్త్రీలు రాసినవో కావో నిర్ధారించుకొనటానికి, ఒక రచయిత్రి ఎన్ని కలం పేర్లతో రాసిందో గుర్తించిఒక పేరును ఖరారు చెయ్యటానికి అనుసరించిన పద్ధతులు చాలాఆసక్తికరమైనవి. మహిళా ఉద్యమంతో తనకు ఉన్న సంబంధంతో పాటు, ఈ కథల గురించి విరసం ప్రకటనకు ఆ రచయిత్రులుస్పందించి పత్రికా ముఖంగా ఇచ్చిన వివరాలు కూడా ఈ పనికి ఉపకరించాయి అంటుందామె. ‘వియ్యుక్క’ గోండీ భాషాపదం. వేగుచుక్క అని దాని అర్థం.ఇందులోని 282 కథలు 52 మంది మహిళా విప్లవకారులు రాసినవి. స్త్రీల కథాసంకలనాలు ఎన్నో వచ్చాయి గానీ ఒక రాజకీయార్థిక సామాజిక అవగాహన కలిగిన 52 మంది స్త్రీల సంకలనాలు మాత్రం ఇప్పటికి ఇవే. వ్యక్తులుగా ఎవరు ఎన్ని కథలు రాశారన్నది చెప్పటం ఈ సంకలనాల ఉద్దేశం కాదు. ఒకటి రెండు కథలు రాసినవాళ్లు కూడా ఇందులో ఉన్నారు. విప్లవ జీవితం అందరికీ సమష్టి అనుభవం. ఆ అవగాహన నుండే విప్లవోద్యమంలో వచ్చిన పరిణామాన్ని స్త్రీల అనుభవ కోణం నుండి నమోదు చేయటం ఈ సంకలనాలకు లక్ష్యం. ఆరు సంకలనాలలో మొదటి మూడు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. మొత్తం ఈ 146 కథలకు విప్లవోద్యమమే వస్తువు. సొంత కుటుంబాలు, ఆస్తులు, పేర్లు – అన్నీ వదులుకొని శ్రామిక వర్గ ప్రయోజనాల కోసం, ఉత్పత్తి సంబంధాలలో మార్పు కోసం, ఉన్నత మానవీయ విలువలతో నూతన సమాజ నిర్మాణం కోసం విప్లవోద్యమంలోకి వెళ్ళిన వాళ్ళ అనుభవ కథనాలు ఇవి. ఈ కథలకు వస్తువైన జీవిత సందర్భాలు, శకలాలు భిన్నం కావచ్చు. కానీ సాధారణ ప్రజల అసాధారణ ధిక్కారం ఈ అన్ని కథలకూ అంతః సూత్రం. ఆచారాలు, రివాజులు, దోపిడీ, పీడన, రాజ్యం, దాని అణచివేత, సామ్రాజ్యవాద చొరబాటు వంటివన్నీ ఈ కథల సాధారణ అంశం. దాని సారం క్రియాశీల సౌందర్యం. ప్రాణాలు పణం పెట్టే సంసిద్ధత, మృత్యువుతో క్రీడలు, వీటన్నిటి దుఃఖోద్వేగాలు ఈ కథల ప్రత్యేకత. ఇవన్నీ వ్యక్తిగత స్థాయిని దాటి విశ్వ ప్రేమగా ఈ కథలలో ఆవిష్కృతమయ్యాయి. గనుల తవ్వకాలకు అడవులను ఆక్రమిస్తున్న బహుళ జాతి కంపెనీ లకు మద్దతును ఇచ్చే ప్రభుత్వ అభివృద్ధి నమూనాకు ఆదివాసీల నిర్వాసితత్వానికి ఉన్న సంబంధాన్ని మానవ సంబంధాలలో భాగంగా అర్థం చేయించే సోయి, ‘సీతాబాయి గెలుపు’, ‘లక్ష్మణరేఖ’ వంటి కథలు ఎన్నో ఇందులో ఉన్నాయి. విప్లవోద్యమం మనుషులను అన్య వర్గ, ఆధిక్య భావన నుండి విముక్తం చేసి కొత్త మనుషులుగా మారు స్తుందని ‘చాయ్ గ్లాస్’ (2012) కథ చెప్తుంది. అహంకారాన్నీ, అధికా రాన్నీ వదులుకొంటూ ఎదుటివాళ్లను వినగలిగిన, వాళ్ళ నుండి నేర్చు కొనగలిగిన సంసిద్ధత విప్లవ సాంస్కృతిక పర్యావరణంలోనే సాధ్య మని ‘ఇద్దరు శస్త్రకారులు’ కథ నిరూపిస్తుంది. ఎన్కౌంటర్ అయిన పిల్లల శవాల కోసం ఆసుపత్రికి వెళ్లిన తల్లులు... మరణించిన బిడ్డలందరి కోసం తల్లులందరి గర్భశోకాన్ని మోసేవాళ్ళు కావటం, ఆ బిడ్డలకు అంత్యక్రియలు గౌరవకరంగా జరగాలనుకొని తమ కడుపున పుట్టకపోయినా ఒడిలోకి తీసుకొని బిడ్డలుగా ప్రకటించే చైతన్యవంతులు కావటం అత్యంత సహజంగా చిత్రితమైన కథలు ‘ఈ శోకం ఎందరిది’, ‘నాబిడ్డనే’, ‘ముగ్గురు తల్లులు’. వాళ్ళు విప్లవ విశ్వమాతలుగా ఎదిగినవాళ్లు. మాతృత్వం విప్లవ మాతృత్వంగా ఆకాశమే హద్దుగా వ్యాపించటం ఈ కథల విశిష్టత. మావోయిస్టుల కార్యకలాపాల గురించీ, దళ జీవితం గురించీ, గిరిజనులకు వాళ్లకు ఉండే సంబంధాల గురించీ పత్రికలలో వచ్చే పాక్షిక కథనాలూ, వక్రీకరణలూ, వాటి వల్ల కలిగే దురభి ప్రాయాలనూ దాటి ఇతిహాసపు చీకటి కోణం అడుగున పడి కనిపించని వాస్తవాల వైపు మన చూపు తిప్పే ఈ కథలు తప్పక చదవవలసినవి. వ్యాసకర్త ప్రరవే కార్యదర్శి, తెలంగాణ (ఈ 24న సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాదులో ‘వియ్యుక్క’ కథా సంకలనాల ఆవిష్కరణ) -
మరో పది నిమిషాల్లో ఇంటికి.. అంతలోనే తీవ్ర విషాదం..!
నారాయణ్‌పేట్: మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అనుకున్న వారిని కారు రూపంలో మృత్యువు వెంటాడింది. తల్లి, తండ్రి, కుమారుడు బైక్‌పై వస్తుండగా.. ఎదురుగా వచ్చిన ఓ కారు వీరిని ఢీకొట్టడంతో తల్లి, కుమారుడు మృత్యువాత పడ్డారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తీలేర్ స్టేజీ సమీపంలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. మరికల్‌కు చెందిన బొంత వెంకటేష్, అనురాధ(35) దంపతుల కుమారుడు శివ(12)కు రెండు రోజుల క్రితం ఓ విష పురుగు కరవడంతో ఒంటిపై దద్దుర్లు వచ్చాయి. దీంతో నాటు వైద్యం కోసం మహబూబ్‌నగర్ రూరల్ మండలం మనికొండకు బైక్‌పై వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి 11 గంటలకు తిరిగి బయల్దేరారు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారు అనగానే తీలేర్ స్టేజీ సమీపంలోని రైస్‌మిల్లు వద్ద జాతీయ రహదారిపై ఎదురుగా వచ్చిన కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అనురాధ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. కుమారుడు శివను మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. తండ్రి వెంకటేష్ పరిస్థితి కూడా విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారును నిలపకుండానే డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శంకరయ్య తెలిపారు. -
అందం.. నేర సామ్రాజ్యంలోకి అడుగిడితే.. లేడీ డాన్ లవ్ స్టోరీస్!
ఆమెది ఎంత అందమైన ముఖమో.. అంతే పదునైన ఆలోచనలు ఆమె సొంతం. అయితే ఆమె ఈ అందాన్ని, తెలివితేటలను నేర ప్రపంచం కోసం వినియోగించింది. డాన్‌గా మొదలైన ఆమె ప్రయాణం.. ఆ తరువాత నేర ప్రపంచంలోని ఇతర నేరస్తులతో కలివిడిగా తిరిగేవరకూ సాగింది. ఈ కథ రాజస్థాన్‌కు చెందిన అనురాధ చౌదరిది. ఆమెను జనం లేడీ డాన్ అని, రివాల్వర్ రాణి అని కూడా పిలుస్తుంటారు. ఆమె రాజస్థాన్‌లో పెద్ద గ్యాంగ్ స్టార్‌గా పేరొందింది. దేశంలోని అతిపెద్ద గ్యాంగ్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్‌తో ఆమెకు నేరుగా సంబంధాలున్నాయి. పండితుని ఇంట పుట్టి.. రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాలో అనురాధ చౌదరి జన్మించింది. తల్లి చనిపోవడంతో తండ్రే ఆమెను పెంచిపెద్ద చేశాడు. ఆమె తండ్రి ఉపాధ్యాయుడు. కుమార్తెను పెద్ద చదువులు చదించాలని కలలుగనేవాడు. అనురాధ కూడా చిన్నతనం నుంచే చదువుపై దృష్టి నిలిపింది. రాజస్థాన్‌లోని ఒక యూనివర్శిటీలో బీటెక్ పూర్తిచేసింది. అయితే కాలేజీ రోజుల్లో ఆమె దీపక్ మింజాతో ప్రేమలో పడింది. దీపక్‌తో ప్రేమ పెళ్లి దీపక్‌తో పెళ్లికి అనురాధ తండ్రి విముఖత వ్యక్తం చేశాడు. అయితే ఆమె తండ్రి మాట కాదని దీపక్‌ను వివాహం చేసుకుంది. కుటుంబంతో అనుబంధం తెంచుకుంది. అనురాధ, దీపక్‌లు కుటుంబ పోషణకు షేర్ ట్రేడింగ్ పని మొదలుపెట్టారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు చుట్టుపక్కల వారిని ప్రోత్సహించేవారు. కొంతకాలం వారి వ్యాపారం సజావుగానే సాగింది. ఆ తరువాత వ్యాపారంలో సమస్యలు తలెత్తడంతో అనురాధ జీవితమే మారిపోయింది. డబ్బు సంపాదనకు అనురాధ తప్పుడు మార్గాలను ఆశ్రయించడం మొదలు పెట్టింది. అనురాధకు ఆనంద్‌పాల్ ఫిదా ఆ సమయంలో రాజస్థాన్‌లో గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పాల్ ప్రభావం అధికంగా ఉండేది. అనురాధ.. ఆనంద్‌పాల్‌ను కలుసుకుంది. అమె అందమైనది, తెలివైనది కావడంతో ఆనంద్‌పాల్ ఆమెతో అనుబంధం ఏర్పరుచుకున్నాడు. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, కిడ్నాప్‌లు మొదలైన నేరాలలో ఆనంద్‌పాల్ పేరు ప్రముఖంగా వినిపించేది. అనురాధ కూడా ఆనంద్ పాల్ గ్యాంగ్ సభ్యురాలిగా మారింది. భర్త దీపక్‌కు దూరం అయ్యింది. ఆనంద్‌పాల్‌ను వివాహం చేసుకుందని చెబుతారు. ఇది కూడా చదవండి: శివుని కోసం మెడ నరుక్కున్నాడు.. ఇప్పుడతని పరిస్థితి ఇదే! ఆనంద్‌పాల్‌కు ఆంగ్లం నేర్పిన అనురాధ ఆనంద్‌పాల్ అనురాధకు రివాల్వర్ వినియోగించడంతో పాటు వివిధ నేరాలలో శిక్షణ అందించాడు. అదేసమయంలో అనురాధ ఆనంద్‌పాల్‌కు ఆంగ్ల భాషలో సంబాషించడాన్ని నేర్పించింది. ఆనంద్‌పాల్ అనురాధ అడుగులకు మడుగులొత్తేవాడని అంటారు. 2017లో ఆనంద్‌పాల్ పోలీసులు జరిపిన ఒక ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఆ సమయంలో అనురాధ రెండేళ్ల జైలు శిక్ష అనుభవిస్తోంది. ఆమె జైలు నుంచి బయటకు వచ్చి, ఆనంద్‌పాల్ గ్యాంగ్‌ను తన చేతుల్లోకి తీసుకుంది. కాలా జఠెడిపై కన్ను వేసి.. అనురాధ తన గ్యాంగ్ ప్రభావాన్ని మరింతగా పెంచుకునేందుకు లారెన్స్ బిష్ణోయితో దోస్తీ మొదలుపెట్టింది. రాజస్థాన్‌లో మారణాయుధాల అక్రమ సరఫరాను అనురాధ గ్యాంగ్ పర్యవేక్షించేది. బిష్టోయి గ్యాంగ్‌తో జతకట్టిన అనురాధ కొంతకాలానికి కాలా జఠెడితో స్నేహం ప్రారంభించింది. కాలా జఠెడి.. బిష్ణోయి గ్యాంగ్ కోసం పనిచేసేవాడు. పాక్ నుంచి ఆయుధాల సరఫరాను జఠెడీ చూసుకునేవాడు. అనురాధ, కాలా జఠెడీ కలసివుండసాగారు. వారు ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారని కొందరు చెబుతుంటారు. తరువాత వీరిద్దరూ మారు పేర్లలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండసాగారు. అయితే 2021లో పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేశారు. ఇది కూడా చదవండి: ‘ప్రతిరోజూ నా అండర్వేర్ చెక్ చేస్తారు’.. 8 మందిని పెళ్లాడిన మోడల్‌కు వింత సమస్య! -
మలక్‌పేట అనురాధ హత్య కేసులో కొత్త ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట అనురాధ మృతి కేసు మరో మలుపు తిరిగింది. అనురాధ మృతి కేసు రాచకొండ పోలీసులకు బదిలీ అయింది. చంద్రమోహన్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. 15 ఏళ్లుగా చంద్రమోహన్, అనురాధల సహజీవనం చేస్తున్నారు. చంద్రమోహన్‌తో అనురాధకు గత కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయి. విభేదాల కారణంగా పెళ్లి చేసుకోవాలని అనురాధ ప్లాన్ చేసింది. పెళ్లి కోసం మాట్రిమోనీలో ప్రకటనలు ఇచ్చింది. తాను పెళ్లి చేసుకోబోతున్నానని డబ్బు, నగలు తిరిగివ్వాలని చంద్రమోహన్‌ని డిమాండ్ చేసింది. రూ.17 లక్షల నగదు, 2 కిలోలకుపైగా బంగారం తిరిగివ్వాలన్న అనురాధను చంపేస్తే డబ్బులు, నగలు ఇవ్వాల్సిన అవసరముండదని హత్య చేసినట్లు తేలింది. అనురాధతో గొడవపడి 15 కత్తిపోట్లు పొడిచి చంపిన చంద్రమోహన్.. ఒక రోజు పాటు మృతదేహాన్ని బయటే పెట్టాడు.. అనురాధ గది పక్కన అద్దెకు ఉన్నవారు ఊరికెళ్లాక ముక్కలు చేశాడు. మరుసటిరోజు స్టోన్ కట్టర్ తెచ్చి మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో దాచాడు. 5 రోజుల తర్వాత తలను తీసుకెళ్లి మూసీలో పడేశాడు. చదవండి: ఆరుగురు పిల్లల తల్లి ఎంతటి దారుణానికి పాల్పడిందంటే... యూట్యూబ్‌లో చూసి మృతదేహాన్ని ముక్కలు చేసిన చంద్రమోహన్.. మృతదేహం నుంచి వాసన రాకుండా కెమికల్స్ వాడాడు. కూతురితోపాటు బంధువులెవరితోనూ అనురాధకు సంబంధాలు లేకపోవడంతో ఆమెను చంపితే బంధువులెవరూ రారని గుర్తించిన చంద్రమోహన్.. అనురాధ చార్ధామ్ యాత్రకు వెళ్తున్నట్లు సృష్టించాడు. అనుమానం రాకుండా అనురాధ కూతురుతో చంద్రమోహన్ చాటింగ్ చేశాడు. అనురాధ సెల్‌ఫోన్‌ను చార్‌ధామ్‌కు తీసుకెళ్లి ధ్వంసం చేయాలని చంద్రమోహన్ ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. -
బీసీలపై బాబు కపట ప్రేమ
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోయినా బీసీ మహిళా నేత పంచుమర్తి అనూరాధను పోటీకి దించి చంద్రబాబు మరోసారి తన మార్కు రాజకీయానికి తెరలేపారు. అధికారంలో ఉన్నప్పుడు ఆమెకు మొండిచేయి చూపించి.. ఇప్పుడు గెలవలేని సీటు ఇచ్చి ఆమెను బలి చేసేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా వైఎస్సార్సీపీకి ఉన్న సంఖ్యాబలంతో వాటిన్నింటినీ చేజిక్కించుకోవడం దాదాపు ఖాయమైంది. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాలంటే కనీసం 22 మంది ఎమ్మెల్యేలు అవసరం. టీడీపీ నుంచి గెలిచింది 23 మంది ఎమ్మెల్యేలైనా, అందులో నలుగురు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. మిగిలింది 19 మంది మాత్రమే. వారి ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలవడం అసాధ్యం అని అందరికీ తెలుసు. అలాంటి ఎన్నికల్లో బీసీ మహిళను నిలబెట్టడం అంటే ఆ వర్గాన్ని అవమానించడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక, అనూరాధ ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వాలని పలుమార్లు కోరినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పుడు ఓడిపోయే సీటును మాత్రం బీసీల కోటాలో ఆమెకు ఇవ్వడంపై టీడీపీలోనే అసహనం వ్యక్తమవుతోంది. మొదటి నుంచీ ఇదే తీరు ♦ అధికారంలో ఉన్నప్పుడు సొంత వర్గానికి మాత్రమే పదవులు కట్టబెట్టిన చంద్రబాబు.. అప్పట్లో బీసీలు, దళిత నేతలను చాలా అవమానాలకు గురిచేశారు. 2020లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ప్రస్తుతం అనూరాధకు ఎమ్మెల్సీ సీటు కేటాయించినట్టే, పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు కేటాయించారు. ఆ ఎన్నికల్లోనూ రాష్ట్రానికి వచ్చే నాలుగు రాజ్యసభ స్థానాల్లో సంఖ్యా బలం రీత్యా వైఎస్సార్సీపీ గెలవడం లాంఛనమేనని తెలిసినా చంద్రబాబు దళిత నేతను పోటీకి దింపి ఆ వర్గాన్ని బలి చేశారు. ♦2014 నుంచి ఆరేళ్లలో మూడుసార్లు టీడీపీ నాయకుల్ని రాజ్యసభకు పంపే అవకాశం వచ్చినప్పుడు తన కోటరీలోని ముఖ్యులు, సొంత సామాజిక వర్గం వారికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి.. దళితులు, బీసీ నాయకుల్ని మాత్రం పట్టించుకోలేదు. ♦2014, 2016, 2018లో ఏడుగురిని రాజ్యసభకు పంపే అవకాశం వచ్చినప్పుడు చంద్రబాబుకు బీసీలు, దళితులు గుర్తుకు రాలేదు. అప్పుడు తన సొంత సామాజికవర్గ నేతలు, తన కోటరీకి చెందిన వారు, సన్నిహితులకు అవకాశం ఇచ్చారు. ♦గరికపాటి మోహనరావు, సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి నేతలను రాజ్యసభకు పంపారు. మిగిలిన సీట్లలోనూ సామాజిక సమీకరణలు, పార్టీ అవసరాల పేరుతో టీజీ వెంకటేష్, తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్, సురేష్ ప్రభు వంటి నేతలకు ఇచ్చారు. ♦2016లో దళిత నేత జేఆర్ పుష్పరాజ్‌కు సీటిస్తానని తన ఇంటికి పిలిపించుకుని ఒక రోజంతా కూర్చోబెట్టి, ఆ తర్వాత లేదని చెప్పి అవమానించి పంపారు. 2018లో దళిత నేత వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి అంతా సిద్ధమయ్యాక చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకుమార్‌కు ఆ సీటు ఇచ్చారు. ♦ఇప్పుడు అధికారం కోల్పోయి, ఎమ్మెల్యేల సంఖ్యా బలం లేని స్థితిలో ఓడిపోతామని తెలిసి కూడా ఆ సీటులో బీసీ మహిళను నిలబెట్టడం ద్వారా చంద్రబాబు మరోసారి బలహీన వర్గాలను మోసం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ స్థానాల్లో తన కుమారుడు లోకేశ్, ఇతర ముఖ్య నాయకులను ఎందుకు నిలబెట్టలేదనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. -
మునుగోడు: హోటల్ గిరాకీతో టీఆర్ఎస్ సర్పంచ్ అనురాధ బిజీ
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల వేళ నాయకులంతా ప్రచారంలో బిజీగా ఉంటే.. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం చొప్పరోనిగూడెం సర్పంచ్ అనురాధ మాత్రం హోటల్లో తనపని తాను చేసుకుంటున్నారు. ప్రచార బాధ్యతలను తన భర్త చూసుకుంటున్నారని అనురాధ పేర్కొంటున్నారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన అనురాధ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. అయితే చండూరులో నామినేషన్ సందర్భంగా ఆమె నడిపిస్తున్న హోటల్‌కు గిరాకీ ఎక్కువగా ఉండడంతో ప్రచారంలో పాల్గొనకుండా హోటల్లో పనిచేసుకుంటున్నారు. -
అప్పటికే నా బిడ్డ ఐదు పేజీల సూసైడ్ నోట్ రాసుకుంది: అనురాధ
సాక్షి, విజయవాడ: లైంగిక వేధింపులు తాళలేక తొమ్మిదో తరగతి బాలిక విజయవాడలో అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాలిక తల్లి అనురాధ సోమవారం సాక్షి టీవీతో మాట్లాడారు. 'నా బిడ్డను ఎంతో అపురూపంగా పెంచుకున్నాం. ఇప్పటివరకు బిడ్డ రక్తపు చుక్క కూడా చూడలేదు. చదువులో నా బిడ్డ టాపర్.. మల్టీ టాలెంటెడ్. పుట్టుకతోనే ఎన్నో మంచి లక్షణాలు వచ్చాయి. చనిపోవడానికి రెండ్రోజుల ముందు పాప ఏడ్చింది. అడిగితే మిమ్మల్ని మిస్ అవుతున్నానంటూ బాధపడింది. ఇంక ఏ సమస్యలు లేవని చెప్పింది. చదవండి: (కామాంధుడు! విజయవాడలో టీడీపీ నేత అకృత్యం) చనిపోయే రోజు సాయంత్రం చివరిసారిగా నాతో మాట్లాడండి. అమ్మ ఐ లవ్యూ అంటూ రెండుసార్లు పిలిచి గట్టిగా హగ్ చేసుకుంది. అప్పటికే ఐదు పేజీల సూసైడ్ నోట్ నా బిడ్డ రాసుకుంది. టుడే ఈజ్ లాస్ట్ డే.. డెత్ డే అంటూ సూసైడ్ నోట్లో రాసింది. ఎవరో ఒక పాప బిల్డింగ్‌పై నుంచి దూకి చనిపోయిందంటూ చెప్పడంతో వెళ్లి చూశాం. సూసైడ్ చేసుకువడానికి కారణమైన వినోద్ జైన్‌ని నడిరోడ్డులో ఎన్ కౌంటర్ చేయాలి. అప్పుడే నా బిడ్డకు ఆత్మ శాంతిస్తుంది. చదవండి: (‘నా బిడ్డ జీవితాన్ని చిదిమేసిన కామ పిశాచిని ఉరి తీయండి’) తాత లాంటి వయసులో నా బిడ్డను ఇంత దారుణంగా లైంగికంగా వేధించిన వినోద్ జైన్‌ను శిక్షించాలి. ఏ తల్లికీ మాలాంటి గర్భశోకం కలగకూడదు. పిల్లలను అందరూ జాగ్రత్తగా పెంచాలి. ముఖ్యమంత్రిని కలిసి నా గోడు వెళ్లబోసుకుంటాను. నాకు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా వద్దు. మరో బిడ్డకు ఇలాంటి గతి పట్టకూడదు. సీఎం జగన్ చట్టాలను మరింత బలోపేతం చేసి మృగాళ్లను కఠినంగా శిక్షించాలి. మా పాపకు న్యాయం చేయాలి' అంటూ బాలిక తల్లి అనురాధ కన్నీటి పర్యంతమైంది. -
పండిత అనురాధా పాల్.. తబలా మాంత్రికురాలు
ఉస్తాద్ అల్లారఖా పెద్ద తబలా మాస్టర్. ఉస్తాద్ జాకిర్ హుసేన్ కూడా. శంకర్ ఘోష్, ఉదయ్ మజుందార్... ఎందరో పురుష ఉస్తాద్‌లు.. పండిత్‌లు. కాని వీరితో సరిసాటిగా కాదు కాదు తనే ఒక విలక్షణ మాస్టర్‌గా అనురాధా పాల్ తబలా వాదనలో ఖ్యాతి గడించింది. స్త్రీలు ఈ రంగంలో రాణించడం సామాన్యం కాదు. ఎన్నో అడ్డంకులను అపధ్వనులను దాటి ఆమె ఈ స్థితికి చేరుకుంది. ఆమె పరిచయం... ముంబైలో అనురాధా పాల్ తబలా కచ్చేరీ జరుగుతోంది. దానికి హాజరైన చిత్రకారుడు ఎం.ఎఫ్.హుసేన్ ఆసాంతం ఆ కచ్చేరి చూసి, ఆమెను కలిసి, ‘రేపు మీ ఇంటికి వస్తున్నాను’ అని వెళ్లిపోయాడు. ఎందుకు వస్తున్నట్టు? మరుసటి రోజు హుసేన్ ఆమె ఇంటికి వచ్చాడు. ఆయనతోపాటు రఫ్ కట్ చేసిన ‘గజ్గామిని’ సినిమా ఉంది. మాధురి దీక్షిత్‌తో ఎం.ఎఫ్.హుసేన్ తీసిన సినిమా అది. త్వరలో విడుదల కావాల్సి ఉంది. ‘దీనికి నువ్వు నేపథ్య సంగీతం అందించాలి’ అన్నాడు హుసేన్. అనురాధా పాల్ ఆశ్చర్యపోయింది. ‘నేను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం ఏమిటి? మీరు తలుచుకుంటే ప్రపంచంలోని మహా మహా సంగీతకారులు ఎవరైనా ఇస్తారు’ అని అనురాధా పాల్ అంది. ‘కాదు నువ్వు ఇవ్వాలి. సినిమా అంతా నీ తబలా వినిపిస్తే చాలు’ అని మీటింగ్ ముగించాడు ఎం.ఎఫ్.హుసేన్. అనురాధా పాల్ తాను ఒక్కతే తబలా వాయిస్తూ ‘గజ్గామిని’కి రీ రికార్డింగ్ చేసింది. బహుశా ప్రపంచంలో కేవలం తబలా మీద అదీ ఒక స్త్రీ వాయిద్యకారిణి వాయిస్తూ ఉంటే రీ రికార్డింగ్ ముగించుకున్న సినిమా అదొక్కటే ఏమో. అది అనురాధా పాల్ ఘనత. ప్రపంచలోనే ఆమె తొలి మహిళా తబలా వాయిద్య కారిణి. అనురాధా పాల్ది ముంబై. అక్కడే పుట్టి పెరిగింది. వాళ్ల కుటుంబం తాతగారి హయాంలో దేశ విభజన సమయంలో ముంబై వచ్చేసింది. ఆమె తండ్రి దేవిందర్ పాల్ వీధి దీపాల కింద చదువుకుని పెద్ద ఫార్మా కన్సల్టెంట్ అయ్యాడు. తల్లి ఇళా పాల్ గాయని, పెయింటర్. ఆ ఇంట్లో కళల పట్ల ఆసక్తి ఉండేది. పిల్లలు ఏదో ఒక కళలో కనీస అభిరుచి కలిగి ఉండాలని తల్లిదండ్రులు కోరుకునేవారు. అయితే చదువు తప్పనిసరి. కాని ఇంటి చిన్న కుమార్తె అయిన అనురాధా పాల్‌కు చదువు కంటే కళ మీదే ఎక్కువ ఆసక్తి ఏర్పడింది. ఆమె ముందు గాత్రం నేర్చుకుంది. కాని గాత్రం కొనసాగిస్తూ ఉంటే తోడు వాయిద్యం అయిన తబలా ఆమెను ఆకర్షించింది. పాడుతూనే తబలా మీద కొట్టవలసిన తాళాన్ని అందించేది. తబలా ఎందుకు నేర్చుకోకూడదు? అని ఆమెకు అనిపించింది. ఆడపిల్లలు సితార్, వీణ, వయొలిన్ వంటి వాయిద్యాలు నేర్చుకుంటారు. కాని తబలా పూర్తిగా మగవాళ్ల విద్యగా చలామణిలో ఉంది. అలాంటి విద్యను ఆడపిల్ల నేర్చుకోవడమా? కాని తొమ్మిదో ఏటకే అనురాధా పాల్ తబలాలో ప్రావీణ్యం సంపాదించింది. కచ్చేరి ఇచ్చింది కూడా. అనురాధా పాల్ మొదట బెనారస్ ఘరానాలోని గురువుల దగ్గర తబలా నేర్చుకున్నా చివరకు ఉస్తాద్ అల్లారఖా ఆ తర్వాత ఉస్తాద్ జాకిర్ హుసేన్ శిష్యురాలైంది. 18 ఏళ్లకు ఆమె ముంబైలో కచ్చేరి ఇస్తే పత్రికలు ఆమెకు ‘లేడీ జాకిర్ హుసేన్’ అనే బిరుదు ఇచ్చాయి. నిజానికి ఇలాంటి బిరుదులు పరోక్షంగా స్త్రీల శక్తిని తక్కువ అంచనా వేసేవే. కాలక్రమంలో అనురాధా పాల్ తన పేరుతో తానే ఒక గొప్ప తబలా విద్వాంసకురాలిగా పేరు పొందింది. ఆమె పర్కషనిస్ట్ కూడా. అంటే ఒకటికి మించి తోడు వాయిద్యాలను వాయించే వారిని పర్కషనిస్ట్ అంటారు. అనురాధా పాల్ కనీసం 40 రకాల వాయిద్యాలను వాయించగలదు. అలా తానే అన్ని వాయిద్యాలు వాయిస్తూ ఆమె ఆల్బమ్ చేసింది కూడా. అయితే కొత్తల్లో ఆమెకు అంత సజావుగా ఎంట్రీ దొరకలేదు. ‘‘ఒక కచ్చేరిలో నన్ను కొన్ని తాళాలు మాత్రమే వాయించమన్నారు. దూకుడుగా వాయించాల్సిన తాళాలను మగ తబలా ప్లేయర్ వాయిస్తాడని చెప్పారు. కారణం అడిగాను. ‘దూకుడు తాళాల పని నీకు అప్పచెప్తే ఆడపిల్లతో కష్టం చేయిస్తున్నారన్న మాట వస్తుంది’ అని చెప్పారు. నేను అడ్డం తిరుక్కుని మొత్తం వాయించి ప్రేక్షకుల హర్షధ్వానాలు అందుకున్నాను’’ అంటుంది అనురాధా పాల్. సాధారణంగా కచ్చేరీలలో మగవారు గాత్రంలో ఉంటే మగ సహ వాద్యకారులనే తోడు తీసుకుంటారు. ఆడవాళ్లను ప్రోత్సహించరు. ఆ విషయంలో కూడా అనురాధా పాల్ సుదీర్ఘ పోరాటం చేసి పెద్ద పెద్ద గాత్ర విద్వాంసుల తోడు కూచుని కచేరీ చేయగలిగింది. ‘నేను మహిళను. ఈ శక్తి నాది. నా శక్తికి విలువ ఇవ్వండి. నేను మహిళను కాబట్టి నాకు మెచ్చుకోలులో వాటా ఇవ్వకండి’ అంటుంది అనురాధా పాల్. ఆమె అందరూ మహిళా విద్వాంసులు ఉండే ‘స్త్రీ శక్తి’ అనే బ్యాండ్‌ను తయారు చేసి ప్రపంచంలో అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చింది. అలాగే క్లాసికల్‌ను వెస్ట్రన్‌తో జత చేస్తూ ‘రీచార్జ్’ అనే బ్యాండ్ ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇస్తుంది. తన సోలో ప్రదర్శనలు ప్రత్యేకం. ఇంత సాధించినా ఆమెకు ‘పద్మశ్రీ’ ఇంకా దక్కలేదు. సంగీత ప్రపంచంలో పురుషుల ప్రాభవం ఇంకా కొనసాగుతున్నదనే అనుకోవాలి. కాని ఎంత కాలం? అనురాధా పాల్ లాంటి వాళ్లు మరెందరో పుట్టుకు వచ్చి ఇదంతా కచ్చితంగా మార్చరూ? -
హైదరాబాద్ ఫిలింనగర్లో జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ ఆత్మహత్య
-
అంగన్వాడీ సెంటర్లను ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా అభివృద్ధి చేస్తున్నాం
-
'కోవిడ్‌తో అనాథలైన పిల్లలను గుర్తిస్తున్నాం'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనాతో అనాథలైన పిల్లలను గుర్తించే పనిలో ఉన్నామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనురాధ పేర్కొన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. '' ఇప్పటివరకు 154 మంది పిల్లలు కోవిడ్ వల్ల అనాథలయ్యారు. అనాథలుగా మారిన 56 మంది పిల్లల పేరిట ఇప్పటికే రూ.10లక్షల చొప్పున డిపాజిట్ చేశాం. దేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదట ఈ పథకం తీసుకొచ్చారు. ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. రానున్న కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి జిల్లాలో పిల్లల కోసం కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. అంగన్వాడీల ద్వారా పిల్లలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. ఐదేళ్ల లోపు పిల్లలున్న తల్లులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం'' అంటూ వివరించారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేసే పనిలో ఉన్నట్లు అనురాధ తెలిపారు. చదవండి: ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులను గుర్తించండి -
తన కల కోసం కూలీగా మారింది!
తల్లే కూలి పనిచేసి కూతుర్ని పీజీ వరకు చదివించింది. ఏనాడూ ఆమె కూతుర్ని పెళ్లి కోసం తొందరపెట్టలేదు. గూడెంలోని వాళ్లు అంటున్నా, వాళ్లనూ అననివ్వలేదు. ‘‘ఉద్యోగం వచ్చాకే చేసుకుంటుందిలే..’’ అని కూతురి వైపు నిలబడింది. అమ్మే పక్కన నిలబడితే ఏ కూతురి కలైనా తీరకుండా ఉంటుందా?! ఒక కలగంటోంది అనూరాధ. కేయేఎస్ ఆఫీసర్ అవాలి తను! ‘నో’ నువ్వు ఆ కల కనేందుకు లేదు. నీ పెళ్లి గురించి కలగను’ ఆనేశాయి ఆమె ఇంటి పరిస్థితులు. అయితే పరిస్థితుల్నే మార్చుకోవాలని నిశ్చయించుకుంది అనూరాధ. ‘‘ఉద్యోగం లేనిదే పెళ్లి చేసుకోకూడదు’’ అని తీర్మానించుకుంది. ఆమె కంటున్న కేయేఎస్ (కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) కలకు పేదరికం మరో అవాంతరం అయింది. తనూ సంపాదిస్తేనే ఇంటికి ఇన్ని తిండి గింజలు. కలను పండించుకోడానికి పొలానికి వెళ్లింది. వ్యవసాయ కూలీగా నాలుగు రాళ్లు సంపాదిస్తూ, మిగతా సమయంలో కేయేఎస్ కు ప్రిపేర్ అవుతోంది. ఇరవై రెండేళ్ల అనూరాధ పోస్ట్ గ్రాడ్యుయేట్. పీజీ చేసి, కూలి పనికి వెళ్లేందుకు ఆమె ఏమీ సిగ్గుపడటం లేదు. పొలం నుంచి తిండి గింజలకు మాత్రమే అనూరాధ సంపాదించుకు రావడం లేదు. కొన్ని బుక్స్ కొనాలి. ఖరీదైనవి. కోచింగ్ కూడా అవసరం. ఆ ఖర్చుల కోసం కూడా పొలం పనులు చేస్తోంది. తలపై ఎర్రటి ఎండ. కనురెప్పల మాటున తను కంటున్న కల. కలే ఆమెకు ఆ ఎండలో చల్లదనం, శక్తీ! అడవి అంచుల్లో ఉంది ఆమె గ్రామం. మైసూరు జిల్లా, హెమ్డి కోటె తాలూకాలోని తిమ్మనహోతలహళ్లి. గ్రామంలా ఉండదు. గిరిజన గూడెంలా ఉంటుంది. అక్కడొక చదువుల పువ్వు పూసిందంటే ఏ అండా, ఆశా లేకుండా తనకై తను వికసించిందనే! అలాంటి విద్యాకుసుమం అనూరాధ. తండ్రి లేడు. ఆమె చిన్నతనంలోనే చనిపోయాడు. ఆస్తి లేదు. డబ్బు లేదు. తల్లే కూలి పని చేసి కూతుర్ని పీజీ వరకు చదివించింది. ఏనాడూ ఆమె కూతుర్ని పెళ్లి కోసం తొందరపెట్టలేదు. గూడెంలోని వాళ్లు అంటున్నా, వాళ్లనూ అననివ్వలేదు. ‘‘ఉద్యోగం వచ్చాకే చేసుకుంటుందిలే..’’ అని కూతురి వైపు నిలబడింది. తల్లి మద్దతుతో కేయేఎస్ ప్రిలిమ్స్ పాసైనంతగా సంబరపడింది అనూరాధ. అయితే ఆ అమ్మాయి కేయేఎస్ ఆఫీసర్ అవాలని అనుకుంటున్నది తన కోసమో, తల్లి కోసమో కాదు. గిరిజన గూడేల్లో తనలాంటి ఆడపిల్లలు, ఇంటి బరువు బాధ్యతల్ని తమరొక్కరే మోస్తున్న తల్లులు ఇంకా ఉన్నారు. వారికోసం ఏమైనా చేయాలని అనుకుంది. పేదరికంలో ఉన్న ఆడపిల్లల్ని చదివించే ఆఫీసర్‌గా, వారి తల్లిదండ్రులకు నమ్మకమైన ఒక ఉపాధిని కల్పించగల అధికారిగా తను ఎదగాలని అనుకుంది. ఆ అనుకోవడం లోనే, ఆ లక్ష్యాన్ని సాధించడానికి పొలం పనులకు వెళ్లి రావడంలోనే పి.ఇ.టి.సి.కి దరఖాస్తు చేసే గడువు తేదీ దాటిపోయాక గానీ ఆమెకు తెలియలేదు! ఐయ్యేఎస్, కేయేఎస్ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రభుత్వ కార్యక్రమమే పి.ఇ.టి.సి. ప్రీ–ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ ప్రోగ్రామ్. సాంఘిక సంక్షేమ శాఖ ఉచితంగా ఈ శిక్షణను ఇస్తుంది. ఆన్లైన్లో ప్రాసెస్ అంతా నడవడంతో దరఖాస్తు సమాచారాన్ని సమయానికి చూడలేకపోయింది అనూరాధ. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు బస వసతి కాకుండా, కేవలం శిక్షణకే 60 వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. అంత మొత్తం కూలి పనితో కూడబెట్టగలిగింది కాదు. ఇంకో పని కూడా వెతుక్కోవాలని అనూరాధ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేయేఎస్ ఆఫీసర్ అయ్యేందుకు అనూరాధ కష్టపడటం అసాధారణమైన విషయమే అయినప్పటికీ అనూరాధ వంటి ఒక నిరుపేద గిరిజన యువతి అసలు పీజీ చేయడం కూడా కేయేఎస్ ఆఫీసర్ అయినంత ఘన విజయమేనని శైలేంద్ర కుమార్ అంటున్నారు. గిరిజన సామాజిక కార్యకర్త అయిన శైలేంద్ర ప్రస్తుతం అనురాధ కోచింగ్ కోసం ఆర్థిక వనరుల్ని సమకూర్చే ప్రయత్నాల్లో ఉన్నారు. -
గాయని కుటుంబంలో తీవ్ర విషాదం
ముంబై: ప్రముఖ గాయని అనురాధా పౌడ్వాల్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె కుమారుడు, మ్యూజిక్ కంపోజర్ ఆదిత్య పౌడ్వాల్(35) కన్నుమూశారు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘ఈ వార్త వినగానే విషాదంలో మునిగిపోయాను. మా సన్నిహితుడైన ఆదిత్య పౌడ్వాల్ ఇకలేరు. తనొక అద్భుతమైన మ్యుజీషియన్. మంచి వ్యక్తి. హాస్య చతురత గలవాడు. మేమిద్దరం కలిసి ఎన్నో ప్రాజెక్టులు చేశాం. ఈ విషాదాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. లవ్ యూ ఆదిత్య.. నిన్ను మిస్సవుతున్నా’’ అని ఆదిత్య ఫొటో షేర్ చేసి సంతాపం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా ఆదిత్య అనారోగ్య కారణాలతో సతమతమవుతున్నాడని, కిడ్నీలు, ఊపిరి తిత్తుల్లో సమస్య తలెత్తడంతో నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఆదిత్య మరణించినట్లు శంకర్ మహదేవన్ ఓ జాతీయ మీడియాకు తెలిపారు. కాగా ఆదిత్య పౌడ్వాల్ మృతి పట్ల సినీ, సంగీత ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. గాయకుడు, సంగీత దర్శకుడు తౌసీఫ్ అక్తర్, సింగర్ అర్మాన్ మాలిక్ ట్విటర్ వేదికగా అతడికి నివాళులు అర్పించారు. మంచి మనసున్న ఆదిత్య ఇంత చిన్న వయస్సులోనే లోకాన్ని వీడి వెళ్లడం బాధాకరమన్నారు. ఆదిత్యతో తమకున్న అనుబంధం గురించి గుర్తుచేసుకుంటూ.. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా ఆదిత్య తల్లిదండ్రులు అనురాధ- అరుణ్ పౌడ్వాల్ ఇద్దరూ సంగీత ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. సంగీత రంగానికి అందించిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం అనురాధను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇక తల్లిదండ్రుల బాటలోనే నడిచిన ఆదిత్య సైతం సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందాడు. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన ఠాక్రే సినిమాకు అతడు చివరిసారిగా సంగీతం అందించాడు. -
4 బంతుల్లో 4 వికెట్లు...
లోయర్ ఆస్ట్రియా: మహిళల టి20 క్రికెట్లో అరుదైన ఘనత నమోదైంది. జర్మనీకి చెందిన అనురాధ దొడ్డబళ్లాపూర్ వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది. పొట్టి ఫార్మాట్లో ఇప్పటి వరకు 18 సార్లు ‘హ్యాట్రిక్’ నమోదైనా... ఇలా ఒక బౌలర్ 4 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. ఆస్ట్రి యాతో జరిగిన మ్యాచ్‌లో అనురాధ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో 2,3, 4, 5 బంతులకు వరుస వికెట్లు తీసింది. ఈ మ్యాచ్‌లో ఆమె బౌలింగ్ గణాంకాలు 3–2–1–5గా ఉన్నాయి. ఈ దెబ్బకు ఆస్ట్రియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 61 పరుగులే చేయగలిగింది. అంతకు ముందు 20 ఓవర్లలో 198 పరుగులు చేసిన జర్మనీ... 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
మగవాళ్ల రాజ్యంలో ‘స్త్రీ మహాలక్ష్మి’
స్త్రీకి ఉండనిదే ఆర్థిక స్వాతంత్య్రం. అదుంటే అన్ని స్వాతంత్య్రాలూ వచ్చేస్తాయి. ఆర్థిక స్వాతంత్య్రం అంటే.. చేతి నిండా డబ్బు ఉండటం కాదు. ఆ డబ్బును ఇష్టానికి ఖర్చు చేసే స్వేచ్ఛ ఉండటం. కృష్ణవేణి, ఆమె కూతురు అనురాధ.. స్వప్నాదత్, ప్రియాంకాదత్, లక్ష్మీ మంచు .. వీళ్లకు.. సినిమాలు నిర్మించడం ఇష్టం. నిర్మిస్తే డబ్బు రావచ్చు.. పోవచ్చు. పోతుందేమోనని ఇష్టాన్ని చంపుకోలేదు వీళ్లు! మంచి మంచి సినిమాలు తీశారు. తీస్తున్నారు. రేపు మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా.. మగవాళ్ల రాజ్యంలో ‘స్త్రీ మహాలక్ష్మి’గా వెలిగిన.. వెలుగుతున్న.. సినీ మహిళా నిర్మాతలతో సాక్షి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు ఇవి. ►చిత్రసీమకు సంబంధించిన తొలి తరం తారల్లో గాయనిగా, నటిగా, నిర్మాతగా మీకు మంచి పేరు ఉంది. నటిగా కెరీర్ ఎలా మొదలైందో చెబుతారా? కృష్ణవేణి: ‘సతీ అనసూయ’ (1936)లో బాలనటిగా నటించాను. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాను. అంతకుముందు డ్రామాల్లో నటించాను. అప్పట్లో మా పాత్రలకు మేమే పాడుకోవాలి. అలా గాయనిగా కూడా మంచి పేరు వచ్చింది. మీర్జాపురం రాజా మేకా వెంకటరామయ్య అప్పారావుగారు నిర్మించిన ‘భోజ కాళిదాసు’కి నన్ను సెకండ్ హీరోయిన్గా తీసుకున్నారు. అందులో కన్నాంబ ఫస్ట్ హీరోయిన్. ఆ తర్వాత ఆయన బేనర్లోనే ‘జీవన జ్యోతి’ సినిమాలో మెయిన్ హీరోయిన్గా చేశాను. నటిగా నన్ను బాగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా అది. 15 సినిమాలకు పైగా హీరోయిన్గా నటించాను. ►మరి నిర్మాణరంగంవైపు ఎలా వచ్చారు? కృష్ణవేణి: ‘జీవనజ్యోతి’ తర్వాత మీర్జాపురం రాజాగారితో నా పెళ్లయింది. మాది ప్రేమ వివాహం. అప్పుడు నాకు 17 ఏళ్లు. జయా పిక్చర్స్‌పై నా భర్త తీసిన సినిమాలకు నిర్వహణ బాధ్యతలు చూసుకునేదాన్ని. అలా నిర్మాణరంగంవైపు వచ్చాను. ఆ సంస్థ పేరుని ఆ తర్వాత ‘శోభనాచల పిక్చర్స్’గా మార్చాం. ‘గొల్లభామ’ (1947), ‘మన దేశం’ (1949), ‘లక్ష్మమ్మ’ (1950), ‘దాంపత్యం’ (1957) వంటి సినిమాలు నిర్మించాం. కొన్నింటిలో నేను కూడా నటించాను. ‘మన దేశం’తో ఎన్టీఆర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేశాం. ఇది నిర్మాతగా నాకు కంప్లీట్ సినిమా. ఎన్టీఆర్‌తో ‘పల్లెటూరి పిల్ల’ కూడా తీశాం. నా భర్తతో కలిసి ప్రొడక్షన్ చూసుకునేదాన్ని. స్టోరీ సిట్టింగ్స్, మ్యూజిక్ సిట్టింగ్స్‌లో కూడా కూర్చునేదాన్ని. షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ అంతా చేసేదాన్ని. ►భానుమతిగారు, విజయ నిర్మలగారు, మీరు.. ఇలా కొందరు నిర్మాతగా చేశారు. తర్వాత మీ అమ్మాయి (అనురాధా దేవి). ఇప్పుడు కూడా వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది మహిళా నిర్మాతలే ఉన్నారు... కృష్ణవేణి: భానుమతి డైనమిక్. ఆవిడని చూసి అందరూ గడగడలాడేవాళ్లు. అంత ధైర్యం ఉంటే ఇక్కడ నిర్మాతగా రాణించవచ్చు. లేకపోతే కష్టం. ఇక విజయనిర్మల కూడా చాలా ధైర్యవంతురాలు. చాలా స్వీట్ పర్సన్. భానుమతి, విజయనిర్మలలది ఒక మొండి వైఖరి. అలా ఉంటే నిర్మాతలుగా చేయొచ్చు. నిర్మాత అంటే మగవాళ్లే అనే ఫీలింగ్ ఏదో పడిపోవడం వల్ల కొందరు రావడంలేదేమో. అనురాధ: అమ్మాయి అంటే నటిగా ఓకే కానీ నిర్మాతలుగా రానివ్వరు. బ్యాకింగ్ ఉంటే ఓకే. కోట్లు ఉన్నాయి.. నిర్మాత అయిపోవచ్చు కదా అనుకుంటే కుదరదు. ర్యాపో ఉండాలి. ఎంతోమంది నా దగ్గరకు సినిమాలు తీస్తామని వస్తారు. కానీ ఎంకరేజ్ చేయను. ఎందుకంటే బ్యాగ్రౌండ్ లేకపోతే కష్టం. ►మీరన్నట్లు నిర్మాతలంటే పురుషులే అనే ఫీలింగ్ చాలామందిలో ఉంది. అలాంటి పరిస్థితిలో మీకు నిర్మాణం ఏమైనా అసౌకర్యంగా అనిపించేదా? కృష్ణవేణి: చాలా హ్యాపీగా ఉండేది. కాశీమజిలీ కథలు చదివేదాన్ని. ఇంకా చాలా పుస్తకాలు చదివి, వాటిలో ఉన్న మంచి పాయింట్స్‌తో సినిమాలు నిర్మించేవాళ్లం. అంతా సాఫీగా సాగేది. కొన్ని సినిమాల్లో డబ్బులు పోయినా అదేం పెద్ద బాధ అనిపించలేదు. అనురాధ: శోభనాచల స్టూడియో మాదే. నాన్నగారు పెద్ద బ్యాకింగ్. ఇక అసౌకర్యంగా ఎందుకు ఉంటుంది? (నవ్వుతూ). చెప్పాలంటే చాలామంది అవకాశాల కోసం అమ్మని కాకాపట్టేవాళ్లు. స్ట్రాంగ్ బ్యాగ్రౌండ్ ఉంటే ఎలాంటి అసౌకర్యం ఉండదు. ►అమ్మ తర్వాత మీరు నిర్మాతగా మారారు. మీరు ఇష్టపడి వచ్చారా? వారసత్వాన్ని కంటిన్యూ చేయాలనా? అనురాధ: నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో నన్ను నిర్మాతగా కంటిన్యూ అవ్వమన్నారు. నిజానికి సినిమా ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన నాకంతగా లేదు. అయితే అప్పటికి కన్నడంలో రాజ్‌కుమార్‌గారితో ‘భక్త కుంభార’ అనే సినిమాని నాన్నగారు నిర్మిస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో కంటిన్యూ చేయలేనని నన్ను, నా భర్త (నంగనూరు శ్రీనివాసరావు) ను ఆ సినిమా ప్రొడక్షన్ చూసుకోమన్నారు. ఆ సినిమాని నాగేశ్వరరావుగారితో తెలుగులో ‘చక్రధారి’గా రీమేక్ చేశాను. ఆ తర్వాత ఆయనతోనే ‘రాముడే రావణుడైతే’ సినిమా తీశాం. ఈ సినిమాకి దాసరిగారు డైరెక్టర్. మా బేనర్లో ఆయనకు ఫస్ట్ సినిమా. ఏయన్నార్‌గారికి ఇది ఫస్ట్ సినిమా స్కోప్ పిక్చర్. ఆ తర్వాత ఏయన్నార్–దాసరిగార్ల కాంబినేషన్లో ‘శ్రీవారి ముచ్చట్లు’ అనే సినిమా తీశాం. ఈ ఇద్దరి కాంబినేషన్లోనే తీసిన ‘రాముడు కాదు కృష్ణుడు’ కూడా సూపర్ హిట్ అయింది. అలాగే ఏయన్నార్ హీరోగా కోదండరామిరెడ్డి డైరెక్షన్లో తీసిన ‘అనుబంధం’ సూపర్ హిట్ అయింది. మురళీమోహన్, శోభన్‌బాబులతో కూడా సినిమాలు తీశాం. ►నిర్మాణం మీకెలా అనిపించింది? ఏవైనా చేదు అనుభవాలు? అనురాధ: నేను పెరిగిందే సినిమా ఇండస్ట్రీలో. నాగేశ్వరరావుగారు నన్ను బాగా ఎత్తుకునేవారు. ఎన్టీఆర్‌గారు బాగా తెలుసు. మా బేనర్లో శోభన్‌బాబుగారు నటించారు. అందరూ తెలిసినవాళ్లే కావడంతో నిర్మాతగా ఇబ్బందిపడలేదు. పైగా దాసరి నారాయణరావుగారు నన్ను సొంత సిస్టర్లా అనుకునేవారు. ఆయన నాకు ‘రాఖీ బ్రదర్’. ►బ్యాగ్రౌండ్ లేనివాళ్లకయితే ఇబ్బందులు ఎదురవుతాయా? అనురాధ: బ్యాడ్ సైడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ నాకు తెలియదు. ఎందుకంటే నా లైఫ్ అంతా బాగా గడిచింది. అయితే ఇక్కడ పురుషాధిక్యం ఉంటుంది. నిర్మాత పురుషుడైతే ఒక రకంగా, ఆడవాళ్లయితే ఒకరకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. బేసిక్‌గా మేల్ డామినేషన్. అంత ఈజీగా స్త్రీలను నిర్మాతలుగా అంగీకరించే పరిస్థితి లేదు. చెప్పుకోవాలంటే ఎన్నో ఉంటాయి. కానీ ఎక్కడ లేవని సినిమా పరిశ్రమ విషయాలను బయటకు చెప్పమంటారు? ప్రపంచం మొత్తం జరుగుతున్నదే సినిమా పరిశ్రమలోనూ జరుగుతోంది. ►అయితే ఒక లేడీ నిర్మాత ఉన్నప్పుడు ఫీమేల్ టెక్నీషియన్స్‌కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే వీలు ఉంటుంది కదా? అనురాధ: అది కరెక్ట్. నా బేనర్లో సినిమా చేసిన ఎవరూ ఇబ్బందిపడలేదు. వాళ్లు సురక్షితంగా పని చేసుకునే వాతావరణం కల్పించేవాళ్లం. అయితే హీరోయిన్ సాక్షీ శివానంద్ లాంటి వాళ్లు మమ్మల్నే ఇబ్బందిపెట్టేవాళ్లు. వాళ్లంతట వాళ్లు కాస్ట్యూమ్స్ తెచ్చుకుని, డైరెక్టర్‌కి కూడా చూపించకుండా నేరుగా లొకేషన్‌కి వచ్చేయడం వంటివి చేసేవాళ్లు. ►17 సినిమాలు నిర్మించిన క్రెడిట్ మీది. ఎక్కువ సినిమాలు నిర్మించిన లేడీ ప్రొడ్యూసర్‌గా ‘లిమ్కా బుక్’ రికార్డ్‌ని సొంతం చేసుకున్నారు.. ఇప్పుడు ఎందుకు సినిమా నిర్మాణం ఆపేశారు? అనురాధ: ఆలయ దీపం (1984), ఇల్లాలే దేవత (1985) వంటి సినిమాలు తీశాం. ‘ఇల్లాలే దేవత’ సినిమా సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత ఓ పదేళ్లు నిర్మాణం మానుకున్నాం. నవీన్, అబ్బాస్, సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా ‘ప్రియా ఓ ప్రియా’ (1997) సినిమాతో మళ్లీ నిర్మాణం మొదలుపెట్టాను. ఆ తర్వాత నవీన్, రవితేజతో ‘ప్రేమించే మనసు’, జేడీ చక్రవర్తి, సాక్షీ శివానంద్ జంటగా ‘మా పెళ్లికి రండి’ సినిమాలు నిర్మించాను. అయితే ‘మా పెళ్లికి రండి’ (2001) సినిమా అప్పుడు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆ సినిమా థియేటర్లో ఉండగానే మాకు తెలియకుండా ఎవరో అమ్మేశారు. దాంతో కేబుల్‌లో వచ్చింది. సినిమా బాగున్నా నిర్మాతగా నష్టపోయాను. ఇక ఆ తర్వాత నిర్మాతగా ఫుల్స్టాప్ పెట్టేశాను. ఆ సినిమా అప్పుడు నిర్మాతగా నన్ను అణగదొక్కాలని చాలామంది ప్రయత్నించారు. సినిమా విడుదల చేయకుండా అడ్డుకోవడానికి ట్రై చేశారు. దాసరిగారి సహాయంతో ఎలాగో విడుదల చేశాను. 2005లో మావారు చనిపోయారు. నాకు ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు కూతుళ్లు చనిపోయారు. మూడో అమ్మాయి మ్యారీడ్ లైఫ్ బాగుంది. అయితే భర్త, ఇద్దరు కుమార్తెలు చనిపోవడంతో ఇక నేను ప్రొడక్షన్ కొనసాగించలేకపోయాను. సౌత్ అంటే చిన్నచూపు – అనురాధ నాకు ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డు వచ్చింది. ఆ అవార్డుకి ఎవరో ఒకరు నా పేరుని రిఫర్ చేయాలి. అవార్డు తీసుకుని వచ్చేశాక ఎవరు రిఫర్ చేసి ఉంటారా? అని అడిగితే.. మన తెలుగు పరిశ్రమ నుంచి నా పేరుని ప్రతిపాదించలేదు. కన్నడ పరిశ్రమ తరఫున నాకు వచ్చిన అవార్డు అది. కన్నడంలో మమ్మల్ని చాలా గౌరవిస్తారు. రాజ్‌కుమార్‌గారితో తీసిన ‘భక్త కుంభార’కి బోలెడన్ని అవార్డులు వచ్చాయి. కన్నడ స్టేట్ అవార్డు కూడా వచ్చింది. అయితే నేషనల్ అవార్డు విషయంలో చిన్న చేదు అనుభవం ఎదురైంది. మన దక్షిణాది పరిశ్రమవారంటే ఉత్తరాదివారికి చిన్న చూపు. ‘భక్త కుంభార’ సినిమాని నేషనల్ అవార్డుకి పంపించాం. అయితే అవార్డు దక్కలేదు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే.. అసలు ఆ సినిమా బాక్సుని అవార్డు కమిటీవాళ్లు ఓపెన్ కూడా చేయలేదట. సౌత్ సినిమా ఇండస్ట్రీ అంటే అక్కడివారికి అంత చిన్న చూపు. -
ఛీ.. ఆమె నా కూతురేంటి: ప్రముఖ గాయని
న్యూఢిల్లీ : బాలీవుడ్ గాయని అనురాధ పౌడ్వాల్ తన తల్లి అంటూ కేరళకు చెందిన ఒక మహిళ చేసిన వ్యాఖ్యలపై అనురాధ స్పందించారు. ఆమె తన కూతురు కాదని.. అవన్నీ తప్పుడు ఆరోపణలంటూ తీవ్రంగా మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన 45 ఏళ్ల కర్మలా మోడెక్స్.. బాలీవుడ్ గాయని అనురాధ పౌడ్వాల్ తన తల్లి అంటూ శుక్రవారం ఉదయం తిరువనంతపురంలో ఉన్న ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అనురాధ, ఆమె భర్త తన తల్లిదండ్రులంటూ పిటిషన్లో పేర్కొంది. 1974లో తనకు నాలుగు రోజుల వయసు ఉన్నప్పుడు వేరే వాళ్లకి దత్తత ఇచ్చి వెళ్లిపోయారని, అనురాధ తన సింగింగ్ కెరీర్‌కు ఆటంకం కలగకూడదనే ఇలా చేసిందంటూ పిటిషన్లో పేర్కొంది. తనను వదిలివెళ్లినందుకు పౌడ్వాల్ దంపతులు రూ. 50 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని మోడెక్స్ పేర్కొనడం విశేషం. వీటిన్నింటికి తన దగ్గర ఆధారాలున్నాయని, తనను పెంచిన ఫాదర్ చనిపోయేముందు అన్ని విషయాలు తనకు చెప్పాడని కర్మలా వెల్లడించారు. అంతేకాదు తన తల్లిని కలిసేందుకు ప్రయత్నించి చాలాసార్లు విఫలమయ్యానని పేర్కొన్నారు. 'నేను ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలను పట్టించుకోను. అయినా ఇలాంటి వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆమె నా గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ' గాయని అనురాధ మండిపడ్డారు. ఇదే విషయమై అనురాధ పౌడ్వాల్ ప్రతినిధి మాట్లాడుతూ... కర్మలా ఒక సైకోలాగా ప్రవర్తిసుందని తెలిపారు. అనురాధకు కూతురు ఉన్న విషయం నిజమేనని అయితే ఆమె పేరు కవిత అని పేర్కొన్నారు. వాళ్లిద్దరు నా తల్లిదండ్రులు అని చెబుతున్న కర్మలాకు తండ్రి చనిపోయాడన్న విషయం తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని, ఒకవేళ ఆమె చేసిన ఆరోపణలు నిజమైతే రూ. 50 కోట్లు ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేస్తుందో చెప్పాలని మండిపడ్డారు. బాలీవుడ్ గాయనీగా ఎన్నో సినిమాల్లో పాటలు పాడిన అనురాధను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1969లో అరుణ్ పౌడ్వాల్‌ను ఆమె పెళ్లాడారు. వారికి కొడుకు ఆదిత్య, కూతురు కవితలు సంతానం. -
యాదాద్రి జిల్లాలో మరో దారుణం
సాక్షి, వెంకటాపూర్: యాదాద్రి జిల్లాలో హాజీపూర్ ఘటన మరవకముందే మరో దారుణం చోటుచేసుకుంది. తుర్కపల్లి మండలం వెంకటాపూర్‌లో ఒంటరి మహిళను దుండగులు పాశవికంగా హతమార్చారు. కర్రే అనురాధ అనే మహిళ స్థానికంగా బెల్టు షాప్ నిర్వహిస్తోంది. అర్థరాత్రి వేళ దుండగులు అనురాధ ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హతమార్చారు. ఇంట్లోని నగలు, నగదు దోచుకు వెళ్లారు. గురువారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ...ఆధారాలు సేకరిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమ్మఒడితో తల్లి బ్యాంకు ఖాతాకు రూ.15 వేలు
తూర్పుగోదావరి, కాట్రేనికోన: మన ప్రభుత్వం అధికారం చేపట్టిన తక్షణమే జగనన్న నవరత్నాలలో ఒకటి ‘అమ్మ ఒడి’ పథకం కింద పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లుల బ్యాంకు ఖాతాకు ఏడాదికి రూ.15 వేలు జమ చేస్తామని అమలాపురం పార్లమెంటరీ పార్టీ కోఆర్డినేటర్ చింతా అనురాధ, ముమ్మిడివరం నియోజకవర్గం వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ పొన్నా డ వెంకట సతీష్‌కుమార్ భరోసా ఇచ్చారు. కాట్రేనికోనలో శుక్రవారం మండల పార్టీ కన్వీనర్ నల్లా నరసింహమూర్తి, ఎస్ఆర్కే తాతాజీ, గంటి వెంకట సుధాకర్ల ఆధ్వర్యంలో ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమం జరిగింది. చింతా అనురాధ, పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌లు కాట్రేనికోన రామస్వామి తోట, చెంచుల గరువు, బూలవారి పేట, జిల్లేళవారి పేటలలో ఇంటింటికీ వెళ్లి నవరత్నాల కరపత్రాలను అందించి ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్ధించారు. అంబేడ్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికలలో రుణమాïఫీ చేస్తానని డ్వాక్రా మహిళలను మోసగించిన చంద్రబాబు ‘పసుపు కుంకుమ’ పేరుతో వంచన చేస్తున్నాడన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ‘పసుపు కుంకుమ’ ప«థకానికి బదిలీ చేయడం సరికాదన్నారు. మీ చిన్నారులను బడికి పంపిస్తే అమ్మ ఒడి పథకంతో ప్రతి నెలా రూ.1500లు చొప్పున లబ్ధిచేకూరుతుందన్నారు. నిరుపేద విద్యార్ధులకు భోజన వసతికి ఏడాదికి రూ. 20 వేలు చెల్లిస్తామన్నారు. పెయ్యల చిట్టిబాబు, మోకా చంద్ర నాగరత్నం, నడింపల్లి సూరిబాబు, కుడిపూడి శివన్నారాయణ, సంసాని నాగేశ్వరరావు, కాశి హనుమంతరా వు, కొప్పిశెట్టి వామనమూర్తి, గుత్తుల పద్మ, రేవు మల్లేశ్వరి, పోతుల రత్నకుమారి పాల్గొన్నారు. -
సిందూరపు కొండల్లో చదువుల మందారం!
కమ్యూనిస్టుల ఖిల్లా అయిన ఒకప్పటి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందుకు ఐదుసార్లు శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన అసామాన్య ప్రజానేత గుమ్మడి నర్సయ్య తనయ గుమ్మడి అనురాధ. కటిక పేదరికం, ఏ మాత్రం సహకరించని ఆర్థిక ఇబ్బందుల వల్ల లక్ష్యాలు మసకబారినా తన ధ్యేయం నుంచి మాత్రం ఆమె పక్కకు జరగలేదు. తనదైన పంథాలో సమాజం రుణం తీర్చుకోవాలనే ఆమె సంకల్పమూ గురి తప్పలేదు. తీవ్ర ప్రతికూలతల మధ్యే కొలిమిలో కాలిన ఇనుములా ఉక్కు సంకల్పంతో విద్యాసుగంధాలు వెదజల్లే కుసుమమై తొలి కోయ న్యాయ విద్య ఆచార్యురాలిగా తెలుగు రాష్ట్రాల్లోనే చరిత్ర లిఖించారు. తండ్రి పేరు ప్రతిష్టలకు దీటైన వారసురాలిగా ఇల్లెందులో గుర్తింపు పొందారు. గిరిజన హక్కులపై పీహెచ్డీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం టేకులగూడెం గ్రామంలో అనురాధ ఒకటీ రెండు తరగతులు చదివారు. మూడో తరగతి నుండి ఇంటర్ వరకు సుదిమళ్లలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేశారు. ఇల్లెందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఏ (హెచ్‌ఇపీ గ్రూప్) పూర్తి చేశారు. తర్వాత ఓయూ క్యాంపస్‌లో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం పూర్తి చేసి, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ పర్యవేక్షణలో ‘ట్రైబల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ తెలంగాణా స్పెషల్ రెఫరెన్స్ టు ఖమ్మం’ అన్న అంశంపై 2017 మార్చిలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఎస్టీ బ్యాక్లాగ్ అధ్యాపక ఉద్యోగ నియామకాల్లో ఆమెకు న్యాయశాఖలో ఉస్మానియా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అదే ఏడాది జూన్‌లో ఉద్యోగం వచ్చింది. ఉస్మానియా చరిత్రలో ఒక గిరిజనమహిళ, అదీ కోయ తెగకు చెందిన మహిళ న్యాయశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడం ఇదే ప్రథమం. విద్యా సమస్యలపై పోరాటం అనురాధకు అన్న, అక్క ఉన్నారు. అన్న గ్రామంలోనే వ్యవసాయం చేస్తారు. అక్క ఊరికి దగ్గర్లో ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి గుమ్మడి నర్సయ్య తన చిన్నతనం నుండే ఎన్నో ఒడిదుడుకులతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు. (సీపీఐ ఎమ్ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ఉండేవారు. ఎప్పుడూ ప్రజల్లో మమేకమై పనిచేశారు. అందువల్లనే ఐదుసార్లు ఇల్లెందు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఇంట్లో ఉండటం చాలా అరుదు కావడం వల్ల అనురాధ అమ్మ అమ్మక్క కుటుంబ భారాన్ని మోశారు. వ్యవసాయం చేస్తూ, అన్నీ తానై పిల్లలను చదివించారు. ప్రయోజకులను చేశారు. అనురాధ చదువుకునే రోజుల్లో న్యూ డెమోక్రసీ పార్టీకి అనుబంధంగా ఉన్న పీడీఎస్‌యూ విద్యార్థి సంఘంలో ఉన్నారు. విద్యా అంశాలపై పోరాడి, డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని చేసిన పోరాటంలో అగ్రభాగాన నిలిచారు. తెలంగాణా పోరాట సమయంలోనే నిరాహార దీక్షలు చేపట్టారు. నాన్న చెప్పిన మాట ‘‘మా నాన్న ఏనాడూ మమ్మల్ని ఎమ్మెల్యే బిడ్డలమన్న భావంతో పెంచలేదు. సాధారణ మధ్యతరగతి వాళ్ల మాదిరిగానే పెంచారు. నేను చదివే స్కూల్లో కూడా నన్ను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా చూడలేదు. అందరి పిల్లలతోపాటే చూసేవారు. ‘పోరాడుతూ చదవాలి, చదువుతూ పోరాడాలి’ అని నాన్న ఎప్పుడూ చెప్పే మాటలు నిజంగా నాకు బలాన్ని ఇచ్చాయి.’’ అని చెప్పారు అనురాధ. ఈ పోరాట నేపథ్యం కారణంగానే కెరీర్లో ఆమెకు అవరోధాలు అడ్డంకులు ఎదురయ్యాయి. ‘‘వాళ్ల నాన్న నక్సలైట్. నక్సలైట్ కూతురికి ఏ ప్రభుత్వ ఉద్యోగమూ ఇవ్వకూడదు. నక్సలైట్ కూతురు అనే ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా ఉంది’’ అని నాకు ఉద్యోగం రాకుండా యూనివర్శిటీలో కొందరు ప్రచారం చేశారు. అయితే తోటి అధ్యాపకులు, స్నేహితులు నాకు పూర్తి మద్దతుగా నిలిచారు. నాకు ఉద్యోగం వచ్చేలా సహకారం అందించారు. నాకున్న మెరిట్‌ను బట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ని అయ్యాను’’ అని చెప్పారు అనురాధ. అమ్మాయిలు చదవాలి.. ఎదగాలి మారుమూల గిరిజన పల్లెల్లో గిరిజన అమ్మాయిలను ఎక్కువ చదువులు (ఉన్నత చదువులు) చదివించడానికి తల్లిదండ్రులు ఇష్టపడటంలేదు. చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఆర్ధిక స్ధోమత లేనప్పుడు పై చదువులకు ఏం పంపుతామని నిస్సహాయత వ్యక్తపరుస్తున్నారు. అమ్మాయిలను చదివిస్తేనే ఉన్నత శిఖరాలను అవరోహిస్తారు. తల్లిదండ్రులు అమ్మాయిని అబ్బాయితో సమానంగా చూడాలి. ఎప్పటికైనా పరాయి ఇంటికి వెళ్ల వలసిన అమ్మాయి, మనకే అన్నం ముద్ద పెట్టదు అనే ఆలోచన చాలా మందిలో ఉంది. కానీ ప్రస్తుత పరిస్ధితుల్లో అమ్మాయిలే తల్లిదండ్రులను చూస్తున్నారు. అమ్మాయిలను తక్కువ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, అబ్బాయిలను కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించడం లాంటివి మానుకోవాలి. పైలట్ అవుతానంటే వద్దనీ, సైన్యలో చేరతానంటే కాదనీ అమ్మాయిలను తల్లిదండ్రులు అడ్డుకోకూడదు. వారికి ఏరంగంలో ఆసక్తి ఉందో అదే రంగంలో ఉంచాలి. అప్పుడే వారు ఏ రంగంలోనైనా రాణించగలరు. ప్రభుత్వాలు కూడా విద్య ఆవశ్యకత పట్ల గిరిజనుల్లో అవగాహన పెంచాలి. నా రిసెర్చ్ కూడా గిరిజనుల విద్యాభివృద్ధి పైనే. -
నా బిడ్డ పేరుతో ఒక చట్టం రావాలి
భారతీయ నౌకాదళంలో విధి నిర్వహణలో ఉన్న తన కుమారుడి ఆకస్మిక మరణం వెనుక అంతుచిక్కకుండా ఉన్న కారణాలను వెల్లడించాలని పాతికేళ్లుగా ఒంటరి న్యాయపోరాటం చేస్తున్న మాతృమూర్తి అనూరాధ పాల్థేకు ఎట్టకేలకు కొద్దిపాటి ఊరట లభించింది. ఈ కేసును తక్షణం సి.బి.ఐ. విచారణకు అప్పగిస్తూ గత సోమవారం హైదరాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర థాణే జిల్లా డోంబివలిలో ఉంటున్న అనూరాధ పాల్థే తనను కలిసిన ‘సాక్షి’ ప్రతినిధులతో తన ఆవేదనను పంచుకున్నారు. అసలేం జరిగింది? పాతికేళ్ల క్రితం.. ఇండియన్ నేవీలో చేరిన అమర్ పాల్థేకి సీ మ్యాన్ 1గా కాకినాడ తీరప్రాంతంలో పోస్టింగ్ వచ్చింది. 1993 సెప్టెంబర్ 21 న అమర్, తక్కిన సీ మెన్.. నేవీ శిక్షణలో భాగంగా హెలికాప్టర్ నుంచి సముద్ర తీరంలోకి దుమికి ఒడ్డుకు చేరే విన్యాసాన్ని ప్రదర్శిస్తుండగా, సముద్రంలోకి పడిపోయిన అమర్ తిరిగి ఒడ్డుకు చేరలేదు. రెండు రోజుల తర్వాత అతడి మృతదేహం లభ్యమైంది. పోస్ట్‌మార్టమ్‌లో వైద్యులు అతడి తలపై గాయాలు ఉండడం గమనించినప్పటికీ, అవి ఘటనకు ముందు నుంచే ఉన్న దెబ్బలని గుర్తించడంతో అమర్ మరణం అనుమానాస్పదం అయింది. దీనిపై అమర్ తల్లి అనూరాధా అశోక్ పాల్థే విచారణకు పట్టుపట్టారు. కాకినాడ పోర్ట్ పోలీసులు, నేవీల అంతర్గత దర్యాప్తు సంస్థ ‘బోర్డ్ ఆఫ్ ఎంక్వయరీ’.. ఈ రెండు కూడా.. ప్రమాదం వల్లనే అమర్ చనిపోయాడు తప్ప, వేరే కారణాలేవీ లేవని తేల్చి చెప్పినప్పటికీ వాటిపై నమ్మక కుదరక అనూరాధ న్యాయస్థానాన్ని ఆశ్రయించి అవిశ్రాంతంగా పోరాటం సాగిస్తూ వచ్చారు. నేవీకి వ్యతిరేకం కాదు ‘‘నేను నేవీకి వ్యతిరేకం కాదు. నేవీలోని అవినీతి అధికారులకు వ్యతిరేకంగానే నా న్యాయ పోరాటం. నా కొడుకు అమర్ మృతి ప్రమాదవశాత్తు జరగలేదని కోర్టు అంగీకరించింది కనుకనే ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అందుకు నా ధన్యవాదాలు. సీబీఐ దర్యాప్తు చేపడితే అమర్ మర ణానికి వాస్తవ కారణాలు బయటపడతాయన్న నమ్మకం నాకు ఉంది. కేసును వెనక్కి తీసుకోవాలని ఇన్నేళ్లలోనూ అనేక బెదిరింపులు వచ్చాయి. దీంతో మానసికంగా కుంగిపోయి ఈ కేసును వెనక్కి తీసుకోవాలని కూడా అన్పించింది. కానీ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, నా విద్యార్థులు ఇలా అనేక మంది ప్రోత్సాహం, ముఖ్యంగా ఈ కేసు వాదిస్తున్న న్యాయవాదులు సునీల్, మంజీరా దంపతుల సహకారంతో ఇంతవరకు పోరాడగలిగాను. నేను ఉన్నంత వరకు ఈ న్యాయపోరాటం చేస్తాను. నా కుమారునిలాగే నేవీలో అనుమానాస్పదంగా అనేక మంది మరణించినట్టు గడిచిన ఇరవై ఐదేళ్లలో తెలుసుకున్నాను. ఏదైనా అడిగితే ప్రమాదవశాత్తు మరణించారని చెబుతారు. అనేక మంది శవాలు కూడా లభించలేదు. ఈ మరణాలపై విచారణకు అడ్డుపడేవారికి, నేవీలోని అవినీతి అధికారులకు శిక్ష పడేలా చూడాలి. ఇందుకోసం అవసరమైతే చట్టం ఉండాలి. ఆ చట్టానికి నా కుమారుని పేరు పెడితే సంతోషిస్తాను.’’ బలి తీసుకున్నారు అమర్ 1970 మే 25వ తేదీ పుట్టాడు. 1990 జనవరి ఒకటవ తేదీ నేవీలో చేరాడు. మొదటి ఆరు నెలలు ‘చిలుక’లో శిక్షణ పొందాడు. తర్వాత డైవర్‌గా సెలక్టయ్యాడు. వాడికి అడ్వెంచర్స్ అంటే ఇష్టం. అవార్డులు కూడా అందుకున్నాడు. విధుల్లో భాగంగా 1993లో కాకినాడ వెళ్లాడు. అప్పుడే ప్రమాదవశాత్తూ అమర్ మరణించినట్లు వార్త వచ్చింది. కుప్పకూలి పోయాను. అక్కడికి వెళ్లాను. రెండు రోజుల ముందే హెలిక్యాప్టర్ నుంచి డైవ్ చేస్తూ మిస్ అయ్యాడని, తర్వాత ఒడ్డుకు కొట్టుకురావడం స్థానిక మత్స్యకారులు చూశారని అధికారులు చెప్పారు. నాకు నమ్మబుద్ధి కాలేదు. ఘటనకు ముందే అమర్‌కు బలమైన గాయాలైనట్టు పోస్ట్‌మార్టమ్‌లో తేలింది. ఖిన్నురాలినయ్యాను. నేవీ అంటే ఎంతో గౌరవమున్న మేము మా అబ్బాయి కోసం నేవీపైనే న్యాయపోరాటానికి దిగాం. నేవీలో కొందరు అవినీతి అధికారుల కారణంగానే మా కొడుకు మరణించాడని నా నమ్మకం. ముందుగా ముంబై హై కోర్టులో పిటిషన్ వేశాం. అనంతరం 1997లో కాకినాడ కోర్టులో కేసు నమోదు చేశాం. కేసులు నడుస్తున్నప్పుడు కొందరు నేవీ అధికారులు ఈ కేసుల్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అమర్ సముద్రంలోకి డైవ్ చేస్తున్న సమయంలో అధిక ఎత్తులో హెలికాప్టర్ ఉండడం, భారీ ఎత్తున అలలు ఎగిసి çపడడం వల్ల అమర్‌ను వెంటనే వెదకలేకపోయామని, దీంతో అమర్ మరణించాడని కోర్టుకు నేవీ అధికారులు చెప్పారు. కానీ నేవీ, ఏయిర్‌ఫోర్స్, ఆర్మీ ఇలా మూడూ ఆ సమయంలో అక్కడ ఉండగా ఎందుకు వెదకలేకపోయారనే అనుమానాలకు వారి వివరణ తావిచ్చేలా ఉంది. మా అనుమానం నిజమేనని కాకినాడ కోర్టుతోపాటు, హైదరాబాదు హైకోర్టు కూడా నా కుమారుని మృతి ప్రమాదవశాత్తు జరగలేదని, అన్నేచురల్ డెత్ అని అభిప్రాయపడ్డాయి’’ అని తెలిపారు అనూరాధ. భర్త మరణానంతరం అనూరాధ స్కూల్ టీచర్. కోర్టు కేసులకు వెళ్లి రావడానికి ఇబ్బందిగా ఉండడంతో 2001లో స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. 2007లో ఆమె భర్త అశోక్ మరణించారు. అప్పుడు మాత్రం ఈ పోరాటంలో తను ఒంటరినయ్యానని అమెకు అనిపించింది. చిన్న కుమారుడు ప్రతాప్, కోడలు సహకారం అందించారు. ఈసారి పూర్తిస్థాయిలో న్యాయపోరాటం మొదలైంది. ముఖ్యంగా 2008 నుంచి ఇప్పటి వరకు కుటుంబానికి... అంటే .. తన మనవలు, మనవరాళ్లకు ప్రేమను అందించలేక పోయినందుకు ఆమె విలపించిన రోజులెన్నో ఉన్నాయి. ‘‘పదేళ్లపాటు దేవుణ్ణి కూడా కొలవడం మానేసి నా కొడుకు కోసం పోరాడాను. నిజంగా దేవుడున్నాడు. నా మొర ఆలకించాడు’’ అన్నారు అనూరాధ. అనేక బెదిరింపులు ‘‘ఈ కేసులను వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తూ ఎక్కడెక్కడి నుంచో నాకు కాల్స్ వస్తుండేవి. ఓసారి బాగా భయపడి వెంటనే న్యాయవాది దంపతులకు ఫోన్ చేసి చెప్పాను. వాళ్లు పోలీస్ ఎంక్వయిరీ చేయిస్తే ఆ కాల్స్‌లో ఒకటి పాకిస్తాన్ సిమ్ నుంచి వచ్చినట్లు బయటపడింది. ఇలాంటివన్ని కూడా నా కేసును మరింత బలోపేతం చేశాయి. 2017 జులైలో తుది తీర్పు ఇవ్వనున్నట్టు హైదరాబాదు కోర్టు పేర్కొంది. దీనిపై ఎంతో ఉత్కంఠతో గడిపాను. కాని తీర్పును అడ్డుకోవడంలో నేవీ అధికారులు సఫలీకృతమయ్యారు. మళ్లీ ఈ కేసు వాయిదా పడింది. మానసికంగా కుంగిపోయాను. కేసును వెనక్కి తీసుకుందామనుకున్నాను. కొన్ని రోజులపాటు అనారోగ్యం పాలయ్యాను. కానీ నిలబడ్డాను. అందరి ప్రోత్సాహం లభించింది. ముఖ్యంగా నయాపైసా తీసుకోకుండా నా కోసం పోరాడుతున్న న్యాయవాది దంపతులు నాకు అండగా నిలిచారు. నేను పనిచేసిన పాఠశాలకు చెందిన పాఠశాల విద్యార్థుల సహకారం కూడా లభించింది. అనేక మంది విద్యార్థులు న్యాయం చేయాలంటూ డిఫెన్స్ శాఖ మంత్రికి లేఖలు రాశారు. నేను కూడా అనేక మందిని కలిశాను. ఎట్టకేలకు పాతికేళ్ల అనంతరం 2018 డిసెంబరు 17వ తేదీన హైదరాబాదు హై కోర్టు సిబిఐకి అప్పగించింది’’ అని భారమైన హృదయంతో తెలిపారు అనూరాధ. నాలుగు పుస్తకాలు అనూరాధ తన న్యాయపోరాటంపై ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు రాశారు. సుప్రసిద్ద రచయిత్రి శిరీష్ పయి ప్రొత్సాహంతో తన కుమారుడు జన్మదినాన్ని (జయంతి) పురస్కరించుకుని 2013 మే 25వ తేదీన మొదటి పుస్తకం అవిష్కరించారు. నాలుగువ పుస్తకం జనవరి ఒకటవ తేదీ 2016న విడుదల అయింది. ఇప్పటి వరకు కొనసాగిన కేసుతోపాటు తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, న్యాయపోరాటంపై అయిదవ పుస్తకాన్ని కూడా రాస్తున్నట్టు అనూరాధ చెప్పారు. మరాఠీలో ఉన్న ఈ పుస్తకాలన్నిటినీ త్వరలోనే ఇంగ్లిష్‌లోకి అనువదిస్తున్నట్లు తెలిపారు. – గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై – మూడి శ్రీనివాస్, సాక్షి, పుణెí -
మేయర్ దంపతుల హత్య కేసు
చిత్తూరు అర్బన్: చిత్తూరు మాజీ మేయర్ అనూరాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసు విచారణ (ట్రయల్ షెడ్యూల్) తేదీలను ఖరారు చేస్తూ స్థానిక 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి కబర్ది గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2015 నవంబరులో జరిగిన జంట హత్యల కేసులో చింటూతో పాటు వెంకటాచలపతి, జయప్రకాష్‌రెడ్డి, మంజునాథ్, వెంకటేష్, మురుగ, యోగ, పరంధామ, మొగిలి, హరిదాస్, శశిధర్, ఎంఎస్.యోగానంద్, ఆర్వీటీ బాబు, లోకేష్, రఘుపతి, నాగరాజు, వెంకటానంద్, కమలాకర్, రజనీకాంత్, నాగేంద్ర, శ్రీనివాసాచారి, బుల్లెట్ సురేష్ నిందితులుగా ఉన్నారు. వీరిలో వెంకటాచలపతి, జయప్రకాష్‌రెడ్డి, మంజునాథ్‌కు బెయిల్ రాలేదు. కేసు విచారణను వేగవంతం చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించడంతో చిత్తూరు కోర్టు చర్యలు చేపట్టింది. కేసులో మొత్తం 130 మంది సాక్షులుగా ఉన్నారు. వీరిలో 69 మందిని తొలుత విచారించనున్నారు. ఈ నెల 29 నుంచి ఈ ఏడాది డిసెంబరు 5వ తేదీ వరకు తొలి షెడ్యూల్ విచారణ జరగనుంది. మలి షెడ్యూల్‌ను ప్రకటించి విచారణ పూర్తి చేసి తీర్పును వెలువరించనున్నారు. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేయడంతో చింటూను పోలీసులు వైఎస్సార్ కడప జైలుకు తరలించారు. -
చదువుకి వైద్యం
డాక్టర్ అవబోయి టీచర్ అవలేదు అనూరాధ. డాక్టర్ అయ్యాక.. టీచర్ అవ్వాలనుకుని చాక్‌పీస్‌తో చదువుకు వైద్యం చేయడానికి బయల్దేరారు. డాక్టర్ అనూరాధ కిశోర్, ఢిల్లీలో మంచి పేరున్న పీడియాట్రీషియన్. పిల్లల డాక్టర్‌గా పదిహేడేళ్ల అనుభవం ఆమెది. అలాంటి డాక్టరమ్మ ఓ రోజు టీచర్ ట్రైనింగ్ కోర్సు చేస్తానంటూ అప్లికేషన్ పెట్టుకున్నారు! ఆ మాట విన్న తోటి డాక్టర్లే కాదు, ఆమె అప్లికేషన్‌ను పరిశీలించి, ఆమోదించిన అధికారులు కూడా విపరీతంగా ఆశ్చర్యపోయారు. ఈవిడకిదేం పిచ్చి అని ముఖాన అనలేదన్నమాటే కానీ దాదాపుగా కొంచెం అటూఇటుగా వారందరి అభిప్రాయం ఇదే! చదువే అనారోగ్యమా? ఇంతకీ అనూరాధ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఉన్న కారణం... పిల్లలు తరచూ అనారోగ్యం పాలు కావడమే. పిల్లలంటే ఆమె పిల్లలు కాదు. ఆమె దగ్గరకు తల్లిదండ్రులు తెస్తున్న పిల్లలు. ఎన్ని పరీక్షలు చేసినా పిల్లల్లో ఫిజికల్‌గా అనారోగ్యం కనిపించేది కాదు. అయితే ఒత్తిడికి లోనవుతున్న లక్షణాలు కనిపించేవి. మానసికంగానే వారిని ఏదో పీడిస్తున్నట్లుండేది. ఈ వయసులో వాళ్లకు ఇంకేం బరువు బాధ్యతలుంటాయని పీడించటానికి? బహుశా వారిని భయపెడుతున్న భూతం చదువే కావచ్చు, వారు భయపడుతున్న బూచి స్కూలే కావచ్చు. స్కూలు ఎగ్గొట్టడానికి ఏదో ఒక నొప్పిని వాళ్లే వెతుక్కుంటూ ఉండవచ్చు. ఇవన్నీ తన ఊహాజనితమైన అనుమానాలేనా లేక పూర్తిగా నిజాలా? ఇది తెలియాలంటే స్కూలు ఎలాగుందో తెలుసుకోవాలి? పిల్లల మీద పాఠాల ఒత్తిడి ఎలా ఉంటోందో తెలుసుకోవాలి అనుకున్నారు డాక్టర్ అనూరాధ. ఆమె టీచర్ ట్రైనింగ్ కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి వెనుక ఇంత కథ ఉంది. పిల్లలవన్నీ సిక్ లీవులే! కోర్సు అయ్యాక, ఢిల్లీ సమీపంలోని గుర్‌గ్రామ్‌లోని ప్రోగ్రెసివ్ స్కూల్లో కిండర్‌గార్డెన్ టీచర్‌గా చేరారు అనూరాధ. క్లాస్‌రూమ్‌లో అడుగుపెట్టిన తరువాత ఆమెకి ఒక్కో సందేహానికీ సమాధానం దొరికింది. క్లాస్‌లో పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు వాళ్ల అటెండెన్స్ హిస్టరీని, హెల్త్హిస్టరీని పరిశీలించారామె. ఏ క్లాస్‌లో అయినా చదువులో చురుకైన పిల్లలతోపాటు, రమారమిగా చదివేవాళ్లు, ఒక మోస్తరుగా చదువుతూ బొటాబొటి మార్కులతో గట్టెక్కేవాళ్లు, పాస్‌మార్కులు తెచ్చుకోవడమూ కష్టమే అనిపించే పిల్లలూ ఉంటారు. చురుగ్గా ఉండే పిల్లలు, యావరేజ్‌గా చదివేవాళ్లలోనూ అభద్రత కనిపించడం లేదు కానీ అంతకంటే తక్కువ గ్రహింపు శక్తితో ఉన్న పిల్లల్లోనే అటెండెన్స్ తగ్గడం గమనించారామె. స్కూలుకి ఆబ్సెంట్ అయిన కారణాలు ‘అనారోగ్యాలే’ అయి ఉంటున్నాయి! తెలిసింది అడిగితే ఆత్మవిశ్వాసం యావరేజ్ పిల్లల్ని చురుకైన పిల్లలతో కలిపి పాఠాలు చెప్పి వదిలేస్తే కుదరదనుకున్నారామె. అలా చెప్పడం వల్ల చురుకైన పిల్లలు త్వరగా నేర్చుకుంటూ, టీచర్ అడిగిన ప్రశ్నకు టక్కున బదులిస్తూ, తోటి పిల్లల వైపు విజయగర్వంతో చూస్తుంటారు. టీచర్ యావరేజ్ స్టూడెంట్‌ని ప్రశ్న అడిగినప్పుడు ఆ పిల్లవాడు తనకు సమాధానం తెలియదనే భయంతో బిగుసుకుపోతుంటాడు. తరచూ ఇలా జరుగుతుంటే పిల్లల్లో న్యూనత పెరిగిపోతుంది, ముడుచుకుపోతారు. స్కూలంటేనే భయపడుతూ, మానేయడానికి దారులు వెతుక్కుంటారు. మరే కారణం చెప్పినా అమ్మానాన్నలు ఒప్పుకోరు కాబట్టి పొట్టలో నొప్పి, కాలు నొప్పి వంటి కారణాలు చెప్తారు. మరికొందరిలో పాఠాల ఒత్తిడి, స్కూలు భయంతో జ్వరం వస్తుంటుంది కూడా. అందుకే అలాంటి పిల్లలను ఎక్కువ సేపు ఆటపాటల్లో ఉంచుతున్నారు అనూరాధ. అంతకంటే ఎక్కువగా ఆమె ఒక విషయాన్ని నిశితంగా అధ్యయనం చేశారు. డల్ స్టూడెంట్స్‌లో ఎవరు ఏ పాఠాన్ని బాగా నేర్చుకున్నారో గమనించారు. క్లాస్‌లో వాళ్లను ఆ పాఠాల్లోని ప్రశ్నలే అడిగేవారు. దాంతో ఆ పిల్లల్లో టీచర్ ప్రశ్నలకు తాము కూడా సమాధానం చెప్పగలమని ఆత్మవిశ్వాసం కలిగింది. క్రమంగా స్కూలంటే భయం తగ్గడం మొదలుపెట్టింది. ఫస్ట్ ఎయిడ్ కూడా క్లాస్‌లోనే అనూరాధ క్లాస్‌లో పిల్లలంతా ఐదేళ్లలోపు వాళ్లే. ఆ వయసు పిల్లలు ఆటలాడుతూ దెబ్బలు తగిలించుకోకుండా ఉండరు. పిల్లల గాయాలకు అనూరాధ స్వయంగా మందురాసి కట్టు కట్టడాన్ని చూసిన తోటి టీచర్లు... ‘టీచరైనా మీలో డాక్టర్ ఎక్కడికీ పోలేద’ని చమత్కరిస్తుంటారు. అప్పుడామె ‘‘డాక్టర్ వైద్యాన్ని వదిలేయవచ్చేమో కానీ వైద్యం డాక్టర్ని వదిలి వెళ్లదు. స్టెతస్కోపు పక్కన పెట్టి బ్లాక్‌బోర్డు పక్కన నిలబడగలిగాను, కానీ గాయాన్ని చూసినప్పుడు డాక్టర్ బయటకు వస్తుంది’’ అంటారు. అనూరాధ టీచర్ చేస్తున్న ప్రాక్టీస్ మంచి ఫలితాలనే సాధిస్తోంది. పిల్లలకు చదువు చెప్పడం రాకపోతే పిల్లలు పేషెంట్లవుతారు. చదువు చెప్పే విధానానికే వైద్యం చేస్తే పిల్లలు హాస్పిటల్ ముఖం చూడకుండా పెరుగుతారు. అనూరాధ అధ్యయనంలో తెలిసిన సంగతి ఏమిటంటే... పిల్లలు స్కూలంటే ముఖం చాటేస్తున్నారంటే, లోపం ఉన్నది పిల్లల్లో కాదు. ఆడుతూ పాడుతూ, ఆటల్లో ఆటగా, పాటల్లో పాటగా పాఠాన్ని చెప్పడం తెలియని విద్యావిధానానిదే లోపం. ఆ విధానంలో చదువు చెప్తున్న స్కూళ్లదే అసలైన లోపం. ఆ లోపాన్ని సరిదిద్దడానికి టీచర్లే పూనుకోవాలి. ఐక్యూ వేరైనా ఒకేలా చూడాలి పిల్లలతో గడపడం నాకిష్టం, అందుకే పీడియాట్రీషియన్ కోర్సు చదివాను. ఇన్నేళ్ల పాటు నా దగ్గరకు వచ్చిన పిల్లలు పేషెంట్లు. ఇప్పుడు నాకు రోజూ ఉదయాన్నే పిల్లలు పువ్వుల్లా నవ్వుతూ పలకరిస్తున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. చదువంటే పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, క్లాస్ రూమ్‌లో పిల్లలందరినీ సమానం చేయగలగడం. నేనదే చేస్తున్నాను. నేను ఈ ఏడాది ఏప్రిల్‌లో టీచర్‌గా చేరాను. అప్పటి వరకు తరచూ స్కూలుకి ఆబ్సెంట్ అయిన పిల్లలెవరూ ఇప్పుడలా లేరు. స్కూల్‌ని ఇష్టపడుతున్నారు. – అనూరాధ – మంజీర -
పాము కరిస్తే పూజలు చేయొద్దు
కృష్ణాజిల్లా, అవనిగడ్డ: పాముకాటు వేసినపుడు మూఢ నమ్మకాలకు పోయి మంత్రాలు, నాటువైద్యం, పూజలు చేస్తూ కూర్చోకుండా వీలైనంత త్వరగా వైద్యశాలకు వెళ్ళి చికిత్స తీసుకోవాలని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గద్దె అనూరాధ పేర్కొన్నారు. శుక్రవారం స్ధానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న పాముకాటు బాధితులను అనూరాధ, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పరామర్శించారు. పాముకాటుకు గురై చికి త్స తీసుకుంటున్న రోగులను పరామర్శించారు. ఎక్కడికి వెళితే పాము కరచింది, ఎంత సమయంలో వైద్యశాలకు వచ్చారు, చికిత్స ఎలా అందుతుందని ప్రశ్నించారు. పాముకాటుకు గురైన వెంటనే సమీపంలోని వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందడం ద్వారా ప్రాణాపాయం లేకుండా చూసుకోవచ్చన్నారు. మోపిదేవిలో నిర్వహించిన సర్పశాంతి హోమం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఛైర్పర్సన్ బదులిస్తూ పాముకాటుకు గురైనపుడు భయపడుతూ ఉండటం వల్ల విషప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఈ భయాలను తొలగించేందుకు, మనో ధైర్యం ఇచ్చేందుకు ఈ హోమం దోహద పడుతుందని పేర్కొన్నారు. అవసరమైతే స్నేక్ స్టిక్స్ సరఫరా... వరదలు, పంటకాలువలో కొత్తనీరు రావడం, వర్షాలు ఎక్కువగా కురవడం, ఎలుకలు పెరగడం వల్ల పాముల బెడద ఎక్కువైందని ఛైర్పర్సన్ అనూరాధ చెప్పారు. వీటి బారి నుంచి రైతులు, కూలీలను కాపాడేందుకు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాలోని 11 గ్రామాల్లో హెక్టార్‌కి 40 కిలోల గుళికలను ఉచితంగా అందిస్తున్నామన్నారు. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దృష్టికి పాముకాట్ల విషయం తీసుకెళ్ళినట్టు చెప్పారు. అవసరమైతే పాములు దగ్గరకు రాకుండా ఉండే శబ్ధతరంగాల స్టిక్స్‌ను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలలు, పీహెచ్‌సీల్లో పాము విషం విరుగుడు (యాంటీ స్నేక్ వీనం ఇంజక్షన్లు) అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ బీవీ కనకదుర్గ, జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణదొర, వైద్యశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మత్తి శ్రీనివాసరావు, వైద్యులు టి.నాగలక్ష్మీ, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్ (రాజా), ఎంపీటీసీ గాజుల మురళీకృష్ణ పాల్గొన్నారు. -
మూఢ నమ్మకాలపై సందేశం
నందు, అనురాధా, బాలాజీ, ప్రమీల ముఖ్య తారలుగా ఫణిరామ్ తూఫాన్ దర్శకత్వంలో శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘ఐందవి’. ఎస్ఏ అర్మాన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నటుడు కాదంబరి కిరణ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఫణిరామ్ తూఫాన్ మాట్లాడుతూ– ‘‘కొందరు యువతీ యువకులు సరదాగా గడుపుదామని ఇంటి నుంచి వెళతారు. అనుకోకుండా వారు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నారన్నదే ఈ సినిమా కథాంశం. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. మూఢ నమ్మకాలను ఆశ్రయించొద్దనే సందేశాన్ని ఇస్తున్నాం’’ అన్నారు. ‘‘ఓ సక్సెస్ఫుల్ ఫార్ములాను అనుసరించి ఈ సినిమా నిర్మించాం. అతీంద్రియ శక్తులు, హారర్ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది. త్వరలో రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు శ్రీధర్. ∙బాలాజీ, ప్రమీల -
హత్యలు చేసిందెవరు?
‘‘పెద్ద హీరోలు ప్రచారానికి వస్తున్నారు. కానీ, చిన్న హీరోలు ఈ విషయంలో సహకరించడం లేదు. నందు తన సినిమాల ప్రచారంలో పాల్గొనడం లేదు. నిర్మాత తన డబ్బును, దర్శకుడు కెరీర్‌ని పణంగా పెట్టి సినిమా చేస్తారు. అలాంటి దర్శక, నిర్మాతలకు హీరోలు సహకరించాలి’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. నందు, అనురాధ జంటగా ఫణిరామ్ తుఫాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐందవి’. సన్నీ అండ్ విన్నీ సినిమాస్ పతాకంపై శ్రీధర్ లింగం నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఫణి రామ్ మాట్లాడుతూ– ‘‘జనసంచారం లేని ప్రాంతంలో సరదాగా కొన్ని రోజులు గడుపుదామని ఆరుగురు వ్యక్తులు వెళ్తారు. ఒక్కొక్కరుగా హత్య చేయబడతారు. ఆ హత్యలు చేసిందెవరు? ఈ హత్యలకు, ఐందవికి సంబంధం ఏంటి? అన్నదే కథాంశం’’ అన్నారు. ‘‘ఆగస్టు మూడో వారంలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అన్నారు శ్రీధర్లింగం. దిలీప్, అవంతిక, ‘ఛత్రపతి’ శేఖర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్ఏ ఆర్మాన్, కెమెరా: భరత్ సి. కుమార్, సమర్పణ: రాజేశ్వరి తుమ్మల. -
సురేంద్రబాబుకా? అనురాధకా?
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ ఎంపికకు రేస్ ముందే మొదలైంది. డీజీపీ మాలకొండయ్య జూన్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉండటంతో తదుపరి డీజీపీ ఎవరనేదానిపై పోలీస్‌శాఖలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నండూరి సాంబశివరావుకు రెండేళ్లపాటు పొడిగింపు ఇస్తున్నట్లు గతేడాది చివరివరకూ హడావుడి చేసిన చంద్రబాబు సీనియారిటీ ప్రాతిపదికన మాలకొండయ్యకు డీజీపీ పగ్గాలు అప్పగించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి డీజీపీగా విధులు చేపట్టిన మాలకొండయ్య జూన్‌లో పదవి విరమణ చేయాల్సి ఉంది. ఆయనకు మరో రెండేళ్లు పొడిగింపు ఇవ్వాలని ఇప్పటి నుంచే చంద్రబాబుకు కొందరు సిఫార్సు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, ముక్కుసూటిగా వ్యవహరించే మాలకొండయ్యను ఎన్నికల సమయంలో కొనసాగిస్తే ఇబ్బంది పడతామని చంద్రబాబుకు మరో వర్గం నూరిపోస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్వీ సురేంద్రబాబును తెరమీదకు తెచ్చినట్టు చెబుతున్నారు. ఆక్టోపస్ (కౌంటర్ టెర్రరిజం ఫోర్స్)లో ఏడీజీగా ఉన్న సురేంద్రబాబుకు ఈ ఏడాది మార్చి 14న డీజీపీగా పదోన్నతి కల్పించారు. అంతేకాక, మార్చి 22న ఆర్టీసీ ఎండీ పగ్గాలు అప్పగించారు. ఇది.. మూడు నెలల తరువాత ఆయనను పోలీస్ బాస్ చేసేందుకేనన్న ప్రచారం ఆ శాఖలో విస్తృతంగా జరుగుతోంది. డీజీపీ ఎంపిక ఇక రాష్ట్రం ఇష్టం గతేడాది చివరలో డీజీపీ ఎంపిక కసరత్తు దశలోనే రాష్ట్ర ప్రభుత్వానికి తలబొప్పి కట్టిన సంగతి తెల్సిందే. చివరి నిమిషంలో పంపిన జాబితా నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ కేంద్ర హోంశాఖ పలుమార్లు తిప్పి పంపింది. దీంతో పంతానికిపోయిన చంద్రబాబు కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే డీజీపీని నియమించుకునేలా పోలీస్ చట్ట సవరణ చేశారు. ఇదిలా ఉంటే.. గత కొన్నేళ్లుగా ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తించిన వారే పోలీస్ బాస్‌గా బాధ్యతలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. దినేష్‌రెడ్డి, ప్రసాదరావు, సాంబశివరావు, మాలకొండయ్య ఆర్టీసీ ఎండీ నుంచి పోలీస్ బాస్‌గా బాధ్యతలు చేపట్టిన వారే. అదే ఆనవాయితీకి కొనసాగింపుగా ఎన్నికల సమయానికి సురేంద్రబాబుకు డీజీపీ పగ్గాలు అప్పగిస్తారా? అనేది ఐపీఎస్‌లలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒకవేళ సురేంద్రబాబుకు అవకాశం ఇవ్వకుంటే ఆయన భార్య, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధకు అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఏదీ ఏమైనా సురేంద్రబాబు, అనురాధ పేర్లు ఇప్పుడు డీజీపీ రేసులో ముందువరుసలో ఉన్నాయి. కానీ, మాలకొండయ్య తరువాత సీనియర్లుగా ఉన్న వీఎస్కే కౌముది, వినయ్‌రంజన్ రే, ఆర్పీ ఠాకూర్, గౌతమ్ సవాంగ్‌లు ఉన్నారు. కౌముది, వినయ్‌రంజన్ రేలు కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్‌పై ఉండగా.. ఏసీబీ డీజీగా ఠాకూర్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా సవాంగ్ రాష్ట్రంలో కొనసాగుతున్నారు. కాగా, సీనియారిటీ కింద డీజీపీ పోస్టుకు ఠాకూర్, సవాంగ్‌లలో ఒకరిని సీఎం ఎంపిక చేస్తారా? లేక ఆనవాయితీ కొనసాగిస్తారా? అనేది వేచి చూడాలి. -
చట్టాలపై పోలీసులు అవగాహన పెంచుకోవాలి
మహబూబ్‌నగర్ క్రైం: వివిధ కేసుల్లో నిందితులకు శిక్ష ఖరారు చేయడంలో తగినంత ఆధారాలు సేకరించేందుకు పోలీసు పరిశోధనాధికారులు కృషి చేయాలని ఎస్పీ బి.అనురాధ సూచించారు. జిల్లా పోలీసు కార్యాల యం లో శనివారం ఉదయం ‘చిట్‌ఫండ్ వ్యవహారాల్లో జరిగే మోసాలు–ప్రజలకు చేయాల్సిన న్యాయ సేవలు, ఇతర చట్టాలు’ అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సును ప్రారంభించిన ఎస్పీ అనురాధ మాట్లాడుతూ పోలీసు అధికారులు నూతన చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ సాక్షాల సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఏఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, డీఎస్పీలు భాస్కర్, శ్రీధర్, పీపీపీబాలగంగాధర్రెడ్డి, ఏపీపీ అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమానం వస్తే ప్రశ్నించండి
మహబూబ్‌నగర్ క్రైం: మీ ప్రాంతంలో కొత్తగా.. అనుమానితులుగా ఎవరైనా వ్యక్తులు గాని, మహిళలు కనిపిస్తే ఒక కాలనీ చెందిన వ్యక్తులుగా ముందు మీరే వాళ్లను ప్రశ్నించి పూర్తి వివరాలు సేకరించాలని.. పొంతన లేని సమాధానాలు చెబితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని మహబూబ్‌నగర్ ఎస్పీ అనురాధ స్థానిక ప్రజలకు సూచించారు. కార్డెన్ సెర్చ్‌లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భాగంగా గురువారం జిల్లాకేంద్రంలోని టీడీగట్టు, ఖలీల్చౌక్ ప్రాంతాల్లోని 300 ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించి ఆయా ఇంట్లో నివాసం ఉండే వ్యక్తుల వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా ఇళ్లను పరిశీలిస్తూ వారి ఇంట్లో ఎవరు ఉంటున్నారు.. వాళ్ల జీవన విధానం ఇతర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రధానంగా కాలనీలో ఉండే కిరాణం, పాన్ దుకాణాలను ఎస్పీ పరిశీలించి వాటిలో అమ్ముతున్న సరుకులను తనిఖీ చేశారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సాగిన తనిఖీల్లో 14 ద్విచక్రవాహనాలను, 7 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకుని.. 8 మంది అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భం గా అనుమానిత వ్యక్తుల వేలిముద్రలను పోలీసులు సేకరించారు. తనిఖీల్లో అద నపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్, ఐదు మంది సీఐలు, 10 మంది ఎస్‌ఐలతోపాటు 200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ ప్రతి వారానికి ఒకసారి పట్టణంలో ఒ క కాలనీలో తనిఖీలు చేపడుతామన్నారు. -
స్వాతంత్య్రమే.. సాధికారత
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘రోజులు మారాయి. ఈ రోజుల్లో అమ్మాయిలు సాధించలేనిదంటూ ఏమీ లేదు. కాస్త ప్రోత్సహిస్తే చాలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. అసాధ్యమనుకున్న వాటిని సాధ్యం చేసి చూపిస్తున్నారు. అయితే పురుషాధిక్య సమాజంలో ఇప్పటికీ మహిళల పట్ల ఎక్కడో ఒక చోట.. ఏదో ఒక రకంగా వివక్ష ఉంటోంది. అందుకే మహిళలు తమ కాళ్లపై తాము నిలబడగలగాలి. ఎవరిపై ఆధారపడకుండా ఆర్థికంగా ఎదిగినప్పుడే సాధికారత దిశగా అడుగులు పడతాయి’ అని అంటున్నారు జిల్లా పోలీస్‌బాస్ డాక్టర్ బి.అనురాధ. ఉద్యోగ, వ్యక్తిగత జీవితంలో తన అనుభవాలు, సమాజంలో అమ్మాయిల పట్ల చోటు చేసుకుంటున్న వివక్షతో పాటు మహిళా సాధికారతపై ఎస్పీ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలు చెప్పుకొచ్చారు. ఆ వివరాలు ఎస్పీ మాటల్లోనే... అందుకే వారికి సెల్యూట్ చేస్తా.. నేను ఒక ఆడపిల్లగా పుట్టినా కొన్ని విషయాల్లో చాలా లక్కీ అనే చెప్పాలి. కొన్ని కుటుంబాల్లో అమ్మాయిలకు సరైన చదువులు చెప్పించకుండా ఇంటి వద్దే ఉంచడం... తొందరగా పెళ్లిళ్లు చేసి తల్లిదండ్రులు చేతులు దులుపుకోవడం చిన్నప్పుడే చేశాను. కానీ నా విషయంలో అలా జరగలేదు. అందుకే పదే పదే చెబుతుంటా.. మా అమ్మనాన్న కమల, జగన్‌మోహన్‌రెడ్డిలే నాకు స్పూర్తి ప్రదాతలని. ఎందుకంటే అమ్మాయిలుగా ఇసుమంత వివక్ష చూపకుండా సమానంగా చూశారు. మేం మొత్తం నలుగురు సంతానం. నాకు అన్న, తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. అందరినీ కూడా క్రమశిక్షణతో పెంచారు. మా అమ్మనాన్నలు విద్యావంతులు కావడంతో అందరికీ ఉన్నత విద్య చెప్పించడంతో పాటు సమాన అవకాశాలు కల్పించారు. ఇప్పుడు అన్నయ్య యూకేలో డాక్టర్, తమ్ముడు ఇంజనీర్‌గా, చెల్లెలు ఢిల్లీలోని జేఎన్‌యూ నుంచి ఎల్ఎల్ఎంలో బంగారు పతకం సాధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో లీగల్ అడ్వైజర్‌గా పని చేస్తోంది. ఇక నేను ఈ రోజు జిల్లా పోలీసు బాస్‌గా నిలబడగలిగానంటే అందుకు కారణం మా తల్లిదండ్రులే. అందుకే వారికి సెల్యూట్ చేస్తా. పెళ్లి తర్వాత భర్త శ్రావణ్‌కుమార్‌రెడ్డి కూడా ఫుల్ సపోర్ట్‌గా నిలుస్తున్నారు. నిత్యం తీవ్ర ఒత్తిడితో కూడుకున్న పోలీసు జాబ్‌ను కుటుంబ సభ్యుల సహకారంతో సులువుగా నెగ్గుకొస్తున్నా. సర్వీస్‌లో చాలా చూస్తున్నా.. సర్వీస్‌లో భాగంగా ఆడవారిపై జరిగే వివక్షను చూస్తున్నా. ప్రస్తుతమంటే కాలం మారింది కానీ... గతంలో అమ్మాయిలపై ఒక రకమైన వివక్ష ఉండేది. అబ్బాయిలను ఒక రకంగా... అమ్మాయిలను ఒక విధంగా చూడటంతో పాటు అవకాశాల విషయంలో కూడా వివక్ష చూపేవారు. ఇప్పటికీ కొందరు అబ్బాయిలను గుర్తింపు పొందిన మంచి స్కూళ్లలో, అమ్మాయిలను మామూలు స్కూళ్లలలో చదివిస్తున్నారు. చిన్నప్పటి నుంచి చోటు చేసుకుంటున్న ఇలాంటి వాటి వల్ల సమాజంలో ఒక రకమైన భావన ఏర్పడుతోంది. అందుకే ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే కుటుంబ వ్యవస్థలో మార్పురావాలి. అప్పుడే కాస్తయినా అమ్మాయిల విషయంలో వివక్ష తగ్గుతుంది. అప్పుడే పెళ్లంటే ఏం తెలుస్తుంది? ఇప్పటికీ మన గ్రామీణ వ్యవస్థలో అమ్మాయిలను భారంగా భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసి పంపించాలనే ఆలోచనలోనే ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. ఎందుకంటే 18 ఏళ్లకే పెళ్లి చేస్తే వారికి ఏం తెలుస్తుంది? అప్పుడప్పుడే సమాజం, మనుషులను అర్థం చేసుకునే వయస్సు. అలాంటప్పుడు పెళ్లి చేస్తే జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? సమాజం పట్ల కనీస అవగాహన అవసరం. అమ్మాయిలు కూడా ధైర్యంతో అడుగు ముందుకు వేయాలి. పోరాట పటిమ అలవరుచుకోవాలి. ముఖ్యంగా ఆర్థికంగా నిలబడగలిగే శక్తి రావాలి. అలాగైతేనే జీవితంలో నిలదొక్కుకోగలుగుతారు. చట్టం గురించి తెలియకే అలా.. చాలా మంది అమ్మాయిలకు చట్టం గురించి తెలియడం లేదు. టీనేజ్‌లో ఆకర్షణకు లోనై ప్రేమ పేరుతో చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కనీస వయస్సు రాకుండానే జరుగుతున్న పెళ్లిళ్లు చాలా ఉన్నాయి. తెలిసీ తెలియని వయస్సులో పెళ్లి చేసుకోవడం.. తర్వాతి క్రమంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. మా వద్దకు వచ్చే చాలా కేసులు ఇలానే ఉంటాయి. ఇలాంటి కేసులను సున్నితంగా డీల్ చేస్తాం. సాధ్యమైనంత వరకు కౌన్సిలింగ్ ఇచ్చి దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఇటీవలి కాలంలో మా పోలీసు శాఖ తరఫున ఏయే చట్టాలు ఏవిధంగా ఉపయోగపడుతాయనే అంశంపై స్కూళ్లు, కాలేజీల్లో సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. కళాజాత బృందాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నాం. తాట తీస్తా... అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా.. మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా వ్యవహరించిన సహించేది లేదు. చట్టప్రకారం వారి తాట తీస్తాం. ప్రస్తుతం మా షీ టీమ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి. కాలేజీలతో పాటు పబ్లిక్ ప్లేస్‌ల వద్ద మా సభ్యులు మఫ్టీలో ఉండి పర్యవేక్షిస్తుంటారు. ఎవరైన తిక్కతిక్క నక్రాలు చేస్తే ఆధారాలు సేకరించి స్టేషన్‌కు పట్టుకొస్తున్నారు. తర్వాత తల్లిదండ్రులను పిలిచి వారి సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. అయినా రెండో సారి పట్టుబడితే మా ట్రీట్మెంట్ చూపిస్తాం. అంతేకాదు మహిళా ఉద్యోగుల పట్ల కూడా సహచర ఉద్యోగులు అనుచితంగా ప్రవర్తిస్తున్న సందర్భా లు కూడా చోటు చేసుకుంటున్నాయి. వారిపై నేరుగా ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నాం. ఆ ఫీలింగ్ ఇప్పటికీ ఉంది.. ఉద్యోగ బాధ్యతల నేపథ్యంలో కుటుంబానికి సమయం కేటాయించలేక పోతున్నాననే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది. నేను చేస్తున్నది పోలీస్ జాబ్. ఈ వృత్తిలో రాత్రి, పగలు తేడా ఉండదు. ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. పిల్లలు చిన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించేది. కానీ నేను ఎంతో ఇష్టంగా సాధించుకున్న పోలీసు జాబ్‌కు న్యాయం చేయాల నే భావనలో మనస్సు లోకి వచ్చేది. నా పరిస్థితిని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు. ప్రస్తుతం పిల్లలు సుజీత్‌రెడ్డి, ధరణిరెడ్డి ఇద్దరూ మెడిసిన్ చదువుతున్నారు. అయితే కొన్ని సందర్భా ల్లో ఇబ్బందికరంగా ఫీలయ్యే దాన్ని. చాలా దగ్గరి బంధువుల ఫంక్షన్లకు కూ డా హాజరయ్యే పరిస్థితి ఉండేది కాదు. అందుకే బంధువులు.. ఏ ఫంక్షన్‌కు హాజరు కావు.. అని పదేపదే అంటుంటా రు. కానీ నా వృత్తి ద్వారా పది మందికి న్యాయం జరుగుతుండటంతో అవన్నీ మర్చిపోతుంటా. -
హెల్మెట్‌తో ప్రాణాలకు రక్షణ
మహబూబ్‌నగర్ క్రైం: ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలు జరిగినా ప్రాణాలకు ముప్పు ఉండదని ఎస్పీ బి.అనురాధ అన్నారు. హెల్మెట్ ధరించకుండా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడమే 80శాతం ప్రమాదాలకు కారణమని ఆమె పేర్కొన్నారు. పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యాన సోమవారం నిర్వహించిన హెల్మెట్ అవగాహన ర్యాలీని ఎస్పీ కార్యాలయంలో ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడడం కంటే ప్రమాద కారణాలను విశ్లేషించుకుని జాగ్రత్త పడితే ఎన్నో కుటుంబాలను కాపాడొచ్చని తెలిపారు. పోలీసులందరూ తప్పక హెల్మెట్ ధరించాలని.. తద్వారా ఇతర వాహనదారులు స్ఫూర్తి పొందుతారని చెప్పారు. కాగా, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అదుపు చేయడానికి పోలీస్ శాఖ తరఫున నిరంతరం కృషి చేస్తున్నామని వెల్లడించారు. అయితే, అవగాహన కార్యక్రమాల ద్వారా ఆశించిన మార్పు రావడం లేదని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలపై బయటకు వెళ్లే వారు హెల్మెట్ ధరించేలా భార్యాపిల్లలు, కుటుంబీకులు గుర్తు చేయాలని కోరారు. కాగా, ర్యాలీ ఎస్పీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్, క్లాక్‌టవర్, అశోక్ టాకీస్, వన్‌టౌన్ వరకు సాగింది. డీఎస్పీ భాస్కర్, సీఐలు సీతయ్య, అమరేందర్నాథ్రెడ్డి, వీరేష్, దిలీప్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
దుర్గ గుడి ఈవోగా అనురాధ
-
జీన్యస్!
జన్మపత్రిక.. మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టి మన రాశి, దశ, గ్రహచారాలను చెప్తుంది! జినోమ్‌పత్రి.. మన నోట్లోని సలైవాలోని డీఎన్ఏను బట్టి మన ఆరోగ్యదశను వెల్లడిస్తుంది! ఇది మ్యాప్ మైజీనోమ్ సృష్టి! ఓసిమమ్ బయోసొల్యూషన్స్ అండ్ మ్యాప్ మైజీనోమ్.. ఈ రెండూ స్త్రీ శక్తికి నిదర్శనాలు! ఆమె పేరే అనురాధా ఆచార్య. ఇప్పుడెందుకు ఈ పరిచయం? అంటే.. రేపు 28న హైదరాబాద్‌లో జరగబోయే గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్‌లో స్పీకర్.. మోడరేటర్‌గా వ్యవహరించబోతున్నారు! అనురాధా ఆచార్య రాజస్థాన్‌లోని బికనీర్‌లో పుట్టారు. తండ్రి ..హెచ్. ఎన్. ఆచార్య సైంటిస్ట్. తల్లి సరళ గృహిణే అయినా పిల్లల మీద చాలా ప్రభావం చూపారు. తల్లి చదువుకుంది ఆరో తరగతే. తొమ్మిదేళ్లకే పెళ్లి. పై చదువులకు అవకాశం లేకపోయినా.. విజ్ఞానాన్ని పంచే పుస్తకాలు ఎన్నో చదివింది. లెక్కల్లో చాలా చురుకు. ఎంతటి క్లిష్టమైన సమస్యనిచ్చినా నిమిషాల్లో సాల్వ్ చేసేస్తుంది. ఇక తండ్రి అయితే.. చెప్పలేనంత స్ఫూర్తినిచ్చారు అనూరాధకు. సైంటిస్ట్ అవడం వల్లో.. కొత్తవిషయం పట్ల జిజ్ఞాస ఉండడం వల్లో ఏమో కాని.. ఇంట్లో ఉన్నప్పుడు ఒక్క నిముషం కూడా ఖాళీగా ఉండేవారు కాదట. ఎప్పుడూ ఏవేవో వస్తువులను తయారు చేస్తూ.. కొత్తవాటిని కనుక్కుంటూ కాలాన్ని లక్ష్యపెట్టేవాడేకాదట. బహుశా అనూరాధకు తండ్రి నుంచి జిజ్ఞాస, తల్లి నుంచి ఆ చురుకుదనం జీన్స్ అంది ఉంటాయి. అందుకే ఓసిమమ్ బయోసొల్యూషన్స్ పుట్టి ఉంటుంది. జీనోమ్‌పత్రి రాయాలనే ఆలోచనా వచ్చి ఉంటుంది. ‘‘మా పేరెంట్స్ ఎప్పుడూ చదువు చదువు అని మా మీద ఒత్తిడి పెట్టలేదు. నాన్న ఎప్పుడూ ఒకటే చెప్పేవారు– ‘ఆర్థికంగా ఎవరిమీదా ఆధారపడకూడదు. శక్తినే నమ్ముకోవాలి. పని ఏదైనా సరే ప్రేమతో చేయాలి. కమిటెడ్‌గా ఉండాలి’ అని. అదే మాలో నాటుకుపోయింది. ఒకరకంగా మా భవిష్యత్‌కు అదే దారైందనుకోవచ్చు. ఆ మాటను మాలోనే కాదు మా అమ్మలో కూడా బలంగా నాటారు నాన్న. ఇప్పుడు ఆయన తోడు లేరు అమ్మకు. అయినా ఆమె బికనీర్‌లో ఒంటరిగా ఉంటోంది తప్ప మా దగ్గరకు రాదు’’ అంటూ నాన్న స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు అనూరాధ. సైన్స్ ... బిజినెస్ ఖరగ్‌పూర్ ఐఐటీ అనూరాధ జీవితంలో ముఖ్యమైంది. దాదాపు ఆమె చదువంతా అక్కడే. అక్కడే ఏంబీఏ చేయాలనుకున్నారు. కాని అమెరికా వెళ్లారు ఫిజిక్స్‌లో పీహెచ్డీ చేయడానికి. షికాగో యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ చేశారు. స్టార్టప్ కూడా అక్కడే స్టార్ట్ చేశారు. చిన్నప్పుడు వాళ్ల నాన్న చేసే ఇన్వెన్షన్స్లోనూ అనూరాధ పాలుపంచుకునేవారు. ఉత్సాహంతో తానూ కొన్ని వస్తువులను తయారు చేసేవారు. తర్వాత నాన్న అనుమతితో సేల్ చేసేవారట. తయారు చేయడంలో కన్నా కూడా అలా సేల్ చేసి, డబ్బు చేతికందినప్పుడు భలే ఆనందం అనిపించేదట. ‘‘బహుశా బిజినెస్ స్పిరిట్ అప్పుడే మొగ్గతొడిగిందేమో. అమెరికా వెళ్లాక అది దృఢపడింది. సైన్స్ కన్నా కూడా ఆ రంగానికి సంబంధించిన వ్యాపారంలోనే నాకు ఆసక్తి. అందులోనే నైపుణ్యం ఉందని అర్థమైంది అక్కడే’’ అంటారు అనూరాధా. ఈలోపే పెళ్లి, తర్వాత పాప పుట్టడంతో హైదరాబాద్ వచ్చేశారు. హైదరాబాద్‌లో బిజినెస్ స్టార్ట్ చేయాలని అంతకుముందే అనూరాధా, ఆమె భర్త (సుభాష్ లింగారెడ్డి)కు ఉండడంతో ఇక్కడకు వచ్చేశారు. అలా ఓసిమమ్ బయోసొల్యూషన్స్, మ్యాప్‌మైజీనోమ్‌కు మ్యాప్ వేశారు అనూరాధ! మహిళలే స్ట్రాంగ్... అయినా... బయాలజీలో మొదటి నుంచీ మహిళలే స్ట్రాంగ్. అయితే అందులో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మహిళల సంఖ్య అంతగా లేదు. ‘బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆత్మవిశ్వాసం కావాలి. మగవాళ్లకు ఈజీ. ఎందుకంటే వాళ్లకు సపోర్ట్సిస్టమ్ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లే యాక్సెస్ ఉంటుంది. ఈ విషయంలో స్త్రీలు ఎక్కువ కష్టపడాలి. చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి మనం. స్ట్రాంగ్‌గా లేకపోతే చేయలేకపోతాం. నెట్‌వర్క్‌కు యాక్సెస్ కావాలి. కాపిటల్కు యాక్సెస్ కావాలి. సరైన సలహాదారులు అవసరం. ఇక్కడే విమెన్‌కు చాలెంజెస్ ఉంటాయి. ఈ చాలెంజెస్‌ను అధిగమించగలిగితే చాలు. ఇవన్నీ మగవాళ్లకు ఉండవని కాదు. కాని వాళ్లకు ఉండే సపోర్ట్సిస్టమ్ వీటిని ఈజీ చేస్తుంది. దాదాపు 65 దేశాల్లో మాకు మార్కెట్ ఉంది. ఈ అనుభవంతో చూసినా విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు మన దగ్గరే చాలా అవకాశాలున్నాయి. అలాగని డిస్క్రిమినేషన్ లేదని అనను. అభివృద్ధి చెందుతున్న దేశం. ఉంటుంది. అలాగని భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లొచ్చు. సవాళ్లను ఎదుర్కొని నిలబడ గలగాలి’’ అంటారు అమె. విమెన్ ఫస్ట్.. ప్రాస్పరిటీ ఫర్ ఆల్.. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. చదువుకు ఇల్లాలు ఎంటర్ప్రెన్యూర్ అయితే దేశానికే కలిమి. అందుకే మహిళలకు ప్రథమ స్థానం ఇవ్వాలి. హైదరాబాద్‌లో జరగబోయే గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్ నినాదం కూడా ఇదే. ‘విమెన్ ఫస్ట్.. ప్రాస్పరిటీ ఫర్ ఆల్’! ఈ జీఈఎస్ ఎనిమిదోది. ఇప్పటివరకే ఏ సమ్మిట్‌కు రానంతమంది మహిళలు దీనికి హాజరవుతున్నారు. అందులో మనవాళ్లూ చాలామందే ఉన్నారు. ఈ లెక్కన ఈ సమావేశం మన మహిళలకు ఎంతో ప్రేరణను.. మరెంతో స్ఫూర్తిని.. ఇంకెన్నో వ్యాపార అవకాశాలను ఇవ్వనుందా అని అడిగితే ‘‘తప్పకుండా! ఈ సమ్మిట్‌లో చాలామంది స్పీకర్స్ మహిళలే. ఎన్నో విషయాలు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా సమ్మిట్స్‌లో ఒక్క మహిళా ఎంట్రప్రెన్యూర్ నూ చూడం. కాని ఇక్కడ సమాన ప్రాతినిధ్యం ఉంది. ఇదే మనకు చాలా హెల్ప్ కానుంది. లైఫ్ సైన్సెస్, హెల్త్ మీదే ఈ సమ్మిట్‌లో ప్రధాన ఫోకస్. కాబట్టి... ఈ అంశాలకు నేచురల్ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లో ఈ సమ్మిట్ నిర్వహించడం వల్ల చాలా ఉపయోగం’’ అన్నారు. ‘‘సైన్స్‌ను ల్యాబ్ నుంచి బిజినెస్‌కు ఎలా తీసుకెళ్లొచ్చు. రియల్ బిజినెస్‌గా ఎలా మార్చవచ్చు అనే అంశం మీద నేను మాట్లాడబోతున్నా. ఆ సెషన్‌కు మోడరేటర్గానూ ఉండబోతున్నా’’నని చెప్పారు అనూరాధ. ‘‘మా కంపెనీలో 80 శాతం మహిళలే. దాన్ని నూరు శాతం విమెన్ పవర్‌గా చేయాలి. మా నాన్న మా భవిష్యత్ ఇలాగే ఉండాలని నిర్దేశించలేదు. ‘నీ నిర్ణయాలు నీవే’ అనేవారు. నేనూ అంతే. నాకు ఇద్దరు అమ్మాయిలు. వాళ్ల భవిష్యత్ గురించి నాకు ఎలాంటి యాంబిషన్స్ లేవు. నేనూ వాళ్లను ఒత్తిడి చేయను. నాన్న నాకిచ్చిన స్వేచ్ఛను నేనూ పిల్లలకు ఇస్తున్నాను. ఈ జనరేషన్ అమ్మాయిలక్కూడా నేనొకటే చెప్తాను. ఇష్టంలేని పని చేయొద్దు. ఇష్టమైన పని మీద మనసు పెట్టాలి. స్ట్రాంగ్‌గా ఉండాలి. డోంట్ లూజ్ ప్యాషన్ ఆన్ వర్క్!’’ అంటారు అనూరాధా ఆచార్య. ఓసిమమ్, మ్యాప్ మై జీనోమ్ ఇన్వెన్షన్స్ జీనోమ్‌పత్రి.. టూత్‌బ్రష్ లాంటి పరికరం ఇది. చివుళ్ల మీద రబ్ చేసి దానికి అంటిన సలైవాలోని డీఎన్ఏతో మనకు ఏయే జబ్బులు రావచ్చో, వేటి రిస్క్ ఎక్కువో చెప్పే పరికరం. అలాగే ఇంకో పరికరాన్నీ ఉత్పత్తి చేస్తోందీ సంస్థ. అది క్షయను కనిపెట్టే సాధనం. బేబీ మ్యాప్ – అప్పుడే పుట్టిన పిల్లల డీఎన్ఏను సమీక్షించి భవిష్యత్‌లో రాబోయే 150 రకాల జబ్బులను ముందుగానే నిర్ధారించే పరీక్ష. దీనివల్ల సాధారణ చికిత్సతో జబ్బులు నయం చేసే అవకాశాలు ఉంటాయి. – సరస్వతి రమ -
మా వాళ్లెలా మాట్లాడారు?
ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అన్యాయం, అక్రమాలు లేదా దొంగతనాలు జరిగితే చెప్పుకుందామని ఎంతో ఆవేదనతో పోలీసుస్టేషన్లకు వస్తారు. అలాంటి వారు ఇబ్బంది పడకుండా చూడడంతో పాటు వారికి సాంత్వన చేకూరేలా నూతన విధానాన్ని అమలు చేస్తున్నాం. ఈ విధానంతో హెడ్ క్వార్టర్స్ నుంచి నేరుగా ఫిర్యాదుదారులతో మాట్లాడుతుండడంతో ఎక్కడైనా పోలీసుస్టేషన్లలో లోటుపాట్లు ఉంటే తెలుస్తోంది. ఈ విషయాన్ని సిబ్బందికి చెబుతూ అప్రమత్తం చేస్తున్నాం. తద్వారా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదుదారులకు న్యాయం జరుగుతుందని చెప్పొచ్చు. – బి.అనురాధ, ఎస్పీ మహబూబ్‌నగర్ క్రైం: పోలీసుస్టేషన్ పేరు వింటేనే గుండెల్లో దడ.. పోలీసు యూనిఫాంలో ఉన్న వారిని చూడగానే కాళ్లలో వణుకు.. తప్పనిసరైతే, ఇంకేం చేయలేని పరిస్థితుల్లో మాత్రమే సాధారణ పౌరులు పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతారు. పోలీసుల్లో కొందరు సిబ్బంది వ్యవహార శైలి, మాట తీరుతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో గుండెలు చేతపట్టుకుని లోపలకు వెళ్లి.. ఫిర్యాదు ఇచ్చేసి బయటపడడమే! కానీ ఆ ఫిర్యాదు ఎంత వరకు వచ్చింది, విచారణ జరుగుతోందా, లేదా అనే వివరాలు ఆరా తీయాలంటే మళ్లీ పెద్ద తతంగం. అయితే, కొంతకాలంగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. దీనిని మరింత మెరుగపరిచేందుకు మహబూబ్‌నగర్ ఎస్పీగా కొన్నినెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన అనురాధ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫిర్యాదుతో పాటు ఫోన్ నంబర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లే ప్రతీ ఫిర్యాదుదారుడి నుంచి అక్కడి సిబ్బంది ఫోన్ నంబర్ సేకరిస్తున్నారు. ఆ తర్వాత కేసు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగానే ఎస్పీ కార్యాలయానికి వివరాలు వెళ్తున్నాయి. అక్కడి సిబ్బంది ఫిర్యాదుదారుడికి ఫోన్ చేసి వివరాలు ఆరా తీస్తున్నారు. ‘మీరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సమయంలో సిబ్బంది ఎలా ప్రవర్తించారు.. మీ ఫిర్యాదు పట్ల బాగా స్పందించారా.. స్టేషన్‌కు ఎప్పు డు వెళ్తే ఎంత సేపటి తర్వాత మాట్లాడారు.. సిబ్బంది మాట్లాడారా లేకుంటే ఎస్ఐ లేదా సీఐ మాట్లాడారా.. ఎవరైనా సిబ్బంది డబ్బు అడిగారా’ అంటూ వివరాలు సేకరిస్తున్నారు. ఇలా ఎస్పీ కార్యాలయం నుంచి నేరుగా ఫిర్యాదుదారులకు ఫోన్లు వస్తుండడంతో చాలా వరకు పీఎస్‌ల్లో పనితీరు మెరుగవుతుందని చెబుతున్నారు. ఇక ఎస్పీ అనురాధ బాధ్యతలు స్వీకరించాక రెండో రోజునే ఫిర్యాదుదారులతో మాట్లాడానికి ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. అక్కడి సిబ్బంది ఫిర్యాదుదారులకు ఫోన్ చేసి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. తక్షణం స్పందన ఠాణాలకు వచ్చే వారి విలువైన సమయాన్ని కాపాడేందుకు ఎస్పీ ప్రారంభించిన కార్యక్రమం ఉపయోగపడుతోంది. ఫిర్యాదుదారు వచ్చే సరికి సంబంధిత అధికారి లేకపోవడం, ఇన్స్పెక్టర్కు విషయం చెబుతామనుకుంటే.. ఇంకా రాలేదన్న సమాధానమే ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు. ఎస్సైలు, కానిస్టేబుళ్లు పోలీస్ స్టేషన్‌కు వచ్చి, వెళ్లడం.. బాధితుల ఫిర్యాదులు స్వీకరించే పరిస్థితి లేకపోవడం కనిపించేది. దీంతో ఫిర్యాదుదారులు గంటల తరబడి వేచి ఉండేవారు. ప్రస్తుత విధానంతో ఎవరైనా సమస్య చెప్పుకొనేందుకు వస్తే.. ఇన్స్పెక్టర్ నుంచి కానిస్టేబుల్ వరకు ఎవరో ఒకరు వెంటనే మాట్లాడి ఫిర్యాదు స్వీకరిస్తున్నారు. -
రణరంగంగా ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రి
-
రణరంగంగా ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రి
హైదరాబాద్ : ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ఆస్పత్రి గురువారం రణరంగంగా మారింది. అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారంటూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదంటూ అవుట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగిని అనురాధ నిన్న మూసాపేటలోని తన నివాసంలో ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిపై సీఐటీయూ నేతలు ఇవాళ అవుట్ సోర్సింగ్ సిబ్బందితో కలిసి ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిరసన తెలుపుతున్న సీఐటీయూ నాయకుడు ఈశ్వర్రావును అదుపులోకి తీసుకోవడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేపట్టడంతో ఆస్పత్రి పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ మాట్లాడుతూ... సిబ్బందికి జీతాల చెల్లింపులో కొంత జాప్యం జరుగుతున్న విషయం వాస్తవమే అన్నారు. ప్రభుత్వం నుంచి బిల్స్ రావడంలో ఆలస్యం కారణంగా వేతనాలు చెల్లింపులో ఆలస్యం జరిగిందన్నారు. -
గుంటూరు కమిషనర్‌గా అనురాధ
♦ ఉన్నతాధికారుల ఉత్తర్వులు ♦ రెండు నెలలుగా ఇన్చార్జిగా కొనసాగుతున్న వైనం ♦ ఎట్టకేలకు పూర్తిస్థాయిలో నియామకం సాక్షి, గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్‌గా మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ సి.అనురాధను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.కరికాల వలవన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు కమిషనర్‌గా పనిచేసిన నాగలక్ష్మి ఈ ఏడాది మే నాలుగో తేదీన ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో గుంటూరు ఆర్డీ అనురాధకు ఫుల్ అడిషనల్ చార్జి ఇచ్చి ఇన్చార్జి కమిషనర్‌గా నియమించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిని నియమిస్తారనే వాదనలు వినిపించినప్పటికీ తాజాగా అనురాధను కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పుకార్లకు తెర పడింది. అనురాధకు 2015లో ఐదు నెలలపాటు గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన అనుభవంతో పాటు, మూడేళ్లుగా ఆర్డీగా పనిచేస్తుండటంతో నగరపాలక సంస్థపై పూర్తి అవగాహన ఉంది. నగరాభివృద్ధికి కృషి చేస్తా... అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో గుంటూరు నగరాభివృద్ధికి కృషి చేస్తానని అనురాధ చెప్పారు. తనపై నమ్మకంతో కమిషనర్‌గా నియమించిన ఉన్నతాధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నగర ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. మున్సిపల్ ఇన్చార్జి ఆర్డీగా రమణి గుంటూరు మున్సిపల్ ఆర్డీగా పనిచేస్తున్న చల్లా అనురాధను కమిషనర్‌గా నియమించడంతో ఏపీఎండీపీ ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఏవీ రమణికి ఇన్చార్జి ఆర్డీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్న డి.మేరీగోల్డ్ డైమండ్‌ను గుంటూరు మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమించారు. -
వివాహిత ఆత్మ‘హత్య’
- ఉసురు తీసిన అదనపు కట్నం వేధింపులు - పెళ్లైన మూడేళ్లకే ముగిసిన జీవితం ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మరణించింది. ఆత్మహత్య చేసుకుందని మెట్టినింటి వారు అంటుండగా, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పుట్టింటి వారు ఆరోపించారు. ఏదేమైనా కట్నం వేధింపులు ఓ నిండు ప్రాణాన్ని మాత్రం బలిగొన్నాయి. - తాడిపత్రి రూరల్ తాడిపత్రి గన్నెవారిపల్లె కాలనీలో రాజు భార్య అనూరాధ(25) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పెళ్లై పట్టుమని మూడేళ్లు కూడా కాలేదని, అప్పుడే భర్త సహా అత్తమామలు కలసి అదనపు కట్నం కోసం వేధించడంతో మనస్తాపం చెందిన ఆమె ఉరేసుకుని ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు... అప్పు తీర్చడం కోసం అదనపు కట్న వేధింపులు రాజు, అతని తండ్రి వెంకటేసులు కలసి ఇటుకల తయారీ ఫ్యాక్టరీ పెట్టారు. అందుకు రూ.10 లక్షల అప్పు చేశారు. ఆ అప్పును రాజు తండ్రి నడిపి సుబ్బరాయుడు చెల్లించాడు. అప్పటి నుంచి ఆ డబ్బు మీ పుట్టింటి నుంచి తెచ్చివ్వాలంటూ సుబ్బరాయుడు కోడలిపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు భర్త రాజు కూడా వంతపాడాడు. ఇద్దరూ కలసి నిత్యం అనూరాధను కాల్చుకుతినేవారు. వారి వేధింపులు శృతిమించడంతో ఇక తట్టుకోలేకోయిన ఆమె జీవితంపై విరక్తితో ఉరేసుకుంది. ముమ్మాటికీ హత్యే తమ బిడ్డను అదనపు కట్నం కోసం అల్లుడితో పాటు అత్తమామలు వేధిస్తున్న మాట వాస్తవమేనని అనూరాధ తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. కచ్చితంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బల్దియాలో ఏడీఎంఏ ఆకస్మిక తనిఖీ
♦ అక్రమ లీజు ల్యాండ్‌లపై రికార్డుల పరిశీలన ♦ మీడియాను అనుమతించని..వివరాలు వెల్లడించని అధికారులు ♦బల్దియా అక్రమాలపై ఉన్నతాధికారుల నిఘా ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్ బల్దియాలో ఏడీఎంఏ(అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్టేషన్, హైదరాబాద్) అధికారి అనురాధ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లీజు స్థలాలు, ప్రస్తుతం ఉన్న స్థలాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమె తనిఖీకి వచ్చినట్లు సమాచారం. లీజు ల్యాండ్ల రికార్డుల జిరాక్స్ కాపీలు, ఫైళ్లను తీసుకెళ్లారు. బల్దియాలో రెండున్నరేళ్లుగా జరుగుతున్న అక్రమాల విషయంలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల కౌసల్య, విఠల్‌రావు షిండే స్థలంపై కోర్టు మున్సిపల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బల్దియా అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోగా పరిశీలించేందుకు వెళ్లినట్లు సమాచారం. బల్దియాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా లీజు భూమి వివాదాలు పెరుగుతున్నాయి. పట్టణంలో ఉన్న ఆక్రమణల తొలగింపు సైతం అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని మాత్రమే ఆక్రమణలు తొలగించి మిగతా కట్టడాలను అలాగే ఉంచిన విషయాన్ని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. మీడియాను ఏడీఎంఏ అనురాధతో ట్లాడేందుకు అనుమతించలేదు. ఉదయం 11 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. మీడియా ప్రశ్నించినప్పటికీ అమె సమాధానం చెప్పలేదు. మళ్లీ మాట్లాడతానని చెప్పి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. కాగా, మీడియాను అనుమతించక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తంమవుతున్నాయి. ఇటీవల కాలంగా నేతల కన్ను లీజుల్యాండ్, ప్రభుత్వ స్థలాలపై పడినట్లుగా ఆరోపణలున్నాయి. టీపీవో, రెవెన్యూ, ఇంజినీరింగ్ సెక్షన్ అధికారులనువిచారించారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ అలువేలు మంగతాయారు, మున్సిపల్ ఎంఈ నాగమల్లేశ్వర్రావు, ఏసీపీ నాగేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. -
పన్నులు వసూలు చేయాలి
గుంటూరు ప్రాంతీయ సంచాలకులు సి.అనూరాధ కావలిఅర్బన్ : మున్సిపల్ పరిధిలోని పన్నులను 100 శాతం వసూలు చేయాలని గుంటూరు ప్రాంతీయ సంచాలకులు సి.అనురాధ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కావలి పట్టణంలోని 4, 5, 33, 34వ వార్డులతో పాటు పట్టణ ప్రధాన వీధుల్లో పారిశుద్ధ్యాన్ని ఆమె మంగళవారం పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె 14, 13వ ఆర్థిక సంఘం, ఎస్సీ సబ్‌ప్లాన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ తదితర అంశాలపై చర్చించారు. ఈ నిధుల ద్వారా చేపట్టబడిన పనులను ఇంజనీరింగ్ శాఖ ద్వారా తెలుసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను ముఖ్యమంత్రి డ్యాష్ బోర్డులో పొందుపరిచి ఎప్పటికప్పుడు సరిచూసి చర్యలు చేపట్టాన్నారు. పనులకు సంబంధించిన చెల్లింపులు ఆన్లైన్ ద్వారానే చెల్లించాలన్నారు. పన్నుల వసూళ్లపై రెవెన్యూ విభాగాన్ని సమీక్షించి అన్ని రకాల పన్నులను ఏడాదిలోగా వసూలు చేయాలన్నారు. జనన, మరణ నివేదికలు, ఆస్తి పన్ను పేరు మార్పు బదిలీ, కొళాయిల మంజూరు వంటి లావాదేవీలు ఆన్లైన్ ద్వారానే జరపాలన్నారు. కంప్యూటర్ ఆపరేటింగ్ రాని గుమస్తాలు వెంటనే నేర్చుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎ.వెంకటేశ్వర్లు, డీఈ మదర్ అలీ, మేనేజర్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఈవ్‌టీజింగ్‌పై అప్రమత్తంగా ఉండాలి
షీ టీం జిల్లా ఇన్చార్జి అనురాధ నకిరేకల్ : ఈవ్‌టీజింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని షీటీం జిల్లా ఇన్చార్జి, నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అనురాధ సూచించారు. నకిరేకల్‌లోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో ఆదివారం జరిగిన షీటీం అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బాలికలు మనోధైర్యంతో ఉండాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలి గినా షీ టీం దృష్టికి తీసుకురావాలని సూ చించారు. ఫిర్యాదు చేయడానికి వాట్సప్ సెల్న నంబర్ 9963393970, ఫోనరుుతే 100కు డయల్ చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సీఐ సుబ్బిరామిరెడ్డి, ఎస్ఐ నర్సింహరావు, బాలికల కళాశాల వసతి గృహం అధికారి భాగ్యలక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రూ.145 కోట్ల సబ్‌ప్లాన్ నిధులు మంజూరు
కనిగిరి : ఎస్సీ సబ్ ప్లాన్ కింద రీజియన్‌లోని (ప్రకాశం,నెల్లూరు, గుంటూరు) కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు రూ. 145 కోట్లు నిధులు మంజూరైనట్లు రీజనల్ డెరైక్టర్(ఆర్డీ) అనురాధ తెలిపారు. నగర పంచాయతీ కార్యాలయంలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికి 27 పనులకు గాను రూ. 25 కోట్ల మేర పనులు మాత్రమే జరిగాయన్నారు. ప్రకాశంకు రూ. 33.5 కోట్లు, నెల్లూరుకు రూ. 51 కోట్లు, గుంటూరుకు రూ. 61 కోట్లు మంజూరు చేశామన్నారు. 14వ ఆర్థిక సంఘ నిధుల్లో భాగంగా ప్రకాశంకు రూ.15.91 కోట్లు, గుంటూరుకు రూ. 38.83 కోట్లు, నెల్లూరుకు రూ. 21.53 కోట్లు మంజూరు కాగా పనుల పురోగతి తక్కువగా ఉందని వివరించారు. రెండు నెలల్లో పనులు చేపట్టాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. అలాగే 13వ ఆర్థిక సంఘ నిధుల కింద రీజియన్‌లో రూ. 141 కోట్లు మంజూరు కాగా, ఇప్పటికి వరకు రూ. 74 కోట్ల పనులు జరిగాయన్నారు. మిగతా నిధులు రెండు నెలల్లో ఖర్చు చేయాల్సి ఉందని చెప్పారు. ట్యాక్స్‌ల రూపంలో రూ. 28 కోట్లు మూడు జిల్లాల్లో రూ. 28 కోట్ల విలువైన ఆస్తి పన్నులు వసూలు చేసినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో రూ. 5 కోట్లు, గుంటూరు రూ. 16 కోట్లు, నెల్లూరులో రూ. 6 కోట్లు వసూలు అరుునట్లు తెలిపారు. పన్నుల కింద రూ. 4.5 కోట్లు వచ్చినట్లు చెప్పారు. కనిగిరి నగర పంచాయతీలో రూ. 27లక్షలు వచ్చినట్లు చెప్పారు. సీఆర్ఎస్ను సేవలను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చిన సర్వీస్ రిజిస్ట్రేషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీ అనురాధ కోరారు. బర్త్, డెత్‌ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకుని రసీదు పొందవచ్చన్నారు. దీనిపై ఇప్పటికే కమిషనర్లకు ట్రైనింగ్ ఇచ్చామని, త్వరలో ప్రైవేటు వైద్యులకు కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. పురసేవల యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచి మీ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కోరారు. -
ఘనంగా బతుకమ్మ సంబరాలు
షాద్‌నగర్‌రూరల్: బతుకమ్మ పండగను తెలంగాణ సంస్కతి సంప్రదాయాలకు ప్రతీకగా అని చెప్పుకోవచ్చని రాష్ట్రఉపాధ్యాయ పండితపరిషత్ రాష్ట్రఅధ్యక్షురాలు అనురాధ, జాతీయఅథ్లెట్ శంకర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని భాగ్యనగర్కాలనీలోగల క్రిష్ణవేణి పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు రఫత్సుల్తానా ఆధ్వర్యంలో బతుకమ్మ పండగను నిర్వహించా రు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయునిలతో కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆట లు ఆడారు. అనంతరం వారు మాట్లాడుతూ పండగలలో మతసామరస్యాన్ని చాటు తూ పం డగ అనుభూతిని ఆస్వాదించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎండి.వసీం, ఉపాధ్యాయు లు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఫరూఖ్‌నగర్ మండలపరిధిలోని బూర్గుల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో డాక్టర్ సుమంత్, దినెష్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ మనపండుగల విశిష్టతను భావితరాలకు అ ందిస్తూ సంస్కతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. విద్యార్థినులు, ఉపాధ్యాయునులు బతుకమ్మ ఆట, పాటలతో చూపరులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ జయప్రకాష్, సుధాకర్, క్రిష్ణయ్య, చంద్రకళావతితోపాటు సిబ్బంది పాల్గొన్నారు. కొత్తూరు: పండగలు మన సంస్కతి, సంప్రదాయాలకు చిహ్నాలని ఎంపీడీఓ జ్యోతి తెలిపారు. మండలంలో మంగళవారం తెలంగాణ జాగతి అధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలను తీరొక్క పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జాగతి నియోజకవర్గ కన్వీనర్ గడ్డం సత్యనారాయణ, రాజ్యలక్ష్మీ, సర్పంచ్‌లు జగన్, కావలికష్ణ, కొమ్ముకష్ణ, ఎంపీటీసీ దేవేందర్‌యాదవ్, జాగతి సభ్యులు జ్ఞానప్రసూన, శైలజ, కష్ణవేణి, సరళ, యాదమ్మ, జ్యోతి, స్థాని క మహిళలు, ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యు లు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఘనంగా బతుకమ్మ సంబరాలు షాద్‌నగర్‌రూరల్: బతుకమ్మ పండగను తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా అని చెప్పుకోవచ్చని రాష్ట్రఉపాధ్యాయ పండితపరిషత్ రాష్ట్రఅధ్యక్షురాలు అనురాధ, జాతీయఅథ్లెట్ శంకర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని భాగ్యనగర్కాలనీలోగల క్రిష్ణవేణి పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు రఫత్సుల్తానా ఆధ్వర్యంలో బతుకమ్మ పండగను నిర్వహించా రు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయునిలతో కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆట లు ఆడారు. అనంతరం వారు మాట్లాడుతూ పండగలలో మతసామరస్యాన్ని చాటు తూ పం డగ అనుభూతిని ఆస్వాదించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎండి.వసీం, ఉపాధ్యాయు లు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఫరూఖ్‌నగర్ మండలపరిధిలోని బూర్గుల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో డాక్టర్ సుమంత్, దినెష్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ మనపండుగల విశిష్టతను భావితరాలకు అ ందిస్తూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. విద్యార్థినులు, ఉపాధ్యాయునులు బతుకమ్మ ఆట, పాటలతో చూపరులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ జయప్రకాష్, సుధాకర్, క్రిష్ణయ్య, చంద్రకళావతితోపాటు సిబ్బంది పాల్గొన్నారు. కొత్తూరు: పండగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నాలని ఎంపీడీఓ జ్యోతి తెలిపారు. మండలంలో మంగళవారం తెలంగాణ జాగృతి అధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలను తీరొక్క పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జాగృతి నియోజకవర్గ కన్వీనర్ గడ్డం సత్యనారాయణ, రాజ్యలక్ష్మీ, సర్పంచ్‌లు జగన్, కావలికృష్ణ, కొమ్ముకృష్ణ, ఎంపీటీసీ దేవేందర్‌యాదవ్, జాగృతి సభ్యులు జ్ఞానప్రసూన, శైలజ, కృష్ణవేణి, సరళ, యాదమ్మ, జ్యోతి, స్థాని క మహిళలు, ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యు లు తదితరులు పాల్గొన్నారు. -
నాన్న... సామ్రాజ్యం
ఫస్ట్ పర్సన్ నాన్న డాక్టర్ అంజిరెడ్డి ఒక గొప్ప దార్శనికుడు! అమ్మ సామ్రాజ్యం.. అభిమానాల సామ్రాజ్యం! వీళ్లిద్దరూ పెంచిన మొక్క అనూరాధ! ఇప్పుడు అనూరాధ పెద్ద చెట్టయింది.. ఓ సప్తపర్ణిలా! ఓ కొమ్మన కళ, సంస్కృతి పూలను విరబూయిస్తూ.. మరో కొమ్మన చదువుల ఫలాలను పంచే చెట్టయింది! ఇంటర్వ్యూ చేస్తామంటే వద్దన్నారు.. ఫొటోలు తీస్తామంటే కుదరదు అన్నారు.. నిశ్శబ్దంగా పనిచేయడం ఇష్టమన్నారు! ‘మీ పనితో పదిమంది స్ఫూర్తి చెందితే పదివేలమంది పదిలంగా ఉంటారు’ అని చెబితే ‘సరే’నని ఒప్పుకున్నారు! ‘సాక్షి’కి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఫ్యామిలీలోని ఈ కొత్త శీర్షిక ఫస్ట్ పర్సన్‌కు స్వాగతం. కొంతమంది పిల్లలను చూస్తుంటే మనమెంత అదృష్టవంతులమో అనిపిస్తుంది. వాళ్లకూ చదువుకోవాలనుంటుంది. కాని ఇంట్లో పరిస్థితి అనుకూలంగా ఉండదు. నాన్న తాగుడుకు బానిసై ఉంటాడు, తల్లి ఎక్కడో పనిచేసుకొని వస్తుంది.. ఆ డబ్బులు సరిపోవు.. దాంతో చదువు మధ్యలోనే ఆపేసి ఆ పిల్లలూ ఏదో పనిని వెదుక్కునే అవసరం ఏర్పడుతుంది. అలాంటివి చూసినప్పుడే మనం ఎంత బాగా పెరిగామో.. అనిపిస్తుంది. అందుకే మా నాన్నగారికి (అంజిరెడ్డి) కూతురుగా పుట్టడం నాకు వరం! గర్వంగా ఉంటుంది. ఈ రోజు ‘డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్’ తరపున ఇలాంటి పిల్లలు చదువుకునేలా చేయడం నాన్నగారు ఇచ్చిన అవకాశమే. ఆయనది విశాల దృష్టి. గొప్ప ఆలోచన! అందరూ మంచివాళ్లే అని నమ్మేవారు. అదే మాకూ అబ్బింది. ఆ ఆలోచనా విధానమే ఆయన బలం! మాకూ అదే శక్తి! ఇది చెయ్.. అది చేయకు అంటూ మమ్మల్నెప్పుడూ ఒత్తిడి చేయలేదు. మేము ఏం చేసినా మెచ్చుకునేవారు. దేన్ని ఎలా చేయాలో ప్రత్యేకించి నేర్పలేదు. దేన్నయినా, ఏదైనా ఆయన్ని చూసి నేర్చుకోవడమే. ఆ మాటకొస్తే మాకు అమ్మా, నాన్న ఇద్దరూ గురువులే. అమ్మ కూడా (సామ్రాజ్యం) సింపుల్. నాన్న దగ్గర మేం దృక్పథాన్ని అలవరచుకుంటే అమ్మ దగ్గర నిరాడంబరతను నేర్చుకున్నాం. తాను మొదటి నుంచి లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా ఉండేవారు. అమ్మా నాన్న.. ఇద్దరూ కూతురుగా నాకెప్పుడూ ఆంక్షలు విధించలేదు. నేను పెట్టుకున్న పరిమితులే తప్ప వాళ్ల నుంచి అలాంటివి లేవు. గృహిణిగా సంతృప్తి, సంతోషం బీఎస్సీ ఫైనలియర్లో పెళ్లయింది. బిజినెస్ వ్యవహారాలకు నేను మొదటి నుంచీ దూరం. అంత ఆసక్తీ లేదు. ఇల్లు, భర్త, ముగ్గురు పిల్లలు, వాళ్ల చదువుల బాధ్యతలను చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాను. మధ్యలోనే బడి మానేస్తున్న పిల్లల కోసం ఏదైనా చేయాలని అనుకుంటుండేవారు నాన్నగారు. ఏది మొదలు పెట్టినా ఇవ్వాళ చేశాం.. రేపటికి అయిపోయింది అన్నట్టుగా కాక.. తను ఉన్నా లేకపోయినా తాను ప్రారంభించిన సంస్థ వృత్తి నైపుణ్యాలతో.. కార్పోరేట్ సంస్థలా కొనసాగాలని అనుకునేవారు. ఆ ఉద్దేశంతోనే 1996లో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ (డీఆర్ఎఫ్)ను ప్రారంభించారు. అప్పుడు తనతోపాటు నన్నూ దానికి ట్రస్టీగా పెట్టారు. ఫౌండేషన్ బాధ్యతలన్నీ నళినీ గంగాధర్ చూసుకునేవారు. పదేళ్లకు (2006లో) నళినీ గంగాధర్ సొంత సంస్థను అభివృద్ధి చేసుకోవాలని ఈ సంస్థ నుంచి వెళ్లిపోయారు. అప్పుడు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ బాధ్యతను నేను తీసుకోవాల్సి వచ్చింది. ఆ పనంతా నాకు కొత్తే! భయంగానే భారాన్ని తలకెత్తుకున్నాను. ఫౌండేషన్ బృందంతో కలిసి పనిచేస్తూనే కొత్త విషయాలను తెలుసుకున్నాను! అయితే ఇక్కడ నా టీమ్‌ని ప్రశంసించాలి. నాకు చాలా మద్దతుగా నిలబడింది. డీఆర్ఎఫ్... చారిటీ కాదు పద్దెనిమిదేళ్లు పైబడిన వాళ్లకు జీవన నైపుణ్యాలు నేర్పించి వారికి ఉపాధి చూపించడం దగ్గర మొదలైంది డీఆర్ఎఫ్ ప్రయాణం. పుడమి పేరుతో 25 పాఠశాలలను నడుపుతున్నాం. ఓ 50 ప్రభుత్వ పాఠశాలలకూ సహకారం ఇస్తున్నాం. బాగా చదువుకునే పిల్లలకు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఒక అవరోధంగా మారకూడదు. డబ్బులేని కారణంగా వాళ్ల చదువు ఆగిపోకూడదు. అందుకే మంచి మార్కులు వచ్చి, ఆర్థికంగా వెనుకబడి ఉన్న విద్యార్థులకు ఉపకార వేతనాలనూ అందిస్తున్నాం.. ఆ డబ్బుతో వాళ్లు పైచదువులకు వెళ్లడానికి. డీఆర్ఎఫ్లో ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ ఉంది. అందులో బోధనా పద్ధతులు, పాఠ్యాంశాలకు సంబంధించిన అధ్యయనం, పరిశోధన జరుగుతుంటాయి. ఇక జీవనోపాధికి సంబంధించి దేశవ్యాప్తంగా వంద కేంద్రాలు పనిచేస్తున్నాయి. క్షేత్రస్థాయి పర్యవేక్షణ కోసం ఆ కేంద్రాలకు వెళ్లినప్పుడు స్థానికుల ఆదరణ చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇలా సేవ చేయడం అదృష్టమనిపిస్తుంది. అలాగని దీన్ని చారిటీ అనను. నాన్నగారు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తా. అదే లక్ష్య నినాదం.. అదే అంకిత భావం ఈ ఫౌండేషన్ వల్ల ఎంతోమంది పిల్లలకు మేలు జరుగుతోంది. నాన్నగారికి చాలా ఆలోచనలు ఉండేవి. సమయానుగుణంగా వాటిని అమలు చేసుకుంటూ పోవడమే నా భావి ప్రణాళిక. నాన్నగారు అనుకున్నట్లు ఈ సంస్థ మేం లేకపోయినా నడవాలి. అదే లక్ష్య నినాదంతో.. అదే అంకితభావంతో! అందుకే వీలైనంత వరకు విస్తరిస్తూ పోతున్నాం. ప్రస్తుతం.. రైతులు, వికలాంగుల కోసం పనిచేస్తున్నాం. ఇలా భవిష్యత్తులో కూడా వీలైనన్ని అంశాల మీద దృష్టి పెడతాం. ఈ స్ఫూర్తి కొనసాగేలా చూస్తాం! చేసింది చాలా తక్కువ ఐ నెవర్ రిగ్రెట్ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. గృహిణిగా ఆ బాధ్యతను చాలా ఇష్టపడ్డాను. డీఆర్ఎఫ్ డెరైక్టర్‌గా ఈ పనినీ అంతే నిబద్ధతతో నెరవేరుస్తున్నాను. అయితే చేసింది చాలా తక్కువనే భావన. ఇంకా ఏదో చేయాల్సి ఉండిందని.. చేయాలనీ ఉంటుంది. ప్రతివాళ్లకూ ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుంది. దాన్ని అనుసరించాలి. ఆసక్తి ఉన్న పనిని అలక్ష్యం చేయకుండా చేతల్లోకి దిగాలి. - సరస్వతి రమ సప్తపర్ణి సప్తపర్ణి నా సొంత ఐడియా. పిల్లలకు చదువే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల మీద మీద కూడా శ్రద్ధ కల్పించాలనే ఉద్దేశంతో సప్తపర్ణిని స్థాపించాను. ఈ విషయంలో జిడ్డు కృష్టమూర్తి, విద్యారణ్య పాఠశాల నాకు స్ఫూర్తి. ఎంతసేపూ బిజినెస్.. సోషల్ వర్కే కాకుండా ఆర్ట్ అండ్ కల్చర్ కూడా జీవితంలో భాగం కావాలి కదా! అందుకే ఈ సప్తపర్ణి. అయితే నా ఈ ఆలోచనను బాగా ప్రోత్సహించి దీనికి రూపమిచ్చింది మాత్రం నా భర్త ప్రసాద్. అసలు నేను ఇవ్వాళ ఇన్ని పనులను ఇంత తేలికగా పూర్తి చేయగలుగుతున్నానంటే కూడా కారణం ప్రసాద్ నాకు అండగా ఉండడమే! ఎన్ని చేసినా మనసులో మాత్రం గృహిణి హోదాకే ఎక్కువ మార్కులు వేసుకుంటా! నిజానికి అది చాలా ఇంపార్టెంట్. కుటుంబ బాధ్యతల్ని, సామాజిక సేవనీ రెండిటినీ సమన్వయం చేయడం కష్టం, కానీ ముఖ్యం! -
రంగంలో అనురాధ భవిష్యవాణి
-
మహిళ దారుణ హత్య
కొనకనమిట్ల మండలం వద్దిమడుగు గ్రామంలో ఆళ్లచెరువు అనురాధ(40) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. గ్రామానికి చెందిన బద్రి గురుమూర్తి అనే వ్యక్తే గొంతు పిసికి చంపి ఉంటాడని అనురాధ తండ్రి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆమె 15 ఏళ్లుగా భర్తతో విడిగా ఉంటోంది. గురుమూర్తి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి గురుమూర్తే మంగళవారం వేకువజామున గొంతు పిసికి చంపి ఉంటాడని భావిస్తున్నారు. ఉదయం తండ్రి చూసేసరికి అనురాధ నిర్జీవంగా పడి ఉంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
నిప్పులాంటి మోసం
చేతనబడి ఒక మోస్తరు డాబా ఇల్లు. ఇంటి ముందు నలభై మంది సమావేశం కాదగిన విశాలమైన వరండా. అందులో ఒక పీఠం. దాని ముందు రకరకాల వస్తువులు. పూజలకు ఉపయోగించే మట్టి ప్రమిదలు, మూకుళ్లు, ఒక మూకుడులో పసుపు, ఒక మూకుడులో కుంకుమ, ఒక ఆకు దొన్నెలో సన్నని దారాలు, ఒక చోట నలుచదరంగా కత్తిరించిన కాగితాల దొంతర, ఒక ఇత్తడి పాత్రలో నిప్పులు, ఆ పక్కనే మరొక పాత్రలో సాంబ్రాణి... ఇలా వైవిధ్యమైన వాతావరణం నెలకొని ఉంది. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పూలమాల గ్రామానికి ఆ పొరుగునే ఉన్న పార్లపల్లి గ్రామం నుంచి వచ్చారు జ్యోతి, అనూరాధ. వారిలాగానే పెద్ద మరిమీడు, చిన్న మరిమీడు, మరికొన్ని గ్రామాల నుంచి వచ్చిన వాళ్లు... అంతా ఓ పదిమందికి పైగా ఉన్నారు. వచ్చిన అందరినీ ఎంతో ఆప్యాయంగా... మేనమామలా ప్రేమగా పలకరిస్తున్నాడు ఓ వ్యక్తి. ఆ ఆత్మీయతకు ఒక్కొక్కరి మనసు తలుపులు తెరుచుకుంటోంది. అత్యంత నిగూఢంగా దాచుకున్న కష్టాన్ని ఆత్మీయుడి ముందు బయటపెట్టుకుంటూ కళ్లు తుడుచుకుంటున్నారు. గతంలో తనకొచ్చిన కష్టాలను వారితో పంచుకున్నాడాయన, వాటిని స్వామి చేత్తో తీసిపారేసినట్లు ఎలా తొలగించాడో చెబుతున్నాడు. సరైన చోటకే వచ్చామనే భరోసా కలుగుతోంది అక్కడున్న వారిలో.ఒక జంట తమ కూతురి పెళ్లికి ఇంకా ఎంత సమయం ఉందని అడిగారు. సంబంధాలు కుదిరినట్లే కుదిరి ఆగిపోతున్నాయని వాపోయారు. బాబా చిర్నవ్వుతో ‘‘మీ అమ్మాయికి అడ్డు వస్తున్న కీడు తొలగిపోతుంది’’ అన్నాడు ధైర్యం ఇస్తున్నట్లు. బాబా ఎదురుగా మట్టి కుండ మీద పెట్టే చిన్న మట్టిపాత్ర. కచ్చితంగా ఆ పాత్ర మధ్యలో తానొక స్పూను వేసి చూపించి మిగిలిన నెయ్యి వారిచేతనే పోయించాడు బాబా. కళ్లు మూసుకుని దీర్ఘంగా మంత్రాలు వల్లించాడు. నిమిషం లోపే పొగ మొదలైంది. ఆ వెంటనే మంట రాజుకుంది. మంట పెద్దదైంది. రెండు నిమిషాల్లో మంట చల్లారి బూడిద మిగిలింది. ‘‘మీ అమ్మాయికి అడ్డుపడుతున్న కీడు మండిపోయింది. ఇక మీ ఊరికి వెళ్లి, అమ్మాయి కీడు తొలగిపోయిందని బంధువులందరికీ చెప్పండి. ప్రయత్నాలు కొనసాగించండి. ఆర్నెల్లలో పెళ్లవుతుంది’’ సంతృప్తికరమైన సమాధానంతో ప్రఫుల్లమైన ముఖంతో లేచారు ఆ తల్లిదండ్రులు. వెళ్తూ వెళ్తూ సంతోషంగా దక్షిణ సమర్పించుకున్నారు. వెంటనే ఒకాయన... ‘రోజుకు ఆరు లీటర్ల పాలిచ్చే తన గేదె ఉన్నట్లుండి ఎండిపోయింద’ని బాబా ముందు వాపోయాడు. ఒక అంత్రాన్ని మంత్రించి ఇచ్చి గేదెకు కట్టమన్నాడు బాబా. దానిని జాగ్రత్తగా చొక్కా లోపలి జేబులో పెట్టుకుని, దక్షిణ తీశాడు ఆ రైతు. ఓ యువ దంపతులు చూడడానికి ముచ్చటగా ఉన్నారు. వారిది అన్యోన్యమైన కాపురమేననిపిస్తోంది. ఈ వయసులో వీళ్లకు వచ్చిన కష్టమేంటో పాపం- అనుకుంటున్నారు అక్కడికొచ్చిన వాళ్లు. ‘‘మీకు పిల్లలు పుడతారు. బెంగ అక్కరలేదు’’ అన్నాడు బాబా. ఆశ్చర్యంగా చూశారు అందరూ. బాబా వారికి మంత్రించిన తాయెత్తు ఇచ్చి ‘నీ భార్య చేతికి కట్టు’ అని ఆదేశించాడు. అలాగే ఆ అమ్మాయికి మరో తాయెత్తు ఇచ్చి ‘ఇది నీ భర్తకు కట్టమ్మా’ అన్నాడు అనునయంగా. ఇక జ్యోతి, అనూరాధల వంతు... ఇద్దరూ ఇబ్బందిగా చూశారు. వారి సంశయాన్ని, వారిలో ఒక మోస్తరు సంపన్నతను గ్రహించిన బాబా వారిని మరికొంత సేపు ఆగమని, మిగిలిన వారిని పంపించేశాడు. ఇద్దరినీ మార్చి చూస్తూ... జ్యోతితో ‘‘నీ భర్త మరొక స్త్రీతో సన్నిహితంగా ఉంటున్నాడని నీకెప్పుడు తెలిసింది’’ అడిగాడు బాబా. అసలే ఆందోళనగా ఉన్న అనూరాధ ముఖం ఆ మాటతో పాలిపోయింది. ‘‘రెండేళ్ల నుంచి తెలుసు’’ నూతిలో నుంచి వచ్చినట్లు ఉంది ఆమె మాట. బాబా కళ్లు మూసుకుని ఏదో జపించాడు. పిడికిలి బిగించి నుదుటి మీద పెట్టుకున్నాడు. ముఖంలో ఆవేశం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. క్షణాల్లోనే కళ్లు తెరిచాడు. కళ్లు ఎర్రగా మండుతున్నాయి. ముఖం రౌద్రంగా మారిపోయింది. గాల్లోకి చూస్తూ ‘‘అమాయకురాలి కాపురంలో నిప్పులు పోస్తావా’’ అని హుంకరించాడు. క్షణాల్లో స్థిమిత పడి జ్యోతి వైపు చూశాడు. ‘‘నీ భర్త మీద వశీకరణం జరిగింది’’ జ్యోతి వణికి పోతోంది. భయపడకు అన్నట్లు ఆమె భుజం చుట్టూ చేయి వేసి తడుతోంది అనూరాధ.‘‘ధైర్యంగా ఉండు. కష్టపెట్టే వాళ్లున్నట్లే ఆదుకునే వాళ్లూ ఉంటారు. కీడును తొలగిద్దాం’’ అన్నాడు బాబా. కళ్లు తుడుచుకుంటూ అలాగేనన్నట్లు తలూపింది. ‘‘చిన్న హోమం చేద్దాం. నెయ్యి ఉందా’’ వారి చెంత ఉన్న పూజసామగ్రి వైపు చూశాడు బాబా. అనూరాధ పైకి లేచి ‘‘ఈ ఊళ్లో నెయ్యి దొరికే దుకాణాలున్నాయా? ఎటు వెళ్లాలి’’ అని వివరాలడుగుతోంది. ఆత్మీయుడు జోక్యం చేసుకున్నాడు. ‘‘కొత్త చోట వాళ్లేం ఇబ్బంది పడతారు పైగా ఆడవాళ్లు పాపం... నువ్వెళ్లి తీసుకురాకూడదూ’’ అంటూ అక్కడే ఉన్న ఓ కుర్రాణ్ని పురమాయించాడు. అనూరాధ ఆ కుర్రాడికి డబ్బిచ్చి పంపించింది. పది నిమిషాల్లోనే నేతితో వచ్చాడు ఆ కుర్రాడు. జ్యోతితో మట్టిపాత్రలో నెయ్యి పోయించాడు బాబా. అంతకు ఓ అరగంట ముందే పెళ్లి కావాల్సిన అమ్మాయి కోసం మంత్రించినట్లే మంత్రించాడు. ఎంత సేపటికీ నిప్పు కాదు కదా పొగ కూడా రావడం లేదు. జ్యోతి కుప్పకూలిపోలేదు అనే కానీ దాదాపు ఆమె పరిస్థితి అలాగే ఉంది. ‘‘వశీకరణకు విరుగుడుగా ఐదువారాల పాటు రోజూ ముగ్గు పెట్టి ఆవాహన చేస్తాను. నువ్వు రోజూ రానక్కరలేదు. ప్రతి శుక్రవారం వచ్చి పూజలో కూర్చుంటే చాలు. మూడో వారానికే కీడు మండిపోవాలి... ’’ తగుమాత్రం భయపెడుతూనే, ఆ భయాన్ని కొనసాగించడానికి కావలసినంత ధైర్యం చెప్పాడు. జ్యోతి కేసులో ఐదవ వారం వరకు ఆగాల్సిన పని రాలేదు. నాలుగవ వారానికే బాబా ప్రయోగించిన చిట్కాల రహస్యం బట్టబయలైంది. బాబా చేస్తున్నవి మోసాలని తెలిసిన తరవాత ఊళ్లో వాళ్లు ఆవేశంతో ఊగిపోయారు. అడ్డుకోకపోతే ప్రాణాలు పోయేటట్లున్నాయి. ట్విస్ట్ ఏమిటంటే... పోలీసులకు సమాచారం వెళ్లేలోపు బాబా ఊరి వారి కాళ్లు పట్టుకున్నాడు. ఇక ఇలా మాయలు చేయనని ఒట్టు పెట్టుకుని గండం నుంచి బయటపడ్డాడు. మంటలెలా వస్తాయి? వాటి లోపల... అంటే కాగితాల కింద దీపం పెట్టే దొన్నె ఉంటుంది. అందులో పొటాషియం పర్మాంగనేట్ పొడి ఉంటుంది. అది బూడిదరంగులో ఉండటం వల్ల ఆ సంగతి ఎవరికీ తెలియదు. దాని మీద గ్లిజరిన్ కలిసిన నెయ్యి పడిన ఇరవై సెకన్లకు పొగ, మంట మొదలవుతాయి. పొటాషియం పర్మాంగనేట్‌తో గ్లిజరిన్ కలిస్తే ఉష్ణమోచక చర్య జరిగి 200 డిగ్రీల వేడి పుడుతుంది. అందులో నుంచి మంటలు వస్తాయి. కొందరికి మొదటిసారే మంటలు తెప్పిస్తారు. బాగా డబ్బు గుంజవచ్చనే భరోసా ఉన్న చోట మూడు- ఐదు వారాలు తిప్పిన తర్వాత మంట తెప్పిస్తారు. అంత వరకు గ్లిజరిన్ లేని నెయ్యి మాత్రమే వేస్తారు. జనవిజ్ఞాన వేదిక దర్యాప్తులో బాబా దగ్గర ఉండే కుర్రాడు ఏ దుకాణంలో నెయ్యి కొంటున్నాడో గమనించి, ఆ దుకాణదారుడిని నిలదీస్తే విషయం బయటపడింది. జ్యోతి తన కాపురం నిలబెట్టమని బాబా దగ్గరకు వెళ్తున్నట్లు ఇరుగుపొరుగుకి తెలిసింది. భర్త వెంకటేశ్‌కూ తెలిసింది. ఈ సంగతి తెలిసిన వాళ్లంతా అతడిని దోషిని చూసినట్లు చూస్తున్నారు. దాంతో జ్యోతి దూరమైపోయిందనే భయం మొదలైందడిలో. మిత్రుడి దగ్గర భోరుమన్నాడు. మూడేళ్లుగా భార్యకు దూరంగా ఉండడానికి ఆకస్మాత్తుగా తనలో తలెత్తిన‘స్తంభన సమస్యే’ కారణమని చెప్పుకోక తప్పలేదు. ఆ మిత్రుడు హేతువాద దృక్పథం కలిగిన వాడు కావడంతో జ్యోతి భర్త అనారోగ్యంతోపాటు బాబా కుట్ర కూడా బయటపడింది. బాబా దగ్గరకొచ్చేవాళ్లందరూ చుట్టుపక్కల ఊళ్లలోనేవాళ్లే. వారి సమస్యలన్నీ తన మనుషుల ద్వారా బాబాకు తెలిసిపోతుంటాయి. అగ్గి లేని బుగ్గి! పుండరీకాక్షయ్య మలయాళ మాంత్రికుడు. కేరళలోనే కాకుండా యావద్దేశంలో ఒక సంచలనం సృష్టించాడు. యజ్ఞాలు చేస్తానని, యజ్ఞగుండంలో అగ్గిలేకుండా మంత్రంతోనే మంట తెప్పిస్తానని సవాల్ చేసేవాడు. అన్నట్లే మంటలు తెప్పించేవాడు. అదంతా మంత్రం మహిమ అని జనం నీరాజనాలు పట్టారు. అందులో ఉన్న సైంటిఫిక్ ఫార్ములాను బట్టబయలు చేసిన తర్వాత ఆయన ఆ తరహా ప్రాక్టీస్ మానేశారు. - మహమ్మద్ మియా, కర్నూలు, జనవిజ్ఞానవేదిక కార్యకర్త -
హైదరాబాద్ లో గృహిణి అదృశ్యం
గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ మహిళ అదృశ్యమైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. ఎన్టీఆర్ స్టేడియం సమీపంలోని వాంబే క్వార్టర్స్ నుంచి కొండపాక అనురాధ (40) అనే గృహిణి అదృశ్యమైంది. కొంతకాలంలో మతిస్థిమితం లేకపోవడంతో ఆమె ఈనెల 20న ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆమె సోదరుడు కె. నారాయణమూర్తి గాంధీనగర్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళ ఆచూకీ తెలిసిన వారు. -
భారత్‌కు మరో విజయం
స్టెలెన్‌బోష్ (దక్షిణాఫ్రికా): భారత మహిళల హాకీ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. స్కాట్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-0 గోల్స్ తేడాతో ఓడించింది. భారత్ తరఫున రాణి రెండు గోల్స్ చేయగా... దీపిక, అనురాధ, గుర్జిత్ ఒక్కో గోల్ సాధించారు. -
ఆన్లైన్లో ఆలయాల సేవలు
శ్రీకాకుళం : శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణస్వామిని దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ కుటుంబ సభ్యులతో కలసి గురువారం దర్శించుకున్నారు. అలాగే, కల్లేపల్లి మణినాగేశ్వరి శివాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... శ్రీ కూర్మం, అరసవల్లి, శ్రీముఖలింగం ఆలయాలను పర్యాటకంలో భాగంగా అభివృద్ధి చేస్తే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు. దేవాలయాల్లో సేవలన్నింటినీ ఆన్లైన్ ద్వారా అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. -
'భూ ఆక్రమణలపై తక్షణం విచారణ జరిపించాలి'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో భూ ఆక్రమణలపై విజిలెన్స్ కమిషనర్ అనురాధకు మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఫిర్యాదు చేశారు. సీఆర్డీఏ, టీడీపీ నేతలు కలిసి 500 ఎకరాల భూమికి అక్రమంగా రికార్డులు సృష్టించారంటూ ఆయన సోమవారం ఫిర్యాదు చేశారు. ఆక్రమణలపై తక్షణం విచారణ జరిపించాలని విజిలెన్స్ కమిషనర్‌ను ఎమ్మెల్యే ఆర్కే కోరినట్టు సమాచారం. -
దొంగకు షాకిచ్చిన మహిళ
నగరంలో గొలుసు దొంగతనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రోడ్లపై నడుచుకుంటూ వెళ్లేవారినీ, పొద్దునే వాకింగ్‌కు వెళ్లే మహిళలనే టార్గెట్‌గా చేసుకునే చైన్‌స్నాచర్..తాజాగా రూటు మార్చారు. ఇళ్లలోకి చొరబడి మరీ దొంగతనాలకు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం ఇలాంటి సంఘటనే మీర్‌పేటలో చోటుచేసుకుంది. మీర్‌పేట పరిధిలోని మిథిలానగర్‌లో ఉన్న ఓ ఇంట్లోకి చొరబడి అనురాధ(28) అనే మహిళ మెడలోని తాళిబొట్టును అపహరించేందుకు ప్రయత్నించాడు. అనురాధ తీవ్రంగా ప్రతిఘటించడంతో తాళిబొట్టును వదిలేసి దుండగుడు పరారయ్యాడు. తాళిబొట్టు దొంగిలించే సమయంలో దుండగుడు ఆమె ముఖం మీద ముసుగు వేయడంతో దుండగుడిని గుర్తుపట్టలేకపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కఠారి దంపతులను చంపింది చింటూనే
-
మేయర్ హత్యానంతరం ‘థ్యాంక్స్’ చెప్పిన దుండగులు!?
-
మేయర్ హత్యానంతరం ‘థ్యాంక్స్’ చెప్పిన దుండగులు!?
దారులు చూపించిన వాళ్లు మేయర్ పక్కనే ఉన్నారా..? మోహన్ అనుచర వర్గంపై పోలీసుల దృష్టి చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ల హత్య వెనుక పలు ఆసక్తికర విషయాలు ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. మేయర్ దంపతులపై కాల్పులు జరిపిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లే దుండగులు సంఘటన స్థలంలోనే ఉన్న ఓ వ్యక్తికి ‘థ్యాంక్స్’ చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారంలో మేయర్ వర్గానికి చెందిన వాళ్లపై పో లీసులు దృష్టి సారించారు. కొత్త వ్యక్తులకు మేయర్ చాంబర్ ఎక్కడుందనే విషయం తెలియదు. ముసుగు ధరించి మే యర్ చాంబర్లోకి ముగ్గురు దుండగులు వెళుతున్న సమయంతో వాళ్ల కాళ్లకు మగాళ్ల చెప్పులు, బూట్లు కనిపించడంతో అప్రమత్తమైన మేయర్ అనుచరులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మేయర్‌కు బాగా తెలిసిన వ్యక్తులే హంతకులకు చాంబర్ లోపలకు వెళ్లడానికి దారి చూపించినట్లు తెలుస్తోంది. ఇక హత్య చేసిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయ ప్రధాన తలుపులు మూశారు. ఈ సమయంలో హంతకులు కార్యాలయం నుంచి తప్పించుకునే అవకాశం లేదు. అయితే కార్పొరేషన్ కార్యాలయంపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు ప్రజారోగ్యశాఖ విభాగం పక్కనున్న ప్రహరీగోడ దూకవచ్చనే సలహా నిందితులకు ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మేయర్ హత్యోదంతంలో మేయర్ దంపతుల అనుచర వర్గం, పార్టీ నాయకులను కూడా పోలీసులు సందేహించాల్సి వస్తోంది. -
అశ్రునివాళి..
మేయర్ దంపతులకు నేతల శ్రద్ధాంజలి హత్యకు నిరసనగా చిత్తూరులో బంద్ గంగన్నపల్లిలో నేడు అంత్యక్రియలు చిత్తూరు మేయర్ దంపతులకు ప్రజానీకం అశ్రునివాళుర్పించింది. మంగళవారం జరిగిన హత్యకాండలో ప్రాణాలు కోల్పోయిన మేయర్ అనురాధ,ఆమె భర్త కఠారి మోహన్ల భౌతిక కాయాలను ప్రజల సందర్శననార్థం బుధవారం చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఉంచారు. ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. గురువారం మధ్యాహ్నం గంగనపల్లెలోని మేయర్ దంపతులకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హత్యకు నిరసనగా బుధవారం చిత్తూరు బంద్‌లో బంద్ పాటించారు. ఈసందర్భంలో టీడీపీ కార్యకర్తలు నాలుగు ఆర్టీసీ బస్సుల్ని ధ్వంసం చేశారు. చిత్తూరు: చిత్తూరు మేయర్ కఠారి అనురాధ,ఆమె భర్త కఠారి మోహన్ లను దారుణంగా హత్య చేసింది మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ అని, కఠారి కుటుంబ సభ్యులు, అనుచరులు, పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. బుధవారం మధ్యాహ్నం చిత్తూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి తొలుత 3.30 ప్రాంతంలో కఠారి దంపతుల భౌతిక కాయాలకు నివాళులర్పించారు. అనంతరం తనయుడు లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు, ఐజీ వేణుగోపాల కృష్ణ, చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ తదితరులతో కలసి సీఎం కార్పొరేషన్ కార్యాలయంలో హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించారు. కఠారి అనురాధ ఎక్కడ హత్యకు గురైంది, మోహన్‌పై దాడి, దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వెళ్లారు? తదితర వివరాలను అడిగి తెలుసుకుని ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఆ తరువాత సీఎం పోలీసు అధికారులతో కార్యాలయంలోనే సమావేశమయ్యారు. దాడికి సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. కొందరు కిరాయి దుండగులతో కలిసి చింటూ స్వయంగా దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం. దాడికి ఉపయోగించిన పిస్టల్, మిగిలిన ఆయుధాలకు సంబంధించిన వివరాలు, దాడిలో పాల్గొన్న కిరాయి హంతకులు ఎక్కడి వారు? దాడి అనంతరం ఎలా పారిపోయారు? పోలీసు జాగిలం నేరుగా చింటూ కార్యాలయానికి వెళ్లడం, ఈ కేసులో లభించిన ఆధారాలను పోలీసులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి కఠారి కుటుంబ సభ్యులతో పాటు కార్పొరేటర్లు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో కలిసి మేయర్ దంపతులపై దాడి సమయంలో అక్కడే ఉన్న కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, కఠారి అనుచరులతో మాట్లాడారు. చింటూనే స్వయంగా ఈ ఘటనలో పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు ముఖ్యమంత్రికి తెలిపారు. తనను కాల్చొద్దురా..అంటూ అనురాధ ప్రాధేయపడినా చింటూ పిస్టల్‌తో పిట్టను కాల్చినట్టు ఆమెను కాల్చాడని వారు సీఎంకు వివరించారు. దుండగులను ఎదిరించే క్రమంలో గాయపడ్డ వారిని సైతం ముఖ్యమంత్రి పరామర్శించినట్లు సమాచారం. సమావేశంలో ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ సైతం పాల్గొన్నారు. -
మేయర్ పోస్టుమార్టం పూర్తి
-
మేయర్ దంపతుల పోస్టుమార్టం పూర్తి
చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం దారుణహత్యకు గురైన చిత్తూరు మేయర్ అనురాధ మృతదేహానికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వేలూరు ప్రభుత్వాసుపత్రిలో మేయర్ భర్త కఠారి మోహన్ మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. బుధవారం పోస్టుమార్టం చేసిన అనంతరం మేయర్ భౌతికకాయాన్ని పార్టీ కార్యకర్తల సందర్శనార్ధం చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి తరలించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు వీరి మృతదేహాలకు కార్పొరేషన్ కార్యాలయంలో టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించనున్నారు. చిత్తూరు మేయర్ కార్పొరేషన్ కార్యాలయానికి విచ్చేసిన పలువురు నేతలు అనురాధ మృతదేహానికి నివాళులర్పించారు. కాసేపట్లో చిత్తూరుకు కఠారి మోహన్ మృతదేహాన్ని తరలించనున్నారు. -
కాపునాడు ఆధ్వర్యంలో నేడు చిత్తూరు బంద్
-
మేయర్ భర్త కూడా మృతి
చిత్తూరు: చిత్తూరులో దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన మేయర్ అనురాధ భర్త కటారి మోహన్ తమిళనాడు వేలూరులోని సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మంగళవారం మధ్యాహ్నం బురఖా ధరించి వచ్చిన ఆరుగురు దుండగులు చిత్తూరు కార్పొరేషన్ ఆవరణలో మేయర్ అనూరాధపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనూరాధతో పాటు ఉన్న కఠారి మోహన్‌పై దుండగులు కత్తులతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మోహన్‌ను వెంటనే చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం వేలూరుకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో రాత్రి సమయంలో మృతి చెందారు. మరోవైపు ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ ముగ్గురు వ్యక్తులు చిత్తూరు ఒన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లోను, మరో వ్యక్తి చిత్తూరు కోర్టులోను లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మోహన్ అక్క కుమారుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూకు చెందిన ఆఫీసును మోహన్ వర్గీయులు పెట్రోలు పోసి నిప్పంటించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. -
కామారెడ్డిలో చైన్ స్నాచింగ్
కామారెడ్డి: ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి లో శుక్రవారం ఉదయం జరిగింది. వివరాలు.. అశోక్ నరగ్ కాలనీకి చెందిన అనురాధ(38) ఇంటి ముందు ముగ్గు వేస్తున్న సమయంలో బైక్ పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని ఐదుతులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అవయవ దానంతో ఐదుగురికి వెలుగు
పంజగుట్ట (హైదరాబాద్): బ్రెయిన్‌డెడ్ అయిన ఓ వ్యక్తి అవయవ దానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నిండాయి. నిమ్స్ జీవన్‌దాన్ ప్రతినిధి అనురాధ దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం మీడియాకు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వల్లోల గణేశ్ (56) చిక్కడపల్లిలో నివసిస్తూ స్థానికంగా కెమెరా సర్వీసింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 12న గణేశ్‌కు హైబీపీతో ఫిట్స్ రావడంతో స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. గణేశ్ బ్రెయిన్‌డెడ్ అయినట్లు 14వ తేదీన వైద్యులు నిర్ధరించారు. అవయవ దానం గురించి జీవన్‌దాన్ ప్రతినిధులు గణేశ్ కుటుంబ సభ్యులకు వివరించారు. అవయవ దానానికి వారు ఒప్పుకోవడంతో గణేశ్‌కు శస్త్రచికిత్స నిర్వహించి రెండు మూత్రపిండాలు, కాలేయం, రెండు కళ్లు తొలగించి అవసరమైన వారికి అమర్చినట్టు అనురాధ మీడియాకు తెలిపారు. -
కన్నతల్లే.. కడతేర్చింది
చంపేసి బావిలో పడేసిన వైనం ఆర్థిక ఇబ్బందులే కారణంటున్న నిందితురాలు అదృశ్యమైందని నాటకం.. పోలీసులకు ఫిర్యాదు బావిలోంచి మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పూడూరు మండల కేంద్రంలో ఘటన పూడూరు : కన్నతల్లే.. కడతేర్చింది. ఆర్థిక ఇబ్బందులతో సాకలేనని అభంశుభం తెలియని ఏడాది చిన్నారిని చంపేసి బావిలో పడేసింది. పాప అదృశ్యమైందని నాటకమాడి చివరకు పోలీసులకు పట్టుబడింది. చిన్నారి అదృశ్యం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పూడూరు మండల కేంద్రంలో ఈనెల 24 ఏడాది పాప అదృశ్యమైన విషయం తెలిసందే. చేవెళ్ల సీఐ ఉపేందర్, చన్గోముల్ ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండల కేంద్రానికి చెందిన మాసగళ్ల శ్రీనివాస్, అనురాధ దంపతులు. వీరికి కుమార్తెలు శ్రీజ(5), శ్రీహనీ(1) ఉన్నారు. శ్రీనివాస్ ఆటో నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈనెల 24న ఇంట్లో పాలుపడుతూ తాను నిద్రించగా చిన్న కూతురు అదృశ్యమైందని అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదటి నుంచి పోలీసులకు కుటుంబీకులపైనే అనుమానం ఉంది. శ్రీహనీని తల్లి అనురాధనే చంపేసి ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అనురాధ తీరు అనుమానాస్పదంగా ఉండడంతో ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరిపారు. ఈమేరకు తానే కూతురు శ్రీహనీని చంపేసి బావిలో పడేశానని ఆమె పోలీసుల ఎదుట అంగీకరించింది. ఆడపిల్ల.. సాకలేక.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. ఇద్దరు ఆడపిల్లలు కావడంతో సాకలేక ఈనెల 24న రాత్రి తన చిన్న కూతురు శ్రీహనీని చంపేసి గ్రామ సమీపంలోని బావిలో పడేసినట్లు మృతురాలి తల్లి అనురాధ నేరం అంగీకరించింది. ఆదివారం ఉదయం పోలీసులు స్థానికుల సాయంతో బావిలోంచి చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అంత్యక్రియల అనంతరం నిందితురాలు అనురాధను అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలిస్తామని సీఐ ఉపేందర్ తెలిపారు. కాగా.. అనురాధ చెప్పే వివరాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. తాను తాగిన మత్తులో ఉన్నానని ఏం జరిగిందో తెలియదని అనురాధ ఓసారి చెప్పింది. ఆడపిల్ల.. ఆర్థిక ఇబ్బందులతేనే కూతురును సాకలేక చంపేసి బావిలో పడేశానని మరోమారు నిందితురాలు తెలిపింది. కాగా కొన్నేళ్ల క్రితం అనురాధ తండ్రి చంద్రయ్య హత్యకు గురయ్యాడు. ఈకేసులో చంద్రయ్య భార్య పోచమ్మ, కూతురు అనురాధ, అల్లుడు శ్రీనివాస్ నిందితులు. చేతులెట్ల వచ్చినయ్.. అభంశుభం ఎరుగని చిన్నారి శ్రీహనీ కన్నతల్లి చేతుల్లో హత్యకు గురవడంతో కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కన్నపేగును చిదిమేయడానికి తల్లికి చేతులెట్ల వచ్చినయ్.. అంటూ అనురాధపై మండిపడ్డారు. సంఘటనా స్థలంలో గ్రామస్తులు పెద్దఎత్తున గుమిగూడారు. చిన్నారి మృతదేహాన్ని చూసి ‘అయ్యో.. పాపం’ అంటూ కంటతడి పెట్టుకున్నారు. కూతురు చంపేసిన అనురాధను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. గ్రామంలో ఎలాంటి గొడవలు తలెత్తకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. -
ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధపై బదిలీ వేటు
-
ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధపై వేటు!
- ఓటుకు నోటు టేపులను పసిగట్టలేకపోయారని సీఎం ఆగ్రహం - ఆమెను తప్పించాలని చంద్రబాబు నిర్ణయం - మరో ఇద్దరి పేర్లు సూచించిన డీజీపీ సాక్షి, హైదరాబాద్: ఏపీ నిఘా విభాగం చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బులిస్తూ అడ్డంగా దొరికిన వీడియోలు, ఆ నామినేటెడ్ ఎమ్మెల్యేతో చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు బయటపడిన వ్యవహారం ముందుగా పసిగట్టి సమాచారం ఇవ్వడంలో వైఫల్యం చెందారనే సాకుతో అనురాధను తప్పించాలని సీఎం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. మంగళవారం నిర్వహించిన అత్యవసర కేబినెట్ భేటీకి ఏపీ పోలీసు ఉన్నతాధికారులను కూడా పిలిచారు. అందరి సమక్షంలో అనురాధ పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక, కార్మిక శాఖల మంత్రులు సైతం ఆమెను పలు ప్రశ్నలు వేస్తూ నిలదీశారు. ఈ సందర్భంగా అనురాధ కూడా ఘాటుగానే స్పందించారని సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.. నోట్ల కట్టలు అందించిన వ్యవహారంలో తమ వైఫల్యం ఏమాత్రం లేదని ఘాటుగానే స్పందించారు. తెలంగాణ అధికారులు, మంత్రులపై తాము నిఘా ఉంచితే, ఆ విషయం బయటకు పొక్కితే ఇప్పుడు ఏపీ మంత్రులు చెబుతున్నట్టే అప్పుడు తెలంగాణ అధికారులు, మంత్రులు తమపై కేసులు పెట్టే ప్రమాదం ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో తమకు రక్షణ ఏమిటని ప్రశ్నిం చారు. తర్వాత అనురాధ అర్థంతరంగా సమావేశం నుంచి బయటకు రావడమే కాకుండా తన అధికార వాహనాన్ని అక్కడే వదిలి మరో వాహనంలో వెళ్లిపోయారు. అనంతరం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మరొకరి పేరును సూచించాలని డీజీపీ ని సీఎం ఆదేశించారు. దాంతో ఆయన సీహెచ్ ద్వారకా తిరుమలరావు, గౌతమ్ సవాంగ్ పేర్లు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం సీఐడీ చీఫ్‌గా ఉన్న తిరుమలరావు ఇంటెలిజెన్స్ బాధ్యతలు స్వీకరించడానికి సుముఖంగా లేకపోవడంతో ఏపీఎస్పీ అదనపు డీజీగా ఉన్న సవాంగ్ పేరును పరిశీలించారు. మార్పుపై మల్లగుల్లాలు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనురాధను మార్చడం వల్ల తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్టు అవుతుందని, టేపుల విషయంలో ఏ మాత్రం సంబంధం లేదని చెబుతున్నందున ఇంటెలిజెన్స్ చీఫ్‌ను ఎందుకు మార్చారనే ప్రశ్నకు జవాబు చెప్పాల్సి ఉంటుందనే చర్చ కేబినెట్లో జరిగినట్లు తెలిసింది. మరోపక్క కొంత మంది మంత్రులతో పాటు కీలక అధికారుల్లో ఓ వర్గం అనురాధకు మద్దతు పలుకుతోంది. కేబినెట్ సమావేశానంతరం కొందరు ‘ముఖ్యులు’ సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. వీరు కొన్ని ‘ప్రత్యేక అంశాలను’ సీఎంకు వివరించి అనురాధను మార్చవద్దని ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం వరుస వైఫల్యాల నేపథ్యంలో అనురాధను బదిలీ చేయాల్సిందే అని ముఖ్యమంత్రికి చెప్పినట్లు సమాచారం. దీంతో ఆమె మార్పు అంశంపై ప్రభుత్వం, పోలీసు విభాగం మల్లగుల్లాలు పడుతోంది. -
పెద్దలు వద్దన్నారు..ప్రేమికులు ప్రాణాలు వదులుకున్నారు
పూడూరు: వారిద్దరూ ఇష్టపడ్డారు.. పెద్దలు వారి ప్రేమకు అడ్డు పడ్డారు.. ఇక గత్యంతరం లేదని యువకుడు ప్రాణాలు తీసుకోగా.. ప్రియుడు లేని జీవితం తనకు వద్దంటూ యువతి కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన మండల పరిధిలోని చన్గోముల్ గ్రామంలో చోటచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చన్గొముల్కు చెందిన గొళ్ల పురేందర్(21), అనురాధ(19)లు పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తున్నారు. వీరిద్దరూ ఒకే వర్గానికి చెందిన వారు కూడా. ఈక్రమంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో తరచూ గొడవలు జరగడం ప్రారంభమైంది. దీంతో యువకుడు నగరానికి వెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. యువతి వికారాబాద్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. పురేందర్ అప్పుడప్పుడు గ్రామానికి వచ్చేవాడు. ఈక్రమంలో అతడు ఆదివారం చన్గోముల్కు రాగా అనురాధ అతణ్ని కలుసుకుంది. ఈ విషయం అమ్మాయి కుటుంబ సభ్యులు గమనించడంతో మళ్లీ గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పురేందర్ సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం పురేందర్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో యువతిని ఇంట్లో వేసి ఆమె బంధువులు తాళం వేశారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత తలుపులు తెరిచి చూసే సరికి అనురాధ కూడా ఉరివేసుకొని బలవ్మరణానికి పాల్పడింది. ప్రేమికుల ఆత్మహత్యతో గ్రామంలో వి షాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయమై పో లీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది. -
బాబుతో సింగపూర్ వెళ్లనున్న సిఎం రమేష్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో సింగపూర్ వెళ్లేందుకు మరో ఇద్దరికి అనుమతి ఇస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌తోపాటు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ అనురాధలు కూడా సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఏపీ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు ఈ నెల 11 నుంచి 14 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఆయనతోపాటు మరో 12 మంది సభ్యుల బృందం సింగపూర్ వెళ్లనుంది. అయితే ఆ బృందంలో సీఎం రమేష్, అనురాధలకు చోటు కల్పించడంతో బృందం సభ్యుల సంఖ్య 14కి చేరింది. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో మంగళవారం సింగపూర్ వెళ్లనున్నారు. అందుకు సంబంధించి జీవోను సాధారణ పరిపాలన శాఖ సోమవారం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. -
నిమోనియా హాయైన శ్వాస కోసం!
శ్వాసక్రియ జరగకుండా మనిషి ఒక్క క్షణం కూడా జీవించి ఉండలేడు. ఈ ప్రక్రియలో ముక్కు నుంచి వెళ్లిన గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. అది జీవక్రియలకు అవసరమైన ఆక్సిజన్‌ను ఊపిరితిత్తుల చివరి భాగమైన అల్వియైలై అనే గాలి గదిలో మార్పిడి చేసి... జీవక్రియల్లో విడుదలైన హానికర వ్యర్థవాయువులైన కార్బన్డయాక్సైడ్ వంటి వాటిని అక్కడి నుంచి బయటకు తీసుకువస్తుంది. ఈ కార్యక్రమం నిత్యం జరుగుతూ ఉండటం వల్లనే ప్రాణులు జీవించగలుగుతున్నాయి. ఊపిరితిత్తులలోని అత్యంత కీలకమైన గాలిగది ఆల్వియోలై అనే భాగంలో ఈ ఆక్సిజన్, కార్బన్డైయాక్సైడ్ల మార్పిడి జరుగుతుంటుంది. ఏదైనా కారణాల వల్ల ఆల్వియోలైలో ద్రవాలు చేరితే వాయుమార్పిడి జరగక శ్వాసక్రియ సక్రమంగా సాగదు. ఆ పరిస్థితినే నిమోనియా అంటారు. ఈ నెల 12న ప్రపంచ నిమోనియా దినం సందర్భంగా ఆ వ్యాధిపై అవగాహన కోసమే ఈ కథనం. నిమోనియా వచ్చే పరిస్థితులు ఎవరెవరిలో..? నిమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే ఒక ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ సోకడం అంటే అది కాస్త తీవ్రమైన పరిస్థితే. సాధారణంగా ఏ వయసు వారిలోనైనా కనిపించే ఇది పిల్లల్లోనూ, 65 ఏళ్లు పైబడ్డవారిలోనూ ఎక్కువ. దీనికి తోడు సాధారణంగా గుండెజబ్బులు, డయాబెటిస్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, వంటివి ఉన్నవారికి తేలిగ్గా వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా చలికాలంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పొగతాగే అలవాటు ఉన్నవారికి నిమోనియా వచ్చే అవకాశాలు మరీ ఎక్కువ. ఇరుకుగా ఉండే ప్రదేశాల్లో ఒకే చోట ఎక్కువ మంది ఉంటే ఇది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఊపిరితిత్తుల పనితీరు ఇలా..! మనం శ్వాసించే సమయంలో ముక్కు ద్వారా గాలిని పీల్చుకుంటాం. ఇది తొలుత ట్రాకియా అనే గాలిగొట్టం నుంచి లోనికి ప్రవేశిస్తుంది. ఇదే ట్రాకియా బ్రాంకై అనే రెండు గొట్టాలుగా విడిపోయి- ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి... బ్రాంకియోల్స్ అని పిలిచే అనేక శాఖలుగా చీలిపోతాయి. ఈ బ్రాంకియోల్స్ చివర గాలి తిత్తులు ఉంటాయి. వీటినే ఆల్వియోలై అంటారు. మనం గాలి పీల్చే సమయంలో మన ముక్కు, నోరు ద్వారా రోగకారక క్రిములు ట్రాకియా మార్గం నుంచి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి ఆల్వియోలైలోకీ చేరే అవకాశం ఉంది. ఈ క్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా చూసేందుకు మన రోగనిరోధక శక్తి, దాంతోపాటు... మన ముక్కు ఆకృతి, ఫ్యారింగ్స్ తోడ్పడతాయి. అవి ప్రవేశించినప్పుడు దగ్గడం ద్వారా వాటిని బయటకు పంపే ఏర్పాటుతో పాటు... బ్రాంకై అనే గాలిగొట్టాల్లో ఉన్న సీలియా అనే వెంట్రుకల వంటి నిర్మాణం... ఎల్లప్పుడూ ఒక ఎస్కలేటర్లా స్పందిస్తూ రోగకారక అంశాలను బయటకు పంపివేస్తూ ఉంటాయి. ఏదైనా కారణాల వల్ల మన రోగనిరోధక శక్తి లోపించినప్పుడు, రోగకారక క్రిములు శరీరంలోకి ప్రవేశించడమో లేదా మనమే ఎక్స్పోజ్ కావడమో జరిగినప్పుడు అవి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. ఇలాంటి సమయాల్లో మన తెల్లరక్తకణాలు ఆల్వియోలైలోకి ప్రవేశించి అక్కడ ఉన్న రోగకారక క్రిములపై దాడి చేస్తాయి. ఇలా జరిగే క్రమంలో మన ఆల్వియోలైలో తెల్లరక్తకణాలు, ప్రోటీన్లు, ఇతర ద్రవాలు, ఎర్రరక్తకణాలు నిండిపోతాయి. ఫలితంగా నిమోనియా లక్షణాలు బయటపడతాయి. నిమోనియా - దుష్ర్పభావాలు నిమోనియాను యాంటీబయాటిక్స్‌తో చాలా తేలిగ్గానే తగ్గించవచ్చు. అయితే కొందరిలో కొన్ని సందర్భాల్లో నిమోనియాను నిర్లక్ష్యం చేయడం వల్ల కనిపించే దుష్ర్పభావాలు (కాంప్లికేషన్స్) చాలా త్రీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా హై-రిస్క్ గ్రూపునకు చెందిన వారిలో ఈ దుష్ర్పభావాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇక దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులైన సీఓపీడీ (ఎంఫసిమా) లేదా కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవారిలోనూ ఈ దుష్ర్పభావాలు తీవ్రంగా ఉంటాయి. అవి... ఊపిరితిత్తుల్లో ద్రవాలు నిండటం : ఊపిరితిత్తుల పొరలైన ప్లూరాకూ, ఛాతీ లోపలి పొరకూ మధ్య ఒక్కోసారి ద్రవాలు నిండవచ్చు. ఈ కండిషన్ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. నిమోనియా వల్ల ఇలా ద్రవాలు నిండితే... ఒక్కోసారి ఛాతీలో ట్యూబ్ వేసిగానీ లేదా చిన్న శస్త్రచికిత్స ద్వారాగాని ఆ ద్రవాలను తొలగించాల్సి వస్తుంది. ఆబ్సెస్ : నిమోనియాతో ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రాంతంలో చీము నిండటాన్ని యాబ్సెస్ అంటారు. ఈ పరిస్థితి తలెత్తినప్పుడు సాధారణంగా యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తారు. అయితే చీమును తొలగించడానికి అరుదుగా సర్జరీ కూడా అవసరం కావచ్చు. బ్యాక్టీరిమియా : ఒక్కోసారి ఊపిరితిత్తులకు సోకిన నిమోనియా వాటికే పరిమితం కాకుండా రక్తప్రవాహానికీ వ్యాపించవచ్చు. ఇలా వ్యాపించడం అన్నది చాలా తీవ్రమైన పరిస్థితి. ఎందుకంటే ఒకసారి రక్తప్రవాహానికి విస్తరించాక ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించడంతో పాటు అన్ని అవయవాలకూ విస్తరిస్తుంది. ఈ కండిషన్‌ను బ్యాక్టీరిమియా అంటారు. ఇది ఒక్కోసారి రోగి తాలూకు రక్తపోటును గణనీయంగా పడిపోయేలా చేస్తుంది.సాధారణంగా నిమోనియా వచ్చిన రోగుల్లో కోలుకోడానికి ఉండే అవకాశాలే చాలా ఎక్కువ. కానీ చాలా అరుదైన సందర్భాల్లో మాత్రం కేవలం 5 నుంచి 10 శాతం కేసుల్లో మాత్రమే ఒక్కోసారి పరిస్థితి విషమించిపోయే పరిస్థితికి దారితీయవచ్చు. నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవారు సాధారణంగా కొందరిలో నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువ. వారినే హై-రిస్క్ గ్రూప్ గా అభివర్ణిస్తారు. వారు ఎవరంటే... 65 ఏళ్లు పైబడినవారు పొగతాగే అలవాటు ఉన్నవారు ఆరోగ్యకారణాల వల్లగానీ లేదా ఇతరపరిస్థితుల వల్లగాని తగినంత పోషకాహారం తీసుకోనివారు ఏదైనా ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు (అంటే... సిస్టిక్ ఫైబ్రోసిస్, ఆస్తమా లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్, ఎంఫసిమా వంటివి) డయాబెటిస్ లేదా గుండెజబ్బుల వంటి ఇతర వ్యాధులు ఉన్నవారు హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ వల్లగానీ లేదా అవయవమార్పిడి చికిత్స వల్లగాని, కీమోథెరపీతోగాని లేదా దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ వాడుతుండటం వల్ల స్వతహాగా ఉండే వ్యాధినిరోధకశక్తి లోపించిన వారు ఆల్కహాల్ లేదా డ్రగ్స్ తీసుకోవడం వల్ల సమర్థంగా దగ్గలేనివారు శ్వాసకోశవ్యవస్థలో పైభాగానికి ఇన్ఫ్లుయెంజా వంటి ఇన్ఫెక్షన్ సోకిన వారు. వ్యాధి నిర్ధారణ రోగి చెప్పిన లక్షణాలను బట్టి, రోగిని పరీక్షించడం ద్వారా నిమోనియా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. దాంతోపాటు ఎక్స్‌రే, కళ్లె పరీక్ష, కొన్ని సందర్భాల్లో యూరిన్ యాంటిజెన్ పరీక్ష, రక్త పరీక్ష వంటివి వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. ఇక రక్తంలో ఆక్సిజన్ పాళ్లను పరీక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి నిమోనియా వల్ల రక్తంలోని ఆక్సిజన్ పాళ్లు తగ్గే అవకాశం ఉంది. తీవ్రమైన నిమోనియాతో ఆసుపత్రిలో చేరిన రోగులకు యాంటీబయాటిక్ చికిత్స తర్వాత కూడా మెరుగుదల కనిపించని సందర్భాల్లోనూ లేదా చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి నిలకడగా లేక దిగజారుతున్న సందర్భాల్లోనూ బ్రాంకోస్కోపీ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ఎటుపడితే అటు తేలిగ్గా ఒంగే ఒక గొట్టానికి కెమెరాను అమర్చి ట్రాకియా, బ్రాంకైలలోని లోపలి దృశ్యాలను పరిశీలించడంతో పాటు అక్కడి ద్రవాల నమూనాలను సేకరించడం, అవసరాన్ని బట్టి చిన్న ముక్కను సేకరించి బయాప్సీ పరీక్షకు పంపడం వంటివి చేస్తారు. నివారణ నిమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా నిమోనియాను చాలా ప్రభావపూర్వకంగా నివారించవచ్చు.పొగతాగే అలవాటు ఉన్నవారు దాన్ని పూర్తిగా మానేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తాము నివసించే ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవడం, చేతులను నిత్యం సబ్బుద్వారాగాని లేదా ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ వాష్‌ల సహాయంతోగాని శుభ్రపరచుకోవడం వంటి జాగ్రత్తల ద్వారా దీన్ని నివారించవచ్చు. రోగి తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డుపెట్టుకోవడమో, పొడవు చేతుల చొక్కా ఉంటే చేతి మడతలో తుమ్మడమో చేయాలి. చికిత్స సాధారణంగా ఇరుకు ప్రదేశాల్లో గుంపులుగా ఉండటం వల్ల వచ్చే కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా ఇన్ఫెక్షన్కు చికిత్సతో పాటు నిమోనియా వల్ల వచ్చే ఇతర కాంప్లికేషన్లకూ చికిత్స చేస్తారు. నిమోనియా కేసుల్లో తొలుత దానికి కారణమైన అంశాలను కనుగొని దానికి అనుగుణంగా చికిత్స అందిస్తారు. సాధారణంగా నిమోనియా రోగుల్లో అత్యధికులకు నోటిద్వారా యాంటీబయాటిక్స్ ఇస్తారు. అయితే నిమోనియా తీవ్రత ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో నిమోనియా రోగులకు నిత్యం గుండె స్పందన రేటు, శ్వాసించే తీరు, రక్తంలో ఆక్సిజన్ పాళ్లు వంటి అంశాలను నిత్యం పర్యవేక్షిస్తూ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో చేర్చిన రోగులకు రక్తనాళం (ఐవీ) ద్వారా యాంటీబయాటిక్స్‌ను అందిస్తారు. రోగికి ఉన్న ఇతర వ్యాధులు, అతడు చికిత్సకు స్పందిస్తున్న తీరును బట్టి ఎంతకాలం ఆసుపత్రిలో ఉండాలన్నది నిర్ణయిస్తారు. అప్పటికే ఊపిరితిత్తులకు ఏదైనా వ్యాధి ఉన్నవారు, ఊపిరితిత్తులలో ఒకదాని కంటే ఎక్కువ తమ్మెల (లోబ్స్)లో వ్యాధి ఉండే వాళ్లు కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. రోగికి ఎలాంటి యాంటీబయాటిక్ వాడాలన్నది... రోగికి సంక్రమించిన సూక్ష్మజీవి ఎలాంటిదన్న అంశంతో పాటు... ఆ మందుకు అతడు ఎలా స్పందిస్తున్నాడనేలాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే... ఏదైనా వ్యాధి వల్ల అప్పటికే రోగి ఇతర యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటే ఆ తరహా యాంటీబయాటిక్స్‌కు ఆ క్రిములు నిరోధకత పెంచుకొని ఉండవచ్చు. అందుకే చికిత్స ప్రక్రియలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కారణాలు సాధారణంగా అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మక్రిముల వల్ల నిమోనియా సోకవచ్చు. అయితే ఫంగస్‌తో వచ్చే అవకాశాలు ఒకింత తక్కువ. ఏదైనా ఇతర వ్యాధులు లేదా హెచ్ఐవీ వంటి ఇన్ఫెక్షన్ల కారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో ఇది ఫంగై కారణంగా రావచ్చు. ఇక మైకోప్లాస్మా అని పిలిచే మరికొన్ని సూక్ష్మక్రిముల వల్ల కూడా నిమోనియా రావచ్చు. కానీ ఇది అంత తీవ్రమైనది కాదు. అయితే ఒక్కోసారి ఇది కూడా తీవ్రమైన పరిస్థితికి దారితీయవచ్చు. నిమోకాకస్ అనే బ్యాక్టీరియా వల్ల ఇది సోకుతుంది. అలాగే ఇరుకుగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువ మంది గుంపులుగా నివసించాల్సిన పరిస్థితుల్లోని 20 శాతం కేసుల్లో కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా (సీఏపీ) అనే ఈ వ్యాధి చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది. లక్షణాలు జ్వరం చలిగా అనిపించడం ఊపిరి సరిగా అందకపోవడం శ్వాస తీసుకునే సమయంలో ఒక్కోసారి నొప్పి చాలా వేగంగా శ్వాసతీసుకోవడం గుండెవేగం పెరగడం వికారం వాంతులు దగ్గు ఒక్కోసారి దగ్గుతున్నప్పుడు ఆకుపచ్చ లేదా పసుపు రంగులో కళ్లె పడటం కొన్ని సందర్భాల్లో కళ్లె తుప్పు రంగులో కనిపించడం అయోమయానికి గురికావడం, ఆలోచనల్లో స్పష్టతలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డా. టి. అనూరాధ, పల్మొనాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
2030 నాటికి భారత్‌లో ఏడు మిలియన్ల మంది ‘అల్జీమర్ వ్యాధిగ్రస్తులు’
అల్జీమర్స్‌పై చర్చా సదస్సులో న్యూరాలజిస్ట్ డాక్టర్ అనూరాధ సాక్షి, బెంగళూరు : భారతదేశంలో 2030 నాటికి దాదాపు ఏడు మిలియన్ల మంది అల్జీమర్ వ్యాధిగ్రస్తులు ఉంటారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాలు తెలియజేస్తున్నాయని కొలంబియా ఏషియా హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అనూరాధ తెలిపారు. వరల్డ్ అల్జీమర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారమిక్కడి కొలంబియా ఏషియా ఆస్పత్రిలో ‘అల్జీమర్స్’ వ్యాధిపై చర్చా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న డాక్టర్ అనూరాధ మాట్లాడుతూ....వృద్ధాప్యం కారణంగా మెదడులోని కణాల పనితీరు క్షీణించడాన్నే అల్జీమర్స్‌గా పిలుస్తారని చెప్పారు. ప్రస్తుతం భారత్ వంటి దేశాల్లో సగటు వ్యక్తి ఆయుర్దాయం పెరుగుతుండటం అదే సమయంలో జననాల సంఖ్య తగ్గిపోతుండడం, రానున్న ఇరవై ఏళ్లలో అల్జీమర్స్‌తో బాధపడే వారి సంఖ్య పెరగడానికి ప్రముఖ కారణాలని తెలిపారు. ఇక ప్రస్తుత జీవన విధానం వల్ల కూడా రానున్న కాలంలో అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉందని అన్నారు. వృద్ధాప్యంలో అల్జీమర్స్ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే శారీరకంగానే కాక మానసికంగా కూడా సంతోషంగా, దృఢంగా ఉండటం ఎంతో ముఖ్యమని చెప్పారు. ఇదే విషయంపై ప్రజల్లో అవగాహనను పెంచడం కోసం కొలంబియా ఏషియా కృషి చేస్తోందని పేర్కొన్నారు. వృద్ధాప్యంలో కుటుంబసభ్యులతో ఎక్కువసేపు గడపడం, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మన చుట్టూ సృష్టించుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని, తద్వారా అల్జీమర్స్‌కు దూరంగా ఉండవ చ్చని సూచించారు. -
బాబ్బాబు ప్లీజ్..
ఎమ్మెల్సీ, ఉడా చైర్మన్ పదవులపైనే అందరి దృష్టి ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు బాబు హామీలు నెరవేర్చేనా? జిల్లాల్లో ‘నామినేటెడ్’ కాక రాజుకుంది. ఎమ్మెల్సీ, ఉడా చైర్మన్ పదవుల కోసం టీడీపీ నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జిల్లాలోని ముఖ్య నేతలు పదవుల కోసం పోటీ పడుతుండటంతో అధినేత ఎవరికి పట్టం కడతారనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రులు, ఎంపీలు కూడా తమ వర్గ నేతలకు పదవులు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ : నామినేటెడ్ పదవుల పంపకానికి ప్రభుత్వం ‘పచ్చ’జెండా ఇచ్చేసింది. ఎలాగైనా కీలక పదవులు పొందాలని టీడీపీ నేతల్లో ఆరాటం మొదలైంది. కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం, వీజీటీఎం ఉడా చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పలువురు పావులు కదుపుతున్నారు. ఎవరికి వారే పార్టీలో తమ గాడ్ఫాదర్ల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు నేరుగా చంద్రబాబును కలిసి ‘గతంలో మీరు చెప్పినట్టే నడుచుకున్నామని, మీరు కూడా మాకు హామీ ఇచ్చినట్లుగానే నామినేటెడ్ పదవి ఇవ్వాలని’ కోరుతున్నారు. ఎమ్మెల్సీ స్థానం కోసం పట్టు... స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ పదవీకాలం కొద్దికాలం కిందట ముగిసింది. ఎలాగైనా తానే తిరిగి ఎమ్మెల్సీ పదవి పొందాలని ఆయన ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ, టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. బుద్దా వెంకన్న గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, ఎమ్మెల్యే సీటు మరొకరికి కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో వెంకన్న అంగీకరించారు. పెనమలూరు నియోజకవర్గం నుంచి వైవీబీ రాజేంద్రప్రసాద్, పంచుమర్తి అనూరాధ కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. వారికి కూడా చంద్రబాబు ఇదే తరహా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ పదవికి వీరి మధ్య పోటీ తీవ్రమైంది. మరోవైపు పామర్రు నుంచి పోటీ చేసి ఓడిపోయిన వర్ల రామయ్య కూడా రేసులో ఉన్నారు. వీరిలో కొందరికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, ఎంపీ కేశినేని నాని మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో పదవులు పందేరం విషయంలో టీడీపీ నాయకులు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ‘ఉడా’ చైర్మన్ గిరీ కోసం.. ఉడా చైర్మన్ పదవి కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుత చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డిని తొలగించి తమకు పదవి కేటాయించాలని పలువురు నేతలు అధినేతను కోరుతున్నట్లు తెలిసింది. జగ్గయ్యపేటకు చెందిన ఆప్కాబ్ మాజీ చైర్మన్ తొండెపు దశరథజనార్దన్, గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడిన నాగుల్‌మీరా, బందరు టికెట్ కోసం ప్రయత్నించిన బచ్చుల అర్జునుడు, బుద్దా వెంకన్న, టీడీపీ విజయవాడ అర్బన్ ఉపాధ్యక్షుడు ముష్ఠి శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ఇప్పటికే సీఎంతో చంద్రబాబు నాయుడుతో మాట్లాడినట్లు సమాచారం. తనకే ఉడా చైర్మన్ పదవి వస్తుందని రవి ప్రసాచారం సాగిస్తున్నారు. చంద్రబాబు కూడా నామినేటెడ్ పదవి ఇస్తానని రవికి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. నాగుల్‌మీరాకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి ఆశీస్సులు ఉన్నాయి. పంచుమర్తి అనూరాధ నేరుగా చంద్రబాబుతోనే సంప్రదింపులు జరుపుతున్నారు. బుద్దా వెంకన్నకు మంత్రి దేవినేని ఉమా అండగా ఉన్నారు. యలమంచిలి రవికి సుజనా చౌదరి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, దూళిపాళ్ల నరేంద్ర కూడా తమ అనుచరులకు ఉడా చైర్మన్ పదవి దక్కించుకునేందకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు విజయవాడ వారికే ఉడా చైర్మన్ పదవి ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించిన విషయాన్ని ఇక్కడి నేతలు ప్రస్తావిస్తున్నారు. ‘వణుకూరి’ ముమ్మర ప్రయత్నాలు కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో చివరిలో ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి పదవి పొందారు. ఆయన నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అత్యంత సన్నిహితుడు. శ్రీనివాసరెడ్డి కూడా రాయపాటి ద్వారా తన పదవిని కాపాడుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకే సామాజికవర్గానికి పదవులు ! ఇప్పటికే జిల్లాలో చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి ముఖ్యమైన మంత్రి పదవులు దక్కాయి. ఎమ్మెల్యేలుగా కూడా వారే ఎక్కువ మంది ఉన్నారు. మేయర్ పదవి కూడా ఇదే సామాజికవర్గానికి చెందిన వారికి దక్కింది. ఉడా చైర్మన్ పదవి విషయంలో బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీలోనే పలువురు పట్టుపడుతున్నారు. అయితే బాబు ఎవరికి పట్టం కడతారో వేచిచూడాల్సిందే. -
విమానాశ్రయంలో సీఎంకు స్వాగతం
విమానాశ్రయం (గన్నవరం) : ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుధవారం గన్నవరం విమానాశ్రయంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటన నిమిత్తం రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావుతో కలిసి చంద్రబాబు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10.10 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనురాధ, కలెక్టర్ ఎం.రఘునందనరావు, పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు, ఎస్పీ ప్రభాకరరావు, ఉడా వైస్ చైర్మన్ ఉషాకుమారి, జాయింట్ కలెక్టర్ జె.మురళి, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీమోహన్, బోడె ప్రసాద్, గద్దె రామ్మోహన్, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, డెప్యూటీ మేయర్ జి.వి.రమణరావు, నూజివీడు సబ్‌కలెక్టర్ చక్రధరరావు, డీసీపీ రవిప్రకాష్, టీడీపీ నాయకులు పలువురు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు హెలికాఫ్టర్‌లో ద్వారకాతిరుమలకు బయలుదేరి వెళ్లారు. రుణాలు మాఫీ చేసితీరుతాం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలు అన్నిం టిని మాఫీచేసి తీరుతామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విమానాశ్రయంలో సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం మంత్రి ఉమా విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇబ్బంది లేకుండా, వారు గతంలో తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేయడంతో పాటు కొత్త రుణాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రుణమాఫీపై ప్రభుత్వం నియమిం చిన కోటయ్య కమిటీ తన నివేదిక అందజేయగానే స్పష్టమైన విధివిధానాలను ప్రకటిస్తామని ప్రకటిం చారు. రుణమాఫీపై రిజర్వు బ్యాంక్ గవర్నర్‌తో పాటు ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రితో కూడా తమ ప్రభుత్వం సంప్రదిం పులు జరుపుతోం దని, మరో రెండు రోజుల్లో ఒక స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రుణాల కోసం రైతులను బ్యాంకర్లు ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. జిల్లాలో తాగునీటి అవసరాలు నిమిత్తం సాగర్ నుంచి విడుదల కావాల్సిన పది టీఎంసీలకు ఇప్పటికే ఏడు టీఎంసీల నీటిని విడుదల చేశామని పేర్కొన్నారు. మిగిలిన నీటిని కూడా విడుదల చేసేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర జలబోర్డులతో సంప్రదింపులు జరిపి నీటి విడుదలకు ముఖ్యమంత్రిస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. -
‘టీనేజ్’ విలవిల!
కామారెడ్డి, న్యూస్‌లైన్: కామారెడ్డి పట్టణానికి సమీపంలో అడ్లూర్ అర్శ గురుకులం వద్ద రైలు పట్టాలపై కోటగిరి మండలం చేతన్నగర్కు చెందిన అనురాధ (15), జ్ఞానేశ్వర్(18) ఆత్మహత్య కు పాల్పడడం కలకలం రేపింది. అనురాధ గత ఏప్రిల్‌లో తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతిలోకి అడుగు పెట్టాల్సి న సమయంలో ప్రాణాలు కోల్పోయింది. డిగ్రీ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసిన జ్ఞా నేశ్వర్ జీవితంలో ఉన్నత లక్ష్యం కోసం ముం దుకు సాగేందుకు ప్రయత్నించకుండా ప్రేమ మైకంలో పడిపోయి తనతో పాటు అనురాధ ను వెంట తీసుకెళ్లాడు. ఈ ఇద్దరి వయస్సు, వారి పరిస్థితిని చూస్తే ఆకర్షణలకు లోనై పెద్దలకు విషయం తెలిస్తే ఏమవుతుందోనన్న భయంతో ఇంటి నుంచి బయటపడి ఆత్మహత్యకు పాల్పడినట్టు స్పష్టమవుతోంది. గతంలో కూడా గత ఏడాది కామారెడ్డి పట్టణానికి చెందిన పదో తరగతి విద్యార్థి నీరజ (15) ఒంటిపై కి రోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిం చింది. రెండు రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచింది. ఈ అ మ్మాయి ఇంటికి సమీపంలో జార్ఖండ్ రాష్ట్రాని కి చెందిన టింకు అనే యువకుడు నివసించేవాడు. నీరజ అతడి ఆకర్షణలో పడిపోయిం ది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు సదరు యువకున్ని మందలించారు. దీంతో నీరజ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. నీరజ మరణం ఆమె కుటుంబ సభ్యులకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది. చదువుకోవడానికి వచ్చిన ఓ యువతి కా మారెడ్డి పట్టణంలోని ఓ హాస్టల్లో ఉండేది. ఓ రోజు హాస్టల్‌కు రాకపోవడంతో నిర్వాహకులు ఆమె కుటుం బ సభ్యులకు సమాచారమందించారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. తరువాత పోలీసులు ఆమె సెల్‌ఫోన్ ఆధారంగా ఆ చూకీ కనిపెట్టారు. ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ చేసిన ఓ యువకుని ప్రే‘మాయ’లో పడి అ దృశ్యమైనట్టు గుర్తించారు. తరువాత అమ్మాయి తల్లి చెంతకు చేరడంతో కథ సుఖాంతమైంది. మూడేళ్ల క్రితం కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీలో ఓ ఇం ట్లో అద్దెకున్న యువకుడు ఇంటర్ చదివే ఇంటి యజమాని కూతురుని ప్రేమపేరుతో వేధించి గొంతుకోసి చంపాడు. ఆ యువకుడు జైలుపాలవగా, విచారణ జరిపిన కోర్టు అతనికి జీవితఖైదు విధించింది. క్రమశిక్షణ కావాలి నిత్యం ఎక్కడో ఒక చోట యువతో, యువకుడో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కౌమారం, యవ్వన దశలలో యువత దారితప్పకుండా క్రమ శిక్షణ అనేది ఇంటి నుంచే ప్రారంభించాల్సిన అవసరం ఉందని వ్యక్తిత్వ వికాస నిపుణులు పేర్కొంటున్నారు. జీవిత లక్ష్యం నిర్దేశించుకు నే విధంగా ప్రోత్సహించాలని, వారికి సానుకూల దృక్ఫథాన్ని అవర్చుకునే విధంగా అవగాహన కల్పించాలని జూచిస్తున్నారు. తద్వారా ఇతర ఆలోచనలు రాకుండా నిరోధించవచ్చని పేర్కొంటున్నారు.